తెలంగాణ రాష్ట్ర రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ)లో ఎలక్ట్రిక్ బస్సుల వినియోగంపై ప్రభుత్వం పునరాలోచించాలని, కరీంనగర్‌లో షార్ట్ సర్క్యూట్‌తో ఎలక్ట్రిక్ బస్సు దగ్ధమైన ఘటన నేపథ్యంలో వీటి భద్రతపై పూర్తిస్థాయిలో పరీక్షలు నిర్వహించిన తర్వాతే అనుమతించాలని సీపీఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ డిమాండ్ చేశారు. కరీంనగర్ – హైదరాబాద్ మార్గంలో ఎలక్ట్రిక్ బస్సుల్లో ప్రయాణం వల్ల తీవ్ర అసౌకర్యం కలుగుతోందని, తరచూ బస్సులు ఆగిపోవడంతో ప్రయాణికులు సకాలంలో గమ్యస్థానాలకు చేరుకోలేకపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కరీంనగర్‌కు అత్యంత సమీపంలో ఎల్.ఎం.డి. వద్ద ఒక ఎలక్ట్రిక్ బస్సులో పొగలు రావడాన్ని డ్రైవర్ సకాలంలో గుర్తించి బస్సును నిలిపివేయడంతో 41 మంది ప్రయాణికులు ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారని శ్రీనివాస్ గుర్తు చేశారు. రాత్రి పూట ఇలాంటి ఘటన జరిగితే డ్రైవర్ గుర్తించే వీలుండదని, నష్టం తీవ్రంగా ఉండేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఎలక్ట్రిక్ బస్సుల్లో కనీసం ఫైర్ సేఫ్టీ పరికరాలు కూడా లేకపోవడం విచారకరమని పంజాల శ్రీనివాస్ పేర్కొన్నారు. ఆర్టీసీని జేబీఎం లాంటి ప్రైవేట్ కంపెనీలకు అప్పగించి ప్రభుత్వం ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటం ఆడుతోందని ఆయన ఆరోపించారు. ఎలక్ట్రిక్ బస్సుల్లో భద్రతా చర్యలు తీసుకునే వరకు ప్రయాణికులను రవాణాకు అనుమతించవద్దని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆర్టీసీకి సొంత బస్సులు కొనుగోలు చేయకుండా అద్దె బస్సులు, కంపెనీల బస్సులతో నడుపుతూ సంస్థను పూర్తిస్థాయి ప్రైవేట్ సంస్థగా మార్చేశారని సీపీఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ విమర్శించారు.
తెలంగాణ రాష్ట్ర రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ)లో ఎలక్ట్రిక్ బస్సుల వినియోగంపై ప్రభుత్వం పునరాలోచించాలని, కరీంనగర్‌లో షార్ట్ సర్క్యూట్‌తో ఎలక్ట్రిక్ బస్సు దగ్ధమైన ఘటన నేపథ్యంలో వీటి భద్రతపై పూర్తిస్థాయిలో పరీక్షలు నిర్వహించిన తర్వాతే అనుమతించాలని సీపీఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ డిమాండ్ చేశారు. కరీంనగర్ – హైదరాబాద్ మార్గంలో ఎలక్ట్రిక్ బస్సుల్లో ప్రయాణం వల్ల తీవ్ర అసౌకర్యం కలుగుతోందని, తరచూ బస్సులు ఆగిపోవడంతో ప్రయాణికులు సకాలంలో గమ్యస్థానాలకు చేరుకోలేకపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కరీంనగర్‌కు అత్యంత సమీపంలో ఎల్.ఎం.డి. వద్ద ఒక ఎలక్ట్రిక్ బస్సులో పొగలు రావడాన్ని డ్రైవర్ సకాలంలో గుర్తించి బస్సును నిలిపివేయడంతో 41 మంది ప్రయాణికులు ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారని శ్రీనివాస్ గుర్తు చేశారు. రాత్రి పూట ఇలాంటి ఘటన జరిగితే డ్రైవర్ గుర్తించే వీలుండదని, నష్టం తీవ్రంగా ఉండేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఎలక్ట్రిక్ బస్సుల్లో కనీసం ఫైర్ సేఫ్టీ పరికరాలు కూడా లేకపోవడం విచారకరమని పంజాల శ్రీనివాస్ పేర్కొన్నారు. ఆర్టీసీని జేబీఎం లాంటి ప్రైవేట్ కంపెనీలకు అప్పగించి ప్రభుత్వం ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటం ఆడుతోందని ఆయన ఆరోపించారు. ఎలక్ట్రిక్ బస్సుల్లో భద్రతా చర్యలు తీసుకునే వరకు ప్రయాణికులను రవాణాకు అనుమతించవద్దని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆర్టీసీకి సొంత బస్సులు కొనుగోలు చేయకుండా అద్దె బస్సులు, కంపెనీల బస్సులతో నడుపుతూ సంస్థను పూర్తిస్థాయి ప్రైవేట్ సంస్థగా మార్చేశారని సీపీఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ విమర్శించారు.
- కరీంనగర్‌లో నీట్-2026 పరీక్షకు హాజరయ్యేందుకు వచ్చిన ఒక విద్యార్థి పరీక్షా కేంద్రానికి ఆలస్యమవుతుండటంతో, విధుల్లో ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్ కుమార్ తక్షణమే స్పందించారు. విద్యార్థి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని పరీక్షా కేంద్రానికి సమయానికి చేరుకునేలా ట్రాఫిక్‌ను సమర్థవంతంగా నియంత్రిస్తూ, అవసరమైన మార్గదర్శకత్వం అందించి సకాలంలో చేర్చారు. ట్రాఫిక్ కానిస్టేబుల్ కుమార్ చూపిన అప్రమత్తత, మానవతా దృక్పథాన్ని విద్యార్థి కుటుంబ సభ్యులు, కరీంనగర్ సీపీ గౌష్ ఆలం ప్రత్యేకంగా అభినందించారు. ప్రజలకు అవసరమైన సమయంలో సహాయం చేయడం పోలీసుల బాధ్యతలో భాగమని, ఇలాంటి సేవా కార్యక్రమాలు కొనసాగుతాయని పోలీసులు తెలియజేశారు.1
- కరీంనగర్ జిల్లాలోని గంగాధర మండలం మధుర నగర్‌లో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని యోగా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. యోగా గురువు విష్ణు ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో గ్రామస్థులు అత్యంత ఉత్సాహంతో పాల్గొని వివిధ యోగా ఆసనాలను ప్రదర్శించారు. ఈ సందర్భంగా యోగా గురువు విష్ణు మాట్లాడుతూ, యోగా సాధన వల్ల శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని తెలిపారు. ప్రతిరోజు కొంత సమయం యోగాకు కేటాయించడం ద్వారా అనేక ఆరోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ వేముల భాస్కర్, ఉప సర్పంచ్ తూం రాజ్ కుమార్, బీజేపీ నాయకులు పెరుక శ్రవణ్ కుమార్, తూం నారాయణ, సదాల భాస్కర్ తో పాటు పలువురు గ్రామ పెద్దలు, యువకులు, ఇతర గ్రామస్థులు పాల్గొన్నారు. యోగా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది.1
- జగిత్యాల జిల్లాలో ఓ విద్యార్థిని కేవలం మూడు నిముషాల ఆలస్యం కారణంగా నీట్ పరీక్ష రాయలేకపోయింది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట 30 నిమిషాల వరకు పరీక్ష కేంద్రంలోకి అనుమతి ఉన్నప్పటికీ, విద్యార్థిని కొండగట్టు జేఎన్టీయూ నీట్ పరీక్షా కేంద్రానికి ఒంటి గంట 33 నిముషాలకు చేరుకుంది. అప్పటికే గేట్లు మూసివేసిన అధికారులు ఆమెను లోపలికి అనుమతించలేదు. పరీక్షా కేంద్రంలోకి అనుమతించమని విద్యార్థిని తల్లి సెక్యూరిటీ సిబ్బంది కాళ్లపై పడి వేడుకున్నా, నిబంధనల ప్రకారం ప్రవేశం కల్పించలేమని అధికారులు స్పష్టం చేశారు. గొల్లపల్లి మండలం రాపల్లి నుంచి ఆటోలో రావడం వల్ల ఆలస్యమైందని విద్యార్థిని, ఆమె తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) నిబంధనల కారణంగా కన్నీటి పర్యంతమై వారు వెనుతిరిగారు. ఈ నిముషం ఆలస్యం నిబంధనపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేయగా, విద్యార్థిని భావోద్వేగ పరిస్థితిని చూసిన స్థానికులు, తోటి విద్యార్థులు సైతం విచారం వ్యక్తం చేశారు.4
- వేములవాడ పట్టణానికి చెందిన తెలంగాణ రాష్ట్ర మోచీ సంఘం అధ్యక్షుడు కొండ్లెపు ముత్యం, తనను కులం పేరుతో దూషించి, దుకాణంలోకి అక్రమంగా ప్రవేశించి దౌర్జన్యానికి పాల్పడ్డారని ఆరోపిస్తూ జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులకు ఫిర్యాదు చేశారు. సంబంధిత అధికారులపై ఎస్సీ, ఎస్టీ (అత్యాచార నిరోధక) చట్టం కింద కేసు నమోదు చేయాలని ఆయన ఈ ఫిర్యాదులో కోరారు. ముత్యం తెలిపిన వివరాల ప్రకారం, వేములవాడలోని శ్రీ భీమేశ్వర ఆలయం ఎదురుగా ఉన్న తన కొబ్బరికాయల దుకాణాన్ని తొలగించాలని గత నెల రోజులుగా దేవస్థాన అధికారుల నుంచి ఒత్తిడి వస్తోంది. ఈ క్రమంలో జూన్ 18న రాత్రి సుమారు 8 గంటల సమయంలో శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం కార్యనిర్వహణ అధికారి రమాదేవి ఆదేశాల మేరకు సుమారు 30 మంది దేవస్థాన సిబ్బంది తన దుకాణం వద్దకు వచ్చి తొలగించే ప్రయత్నం చేశారు. ఆ సమయంలో తనను కులం పేరుతో దూషించడంతో పాటు అవమానకరంగా మాట్లాడారని, తన అనుమతి లేకుండా దుకాణంలోకి ప్రవేశించి పరువు ప్రతిష్ఠలకు భంగం కలిగించారని ముత్యం తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఘటనలో దేవస్థానం ఈవో రమాదేవి, ఏఈవో శ్రావణ్, సూపరింటెండెంట్ నూగూరి నరేందర్, రాంకిషన్‌రావు, భగవంతరావు, జయకుమారి, రాజేందర్, భరత్, గంగిశెట్టి సాయి తదితరులపై చర్యలు తీసుకోవాలని ముత్యం కోరారు. సంఘటన జరిగిన సమయంలో రేగుల శ్రీకాంత్, వంగళ శ్రీనివాస్, మైలారపు శ్రీనివాస్, బోనాల శివ, మామిండ్ల లక్ష్మిరాజం తదితరులు ప్రత్యక్ష సాక్షులుగా ఉన్నారని ఆయన పేర్కొన్నారు. ఈ విషయమై జూన్ 19న వేములవాడ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్, సబ్ డివిజనల్ పోలీస్ అధికారి, రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీలకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినప్పటికీ, ఇప్పటివరకు కేసు నమోదు కాలేదని ఆయన తెలిపారు. అందువల్ల, సంబంధిత అధికారులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేసి, తనకు న్యాయం చేయాలని కొండ్లెపు ముత్యం జాతీయ ఎస్సీ కమిషన్‌ను కోరారు.4
- జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా బెజ్జంకి సర్పంచ్ బొల్లం శ్రీధర్ యోగా ప్రాధాన్యాన్ని వివరించారు. యోగా భారతదేశం ప్రపంచానికి అందించిన అమూల్యమైన వారసత్వమని ఆయన పేర్కొన్నారు. నిత్య జీవితంలో యోగాను అలవాటు చేసుకోవడం ద్వారా శారీరక దృఢత్వంతో పాటు మానసిక ప్రశాంతత కూడా లభిస్తుందని శ్రీధర్ అన్నారు. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి యోగా దోహదపడుతుందని, ఆరోగ్యకర జీవనానికి యోగా ఉత్తమ మార్గమని ఆయన స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో, ప్రతి ఒక్కరూ తమ రోజువారీ జీవితంలో యోగా సాధన కోసం సమయం కేటాయించాలని ఆయన పిలుపునిచ్చారు.4
- కరీంనగర్‌లోని మాణికేశ్వరి నగర్‌లో దేహ దాత బుర్ర భారతి సంస్మరణ సభను ఘనంగా నిర్వహించారు. పలువురు వక్తలు, నాయకులు, ప్రజలు, డాక్టర్లు ఈ సభలో పాల్గొని బుర్ర భారతి చేసిన నేత్రదానం, దేహదానం పట్ల తమ అభిప్రాయాలను వెలిబుచ్చారు. 73 సంవత్సరాల వయసులో మరణించిన బుర్ర భారతి, తన నేత్రాలను దానం చేయడం ద్వారా ఇద్దరు అంధులకు చూపును ప్రసాదించారు. దీనివల్ల వారి కళ్ళు సజీవంగా ఉంటాయని సదాశయ ఫౌండేషన్ సభ్యులు పేర్కొన్నారు. అలాగే, ఆమె తన దేహాన్ని ప్రభుత్వ మెడికల్ కళాశాలకు దానం చేయడం వల్ల ఎందరో వైద్య విద్యార్థులకు అది పాఠ్యపుస్తకంగా నిలిచిందని కవి, రచయిత డాక్టర్ నలిమెల భాస్కర్ కొనియాడారు. సదాశయ ఫౌండేషన్ సభ్యులు మాట్లాడుతూ, కుమార్ కుటుంబ సభ్యుల అంగీకారంతో తన తల్లి నేత్రదానం చేయడం గర్వించదగ్గ విషయమని అన్నారు. నేత్రదానంపై ప్రజలలో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని, ప్రజలు, యువత అపోహలను తొలగించుకొని ముందుకు రావాలని పిలుపునిచ్చారు. 73 ఏళ్ల వయసులోనూ ఆ తల్లి ముందుచూపుతో ఇద్దరు అంధులకు చూపును ప్రసాదించేలా నేత్రదానం చేయడం గొప్ప విషయమని, ఆమె ఒక గొప్ప ధన్యజీవి అని ప్రశంసించారు. మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, మరణించిన తర్వాత కూడా దేహం పలువురికి ఉపయోగపడే విధంగా వైద్య కళాశాలకు దేహదానం చేసిన ఆ తల్లి గొప్ప సంఘసంస్కర్త అని కొనియాడారు. భౌతికంగా ఆమె లేకున్నా అందరి మనసులో నిలిచిపోయారని, ఆమె గర్భాన పుట్టినవారు ధన్యులని పేర్కొన్నారు. ప్రభుత్వ మెడికల్ కళాశాల నోడల్ అధికారి మాట్లాడుతూ, మనిషి మరణించిన తర్వాత దేహం కాల్చినా, పూడ్చివేసినా దానికి ఏమీ తెలియదని, అలాంటి దేహాన్ని బ్రతికి ఉండగానే మెడికల్ కళాశాలకు డొనేట్ చేయాలని బుర్ర భారతి తన కుటుంబ సభ్యులకు చెప్పడం అభినందనీయమన్నారు. ఆమె కోరిక మేరకు కుటుంబ సభ్యులు నేత్రాలను, పార్థివదేహాన్ని కళాశాలకు అప్పగించడం గొప్ప విషయమని, ప్రతి ఒక్కరూ దేహదానానికి ముందుకు రావాలని అవగాహన కల్పించారు. సీనియర్ జర్నలిస్ట్ రవిచంద్ర మాట్లాడుతూ, తల్లి లేనిదే మనకు జన్మ లేదని, అలాంటి తల్లి ఒక దేవత లాంటిదని కొనియాడారు. తన దేహాన్ని ప్రభుత్వ మెడికల్ కళాశాలకు దానం చేసి గొప్ప మానవతావాదిగా నిలిచారని అన్నారు. సమాజంలో చెప్పడమే కాదు, నిబద్ధతతో నిలబడాలని సూచించిన ఆయన, తన మరణానంతరం తన పార్థివదేహాన్ని కూడా మెడికల్ కళాశాలకు అప్పగించాలని తన కుటుంబ సభ్యులకు తెలిపినట్లు వేదికపై నుండి ప్రకటించారు. డాక్టర్ రఘురామన్ మాట్లాడుతూ, 73 ఏళ్ల వయసులో ముందుచూపుతో తన పార్థివదేహాన్ని మెడికల్ కళాశాలకు అందించిన ఆ కుటుంబం ఎంతో గొప్ప మనసు కలిగి ఉందని అన్నారు. ముందు తరాలకు బాటలు వేస్తూ తాను తీసుకున్న నిర్ణయం గొప్ప విషయమని చెబుతూ, ఆ తల్లి బుర్ర భారతికి మనస్ఫూర్తిగా నివాళులర్పించారు. మనిషి మరణించిన తర్వాత పేరు మాత్రమే శాశ్వతంగా నిలుస్తుందని, అలాంటి పేరు వచ్చే పనులు ప్రతి ఒక్కరూ చేయాలని ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో పలువురు డాక్టర్లు, కళాకారులు, కవులు, సామాజిక కార్యకర్తలు, స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. బుర్ర భారతి కుమారులు సివి కుమార్, సీవీ శ్రీధర్, కూతుళ్లు వనజ, లావణ్య, విజయలక్ష్మి, పద్మ, అలాగే డాక్టర్ నలిమెల భాస్కర్, డాక్టర్ రఘురామన్, రవిచంద్ర, మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, మెడికల్ కళాశాల సూపర్డెంట్ డాక్టర్ సత్యనారాయణ రెడ్డి, అన్నవరం దేవేందర్, తైదెల అంజయ్య, బివిఎన్ స్వామి, నడిమెట్ల రామయ్య తదితరులు ఈ సంస్మరణ సభకు హాజరయ్యారు.2
- కరీంనగర్ జిల్లాలో, ఈనాడు ఆఫీస్ కెనాల్ సమీపంలో హైదరాబాద్ వైపు వెళ్తున్న TS RTC ఎలక్ట్రికల్ బస్సులో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. కరీంనగర్ నుండి బయలుదేరిన ఈ బస్సులో అగ్నిప్రమాదం సంభవించినప్పటికీ, డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో బస్సులోని ప్రయాణికులందరూ సురక్షితంగా బయటపడ్డారు.1