logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

మియాపూర్ బాలాజీ మెడికల్స్‌లో అక్రమంగా మత్తు మందుల విక్రయం: యజమాని అరెస్ట్, 1,500 మాత్రలు స్వాధీనం మియాపూర్: డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా అక్రమంగా మత్తు మాత్రలు, సిరప్‌లు విక్రయిస్తున్న బాలాజీ మెడికల్స్ ఫార్మసీపై సైబరాబాద్ స్పెషల్ ఆపరేషన్ టీమ్ (SOT), స్థానిక పోలీసులు సంయుక్తంగా ఆకస్మిక దాడి జరిపారు. ఈ దాడుల్లో నిర్వాహకుడు మహేశ్వర్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల సమాచారం మేరకు.. ఫార్మసీలో ఎలాంటి వైద్య ఆధారాలు లేకుండా ట్యాపెంటడాల్ (Tapentadol) మత్తు మాత్రలతో పాటు టెర్మిన్ ఇంజెక్షన్లను యథేచ్ఛగా విక్రయిస్తున్నట్లు వెల్లడైంది. తనిఖీల్లో భాగంగా 60 బాక్సుల్లో ఉన్న 1,500 మత్తు టాబ్లెట్లను, పలు ఇంజెక్షన్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కస్టమర్లకు నేరుగా డ్రగ్స్ చేరవేసేందుకు నిర్వాహకుడు ఆరుగురు డెలివరీ బాయ్స్‌ను నియమించుకుని, హోమ్ డెలివరీ నెట్‌వర్క్ నడుపుతున్నట్లు ప్రాథమిక విచారణలో తెలిసింది. కేసు నమోదు చేసిన పోలీసులు, ఈ అక్రమ రవాణా వెనుక ఉన్న ప్రధాన సరఫరాదారుల వివరాలకై దర్యాప్తును వేగవంతం చేశారు.

2 hrs ago
user_దాసరి నటరాజు
దాసరి నటరాజు
ఉయ్యూరు, కృష్ణ, ఆంధ్రప్రదేశ్•
2 hrs ago
bdc2397e-194f-4d3a-87cd-e496e323d101

మియాపూర్ బాలాజీ మెడికల్స్‌లో అక్రమంగా మత్తు మందుల విక్రయం: యజమాని అరెస్ట్, 1,500 మాత్రలు స్వాధీనం మియాపూర్: డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా అక్రమంగా మత్తు మాత్రలు, సిరప్‌లు విక్రయిస్తున్న బాలాజీ మెడికల్స్ ఫార్మసీపై సైబరాబాద్ స్పెషల్ ఆపరేషన్ టీమ్ (SOT), స్థానిక పోలీసులు సంయుక్తంగా ఆకస్మిక దాడి జరిపారు. ఈ దాడుల్లో నిర్వాహకుడు మహేశ్వర్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల సమాచారం మేరకు.. ఫార్మసీలో ఎలాంటి వైద్య ఆధారాలు లేకుండా ట్యాపెంటడాల్ (Tapentadol) మత్తు మాత్రలతో పాటు టెర్మిన్ ఇంజెక్షన్లను యథేచ్ఛగా విక్రయిస్తున్నట్లు వెల్లడైంది. తనిఖీల్లో భాగంగా 60 బాక్సుల్లో ఉన్న 1,500 మత్తు టాబ్లెట్లను, పలు ఇంజెక్షన్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కస్టమర్లకు నేరుగా డ్రగ్స్ చేరవేసేందుకు నిర్వాహకుడు ఆరుగురు డెలివరీ బాయ్స్‌ను నియమించుకుని, హోమ్ డెలివరీ నెట్‌వర్క్ నడుపుతున్నట్లు ప్రాథమిక విచారణలో తెలిసింది. కేసు నమోదు చేసిన పోలీసులు, ఈ అక్రమ రవాణా వెనుక ఉన్న ప్రధాన సరఫరాదారుల వివరాలకై దర్యాప్తును వేగవంతం చేశారు.

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • డయేరియా బాధితులను పరామర్శించిన ఉయ్యూరు నగర పంచాయతీ మాజీ చైర్మన్ వల్లభనేని నాని ఉయ్యూరు నగర పంచాయతీ మాజీ చైర్మన్ వల్లభనేని సత్యనారాయణ అలియాస్ వల్లభనేని నాని డయేరియా బాధితులను పరామర్శించారు.ఉయ్యూరు ప్రభుత్వ ఆసుపత్రిలో బాధితులను పరామర్శించి బ్రెడ్, పళ్ళు పంపిణీ చేశారు.స్థానిక కాపుల రామాలయం సెంటర్లో సుమారు పదిమందికి పైగా బాధితులను కలిసి వారి ఇంటి వద్దకు వెళ్లి వారి యోగక్షేమాలు తెలుసుకొని, పళ్ళు, బ్రెడ్ పంపిణీ చేసిన నాని. ఈ కార్యక్రమంలో ఆయన వెంట ఉయ్యూరు టౌన్ టిడిపి మాజీ వైస్ ప్రెసిడెంట్ తుంగల పెద్ద రత్తయ్య, నాయకులు, కార్యకర్తలు, పాల్గొన్నారు.
    1
    డయేరియా బాధితులను పరామర్శించిన ఉయ్యూరు నగర పంచాయతీ మాజీ చైర్మన్ వల్లభనేని నాని
ఉయ్యూరు నగర పంచాయతీ మాజీ చైర్మన్ వల్లభనేని సత్యనారాయణ అలియాస్ వల్లభనేని నాని డయేరియా బాధితులను పరామర్శించారు.ఉయ్యూరు ప్రభుత్వ ఆసుపత్రిలో బాధితులను పరామర్శించి బ్రెడ్, పళ్ళు పంపిణీ చేశారు.స్థానిక కాపుల రామాలయం సెంటర్లో సుమారు పదిమందికి పైగా బాధితులను కలిసి వారి ఇంటి వద్దకు వెళ్లి వారి యోగక్షేమాలు తెలుసుకొని, పళ్ళు, బ్రెడ్ పంపిణీ చేసిన నాని. ఈ కార్యక్రమంలో ఆయన వెంట ఉయ్యూరు టౌన్ టిడిపి మాజీ వైస్ ప్రెసిడెంట్ తుంగల పెద్ద రత్తయ్య, నాయకులు, కార్యకర్తలు, పాల్గొన్నారు.
    user_దాసరి నటరాజు
    దాసరి నటరాజు
    ఉయ్యూరు, కృష్ణ, ఆంధ్రప్రదేశ్•
    59 min ago
  • ఇంటి సమస్య పరిష్కారం చేసుకోలేని అసమర్ధుడు జోగి రమేష్ టీడీపీపై విమర్శలు చేస్తే సహించేది లేదు ఇంటి సమస్య పరిష్కారం చేసుకోలేని అసమర్ధుడు జోగి రమేష్ టీడీపీపై విమర్శలు చేస్తే సహించేది లేదని, మరోసారి చంద్రబాబు, లోకేష్ లపై అవాకులు చవాకులు పేలితే ఇంటిని ముట్టడిస్తామని తెలుగు యువత జిల్లా అధ్యక్షులు దండమూడి చౌదరి హెచ్చరించారు. బుధవారం చల్లపల్లిలోని నందమూరి తారకరామారావు గ్రామ పంచాయతీ ఆవరణలోని ఎన్టీఆర్ కళా పరిషత్ వేదికపై ఆయన మీడియాతో మాట్లాడుతూ పెడన నియోజకవర్గాన్ని దోచుకుని, మంత్రిగాను విఫలమైన జోగి రమేష్ చివరికి కుటుంబ సమస్య పరిష్కారంలోనూ విఫలమయ్యారన్నారు. ఇంటి సమస్య పరిష్కారం చేతకాని జోగి రమేష్ బయటకు వచ్చి సీఎం నారా చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ లపై రాజకీయ విమర్శలు చేయటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. ఇంటి సమస్య తీర్చుకోలేక కులం కార్డు వాడుకుంటున్న జోగి రమేష్ రేపల్లె నియోజకవర్గంలో అమర్నాథ్ గౌడ్ అనే బాలుడి సజీవ దహనం ఘటనలో బీసీలకు అండగా నిలువకుండా కులానికి న్యాయం చేయని జోగి రమేష్ నేడు కులం కార్డు వాడుకోవటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోసారి చంద్రబాబు, లోకేష్ లపై విమర్శలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. లిక్కర్ కుంభకోణంలో జోగి రమేష్ అరెస్టు ఖాయం అన్నారు.
    3
    ఇంటి సమస్య పరిష్కారం చేసుకోలేని అసమర్ధుడు జోగి రమేష్ టీడీపీపై విమర్శలు చేస్తే సహించేది లేదు 
ఇంటి సమస్య పరిష్కారం చేసుకోలేని అసమర్ధుడు జోగి రమేష్ టీడీపీపై విమర్శలు చేస్తే సహించేది లేదని, మరోసారి చంద్రబాబు, లోకేష్ లపై అవాకులు చవాకులు పేలితే ఇంటిని ముట్టడిస్తామని తెలుగు యువత జిల్లా అధ్యక్షులు దండమూడి చౌదరి హెచ్చరించారు. బుధవారం చల్లపల్లిలోని నందమూరి తారకరామారావు గ్రామ పంచాయతీ ఆవరణలోని ఎన్టీఆర్ కళా పరిషత్ వేదికపై ఆయన మీడియాతో మాట్లాడుతూ పెడన నియోజకవర్గాన్ని దోచుకుని, మంత్రిగాను విఫలమైన జోగి రమేష్ చివరికి కుటుంబ సమస్య పరిష్కారంలోనూ విఫలమయ్యారన్నారు. ఇంటి సమస్య పరిష్కారం చేతకాని జోగి రమేష్ బయటకు వచ్చి సీఎం నారా చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ లపై రాజకీయ విమర్శలు చేయటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. ఇంటి సమస్య తీర్చుకోలేక కులం కార్డు వాడుకుంటున్న జోగి రమేష్ రేపల్లె నియోజకవర్గంలో అమర్నాథ్ గౌడ్ అనే బాలుడి సజీవ దహనం ఘటనలో బీసీలకు అండగా నిలువకుండా కులానికి న్యాయం చేయని జోగి రమేష్ నేడు కులం కార్డు వాడుకోవటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోసారి చంద్రబాబు, లోకేష్ లపై విమర్శలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. లిక్కర్ కుంభకోణంలో జోగి రమేష్ అరెస్టు ఖాయం అన్నారు.
    user_Md.A.K.Jilani
    Md.A.K.Jilani
    Photographer అవనిగడ్డ, కృష్ణ, ఆంధ్రప్రదేశ్•
    3 hrs ago
  • ఆర్ డబ్ల్యూ ఎస్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జనసేన కార్యాలయం వద్ద నిరసన గుంటూరు జిల్లా మంగళగిరి.. ఆర్డబ్ల్యూఎస్ కాంట్రాక్టర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జనసేన కార్యాలయం వద్ద నిరసన.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట నిలబెట్టుకోవాలి.. మా అసోసియేషన్ లో ఆరుగురు తో కమిటీ వేసి బకాయిలు విడుదల చేపిస్తామన్నారు ఇంతవరకు నెరవేరలేదు.. ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జెల్ జీవన్ మిషన్ ద్వారా గ్రామీణ ప్రాంతాలలో త్రాగునీటి సరఫరా కోసం పనులు చేసాము.. 2024 నవంబర్ నుంచి ఇప్పటివరకు మా నిధులు ఇంతవరకు చెల్లించలేదు.. ఈ విషయంపై కాంట్రాక్టర్లు ధర్నాలు వినతి పత్రాలు ద్వారా తెలియజేశాము.. పవన్ కళ్యాణ్ కొత్త ప్లాట్ ఫామ్ లోకి బిల్లులు అప్లోడ్ చేయించుకుంటే పాత బకాయిలు సత్వరమే చెల్లిస్తామని భరోసా ఇచ్చారు.. 2026 జులై నాటికి దాదాపు 90 శాతం నుండి 95 శాతం వరకు తప్పకుండా కొత్త సిస్టంలో అప్లోడ్ చేయాలి.. ప్రస్తుతం ఫిట్టింగ్ బకాయి ఉన్న నాలుగువేల 133 కోట్ల రూపాయలు విడుదల చేయాలి. మా సమస్యలు పరిష్కరించే వరకు ఇక్కడే ఉంటాము అంటూ తెలియజేశారు..
    2
    ఆర్ డబ్ల్యూ ఎస్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జనసేన కార్యాలయం వద్ద నిరసన 
గుంటూరు జిల్లా మంగళగిరి..
ఆర్డబ్ల్యూఎస్ కాంట్రాక్టర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జనసేన కార్యాలయం వద్ద నిరసన..
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట నిలబెట్టుకోవాలి..
మా అసోసియేషన్ లో ఆరుగురు తో కమిటీ వేసి బకాయిలు విడుదల చేపిస్తామన్నారు ఇంతవరకు నెరవేరలేదు..
ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జెల్  జీవన్ మిషన్ ద్వారా గ్రామీణ ప్రాంతాలలో త్రాగునీటి సరఫరా కోసం పనులు చేసాము..
2024 నవంబర్ నుంచి ఇప్పటివరకు మా నిధులు ఇంతవరకు చెల్లించలేదు..
ఈ విషయంపై కాంట్రాక్టర్లు ధర్నాలు వినతి పత్రాలు ద్వారా తెలియజేశాము..
పవన్ కళ్యాణ్ కొత్త ప్లాట్ ఫామ్ లోకి బిల్లులు అప్లోడ్ చేయించుకుంటే పాత బకాయిలు సత్వరమే చెల్లిస్తామని భరోసా ఇచ్చారు..
2026 జులై నాటికి దాదాపు 90 శాతం నుండి 95 శాతం వరకు తప్పకుండా కొత్త సిస్టంలో అప్లోడ్ చేయాలి..
ప్రస్తుతం ఫిట్టింగ్ బకాయి ఉన్న నాలుగువేల 133 కోట్ల రూపాయలు విడుదల చేయాలి.
మా సమస్యలు పరిష్కరించే వరకు ఇక్కడే ఉంటాము అంటూ తెలియజేశారు..
    user_Syyed taher
    Syyed taher
    Local News Reporter Repalle, Bapatla•
    6 hrs ago
  • ప్రవక్త జన్మదిన సందర్భంగా గుంటూరులో స్వీట్లు పంపిణీ కార్యక్రమం మొహ్మద్ ప్రవక్త చూపిన మార్గం ప్రతి ఒక్కరికీ ఆదర్శనీయమని YCP గుంటూరు నగర అధ్యక్షురాలు నూరీఫాతిమా ప్రవక్త జన్మదిన సందర్భంగా స్వీట్లు పంపిణీఅన్నారు. మిలాద్ ఉన్ నబీ పర్వదినాన్ని పురస్కరించుకొని బుధవారం పొత్తూరువారితోటలోని వైసీపీ నగర కార్యాలయం వద్ద నూరీఫాతిమా స్వీట్స్ పంపిణీ చేశారు. ప్రతీయేటా మిలాద్ ఉన్ నబీ నాడు సేవా కార్యక్రమాలను చేయడం ఆనవాయతీగా వస్తుందన్నారు. ప్రవక్త మహమ్మద్ వారిని స్ఫూర్తిగా తీసుకొని అందరూ సేవా కార్యక్రమాలు చేయాలని ఆమె అన్నారు
    1
    ప్రవక్త జన్మదిన సందర్భంగా గుంటూరులో స్వీట్లు పంపిణీ కార్యక్రమం
మొహ్మద్ ప్రవక్త చూపిన మార్గం ప్రతి ఒక్కరికీ ఆదర్శనీయమని YCP గుంటూరు నగర అధ్యక్షురాలు నూరీఫాతిమా ప్రవక్త జన్మదిన సందర్భంగా స్వీట్లు పంపిణీఅన్నారు. మిలాద్ ఉన్ నబీ పర్వదినాన్ని పురస్కరించుకొని బుధవారం పొత్తూరువారితోటలోని వైసీపీ నగర కార్యాలయం వద్ద నూరీఫాతిమా స్వీట్స్ పంపిణీ చేశారు. ప్రతీయేటా మిలాద్ ఉన్ నబీ నాడు సేవా కార్యక్రమాలను చేయడం ఆనవాయతీగా వస్తుందన్నారు. ప్రవక్త మహమ్మద్ వారిని స్ఫూర్తిగా తీసుకొని అందరూ సేవా కార్యక్రమాలు చేయాలని ఆమె అన్నారు
    user_SHOT NEWS
    SHOT NEWS
    Advertising agency Guntur, Andhra Pradesh•
    5 hrs ago
  • అయితే ఏంటి, నేను లైవ్ లో చూసాను మహిళలు స్వేచ్ఛ గా ఉన్నారు. స్త్రీ శక్తి పదకం ద్వారా... బస్సులో 80 మంది.. 🚍 ఇద్దరే పురుషులు.. కండక్టర్ వీడియో వైరల్ TG: మంచిర్యాల డిపో బస్సు కండక్టర్ తన ఆవేదనను పంచుకున్న వీడియో వైరల్ అవుతోంది. 'మా బస్సులో 80 మంది ఉండగా అంతా మహిళలే.. ఇద్దరే పురుషులు ఉన్నారు. డిపార్ట్మెంటేమో డబ్బులు తీసుకురావాలని వేధిస్తోంది. ఇలా అయితే డబ్బులు ఎలా తేవాలి? ప్రభుత్వం మహిళల కోసం ఫ్రీ బస్ స్కీమ్ పెట్టింది. అందుకు అనుగుణంగా మేం పని చేస్తున్నాం. టికెట్ డబ్బుల కోసం వేధించవద్దు' అని కోరారు.
    1
    అయితే ఏంటి, నేను లైవ్ లో చూసాను మహిళలు స్వేచ్ఛ గా ఉన్నారు. స్త్రీ శక్తి పదకం ద్వారా...
బస్సులో 80 మంది.. 🚍
ఇద్దరే పురుషులు.. 
కండక్టర్ వీడియో వైరల్

TG: మంచిర్యాల డిపో బస్సు కండక్టర్ తన ఆవేదనను పంచుకున్న వీడియో వైరల్ అవుతోంది. 'మా బస్సులో 80 మంది ఉండగా అంతా మహిళలే.. ఇద్దరే పురుషులు ఉన్నారు. డిపార్ట్మెంటేమో డబ్బులు తీసుకురావాలని వేధిస్తోంది. ఇలా అయితే డబ్బులు ఎలా తేవాలి? ప్రభుత్వం మహిళల కోసం ఫ్రీ బస్ స్కీమ్ పెట్టింది. అందుకు అనుగుణంగా మేం పని చేస్తున్నాం. టికెట్ డబ్బుల కోసం వేధించవద్దు' అని కోరారు.
    user_Seelam Ashok Reddy Flex Print
    Seelam Ashok Reddy Flex Print
    Graphic designer మైలవరం, ఎన్టీఆర్, ఆంధ్రప్రదేశ్•
    20 hrs ago
  • బీసీల అభివృద్ధి ప్రదాత బీపీ మండల్ పాలకొల్లులో బీపీ మండల్ 108వ జయంతి వేడుకలు
    1
    బీసీల అభివృద్ధి ప్రదాత బీపీ మండల్ 
పాలకొల్లులో బీపీ మండల్ 108వ జయంతి వేడుకలు
    user_Gopi krishna Journalist
    Gopi krishna Journalist
    journalist (20yrs experience) పాలకొల్లు, పశ్చిమ గోదావరి, ఆంధ్రప్రదేశ్•
    8 hrs ago
  • ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని దర్శించుకున్న నూతన ఏపీ లోకాయుక్త జస్టిస్ టి. మల్లికార్జున రావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన లోకాయుక్త (రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి) जస్టిస్ తాళ్లప్రగడ మల్లికార్జున రావు మంగళవారం తన కుటుంబ సభ్యులతో కలిసి విజయవాడ ఇంద్రకీలాద్రిపై వేంచేసియున్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానాన్ని సందర్శించారు. ఆంధ్రప్రదేశ్ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఆయన కుటుంబ సమేతంగా అమ్మవారి దర్శనం కోసం విచ్చేశారు.ఈ సందర్భంగా ఆలయానికి చేరుకున్న లోకాయుక్త జడ్జి దంపతులకు మరియు వారి కుటుంబ సభ్యులకు దేవస్థాన అధికారులు మర్యాదపూర్వకంగా ఘన స్వాగతం పలికారు. ఆలయ డెప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (డీఈఓ) కిషోర్ కుమార్ స్వయంగా హాజరై, జడ్జి గారి కుటుంబానికి అమ్మవారి అంతరాలయ దర్శన ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షించారు.లోకాయుక్త జడ్జి మరియు వారి కుటుంబ సభ్యులు కనకదుర్గ అమ్మవారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనము అనంతరం వేద పండితులు వారికి వేదాశీర్వచనం అందించగా, డెప్యూటీ ఈఓ కిషోర్ కుమార్ అమ్మవారి శేష వస్త్రం, పవిత్ర తీర్థ ప్రసాదాలు మరియు అమ్మవారి చిత్రపటాన్ని అందజేసి యున్నారు ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, అర్చకులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.
    3
    ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని దర్శించుకున్న నూతన ఏపీ లోకాయుక్త జస్టిస్ టి. మల్లికార్జున రావు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన లోకాయుక్త (రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి) जస్టిస్ తాళ్లప్రగడ మల్లికార్జున రావు మంగళవారం తన కుటుంబ సభ్యులతో కలిసి విజయవాడ ఇంద్రకీలాద్రిపై వేంచేసియున్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానాన్ని సందర్శించారు. ఆంధ్రప్రదేశ్ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఆయన కుటుంబ సమేతంగా అమ్మవారి దర్శనం కోసం విచ్చేశారు.ఈ సందర్భంగా ఆలయానికి చేరుకున్న లోకాయుక్త జడ్జి  దంపతులకు మరియు వారి కుటుంబ సభ్యులకు దేవస్థాన అధికారులు మర్యాదపూర్వకంగా ఘన స్వాగతం పలికారు. ఆలయ డెప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (డీఈఓ) కిషోర్ కుమార్ స్వయంగా హాజరై, జడ్జి గారి కుటుంబానికి అమ్మవారి అంతరాలయ దర్శన ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షించారు.లోకాయుక్త జడ్జి మరియు వారి కుటుంబ సభ్యులు కనకదుర్గ అమ్మవారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనము అనంతరం వేద పండితులు వారికి వేదాశీర్వచనం అందించగా, డెప్యూటీ ఈఓ కిషోర్ కుమార్ అమ్మవారి శేష వస్త్రం, పవిత్ర తీర్థ ప్రసాదాలు మరియు అమ్మవారి చిత్రపటాన్ని అందజేసి యున్నారు ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, అర్చకులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.
    user_దాసరి నటరాజు
    దాసరి నటరాజు
    ఉయ్యూరు, కృష్ణ, ఆంధ్రప్రదేశ్•
    18 hrs ago
  • మేడ్చల్‌లో గంజాయి మత్తులో యువకుల వీరంగం సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయిన దృశ్యాలు పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భాగ్యలక్ష్మీ కాలనీలో గంజాయి బ్యాచ్ వీరంగం రోడ్డుపై వెళ్తున్న ర్యాపిడో కార్ డ్రైవర్‌ని ఆపి గంజాయి కావాలంటూ రచ్చ చేసిన 10 మంది యువకులు గంజాయి నా వద్ద లేదనడంతో ఆగ్రహానికి గురై మత్తులో డ్రైవర్ ఆకాష్‌పై బీర్ సీసాలతో విచక్షణారహితంగా దాడి గంజాయి యువకుల దాడిలో కార్ డ్రైవర్ ఆకాష్ తలతో పాటు చేయి విరిగిన వైనం దాడి ఘటనలో దెబ్బలు తట్టుకోలేక పక్కనే ఉన్న తన రూమ్‌కి పరిగెత్తిన డ్రైవర్ తరుముకుంటూ వెళ్లి డ్రైవర్ ఇంటి ఆవరణలో కట్టెలతో విచక్షణారహితంగా దాడి
    1
    మేడ్చల్‌లో గంజాయి మత్తులో యువకుల వీరంగం
సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయిన దృశ్యాలు

పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భాగ్యలక్ష్మీ కాలనీలో గంజాయి బ్యాచ్ వీరంగం
రోడ్డుపై వెళ్తున్న ర్యాపిడో కార్ డ్రైవర్‌ని ఆపి గంజాయి కావాలంటూ రచ్చ చేసిన 10 మంది యువకులు
గంజాయి నా వద్ద లేదనడంతో ఆగ్రహానికి గురై మత్తులో డ్రైవర్ ఆకాష్‌పై బీర్ సీసాలతో విచక్షణారహితంగా దాడి
గంజాయి యువకుల దాడిలో కార్ డ్రైవర్ ఆకాష్ తలతో పాటు చేయి విరిగిన వైనం
దాడి ఘటనలో దెబ్బలు తట్టుకోలేక పక్కనే ఉన్న తన రూమ్‌కి పరిగెత్తిన డ్రైవర్
తరుముకుంటూ వెళ్లి డ్రైవర్ ఇంటి ఆవరణలో కట్టెలతో విచక్షణారహితంగా దాడి
    user_ఆజాద్
    ఆజాద్
    Local News Reporter సత్తుపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    1 hr ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.