logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ప్రైవేట్ స్కూల్ ఫీజుల నియంత్రణకు డిమాండ్ చేస్తూ ఆదివారం నాడు ఉప్పల్ గాంధీ బొమ్మ పక్కన బీజేపీ ఉప్పల్ డివిజన్ ఆధ్వర్యంలో నిరసన దీక్ష కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఉప్పల్ డివిజన్ అధ్యక్షులు ఫణీంద్ర అన్న ఆదేశాల మేరకు, ఉప్పల్ గిరిజన మోర్చా అధ్యక్షులు శ్రీ బానోత్ రాజు నాయక్ ఆధ్వర్యంలో, ఈ రోజు ఉప్పల్ గిరిజన మోర్చా ఉప్పల్ గాంధీ బొమ్మ పక్కన ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రకటన చేసింది. ఈ సందర్భంగా, బీజేపీ ఓబీసీ మోర్చా తెలంగాణ అధ్యక్షుడు పంజాల శ్రవణ్ కుమార్ గౌడ్, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరూ హాజరు కావాలని ఈ రోజు విజ్ఞప్తి చేశారు.

14 hrs ago
user_Journalist Madhu
Journalist Madhu
Financial Analyst కాప్రా, మేడ్చల్ మల్కాజ్‌గిరి, తెలంగాణ•
14 hrs ago
026c288f-c435-4042-858b-f60ca3273821

ప్రైవేట్ స్కూల్ ఫీజుల నియంత్రణకు డిమాండ్ చేస్తూ ఆదివారం నాడు ఉప్పల్ గాంధీ బొమ్మ పక్కన బీజేపీ ఉప్పల్ డివిజన్ ఆధ్వర్యంలో నిరసన దీక్ష కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఉప్పల్ డివిజన్ అధ్యక్షులు ఫణీంద్ర అన్న ఆదేశాల మేరకు, ఉప్పల్ గిరిజన మోర్చా అధ్యక్షులు శ్రీ బానోత్ రాజు నాయక్ ఆధ్వర్యంలో, ఈ రోజు ఉప్పల్ గిరిజన మోర్చా ఉప్పల్ గాంధీ బొమ్మ పక్కన ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రకటన చేసింది. ఈ సందర్భంగా, బీజేపీ ఓబీసీ మోర్చా తెలంగాణ అధ్యక్షుడు పంజాల శ్రవణ్ కుమార్ గౌడ్, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరూ హాజరు కావాలని ఈ రోజు విజ్ఞప్తి చేశారు.

More news from Sangareddy and nearby areas
  • అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆదివారం జిన్నారం మున్సిపల్ కేంద్రంలోని కోర్టు ఆవరణలో యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిన్నారం జడ్జి తేజశ్రీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, యోగా సాధనతో మానసిక ప్రశాంతతతో పాటు సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. యోగా శారీరక, మానసిక ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని స్పష్టం చేసిన జడ్జి తేజశ్రీ, ప్రతి ఒక్కరూ ప్రతిరోజూ యోగా చేయాలని సూచించారు. సమాజంలోని ప్రతి ఒక్కరికీ యోగా ప్రాముఖ్యతను తెలియజేయాలని ఆమె పిలుపునిచ్చారు.
    1
    అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆదివారం జిన్నారం మున్సిపల్ కేంద్రంలోని కోర్టు ఆవరణలో యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిన్నారం జడ్జి తేజశ్రీ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, యోగా సాధనతో మానసిక ప్రశాంతతతో పాటు సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. యోగా శారీరక, మానసిక ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని స్పష్టం చేసిన జడ్జి తేజశ్రీ, ప్రతి ఒక్కరూ ప్రతిరోజూ యోగా చేయాలని సూచించారు. సమాజంలోని ప్రతి ఒక్కరికీ యోగా ప్రాముఖ్యతను తెలియజేయాలని ఆమె పిలుపునిచ్చారు.
    user_KUMAR
    KUMAR
    Patancheru, Sangareddy•
    13 hrs ago
  • అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని, మెదక్ జిల్లాలోని కౌడిపల్లి మండల కేంద్రంలోని స్కూల్ మైదానం యోగా సాధకులతో కళకళలాడింది. ఆదివారం నిర్వహించిన ప్రత్యేక యోగా కార్యక్రమంలో యోగా గురువులు ప్రతాప్ రెడ్డి, సత్యం పాల్గొని యోగా యొక్క ప్రాముఖ్యతను వివరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఆధునిక జీవనశైలిలో పెరుగుతున్న ఒత్తిడి, ఆందోళనలను అధిగమించడంలో యోగా కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. ప్రతిరోజూ కొంత సమయం యోగా సాధనకు కేటాయిస్తే శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు ఏకాగ్రత కూడా పెరుగుతుందని చెప్పారు. యోగాను నిత్య జీవితంలో భాగంగా మార్చుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, విద్యార్థులు, గ్రామ ప్రజలు ఉత్సాహంగా పాల్గొని యోగా ఆసనాలు వేశారు. సామూహిక యోగా సాధనతో మైదానం ఆరోగ్య చైతన్యానికి వేదికగా మారింది.
    1
    అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని, మెదక్ జిల్లాలోని కౌడిపల్లి మండల కేంద్రంలోని స్కూల్ మైదానం యోగా సాధకులతో కళకళలాడింది. ఆదివారం నిర్వహించిన ప్రత్యేక యోగా కార్యక్రమంలో యోగా గురువులు ప్రతాప్ రెడ్డి, సత్యం పాల్గొని యోగా యొక్క ప్రాముఖ్యతను వివరించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఆధునిక జీవనశైలిలో పెరుగుతున్న ఒత్తిడి, ఆందోళనలను అధిగమించడంలో యోగా కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. ప్రతిరోజూ కొంత సమయం యోగా సాధనకు కేటాయిస్తే శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు ఏకాగ్రత కూడా పెరుగుతుందని చెప్పారు. యోగాను నిత్య జీవితంలో భాగంగా మార్చుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, విద్యార్థులు, గ్రామ ప్రజలు ఉత్సాహంగా పాల్గొని యోగా ఆసనాలు వేశారు. సామూహిక యోగా సాధనతో మైదానం ఆరోగ్య చైతన్యానికి వేదికగా మారింది.
    user_Priya
    Priya
    నర్సాపూర్, మెదక్, తెలంగాణ•
    5 hrs ago
  • హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీలో NEET పరీక్షా కేంద్రం తెలియక కంగారు పడుతున్న ఒక విద్యార్థినికి ఓయూ ఇన్‌స్పెక్టర్ మహేష్ కుమార్ గౌడ్ మానవత్వంతో సహాయం చేశారు. ఇన్‌స్పెక్టర్ తన వాహనంలో ఆ విద్యార్థినిని ఎక్కించుకుని, సరిగ్గా సమయానికి పరీక్షా కేంద్రం లోపలికి చేర్చి పంపించారు.
    1
    హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీలో NEET పరీక్షా కేంద్రం తెలియక కంగారు పడుతున్న ఒక విద్యార్థినికి ఓయూ ఇన్‌స్పెక్టర్ మహేష్ కుమార్ గౌడ్ మానవత్వంతో సహాయం చేశారు. ఇన్‌స్పెక్టర్ తన వాహనంలో ఆ విద్యార్థినిని ఎక్కించుకుని, సరిగ్గా సమయానికి పరీక్షా కేంద్రం లోపలికి చేర్చి పంపించారు.
    user_@ANUNEWS143
    @ANUNEWS143
    Newspaper publisher యాదగిరిగుట్ట, యాదాద్రి భువనగిరి, తెలంగాణ•
    7 hrs ago
  • తెలంగాణ పంచాయతీ రాజ్ మరియు గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి ధనసరి సీతక్క, అలాగే ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య శనివారం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. స్వామి వారిని దర్శించుకోవడం తన అదృష్టమని మంత్రి సీతక్క ఈ సందర్భంగా తెలిపారు. కొండపైకి చేరుకున్న మంత్రి సీతక్కకు కలెక్టర్ అనురాగ్ జయంతి, అడిషనల్ కలెక్టర్ భాస్కర్ రావు పూల మొక్కను ఇచ్చి స్వాగతం పలికారు. అనంతరం ఆలయ చైర్మన్ నరసింహమూర్తి ఆధ్వర్యంలో అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. మంత్రి సీతక్క, ఎమ్మెల్యే ఐలయ్య గర్భాలయంలోని స్వయంభూమూర్తులను దర్శించుకుని, ఆలయ అర్చకులు నిర్వహించిన ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అలాగే ప్రధానాలయ ముఖమంటపంలోని ఉత్సవ మూర్తులను దర్శించుకుని ప్రత్యేక సువర్ణ పుష్పార్చనలో పాల్గొన్నారు. వేద పండితులు, ఆలయ అర్చకులు వారికి ఆశీర్వచనం చేయగా, ఆలయ చైర్మన్ నరసింహమూర్తి స్వామి వారి లడ్డు ప్రసాదం, చిత్రపటాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ డీఈవో నవీన్ కుమార్, సూపర్డెంట్ రాజన్ బాబు, ఆలయ ప్రధానార్చకులు సురేంద్రచార్యులు, ఉప ప్రధాన అర్చకులు లక్ష్మణాచార్యులు, అర్చకులు మురళి, అడిషనల్ కలెక్టర్ భాస్కర్ రావు, ఎస్పీఎఫ్ ఆర్‌ఐ శేషగిరిరావు, ఆర్డీవో కృష్ణారెడ్డి, తహసిల్దార్ గణేష్ నాయక్, యాదగిరిగుట్ట మున్సిపల్ చైర్మన్ గుండ్లపల్లి వాణి భరత్ గౌడ్, మహిళా నాయకురాలు బండ్రు శోభారాణి, ఆలేరు మార్కెట్ కమిటీ చైర్మన్ చైతన్య మహేందర్ రెడ్డి, యాదగిరిగుట్ట మున్సిపల్ కౌన్సిలర్లు ముక్కెర్ల మల్లేష్, బూడిద మధు, నాయకులు గౌలికర్ రాజేష్, సుధాకర్, భిక్షపతి, గుండ్లపల్లి రాము, అజయ్ తదితరులు పాల్గొన్నారు.
    1
    తెలంగాణ పంచాయతీ రాజ్ మరియు గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి ధనసరి సీతక్క, అలాగే ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య శనివారం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. స్వామి వారిని దర్శించుకోవడం తన అదృష్టమని మంత్రి సీతక్క ఈ సందర్భంగా తెలిపారు.

కొండపైకి చేరుకున్న మంత్రి సీతక్కకు కలెక్టర్ అనురాగ్ జయంతి, అడిషనల్ కలెక్టర్ భాస్కర్ రావు పూల మొక్కను ఇచ్చి స్వాగతం పలికారు. అనంతరం ఆలయ చైర్మన్ నరసింహమూర్తి ఆధ్వర్యంలో అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. మంత్రి సీతక్క, ఎమ్మెల్యే ఐలయ్య గర్భాలయంలోని స్వయంభూమూర్తులను దర్శించుకుని, ఆలయ అర్చకులు నిర్వహించిన ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అలాగే ప్రధానాలయ ముఖమంటపంలోని ఉత్సవ మూర్తులను దర్శించుకుని ప్రత్యేక సువర్ణ పుష్పార్చనలో పాల్గొన్నారు.

వేద పండితులు, ఆలయ అర్చకులు వారికి ఆశీర్వచనం చేయగా, ఆలయ చైర్మన్ నరసింహమూర్తి స్వామి వారి లడ్డు ప్రసాదం, చిత్రపటాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ డీఈవో నవీన్ కుమార్, సూపర్డెంట్ రాజన్ బాబు, ఆలయ ప్రధానార్చకులు సురేంద్రచార్యులు, ఉప ప్రధాన అర్చకులు లక్ష్మణాచార్యులు, అర్చకులు మురళి, అడిషనల్ కలెక్టర్ భాస్కర్ రావు, ఎస్పీఎఫ్ ఆర్‌ఐ శేషగిరిరావు, ఆర్డీవో కృష్ణారెడ్డి, తహసిల్దార్ గణేష్ నాయక్, యాదగిరిగుట్ట మున్సిపల్ చైర్మన్ గుండ్లపల్లి వాణి భరత్ గౌడ్, మహిళా నాయకురాలు బండ్రు శోభారాణి, ఆలేరు మార్కెట్ కమిటీ చైర్మన్ చైతన్య మహేందర్ రెడ్డి, యాదగిరిగుట్ట మున్సిపల్ కౌన్సిలర్లు ముక్కెర్ల మల్లేష్, బూడిద మధు, నాయకులు గౌలికర్ రాజేష్, సుధాకర్, భిక్షపతి, గుండ్లపల్లి రాము, అజయ్ తదితరులు పాల్గొన్నారు.
    user_ARUTLA KISHORE KUMAR
    ARUTLA KISHORE KUMAR
    Teacher Yadagirigutta, Yadadri Bhuvanagiri•
    15 hrs ago
  • ఆదివారం జనగామ జిల్లాలో జరిగిన నీట్ పరీక్షకు హాజరైన అశ్విని అనే విద్యార్థిని, జనగామ పట్టణంలోని ఏబీవీ డిగ్రీ కళాశాల సెంటర్‌కు పొరపాటున చేరుకుంది. అయితే, ఆమెకు కేటాయించిన అసలు పరీక్షా కేంద్రం పెంబర్తి గ్రామంలోని ఒక కళాశాలలో ఉంది. హాల్ టికెట్ పరిశీలించిన విధుల్లో ఉన్న పోలీసులు, ఆమె తప్పుడు సెంటర్‌కు వచ్చినట్లు గుర్తించి తెలియజేశారు. ఈ విషయం తెలిసి తీవ్ర కంగారుతో కన్నీటిపర్యంతమైన విద్యార్థినిని చూసి, పోలీసులు వెంటనే స్పందించి విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. పరిస్థితిని అర్థం చేసుకున్న అధికారులు, ఏమాత్రం ఆలస్యం చేయకుండా విద్యార్థినిని వెంటనే పోలీస్ వాహనంలో అసలు సెంటర్‌కు తరలించాలని ఆదేశించారు. పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాలతో, సదరు విద్యార్థినిని అధికారిక పోలీస్ వాహనంలో ఎక్కించుకొని, జనగామ పట్టణం నుండి పెంబర్తిలోని నీట్ పరీక్షా కేంద్రానికి సైరన్ మోగిస్తూ మెరుపు వేగంతో వెళ్లి, పరీక్ష ప్రారంభానికి 9 నిమిషాల ముందే చేర్చారు. పోలీసుల ఈ వేగవంతమైన, మానవతా దృక్పథంతో కూడిన చర్యకు వారు ప్రజలచే శభాష్ అనిపించుకోగా, విద్యార్థినితో పాటు పలువురు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.
    1
    ఆదివారం జనగామ జిల్లాలో జరిగిన నీట్ పరీక్షకు హాజరైన అశ్విని అనే విద్యార్థిని, జనగామ పట్టణంలోని ఏబీవీ డిగ్రీ కళాశాల సెంటర్‌కు పొరపాటున చేరుకుంది. అయితే, ఆమెకు కేటాయించిన అసలు పరీక్షా కేంద్రం పెంబర్తి గ్రామంలోని ఒక కళాశాలలో ఉంది. హాల్ టికెట్ పరిశీలించిన విధుల్లో ఉన్న పోలీసులు, ఆమె తప్పుడు సెంటర్‌కు వచ్చినట్లు గుర్తించి తెలియజేశారు.

ఈ విషయం తెలిసి తీవ్ర కంగారుతో కన్నీటిపర్యంతమైన విద్యార్థినిని చూసి, పోలీసులు వెంటనే స్పందించి విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. పరిస్థితిని అర్థం చేసుకున్న అధికారులు, ఏమాత్రం ఆలస్యం చేయకుండా విద్యార్థినిని వెంటనే పోలీస్ వాహనంలో అసలు సెంటర్‌కు తరలించాలని ఆదేశించారు. పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాలతో, సదరు విద్యార్థినిని అధికారిక పోలీస్ వాహనంలో ఎక్కించుకొని, జనగామ పట్టణం నుండి పెంబర్తిలోని నీట్ పరీక్షా కేంద్రానికి సైరన్ మోగిస్తూ మెరుపు వేగంతో వెళ్లి, పరీక్ష ప్రారంభానికి 9 నిమిషాల ముందే చేర్చారు. పోలీసుల ఈ వేగవంతమైన, మానవతా దృక్పథంతో కూడిన చర్యకు వారు ప్రజలచే శభాష్ అనిపించుకోగా, విద్యార్థినితో పాటు పలువురు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.
    user_Devender Pasunoori
    Devender Pasunoori
    Local News Reporter Jangoan, Telangana•
    8 hrs ago
  • తిరుమల మెట్ల మార్గంలో ఓ వృద్ధ దంపతుల మధ్య చోటుచేసుకున్న అపురూప దృశ్యం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. భార్య మెట్లు ఎక్కలేక ఇబ్బంది పడుతుండటాన్ని గమనించిన భర్త, ఆమెకు సాయం చేసేందుకు తన టవల్‌ను ఓవైపు చేతికి కట్టుకున్నారు. భార్య ఆ టవల్ మరొక భాగాన్ని పట్టుకుని ఒక్కో మెట్టూ ఎక్కుతూ ముందుకు సాగింది. భార్యాభర్తల మధ్య కనిపించిన ఈ హృదయపూర్వకమైన సీన్ ప్రస్తుతం తిరుమలలో హాట్ టాపిక్‌గా మారింది.
    1
    తిరుమల మెట్ల మార్గంలో ఓ వృద్ధ దంపతుల మధ్య చోటుచేసుకున్న అపురూప దృశ్యం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. భార్య మెట్లు ఎక్కలేక ఇబ్బంది పడుతుండటాన్ని గమనించిన భర్త, ఆమెకు సాయం చేసేందుకు తన టవల్‌ను ఓవైపు చేతికి కట్టుకున్నారు. భార్య ఆ టవల్ మరొక భాగాన్ని పట్టుకుని ఒక్కో మెట్టూ ఎక్కుతూ ముందుకు సాగింది. భార్యాభర్తల మధ్య కనిపించిన ఈ హృదయపూర్వకమైన సీన్ ప్రస్తుతం తిరుమలలో హాట్ టాపిక్‌గా మారింది.
    user_SANDEEEP K
    SANDEEEP K
    కుత్బుల్లాపూర్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, తెలంగాణ•
    10 hrs ago
  • మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని నాగసానుపల్లి గ్రామంలో ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారి ఆలయంలో ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి, అభిషేకాలు, హారతులు ఘనంగా జరిపారు. ఏడుపాయల శ్రీ వన దుర్గా భవాని అమ్మవారికి ప్రత్యేక మంగళహారతి కూడా ఇచ్చారు.
    1
    మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని నాగసానుపల్లి గ్రామంలో ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారి ఆలయంలో ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి, అభిషేకాలు, హారతులు ఘనంగా జరిపారు. ఏడుపాయల శ్రీ వన దుర్గా భవాని అమ్మవారికి ప్రత్యేక మంగళహారతి కూడా ఇచ్చారు.
    user_KUMAR
    KUMAR
    Patancheru, Sangareddy•
    15 hrs ago
  • మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు చిన్నశంకరంపేట మండల కేంద్రం సమగ్ర అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. మండల కేంద్రంలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీలో కొత్తవారు–పాతవారు అనే భేదం లేదని స్పష్టం చేశారు. పార్టీ బలోపేతంతో పాటు ప్రాంత అభివృద్ధిని సాధించడమే అందరి లక్ష్యమని పేర్కొన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు కలిసి పనిచేస్తే అభివృద్ధి మరింత వేగవంతమవుతుందని ఆయన అన్నారు. అలాగే, గ్రామ సర్పంచ్ చంద్రశేఖర్ ప్రతిపాదించిన అభివృద్ధి పనులను దశలవారీగా చేపట్టేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఫోరం అధ్యక్షుడు గోపాల్ రెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మోహన్‌తో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
    1
    మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు చిన్నశంకరంపేట మండల కేంద్రం సమగ్ర అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. మండల కేంద్రంలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీలో కొత్తవారు–పాతవారు అనే భేదం లేదని స్పష్టం చేశారు. పార్టీ బలోపేతంతో పాటు ప్రాంత అభివృద్ధిని సాధించడమే అందరి లక్ష్యమని పేర్కొన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు కలిసి పనిచేస్తే అభివృద్ధి మరింత వేగవంతమవుతుందని ఆయన అన్నారు. అలాగే, గ్రామ సర్పంచ్ చంద్రశేఖర్ ప్రతిపాదించిన అభివృద్ధి పనులను దశలవారీగా చేపట్టేందుకు కృషి చేస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఫోరం అధ్యక్షుడు గోపాల్ రెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మోహన్‌తో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
    user_Priya
    Priya
    నర్సాపూర్, మెదక్, తెలంగాణ•
    5 hrs ago
  • కరీంనగర్-హైదరాబాద్ మార్గంలో ప్రయాణిస్తున్న కరీంనగర్-2 డిపోకు చెందిన ఓ ఎలక్ట్రిక్ ఆర్టీసీ బస్సులో తిమ్మాపూర్ మండలం ఎల్ఎండీ సమీపంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. సాంకేతిక లోపం కారణంగా ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. అప్రమత్తమైన డ్రైవర్ తక్షణమే బస్సును నిలిపివేయగా, డ్రైవర్, కండక్టర్లు కలిసి అందులో ఉన్న 37 మంది ప్రయాణికులను సురక్షితంగా బయటికి దించారు. ప్రయాణికులను దించిన అనంతరం మంటలు బస్సు మొత్తం వ్యాపించి, అది పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ప్రమాదానికి గల కచ్చితమైన కారణాలను తెలుసుకునేందుకు అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.
    1
    కరీంనగర్-హైదరాబాద్ మార్గంలో ప్రయాణిస్తున్న కరీంనగర్-2 డిపోకు చెందిన ఓ ఎలక్ట్రిక్ ఆర్టీసీ బస్సులో తిమ్మాపూర్ మండలం ఎల్ఎండీ సమీపంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. సాంకేతిక లోపం కారణంగా ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. అప్రమత్తమైన డ్రైవర్ తక్షణమే బస్సును నిలిపివేయగా, డ్రైవర్, కండక్టర్లు కలిసి అందులో ఉన్న 37 మంది ప్రయాణికులను సురక్షితంగా బయటికి దించారు.

ప్రయాణికులను దించిన అనంతరం మంటలు బస్సు మొత్తం వ్యాపించి, అది పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ప్రమాదానికి గల కచ్చితమైన కారణాలను తెలుసుకునేందుకు అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.
    user_KHADEER REPORTER
    KHADEER REPORTER
    Journalist జగదేవ్‌పూర్, సిద్దిపేట, తెలంగాణ•
    12 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.