*శ్రీశైలం దేవస్థానానికి ధర్మప్రచారరథం సమర్పణ* హైదరాబాద్ వాస్తవ్యులైన బాలం సుధీర్ దేవస్థానానికి ధర్మప్రచార రథాన్ని విరాళంగా సమర్పించారు. సుమారు రూ.72లక్షల వ్యయంతో ఈ రథాన్ని రూపొందించినట్లుగా దాత తెలియజేశారు. ఆలయ నమూనాలో రూపొందించబడిన ఈ ధర్మప్రచారరథంలో స్వామిఅమ్మవార్ల అనుకృతమూర్తులు నెలకొల్పబడ్డారు. అదేవిధంగా కల్యాణమూర్తులు నెలకొల్పబడ్డారు. వాహనానికి ముందువైపు సాక్షిగణపతి వారి ప్రతిరూపాన్ని నెలకొల్పడం జరిగింది. రథానికి వెనుకవైపున దక్షిణామూర్తి, కుడివైపున గణపతి, కుమారస్వామివార్లను నెలకొల్పబడ్డారు.మంగళవారం(30.09.2025) ఉదయం గంగాధర మండపం వద్ద ఈ ధర్మప్రచారరథానికి శాస్త్రోక్తంగా పూజాదికాలు జరిపించబడ్డాయి. దేవస్థానంకార్యనిర్వహణాధికారి యం. శ్రీనివాసరావు, దేవస్థాన చైర్మెన్గా నియామకం కాబడిన పి. రమేష్ నాయుడు, అర్చకస్వాములు, వేదపండితులు, అధికారులు, సంబంధిత సిబ్బంది పాల్గొన్నారుఈ సందర్భంగా కార్యనిర్వహణాధికారి యం. శ్రీనివాసరావు మాట్లాడుతూ వివిధ ప్రాంతాలలో దేవస్థానం తరుపున ధర్మప్రచార కార్యక్రమాలను నిర్వహించేందుకు వినియోగించబడుతుందన్నారు. ఈ ధర్మరథంఅనంతరం దాతమాట్లాడుతూదేవస్థానానికి ధర్మప్రచారరథాన్ని సమర్పించడం తమ పూర్వజన్మసుకృతంగా భావిస్తున్నామన్నారు. స్వామిఅమ్మవార్ల అనుగ్రహంతో తమకు ఈ అదృష్టం కలిగిందన్నారు.
*శ్రీశైలం దేవస్థానానికి ధర్మప్రచారరథం సమర్పణ* హైదరాబాద్ వాస్తవ్యులైన బాలం సుధీర్ దేవస్థానానికి ధర్మప్రచార రథాన్ని విరాళంగా సమర్పించారు. సుమారు రూ.72లక్షల వ్యయంతో ఈ రథాన్ని రూపొందించినట్లుగా దాత తెలియజేశారు. ఆలయ నమూనాలో రూపొందించబడిన ఈ ధర్మప్రచారరథంలో స్వామిఅమ్మవార్ల అనుకృతమూర్తులు నెలకొల్పబడ్డారు. అదేవిధంగా కల్యాణమూర్తులు నెలకొల్పబడ్డారు. వాహనానికి
ముందువైపు సాక్షిగణపతి వారి ప్రతిరూపాన్ని నెలకొల్పడం జరిగింది. రథానికి వెనుకవైపున దక్షిణామూర్తి, కుడివైపున గణపతి, కుమారస్వామివార్లను నెలకొల్పబడ్డారు.మంగళవారం(30.09.2025) ఉదయం గంగాధర మండపం వద్ద ఈ ధర్మప్రచారరథానికి శాస్త్రోక్తంగా పూజాదికాలు జరిపించబడ్డాయి. దేవస్థానంకార్యనిర్వహణాధికారి యం. శ్రీనివాసరావు, దేవస్థాన చైర్మెన్గా నియామకం కాబడిన పి. రమేష్ నాయుడు,
అర్చకస్వాములు, వేదపండితులు, అధికారులు, సంబంధిత సిబ్బంది పాల్గొన్నారుఈ సందర్భంగా కార్యనిర్వహణాధికారి యం. శ్రీనివాసరావు మాట్లాడుతూ వివిధ ప్రాంతాలలో దేవస్థానం తరుపున ధర్మప్రచార కార్యక్రమాలను నిర్వహించేందుకు వినియోగించబడుతుందన్నారు. ఈ ధర్మరథంఅనంతరం దాతమాట్లాడుతూదేవస్థానానికి ధర్మప్రచారరథాన్ని సమర్పించడం తమ పూర్వజన్మసుకృతంగా భావిస్తున్నామన్నారు. స్వామిఅమ్మవార్ల అనుగ్రహంతో తమకు ఈ అదృష్టం కలిగిందన్నారు.