Shuru
Apke Nagar Ki App…
మాజీ ఉప-ముఖ్యమంత్రి ఆళ్ల నాని మృతికి సంతాపం తెలిపిన ఎమ్మెల్యే బేబీనాయన గారు, బుడా చైర్మన్ తెంటు లక్ష్మునాయుడు.. ఆంధ్రప్రదేశ్ మాజీ ఉప-ముఖ్యమంత్రి, మాజీ మంత్రి ఆళ్ల నాని హఠాన్మరణం పట్ల గౌరవ శాసనసభ్యులు శ్రీ *ఆర్.వీ.ఎస్.కె.కె.రంగారావు (బేబీ నాయన)* గారు మరియు బుడా చైర్మన్ శ్రీ *తెంటు లక్ష్మునాయుడు* గారు కలిసి బొబ్బిలి కోటలో సంతాపం తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ బేబీనాయన గారు మాట్లాడుతూ, 2004 నుంచి బొబ్బిలి రాజకుటుంబానికి వారితో సత్సంబంధాలు ఉన్నాయని, గత ప్రభుత్వ హయాంలో కోవిడ్ సమయంలో ఎంతో సేవ చేశారని కొనియాడారు. బొబ్బిలి ప్రాంతంతో కూడా వారికి అవినాభావ సంబంధం ఉందని, మన ప్రాంతంలో వారికి వ్యవసాయ క్షేత్రం కూడా ఉందని గుర్తుచేసుకున్నారు. వారి హఠాన్మరణం మన అందరికీ తీరని లోటు అని ఆవేదన వ్యక్తం చేశారు.
వెంకీ నాయుడు
మాజీ ఉప-ముఖ్యమంత్రి ఆళ్ల నాని మృతికి సంతాపం తెలిపిన ఎమ్మెల్యే బేబీనాయన గారు, బుడా చైర్మన్ తెంటు లక్ష్మునాయుడు.. ఆంధ్రప్రదేశ్ మాజీ ఉప-ముఖ్యమంత్రి, మాజీ మంత్రి ఆళ్ల నాని హఠాన్మరణం పట్ల గౌరవ శాసనసభ్యులు శ్రీ *ఆర్.వీ.ఎస్.కె.కె.రంగారావు (బేబీ నాయన)* గారు మరియు బుడా చైర్మన్ శ్రీ *తెంటు లక్ష్మునాయుడు* గారు కలిసి బొబ్బిలి కోటలో సంతాపం తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ బేబీనాయన గారు మాట్లాడుతూ, 2004 నుంచి బొబ్బిలి రాజకుటుంబానికి వారితో సత్సంబంధాలు ఉన్నాయని, గత ప్రభుత్వ హయాంలో కోవిడ్ సమయంలో ఎంతో సేవ చేశారని కొనియాడారు. బొబ్బిలి ప్రాంతంతో కూడా వారికి అవినాభావ సంబంధం ఉందని, మన ప్రాంతంలో వారికి వ్యవసాయ క్షేత్రం కూడా ఉందని గుర్తుచేసుకున్నారు. వారి హఠాన్మరణం మన అందరికీ తీరని లోటు అని ఆవేదన వ్యక్తం చేశారు.
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ను కలిసిన మజ్జి శ్రీనివాసరావు చిన్న విజయనగరం, సెప్టెంబర్ 15: ఇటీవల తెలుగుదేశం పార్టీలో చేరిన ఉమ్మడి విజయనగరం మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) మంగళవారం రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. విజయనగరంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో ఈ భేటీ జరిగింది. ఈ సందర్భంగా జిల్లాలోని రాజకీయ పరిస్థితులు, అభివృద్ధి కార్యక్రమాలు, పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై ఇరువురూ చర్చించారు. అనంతరం మంత్రి క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన పత్రికా సమావేశంలో చిన్న శ్రీను పాల్గొని మాట్లాడారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ శ్రేణులను సమాయత్తం చేయడంతో పాటు, నాయకులు, కార్యకర్తల మధ్య సమన్వయంతో ముందుకు సాగుతామని తెలిపారు. అన్ని వర్గాలను కలుపుకొని స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ విజయానికి కృషి చేస్తానన్నారు. కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ దిశానిర్దేశంలో విజయనగరం జిల్లాలో టీడీపీని మరింత బలోపేతం చేసేందుకు తన వంతు కృషి చేస్తానని చిన్న శ్రీను తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులునాయుడు, తూర్పు కాపు కార్పొరేషన్ చైర్మన్ పాలవలస యశస్విని, మాజీ వెలమ కార్పొరేషన్ చైర్మన్ నెక్కల నాయుడు బాబు, జడ్పీటీసీలు వర్రీ నరసింహమూర్తి, గార తవుడు, వల్లిరెడ్డి శ్రీను తదితరులు పాల్గొన్నారు.4
- ఆఫీస్‌లోకి కత్తితో వచ్చి దాడికి యత్నం................. మంగమారిపేటలో అడ్వకేట్ సూరాడ నరసింగరావుపై కత్తితో దాడికి యత్నించారంటూ చల్లపిల్లి అప్పలరాజుపై ఆరోపణలు వచ్చాయి. తాను కార్యాలయంలో ఉండగా అప్పలరాజు కత్తితో ఆఫీస్‌లోకి వచ్చి తనపై దాడికి ప్రయత్నించాడని నరసింగరావు ఆరోపించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఆధారాలు తమ వద్ద ఉన్నాయని పేర్కొంటూ బాధితుడు విశాఖ పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. తనపై కక్షతోనే దాడికి యత్నించారని ఆరోపించిన ఆయన.. అప్పలరాజుతో పాటు ఈ ఘటనకు సహకరించిన వారిపైనా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.1
- పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్ పత్రికా ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సమావేశం జిల్లా స్థాయి అభివృద్ధి సమన్వయ మరియు మానిటరింగ్ కమిటీ (DISHA) సమీక్షా సమావేశము అనంతరము అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్ పత్రికా ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సమావేశం1
- తుమ్మలపల్లి రమేష్ ఆధ్వర్యంలో డొక్కా సీతమ్మ క్యాంటీన్ ద్వారా ప్రతి మంగళవారం 500 మందికి అన్నదానం *డొక్కా సీతమ్మ క్యాంటీన్ ద్వారా ప్రతి మంగళవారం 500 మందికి అన్నదానం* జనసేనాని పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో.. తుమ్మలపల్లి రమేష్ సొంత నిధులతో నిర్వహణ కాకినాడ జిల్లా, జగ్గంపేట, సెప్టెంబర్ 15: జగ్గంపేట పట్టణంలోని పాత పోలీస్ స్టేషన్ ఆవరణలో తుమ్మలపల్లి సత్యనారాయణ భూపతి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, జగ్గంపేట జనసేన పార్టీ ఇంచార్జ్ తుమ్మలపల్లి రమేష్ ఆధ్వర్యంలో డొక్కా సీతమ్మ క్యాంటీన్ నిర్వహించారు. ముందుగా డొక్కా సీతమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి క్యాంటీన్‌ను ప్రారంభించారు. అనంతరం సుమారు 500 మందికి ఉచితంగా భోజనం అందించారు. జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రజా సేవా స్ఫూర్తితో ప్రతి మంగళవారం డొక్కా సీతమ్మ క్యాంటీన్ ద్వారా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తుమ్మలపల్లి రమేష్ తెలిపారు. ఈ కార్యక్రమాన్ని తన సొంత నిధులతో నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. పేదలు, కూలీలు, వృద్ధులు, ప్రయాణికులు, ఆపదలో ఉన్న వారికి భోజనం అందించి అండగా నిలవాలనే ఉద్దేశంతో ఈ సేవా కార్యక్రమాన్ని నిరంతరం కొనసాగిస్తున్నామని రమేష్ తెలిపారు. అన్నదాన కార్యక్రమానికి వచ్చిన ప్రజలకు తుమ్మలపల్లి రమేష్ స్వయంగా భోజనం వడ్డించారు. భోజనం చేస్తున్న వారితో ఆప్యాయంగా మాట్లాడి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మాదారపు వీరబాబు, కురుమల్ల నాగేశ్వరరావు, పాఠం శెట్టి రమేష్, పులి ప్రసాద్, గోకేడ ప్రసాద్,అడబాల వీరబాబు,గుంటముక్కల పెద్ద, పబ్బిరెడ్డి మణికంఠ, డ్రిల్ మాస్టారు,కోలమూరు బుజ్జి జనసేన పార్టీ నాయకులు, జనసైనికులు, వీరమహిళలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.3
- వినాయక చవితి 14-09-2026 ఆది గణపతి, అయినవిల్లి గణపతి ఘనం గా జరిగిన వేడుకలు1
- రోడ్డు వేయండి మహాప్రభో.. మా కష్టాలు తీర్చండి.......... అంబేద్కర్ కోనసీమ జిల్లా: పల్లంకూరు గ్రామపంచాయతీ పరిధిలోని దాసరి వారి పేటకు వెళ్లే రహదారి అత్యంత దయనీయంగా మారింది. గుంతలు, బురదతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు నిర్మాణం కోసం గ్రామస్తులు పలుమార్లు గ్రామపంచాయతీ కార్యాలయం, మండల కార్యాలయాల చుట్టూ తిరిగి అధికారులకు వినతులు సమర్పించినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి పరిష్కారం లభించలేదని తెలిపారు. ఈ రహదారిపై ఆధారపడి సుమారు 100 కుటుంబాలు నివసిస్తున్నాయని, వర్షాకాలంలో పరిస్థితి మరింత దారుణంగా మారుతుందని గ్రామస్తులు వాపోతున్నారు. అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్‌లు, ఇతర వాహనాలు కూడా గ్రామానికి చేరుకోవడం కష్టంగా మారుతోందని తెలిపారు. తమ సమస్యను జిల్లా కలెక్టర్ గారు ప్రత్యేకంగా పరిశీలించి, దాసరి వారి పేట రహదారికి నూతన రోడ్డు నిర్మాణం చేపట్టేలా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు.1
- విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం మరడాం, మర్రివలస , అడవి కొత్తవలస గ్రామాలకు చెందిన 130 కుటుంబాలు టిడిపి పార్టీలో భారీ చేరికలు : మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కార్యాలయంలో.. విజయనగరం :మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సారధ్యంలో విజయనగరం మంత్రి కార్యాలయంలో తెలుగుదేశం పార్టీలోకి భారీ చేరికలు దత్తిరాజేరు మండలం మరడాం, మర్రివలస, అడవి కొత్తవలస గ్రామాలకు చెందిన 130 కుటుంబాలు పార్టీలో చేరిక మాజీ వార్డు మెంబర్ లతో సహా పలువురు వైసీపీ నాయకులు తెలుగుదేశం తీర్థం తెలుగుదేశం పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మంత్రి కొండపల్లి తెలుగుదేశం పార్టీలో చేరిన ప్రతి ఒక్కరు కూడా క్రమశిక్షణ కలిగిన ఉండాలని సూచించిన మంత్రి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులతో సమన్వయంతో ముందుకు సాగాలని చూచిన స్థానిక సంస్థల ఎన్నికలలో అత్యధిక మెజార్టీతో గెలుపొందేలా కష్టపడి పనిచేయాలని ఆదేశం తెలుగుదేశం పార్టీలో కష్టపడి పని చేసిన వారికి తగిన ఫలితం దక్కుతుంది.2
- మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని అకాల మరణం,................ కాంగ్రెస్ నాయకునిగా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించి, 2004 నుంచి 2009 వరకు ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా పనిచేసిన ఆళ్ల నాని మంగళవారం ఉదయం గుండెపోటుతో విశాఖలో మరణించారు. అత్తగారింటికి పండగకి గాని వచ్చిన ఆయనకు ఊహించని విధంగా గుండెలో నొప్పి రావడంతో హుటాహుటిన నగరంలోని సీతమ్మదార లో గల కిమ్స్ ఐకాన్ హాస్పిటల్ కు తరలించగా ఆయన అక్కడ మృతి చెందారు.1
- ఇంజనీరింగ్ రంగంలో మహోన్నత సేవలు అందించిన మహనీయుడు శ్రీ మోక్షగుండం విశ్వేశ్వరయ్య తాడేపల్లిగూడెం, మండల పరిషత్ కార్యాలయంలో ఇంజనీర్స్ డే కార్యక్రమాన్ని నిర్వహించారు. అందులో భాగంగా రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ,రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు, 20 మంది రక్తదానం చేశారు. ఇంజనీర్స్ డే. వేడుకలు భారత దేశానికి ఇంజనీరింగ్ రంగంలో మహోన్నత సేవలు అందించిన మహనీయుడుశ్రీ మోక్షగుండం విశ్వేశ్వరయ్య అని ఆధునిక మైసూర్. కర్ణాటక రూప కల్పనే కాక భారత దేశంలో అనేక ప్రాంతాలలో సేవలు అందించిన భారతరత్న సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య 165 వ జయంతి సందర్బంగా ఇంజనీర్ వ్యవస్థ ని వారి సేవలు ను గుర్తు చేసుకుంటూ ఇంజినీర్స్ ని గౌరవించు కోవడం స్ఫూర్తి దాయకం అని పలువురు వక్తలు పేర్కొన్నారు. పంచాయితీ రాజ్ విభాగం లో మున్సిపల్ విభాగం లో విశేష సేవలు అందిస్తున్న పలువురు ఇంజినీర్స్ ని ఇంజనీర్స్ డే. వేడుకలలో జి .త్రినాథ్ బాబు రిటైర్డ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, మాట్లాడుతూ భారత దేశానికి ఇంజనీరింగ్ రంగంలో మహోన్నత సేవలు అందించిన మహనీయుడు శ్రీ మోక్షగుండం విశ్వేశ్వరయ్య అని అన్నారు . ఈ కార్యక్రమంలో విశ్వనాథరెడ్డి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఏలూరు జి త్రినాథ్ బాబు, రిటైర్డ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, సిహెచ్ వర్మ ఏపీ ఆర్డబ్ల్యూఎస్ ఈఏ అధ్యక్షులు, శ్రీకాంత్ ప్రధాన కార్యదర్శి, కే.ధణానంద్ ఏపీ ఆర్డబ్ల్యూఎస్ ఈఏ పశ్చిమగోదావరి అధ్యక్షులు, శ్రీనివాస్ ప్రధాన కార్యదర్శి, రెడ్ క్రాస్ సొసైటీ పీఆర్వో కెవి రమణ, పెద్ద ఎత్తున ఇంజనీర్స్ పాల్గొన్నారు.1