Shuru
Apke Nagar Ki App…
పులి సంచారం.. ప్రధాన మార్గాలు మూసివేత పులి సంచారం వార్తలు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. మొన్నటి వరకు కోహెడ, ఆరేపల్లి శివార్లలో సంచరించిన పెద్దపులి తాజాగా చిన్నకోడూరు మండలం చౌడారం గుట్టల పరిసరాల్లో ఉందన్న సమాచారంతో స్థానికుల్లో భయందోళన మొదలైంది. పులి కదలిక నేపథ్యంలో ముందస్తుగా చౌడారం, గుండారం గుట్టలకు వెళ్లే ప్రధాన మార్గాలను అధికారులు మూసివేశారు.
వేణు విలేకరి
పులి సంచారం.. ప్రధాన మార్గాలు మూసివేత పులి సంచారం వార్తలు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. మొన్నటి వరకు కోహెడ, ఆరేపల్లి శివార్లలో సంచరించిన పెద్దపులి తాజాగా చిన్నకోడూరు మండలం చౌడారం గుట్టల పరిసరాల్లో ఉందన్న సమాచారంతో స్థానికుల్లో భయందోళన మొదలైంది. పులి కదలిక నేపథ్యంలో ముందస్తుగా చౌడారం, గుండారం గుట్టలకు వెళ్లే ప్రధాన మార్గాలను అధికారులు మూసివేశారు.
More news from తెలంగాణ and nearby areas
- తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పుట్టినరోజు సందర్భంగా హుస్నాబాద్ పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బుధవారం ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ హాజరై కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. కేసీఆర్ కేవలం ఒక రాజకీయ నాయకుడు మాత్రమే కాదని, తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీక అని అన్నారు. రాష్ట్ర సాధన ఉద్యమం నుంచి పాలన వరకు ప్రతి దశలో ఆయన పాత్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని కొనియాడారు.1
- ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ ముగిసింది. కోడ్ ను అధికారులు ఎత్తివేశారు. రెండు వారాలు గా సాగిన మున్సి పోరు ప్రశాంతంగా ముగియడంతో అందరు ఊపిరి పీల్చుకున్నారు. ఉమ్మడి జిల్లాలో రెండు మున్సిపల్ కార్పొరేషన్లు 13 మున్సిపాలిటీలు ఉండగా రామగుండం కార్పొరేషన్ తో పాటు 11 మున్సిపాలిటీలను కాంగ్రెస్, కరీంనగర్ కార్పోరేషన్ ను బిజేపి, సిరిసిల్ల జమ్మికుంట రాయికల్ మున్సిపాలిటీలను బిఆర్ఎస్ కైవసం చేసుకుంది. సోమవారం కోరం లేక వాయిదా పడ్డ సుల్తానాబాద్ మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక మంగళవారం నిర్వహించారు. సుల్తానాబాద్ మున్సిపాలిటీని ఏకపక్షంగా కాంగ్రెస్ కైవసం చేసుకుంది. పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు నేతృత్వంలో 12మంది కాంగ్రెస్ కౌన్సిలర్ లు ప్రత్యేక సమావేశానికి హాజరై కౌన్సెలర్ గా ప్రమాణ స్వీకారం చేసి చైర్మన్ వైస్ చైర్మన్ ను ఎన్నుకున్నారు. చైర్మన్ గా బిరుదు రాధాకృష్ణ, వైస్ చైర్మన్ గా అంతటి పుష్పలత ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతన పాలక వర్గాన్ని ఎమ్మెల్యే తోపాటు అధికారులు అభినందించారు.4
- తొర్రూరు మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్ ల ఎన్నిక సందర్భంగా ఎలాంటి గొడవలు జరగకుండా ముందస్తుగా మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును పోలీసులు అమ్మపురం వద్ద అడ్డుకున్నారు. ఆయన వెంట ఉన్న బిఆర్ఎస్ కౌన్సిలర్లను మాత్రమే తొర్రూర్ కు పంపించి ఆయనతోపాటు ఆయన సతీమణి ఉషను సైతం వెనక్కి పంపించారు. దీంతో కొద్దిసేపు అమ్మపురం గ్రామంలో ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది.2
- రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం తిప్పాపూర్ గ్రామ శివారులో పెద్దపులి సంచారం స్థానికుల్లో ఆందోళన కలిగిస్తోంది. సిద్దిపేట వైపు అడవుల నుంచి వచ్చినట్లు భావిస్తున్న పులి రెండు రోజులుగా సంచరిస్తూ మూడు ఆవు దూడలను బలి తీసుకుంది. అటవీశాఖ అధికారులు గ్రామస్తులను అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తూ, పులిని అడవిలోకి తరలించే చర్యలు చేపట్టారు.2
- ఈ సమావేశంలో మాజీ మంత్రి వర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు... రాజ్యసభ సభ్యులు వద్ది రాజు రవిచంద్ర... మాజీ ఎంపీ మాలోత్ కవిత, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి.... ఈ సందర్భంగా పెద్ది సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ.... ఇటీవల జరిగిన ఎన్నికల్లో ప్రజాస్వామ్యన్ని సమాధి చేసింది కాంగ్రెస్ పార్టీ. ఎక్స్ అఫీషియో పేరుతో తొర్రూరులో ఓటు నమోదు చేసుకొని డ్రా చేసి గెలుచుకున్నారు. కడియం కావ్య గెలిచిన తరువాత GWMC ఎన్నికల్లో ఎక్స్ అఫీషియో సభ్యురాలుగా హాజరైనారు ఆమె అక్కడ విత్ డ్రా చేసుకోకుండా తొర్రూరు లో నమోదు చేయడం నిజంగా అప్రజాస్వామికం. ఆమె యొక్క వివరాలు ఇవ్వాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నుండి జిల్లా అధికారుల వరకు అడిగిన కూడా ఇవ్వకుండా ఇబ్బంది పెట్టారు అధికారులు. ఓట్లను కోట్లతో కొని రేవంత్ రెడ్డి మున్సిపాలిటీల్లో గెలిచారు. ఎన్నిక ప్రక్రియ కొన్ని చోట్ల లైవ్ పెట్టి కొన్ని చోట్ల లైవ్ పెట్టలేదు. తొర్రూరు లో లైవ్ పెట్టకపోవడానికి కారణం ఆమె దొంగ ఓటు బయటపడుతుంది అని పెట్టలేదు. కోర్టు ద్వారా కచ్చితంగా కాంగ్రెస్ వాళ్ళకి బుద్ది చెప్పుతాం. మాజీ ఎంపీ మాలోత్ కవిత మాట్లాడుతూ... తొర్రూరు లో బిఆర్ఎస్ పార్టీ నాయకులు అమ్ముడుపోకుండా నికచ్చి గా ఉండడం మన మొదటి విజయం. రేవంత్ రెడ్డి తోని మాట్లాడి ఇవ్వాళ వచ్చి దొంగ ఓటు వేసింది. రాబోయే zptc, mptc ఎన్నికల్లో కచ్చితం బుద్ధి చెప్తాము. తొర్రూరులో నిజంగా ఇవ్వాళ పోలీసు కట్టడితో ఎన్నిక జరిగింది. ప్రధాన మంత్రి వచ్చిన కూడా ఇంత బందోబస్తు రాని పోలీసులు ఇవ్వాళ ఒక ఎన్నికకు ఇంత మందిని పెట్టడం ఏంటో వారికే తెలియాలి. రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర మాట్లాడుతూ.... ప్రజాక్షేత్రంలో జరిగిన ఎన్నికల్లో తొర్రూరులో బిఆర్ఎస్ పార్టీ గెలిచింది. తొర్రూరు లో గెలవాలి అని రేవంత్ రెడ్డి కార్యాలయం నుండి కుట్రలు జరిపారు. రేవంత్ రెడ్డి కుట్రలో భాగంగా కావ్య ఓటు ఇక్కడ పెట్టుకున్నారు. బిఆర్ ఎస్ పార్టీని అడ్డుకోవడం కోసం నిన్న వాయిదా వేసి కాలక్షేపం చేశారు అధికారులు. పార్టీ కోసం కష్టపడిన ప్రతి కార్యకర్త కు నా సెల్యూట్. దయన్న వచ్చే ఎన్నికలో పూర్తి మెజారిటీతో విజయం సాధిస్తారు నేను కూడా ఎక్స్ ఆఫీసియో అప్లై చేశారు. ఒకరోజు ముందే మమ్మల్ని తీసేశారు అన్నారు.1
- మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బిఆర్ఎస్, కాంగ్రెస్ కౌన్సిలర్లు మున్సిపల్ కార్యాలయానికి చేరగా, ఎంపీకి ఎక్స్‌ఆఫీషియో ఓటు హక్కు లేదని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు.1
- ప్రజాస్వామ్య విరుద్దంగా కాంగ్రెస్ తొర్రూరు మున్సిపాలిటీని కైవసం చేసుకుందని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆరోపించారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రజలు BRSను గెలిపిస్తే కాంగ్రెస్ ఛైర్మన్, వైస్ చైర్మన్ పదవులను కొల్లగొట్టిందని మండిపడ్డారు. తనతో పాటు పార్టీ నాయకులను అరెస్టు చేసి అక్రమంగా ఎన్నిక నిర్వహించారన్నారు. BRS గెలుపు కోసం కార్యకర్తలు కష్ట పడ్డారని, వారికి ఏం జవాబు చెప్పుకోవాలి అంటూ ఆయన కన్నీళ్లు పెట్టుకున్నారు.1
- బిఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ జన్మదినోత్సవ వేడుకలను ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి పలు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. బిఆర్ఎస్ కరీంనగర్ నగర శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ చౌక్ లో కేక్ కట్ చేసి మొక్కలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జివి.రామకృష్ణ రావు, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, నగర అధ్యక్షులు చల్లా హరిశంకర్, మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్ , కార్పొరేటర్ గుగ్గిళ్ళ జయశ్రీ- శ్రీనివాస్, మాజీ కార్పొరేటర్లు పాల్గొని బాటసారులకు పూల మొక్కల తో పాటు మిఠాయిలను పంపిణీ చేశారు. స్వరాష్ట్ర సాధనలో అలుపెరుగనిపోరాటం చేసిన ఉద్యమ వీరుడు జనహృదయనేత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ అని మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు అన్నారు. తెలంగాణ ఉద్యమ వ్యూహకర్త, బంగారు తెలంగాణ రూపశిల్పి, అపర భగీరథుడు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ అని కొనియాడారు. మళ్లీ వారి నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావాలని ఆకాంక్షించారు. వారు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నారు.2