Shuru
Apke Nagar Ki App…
త్వరలో 'ఇదేరా జీవితం', 'ప్రజా దేవుళ్లు' పుస్తకాల ఆవిష్కరణ విజయవాడ: తెలుగు వెలుగు సాహిత్య జాతీయ వేదిక ఆధ్వర్యంలో "ఇదేరా జీవితం", "ప్రజా దేవుళ్లు" పుస్తకాల ఆవిష్కరణ కార్యక్రమం త్వరలో ఘనంగా నిర్వహించనున్నట్లు వేదిక అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి డా. నారాయణ మూర్తి తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ కవులు, కవయిత్రులు, సాహితీవేత్తలు, సాహిత్యాభిమానులు పాల్గొంటారని పేర్కొన్నారు. కార్యక్రమం తేదీ, సమయం, వేదిక తదితర వివరాలను త్వరలో అధికారికంగా ప్రకటిస్తామని ఆయన వెల్లడించారు.
PRSS
త్వరలో 'ఇదేరా జీవితం', 'ప్రజా దేవుళ్లు' పుస్తకాల ఆవిష్కరణ విజయవాడ: తెలుగు వెలుగు సాహిత్య జాతీయ వేదిక ఆధ్వర్యంలో "ఇదేరా జీవితం", "ప్రజా దేవుళ్లు" పుస్తకాల ఆవిష్కరణ కార్యక్రమం త్వరలో ఘనంగా నిర్వహించనున్నట్లు వేదిక అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి డా. నారాయణ మూర్తి తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ కవులు, కవయిత్రులు, సాహితీవేత్తలు, సాహిత్యాభిమానులు పాల్గొంటారని పేర్కొన్నారు. కార్యక్రమం తేదీ, సమయం, వేదిక తదితర వివరాలను త్వరలో అధికారికంగా ప్రకటిస్తామని ఆయన వెల్లడించారు.
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం వేడుకలలో భాగంగా చరిత్ర సృష్టించిన మన గిరిజన ఆడబిడ్డలు గర్వపడేలా చేసిన మన సంస్కృతి !! భోగాపురంలో 13 వేల మంది గిరిజన బాలికలు ఒకే వేదికపై అద్భుతంగా ప్రదర్శించిన థింసా నృత్యం గిన్నిస్ ప్రపంచ రికార్డును సొంతం చేసుకుంది. ఇది కేవలం ఒక రికార్డు కాదు మన గిరిజన సంప్రదాయాలకు ప్రపంచం ఇచ్చిన గౌరవం. గిన్నిస్ సంస్థ ప్రతినిధుల నుంచి ఈ ప్రతిష్ఠాత్మక అవార్డును గిరిజన సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి @GSandhyarani_ గారు అందుకోవడం, అనంతరం బాలికలతో కలిసి థింసా నృత్యంలో పాల్గొనడం ప్రతి గిరిజన కుటుంబానికి గర్వకారణం. మన మూలాలను, మన సంస్కృతిని ప్రపంచ వేదికపై నిలబెట్టిన ప్రతి గిరిజన బాలికకు హృదయపూర్వక అభినందనలు. మీ అడుగుల తాళానికి ప్రపంచం చప్పట్లు కొట్టింది .1
- ద్వేషం గోడలను కడుతుంది ప్రేమ మాత్రం దారులను తెరుస్తుంది ప్రేమతో చేసిన చిన్న సహాయం వేల మాటల కంటే గొప్పది1
- వికలాంగులకు వీల్‌చైర్ల పంపిణీ చేసిన ఎస్ ఐ వెంకటేష్...... ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం రంగారావు బంజరు గ్రామంలో జోనేబోయిన చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ముగ్గురు వికలాంగులకు వీల్‌చైర్లు పంపిణీ చేశారు. ఈ సేవా కార్యక్రమాన్ని వి.ఎం. బంజరు ఎస్‌ఐ వెంకటేష్ అభినందించారు.1
- ప్రభుత్వ సేవలు సకాలంలో ప్రజలకు అందించటమే కూటమి ప్రభుత్వ లక్ష్యం. ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు. ప్రజలకు ప్రభుత్వ సేవలు సకాలంలో అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు పేర్కొన్నారు. శుక్రవారం అమృతలూరు ఎంపీడీవో కార్యాలయంలో జరిగిన PGRS కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించారు. అమృతలూరు మండల పరిధిలోని వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు భూ సంబంధిత సమస్యలు ఆదాయ ధ్రువ పత్రాలు పింఛన్లు గృహ నిర్మాణం త్రాగునీటి సౌకర్యం రహదారులు ఇతర మౌలిక వసతులకు సంబంధించి వినతి పత్రాలు ఎమ్మెల్యేకి అందజేశారు.2
- జాతీయ రహదారి విస్తరణ పనుల అడ్డుకట్ట: అధికారుల హామీతో విరమణ ఖమ్మం జిల్లా ముదిగొండ మండల కేంద్రం నుండి జాతీయ రహదారి వరకు అధికారులు చేపట్టిన రోడ్డు విస్తరణ పనులను గ్రామస్థులు అడ్డుకోవడంతో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. ఈ విస్తరణ వల్ల తాము ఏళ్ల తరబడి నివాసముంటున్న ఇళ్లను కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తూ, పనులు జరుగుతున్న రహదారిపైనే బైఠాయించి ఆందోళన చేపట్టారు. విషయం తెలుసుకున్న పోలీసులు, రెవెన్యూ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకారులతో చర్చలు జరిపారు. బాధితులకు తగిన న్యాయం జరిగేలా చూస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో గ్రామస్థులు నిరసనను విరమించారు.1
- GNT: రాజ్యసభలో తొలిసారి మాట్లాడిన గుంటూరుకు చెందిన రాజ్యసభ సభ్యుడు భాష్యం రామకృష్ణ రాజ్యసభలో ది పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (సవరణ) బిల్లు–2026పై తొలిసారి ప్రసంగించిన టీడీపీ ఎంపీ భాష్యం రామకృష్ణ బిల్లుకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ప్రశ్నపత్రాల లీక్‌లు, పరీక్షల అక్రమాలపై కఠిన శిక్షలు, వేగవంతమైన దర్యాప్తు, ఫాస్ట్‌రక్ కోర్టులతో విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా కల్పిస్తుంది. ఏపీలో మెగా డీఎస్సీతో వేలాది ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేసి విద్యా వ్యవస్థను బలోపేతం చేస్తామన్నారు.1
- మొరాకో-స్పెయిన్ సరిహద్దులో వలస సంక్షోభం తీవ్రం. 57 మంది మృతి. 🔹 వలసదారులను చట్టబద్ధం చేస్తారనే ఆశతో మొరాకో నుంచి భారీగా స్పెయిన్‌లోకి ప్రవేశం 🔹 కేవలం 24 గంటల్లోనే సుమారు 60 వేల మంది దేశంలోకి వచ్చినట్లు స్పెయిన్ అధికారులు వెల్లడి 🔹 సరిహద్దు దాటే ప్రయత్నాల్లో 57 మంది మృతి 🔹 వలసదారులు-భద్రతా బలగాల మధ్య ఘర్షణలతో ఉద్రిక్త పరిస్థితులు 🔹 పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు చర్యలు కొనసాగుతున్నాయని ప్రధాని పెడ్రో సాంచెజ్ తెలిపారు1