logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

కొల్లాపూర్ నియోజకవర్గం పానగల్ మండలం మల్లాయిపల్లి గ్రామానికి రూ.2.54 కోట్ల వ్యయంతో 33/11 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్‌ను మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సబ్‌స్టేషన్ మంజూరు చేయించిన రాష్ట్ర మంత్రి శ్రీ జూపల్లి కృష్ణారావు గారికి కృతజ్ఞతలు తెలుపుతూ గ్రామపంచాయతీ ఆవరణలో ఆయన చిత్రపటానికి గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొని పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ నాగిరెడ్డి మరియు నాయకులు మాట్లాడుతూ, మంత్రి శ్రీ జూపల్లి కృష్ణారావు గారు గ్రామంలో ఏ సమస్య వచ్చినా వెంటనే స్పందించి పరిష్కరిస్తున్నారని కొనియాడారు. గత కొన్నేళ్లుగా భీమా, కేఎల్ఐ (KLI) కాలువ ద్వారా సాగునీరు గణనీయంగా అందడంతో సాగు విస్తీర్ణం పెరిగిందని, దానికి అనుగుణంగా విద్యుత్ అవసరాలు కూడా పెరిగి రైతులు తరచూ విద్యుత్ సమస్యలు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఈ సమస్యను మంత్రి దృష్టికి తీసుకెళ్లగానే, ఆయన వెంటనే విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో మాట్లాడి రూ.2.54 కోట్ల వ్యయంతో 33/11 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్ మంజూరు చేయించడం గ్రామ అభివృద్ధిపై మంత్రి జూపల్లి గారికి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమని అన్నారు. అలాగే ఈ సబ్‌స్టేషన్ మంజూరుకు కృషి చేసిన జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ శ్రీ గోవర్ధన్ సాగర్ గారికి, పార్టీ మండల అధ్యక్షులు శ్రీ వెంకటేష్ నాయుడు గారికి, మాజీ జెడ్పీటీసీ శ్రీ కేతపల్లి రవి గారికి గ్రామ ప్రజలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ నాగిరెడ్డి గారు, వార్డు సభ్యులు, నాయకులు, కార్యకర్తలు, రైతులు, మహిళలు, యువకులు మరియు గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

2 hrs ago
user_A Rajashekar Pangal
A Rajashekar Pangal
Lawyer పాంగల్, వనపర్తి, తెలంగాణ•
2 hrs ago
abfb35d6-49fe-4662-b8f4-30ad58b97eee

కొల్లాపూర్ నియోజకవర్గం పానగల్ మండలం మల్లాయిపల్లి గ్రామానికి రూ.2.54 కోట్ల వ్యయంతో 33/11 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్‌ను మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సబ్‌స్టేషన్ మంజూరు చేయించిన రాష్ట్ర మంత్రి శ్రీ జూపల్లి కృష్ణారావు గారికి కృతజ్ఞతలు తెలుపుతూ గ్రామపంచాయతీ ఆవరణలో ఆయన చిత్రపటానికి గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొని పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ నాగిరెడ్డి మరియు నాయకులు మాట్లాడుతూ, మంత్రి శ్రీ జూపల్లి కృష్ణారావు గారు గ్రామంలో ఏ సమస్య వచ్చినా వెంటనే స్పందించి పరిష్కరిస్తున్నారని కొనియాడారు. గత కొన్నేళ్లుగా భీమా, కేఎల్ఐ (KLI) కాలువ ద్వారా సాగునీరు గణనీయంగా అందడంతో సాగు విస్తీర్ణం పెరిగిందని, దానికి అనుగుణంగా విద్యుత్ అవసరాలు కూడా పెరిగి రైతులు తరచూ విద్యుత్ సమస్యలు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఈ సమస్యను మంత్రి దృష్టికి తీసుకెళ్లగానే, ఆయన వెంటనే విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో మాట్లాడి రూ.2.54 కోట్ల వ్యయంతో 33/11 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్ మంజూరు చేయించడం గ్రామ అభివృద్ధిపై మంత్రి జూపల్లి గారికి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమని అన్నారు. అలాగే ఈ సబ్‌స్టేషన్ మంజూరుకు కృషి చేసిన జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ శ్రీ గోవర్ధన్ సాగర్ గారికి, పార్టీ మండల అధ్యక్షులు శ్రీ వెంకటేష్ నాయుడు గారికి, మాజీ జెడ్పీటీసీ శ్రీ కేతపల్లి రవి గారికి గ్రామ ప్రజలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ నాగిరెడ్డి గారు, వార్డు సభ్యులు, నాయకులు, కార్యకర్తలు, రైతులు, మహిళలు, యువకులు మరియు గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

More news from Telangana and nearby areas
  • నాగర్‌కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలంలోని గౌరారం గ్రామంలో బొడ్రాయి పండుగ ఉత్సవాలు అత్యంత కన్నులపండువగా, ఘనంగా సాగాయి. ఈ వేడుకల సందర్భంగా ఉదయం నుంచే గ్రామ దేవతకు మహిళలు పెద్ద ఎత్తున బోనాలు సమర్పించారు. వేపాకులు, పసుపు, కుంకుమలతో అలంకరించిన బోనాలతో మహిళలు బొడ్రాయి చుట్టూ తిరుగుతూ భక్తిపారవశ్యంలో మునిగితేలారు. ఊరు, వాడ అంతా సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని గ్రామ దేవతకు ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులు తమ మొక్కులు తీర్చుకున్నారు. ఈ ఉత్సవాల్లో గ్రామ పెద్దలతో పాటు యువకులు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
    1
    నాగర్‌కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలంలోని గౌరారం గ్రామంలో బొడ్రాయి పండుగ ఉత్సవాలు అత్యంత కన్నులపండువగా, ఘనంగా సాగాయి. ఈ వేడుకల సందర్భంగా ఉదయం నుంచే గ్రామ దేవతకు మహిళలు పెద్ద ఎత్తున బోనాలు సమర్పించారు. వేపాకులు, పసుపు, కుంకుమలతో అలంకరించిన బోనాలతో మహిళలు బొడ్రాయి చుట్టూ తిరుగుతూ భక్తిపారవశ్యంలో మునిగితేలారు. ఊరు, వాడ అంతా సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని గ్రామ దేవతకు ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులు తమ మొక్కులు తీర్చుకున్నారు. ఈ ఉత్సవాల్లో గ్రామ పెద్దలతో పాటు యువకులు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
    user_NAVADEEP
    NAVADEEP
    Nagarkurnool, Telangana•
    5 hrs ago
  • జోగులాంబ గద్వాల జిల్లా ధరూర్ మండలంలో ప్రస్తుతం సాగవుతున్న వ్యవసాయ పంట పొలాల్లో విత్తనపత్తి సాగు గణనీయంగా తగ్గింది. ప్రతి సంవత్సరం ఈ మండలంలో అత్యధికంగా విత్తనపత్తిని సాగు చేసే రైతులు, ఈ ఏడాది ఈ పంటను సాగు చేయడం తగ్గించారు. దీనికి ప్రత్యామ్నాయంగా వరి, వేరుశెనగ, మిరప పంటలు సాగు చేసేందుకు రైతులు మొగ్గు చూపుతున్నారు. ప్రస్తుతం మార్కెట్లో ఈ పంటలకు డిమాండ్ ఎక్కువగా ఉండడం వల్ల రైతులకు మంచి గిట్టుబాటు ధర లభించే అవకాశం ఉందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అందుకే విత్తనోత్పత్తి పంట సాగు స్థానంలో రైతన్నలు ఈ ఇతర పంటల వైపు మళ్లుతున్నారు.
    1
    జోగులాంబ గద్వాల జిల్లా ధరూర్ మండలంలో ప్రస్తుతం సాగవుతున్న వ్యవసాయ పంట పొలాల్లో విత్తనపత్తి సాగు గణనీయంగా తగ్గింది. ప్రతి సంవత్సరం ఈ మండలంలో అత్యధికంగా విత్తనపత్తిని సాగు చేసే రైతులు, ఈ ఏడాది ఈ పంటను సాగు చేయడం తగ్గించారు. దీనికి ప్రత్యామ్నాయంగా వరి, వేరుశెనగ, మిరప పంటలు సాగు చేసేందుకు రైతులు మొగ్గు చూపుతున్నారు. ప్రస్తుతం మార్కెట్లో ఈ పంటలకు డిమాండ్ ఎక్కువగా ఉండడం వల్ల రైతులకు మంచి గిట్టుబాటు ధర లభించే అవకాశం ఉందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అందుకే విత్తనోత్పత్తి పంట సాగు స్థానంలో రైతన్నలు ఈ ఇతర పంటల వైపు మళ్లుతున్నారు.
    user_Ram  Ram
    Ram Ram
    Journalist గద్వాల్, జోగులాంబ గద్వాల్, తెలంగాణ•
    10 hrs ago
  • జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ మున్సిపల్ పరిధిలోని స్థానిక మున్సిపల్ కార్యాలయంలో నేడు స్థానిక కమిషనర్ రాజేష్ ఆదేశానుసారం సీనియర్ అసిస్టెంట్లు సుప్రియ, ప్రియాంక ఆధ్వర్యంలో వర్షపు నీటి సంరక్షణపై ప్రతిజ్ఞ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వర్షపు నీటిని సంరక్షించుకోవడం వలన భవిష్యత్ తరాలకు నీటి కొరత లేకుండా చూడవచ్చని తెలిపారు. ఇందులో భాగంగా ప్రతి ఒక్కరూ తప్పకుండా వర్షపు నీటిని సంరక్షించుకోవాలని పిలుపునిచ్చారు.
    1
    జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ మున్సిపల్ పరిధిలోని స్థానిక మున్సిపల్ కార్యాలయంలో నేడు స్థానిక కమిషనర్ రాజేష్ ఆదేశానుసారం సీనియర్ అసిస్టెంట్లు సుప్రియ, ప్రియాంక ఆధ్వర్యంలో వర్షపు నీటి సంరక్షణపై ప్రతిజ్ఞ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వర్షపు నీటిని సంరక్షించుకోవడం వలన భవిష్యత్ తరాలకు నీటి కొరత లేకుండా చూడవచ్చని తెలిపారు. ఇందులో భాగంగా ప్రతి ఒక్కరూ తప్పకుండా వర్షపు నీటిని సంరక్షించుకోవాలని పిలుపునిచ్చారు.
    user_Ramesh kumar
    Ramesh kumar
    ఆలంపూర్, జోగులాంబ గద్వాల్, తెలంగాణ•
    22 hrs ago
  • జానకి అమ్మ చివరి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో జానకి అమ్మ, సింగర్ సునీత ఇద్దరూ కలిసి పాటలు పాడుతూ, ఎంతో సరదాగా గడిపారు. వీరిద్దరికి సంబంధించిన ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
    1
    జానకి అమ్మ చివరి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో జానకి అమ్మ, సింగర్ సునీత ఇద్దరూ కలిసి పాటలు పాడుతూ, ఎంతో సరదాగా గడిపారు. వీరిద్దరికి సంబంధించిన ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
    user_Anji
    Anji
    Mahabubnagar Rural, Telangana•
    58 min ago
  • అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు నెలకు రూ. 34,800 జీతం లభిస్తుంది కాబట్టి అభ్యర్థులు దీనికి తప్పక అప్లికేషన్ చేసుకోవాలి. ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాల వీడియో కోసం 'Cryancreations5191' యూట్యూబ్ ఛానల్ ఐడీని సందర్శించవచ్చు.
    1
    అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు నెలకు రూ. 34,800 జీతం లభిస్తుంది కాబట్టి అభ్యర్థులు దీనికి తప్పక అప్లికేషన్ చేసుకోవాలి. ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాల వీడియో కోసం 'Cryancreations5191' యూట్యూబ్ ఛానల్ ఐడీని సందర్శించవచ్చు.
    user_Chandraiah Pochampally
    Chandraiah Pochampally
    Digital Marketing Specialist Ieeja, Jogulamba Gadwal•
    4 hrs ago
  • కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డిపై చేసిన వ్యాఖ్యలను టీడీపీ నేతలు తీవ్రంగా ఖండించారు. ఎమ్మెల్యేపై నిరాధారమైన ఆరోపణలు చేయడం మానుకోవాలని సదరు వైసీపీ నేతకు టీడీపీ నాయకులు ఘాటుగా హెచ్చరిక జారీ చేశారు.
    1
    కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డిపై చేసిన వ్యాఖ్యలను టీడీపీ నేతలు తీవ్రంగా ఖండించారు. ఎమ్మెల్యేపై నిరాధారమైన ఆరోపణలు చేయడం మానుకోవాలని సదరు వైసీపీ నేతకు టీడీపీ నాయకులు ఘాటుగా హెచ్చరిక జారీ చేశారు.
    user_K AMPAIAH ACHARI
    K AMPAIAH ACHARI
    Local News Reporter ఎమ్మిగనూరు, కర్నూలు, ఆంధ్రప్రదేశ్•
    10 hrs ago
  • నంద్యాల కోర్టులో శనివారం జరిగిన జాతీయ మెగా లోక్ అదాలత్‌లో బాధితులకు అండగా నిలిచిన వకీల్ సాబ్ సుబ్బరాయుడు అందరి అభినందనలు అందుకున్నారు. గౌరవ నంద్యాల మూడవ అదనపు జిల్లా జడ్జి అమ్మన్న రాజు చేతుల మీదుగా బాధితులకు రూ. 3 కోట్ల 50 లక్షల విలువైన చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జడ్జి అమ్మన్న రాజా మాట్లాడుతూ, జాతీయ మెగా లోక్ అదాలత్‌లో ఎన్నడూ లేని విధంగా న్యాయవాదులు కక్షిదారులను సాధ్యమైనంత వరకు రాజీ మార్గంలో నడిపించేందుకు ఎంతో కృషి చేశారని కొనియాడారు. ఈ అదాలత్‌లో దాదాపు 125 మోటర్ వెహికల్ యాక్సిడెంట్ కేసులు పరిష్కారమయ్యాయని, అత్యధికంగా ఇన్సూరెన్స్ కంపెనీల నుండి బాధితులకు రూ. 3 కోట్ల 50 లక్షల మేర సెటిల్‌మెంట్ జరిగిందని వివరించారు. కోర్టు స్థాయిలో మోటర్ వెహికల్ యాక్సిడెంట్ కేసులతో పాటు సివిల్ కేసులు, బ్యాంకు మేటర్స్, ఇతర లిటికేషన్ కేసులు కలిపి దాదాపు 300 వరకు పరిష్కారం అవుతున్నాయని తెలిపారు. ఇన్సూరెన్స్ కంపెనీల వ్యవహారాలపై న్యాయవాది సుబ్బరాయుడు మాట్లాడుతూ, కంపెనీల లీగల్ అడ్వైజర్ విజయ శేఖర్ రెడ్డి సహకారంతో 30 నుంచి 40 కేసులకు సంబంధించి రూ. 3 కోట్ల 50 లక్షల విలువైన చెక్కులను బాధితులకు అందజేసినట్లు స్పష్టం చేశారు. తమ ఆత్మీయులను కోల్పోయి ఇబ్బందుల్లో ఉన్న బాధితులకు ఈ ఇన్సూరెన్స్ కంపెనీల ద్వారా చేకూరిన ఆర్థిక సహాయం ఎంతో అండగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు.
    2
    నంద్యాల కోర్టులో శనివారం జరిగిన జాతీయ మెగా లోక్ అదాలత్‌లో బాధితులకు అండగా నిలిచిన వకీల్ సాబ్ సుబ్బరాయుడు అందరి అభినందనలు అందుకున్నారు. గౌరవ నంద్యాల మూడవ అదనపు జిల్లా జడ్జి అమ్మన్న రాజు చేతుల మీదుగా బాధితులకు రూ. 3 కోట్ల 50 లక్షల విలువైన చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జడ్జి అమ్మన్న రాజా మాట్లాడుతూ, జాతీయ మెగా లోక్ అదాలత్‌లో ఎన్నడూ లేని విధంగా న్యాయవాదులు కక్షిదారులను సాధ్యమైనంత వరకు రాజీ మార్గంలో నడిపించేందుకు ఎంతో కృషి చేశారని కొనియాడారు. ఈ అదాలత్‌లో దాదాపు 125 మోటర్ వెహికల్ యాక్సిడెంట్ కేసులు పరిష్కారమయ్యాయని, అత్యధికంగా ఇన్సూరెన్స్ కంపెనీల నుండి బాధితులకు రూ. 3 కోట్ల 50 లక్షల మేర సెటిల్‌మెంట్ జరిగిందని వివరించారు. కోర్టు స్థాయిలో మోటర్ వెహికల్ యాక్సిడెంట్ కేసులతో పాటు సివిల్ కేసులు, బ్యాంకు మేటర్స్, ఇతర లిటికేషన్ కేసులు కలిపి దాదాపు 300 వరకు పరిష్కారం అవుతున్నాయని తెలిపారు.

ఇన్సూరెన్స్ కంపెనీల వ్యవహారాలపై న్యాయవాది సుబ్బరాయుడు మాట్లాడుతూ, కంపెనీల లీగల్ అడ్వైజర్ విజయ శేఖర్ రెడ్డి సహకారంతో 30 నుంచి 40 కేసులకు సంబంధించి రూ. 3 కోట్ల 50 లక్షల విలువైన చెక్కులను బాధితులకు అందజేసినట్లు స్పష్టం చేశారు. తమ ఆత్మీయులను కోల్పోయి ఇబ్బందుల్లో ఉన్న బాధితులకు ఈ ఇన్సూరెన్స్ కంపెనీల ద్వారా చేకూరిన ఆర్థిక సహాయం ఎంతో అండగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు.
    user_Naga kanth
    Naga kanth
    బండి ఆత్మకూరు, నంద్యాల, ఆంధ్రప్రదేశ్•
    23 hrs ago
  • నాగర్‌కర్నూల్ జిల్లా బిజినేపల్లి పరిధిలోని పాలెం వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రీ బాలాజీ ఆధ్యాత్మిక సేవా సమితి ఆధ్వర్యంలో వారం వారం భజన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ శనివారం నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా నాగనూలు గ్రామానికి చెందిన భజన మండలి సభ్యులు భజనలు నిర్వహించారు. వీరికి నిబంధనల ప్రకారం అల్పాహారంతో పాటు ₹2,000 పారితోషికంగా అందజేశారు. ఈ వారం కార్యక్రమానికి స్థానిక శివాలయం పూజారి శ్రీ కె.వి చక్రపాణి దాతగా వ్యవహరించారు. తన తండ్రి కీర్తిశేషులు కె.వి నరసింహారావు స్మారకార్థం ఆయన ఈ విరాళాన్ని సమర్పించారు. భజన కార్యక్రమం నిర్వహించిన నాగనూలు భజన మండలి సభ్యులకు, దాతకు స్వామివారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకున్నారు.
    1
    నాగర్‌కర్నూల్ జిల్లా బిజినేపల్లి పరిధిలోని పాలెం వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రీ బాలాజీ ఆధ్యాత్మిక సేవా సమితి ఆధ్వర్యంలో వారం వారం భజన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ శనివారం నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా నాగనూలు గ్రామానికి చెందిన భజన మండలి సభ్యులు భజనలు నిర్వహించారు. వీరికి నిబంధనల ప్రకారం అల్పాహారంతో పాటు ₹2,000 పారితోషికంగా అందజేశారు.

ఈ వారం కార్యక్రమానికి స్థానిక శివాలయం పూజారి శ్రీ కె.వి చక్రపాణి దాతగా వ్యవహరించారు. తన తండ్రి కీర్తిశేషులు కె.వి నరసింహారావు స్మారకార్థం ఆయన ఈ విరాళాన్ని సమర్పించారు. భజన కార్యక్రమం నిర్వహించిన నాగనూలు భజన మండలి సభ్యులకు, దాతకు స్వామివారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకున్నారు.
    user_NAVADEEP
    NAVADEEP
    Nagarkurnool, Telangana•
    20 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.