Shuru
Apke Nagar Ki App…
అలంపూర్: మూడవ వార్డులో ఇందిరమ్మ చీరల పంపిణీ!! స్థానిక వార్డ్ కౌన్సిలర్ .. నవాబ్ ఆసిఫ్ ఉద్దీన్ ఖాన్ అలంపూర్ మున్సిపల్ పరిధిలోని మూడవ వార్డులో స్థానిక వార్డ్ కౌన్సిలర్ నవాబ్ ఆసిఫ్ ఉద్దీన్ ఖాన్ ఆధ్వర్యంలో స్థానిక ప్రజలకు ఇందిరమ్మ చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వార్డ్ కౌన్సిలర్ మాట్లాడుతూ వాడికి మొత్తం 100 చీరలు వచ్చాయని లబ్ధిదారులను గుర్తించి పంపిణీ చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో వార్డ్ కౌన్సిలర్ తో పాటు కో ఆప్షన్ నెంబర్ ముజీబ్, ఫయాజ్, స్థానికులు పాల్గొన్నారు
Ramesh kumar
అలంపూర్: మూడవ వార్డులో ఇందిరమ్మ చీరల పంపిణీ!! స్థానిక వార్డ్ కౌన్సిలర్ .. నవాబ్ ఆసిఫ్ ఉద్దీన్ ఖాన్ అలంపూర్ మున్సిపల్ పరిధిలోని మూడవ వార్డులో స్థానిక వార్డ్ కౌన్సిలర్ నవాబ్ ఆసిఫ్ ఉద్దీన్ ఖాన్ ఆధ్వర్యంలో స్థానిక ప్రజలకు ఇందిరమ్మ చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వార్డ్ కౌన్సిలర్ మాట్లాడుతూ వాడికి మొత్తం 100 చీరలు వచ్చాయని లబ్ధిదారులను గుర్తించి పంపిణీ చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో వార్డ్ కౌన్సిలర్ తో పాటు కో ఆప్షన్ నెంబర్ ముజీబ్, ఫయాజ్, స్థానికులు పాల్గొన్నారు
More news from Andhra Pradesh and nearby areas
- నంద్యాలలో దస్తావేజు లేఖరుల సమ్మెకు తాత్కాలిక విరామం : దస్తావేజు లేఖరుల సంక్షేమ సంఘం నంద్యాల జిల్లా దస్తావేజు లేఖరుల సంక్షేమ సంఘం చేపట్టిన పెన్‌డౌన్ సమ్మె శుక్రవారంతో 12వ రోజుకు చేరుకుంది. జిల్లాలోని 11 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలో దస్తావేజు లేఖరులు సమ్మెలో పాల్గొన్నారు. జీఓ ఎంఎస్ నెం.396ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కొనసాగిన ఈ సమ్మెకు, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని జూలై 31న తాత్కాలిక విరామం ప్రకటించినట్లు సంఘం నాయకులు తెలిపారు. రిజిస్ట్రేషన్ శాఖ ప్రైవేటీకరణ వల్ల ప్రజల ఆస్తుల భద్రతతో పాటు దస్తావేజు లేఖరుల జీవనోపాధి ప్రమాదంలో పడుతుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమ డిమాండ్లను నెరవేర్చే వరకు పోరాటం కొనసాగుతుందని, జీఓ ఎంఎస్ నెం.396పై న్యాయస్థానాన్ని కూడా2
- నందికొట్కూరులో శిథిలావస్థకు చేరుకున్న స్తంభాలు తొలగించాలి నందికొట్కూరులో శిథిలావస్థకు చేరుకున్న విద్యుత్ స్తంభాలు తొలగించాలని సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ పార్టీ జిల్లా కార్యదర్శి వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. పట్టణంలోని పలు వార్డులలో పర్యటించి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అధికారులు వార్డులలో పర్యటించి శిథిలావస్థకు చేరిన స్తంభాలను తొలగించాలన్నారు. వాటి స్థానంలో నూతన విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.1
- జూరాలకు భారీ వరద.. 17 గేట్లు ఎత్తివేత దిగినన్న శ్రీశైలం ప్రాజెక్టు విడుదల గద్వాల: జోగులాంబ గద్వాల జిల్లాలోని ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతోంది. గురువారం రాత్రి 9 గంటల సమయానికి ప్రాజెక్టులోకి 1,04,375 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో అధికారులు 17 గేట్లను ఎత్తి 67,235 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు నీటిమట్టం 317.59 మీటర్లు (1,041.962 అడుగులు) గా నమోదైంది. ప్రాజెక్టు స్థూల సామర్థ్యం 9.657 టీఎంసీలకు గాను ప్రస్తుతం 7.817 టీఎంసీల నీటి నిల్వ ఉంది. లైవ్ స్టోరేజ్ 4.11 టీఎంసీలుగా నమోదైంది. జూరాల జలవిద్యుత్ కేంద్రం ద్వారా 37,906 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తున్నారు. నెట్టెంపాడు లిఫ్ట్‌కు 750, భీమా లిఫ్ట్–1కు 1,300, కోయిల్‌సాగర్ లిఫ్ట్‌కు 315 క్యూసెక్కులు, ఎల్‌ఎంసీకి 870, ఆర్‌ఎంసీకి 500, ప్యారలల్ కెనాల్‌కు 600, భీమా లిఫ్ట్–2కు 750 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. మొత్తంగా ప్రాజెక్టు నుంచి 1,09,519 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదలవుతోంది. వరద ప్రవాహం నేపథ్యంలో అధికారులు పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.1
- రణ్బీర్ కపూర్ సాయి పల్లవి నటించిన రామాయణం ట్రైలర్ పై మిశ్రమస్తు స్పందన మొన్న విడుదల చేసిన రామాయణం పార్ట్ వన్ ట్రైలర్ మిశ్రమ స్పందన వ్యక్తం చేస్తున్నారు రణబీర్ కపూర్ కన్నా యాష్ యాక్టింగ్ డామినేషన్ చేశాడని రావణాసురుడి పాత్రలలో పలువురు కామెంట్ చేశారు సీత పాత్రకు సాయి పల్లవి సరిగ్గా సరిపోయిందని కొందరు సరిగ్గా సెట్ కాలేదని కొందరుకామెంట్ చేస్తున్నారు టైలర్లో హనుమంతుడు కనిపించకపోవడంతో ట్రైలర్ ఇన్ కంప్లీట్ గా ఉందని విస్మయం చెందుతున్నారు బిఎఫ్ ఎక్స్ మ్యూజిక్ బాగుంది అని అంటున్నారు1
- నాగర్ కర్నూల్ జిల్లా వి బి జి రాంజీ ఉద్యోగుల సమస్యలపై కలెక్టర్కు వినతిపత్రం నాగర్ కర్నూల్ జిల్లాలో వీబీజీ రామ్ జి - సాంకేతిక సహాయకులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సాంకేతిక సహాయకులు ఏపీవోలు,ఈసీలు, టెక్నికల్ అసిస్టెంట్లు, కంప్యూటర్ ఆపరేటర్లు శుక్రవారం జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు.ఆ సంఘం జేఏసీ చెర్మన్, వాయిస్ చెర్మన్, నాయకులు మాట్లాడుతూ....వీబీజీ రామ్ జి పథకం లో 2006 నుంచి పనిచేస్తున్నాము. మాకు పే స్కెల్ అమలుచేసి తమ సమస్యలు పరిష్కరించాలని అని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమం లో 20 మండలాల వీబిజి రాంజీ ఉద్యోగులు పాల్గొన్నారు. నాగర్ కర్నూల్ జిల్లాలో వీబీజీ రామ్ జి - సాంకేతిక సహాయకులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సాంకేతిక సహాయకులు ఏపీవోలు,ఈసీలు, టెక్నికల్ అసిస్టెంట్లు, కంప్యూటర్ ఆపరేటర్లు శుక్రవారం జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు.ఆ సంఘం జేఏసీ చెర్మన్, వాయిస్ చెర్మన్, నాయకులు మాట్లాడుతూ....వీబీజీ రామ్ జి పథకం లో 2006 నుంచి పనిచేస్తున్నాము. మాకు పే స్కెల్ అమలుచేసి తమ సమస్యలు పరిష్కరించాలని అని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమం లో 20 మండలాల వీబిజి రాంజీ ఉద్యోగులు పాల్గొన్నారు.1
- తెలంగాణ రక్షణ ట్రేడ్ యూనియన్ ఆవిర్భావం: కల్వకుంట్ల కవిత హైదరాబాద్ బంజారాహిల్స్ లోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో టీఆర్ టీయూ లోగో ను తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత ఆవిష్కరించారు. రాష్ట్రంలోని కోటిన్నర మంది కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం టీఆర్ టీయూ ఉద్యమిస్తుందని స్పష్టం చేశారు.1
- సీపీ శంఖబ్రత బాగ్చి కీలక చర్యలు..! ప్రధాని పర్యటనకు భారీ భద్రత..! విశాఖ నగర పోలీస్ కమిషనర్ డా. శంఖబ్రత బాగ్చి ఆధ్వర్యంలో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆగస్టు 1న భోగాపురం ఎయిర్‌పోర్టు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొననున్న నేపథ్యంలో విశాఖ పోలీసులు అప్రమత్తమయ్యారు. వీఐపీ భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, ప్రజల రాకపోకల నిర్వహణ కోసం ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేశారు. మూడు ప్రధాన మార్గాల్లో ట్రాఫిక్ ఏర్పాట్లు చేపట్టిన పోలీసులు.. అవసరమైన ప్రాంతాల్లో వాహనాల మళ్లింపులు చేపట్టనున్నారు. ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్, క్రైమ్, ఏఆర్, హోంగార్డ్స్ విభాగాలకు చెందిన పోలీసు సిబ్బందిని భారీగా మోహరించనున్నారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో గ్రీన్ కారిడార్, వీఐపీ పార్కింగ్, సభా ప్రాంగణ భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఆగస్టు 1 ఉదయం 5 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు భారీ వాహనాల రాకపోకలపై ఆంక్షలు అమలు చేయనున్నారు. అనకాపల్లి, శ్రీకాకుళం, విజయనగరం వైపు నుంచి వచ్చే భారీ, గూడ్స్ వాహనాలను విశాఖ నగరంలోకి అనుమతించబోమని పోలీసులు తెలిపారు. సభకు వచ్చే ప్రజల కోసం ప్రత్యేక బస్సు మార్గాలు, పార్కింగ్ ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. వాహనదారులు పోలీసుల సూచనలు పాటించాలని, అత్యవసరం అయితే తప్ప ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని సీపీ శంఖబ్రత బాగ్చి విజ్ఞప్తి చేశారు.1
- దేవుడిలా వచ్చి భక్తుణ్ని కాపాడిన జవాన్..జవాన్పై ప్రశంసలు.. గంగా నదిలో కొట్టుకుపోతున్న భక్తుణ్ని జవాన్ ప్రాణాలకు తెగించి రక్షించారు. నోయిడా(UP)కు చెందిన శివభక్తుడు హరిద్వార్లోని కాంగ్రా ఘాట్ వద్ద స్నానం చేస్తుండగా వరద ఉద్ధృతికి కొట్టుకుపోయాడు.గమనించిన SDRF జవాన్ వెంటనే నదిలోకి దూకి అతడిని పట్టుకున్నారు. వరద కిందికి లాక్కెళ్తున్నా ఈదుతూ అతణ్ని క్షేమంగా ఒడ్డుకు చేర్చారు. ఈ వీడియోను ఉత్తరాఖండ్ పోలీస్ Xలో షేర్ చేయగా జవాన్పై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.....1