*నవంబర్ 6, 7, 8 తేదీల్లో కార్తీకమాస లక్ష దీపోత్సవం* - బ్రోచర్ ఆవిష్కరించిన నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతమ్మ దంపతులు - వైభవంగా భూమి పూజ, గుంజ ప్రతిష్టాపన కార్యక్రమం - గత తొమ్మిదేళ్లుగా విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వైభవోపేతంగా కార్తీక మాస లక్ష దీపోత్సవం - పదో సంవత్సరంలోకి అడుగుడుతున్న సందర్భంగా భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు - కార్యక్రమ వివరాలు వెల్లడించిన వేమిరెడ్డి దంపతులు విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రతి ఏటా వైభవోపేతంగా జరిగే కార్తీక మాస లక్ష దీపోత్సవ కార్యక్రమానికి అంకురార్పణ కార్యక్రమం ఘనంగా జరిగింది. నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి దంపతుల చేతుల మీదుగా ఆదివారం ఉదయం వి ఆర్ సి మైదానంలో గుంజ ప్రతిష్టాపన, బ్రోజర్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ముందుగా భూమి పూజ చేసిన విపిఆర్ దంపతులు.. అనంతరం గుంజును ప్రతిష్టించి కార్యక్రమానికి అంకురార్పణ చేశారు. అనంతరం కార్తీక్ మాస లక్ష దీపోత్సవ కార్యక్రమానికి సంబంధించి బ్రోచర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈ ఏడాది వి ఆర్ సి మైదానంలో నవంబర్ 6, 7, 8 తేదీల్లో కార్తీకమాస లక్ష దీపోత్సవ కార్యక్రమం నిర్వహించనునట్లు తెలిపారు. గత తొమ్మిది సంవత్సరాలుగా VPR FOUNDATION ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తుండడం ఆనందంగా ఉందన్నారు. ఈ ఏడాది పదో సంవత్సరం పూర్తి చేసుకుంటున్నట్లు వెల్లడించారు. కార్తీక మాసం అంటేనే హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన మాసమని, శివుడికి, మహావిష్ణువుకు అత్యంత ఇష్ట మన్నారు. కార్తీక మాసం ఫలాలను ప్రజలందరికీ చేర్చాలనే మంచి ఉద్దేశంతో లక్ష దీపోత్సవ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నామని చెప్పారు. జిల్లా ప్రజలు భారీగా తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. 6వ తేదీ ఉదయం గణపతి పూజతో కార్యక్రమం ప్రారంభమవుతుందని, అదే రోజు సాయంత్రం ఆధ్యాత్మిక వేత్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనం ఉంటుందన్నారు. చివరి రోజు 8వ తేదీ శివపార్వతుల కళ్యాణ మహోత్సవంతో కార్యక్రమం ముగుస్తుందని చెప్పారు. కార్తీక మాస లక్ష దీపోత్సవంలో ఏటా ఒక శివాలయము, ఒక మహావిష్ణువు ఆలయ నమూనాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని, ఈ ఏడాది ద్వారకాలో వెలసిన నాగేశ్వర జ్యోతిర్లింగ ఆలయ నమూనాను, అలాగే పండరీనాథ్ ఆలయ నమూనాను ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించారు. భక్తులు ఒక ఆధ్యాత్మిక సంతృప్తితో ఇక్కడ కార్తీక దీపాలు వెలిగించి స్వామివార్లను దర్శనం చేసుకుని వెళ్లాలన్నదే తమ ఆకాంక్ష అని, భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని భగవంతుడి ఆశీస్సులు అందుకోవాలని కోరారు. కార్యక్రమంలో కార్తీకమాస లక్ష దీపోత్సవ నిర్వాహకులు భాస్కర్ శర్మ, ప్రభాకర్ రావు, సునీల్ కుమార్, విజయ సారధి, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, వంశీ కృష్ణారెడ్డి, కేతంరెడ్డి వినోద్ రెడ్డి, ఉచ్చి భువనేశ్వరి ప్రసాద్, స్థానిక నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.