శేరిలింగంపల్లిలో రెండు కోట్ల విలువ చేసే గంజాయిని పట్టుకున్న ఎస్ఓటి పోలీసులు (హైదరాబాద్ )మే 11: శేరిలింగంపల్లి జోన్‌లో భారీగా గంజాయిని పట్టుకున్న పోలీసులు.శేరిలింగంపల్లి జోన్ డీసీపి చింతమనేని శ్రీనివాస్ వివరాలు వెల్లడించారు.కూకట్‌పల్లి ఎస్‌వోటీ మరియు పటాన్‌చెరు పోలీసులు సంయుక్త ఆపరేషన్ లో భాగంగా గంజాయి రవాణా చేస్తున్న ముఠా ను పట్టుకున్నారు ఒడిశా రాష్టం మల్కన్ గిరి నుండి మహారాష్ట్ర సోలాపూర్ వరకు గంజాయి తరలించే క్రమంలో పటాన్చెరు ఓ ఆర్ ఆర్ దగ్గర ముఠా ను పట్టుకున్నారు మహారాష్ట్ర సోలాపూర్ లోని మనీషా పద్వాల్ కు సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు డీసీఎంకు ముందుగా ఇండికా కారులో పైలట్ చేస్తూ, ఎర్టిగా కారుతో ఎస్కార్ట్ ఇస్తూ రవాణా చేస్తూ గంజాయి సరఫరా చేస్తున్నారు.ఏ1మనీషా పద్వాల్, ఏ2 ట్రిబ్యున్ పరరీ లో ఉండగా, మిగతా 7మందిని అరెస్ట్ చేశారు.వారి వద్ద నుండి 2కోట్ల విలువ చేసే 400కిలోల గంజాయి, ఒక డీసీఎం, 2కార్లు, 6మొబైల్స్ స్వాధీనం చేసుకున్నారు.కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
శేరిలింగంపల్లిలో రెండు కోట్ల విలువ చేసే గంజాయిని పట్టుకున్న ఎస్ఓటి పోలీసులు (హైదరాబాద్ )మే 11: శేరిలింగంపల్లి జోన్‌లో భారీగా గంజాయిని పట్టుకున్న పోలీసులు.శేరిలింగంపల్లి జోన్ డీసీపి చింతమనేని శ్రీనివాస్ వివరాలు వెల్లడించారు.కూకట్‌పల్లి ఎస్‌వోటీ మరియు పటాన్‌చెరు పోలీసులు సంయుక్త ఆపరేషన్ లో భాగంగా గంజాయి రవాణా చేస్తున్న ముఠా ను పట్టుకున్నారు ఒడిశా రాష్టం మల్కన్ గిరి నుండి మహారాష్ట్ర సోలాపూర్ వరకు గంజాయి తరలించే క్రమంలో పటాన్చెరు ఓ ఆర్ ఆర్ దగ్గర ముఠా ను పట్టుకున్నారు మహారాష్ట్ర సోలాపూర్ లోని మనీషా పద్వాల్ కు సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు డీసీఎంకు ముందుగా ఇండికా కారులో పైలట్ చేస్తూ, ఎర్టిగా కారుతో ఎస్కార్ట్ ఇస్తూ రవాణా చేస్తూ గంజాయి సరఫరా చేస్తున్నారు.ఏ1మనీషా పద్వాల్, ఏ2 ట్రిబ్యున్ పరరీ లో ఉండగా, మిగతా 7మందిని అరెస్ట్ చేశారు.వారి వద్ద నుండి 2కోట్ల విలువ చేసే 400కిలోల గంజాయి, ఒక డీసీఎం, 2కార్లు, 6మొబైల్స్ స్వాధీనం చేసుకున్నారు.కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
- యాదగిరిగుట్ట పరిసర ప్రాంతాలకు చిన్న విన్నపం దీని దీని వెంటనే స్పందించి డిఈ గారు దీనిపై తగు చర్యలు తీసుకోవాలి అట్లనే ఏఈ గారు యాదగిరిగుట్ట గారికి చిన్న విన్నపిస్తున్నాము దయచేసి దీనిపై వెంటనే చర్యలు తీసుకోండి ఎందుకంటే ఇది ఇలా మధ్యలోకి వెళ్లి పాస్ అయితే లైన్ ఇది చాలా అంటే చాలా వైబ్రేట్ అవుతుంది. ఒక్కసారి మీరు వచ్చి అధికారులతో నిధిని పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలని వినిపిస్తున్నాం 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼1
- ఐఎఫ్బి ఎస్ ఐ డి పి ఎస్ బోధనతో నాణ్యమైన విద్య డిజిటల్ క్లాస్ రూమ్ బోర్డులను ప్రారంభించిన కలెక్టర్ ప్రతిమాసింగ్ ఐఎఫ్బి ఎస్ ఐ డి పి ఎస్ బోధనతో నాణ్యమైన విద్య-భవిష్యత్తుకు నాంది కలెక్టర్ ప్రతిమా సింగ్99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా చేగుంట మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ను సందర్శించిన కలెక్టర్ డిజిటల్ క్లాస్ రూమ్ బోర్డులను క్లాస్ రూమ్ బోర్డులను ప్రారంభించిన కలెక్టర్ ప్రారంభించారు.కలెక్టర్ చేగుంట ప్రభుత్వ జూనియర్ కాలేజీలో సోమవారం జిల్లా కలెక్టర్ ప్రతిమసింగ్ ఐ ఎఫ్ పి ఎస్ ఐ డి పి ఎస్ బోధనతో నాణ్యమైన విద్య-భవిష్యత్తుకు నాంది కార్యక్రమంలో భాగంగా డిజిటల్ క్లాస్ రూమ్ బోర్డులను కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 2026-27 విద్యా సంవత్సరం నుండి ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఇంటర్ విద్యార్థుల కోసం డిజిటల్ విద్యను ప్రోత్సహించే లక్ష్యంతో ఈ ఐ ఎఫ్ పి ఎస్ ఐ డి పి ఎస్ బోధనను ప్రవేశపెడుతున్నట్లు కలెక్టర్ తెలిపారు .ఈ కార్యక్రమంలోశ్యాంసుందర్, -భౌతికశాస్త్ర బోధనతో అధ్యాపకులు -ఇంచార్జి ప్రిన్సిపాల్స్వర్ణలత ,-వృక్షశాస్త్ర అధ్యాపకులు అరవింద్ రెడ్డి, -రసాయనశాస్త్ర అధ్యాపకులువెంకటేశ్వర్లు -అర్ధశాస్త్ర అధ్యాపకులుప్రమోద్కుమార్ -కంప్యూటర్ అధ్యాపకులు ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు1
- నల్గొండ: కొత్తపల్లిలో ప్రమాదకరంగా బోరు నీటి పైప్ లైన్ గుంత నల్గొండ: నల్గొండ మండలంలోని కొత్తపల్లి గ్రామంలో 4వ వార్డులో బోరు నీటి పైప్ లైన్ మరమ్మత్తుల కోసం ప్రధాన రహదారి పక్కన తీసిన గుంత ప్రమాదకరంగా మారింది. వారం రోజుల క్రితం తీసిన ఈ గుంతను మరమ్మత్తులు చేపట్టకుండా నిర్లక్ష్యంగా వదిలి వేయడంతో చిన్నారులు అందులో పడే ప్రమాదం ఉంది. స్థానికులు వాహనదారులు, పాదచారులు, రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రమాదాలు జరగకముందే సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి పైప్ లైన్ కు మరమ్మత్తులు పూర్తిచేసి, గుంతను పూడ్చాలని స్థానికులు, వాహనదారులు కోరుతున్నారు.1
- రామాయంపేట పట్టణ అభివృద్ధి పనుల్లో జాప్యం వద్దు: కౌన్సిలర్ శంకర్ గౌడ్. రామాయంపేట: మున్సిపాలిటీ పరిధిలోని 8వ వార్డు సమస్యల పరిష్కారమే ధ్యేయంగా కౌన్సిలర్ జె. శంకర్ గౌడ్ గళమెత్తారు. అత్యవసర సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 40 ఫీట్ల ప్రధాన రహదారి విస్తరణకు తక్షణమే మార్కింగ్ చేసి, బాధితులకు ప్రభుత్వ సాయం అందించాలని డిమాండ్ చేశారు. బజాజ్ షోరూం వద్ద పెండింగ్‌లో ఉన్న పనుల వల్ల ప్రమాదాలు పొంచి ఉన్నాయని, జాప్యం చేయకుండా పూర్తి చేయాలని కోరారు.గత బీఆర్ఎస్ పాలనలో రామాయంపేట వెనుకబాటుకు గురైందని విమర్శిస్తూ.. 15వ ఆర్థిక సంఘం నిధుల దుర్వినియోగంపై కలెక్టర్, ఎమ్మెల్యేలు విచారణ జరిపి చర్యలు తీసుకోవాలన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కేటాయించిన TUFIDC నిధులతో పనులను వేగవంతం చేసి, ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని శంకర్ గౌడ్ స్పష్టం చేశారు.1
- నల్గొండ జిల్లాలో బత్తాయి తోటల అభివృద్ధి, దిగుబడి పెంపు కోసం రైతులకు ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. రికార్డు స్థాయిలో ధర ఉన్నప్పటికీ, దిగుబడి తగ్గి రైతులు నష్టపోతున్నారని అధికారులు గుర్తించారు. భూసారం పెంపు, సరైన సాగు పద్ధతులు పాటించి అధిక లాభాలు పొందాలని ఉద్యానవన శాఖ సూచించింది.1
- కామారెడ్డి జిల్లా యాడారం గ్రామంలో ముదిరాజుల కులదేవత శ్రీ వనదుర్గ పెద్దమ్మ తల్లి ఆలయ పునర్నిర్మాణ మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. బోనాలతో పాటు గ్రామమంతా ఏకమై జాతరను ఘనంగా నిర్వహించగా, దాతలకు సన్మానాలు చేశారు.1
- వచ్చే అకడమిక్ ఇయర్ నుండి ఇంటర్మీడియట్ బోర్డు రద్దు చేసి పాఠశాల విద్యలో కలుపుతాం1
- తెలంగాణలో 17 ఏళ్ల పోక్సో బాధితురాలిపై బండి సంజయ్ తీవ్ర దిగజారుడు వ్యాఖ్యలు చేసి, బెదిరించినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. బాలిక చరित्रంపై ప్రశ్నిస్తూ, తనతో పెట్టుకోవద్దని బాధితులను భయపెట్టినట్లు సమాచారం. ఈ ఘటనపై బండి సంజయ్ ఇంటి సీసీ ఫుటేజ్, కాల్ రికార్డ్స్‌ను తనిఖీ చేయాలని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు.1
- ఖచ్చితమైన గణాంకాల రూపకల్పన జనగణన కీలకం జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ సమగ్ర, ఖచ్చితమైన గణాంకాల రూపకల్పనలో జనగణన కీలకం కలెక్టర్ జనగణన ప్రక్రియలో అందరూ భాగస్వామ్యులు కావాలి పోస్ట్ ఆఫీస్ సర్కిల్ నుండి . రాందాస్ చౌరస్తా వరకు మారథాన్ వాక్ కార్యక్రమాన్ని జెండాతో ప్రారంభించిన కలెక్టర్ జనగణన ట్యాబ్లు ఆవిష్కరించిన కలెక్టర్ మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ జనగణన 2027లో భాగంగా సమగ్ర, ఖచ్చితమైన గణాంకాల రూపకల్పనలో జనగణన కీలకమని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అన్నారు. సోమవారం ఉదయం జిల్లా కేంద్రంలోని రాందాస్ చౌరస్తా నుండి పోస్ట్ ఆఫీస్ సర్కిల్ వరకు మొదటి దశ జనగణనపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో కలెక్టర్ ప్రతిమా సింగ్, అదనపు కలెక్టర్ నగేష్ తో కలిసి మారథాన్ వాక్ కార్యక్రమాన్ని పాల్గొని ఇంటింటి సందర్శనతో అవగాహన కల్పించారు. ప్రజల సహకారంతో కార్యక్రమం విజయవంతం చేయాలని పిలుపు నిచ్చారు. అనంతరం జనగణన ట్యాబ్లు ఆవిష్కరించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... చాలా సంవత్సరాల తర్వాత భారతదేశంలో జనగణన చేయడం జరుగుతుందని, 2021లో జనగణన జరగాల్సింది ఉంది కానీ కోవిడ్ కారణంగా జరగలేదని, స్వాతంత్రం వచ్చినప్పటి నుండి చేస్తున్న జనగణన ఇది 16వసారి, మన తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత ఇది మొదటి జనగణన అని, మొదటి సారి డిజిటల్ విధానంలో ఈ జనగణన నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. స్వీయగణన అనే విధానం తొలిసారి ప్రవేశపెట్టి జనగణన ప్రక్రియలో నూతన అధ్యాయానికి నాంది పలకడం జరిగిందని పేర్కొన్నారు. మీ కుటుంబ వివరాలను స్వయంగా మీరే నమోదు చేసుకునే చేసుకునే అవకాశం స్వీయ గణన ద్వారా కల్పించారని, ఇందులో 34 ప్రశ్నలు ఉన్నాయని, కేవలం ఐదు నిమిషాల్లో స్వీయ గణన ప్రక్రియను పూర్తి చేయవచ్చని పేర్కొన్నారు. సోమవారం నుండి జనగణన ఎన్యూమరేటర్లు ఇంటింటికీ తిరిగి వివరాలను సేకరించడం జరుగుతుందని అన్నారు. అనుభవజ్ఞులైన సిబ్బందిని జనగణన సూపర్ వైజర్లు, ఎన్యూమరేటర్లుగా నియమించి వారికి అవసరమైన శిక్షణ అందించడం జరిగిందని వెల్లడించారు. వారికి ప్రత్యేక ఐడీ కార్డులు కూడా జారీ చేశామని, ఇంటికి వచ్చినప్పుడు వారికి సహకరించాలని కోరారు. జనగణన పేరుతో ఎవరైనా అనుమానిత వ్యక్తులు మీ ఇంటికి వచ్చి వివరాలు అడిగే అవకాశం ఉంటుందని, అలాంటి వ్యక్తుల పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలని అన్నారు. జనగణనలో పాల్గొనే సిబ్బందికి జారీ చేసిన గుర్తింపు కార్డుల మీద క్యూ ఆర్ కోడ్ ఉంటుందని, దానిని స్కాన్ చేస్తే అధికారిక వెబ్ సైట్ లో పొంది ఉంచిన వారి పూర్తి వివరాలు వస్తాయని, ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని విజ్ఞప్తి చేశారు. జనగణన ప్రక్రియ చాలా ముఖ్యమైనదని, జనగణనలో భాగస్వామ్యులు అయ్యే బాధ్యత ప్రతీ ఒక్కరికీ ఉంటుందని గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో మెదక్ మున్సిపల్ చైర్మన్ రాధికా భూపతి రాజు, మెదక్ ఆర్డీవో రమాదేవి, డీఎఫ్ఓ జోజి, జిల్లా పరిశ్రమల అధికారి ప్రకాష్ రావు, తాసిల్దార్ లక్ష్మణ్ బాబు, జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి, సంబంధిత జిల్లా అధికారులు వ్యాయామ ఉపాధ్యాయులు క్రీడాకారులు క్రీడాభిమానులు, విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు1