logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

తెలంగాణ రాజ్యాధికార పార్టీ (టిఆర్పి) మైనార్టీ విభాగ రాష్ట్ర కార్యదర్శిగా మహమ్మద్ అమ్జద్ పాషా నియామకం : జనగామ : తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర కమిటీ నిర్ణయం మేరకు పార్టీకి నిస్వార్థంగా సేవలందిస్తూ మైనార్టీల హక్కులు, సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్న సీనియర్ నాయకులు మహమ్మద్ అమ్జద్ పాషాని తెలంగాణ రాజ్యాధికార పార్టీ మైనార్టీ విభాగ రాష్ట్ర కార్యదర్శిగా నియమిస్తూ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు తీన్మార్ మల్లన్న నియామక ఉత్తర్వులను జారీ చేశారు. ఈ సందర్భంగా నూతనంగా నియమితులైన రాష్ట్ర కార్యదర్శి మహమ్మద్ అమ్జద్ పాషా మాట్లాడుతూ నాపై నమ్మకం ఉంచి ఈ బాధ్యత అప్పగించిన పార్టీ రాష్ట్ర నాయకత్వానికి, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మైనార్టీ సోదరుల సమస్యలను ప్రభుత్వం, పార్టీ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం అయ్యేలా కృషి చేస్తానన్నారు. తెలంగాణ రాజ్యాధికార పార్టీని గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు బలోపేతం చేయడానికి, పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి శక్తి వంచన లేకుండా పని చేస్తానని ప్రకటించారు.

1 day ago
user_P Jithender, Sr Reportar
P Jithender, Sr Reportar
Local News Reporter జనగాం, తెలంగాణ•
1 day ago
4b8bcb3f-a8af-41d6-8a25-e88a1715b4be

తెలంగాణ రాజ్యాధికార పార్టీ (టిఆర్పి) మైనార్టీ విభాగ రాష్ట్ర కార్యదర్శిగా మహమ్మద్ అమ్జద్ పాషా నియామకం : జనగామ : తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర కమిటీ నిర్ణయం మేరకు పార్టీకి నిస్వార్థంగా సేవలందిస్తూ మైనార్టీల హక్కులు, సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్న సీనియర్ నాయకులు మహమ్మద్ అమ్జద్ పాషాని తెలంగాణ రాజ్యాధికార పార్టీ మైనార్టీ విభాగ రాష్ట్ర కార్యదర్శిగా నియమిస్తూ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు తీన్మార్ మల్లన్న నియామక ఉత్తర్వులను జారీ చేశారు. ఈ సందర్భంగా

dbd4b9d7-2e8d-4bbb-b91c-b5ba6cd71cbc

నూతనంగా నియమితులైన రాష్ట్ర కార్యదర్శి మహమ్మద్ అమ్జద్ పాషా మాట్లాడుతూ నాపై నమ్మకం ఉంచి ఈ బాధ్యత అప్పగించిన పార్టీ రాష్ట్ర నాయకత్వానికి, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మైనార్టీ సోదరుల సమస్యలను ప్రభుత్వం, పార్టీ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం అయ్యేలా కృషి చేస్తానన్నారు. తెలంగాణ రాజ్యాధికార పార్టీని గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు బలోపేతం చేయడానికి, పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి శక్తి వంచన లేకుండా పని చేస్తానని ప్రకటించారు.

More news from తెలంగాణ and nearby areas
  • వివాహ వేడుక నుంచి తిరిగి వస్తుండగా ప్రమాదం............. ఉమ్మడి వరంగల్ హనుమకొండ జిల్లా లో విషాదం చోటు చేసుకుంది. గురువారం వ్యవసాయ బావిలోకి కారు దూసుకెళ్లిన సంఘటన లో మహిళ మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. భీమదేవరపల్లి మండలం రాంనగర్‌ శివారులో జరిగిన ఈ విషాద సంఘటనలో హుస్నాబాద్ మండలం పోతారం లో జరిగిన వివాహ వేడుక నుంచి తిరిగి వస్తుండగా ప్రమాదం చోటు చేసుకుందనీ ఈ సంఘటనలో ఏలూరి రాధా (61) అక్కడికక్కడే మృతి చెందగా వీరారెడ్డి,కిరణ్,రవీందర్ రెడ్డి అనే మరో ముగ్గురికి తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించి నట్లు, వీరంతా సైదాపూర్ మండలం బొమ్మకల్ గ్రామానికి చెందిన వారుగా స్థానికులు గుర్తించారు.సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారని వివరించారు.
    1
    వివాహ వేడుక నుంచి తిరిగి వస్తుండగా ప్రమాదం............. 
ఉమ్మడి వరంగల్ హనుమకొండ జిల్లా లో విషాదం చోటు చేసుకుంది. గురువారం 
వ్యవసాయ బావిలోకి కారు దూసుకెళ్లిన సంఘటన లో
మహిళ మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు.
భీమదేవరపల్లి మండలం రాంనగర్‌ శివారులో జరిగిన ఈ విషాద సంఘటనలో
హుస్నాబాద్ మండలం పోతారం లో జరిగిన వివాహ వేడుక నుంచి తిరిగి వస్తుండగా ప్రమాదం చోటు చేసుకుందనీ ఈ సంఘటనలో ఏలూరి రాధా (61) అక్కడికక్కడే మృతి చెందగా
వీరారెడ్డి,కిరణ్,రవీందర్ రెడ్డి అనే మరో ముగ్గురికి తీవ్ర 
గాయాలు కావడంతో 
ఆస్పత్రికి తరలించి నట్లు, వీరంతా 
సైదాపూర్ మండలం బొమ్మకల్ గ్రామానికి చెందిన వారుగా స్థానికులు గుర్తించారు.సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారని వివరించారు.
    user_Devender Pasunoori
    Devender Pasunoori
    Local News Reporter జనగాం, జనగాం, తెలంగాణ•
    3 hrs ago
  • హైదరాబాద్ మహాధర్నాలో వైద్య ఆరోగ్య ఉద్యోగుల గర్జ తెలంగాణ ఉద్యోగ జేఏసీ హైదరాబాద్ మహాధర్నాలో వైద్య ఆరోగ్య ఉద్యోగుల గర్జన తెలంగాణ ఉద్యోగ జేఏసీ (TGEJAC) పిలుపు మేరకు హైదరాబాద్‌లో నిర్వహించిన మహాధర్నాలో మెడికల్ & హెల్త్ డిపార్ట్‌మెంట్‌లోని అన్ని సంఘాల నాయకులు, వైద్యులు, వైద్య ఆరోగ్య ఉద్యోగులు భారీగా పాల్గొని తమ ఐక్యతను చాటారు. ఈ సందర్భంగా TGO Doctors Forum & TMPHDA అధ్యక్షులు డాక్టర్ కత్తి జనార్దన్ మాట్లాడుతూ: 🔴 2వ PRCను వెంటనే అమలు చేయాలి 🔴 6 పెండింగ్ DAలను విడుదల చేయాలి 🔴 OPSను పునరుద్ధరించాలి 🔴 పెండింగ్ బిల్లులను తక్షణమే చెల్లించాలి 🔴 EHSలోని లోటుపాట్లను పరిష్కరించాలి అని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించని పక్షంలో, *TGEJAC చైర్మన్ మారం జగదీష్ అన్నగారు, జనరల్ సెక్రటరీ ఏలూరు శ్రీనివాస్ అన్నగారి నాయకత్వంలో సెప్టెంబర్ 10న “చలో హైదరాబాద్”* కార్యక్రమాన్ని నిర్వహించి, లక్షలాది ఉద్యోగులతో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు. 🤝 మెడికల్ & హెల్త్ డిపార్ట్‌మెంట్ ఐక్య గళం ఈ మహాధర్నాలో వివిధ సంఘాల రాష్ట్ర నాయకులు పాల్గొని, ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని స్పష్టం చేశారు. డా. కిరణ్ మాదాల డా. వెంకట్ యాదవ్ శ్రీనివాస్ కొప్పునమోని శ్రీనివాస్ మెంగా సుజాత రాథోడ్ దేవిక రొక్కం బత్తిని సుదర్శన్ గౌడ్ డా. రవికుమార్ ✊🏻 ఐక్యంగా నిలబడదాం… హక్కులు సాధించుకుందాం ,జై TGEJAC✊🏻
    1
    హైదరాబాద్ మహాధర్నాలో వైద్య ఆరోగ్య ఉద్యోగుల గర్జ తెలంగాణ ఉద్యోగ జేఏసీ
హైదరాబాద్ మహాధర్నాలో వైద్య ఆరోగ్య ఉద్యోగుల గర్జన
తెలంగాణ ఉద్యోగ జేఏసీ (TGEJAC) పిలుపు మేరకు హైదరాబాద్‌లో నిర్వహించిన మహాధర్నాలో మెడికల్ & హెల్త్ డిపార్ట్‌మెంట్‌లోని అన్ని సంఘాల నాయకులు, వైద్యులు, వైద్య ఆరోగ్య ఉద్యోగులు భారీగా పాల్గొని తమ ఐక్యతను చాటారు.
ఈ సందర్భంగా TGO Doctors Forum & TMPHDA అధ్యక్షులు డాక్టర్ కత్తి జనార్దన్ మాట్లాడుతూ:
🔴 2వ PRCను వెంటనే అమలు చేయాలి
🔴 6 పెండింగ్ DAలను విడుదల చేయాలి
🔴 OPSను పునరుద్ధరించాలి
🔴 పెండింగ్ బిల్లులను తక్షణమే చెల్లించాలి
🔴 EHSలోని లోటుపాట్లను పరిష్కరించాలి అని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించని పక్షంలో, *TGEJAC చైర్మన్ మారం జగదీష్ అన్నగారు, జనరల్ సెక్రటరీ ఏలూరు శ్రీనివాస్ అన్నగారి నాయకత్వంలో సెప్టెంబర్ 10న “చలో హైదరాబాద్”* కార్యక్రమాన్ని నిర్వహించి, లక్షలాది ఉద్యోగులతో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు.
🤝 మెడికల్ & హెల్త్ డిపార్ట్‌మెంట్ ఐక్య గళం
ఈ మహాధర్నాలో వివిధ సంఘాల రాష్ట్ర నాయకులు పాల్గొని, ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని స్పష్టం చేశారు.
డా. కిరణ్ మాదాల 
డా. వెంకట్ యాదవ్ 
శ్రీనివాస్ కొప్పునమోని 
శ్రీనివాస్ మెంగా 
సుజాత రాథోడ్ 
దేవిక రొక్కం 
బత్తిని సుదర్శన్ గౌడ్ 
డా. రవికుమార్ 
✊🏻 ఐక్యంగా నిలబడదాం… హక్కులు సాధించుకుందాం ,జై TGEJAC✊🏻
    user_SIRIPATI ARUNKUMAR
    SIRIPATI ARUNKUMAR
    Auditor బచ్చన్నపేట, జనగాం, తెలంగాణ•
    2 hrs ago
  • బీబీనగర్ ఎయిమ్స్ కు వెళ్లే వారికి ప్రత్యేక బస్సులు ఏర్పాటు... బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిలోని వివిధ విభాగాలకు వెళ్లే రోగులు, వారి సహాయకుల సౌకర్యార్థం ఎయిమ్స్ అధికారులు జాతీయ రహదారిపై గల బస్ స్టాప్ నుంచి ప్రత్యేక బస్సు సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు. దీంతో ఆసుపత్రి ప్రాంగణంలోని పలు విభాగాలకు వెళ్లే వారికి రవాణా ఇబ్బందులు తగ్గనున్నాయి. ఎయిమ్స్ అధికారుల చర్యల పట్ల ఆసుపత్రికి వచ్చేవారు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
    1
    బీబీనగర్ ఎయిమ్స్ కు వెళ్లే వారికి ప్రత్యేక బస్సులు ఏర్పాటు...
బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిలోని వివిధ విభాగాలకు వెళ్లే రోగులు, వారి సహాయకుల సౌకర్యార్థం ఎయిమ్స్ అధికారులు జాతీయ రహదారిపై గల బస్ స్టాప్ నుంచి ప్రత్యేక బస్సు సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు. దీంతో ఆసుపత్రి ప్రాంగణంలోని పలు విభాగాలకు వెళ్లే వారికి రవాణా ఇబ్బందులు తగ్గనున్నాయి. ఎయిమ్స్ అధికారుల చర్యల పట్ల ఆసుపత్రికి వచ్చేవారు హర్షం
వ్యక్తం చేస్తున్నారు.
    user_P.srinu
    P.srinu
    యాదగిరిగుట్ట, యాదాద్రి భువనగిరి, తెలంగాణ•
    30 min ago
  • బిజెపి, బీఆర్ఎస్ పార్టీల నేతలపై స్టేషన్‌ ఘణపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఘాటు వ్యాఖ్యలు జనగామ జిల్లా జఫర్గడ్ మండలం సాగరం గ్రామంలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ... బిఆర్ఎస్ పార్టీ సన్నాసులకు దమ్ముంటే, కాస్తంతయినా బుద్ది ఉంటే కేసీఆర్ బిడ్డ కవిత స్వయంగా బిఆర్ఎస్ పార్టీ పై చేసిన ఆరోపణలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కవిత బిఆర్ఎస్ పార్టీ అకౌంట్లో ఉన్న 1,400 కోట్లు అక్రమంగా వచ్చినవే అని ఆ మొత్తాన్ని పార్టీ కార్యకర్తలకు పంచాలని డిమాండ్ చేస్తూంటే దానికి సమాధానం చెప్పే దమ్ము బిఆర్ఎస్ పార్టీ నాయకులకు ఉందా అని సవాల్ విసిరారు. బిఆర్ఎస్ అధికారం కోల్పోయామనే అక్కసుతో, మళ్ళీ అధికారంలోకి రావాలనే ఆశతో కొన్ని యూట్యూబ్ చానళ్ళు కొని వాటి ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వంపై విష ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. అక్రమంగా సంపాదించిన డబ్బుతో కొంతమందికి జీతాలు ఇచ్చి మరి నీచ స్థాయికి దిగజారి అబద్దాలు ప్రచారం చేస్తూ ప్రజలను మభ్యపెట్టె ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. బీజేపీ, తెలంగాణ అభివృద్ధిని అడుగడుగునా అడ్డుకుటుందని ఆరోపించారు. తెలంగాణ నుండి 8ఎంపీలు ఉండి, 8మంది ఎమ్మెల్యేలు ఉండి తెలంగాణకు ఒక వెయ్యి కోట్ల ప్రాజెక్టు అయినా తీసుకువచ్చారా ప్రశ్నించారు. అసలు ప్రధాని మోడీకి మొదటి నుండి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఇష్టం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్కడో జరిగిన సంఘటన వీడియోలో నేనే ఉన్నానని బిఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా విష ప్రచారం చేస్తున్నారన్నారు.
    1
    బిజెపి, బీఆర్ఎస్ పార్టీల నేతలపై స్టేషన్‌ ఘణపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఘాటు వ్యాఖ్యలు
జనగామ జిల్లా జఫర్గడ్ మండలం సాగరం గ్రామంలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి అనంతరం  ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ... బిఆర్ఎస్ పార్టీ సన్నాసులకు దమ్ముంటే, కాస్తంతయినా బుద్ది ఉంటే కేసీఆర్ బిడ్డ కవిత స్వయంగా బిఆర్ఎస్ పార్టీ పై చేసిన ఆరోపణలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కవిత బిఆర్ఎస్ పార్టీ అకౌంట్లో ఉన్న 1,400 కోట్లు అక్రమంగా వచ్చినవే అని ఆ మొత్తాన్ని పార్టీ కార్యకర్తలకు పంచాలని డిమాండ్ చేస్తూంటే దానికి సమాధానం చెప్పే దమ్ము బిఆర్ఎస్ పార్టీ నాయకులకు ఉందా అని సవాల్ విసిరారు. బిఆర్ఎస్ అధికారం కోల్పోయామనే అక్కసుతో, మళ్ళీ అధికారంలోకి రావాలనే ఆశతో కొన్ని యూట్యూబ్ చానళ్ళు కొని వాటి ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వంపై విష ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. అక్రమంగా సంపాదించిన డబ్బుతో కొంతమందికి జీతాలు ఇచ్చి మరి నీచ స్థాయికి దిగజారి అబద్దాలు ప్రచారం చేస్తూ ప్రజలను మభ్యపెట్టె ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. బీజేపీ, తెలంగాణ అభివృద్ధిని అడుగడుగునా అడ్డుకుటుందని ఆరోపించారు. తెలంగాణ నుండి 8ఎంపీలు ఉండి, 8మంది ఎమ్మెల్యేలు ఉండి తెలంగాణకు ఒక వెయ్యి కోట్ల ప్రాజెక్టు అయినా తీసుకువచ్చారా ప్రశ్నించారు. అసలు ప్రధాని మోడీకి మొదటి నుండి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఇష్టం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్కడో జరిగిన సంఘటన వీడియోలో నేనే ఉన్నానని బిఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా విష ప్రచారం చేస్తున్నారన్నారు.
    user_Kumar Pasunuri
    Kumar Pasunuri
    Local News Reporter Ghanpur (Station), Jangoan•
    58 min ago
  • అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించడం ప్రభుత్వ లక్ష్యం ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ప్రతి ఒక్కరి ఓటు పరిరక్షణే SIR-2 లక్ష్యం ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి బోనగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో SIR-2 వార్డు సభ నిర్వహించారు. ప్రజలకు మరింత చేరువగా ఉండాలనే ఉద్దేశంతో ఎమ్మెల్యే ప్రజలతో కలిసి నేలపై కూర్చొని సభ నిర్వహించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సందర్భంగా ప్రజలతో మమేకమై SIR-2 కార్యక్రమం ప్రాముఖ్యతను వివరించారు. ప్రతి అర్హుడి ఓటు ఓటరు జాబితాలో ఉండేలా చూడాలని, ఒక్క అర్హుడి ఓటు కూడా పోకుండా కాపాడుకోవడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని తెలిపారు.. ఏవైనా లోపాలు ఉన్నట్లయితే సంబంధిత బీఎల్ఓలను సంప్రదించి సరిచేసుకోవాలని సూచించారు. ప్రతి ఓటు విలువైనదని, ప్రతి ఓటు ప్రజాస్వామ్యానికి బలమైన పునాది అని పేర్కొంటూ, ప్రతి పౌరుడు తమ ఓటు హక్కును పరిరక్షించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి భువనగిరి సర్ కోఆర్డినేటర్ ఇ.వి. శ్రీనివాస్ రావు మున్సిపల్ చైర్మన్ తంగళ్ళపల్లి శ్రీవాణి రవికుమార్ , వైస్ చైర్మన్ పోతంశెట్టి మంజుల వెంకటేశ్వర్లు జిల్లా గ్రంధాలయ చైర్మన్ అవెస్ చిస్తి PACS చైర్మన్ కొండల్ రెడ్డి ,RDO కృష్ణారెడ్డి గ, MRO జగన్ , పట్టణ అధ్యక్షులు కూర వెంకటేష్ వార్డు కౌన్సిలర్ గుర్రాల సంతోష శ్రీనివాస్ , కౌన్సిలర్స్ ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ నాయకులు BLA లు పాల్గొన్నారు... ప్రజల భాగస్వామ్యంతో పారదర్శకమైన ఓటరు జాబితా – ప్రజాస్వామ్య పరిరక్షణే మనందరి లక్ష్యం అని నాయకులు పేర్కొన్నారు.
    4
    అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించడం ప్రభుత్వ లక్ష్యం ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి
ప్రతి ఒక్కరి ఓటు పరిరక్షణే SIR-2 లక్ష్యం  ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి
బోనగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో SIR-2 వార్డు సభ నిర్వహించారు. ప్రజలకు మరింత చేరువగా ఉండాలనే ఉద్దేశంతో ఎమ్మెల్యే  ప్రజలతో కలిసి నేలపై కూర్చొని సభ నిర్వహించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ఈ సందర్భంగా ప్రజలతో మమేకమై SIR-2 కార్యక్రమం ప్రాముఖ్యతను వివరించారు. ప్రతి అర్హుడి ఓటు ఓటరు జాబితాలో ఉండేలా చూడాలని, ఒక్క అర్హుడి ఓటు కూడా పోకుండా కాపాడుకోవడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని తెలిపారు..
ఏవైనా లోపాలు ఉన్నట్లయితే సంబంధిత బీఎల్ఓలను సంప్రదించి సరిచేసుకోవాలని సూచించారు. ప్రతి ఓటు విలువైనదని, ప్రతి ఓటు ప్రజాస్వామ్యానికి బలమైన పునాది అని పేర్కొంటూ, ప్రతి పౌరుడు తమ ఓటు హక్కును పరిరక్షించుకోవాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి భువనగిరి సర్ కోఆర్డినేటర్ ఇ.వి. శ్రీనివాస్ రావు మున్సిపల్ చైర్మన్ తంగళ్ళపల్లి శ్రీవాణి రవికుమార్ , వైస్ చైర్మన్ పోతంశెట్టి మంజుల వెంకటేశ్వర్లు 
జిల్లా గ్రంధాలయ చైర్మన్ అవెస్ చిస్తి  PACS చైర్మన్ కొండల్ రెడ్డి ,RDO కృష్ణారెడ్డి గ, MRO జగన్ , పట్టణ అధ్యక్షులు కూర వెంకటేష్  వార్డు కౌన్సిలర్ గుర్రాల సంతోష శ్రీనివాస్ , కౌన్సిలర్స్ ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ నాయకులు  BLA లు పాల్గొన్నారు...
ప్రజల భాగస్వామ్యంతో పారదర్శకమైన ఓటరు జాబితా – ప్రజాస్వామ్య పరిరక్షణే మనందరి లక్ష్యం అని నాయకులు పేర్కొన్నారు.
    user_గడ్డమీది చంద్రయ్య
    గడ్డమీది చంద్రయ్య
    Bhongir, Yadadri Bhuvanagiri•
    4 hrs ago
  • గ్రానెట్ లారీ బోల్తా మిషన్ భగీరథ ప్రధాన పైప్ లైన్ డ్యామేజ్ జనగామ జిల్లా కొడకండ్ల మండలం రామవరం చెరువు మూలమలుపు వద్ద గ్రానెట్ లారీ బోల్తా పడటంతో మిషన్ భగీరథ ప్రధాన పైప్ లైన్ డ్యామేజ్ కావడం వలన కొడకండ్ల పెద్దవంగర మండలాల్లోని పలు గ్రామ పంచాయతీలకు నీటి సరఫరాకు అంతరాయం కలిగింది. దీంతో గ్రామ పంచాయతీలు గ్రామ ప్రజలు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోగలరని సంబంధిత అధికారులు స్పష్టం చేశారు.
    1
    గ్రానెట్ లారీ బోల్తా మిషన్ భగీరథ ప్రధాన పైప్ లైన్ డ్యామేజ్
జనగామ జిల్లా కొడకండ్ల మండలం రామవరం చెరువు మూలమలుపు వద్ద గ్రానెట్ లారీ బోల్తా పడటంతో మిషన్ భగీరథ ప్రధాన పైప్ లైన్ డ్యామేజ్ కావడం వలన కొడకండ్ల పెద్దవంగర మండలాల్లోని పలు గ్రామ పంచాయతీలకు నీటి సరఫరాకు అంతరాయం కలిగింది. దీంతో గ్రామ పంచాయతీలు గ్రామ ప్రజలు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోగలరని సంబంధిత అధికారులు స్పష్టం చేశారు.
    user_Shareef pasha
    Shareef pasha
    Local News Reporter పాలకుర్తి, జనగాం, తెలంగాణ•
    12 hrs ago
  • హనుమకొండలో హరీశ్‌రావు అరెస్ట్.. బీఆర్‌ఎస్‌ కార్యకర్తల ఆందోళనతో ఉద్రిక్తత హనుమకొండ: కలెక్టరేట్ వద్ద ఉద్యోగుల మహాధర్నాకు సంఘీభావం తెలిపి తిరిగి వెళ్తున్న మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ నేత హరీశ్‌రావును పోలీసులు అరెస్టు చేశారు. దీంతో బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పోలీసులతో వాగ్వాదానికి దిగడంతో ఉద్రిక్తత నెలకొంది. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో కలెక్టరేట్ పరిసరాల్లో కొంతసేపు ట్రాఫిక్‌ స్తంభించింది. అనంతరం హరీశ్‌రావు మాట్లాడుతూ.. పాలిటెక్నిక్‌ కళాశాలలను యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ పరిధిలోకి తీసుకెళ్లే GO 97ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పాలిటెక్నిక్‌లను ప్రభుత్వం ఆధ్వర్యంలోనే కొనసాగించాలని కోరారు. విద్యార్థులు ఆందోళనలు చేస్తున్నా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు.
    1
    హనుమకొండలో హరీశ్‌రావు అరెస్ట్.. బీఆర్‌ఎస్‌ కార్యకర్తల ఆందోళనతో ఉద్రిక్తత
హనుమకొండ: కలెక్టరేట్ వద్ద ఉద్యోగుల మహాధర్నాకు సంఘీభావం తెలిపి తిరిగి వెళ్తున్న మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ నేత హరీశ్‌రావును పోలీసులు అరెస్టు చేశారు. దీంతో బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పోలీసులతో వాగ్వాదానికి దిగడంతో ఉద్రిక్తత నెలకొంది. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో కలెక్టరేట్ పరిసరాల్లో కొంతసేపు ట్రాఫిక్‌ స్తంభించింది.
అనంతరం హరీశ్‌రావు మాట్లాడుతూ.. పాలిటెక్నిక్‌ కళాశాలలను యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ పరిధిలోకి తీసుకెళ్లే GO 97ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పాలిటెక్నిక్‌లను ప్రభుత్వం ఆధ్వర్యంలోనే కొనసాగించాలని కోరారు. విద్యార్థులు ఆందోళనలు చేస్తున్నా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు.
    user_M D Azizuddin
    M D Azizuddin
    జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    7 hrs ago
  • లారీ బోల్తాపడి పగిలిన మిషన్ భగీరథ పైప్ లైన్........... జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గ పరిధిలోని కొడకండ్ల మండలం రామవరం చెరువు మూలమలుపు వద్ద గ్రానెట్ లారీ బోల్తాపడిన సంఘటన చోటుచేసుకుంది.గురువారం జరిగిన ఈ ఆకస్మిక సంఘటనలో మిషన్ భగీరథ ప్రధాన పైప్ లైన్ పై లారీ పడడంతో పైప్ లైన్ పగిలిపోయినట్లు స్థానికులు తెలిపారు.దీంతో కొడకండ్ల,పెద్దవంగర మండలాల గ్రామ పంచాయతీలకు నీటి సరఫరాలో అంతరాయం కలుగుతుందని వివరించారు. సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
    1
    లారీ బోల్తాపడి పగిలిన మిషన్ భగీరథ పైప్ లైన్...........
జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గ పరిధిలోని కొడకండ్ల మండలం రామవరం చెరువు మూలమలుపు వద్ద గ్రానెట్ లారీ బోల్తాపడిన సంఘటన చోటుచేసుకుంది.గురువారం జరిగిన ఈ ఆకస్మిక సంఘటనలో మిషన్ భగీరథ ప్రధాన పైప్ లైన్ పై లారీ పడడంతో  పైప్ లైన్ పగిలిపోయినట్లు స్థానికులు తెలిపారు.దీంతో కొడకండ్ల,పెద్దవంగర మండలాల గ్రామ పంచాయతీలకు నీటి సరఫరాలో అంతరాయం కలుగుతుందని వివరించారు. సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
    user_Devender Pasunoori
    Devender Pasunoori
    Local News Reporter జనగాం, జనగాం, తెలంగాణ•
    9 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.