కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సర్వేల పేర్లతో బీసీలను అవమాన పరుస్తున్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పునర్విభజన, సమగ్ర కుటుంబ సర్వే పేరుతో బీసీలకు తీవ్ర అన్యాయం చేస్తున్నాయని మాజీమంత్రి, brs జిల్లా అధ్యక్షులు జోగురామన్న ధ్వజమెత్తారు. పట్టణంలోని brs పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని ప్రభుత్వాల విధానాలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి ఉపకులాల సర్వేలో బీసీలను తక్కువ చేసి చూపిస్తూ బీసీలను అవమానపరుస్తున్నారని అన్నారు. ప్రధాని, ముఖ్యమంత్రి ఇద్దరు సర్వేల పేరుతో బీసీలను అవమానపరుస్తున్నారని ఆరోపించారు. బీసీ సమగ్ర గణనపై కాంగ్రెస్ మంత్రులు సైతం అసంతృప్తిగా ఉన్నారని పేర్కొన్నారు. బీసీలపై ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి ఉంటే మండలాలను పైలెట్ ప్రాజెక్టుగా ఎన్నుకుని సర్వే జరపాలని డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని ప్రజల ముందుంచుతామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో అన్నెల వసంత్,దాసరి రమేష్, అశోక్ స్వామి, సేవ్వ జగదీష్, గంగయ్య, ధరవేణి రాము,జంగిలి ప్రశాంత్,కలిమ్, వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సర్వేల పేర్లతో బీసీలను అవమాన పరుస్తున్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పునర్విభజన, సమగ్ర కుటుంబ సర్వే పేరుతో బీసీలకు తీవ్ర అన్యాయం చేస్తున్నాయని మాజీమంత్రి, brs జిల్లా అధ్యక్షులు జోగురామన్న ధ్వజమెత్తారు. పట్టణంలోని brs పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని ప్రభుత్వాల విధానాలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి ఉపకులాల సర్వేలో బీసీలను తక్కువ చేసి చూపిస్తూ బీసీలను అవమానపరుస్తున్నారని అన్నారు. ప్రధాని, ముఖ్యమంత్రి ఇద్దరు సర్వేల పేరుతో బీసీలను అవమానపరుస్తున్నారని ఆరోపించారు. బీసీ సమగ్ర గణనపై కాంగ్రెస్ మంత్రులు సైతం అసంతృప్తిగా ఉన్నారని పేర్కొన్నారు. బీసీలపై ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి ఉంటే మండలాలను పైలెట్ ప్రాజెక్టుగా ఎన్నుకుని సర్వే జరపాలని డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని ప్రజల ముందుంచుతామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో అన్నెల వసంత్,దాసరి రమేష్, అశోక్ స్వామి, సేవ్వ జగదీష్, గంగయ్య, ధరవేణి రాము,జంగిలి ప్రశాంత్,కలిమ్, వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు
- ప్రభుత్వ పాఠశాలలతో విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉంటుందని లక్షెట్టిపేట మండలంలోని దౌడేపల్లి పాఠశాల హెచ్ఎం గిరిధర్ అన్నారు. శుక్రవారం గ్రామంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులతో కలిసి ముందస్తు బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులువిద్యార్థులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. విద్యార్థుల మంచి భవిష్యత్తుకు పునాది ప్రభుత్వ పాఠశాలలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు సతీష్ ఉన్నారు.1
- *ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు త్వరితగతిన అట్టి వ్యక్తిని కాపాడడానికి సిపిఆర్ ఎంతో ఉపయోగపడుతుంది పోలీస్ కమిషనర్ వెల్లడి* *జిల్లా వ్యాప్తంగా కార్యక్రమాల నిర్వహణ* *ప్రతి ఒక్కరూ సిపిఆర్ పద్ధతి అవగాహన కలిగి ఉండవలెను* రాష్ట్ర ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న *99 రోజుల ప్రజాపాలన - ప్రగతి ప్రణాళికలో* భాగంగా రోడ్డు ప్రమాదాలు నియంత్రించడం ప్రజలలో ట్రాఫిక్ నియమాలు పట్ల బాధ్యత భావం పెంపొందించడం లక్ష్యంగా అరైవ్ ఆలైవ్ కార్యక్రమాన్ని ఏప్రిల్ 13 నుండి 18 వరకు జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా నిర్వహిస్తున్నారు . ఇందులో భాగముగా నేడు ఐదవ రోజు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ హాల్ యందు బ్లూ కోర్టు సిబ్బందికి మరియు ఆటో డ్రైవర్లకు సిపిఆర్ పద్ధతి పై అవగాహన కార్యక్రమం నిర్వహించగా *గౌరవనీయులు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ పి.సాయి చైతన్య, ఐ.పీ.ఎస్*., గారు హాజరు కావడం జరిగింది. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ గారు మాట్లాడుతూ “అరైవ్ అలైవ్” కార్యక్రమంలో భాగంగా ప్రాణరక్షణకు సంబంధించిన అత్యవసర నైపుణ్యాలపై అవగాహన కల్పించడం అత్యంత అవసరమని పోలీస్ కమిషనర్ గారు పేర్కొన్నారు. ముఖ్యంగా పోలీసు సిబ్బంది, ఆటో డ్రైవర్లు వంటి ప్రజలతో నిత్యం సంబంధం కలిగిన వర్గాలు తప్పనిసరిగా CPR (Cardiopulmonary Resuscitation) విధానం గురించి పూర్తి స్థాయిలో అవగాహన కలిగి ఉండాలని ఆయన సూచించారు. ప్రస్తుతం గుండెపోటు, రోడ్డు ప్రమాదాలు వంటి అత్యవసర పరిస్థితుల్లో బాధితులకు తక్షణ సహాయం అందించడంలో సిపిఆర్ కీలక పాత్ర పోషిస్తుందని ఆయన తెలిపారు. అయితే సమాజంలో ఇంకా చాలామందికి ఈ పద్ధతి పై సరైన అవగాహన లేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు కమిషనర్ గారు తెలిపారు. ఈ శిక్షణలో సిపిఆర్ విధానం , ప్రాథమిక ప్రథమ చికిత్స (First Aid), అత్యవసర పరిస్థితుల్లో ఎలా స్పందించాలి వంటి అంశాలను నిపుణుల ద్వారా వివరించనున్నారు. ప్రతి పోలీసు సిబ్బంది, ఆటో డ్రైవర్లు మాత్రమే కాకుండా సాధారణ ప్రజలు కూడా ఈ శిక్షణలో పాల్గొని అవగాహన పెంచుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. సమయానికి సరైన సహాయం అందిస్తే అనేక ప్రాణాలను కాపాడవచ్చని, అందుకు సిపిఆర్ వంటి నైపుణ్యాలు ప్రతి ఒక్కరికీ అవసరమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా సమాజంలో భద్రతా చైతన్యం పెంపొందించి, అత్యవసర పరిస్థితుల్లో తక్షణ స్పందన సామర్థ్యాన్ని పెంచడమే ప్రధాన లక్ష్యమని పోలీస్ కమిషనర్ గారు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ అదనపు డీ.సీ.పీ (అడ్మిన్) శ్రీ జి.బస్వా రెడ్డి , నిజామాబాద్ ట్రాఫిక్ ఏ.సీ.పి శ్రీ మస్తాన్ అలీ, జిల్లా స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శ్రీ శ్రీశైలం , ట్రాఫిక్ సి ఐ శ్రీ ప్రసాద్ , ట్రాఫిక్ రిజర్వ్ ఇన్స్పెక్టర్ శ్రీ వినోద్ , డాక్టర్ శ్రీ విశాల్ (ఐ.ఎమ్.ఏ ప్రెసిడెంట్ ) , డాక్టర్ రామనేశ్వర్ ( న్యూరాలజిస్ట్ , ( ఐ.ఎమ్.ఏ ట్రెజరీ ), డాక్టర్ శ్రీశైలం (పీడియాట్రెస్ట్) , డాక్టర్ విట్టల్ ఆనస్తేషియా స్పెషలిస్ట్, మరియు ఐటీ కోర్స్ సిబ్బంది, బ్లూ కోర్ట్ సిబ్బంది , ఆటో డ్రైవర్లు తదితరులు పాల్గొన్నారు.3
- Post by Boke saikumar Boke saikumar1
- రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి వారిని తెలంగాణ రాష్ట్ర రైల్వే మరియు రోడ్డు భద్రత ఐజీపి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈసందర్భంగా ఆలయానికి చేరుకున్న ఐజిపి కి ఆలయ అర్చకులు,వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.దర్శనం అనంతరం ఆలయ మండపంలో స్వామివారి శేషవస్త్రం కప్పి, లడ్డూ ప్రసాదాన్ని అందజేసి ఆశీర్వచనం ఇచ్చారు.వారి వెంట వేములవాడ డీఎస్పీ శ్రీనివాసులు, సీఐ వీరప్రసాద్,ఆర్.ఐ సురేష్, ఎస్సైలు,అలాగే ప్రోటోకాల్ ఏఈఓ జి. అశోక్ కుమార్,ఆలయ పర్యవేక్షకులు ఎన్. రాజేందర్, ఆలయ ఉద్యోగులు కూడా హాజరయ్యారు.1
- కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండల కార్యాలయంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక సభలో రెండువర్గాల మధ్య ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.ఓ వర్గానికి చెందిన మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ను అధికారులు వేదిక పై పిలిచి సర్పంచును వేదిక పై పిలవకపోవడంతో అధికారులను సర్పంచ్ ప్రథమ పౌరుని అయిన మాకు ఎందుకు పిలవలేదనీ సర్పంచ్ ధర్మతేజ అధికారులను నిలదీశాడు.అంతలోనే ఇరువర్గాల మధ్య వాగ్వివాదం జరిగింది. ధర్మ తేజ,మండల సర్పంచ్ లు క్రింద నేల పై కూర్చుండి నిరసన తెలిపారు.వారిని పోలీసులు సముదాయించి కుర్చీల్లో కూర్చోపెట్టారు.1
- చిగురుమామిడి మండలం లంబాడిపల్లిలో విషాదం చోటుచేసుకుంది. పొలం నుంచి వడ్ల లోడుతో వస్తున్న ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ కాటం కిషన్ రెడ్డి అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి దర్యాప్తు చేస్తున్నారు. ధాన్యం తరలిస్తుండగా జరిగిన ఈ ప్రమాదం గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.1
- I stand with you, and once I am in power, I will give them back to you. Together, we will protect your livelihoods and ensure that privatization never harms Andhra Pradesh’s future.1
- రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని రాజీవ్ నగర్ కు చెందిన కూన లక్ష్మీ అనే మహిళ ఈ నెల 13వ తేదీన హత్యకు గురికాగా పోలీసులు హత్య కేసును ఛేదించి నిందితుడి వివరాలను సిరిసిల్ల డిఎస్పి కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించి వెల్లడించారు. ఈ సందర్భంగా నాగేంద్ర చారి మాట్లాడుతూ.. ఒంటరిగా ఉంటున్న కూనలక్ష్మిని గమనించిన గడీల రాజు అనే వ్యక్తి మద్యానికి బానిసై జల్సాలకు డబ్బులు సరిపోనందున ఎలా అయినా డబ్బులు సంపాదించాలనుకుని కొంత కాలం నుండి రాజీవ్ నగర్ లో ఇంటిలో లక్ష్మీ ఒక్కతే ఉండడాన్ని గమనించి ఇంట్లోకి వెళ్లి కత్తెరతో హత్య చేసి 2000 రూపాయలు నగదు, రెండు చీరలు, బ్యాంకు పాసుబుక్కులు, రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్డు, హ్యాండీక్యాప్డ్ సర్టిఫికెట్ లు తీసుకెళ్లినట్లు చెవులకు ఉన్న బంగారు పుల్లలు తీయడానికి ప్రయత్నించగా అవి రాకపోవడంతో తన వద్ద ఉన్న కత్తెరతో రెండు చెవులను కత్తిరించి ఇంటికి తీసుకుపోయి అవి కడిగే ప్రయత్నం చేయగా ఆ బంగారు పోగులు పడిపోయాయని తెలిపారు. సాంకేతికత ఆధారంగా నిందితుని పట్టుకోవడం జరిగిందని అతని వద్ద నుండి హత్యకు ఉపయోగించిన కత్తెర రెండు చీరలు బ్యాంకు పాసుబుక్కులు రాజీవ్ ఆరోగ్యశ్రీ హ్యాండీక్యాప్డ్ సర్టిఫికెట్లు 2000 రూపాయలను స్వాధీనం చేసుకోవడం జరిగిందని తెలిపారు.1
- Post by Vishwamber Rao1