Shuru
Apke Nagar Ki App…
*నేపాల్‌లో చిక్కుకుపోయిన సద్గురు జగ్గీ వాసుదేవ్ బృందం..* కైలాష్ యాత్రకు వెళ్లిన 300 మంది ఈశా ఫౌండేషన్ సభ్యులు.. వరదల్లో గల్లంతైన ఈశా ఫౌండేషన్‌కు చెందిన 77 మంది యాత్రికులు.. కైసాల్ మానససరోవర్ యాత్ర నుంచి తిరిగి వస్తుండగా మిస్సింగ్.. గల్లంతైనవారిలో 50 మంది భారతీయులు.. మొత్తం 19 దేశాలకు చెందిన యాత్రికులు ఉన్నట్లు గుర్తింపు.. ప్రస్తుతం టిబెట్‌లోనే జగ్గీ వాసుదేవ్.. టిబెట్‌లోని గైరాంగ్‌కు వెళ్లేందుకు అనుమతివ్వాలని చైనాకు వినతి....
Seelam Ashok Reddy Flex Print
*నేపాల్‌లో చిక్కుకుపోయిన సద్గురు జగ్గీ వాసుదేవ్ బృందం..* కైలాష్ యాత్రకు వెళ్లిన 300 మంది ఈశా ఫౌండేషన్ సభ్యులు.. వరదల్లో గల్లంతైన ఈశా ఫౌండేషన్‌కు చెందిన 77 మంది యాత్రికులు.. కైసాల్ మానససరోవర్ యాత్ర నుంచి తిరిగి వస్తుండగా మిస్సింగ్.. గల్లంతైనవారిలో 50 మంది భారతీయులు.. మొత్తం 19 దేశాలకు చెందిన యాత్రికులు ఉన్నట్లు గుర్తింపు.. ప్రస్తుతం టిబెట్‌లోనే జగ్గీ వాసుదేవ్.. టిబెట్‌లోని గైరాంగ్‌కు వెళ్లేందుకు అనుమతివ్వాలని చైనాకు వినతి....
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- టెలిగ్రామ్, వాట్సాప్‌లో స్టాక్ టిప్స్ పేరుతో మోసాలు–ప్రజలు అప్రమత్తంగా ఉండాలి గ్రామంలో టెలిగ్రామ్, వాట్సాప్ వంటి సోషల్ మీడియా వేదికల ద్వారా వచ్చే స్టాక్ మార్కెట్ టిప్స్, అధిక లాభాల హామీలను నమ్మి మోసపోవద్దని చిల్లకల్లు ఎస్సై సూర్య శ్రీనివాస్ ప్రజలకు సూచించారు. సైబర్ నేరగాళ్లు సోషల్ మీడియాలో ఆకర్షణీయమైన ప్రకటనలు, ఫేక్ స్టాక్ టిప్స్, భారీ రాబడుల హామీలతో ప్రజలను తమ వలలోకి లాగుతున్నారని పోలీసులు హెచ్చరిస్తున్నారు. మొదట చిన్న మొత్తంలో పెట్టుబడి పెట్టించి లాభాలు వచ్చినట్లు నమ్మించి, ఆ తర్వాత పెద్ద మొత్తంలో డబ్బులు పెట్టించే విధంగా మోసాలకు పాల్పడుతున్నారని తెలిపారు.ఎక్కువ లాభాలు వస్తాయి రిస్క్ ఉండదు గ్యారంటీ రిటర్న్స్ అంటూ వచ్చే సందేశాలు, అనుమానాస్పద లింకులు, తెలియని వ్యక్తుల పెట్టుబడి సలహాలను ప్రజలు నమ్మవద్దని ఎస్సై సూచించారు. వ్యక్తిగత వివరాలు, బ్యాంక్ ఖాతా సమాచారం, OTPలు, పాస్‌వర్డ్‌లు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరులతో పంచుకోవద్దన్నారు.ఇలాంటి మోసానికి గురైన వెంటనే ఆలస్యం చేయకుండా సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ 1930కు కాల్ చేయాలని, ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచించారు.ప్రజలు అత్యాశకు పోకుండా, పెట్టుబడులకు సంబంధించిన విషయాల్లో పూర్తి వివరాలు పరిశీలించిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలని చిల్లకల్లు ఎస్సై సూర్య శ్రీనివాస్ సూచించారు.1
- తిరుమలాయపాలెం మండలం గోపాలపురంలో పాఠశాల భవన నిర్మాణానికి రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శ్రీనివాస రెడ్డి శంకుస్థాపన చేశారు ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం గోపాలపురంలో పాఠశాల భవన నిర్మాణానికి రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శ్రీనివాస రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విద్య,వైద్యానికి పెద్దపీట వేశామన్నారు.రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో టెక్నీకల్ విద్య కోసం ఒక ATC ని ఏర్పాటు చేస్తున్నామని ఆయన చెప్పారు.ఇందిరమ్మ ప్రభుత్వం పేదలకు మెరుగైన వైద్యం అందిస్తుందని ఆయన తెలిపారు.రెండున్నర సంవత్సరాల్లో డ్వాక్రా మహిళలకు 63 వేల కోట్ల రూపాయలు సున్నా వడ్డీకి రుణాలు ఇచ్చామని ఆయన వెల్లడించారు.వచ్చే నెల నుంచి అర్హులైన వారికి పెన్షన్లు ఇస్తామని ఆయన స్పష్టం చేశారు..1
- కృష్ణాజిల్లా: మచిలీపట్నం *మద్యం నియంత్రణ ఇదేనా..? బెల్ట్ షాపులకు విచ్చలవిడిగా అనుమతులా?* * కల్లుగీత కార్మికుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వాకా రామచంద్రరావు ఫైర్.... మద్యం దశలవారీగా అరికడతామని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన ప్రభుత్వం ఇప్పుడు బెల్ట్ షాపులకు అనుమతులు ఇచ్చి మద్యం విక్రయాలను మరింత పెంచుతోందని ఆంధ్రప్రదేశ్ కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వాకా రామచంద్రరావు తీవ్రస్థాయిలో ఆరోపించారు.కృష్ణాజిల్లా మచిలీపట్నంలో గురువారం ఆంధ్రప్రదేశ్ కల్లుగీత కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఎక్సైజ్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు. అనంతరం ఎక్సైజ్ సూపరింటెండెంట్ గంగాధర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వాకా రామచంద్రరావు మాట్లాడుతూ కల్లుగీత వృత్తి రాష్ట్రంలో రోజురోజుకూ కనుమరుగవుతోందని, దీనికి ప్రభుత్వ విధానాలే ప్రధాన కారణమని ఆరోపించారు. ఎన్నికల ముందు మద్యం దశలవారీగా నియంత్రిస్తామని చెప్పిన ప్రభుత్వం.. ఇప్పుడు బెల్ట్ షాపులను దశలవారీగా అభివృద్ధి చేస్తున్నట్టుగా పరిస్థితి కనిపిస్తోందని విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా బెల్ట్ షాపులు విపరీతంగా పెరిగిపోయాయని, అనధికారికంగా పెద్దఎత్తున డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయని ఆయన అన్నారు. కల్లుగీత కార్మికుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని, వారికి ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. కల్లుగీత కార్మికుల సమస్యలను నిర్లక్ష్యం చేస్తే గత ప్రభుత్వాలకు పట్టిన గతే ఈ ప్రభుత్వానికి పడుతుందని వాకా రామచంద్రరావు హెచ్చరించారు. కల్లుగీత వృత్తిని పరిరక్షించడంతో పాటు కార్మికుల జీవనోపాధికి భరోసా కల్పించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.1
- తిరుమలాయపాలెం మండలం గోపాలపురం గ్రామంలో ప్రైమరీ నూతన భవనానికి శంకుస్థాపన చేసిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. తిరుమలాయపాలెం మండలం ఎర్రగడ్డ గ్రామపంచాయతీ గోపాలపురంలో ఈరోజు రాష్ట్ర రెవిన్యూ గృహ నిర్మాణ సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రత్యేక ఆహ్వానితులుగా పాల్గొని గత కొంతకాలంగా శిధిలావస్థలో ఉన్న మంజూరు చేయించి ఆ నూతన భవనానికి ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. మండలంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతంగా నిర్వహించినారు.1
- నోట్లో గోల్డ్ క్యాప్సూల్స్ ఎయిర్‌పోర్టులో చిక్కిన ప్యాసింజర్ దుబాయ్ నుంచి బెంగళూరులోని కెంపెగౌడ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నాడు ఓ ప్రయాణికుడు అటు నుంచి ఘాజియాబాద్‌కు వెళ్లాల్సి ఉండగా అతని ప్రవర్తన పట్ల అధికారులకు అనుమానం వచ్చింది దాంతో సీఐఎస్ఎఫ్ సిబ్బంది తనిఖీలు చేయగా!!!1
- పెడన పట్నంలోని ప్రధాన రహదారిలో ప్రమాద భరితంగా మారిన విద్యుత్ స్తంభం పెడన పట్నంలోని ప్రధాన రహదారిలో విద్యుత్ స్తంభం ప్రమాద భరితంగా మారింది. పెడన మెయిన్ రోడ్ లోని సంత మార్కెట్ సమీపం డాక్టర్ అశోక్ హాస్పిటల్ ఎదురుగా రోడ్డు డివైడర్ పై ఉన్న విద్యుత్ లైట్ స్తంభం కూలిపోవడానికి సిద్ధంగా ఉంది. లారీ రివర్స్ చేస్తా ఉండగా స్తంభానికి తాకడం వల్ల స్తంభం పాక్షికంగా దెబ్బతిందని స్థానిక ప్రజలు చెబుతున్నారు. ఈ రహదారిలో ప్రతిక్షణం వందలాది వాహనాలు వాహనదారులు రాకపోకలు సాగిస్తూ ఉంటారు ప్రమాదవశాత్తు ఈ విద్యుత్ స్తంభం కూలితే ఘోర ప్రమాదం జరిగి ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉందని స్థానిక ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు దీనిపై స్థానిక మున్సిపల్ అధికారులకు తెలియజేసిన ఎవరు స్పందించడం లేదని ప్రజలు వాపోతున్నారు. మున్సిపల్ కమిషనర్ మరియు పెడన పోలీస్ శాఖ అధికారులుస్పందించి యుద్ధ ప్రాతిపదికన కోలడానికి సిద్ధంగా ఉన్న విద్యుత్ స్తంభంకు మరమ్మతులు నిర్వహించాలని ప్రజలు కోరుకుంటున్నారు.1
- నేలకొండపల్లిలో మాజీ పిడిఎస్ యు మిత్రుల ఆత్మీయ సమావేశం జరిగింది. ఒకప్పుడు పీడీఎస్ పార్టీలో కలిసి పనిచేసిన కార్యకర్తలు ఏళ్ల తర్వాత ఒకే వేదికపైకి వచ్చారు ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో మాజీ పిడిఎస్ యు మిత్రుల ఆత్మీయ సమావేశం జరిగింది. ఒకప్పుడు పీడీఎస్ పార్టీలో కలిసి పనిచేసిన కార్యకర్తలు ఏళ్ల తర్వాత ఒకే వేదికపైకి వచ్చారు. ఈ సమావేశంలో ప్రస్తుతం వివిధ పార్టీలలో ఉన్న వారు వివిధ రంగాల్లో ఉన్న వారు పాల్గొన్నారు.ఒకప్పుడు పార్టీలో పనిచేసినప్పుడు చేసిన ఉద్యమాలు, పోరాటాలు, ప్రజల కోసం చేసిన పనులను నెమరు వేసుకున్నారు. తమ గత స్మృతులను ఒకరికొకరు పంచుకున్నారు. రాజకీయంగా వేర్వేరు పార్టీల్లో ఉన్నా.. ఆనాటి స్నేహం, ఆత్మీయత ఇంకా అలాగే ఉందని వారు ఆనందం వ్యక్తం చేశారు. ఇలాంటి కలయికలు మరిన్ని జరగాలని కోరుకున్నారు.1
- గంగా నదిలో చూస్తుండగానే మునిగిపోయిన బోటు చూస్తుండగానే మునిగిపోయిన బోటు.... బిహార్లోని భాగల్పూర్ జిల్లాలో పడవ ప్రమాదం జరిగింది. ఉద్ధృతంగా ప్రవహిస్తున్న గంగానదిలో ఓ పడవ బోల్తా పడింది. అందులోని 21 మంది కూలీలు ప్రవాహంలో మునిగిపోయారు. SDRF వేగంగా స్పందించి 20 మందిని కాపాడగా మరో కార్మికుడి ఆచూకీ గల్లంతయింది. వరద నివారణ చర్యల్లో భాగంగా వారు నదిలోకి వెళ్లారని అధికారులు వెల్లడించారు. బోటు మునిగిపోయిన విజువల్స్ వైరల్ అవుతున్నాయి....1
- RIP రామకృష్ణ....😔🙏 కొన్ని కారణాలు వలన ఫైర్ ఆక్సిడెంట్ చేత బాధపడుతున్న రామకృష్ణ అనే వ్యక్తికి కొన్ని రోజుల క్రితం మాకు తోచిన సహాయాన్ని అందించాము. ఆ వీడియోని చూసి అతనికి సహాయం చేయడం కోసం ముందుకు వచ్చిన ఇద్దరు సోదరులు. రవి గారు 5000 నరేంద్ర గారు 2000 అందజేశారు. మేము హాస్పిటల్ కి వెళ్లి వారిని పరామర్శించి సహాయం చేయడం జరిగింది. ఈ రోజున ఉదయం 11 గంటలకు బాడీలో పూర్తిగా ఇన్ఫెక్షన్ అవ్వడం వలన తుది శ్వాసను విడిచారు.. మీ ఆత్మకు శాంతి కలగాలని టీం క్యాపో తరపున కోరుకుంటున్నాము..1