పారదర్శకంగా పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ ప్రతిపాదిత కొత్త కేంద్రాలను పరిశీలించిన ఎన్నికల నమోదు అధికారి, ఆర్డీవో కృష్ణవేణి భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్–2026 కార్యక్రమంలో భాగంగా పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ ప్రక్రియను పారదర్శకంగా, సమర్థవంతంగా అమలు చేయాలని ఎన్నికల నమోదు అధికారి, ఆర్డీవో కె. కృష్ణవేణి అధికారులను ఆదేశించారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్–2026 కార్యక్రమంలో భాగంగా జిల్లాలో పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు. శుక్రవారం ములుగు మండలంలోని చింతకుంట, జగ్గన్నగూడెం గ్రామాల్లో ప్రతిపాదిత కొత్త పోలింగ్ కేంద్రాలను ఎన్నికల నమోదు అధికారి ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రతిపాదిత పోలింగ్ కేంద్రాలుగా గుర్తించిన భవనాల స్థితిగతులు, ఓటర్లకు సులభంగా చేరుకునే వీలుందా లేదా, తాగునీరు, విద్యుత్, మరుగుదొడ్లు, వేచి ఉండేందుకు తగిన స్థలం, దివ్యాంగులు, వృద్ధులు సులభంగా ఓటు హక్కు వినియోగించుకునేందుకు ర్యాంపుల ఏర్పాటు వంటి మౌలిక సదుపాయాలను ఆమె క్షుణ్ణంగా పరిశీలించారు. అలాగే పోలింగ్ కేంద్రాల పరిధి, ఓటర్ల సంఖ్య, గ్రామాల భౌగోళిక పరిస్థితులు, ఓటర్ల ప్రయాణ దూరం తగ్గేలా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణలో ఎన్నికల సంఘం జారీ చేసిన మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని, ప్రతి ఓటరుకు సౌకర్యవంతమైన, పారదర్శకమైన, సులభమైన ఓటింగ్ వాతావరణం కల్పించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ప్రతిపాదిత కేంద్రాల్లో ఉన్న లోపాలను వెంటనే గుర్తించి, ఎన్నికలకు ముందే అన్ని మౌలిక వసతులు పూర్తి చేయాలని ఆదేశించారు. అనంతరం గ్రామస్థులతో మాట్లాడిన ఎన్నికల నమోదు అధికారి, ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలింగ్ కేంద్రాల ఏర్పాటు చేపడుతున్నామని తెలిపారు. ఎన్నికల నిర్వహణలో ప్రజల సహకారం ఎంతో అవసరమని, అధికారులు, సిబ్బంది సమన్వయంతో ఎన్నికల సంఘం లక్ష్యాలను విజయవంతంగా అమలు చేయాలని పేర్కొన్నారు. ఈ పరిశీలన కార్యక్రమంలో ములుగు తహసీల్దార్ ఎన్. విజయ భాస్కర్, బూత్ లెవల్ అధికారులు, రెవెన్యూ శాఖ సిబ్బంది, ఇతర సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

- *ములుగు:* చావుతో పోరాడుతూ అనంతలోకాలకు చేరుకున్న BRS సీనియర్ నాయకుడు, నర్సంపేట్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి హైదరాబాద్‌లోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం అర్థరాత్రి 12:51 గంటలకు తుదిశ్వాస విడిచారు.1
- నర్సంపేట పట్టణంలోని అమరవీరుల స్థూపం వద్ద పెద్ది సుదర్శన్ రెడ్డికి నివాళులర్పించేందుకు అభిమానులు... తెలంగాణ ఉద్యమ క్షేత్రంలో.. నర్సంపేట రాజకీయాల్లో చెరగని ముద్ర వేసిన కీలక నేత, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అకాల మృతి చెందడం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగిస్తోంది. ఆయన మరణవార్తతో గులాబీ శ్రేణులు, తెలంగాణ ఉద్యమకారులు తీవ్ర శోకసముద్రంలో మునిగిపోయారు. పెద్ది సుదర్శన్ రెడ్డి భౌతిక కాయం నర్సంపేట మీదుగా ఆయన స్వగ్రామమైన నల్లబెల్లికి తరలిస్తుండటంతో.. అశేష జనవాహిని నర్సంపేట వైపు కదలివస్తోంది. తమ ప్రియతమ నాయకుడిని ఆఖరిసారి చూసుకునేందుకు కార్యకర్తలు, ప్రజలు భారీగా తరలివస్తున్నారు.నర్సంపేట పట్టణంలోని అమరవీరుల స్థూపం వద్ద పెద్ది సుదర్శన్ రెడ్డికి నివాళులర్పించేందుకు అభిమానులు, పార్టీ నాయకులు భారీ సంఖ్యలో వేచి చూస్తున్నారు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో పెద్ది సుదర్శన్ రెడ్డి పోషించిన పాత్రను, నర్సంపేట నియోజకవర్గ అభివృద్ధికి ఆయన చేసిన సేవలను ఈ సందర్భంగా తోటి ఉద్యమకారులు గుర్తు చేసుకుంటున్నారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని తలచుకుంటూ కార్యకర్తలు కన్నీరు మున్నీరవుతున్నారు. పెద్ది సుదర్శన్ రెడ్డి అమర్ రహే అంటూ నర్సంపేట నినాదాలతో మారుమోగుతోంది.2
- *పత్రిక మరియు మీడియా మిత్రులకు నమస్కారములు* 🙏🙏🙏🙏🙏 *ఢిల్లీ లోని తెలంగాణ భవన్ అమరవీరుల స్తూపం దగ్గర పెద్ది సుదర్శన్ రెడ్డి చిత్రపటనికి నివాళులు అర్పించిన కాజిపేట్ బి ఆర్ యస్ పార్టీ నాయకులు *ఢిల్లీ లోని తెలంగాణ భవన్ అమరవీరుల స్తూపం దగ్గర పెద్ది సుదర్శన్ రెడ్డి చిత్రపటానికి నివాళులు* ఈరోజు ఢీల్లి లోని తెలంగాణ భవన్ అమరవీరుల స్థూపం దగ్గర పెద్ది సుదర్శన్ రెడ్డి చిత్రపటానికి నివాళులు అర్పించిన కాజిపేట్ బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు ఈ కార్యక్రమం లో ఉద్దేశించి బి ఆర్ ఎస్ పార్టీ రాష్ట్ర మాజీ కార్యదర్శి *నార్లగిరి రమేష్* మాజీ కార్పొరేటర్ *జోరిక రమేష్* గార్లు మాట్లాడుతూ పెద్ది సుదర్శన్ రెడ్డి గారి మరణం ఉమ్మడి వరంగల్ జిల్లాకే కాకుండా బి ఆర్ ఎస్ పార్టీ కి తీరని నష్టమని పెద్ది సుదర్శన్ రెడ్డి తెలంగాణ మలిదిశ ఉద్యమాన్ని నడిపిన ఉద్యమ నాయకుడు అని మచ్చలేని ఎమ్మెల్యేగా సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ గా ప్రజలకు ఎన్నో సేవలు చేశాడని పెద్దికి రైతుల పట్ల ఉద్యమకారుల పట్ల ఏదో ఒకటి చేయాలనే తపన ఉండేదని 2001 నుండి పెద్ది సుదర్శన్ రెడ్డితో ఉద్యమంలో కలిసి పనిచేసినమని పెద్దన్న మరణం నాలాంటి ఉద్యమకారులకు బి ఆర్ ఎస్ పార్టీకి తీవ్ర నష్టమని వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూన్నాము అని తెలియజేసినారు ఇంకా ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ పార్టీ అర్బన్ జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి *గబ్బెట శ్రీనివాస్* శిరుమల్ల దశరథం సంకు నర్సింగ రావు MD ఆఫ్జాల్ MD హుస్సేన్ సుంచు అశోక్ కోండ్ర శంకర్ తండమళ్ళ వేణు కుమ్మరి రాజ్ కుమార్ పోలేపల్లి రామ్మూర్తి గడ్డం రఘు వంశీ మాచర్ల గణేష్ కనకం రమేష్ మారపాక గణేష్ రాబర్ట్ అయాన్ జుబేర్ తదితరులు పాల్గొన్నారు *మీ.. గబ్బేట శ్రీనివాస్ బి ఆర్ యస్ పార్టీ అర్బన్ జిల్లా ప్రధాన కార్యదర్శి* 86866186642
- దొంగతనం కేసులో ట్విస్ట్.. పోలీసులకు ఫిర్యాదు చేయబోతే సీసీటీవీలో కనిపించిన అసలు దొంగ ఎలుక! కర్ణాటక: తుమకూరులోని ఓ బంగారు ఆభరణాల దుకాణంలో ఆభరణాలు కనిపించకుండా పోవడంతో సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యారు. అయితే ముందుగా సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించగా, ఓ ఎలుక ఒక్కో ఉంగరం, చిన్న ఆభరణాలను నోటితో తీసుకెళ్లడం కనిపించింది. దీంతో ఎలుక బొరియను పరిశీలించగా 10 బంగారు ఉంగరాలు, మూడు బంగారు చైన్లు లభించాయి. వీటి విలువ సుమారు రూ.10 లక్షలు ఉంటుందని దుకాణ యాజమాన్యం తెలిపింది. మెరిసే వస్తువులను తన గూటిలోకి తీసుకెళ్లే అలవాటు వల్లే ఎలుక ఆభరణాలను తరలించినట్లు భావిస్తున్నారు.1
- మహబూబాబాద్ లోని 22వ వార్డ్ లో రోడ్లు వేయాలని సిపిఐ వినూత్న నిరసన.. మహబూబాబాద్‌లోని 22వ వార్డులో రూ.50 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణ పనులను వెంటనే చేపట్టాలని డిమాండ్ చేస్తూ సీపీఐ నాయకులు, కార్యకర్తలు వినూత్న నిరసన చేపట్టారు. రోడ్డు అధ్వానంగా ఉండటంతో కాలనీలో వరి నాట్లు వేసి తమ నిరసన వ్యక్తం చేశారు. స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని అధికారులు, ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించి సీసీ రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించాలని సీపీఐ శ్రేణులు కోరారు.1
- *పత్రిక మరియు మీడియా మిత్రులకు నమస్కారములు* 🙏🙏🙏🙏🙏 *ఢిల్లీ లోని తెలంగాణ భవన్ అమరవీరుల స్తూపం దగ్గర పెద్ది సుదర్శన్ రెడ్డి చిత్రపటానికి నివాళులు* *పత్రిక మరియు మీడియా మిత్రులకు నమస్కారములు* 🙏🙏🙏🙏🙏 *ఢిల్లీ లోని తెలంగాణ భవన్ అమరవీరుల స్తూపం దగ్గర పెద్ది సుదర్శన్ రెడ్డి చిత్రపటానికి నివాళులు* ఈరోజు ఢీల్లి లోని తెలంగాణ భవన్ అమరవీరుల స్థూపం దగ్గర పెద్ది సుదర్శన్ రెడ్డి చిత్రపటానికి నివాళులు అర్పించిన కాజిపేట్ బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు ఈ కార్యక్రమం లో ఉద్దేశించి బి ఆర్ ఎస్ పార్టీ రాష్ట్ర మాజీ కార్యదర్శి *నార్లగిరి రమేష్* మాజీ కార్పొరేటర్ *జోరిక రమేష్* గార్లు మాట్లాడుతూ పెద్ది సుదర్శన్ రెడ్డి గారి మరణం ఉమ్మడి వరంగల్ జిల్లాకే కాకుండా బి ఆర్ ఎస్ పార్టీ కి తీరని నష్టమని పెద్ది సుదర్శన్ రెడ్డి తెలంగాణ మలిదిశ ఉద్యమాన్ని నడిపిన ఉద్యమ నాయకుడు అని మచ్చలేని ఎమ్మెల్యేగా సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ గా ప్రజలకు ఎన్నో సేవలు చేశాడని పెద్దికి రైతుల పట్ల ఉద్యమకారుల పట్ల ఏదో ఒకటి చేయాలనే తపన ఉండేదని 2001 నుండి పెద్ది సుదర్శన్ రెడ్డితో ఉద్యమంలో కలిసి పనిచేసినమని పెద్దన్న మరణం నాలాంటి ఉద్యమకారులకు బి ఆర్ ఎస్ పార్టీకి తీవ్ర నష్టమని వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూన్నాము అని తెలియజేసినారు ఇంకా ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ పార్టీ అర్బన్ జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి *గబ్బెట శ్రీనివాస్* శిరుమల్ల దశరథం సంకు నర్సింగ రావు MD ఆఫ్జాల్ MD హుస్సేన్ సుంచు అశోక్ కోండ్ర శంకర్ తండమళ్ళ వేణు కుమ్మరి రాజ్ కుమార్ పోలేపల్లి రామ్మూర్తి గడ్డం రఘు వంశీ మాచర్ల గణేష్ కనకం రమేష్ మారపాక గణేష్ రాబర్ట్ అయాన్ జుబేర్ తదితరులు పాల్గొన్నారు *మీ.. గబ్బేట శ్రీనివాస్ బి ఆర్ యస్ పార్టీ అర్బన్ జిల్లా ప్రధాన కార్యదర్శి* 86866186642
- విద్యుత్ షార్ట్‌సర్క్యూట్‌తో ఫోటోగ్రాఫర్ ఇంట్లో అగ్నిప్రమాదం ములుగు జిల్లా వాజేడు మండల కేంద్రానికి చెందిన ఫోటోగ్రాఫర్ చెన్నంరాజు నివాసంలో విద్యుత్ షార్ట్‌సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం సంభవించింది. మంటలు ఇంట్లో ఉన్న గ్యాస్ సిలిండర్‌కు వ్యాపించడంతో పేలుడు చోటుచేసుకుని ఇంట్లోని గృహోపకరణాలు, ఫర్నిచర్, ఇతర విలువైన వస్తువులు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.1