logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

మెదక్ : జిల్లాలో బాల్య వివాహాల నిర్మూలన అందరి బాధ్యత మెదక్ కలెక్టరేట్ కార్యాలయ ఆవరణలో 'బాల్య వివాహము భారత్ 1- 100 రోజుల ప్రత్యేక కార్యక్రమం'లో భాగంగా మంగళవారం జిల్లా సంక్షేమ అధికారి హేమ భార్గవి తో కలిసి ప్రత్యేక ప్రచార వాహనాన్ని జెండా ఊపి అదనపు కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ వాహనంలోని మైక్ సదుపాయంతో గ్రామాలు, గిరిజన ప్రాంతాల్లో పర్యటిస్తూ బాల్యవివాహాలపై అవగాహన కల్పిస్తామన్నారు. బాల్యం ఎంతో విలువైన దశ అని, బాలబాలికలకు విద్య, ఆరోగ్యం, రక్షణ హక్కులు కల్పించడం మన అందరి బాధ్యత అని పేర్కొన్నారు. బాల్య వివాహాల వివరాలు తెలిస్తే అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరారు. జిల్లాను బాల్య వివాహ రహిత జిల్లాగా చేయడంలో అందరూ బాధ్యత వహించాలని చెప్పారు.

5 hrs ago
user_MERCY
MERCY
Local News Reporter మెదక్, మెదక్, తెలంగాణ•
5 hrs ago
27f51c27-4635-4def-8562-252b8ce28541

మెదక్ : జిల్లాలో బాల్య వివాహాల నిర్మూలన అందరి బాధ్యత మెదక్ కలెక్టరేట్ కార్యాలయ ఆవరణలో 'బాల్య వివాహము భారత్ 1- 100 రోజుల ప్రత్యేక కార్యక్రమం'లో భాగంగా మంగళవారం జిల్లా సంక్షేమ అధికారి హేమ భార్గవి తో కలిసి ప్రత్యేక ప్రచార వాహనాన్ని జెండా ఊపి అదనపు కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ వాహనంలోని మైక్ సదుపాయంతో గ్రామాలు, గిరిజన ప్రాంతాల్లో పర్యటిస్తూ బాల్యవివాహాలపై అవగాహన కల్పిస్తామన్నారు. బాల్యం ఎంతో విలువైన దశ అని, బాలబాలికలకు విద్య, ఆరోగ్యం, రక్షణ హక్కులు కల్పించడం మన అందరి బాధ్యత అని పేర్కొన్నారు. బాల్య వివాహాల వివరాలు తెలిస్తే అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరారు. జిల్లాను బాల్య వివాహ రహిత జిల్లాగా చేయడంలో అందరూ బాధ్యత వహించాలని చెప్పారు.

More news from తెలంగాణ and nearby areas
  • జిల్లాలో బాల్య వివాహాల నిర్మూలన అందరి బాధ్యత అని అదనపు కలెక్టర్ నగేష్ తెలిపారు. కలెక్టరేట్ కార్యాలయ ఆవరణలో జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్, విజన్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో మహిళాశిశు సంక్షేమ శాఖ పర్యవేక్షణలో 'బాల్య వివాహము భారత్ 1- 100 రోజుల ప్రత్యేక కార్యక్రమం'లో భాగంగా బుధవారం జిల్లా సంక్షేమ అధికారి హేమ భార్గవి తో కలిసి ప్రత్యేక ప్రచార వాహనాన్ని జెండా ఊపి అదనపు కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ వాహనంలోని మైక్ సదుపాయంతో గ్రామాలు, గిరిజన ప్రాంతాల్లో పర్యటిస్తూ బాల్యవివాహాలపై అవగాహన కల్పిస్తామన్నారు. బాల్యం ఎంతో విలువైన దశ అని, బాలబాలికలకు విద్య, ఆరోగ్యం, రక్షణ హక్కులు కల్పించడం మన అందరి బాధ్యత అని పేర్కొన్నారు. బాల్య వివాహాల వివరాలు తెలిస్తే అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరారు.జిల్లాను బాల్య వివాహ రహిత జిల్లాగా చేయడంలో అందరూ బాధ్యత వహించాలని చెప్పారు. జిల్లా సంక్షేమ అధికారి హేమ భార్గవి మాట్లాడుతూ 100 రోజుల కార్యక్రమంలో భాగంగా పాఠశాలలు, కళాశాలలు, గ్రామసభలు, ఆశ్రమ పాఠశాలలు, గిరిజన తండాల్లో విస్తృతంగా అవగాహన కల్పిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా శాఖ అధికారినీ హేమ భార్గవి, డి పి ఆర్ ఓ రామచంద్ర రాజు,జిల్లా బాలల సంరక్షణ అధికారి నాగరాజు, మహిళా శక్తి కేంద్ర కోఆర్డినేటర్ సంతోషి, విజన్ సంస్థ డైరెక్టర్ కైలాష్, ప్రాజెక్ట్ కోఆర్డినేటర్లు రాజు, శరత్ మరియు సిబ్బంది సంజీవ్, నవనీత పాల్గొన్నారు అదేవిధంగా జిల్లా బాలల సంరక్షణ సిబ్బంది ఇతర అధికారులు పాల్గొన్నారు
    1
    జిల్లాలో బాల్య వివాహాల నిర్మూలన అందరి బాధ్యత అని అదనపు కలెక్టర్ నగేష్  తెలిపారు.
కలెక్టరేట్ కార్యాలయ ఆవరణలో
జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్, విజన్ స్వచ్ఛంద సంస్థ   ఆధ్వర్యంలో మహిళాశిశు సంక్షేమ శాఖ పర్యవేక్షణలో 'బాల్య వివాహము భారత్ 1- 100 రోజుల ప్రత్యేక కార్యక్రమం'లో భాగంగా బుధవారం  జిల్లా సంక్షేమ అధికారి హేమ భార్గవి తో కలిసి ప్రత్యేక ప్రచార వాహనాన్ని జెండా ఊపి అదనపు కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ వాహనంలోని మైక్ సదుపాయంతో గ్రామాలు, గిరిజన ప్రాంతాల్లో పర్యటిస్తూ బాల్యవివాహాలపై అవగాహన కల్పిస్తామన్నారు. బాల్యం ఎంతో విలువైన దశ అని, బాలబాలికలకు విద్య, ఆరోగ్యం, రక్షణ హక్కులు కల్పించడం మన అందరి బాధ్యత అని పేర్కొన్నారు. బాల్య వివాహాల వివరాలు తెలిస్తే అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరారు.జిల్లాను బాల్య వివాహ రహిత జిల్లాగా చేయడంలో అందరూ బాధ్యత వహించాలని చెప్పారు.
జిల్లా సంక్షేమ అధికారి హేమ భార్గవి మాట్లాడుతూ  100 రోజుల కార్యక్రమంలో భాగంగా పాఠశాలలు, కళాశాలలు, గ్రామసభలు, ఆశ్రమ పాఠశాలలు, గిరిజన తండాల్లో విస్తృతంగా అవగాహన కల్పిస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా శాఖ అధికారినీ హేమ భార్గవి, డి పి ఆర్ ఓ రామచంద్ర రాజు,జిల్లా బాలల సంరక్షణ అధికారి నాగరాజు, మహిళా శక్తి కేంద్ర కోఆర్డినేటర్ సంతోషి, విజన్ సంస్థ డైరెక్టర్ కైలాష్, ప్రాజెక్ట్ కోఆర్డినేటర్లు రాజు, శరత్ మరియు సిబ్బంది సంజీవ్, నవనీత పాల్గొన్నారు అదేవిధంగా జిల్లా బాలల సంరక్షణ సిబ్బంది ఇతర అధికారులు  పాల్గొన్నారు
    user_మెదక్ న్యూస్
    మెదక్ న్యూస్
    హవేలీఘనాపూర్, మెదక్, తెలంగాణ•
    5 hrs ago
  • కొల్చారం శివారులో హైదరాబాద్ ప్రధాన రహదారి పై అతివేగంగా వస్తున్న కారు చెట్టు ను ఢీ కొట్టడం జరిగింది. ఈ సంఘటన లో మెదక్ పట్టణానికి చెందిన వీవీ సిల్క్స్ యజమాని, బిసి వై పార్టీ జిల్లా అధ్యక్షులు వనపర్తి రోహిత్ గుప్తా అక్కడిక్కడే మృతి చెందాడు. విజయవాడలో జరిగిన బీసీవై పార్టీ బిసి సింహ గర్జన కార్యక్రమానికి హాజరై తిరిగి వస్తుండగా ఈ సంఘటన చోటు చేసుకుంది. ఈ సంఘటనలో తన స్నేహితుడు కామారెడ్డి జిల్లాకు చెందిన విజయ్ తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే క్షతగాత్రున్ని 108 సహాయంతో మెదక్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. మృతుని కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు కొల్చారం పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
    1
    కొల్చారం శివారులో హైదరాబాద్ ప్రధాన రహదారి పై అతివేగంగా వస్తున్న కారు చెట్టు ను ఢీ కొట్టడం జరిగింది. ఈ సంఘటన లో మెదక్ పట్టణానికి చెందిన వీవీ సిల్క్స్ యజమాని, బిసి వై పార్టీ జిల్లా అధ్యక్షులు వనపర్తి రోహిత్ గుప్తా అక్కడిక్కడే మృతి చెందాడు. విజయవాడలో జరిగిన బీసీవై పార్టీ బిసి సింహ గర్జన కార్యక్రమానికి హాజరై తిరిగి వస్తుండగా ఈ సంఘటన చోటు చేసుకుంది. ఈ సంఘటనలో తన స్నేహితుడు కామారెడ్డి జిల్లాకు చెందిన విజయ్ తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే క్షతగాత్రున్ని 108 సహాయంతో మెదక్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. మృతుని  కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు కొల్చారం పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
    user_MERCY
    MERCY
    Local News Reporter మెదక్, మెదక్, తెలంగాణ•
    14 hrs ago
  • కామారెడ్డి : రాబోయే వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని కామారెడ్డి పట్టణ ప్రజలకు తాగునీటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని మున్సిపల్ చైర్‌పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు. బుధవారం ఆమె పట్టణంలోని బుర్ర మత్తడి, ఫిల్టర్ బెడ్లను మున్సిపల్ అధికారులతో కలిసి ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ సూచన మేరకు అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో సందర్శించారు. ఈ సందర్భంగా ఫిల్టర్ బెడ్ల పనితీరును పరిశీలించిన అనంతరం ఆమె మాట్లాడుతూ పట్టణంలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని అధికారులకు స్పష్టం చేశారు. బుర్ర మత్తడి వద్ద ప్రస్తుతం ఉన్న వనరులకు అదనంగా మరో మూడు కొత్త బోర్లు వేయించాలని, వీటికి అంతరాయం లేని విద్యుత్ సరఫరా కోసం ప్రత్యేకంగా ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాటు చేయాలని మున్సిపల్ కమిషనర్ రాజేందర్ రెడ్డి, ఏఈ వేణు ప్రసాద్‌లకు ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా ఫిల్టర్ బెడ్ల వద్ద పరిశుభ్రత విషయంలో రాజీ పడకూడదని, ప్రజలకు స్వచ్ఛమైన నీటిని అందించాలని సూచించారు. ప్రతి ఇంటికి తాగునీరు సక్రమంగా అందేలా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని కోరారు. వేసవి ప్రణాళికలో ఏవైనా లోపాలు ఉంటే సహించేది లేదని ఆమె హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రాజేందర్ రెడ్డి,ఏఈ వేణు ప్రసాద్‌లతో పాటు మున్సిపల్ కౌన్సిలర్లు అన్వర్,కాల్ల గణేష్, భాస్కర్ గౌడ్,గడ్డమీద మహేష్,అంజద్,లడ్డు, భూపతి,గంగాధర్, వాజిద్,లోలం శ్రీనివాస్, జెర్సీ నర్సింహులు, మామిడి లక్ష్మణ్,కె. లలిత, బబ్లు,మాజీద్, జావేద్,యూనుస్, సిద్దిఖ్,గ్యార సాయిలు, మన్సూర్ మరియు మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
    1
    కామారెడ్డి : రాబోయే వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని కామారెడ్డి పట్టణ ప్రజలకు తాగునీటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని మున్సిపల్ చైర్‌పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు. బుధవారం ఆమె పట్టణంలోని బుర్ర మత్తడి, ఫిల్టర్ బెడ్లను మున్సిపల్ అధికారులతో కలిసి ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్  సూచన మేరకు అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో సందర్శించారు. ఈ సందర్భంగా ఫిల్టర్ బెడ్ల పనితీరును పరిశీలించిన అనంతరం ఆమె మాట్లాడుతూ పట్టణంలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని  అధికారులకు స్పష్టం చేశారు. బుర్ర మత్తడి వద్ద ప్రస్తుతం ఉన్న వనరులకు అదనంగా మరో మూడు కొత్త బోర్లు వేయించాలని, వీటికి అంతరాయం లేని విద్యుత్ సరఫరా కోసం ప్రత్యేకంగా ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాటు చేయాలని మున్సిపల్ కమిషనర్ రాజేందర్ రెడ్డి, ఏఈ వేణు ప్రసాద్‌లకు ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా ఫిల్టర్ బెడ్ల వద్ద పరిశుభ్రత విషయంలో రాజీ పడకూడదని, ప్రజలకు స్వచ్ఛమైన నీటిని అందించాలని సూచించారు. ప్రతి ఇంటికి తాగునీరు సక్రమంగా అందేలా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని కోరారు. వేసవి ప్రణాళికలో ఏవైనా లోపాలు ఉంటే సహించేది లేదని ఆమె హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రాజేందర్ రెడ్డి,ఏఈ వేణు ప్రసాద్‌లతో పాటు మున్సిపల్ కౌన్సిలర్లు అన్వర్,కాల్ల గణేష్, భాస్కర్ గౌడ్,గడ్డమీద మహేష్,అంజద్,లడ్డు, భూపతి,గంగాధర్, వాజిద్,లోలం శ్రీనివాస్, జెర్సీ నర్సింహులు, మామిడి లక్ష్మణ్,కె. లలిత, బబ్లు,మాజీద్, జావేద్,యూనుస్, సిద్దిఖ్,గ్యార సాయిలు, మన్సూర్ మరియు మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
    user_Narmala Swapna
    Narmala Swapna
    Tour operator నాగారెడ్డిపేట్, కామారెడ్డి, తెలంగాణ•
    5 hrs ago
  • గజ్వేల్ సిద్దిపేట జిల్లా ఫిబ్రవరి 18 ప్రజా తెలంగాణ న్యూస్ ఈరోజు ప్రజా నాయకుడు, మనసున్న మహానేత,మాజీ ముఖ్యమంత్రివర్యులు చంద్రశేఖర్ రావు గారి 72వ జన్మదినం సందర్బంగా వేడుకలు గజ్వెల్ పట్టణంలో mlc వంటేరి యాదవరెడ్డి,గజ్వెల్ నియోజకవర్గ ఇంచార్జి వంటేరు ప్రతాప్ రెడ్డి, గజ్వెల్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్ ల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా నల్లవాగు కేసరి హనుమాన్ దేవాలయంలో brs మండల అధ్యక్షుడు బెండే మధు మరియు బీఆర్ఎస్ శ్రేణులంతా కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించి కేసీఆర్ గారికి నిండు ఆయురారోగ్యాలతో పాటు మరింత ప్రజా సేవలో ముందుకు వెళ్లేలా ఆశీర్వధించాలని ప్రార్థించారు. అనంతరం అక్కడే కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు నిర్వహించారు. తదననంతరం గజ్వెల్ ప్రభుత్వ ఆసుపత్రిలో మున్సిపల్ చైర్మన్ గంగిశెట్టి చందన రవి, వైస్ ఛైర్మన్ కల్యాణ్ కార్ నర్సింగరావు మురియు పాలక వర్గం ఆధ్వర్యంలో పండ్లు, బ్రెడ్ పంపిణీ చేశారు. ఆ తర్వాత మున్సిపల్ కార్యాలయ ఆవరణలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.అనంతరం గజ్వేల్ మండలం బంగ్లా వెంకటపూర్ గ్రామానికి చెందిన సల్లూరీ మహేష్ S%రామయ్య నిరుపేద కుటుంబానికి చెంది వారు కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న సందర్భంగా హాస్పిటల్ ఖర్చుల నిమిత్తం కుటుంబ సభ్యులు రాఆకాంక్షించారు72000 రూపాయల ఆర్థిక సహాయం బంగ్లా వెంకటాపూర్ లోని ఇంటికి వెళ్లి ఏఎంసీ మాజీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్ నేతృత్వంలో ఎమ్మెల్సీ యాదవ రెడ్డి, గజ్వేల్ బిఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జ్ వంటేరు ప్రతాపరెడ్డిల చేతుల మీదుగా అందజేశారు.ఆ తర్వాత స్థానిక ఇందిరా పార్క్ చౌరస్తాలో గజ్వేల్ మున్సిపల్ పాలక వర్గం ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ కెసిఆర్ గారు తిరుగులేని ప్రజా నాయకునిగా తెలంగాణ రాష్ట్రం కలను సాకారం చేసిన మనసున్న మానవతావాది కేసీఆర్ గారు అని వారు నిండు నూరేళ్లు చల్లగా ఆయురారోగ్యాలతో చల్లగా ఉండాలని ఆ భగవంతుడిని ప్రారస్తున్నామని అన్నారు. తెలంగాణ ఉద్యమ సందర్భంలో పోరాట వీరునిగా, పదేళ్ళ పాలనలో మంచి పరిపాలనా దక్షునిగా, నేడు రాష్ట్ర ప్రజలందరూ జాతిపిత గా పిలుస్తున్న నేతగా నిజాయితీకి, నిరాడంబరతకు, నిలువెత్తు రూపం కెసిఆర్ అన్నారు. గజ్వెల్ నియోజకవర్గ అభివృద్ధిలో రాష్టానికి మార్గదర్శనం చేసి రోల్ మొడల్గా నిలిపిన అభివృద్ధి ప్రదాత కేసీఆర్ గారని గుర్తు చేశారు. వారు ఇచ్చిన స్ఫూర్తి తోనే తాము కూడా ప్రజా సేవలో కొనసాగుతూ సేవా కార్యక్రమాల్ని నిర్వహిస్తున్నామని అన్నారు. ఆ భగవంతుని ఆశీర్వాదం తెలంగాణ ప్రజల దీవెనలతో కేసీఆర్ గారు ఆయురారోగ్యాలతో పురోగమించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ రాజమౌళి, మండల పార్టీ అధ్యక్షుడు బెండే మధు, పట్టణ అధ్యక్షుడు నవాజ్ మీరా, మాజీ జడ్పీటీసీ పంగ మల్లేశం, మద్దూరి శ్రీనివాస్ రెడ్డి, గోపాల్ రెడ్డి,అరుణ,జఖి ఉద్దీన్, చంద్రమోహన్ రెడ్డి, కౌన్సిలర్లు, కప్ప మమత, గోలి మమత, మురళి, బొగ్గుల స్వప్న, బాపురావు, భవాని, భాగ్యలక్ష్మీ, శ్రీధర్, అత్తెల్లి శ్రీను, ఆయా గ్రామాల సర్పంచ్ లు, రమేష్, నాగలక్ష్మి, శ్రీనివాస్, నాగరాజు, జ్యోతి స్వామి, బ్యాగారి ప్రభాకర్, నాయకులు బలమని, మద్ది రాజిరెడ్డి,కృష్ణా రెడ్డి, రగుపతి రెడ్డి, రమేష్ గౌడ్, శివ,స్వామి, మల్లేశం, బిమప్ప, అహ్మద్,దశరథ, బాపిరెడ్డి, ఉమర్, కనక గౌడ్, భాను, చందు, బూరన్, శ్రీనివాస్ రెడ్డి,మాజీ సర్పంచ్లు, మాజీ ఎంపీటీసీలు, గ్రామ పార్టీ అధ్యక్షులు, మాజీ కౌన్సిలర్లు, తదితరులు పాల్గొన్నారు.
    2
    గజ్వేల్ సిద్దిపేట జిల్లా ఫిబ్రవరి 18 ప్రజా తెలంగాణ న్యూస్
ఈరోజు ప్రజా నాయకుడు, మనసున్న మహానేత,మాజీ ముఖ్యమంత్రివర్యులు చంద్రశేఖర్ రావు గారి 72వ జన్మదినం సందర్బంగా వేడుకలు గజ్వెల్ పట్టణంలో mlc వంటేరి యాదవరెడ్డి,గజ్వెల్ నియోజకవర్గ ఇంచార్జి వంటేరు ప్రతాప్ రెడ్డి, గజ్వెల్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్ ల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా నల్లవాగు కేసరి హనుమాన్ దేవాలయంలో brs మండల అధ్యక్షుడు బెండే మధు మరియు బీఆర్ఎస్ శ్రేణులంతా కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించి కేసీఆర్  గారికి నిండు ఆయురారోగ్యాలతో పాటు మరింత ప్రజా సేవలో ముందుకు వెళ్లేలా ఆశీర్వధించాలని ప్రార్థించారు. అనంతరం అక్కడే కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు నిర్వహించారు. తదననంతరం గజ్వెల్ ప్రభుత్వ ఆసుపత్రిలో  మున్సిపల్ చైర్మన్ గంగిశెట్టి చందన రవి, వైస్ ఛైర్మన్ కల్యాణ్ కార్ నర్సింగరావు మురియు పాలక వర్గం ఆధ్వర్యంలో పండ్లు, బ్రెడ్ పంపిణీ చేశారు. ఆ తర్వాత మున్సిపల్ కార్యాలయ ఆవరణలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.అనంతరం గజ్వేల్  మండలం బంగ్లా వెంకటపూర్ గ్రామానికి చెందిన సల్లూరీ మహేష్ S%రామయ్య  నిరుపేద  కుటుంబానికి  చెంది వారు కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న సందర్భంగా హాస్పిటల్ ఖర్చుల నిమిత్తం కుటుంబ సభ్యులు రాఆకాంక్షించారు72000 రూపాయల ఆర్థిక సహాయం బంగ్లా వెంకటాపూర్ లోని  ఇంటికి వెళ్లి ఏఎంసీ మాజీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్ నేతృత్వంలో  ఎమ్మెల్సీ యాదవ రెడ్డి,  గజ్వేల్ బిఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జ్ వంటేరు ప్రతాపరెడ్డిల చేతుల మీదుగా అందజేశారు.ఆ తర్వాత స్థానిక ఇందిరా పార్క్ చౌరస్తాలో  గజ్వేల్ మున్సిపల్ పాలక వర్గం ఆధ్వర్యంలో  అన్నదానం నిర్వహించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ కెసిఆర్ గారు  తిరుగులేని ప్రజా నాయకునిగా  తెలంగాణ రాష్ట్రం కలను సాకారం చేసిన మనసున్న మానవతావాది కేసీఆర్  గారు అని వారు నిండు నూరేళ్లు చల్లగా ఆయురారోగ్యాలతో చల్లగా ఉండాలని ఆ భగవంతుడిని ప్రారస్తున్నామని అన్నారు. తెలంగాణ ఉద్యమ సందర్భంలో పోరాట వీరునిగా, పదేళ్ళ పాలనలో మంచి పరిపాలనా దక్షునిగా, నేడు రాష్ట్ర ప్రజలందరూ జాతిపిత గా పిలుస్తున్న నేతగా నిజాయితీకి, నిరాడంబరతకు, నిలువెత్తు రూపం కెసిఆర్ అన్నారు.  గజ్వెల్ నియోజకవర్గ అభివృద్ధిలో రాష్టానికి మార్గదర్శనం చేసి రోల్ మొడల్గా నిలిపిన అభివృద్ధి ప్రదాత కేసీఆర్ గారని గుర్తు చేశారు. వారు ఇచ్చిన స్ఫూర్తి తోనే తాము కూడా ప్రజా సేవలో కొనసాగుతూ సేవా కార్యక్రమాల్ని నిర్వహిస్తున్నామని అన్నారు. ఆ భగవంతుని ఆశీర్వాదం తెలంగాణ ప్రజల దీవెనలతో కేసీఆర్  గారు  ఆయురారోగ్యాలతో  పురోగమించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ రాజమౌళి, మండల పార్టీ అధ్యక్షుడు బెండే మధు, పట్టణ అధ్యక్షుడు నవాజ్ మీరా, మాజీ జడ్పీటీసీ పంగ మల్లేశం, మద్దూరి శ్రీనివాస్ రెడ్డి, గోపాల్ రెడ్డి,అరుణ,జఖి ఉద్దీన్, చంద్రమోహన్ రెడ్డి, కౌన్సిలర్లు, కప్ప మమత, గోలి మమత, మురళి, బొగ్గుల స్వప్న, బాపురావు, భవాని, భాగ్యలక్ష్మీ, శ్రీధర్, అత్తెల్లి శ్రీను, ఆయా గ్రామాల సర్పంచ్ లు,  రమేష్, నాగలక్ష్మి, శ్రీనివాస్, నాగరాజు, జ్యోతి స్వామి, బ్యాగారి ప్రభాకర్, నాయకులు బలమని,  మద్ది రాజిరెడ్డి,కృష్ణా రెడ్డి, రగుపతి రెడ్డి,  రమేష్ గౌడ్, శివ,స్వామి,  మల్లేశం, బిమప్ప, అహ్మద్,దశరథ, బాపిరెడ్డి, ఉమర్, కనక గౌడ్, భాను, చందు, బూరన్, శ్రీనివాస్ రెడ్డి,మాజీ సర్పంచ్లు, మాజీ ఎంపీటీసీలు, గ్రామ పార్టీ అధ్యక్షులు, మాజీ కౌన్సిలర్లు, తదితరులు పాల్గొన్నారు.
    user_GOUSE BEURO REPORTER
    GOUSE BEURO REPORTER
    రిపోర్టర్ వర్గల్, సిద్దిపేట, తెలంగాణ•
    13 hrs ago
  • బాన్సువాడ లో పట్ట పగలే భారీ కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో ఎప్పుడూ రద్దీగా ఉండే తాడ్కోల్ ప్రధాన రహదారిపై నిలిపిన కారు నుంచి పట్టపగలే 8 లక్షల రూపాయల నగదుదొంగతనం జరగడం బాన్సువాడ లో కలకలం రేపింది. మొదటినుంచి మన దినపత్రిక బాన్స్వాడ పోలీస్ డివిజన్ పరిధిలో సీసీ కెమెరాలు పని చేయడం లేదంటూ వరుస కథనాలు ప్రచరించినప్పటికీ, ఇటు పోలీస్ యంత్రాంగం, అటు వ్యాపారస్తులు స్పందించకపోవడం వల్ల బాన్సువాడ పోలీస్ డివిజన్ పరిధిలో దొంగతనాలు ఈమధ్య విపరీతంగా పెరిగిపోయాయి. దీనికి తాజాగా బాన్స్వాడ పట్టణంలోని తాడ్కోలు చౌరస్తా వద్ద నిలిపిన కారు నుంచి 8 లక్షల రూపాయలు దొంగలు అపహరించుకొని పోవడం బాన్సువాడ పట్టణ ప్రజల్ని భయం గుప్పెట్లోకి పంపించింది. ఇప్పటికే బిచ్కుంద పోలీస్ స్టేషన్ సర్కిల్ పరిధిలో డోంగ్లి మండలం లింబురు గ్రామ శివారులో పొలం వద్ద గుర్తుతెలియని దొంగలు రెండు రోజుల క్రితం మూడు విద్యుత్తు ట్రాన్స్ఫార్మర్ పగలగొట్టి విలువైన రాగి తీగలు, నూనె ఎత్తుకొని వెళ్ళిపోయారు. మద్నూర్ మండలం పెద్ద ఎక్లార , పిట్లం మండలంలో ట్రాన్స్ఫార్మర్లను పగలగొట్టి విలువైన రాగి తీగలను దొంగలించుకుని పోతున్నారు జిల్లాలో వరుసగా ట్రాన్స్ఫార్మర్ల పగలగొట్టి విలువైన వస్తువులను దొంగలించుకుని పారిపోతున్నారు. బాన్స్వాడ పట్టణంలో ఎస్బిఐ బ్యాంక్ నుంచి తన బంధువు ఆసుపత్రిలో చికిత్స పొందుతుంటే వారి అవసరాల కోసం తోటి బంధువు కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం హజ్గుల్ గ్రామానికి చెందిన మాధవరావు మంగళవారం బ్యాంకు నుంచి 8 లక్షల రూపాయలు డ్రా చేసుకొని, తాడ్ కోల్ చౌరస్తా వద్ద గల రిలయన్స్ సూపర్ మార్కెట్ కు సరుకులు కొనడానికి వెళ్లిన మాధవరావును గుర్తించిన దొంగలు, ఆయన కారులో దాచిన ఎనిమిది లక్షల రూపాయలు కారు అద్దాలు పగలగొట్టి పట్ట పగలే చోటికి పాల్పడ్డారు. ముఖ్యంగా బాన్స్వాడ పోలీస్ డివిజన్ పరిధిలో సీసీ కెమెరాలు సక్రమంగా పని చేయకపోవడం వల్ల, నేరాలు, ఘోరాలు జరగడానికి కారణం అవుతున్నాయి. కామారెడ్డి జిల్లా ఏర్పాటు అయిన తర్వాత మొట్టమొదటిసారిగా జిల్లా ఎస్పీగా వచ్చిన శ్వేత ముఖ్యంగా సీసీ కెమెరాలపై దృష్టి పెట్టారు, వ్యాపారస్తుల కు అవగాహన కల్పించి వ్యాపార సంస్థల వద్ద సీసీ కెమెరా ఏర్పాటు, గ్రామాలలో సీసీ కెమెరాల ఏర్పాటు, పోలీస్ శాఖ ద్వారా ముఖ్య కూడలిలో సీసీ కెమెరా ఏర్పాటు చేశారు. కానీ వాటిపై పోలీస్ శాఖ నిర్లక్ష్యపు నీడలు అల్ముకోవడంతో, సిసి కెమెరాలు పనిచేయక పోవడంతో ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున దొంగతనాలు, హత్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే బాన్సువాడ కల్కి చెరువు వద్ద గుర్తుతెలియని రెండు మహిళా మృతదేహాలు బయట పడ్డప్పటికీ, అవి ఎవరి అన్నది పోలీసులు చేదించలేకపోయారు, నిజం సాగర్ వద్ద 23 ఏళ్ల యువతి మృతదేహం బయటపడి మూడు నెలలు కావస్తున్నా ఆ యువతి ఎవరు అన్నది పోలీసులు చేదించలేకపోయారు. దీనివల్ల బాన్స్వాడ పోలీస్ డివిజన్ పరిధిలో పెద్ద ఎత్తున దొంగతనాలు, ద్విచక్ర వాహనాలు దొంగలించడం, తాళాలు వేసిన ఇళ్లను లక్ష్యంగా పెట్టుకుని దొంగతనాలకు దొంగలు పాల్పడుతున్నారు. కానీ పోలీసులకు చిక్కకుండా దొంగలు పారిపోవడానికి కారణం సీసీ కెమెరాలు సక్రమంగా పని చేయకపోవడమే అని ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాడుకుల్ చౌరస్తాలో 8 లక్షల నగదును కారులో నుంచి దొంగలించి పోయిన దొంగలు ఎవరు? కారు అద్దాలు పగలకొట్టేవరకు ఎవరు? ఎవరు గమనించలేదా? కారు అద్దం బలమైన ఏదైనా ఆయుధంతో పలగొట్టి ఉండవచ్చునని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటివరకు చుట్టుపక్కల గల సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తున్నారు, కొన్నిచోట్ల సీసీ కెమెరాలు పనిచేస్తుండగా, మరికొన్ని చోట్ల పని చేయకపోవడంతో, పట్టపగలు కారులో నుంచి 8 లక్షల దొంగలించుకుని పారిపోయిన వారి ఆచూకీ ఇప్పటివరకు పోలీసులకు చిక్కకపోవడంతో, మాధవరావు అనే రైతు తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆసుపత్రిలో ఉన్న తన బంధువుకు చికిత్స ఖర్చులకోసం నుంచి బ్యాంకు నుంచి డ్రా చేసిన డబ్బులను సూపర్ మార్కెట్ నుంచి 15 నిమిషాల్లోనే బయటకు వచ్చేసరికి డబ్బులు మాయం కావడం పట్ల మాధవరావు వారిని రైతు కంటతడి పెడుతున్నారు. కారు అద్దాలు పగలగొట్టి భారీ నగదు చోరీకి పాల్పడ్డ దుండగులురు పట్టుకోలంటూ మాధవరావు అనే రైతు పోలీసులకు విజ్ఞప్తి చేస్తున్నారు. బాన్స్వాడ డి.ఎస్.పి విట్టల్ రెడ్డి ఆధ్వర్యంలో చుట్టుపక్కల గల సీసీ కెమెరా ఫుటేజ్ లను పరిశీలిస్తున్నారు. కారులో నుంచి నగదు చోరీకి పాల్పడ్డ దుండగులను పట్టుకుంటామని పోలీసులు సీరియస్గా తీసుకొని బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. బాన్సువాడ లో మంగళవారం పట్టపగలు జరిగిన భారీ నగదు చోరీలో పాల్పడ్డ దుండగులు అంతరాష్ట్ర దొంగల ముఠాగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మంగళవారం పకడ్బందీగా బాన్స్వాడ డిఎస్పి విట్టల్ రెడ్డి దొంగలను పట్టుకోవడానికి మూడు బృందాలుగా ఏర్పడి గాలించినప్పటికీ వారి ఆచూకీ లభించలేదు. ఇంకా గాలింపు చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి.
    1
    బాన్సువాడ లో పట్ట పగలే భారీ  
కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో ఎప్పుడూ రద్దీగా ఉండే తాడ్కోల్ ప్రధాన రహదారిపై నిలిపిన కారు నుంచి పట్టపగలే 8 లక్షల రూపాయల నగదుదొంగతనం జరగడం బాన్సువాడ లో కలకలం రేపింది. మొదటినుంచి మన దినపత్రిక బాన్స్వాడ పోలీస్ డివిజన్ పరిధిలో సీసీ కెమెరాలు పని చేయడం లేదంటూ వరుస కథనాలు ప్రచరించినప్పటికీ, ఇటు పోలీస్ యంత్రాంగం, అటు వ్యాపారస్తులు స్పందించకపోవడం వల్ల బాన్సువాడ పోలీస్ డివిజన్ పరిధిలో దొంగతనాలు ఈమధ్య విపరీతంగా పెరిగిపోయాయి. దీనికి తాజాగా బాన్స్వాడ పట్టణంలోని తాడ్కోలు చౌరస్తా వద్ద నిలిపిన కారు నుంచి 8 లక్షల రూపాయలు దొంగలు అపహరించుకొని పోవడం బాన్సువాడ పట్టణ ప్రజల్ని భయం గుప్పెట్లోకి పంపించింది. ఇప్పటికే బిచ్కుంద పోలీస్ స్టేషన్ సర్కిల్ పరిధిలో డోంగ్లి మండలం లింబురు గ్రామ శివారులో పొలం వద్ద గుర్తుతెలియని దొంగలు రెండు రోజుల క్రితం మూడు విద్యుత్తు ట్రాన్స్ఫార్మర్ పగలగొట్టి విలువైన రాగి తీగలు, నూనె ఎత్తుకొని వెళ్ళిపోయారు. మద్నూర్ మండలం పెద్ద ఎక్లార , పిట్లం మండలంలో ట్రాన్స్ఫార్మర్లను పగలగొట్టి విలువైన రాగి తీగలను దొంగలించుకుని పోతున్నారు జిల్లాలో వరుసగా ట్రాన్స్ఫార్మర్ల పగలగొట్టి విలువైన వస్తువులను దొంగలించుకుని పారిపోతున్నారు. బాన్స్వాడ పట్టణంలో ఎస్బిఐ బ్యాంక్ నుంచి తన బంధువు ఆసుపత్రిలో చికిత్స పొందుతుంటే వారి అవసరాల కోసం తోటి బంధువు కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం హజ్గుల్ గ్రామానికి చెందిన మాధవరావు మంగళవారం బ్యాంకు నుంచి 8 లక్షల రూపాయలు డ్రా చేసుకొని, తాడ్ కోల్ చౌరస్తా వద్ద గల రిలయన్స్ సూపర్ మార్కెట్ కు సరుకులు కొనడానికి వెళ్లిన మాధవరావును గుర్తించిన దొంగలు, ఆయన కారులో దాచిన ఎనిమిది లక్షల రూపాయలు కారు అద్దాలు పగలగొట్టి పట్ట పగలే చోటికి పాల్పడ్డారు. ముఖ్యంగా బాన్స్వాడ పోలీస్ డివిజన్ పరిధిలో సీసీ కెమెరాలు సక్రమంగా పని చేయకపోవడం వల్ల, నేరాలు, ఘోరాలు జరగడానికి కారణం అవుతున్నాయి. కామారెడ్డి జిల్లా ఏర్పాటు అయిన తర్వాత మొట్టమొదటిసారిగా జిల్లా ఎస్పీగా వచ్చిన శ్వేత ముఖ్యంగా సీసీ కెమెరాలపై దృష్టి పెట్టారు, వ్యాపారస్తుల కు అవగాహన కల్పించి వ్యాపార సంస్థల వద్ద సీసీ కెమెరా ఏర్పాటు, గ్రామాలలో సీసీ కెమెరాల ఏర్పాటు, పోలీస్ శాఖ ద్వారా ముఖ్య కూడలిలో సీసీ కెమెరా ఏర్పాటు చేశారు. కానీ వాటిపై పోలీస్ శాఖ నిర్లక్ష్యపు నీడలు అల్ముకోవడంతో, సిసి కెమెరాలు పనిచేయక పోవడంతో ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున దొంగతనాలు, హత్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే బాన్సువాడ కల్కి చెరువు వద్ద గుర్తుతెలియని రెండు మహిళా మృతదేహాలు బయట పడ్డప్పటికీ, అవి ఎవరి అన్నది పోలీసులు చేదించలేకపోయారు, నిజం సాగర్ వద్ద 23 ఏళ్ల యువతి మృతదేహం బయటపడి మూడు నెలలు కావస్తున్నా ఆ యువతి ఎవరు అన్నది పోలీసులు చేదించలేకపోయారు. దీనివల్ల బాన్స్వాడ పోలీస్ డివిజన్ పరిధిలో పెద్ద ఎత్తున దొంగతనాలు, ద్విచక్ర వాహనాలు దొంగలించడం, తాళాలు వేసిన ఇళ్లను లక్ష్యంగా పెట్టుకుని దొంగతనాలకు దొంగలు పాల్పడుతున్నారు. కానీ పోలీసులకు చిక్కకుండా దొంగలు పారిపోవడానికి కారణం సీసీ కెమెరాలు సక్రమంగా పని చేయకపోవడమే అని ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాడుకుల్ చౌరస్తాలో 8 లక్షల నగదును కారులో నుంచి దొంగలించి పోయిన దొంగలు ఎవరు? కారు అద్దాలు పగలకొట్టేవరకు ఎవరు? ఎవరు గమనించలేదా? కారు అద్దం బలమైన ఏదైనా ఆయుధంతో పలగొట్టి ఉండవచ్చునని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటివరకు చుట్టుపక్కల గల సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తున్నారు, కొన్నిచోట్ల సీసీ కెమెరాలు పనిచేస్తుండగా, మరికొన్ని చోట్ల పని చేయకపోవడంతో, పట్టపగలు కారులో నుంచి 8 లక్షల దొంగలించుకుని పారిపోయిన వారి ఆచూకీ ఇప్పటివరకు పోలీసులకు చిక్కకపోవడంతో, మాధవరావు అనే రైతు తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆసుపత్రిలో ఉన్న తన బంధువుకు చికిత్స ఖర్చులకోసం నుంచి బ్యాంకు నుంచి డ్రా చేసిన డబ్బులను సూపర్ మార్కెట్ నుంచి 15 నిమిషాల్లోనే బయటకు వచ్చేసరికి డబ్బులు మాయం కావడం పట్ల మాధవరావు వారిని రైతు కంటతడి పెడుతున్నారు. కారు అద్దాలు పగలగొట్టి భారీ నగదు చోరీకి పాల్పడ్డ దుండగులురు పట్టుకోలంటూ మాధవరావు అనే రైతు పోలీసులకు విజ్ఞప్తి చేస్తున్నారు. బాన్స్వాడ డి.ఎస్.పి విట్టల్ రెడ్డి ఆధ్వర్యంలో చుట్టుపక్కల గల సీసీ కెమెరా ఫుటేజ్ లను పరిశీలిస్తున్నారు. కారులో నుంచి నగదు చోరీకి పాల్పడ్డ దుండగులను పట్టుకుంటామని పోలీసులు సీరియస్గా తీసుకొని బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. బాన్సువాడ లో మంగళవారం పట్టపగలు జరిగిన భారీ నగదు చోరీలో పాల్పడ్డ దుండగులు అంతరాష్ట్ర దొంగల ముఠాగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మంగళవారం పకడ్బందీగా బాన్స్వాడ డిఎస్పి విట్టల్ రెడ్డి దొంగలను పట్టుకోవడానికి మూడు బృందాలుగా ఏర్పడి గాలించినప్పటికీ వారి ఆచూకీ లభించలేదు. ఇంకా గాలింపు చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి.
    user_Local Public news
    Local Public news
    బాన్సువాడ, కామారెడ్డి, తెలంగాణ•
    9 hrs ago
  • భారత్ మాత కి జై 🇮🇳 జాగో హిందూ జాగో నిన్ను నువ్వే కాపాడుకో మహమ్మద్ అలీ జిన్నా వారసులు MiM కాసిమ్ రజ్వీ రజాకార్ వారసుల తో జాగ్రత్తగా ఉండండి హిందువులారా
    1
    భారత్ మాత కి జై 🇮🇳 
జాగో హిందూ జాగో నిన్ను నువ్వే కాపాడుకో 
మహమ్మద్ అలీ జిన్నా వారసులు MiM కాసిమ్ రజ్వీ రజాకార్ వారసుల తో జాగ్రత్తగా ఉండండి హిందువులారా
    user_Shyam sunder Yadav Pulapally
    Shyam sunder Yadav Pulapally
    Malkajgiri, Medchal Malkajgiri•
    23 hrs ago
  • ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీస్ (ఏఐయూ) సెంట్రల్ జోన్ వైస్ చాన్సలర్ల సదస్సు ను ఈ నెల 19 నుండి 20 వరకు నిర్వహించనున్నారు. "ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), క్వాంటం సాంకేతికతతో కూడిన ఉన్నత విద్యా సంస్థల రూపకల్పన" అం శంపై రెండు రోజుల పాటు విస్తృత చర్చలు జరుగుతాయని ఓయూ వీసీ ప్రొఫెసర్ కుమార్ తెలిపారు. ఓయూలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ కార్యక్రమానికి తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ముఖ్య అతిధిగా హాజరై ఓయూలోని ఠాగూర్ ఆడిటోరియంలో ఉదయం 10 గంటలకు సదస్సును ప్రారంభిస్తారని తెలిపారు. ఈ సదస్సు లో తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గడ్, ఉత్తర ప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలకు చెందిన సుమారు 40 మందికి పైగా వీసీలు, ఉన్నత విద్యా నిర్వాహకులు పాల్గొంటారని తెలిపారు. మారుతున్న సాంకేతిక యుగంలో ఉన్నత విద్యా విదానాల రూపకల్పనపై చర్చ ఉంటుందన్నారు. ఈ చర్చల్లో వచ్చి ప్రధాన అంశాలను ప్రభుత్వానికి సిఫార్సు చేస్తామని వెల్లడించారు.
    1
    ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీస్ (ఏఐయూ) సెంట్రల్ జోన్ వైస్ చాన్సలర్ల సదస్సు ను ఈ నెల 19 నుండి 20 వరకు నిర్వహించనున్నారు. "ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), క్వాంటం సాంకేతికతతో కూడిన ఉన్నత విద్యా సంస్థల రూపకల్పన" అం శంపై రెండు రోజుల పాటు విస్తృత చర్చలు జరుగుతాయని ఓయూ వీసీ ప్రొఫెసర్ కుమార్  తెలిపారు. ఓయూలో నిర్వహించిన సమావేశంలో  మాట్లాడుతూ కార్యక్రమానికి తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ముఖ్య అతిధిగా హాజరై ఓయూలోని ఠాగూర్ ఆడిటోరియంలో ఉదయం 10 గంటలకు సదస్సును ప్రారంభిస్తారని తెలిపారు. ఈ సదస్సు లో తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గడ్, ఉత్తర ప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలకు చెందిన సుమారు 40 మందికి పైగా వీసీలు, ఉన్నత విద్యా నిర్వాహకులు పాల్గొంటారని తెలిపారు. మారుతున్న సాంకేతిక యుగంలో ఉన్నత విద్యా విదానాల రూపకల్పనపై చర్చ ఉంటుందన్నారు. ఈ చర్చల్లో వచ్చి ప్రధాన అంశాలను ప్రభుత్వానికి సిఫార్సు చేస్తామని వెల్లడించారు.
    user_దినేష్ కుమార్
    దినేష్ కుమార్
    సికింద్రాబాద్, హైదరాబాద్, తెలంగాణ•
    1 hr ago
  • ప్రత్యేక తరగతుల ద్వారా ఉత్తమ విద్యా ప్రమాణాలు పదవ తరగతి పరీక్షలలో అత్యుత్తమ ఫలితాలకు దోహదపడతాయని కలెక్టర్ రాహుల్ రాజ్ స్పష్టం చేశారు. బుధవారం కౌడిపల్లి మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను కలెక్టర్ సందర్శించారు. ముందుగా పాఠశాల పరిసరాలను పరిశీలించి అనంతరం విద్యార్థుల కోసం సిద్ధం చేస్తున్న మధ్యాహ్న భోజనం మెనూ ఆహార పదార్థాలను పరిశీలించారు తరగతి గదులలో పదవ తరగతి విద్యార్థుల సామర్థ్యాలను పరిశీలించి సబ్జెక్టుల వారీగా ప్రశ్నల రూపంలో అడిగి తెలుసుకుని సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించే విషయంలో నిబంధనలు పాటించాలని రుచి సూచితో కూడిన ఆహార పదార్థాలు విద్యార్థులకు అందించాలన్నారు. ఈ సంవత్సరం పదవ తరగతి జిల్లాలో ఉత్తమ ఫలితాలు లక్ష్యంగా ముందుకు పోతున్నామని ప్రత్యేక తరగతులు నిర్వహించి సబ్జెక్టుల వారీగా సామర్థ్యాలను పెంపొందించి వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నామన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో గుణాత్మక విద్య లక్ష్యంగా ప్రభుత్వం కార్పొరేట్ స్థాయిలో అనేక మౌలిక సదుపాయాలు కల్పించి విద్యార్థులు చదువుకునేలా పటిష్ట చర్యలు తీసుకుంటుందని ఈ సందర్భంగా కలెక్టర్ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
    1
    ప్రత్యేక తరగతుల ద్వారా ఉత్తమ విద్యా ప్రమాణాలు పదవ తరగతి పరీక్షలలో అత్యుత్తమ ఫలితాలకు 
దోహదపడతాయని కలెక్టర్ రాహుల్ రాజ్ స్పష్టం చేశారు. బుధవారం కౌడిపల్లి మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను కలెక్టర్ సందర్శించారు. ముందుగా పాఠశాల పరిసరాలను పరిశీలించి అనంతరం విద్యార్థుల కోసం సిద్ధం చేస్తున్న మధ్యాహ్న భోజనం మెనూ ఆహార పదార్థాలను పరిశీలించారు తరగతి గదులలో పదవ తరగతి విద్యార్థుల సామర్థ్యాలను పరిశీలించి సబ్జెక్టుల వారీగా  ప్రశ్నల రూపంలో  అడిగి తెలుసుకుని సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించే విషయంలో నిబంధనలు పాటించాలని రుచి సూచితో కూడిన ఆహార పదార్థాలు విద్యార్థులకు అందించాలన్నారు.
ఈ సంవత్సరం పదవ తరగతి జిల్లాలో ఉత్తమ ఫలితాలు లక్ష్యంగా 
ముందుకు పోతున్నామని ప్రత్యేక తరగతులు నిర్వహించి సబ్జెక్టుల వారీగా సామర్థ్యాలను పెంపొందించి 
వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నామన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో గుణాత్మక విద్య లక్ష్యంగా ప్రభుత్వం కార్పొరేట్ స్థాయిలో అనేక మౌలిక సదుపాయాలు కల్పించి విద్యార్థులు చదువుకునేలా పటిష్ట చర్యలు తీసుకుంటుందని  ఈ సందర్భంగా కలెక్టర్ వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
    user_మెదక్ న్యూస్
    మెదక్ న్యూస్
    హవేలీఘనాపూర్, మెదక్, తెలంగాణ•
    5 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.