బొబ్బిలి ఆర్డిఓ గారికి మున్సిపల్ కార్మికులు సమ్మె నోటీస్ ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ ----------------------------------------------------------------- బొబ్బిలి మున్సిపాలిటీలో జలగడుగుల శ్యామల కుమార్ పారిశుధ్య విభాగంలో 15 ఏళ్లుగా పనిచేసి ఫిబ్రవరి 14 క్యాన్సర్ జబ్బుతో చనిపోయారు. పిఎఫ్ పెన్షన్ ఎక్స్గ్రేషన్ 2 లక్షల దాన సంస్కరణలు ఖర్చు 20,000/- ఇవ్వలేదు. దీనివలన ఆ కుటుంబం తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు. మునిసిపాలిటీలో చనిపోయిన కార్మికుల కుటుంబాలకు గతంలో ఉద్యోగం ఇచ్చినట్లే ఇవ్వాలని అన్ని రకాల డాక్యుమెంట్స్ ఇవ్వడం జరిగింది. 18 నెలలుగా కమిషనర్ వద్దకు తిరుగుతూనే ఉన్నాము ఫైల్ పెడతామని కొన్నాళ్లు జీవో లేదని కొన్నాళ్లు సమాధానం చెప్పి ఇంతవరకు ఉద్యోగం ఇవ్వలేదు. ఈ సంవత్సరంలోనే సాలూరు, పాలకొండ విశాఖపట్నం రాయలసీమ అనేక జిల్లాల్లో చనిపోయిన కాంట్రాక్టు కార్మికుల కుటుంబాలకు ఉద్యోగం ఇచ్చారు. ఈ కమిషనర్ బొబ్బిలి వచ్చినప్పటి నుండి ఇవ్వడం లేదు. పైగా జనరల్ ఫండ్ దుర్వినియోగం, అవినీతి పెరిగిపోయింది. కార్మికుల ఏ సమస్య పరిష్కారం చేయడం లేదు.చనిపోయిన కార్మిక కుటుంబాలకు ఉద్యోగం ఇచ్చేవరకు తేదీ 27 - 8 - 26 ఈరోజు నుండి భార్య పిల్లలతో నిరాహారదీక్ష సెప్టెంబర్ 5వ తేదీ నుండి సమ్మె చేపడుతామని తమకు తెలియజేస్తున్నాము. ఈ సమ్మె వళ్ళన ప్రజలకు కలిగే ఇబ్బందులకు మున్సిపల్ అధికారులదే బాధ్యత అని తెలియజేస్తున్నాము. నిరాహార దీక్షలో భార్య జలగడుగుల పోలమ్మ పిల్లలు భారతి, జ్యోత్స్న సిఐటియు నుండి మంగళగిరి ప్రసాదు బి. వెంకటి జె శ్రీనివాసరావు, బంగారి గోవిందా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు పి. శంకర్రావు తదితరులు కూర్చున్నారు.
బొబ్బిలి ఆర్డిఓ గారికి మున్సిపల్ కార్మికులు సమ్మె నోటీస్ ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ ----------------------------------------------------------------- బొబ్బిలి మున్సిపాలిటీలో జలగడుగుల శ్యామల కుమార్ పారిశుధ్య విభాగంలో 15 ఏళ్లుగా పనిచేసి ఫిబ్రవరి 14 క్యాన్సర్ జబ్బుతో చనిపోయారు. పిఎఫ్ పెన్షన్ ఎక్స్గ్రేషన్ 2 లక్షల దాన సంస్కరణలు ఖర్చు 20,000/- ఇవ్వలేదు. దీనివలన ఆ కుటుంబం తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు. మునిసిపాలిటీలో చనిపోయిన కార్మికుల కుటుంబాలకు గతంలో ఉద్యోగం ఇచ్చినట్లే ఇవ్వాలని అన్ని రకాల డాక్యుమెంట్స్ ఇవ్వడం జరిగింది. 18 నెలలుగా కమిషనర్ వద్దకు తిరుగుతూనే ఉన్నాము ఫైల్ పెడతామని కొన్నాళ్లు జీవో లేదని కొన్నాళ్లు సమాధానం చెప్పి ఇంతవరకు ఉద్యోగం ఇవ్వలేదు. ఈ సంవత్సరంలోనే సాలూరు, పాలకొండ విశాఖపట్నం రాయలసీమ అనేక జిల్లాల్లో
చనిపోయిన కాంట్రాక్టు కార్మికుల కుటుంబాలకు ఉద్యోగం ఇచ్చారు. ఈ కమిషనర్ బొబ్బిలి వచ్చినప్పటి నుండి ఇవ్వడం లేదు. పైగా జనరల్ ఫండ్ దుర్వినియోగం, అవినీతి పెరిగిపోయింది. కార్మికుల ఏ సమస్య పరిష్కారం చేయడం లేదు.చనిపోయిన కార్మిక కుటుంబాలకు ఉద్యోగం ఇచ్చేవరకు తేదీ 27 - 8 - 26 ఈరోజు నుండి భార్య పిల్లలతో నిరాహారదీక్ష సెప్టెంబర్ 5వ తేదీ నుండి సమ్మె చేపడుతామని తమకు తెలియజేస్తున్నాము. ఈ సమ్మె వళ్ళన ప్రజలకు కలిగే ఇబ్బందులకు మున్సిపల్ అధికారులదే బాధ్యత అని తెలియజేస్తున్నాము. నిరాహార దీక్షలో భార్య జలగడుగుల పోలమ్మ పిల్లలు భారతి, జ్యోత్స్న సిఐటియు నుండి మంగళగిరి ప్రసాదు బి. వెంకటి జె శ్రీనివాసరావు, బంగారి గోవిందా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు పి. శంకర్రావు తదితరులు కూర్చున్నారు.
- బొబ్బిలి పట్టణంలోని మేదరబంద కాలువ కంపు కొడుతుంది. బజారు, చిన బజారు, యాతవీధి, రావువారివీధి, గౌడవీధి వీధుల మురుగునీరు ఇక్కడ కలిసి చెరువుకు వెళ్తుంది. కాలువలో ప్లాస్టిక్ వ్యర్థాలు కలవడంతో నీరు సక్రమంగా వెళ్లడం లేదు. దీంతో దుర్వాసన వెదజల్లుతుందని ప్రజలు వాపోతున్నారు. కాలువను శుభ్రం చేయాలని కోరుతున్నారు. మేదరబంద కాలువ దుర్వాసన1
- రాజాం :శ్రీ వెంకటశ్వర స్వామి గుడి వద్ద బ్రీడ్జి ప్రక్కన సోలార్ హెచ్చరిక లైట్లు ఏర్పాటు రాజాం మండలం అంతకాపల్లి గ్రామం వెంకటేశ్వర స్వామి గుడి వద్ద బ్రీడ్జ్ పక్కన హాంజరాంపేటకు చెందిన కొల్లి రాముఅనే యువకుడు తన సొంత డబ్బులతో సోలార్ హెచ్చరిక లైట్లును అమర్చారు. ఈ ప్రాంతంలో తరచూ ప్రమాదాలు జరిగి ఎక్కువగా యువత మరణిస్తుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. ఈ లైట్ల వల్లనైనా ప్రమాదాలు తగ్గుతాయని ఆశిస్తున్నానని పేర్కొన్న రాము చేసిన ఈ పనిని వాహనదారులు గ్రామస్తులు అభినందించారు.1
- రాజాం హాస్టల్ విద్యార్థినులతో రోడ్లపై డాన్సులు, చేయించిన వార్డెన్ రమాదేవి. రాజాం ఓ హాస్టల్ వార్డెన్ తీరు విమర్శలకు తావిస్తుంది, రాజాం సారది రోడ్ లో ఉన్న జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల, బాలికలతో, బంధువులు పెళ్లి వేడుకల్లో డాన్స్ చేయించిన వార్డెన్ రమాదేవి.1
- శ్రీ కనకదుర్గమ్మ తల్లి పండగ సందర్భంగా వెలిగిపోతున్న నెల్లిమర్ల నగరం నెల్లిమర్ల నగర పంచాయతీ పరిధి సెగిడి వీధి లో శ్రీ కనకదుర్గమ్మ తల్లి పండగ 26-28వ తేదీ వరకు మూడు రోజులు నిర్వహించనున్నామని కనకదుర్గమ్మ ఆలయ కమిటీ బుధవారం తెలిపారు. నగరంలో ప్రధాన రహదారి, సెగిడివీధీలో లైటింగ్ తో నగరం మెరిసిపోతుంది. మొదటిరోజు మొయిద జంక్షన్లో డాన్స్ బేబీ డాన్స్ కార్యక్రమం,బంధువులు, స్నేహితులకు స్థానికులు విందు ఏర్పాట్లు చేశారు. గురువారం అమ్మవారికి పసుపు కుంకుమ ఇవ్వనున్నామని చెప్పారు.1
- నెల్లిమర్ల మండలం వల్లూరు మర్డర్ కేసు లో ఇద్దరు అరెస్టు నెల్లిమర్ల మండలం వల్లూరు గ్రామంలో కుటుంబ కలహాలు, ఆర్థిక లావాదేవీల నేపథ్యంలో జరిగిన హత్య కేసులో సిరిగుడి అప్పలనారాయణ, అతని కుమారుడు శ్రీనును పోలీసులు అరెస్ట్ చేశారు. రూ.6 వేల ట్రాక్టర్ కిరాయి డబ్బుల విషయమై వివాదం జరగగా, శ్రీను కర్రతో రామారావు తలపై దాడి చేయడంతో మృతి చెందినట్లు సిఐ శ్రీనివాస్ తెలిపారు. కేసు నమోదైన 48 గంటల్లో నిందితులను అరెస్ట్ చేసిన సిబ్బందిని జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ అభినందించారు.1
- వీధి పశువుల నియంత్రణకు కార్పొరేషన్ కమిషనర్ శ్రావణకుమార్ కఠిన చర్యలు శ్రీకాకుళం : రోడ్లపై విచ్చలవిడిగా తిరిగే పశువుల నియంత్రణకు కఠిన చర్యలు చేపట్టామని నగరపాలక సంస్థ కమిషనర్ గన్న శ్రవణ్ కుమార్ గురువారం వెల్లడించారు. వీధి పశువుల కారణంగా ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని, రోడ్డు ప్రమాదాలు సైతం చోటు చేసుకుంటున్నాయని ఆయన తెలిపారు. ఈ దృష్ట్యా బాధ్యత లేకుండా పశువులను రోడ్లపై వదిలే పశువుల యజమానులతో ఇటీవల సమావేశం నిర్వహించామని, అయినా వారిధోరణిలో మార్పు లేదని, పశువులు రోడ్లపై కనిపిస్తున్నాయని ఆయన చెప్పారు. ఇకపై రోడ్లపై కనిపించే పశువులను పట్టుకొని నగరంలోని కాజీపేట ఏరియాకు కాకుండా నేరుగా సింహాచలం గోశాలకు తరలించడం జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు.1
- *అమ్మ గీతం అదిశాక్తివి ని సత్తెమ్మ తల్లి అమ్మావారు I గాజువాక II విశాఖపట్నం II *అమ్మ గీతం అదిశాక్తివి ని సత్తెమ్మ తల్లి అమ్మావారు I గాజువాక II విశాఖపట్నం II1
- చీపురుపల్లి మండలంలో బుధవారం ఎండ తీవ్రతకు అల్లాడిన ప్రజలకు మధ్యాహ్నం కురిసిన చిరుజల్లుల వర్షం ఉపశమనం కలిగించింది. మూడు రోజులుగా వర్షాలు లేకపోవడంతో వేడెక్కిన వాతావరణం చల్లబడింది. ఈ వర్షం వరి నారుమళ్లకు, అంతర పంటలకు ఎంతో ప్రయోజనకరమని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయ పనుల్లో నిమగ్నమైన రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. చీపురుపల్లి మండలంలో వర్షం1