logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

*ప్రతి రైతుకు ఫార్మర్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి : జిల్లా కలెక్టర్ అంకిత్* జిల్లాలోని ప్రతి రైతు ఫార్మర్ రిజిస్ట్రీలో తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ అంకిత్ సూచించారు. ఆదివారం వ్యవసాయ శాఖ ఏడీఏలు, ఏవోలు, ఏఈవోలు మరియు మీ సేవ కేంద్రాల మేనేజర్లతో గూగుల్ మీట్ ద్వారా ఫార్మర్ రిజిస్ట్రేషన్‌పై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఆధార్ ద్వారా దేశంలోని ప్రతి పౌరునికి గుర్తింపు కల్పించినట్లుగానే ప్రతి రైతుకు 14 అంకెల విశిష్ట గుర్తింపు సంఖ్య (ఫార్మర్ ఐడి) కేటాయించే కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. వ్యవసాయ రంగాన్ని పూర్తిగా డిజిటలైజ్ చేయాలనే లక్ష్యంతో ఈ ప్రాజెక్టు చేపట్టబడినట్లు తెలిపారు. భూమి కలిగిన ప్రతి రైతుకు సంబంధించిన భూ యాజమాన్య వివరాలు, వ్యక్తిగత సమాచారం ఆధారంగా ఫార్మర్ రిజిస్ట్రీ రూపొందించబడుతుందని చెప్పారు. రెవెన్యూ శాఖ వద్ద ఉన్న భూ రికార్డులను రైతుల ఆధార్ సంఖ్యతో అనుసంధానం చేసి ఫార్మర్ ఐడీ జారీ చేయడం జరుగుతుందని వివరించారు. ఫార్మర్ రిజిస్ట్రీలో నమోదు చేయడం ద్వారా ఎటువంటి కొత్త చట్టబద్ధ యాజమాన్య హక్కులు కల్పించబడవని స్పష్టం చేశారు. ఇది కేవలం ప్రభుత్వ రికార్డులలో ఉన్న భూ వివరాలను ప్రామాణికంగా తీసుకొని రైతులకు ప్రత్యేక గుర్తింపు సంఖ్యను అందించడానికి మాత్రమే ఉపయోగపడుతుందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ పథకాల అమలులో భాగంగా ఫార్మర్ రిజిస్ట్రేషన్‌ను అనుసంధానం చేయడం జరుగుతుందని, ముఖ్యంగా పీఎం కిసాన్ పథకం తదుపరి విడతల లబ్ధి పొందాలంటే ఫార్మర్ రిజిస్ట్రీలో నమోదు తప్పనిసరిగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసినట్లు తెలిపారు.రాబోయే వర్షాకాలం సీజన్ నుంచి రాష్ట్ర ప్రభుత్వ పథకాలు అయిన రైతు భరోసా, రుణమాఫీ, మొక్కజొన్న, పత్తి, ధాన్యం కొనుగోలు, యూరియా మరియు ఇతర ఎరువుల పంపిణీకి ఫార్మర్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి అవుతుందని స్పష్టం చేశారు. రైతులు తమ ఆధార్ కార్డు, భూ యాజమాన్య పాస్‌బుక్, ఆధార్‌కు అనుసంధానమైన మొబైల్ నంబర్‌తో సమీపంలోని వ్యవసాయ అధికారి లేదా వ్యవసాయ విస్తరణ అధికారిని సంప్రదించవచ్చని, లేక సమీప మీ సేవ కేంద్రాలను సంప్రదించి వెంటనే ఫార్మర్ ఐడీ నమోదు ప్రక్రియను పూర్తి చేసుకోవాలని సూచించారు. వ్యవసాయ శాఖ అధికారులు, మీసేవ కేంద్రాల వారు తమ పరిధిలోని ప్రతి రైతుకు అవగాహన కల్పించి, రిజిస్ట్రేషన్ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.

1 day ago
user_Shivaram
Shivaram
Accountant బుర్గుంపహాడ్, భద్రాద్రి కొత్తగూడెం, తెలంగాణ•
1 day ago
cb0fdf02-9484-44ae-b1c2-45e9bc1a8fff

*ప్రతి రైతుకు ఫార్మర్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి : జిల్లా కలెక్టర్ అంకిత్* జిల్లాలోని ప్రతి రైతు ఫార్మర్ రిజిస్ట్రీలో తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ అంకిత్ సూచించారు. ఆదివారం వ్యవసాయ శాఖ ఏడీఏలు, ఏవోలు, ఏఈవోలు మరియు మీ సేవ కేంద్రాల మేనేజర్లతో గూగుల్ మీట్ ద్వారా ఫార్మర్ రిజిస్ట్రేషన్‌పై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఆధార్ ద్వారా దేశంలోని ప్రతి పౌరునికి గుర్తింపు కల్పించినట్లుగానే ప్రతి రైతుకు 14 అంకెల విశిష్ట గుర్తింపు సంఖ్య (ఫార్మర్ ఐడి) కేటాయించే కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. వ్యవసాయ రంగాన్ని పూర్తిగా డిజిటలైజ్ చేయాలనే లక్ష్యంతో ఈ ప్రాజెక్టు చేపట్టబడినట్లు తెలిపారు. భూమి కలిగిన ప్రతి రైతుకు సంబంధించిన భూ యాజమాన్య వివరాలు, వ్యక్తిగత సమాచారం ఆధారంగా ఫార్మర్ రిజిస్ట్రీ రూపొందించబడుతుందని చెప్పారు. రెవెన్యూ శాఖ వద్ద ఉన్న భూ రికార్డులను రైతుల ఆధార్ సంఖ్యతో అనుసంధానం చేసి ఫార్మర్ ఐడీ జారీ చేయడం జరుగుతుందని వివరించారు. ఫార్మర్ రిజిస్ట్రీలో నమోదు చేయడం ద్వారా ఎటువంటి కొత్త చట్టబద్ధ యాజమాన్య హక్కులు కల్పించబడవని స్పష్టం చేశారు. ఇది కేవలం ప్రభుత్వ రికార్డులలో ఉన్న భూ వివరాలను ప్రామాణికంగా తీసుకొని రైతులకు ప్రత్యేక గుర్తింపు సంఖ్యను అందించడానికి మాత్రమే ఉపయోగపడుతుందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ పథకాల అమలులో భాగంగా ఫార్మర్ రిజిస్ట్రేషన్‌ను అనుసంధానం చేయడం జరుగుతుందని, ముఖ్యంగా పీఎం కిసాన్ పథకం తదుపరి విడతల లబ్ధి పొందాలంటే ఫార్మర్ రిజిస్ట్రీలో నమోదు తప్పనిసరిగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసినట్లు తెలిపారు.రాబోయే వర్షాకాలం సీజన్ నుంచి రాష్ట్ర ప్రభుత్వ పథకాలు అయిన రైతు భరోసా, రుణమాఫీ, మొక్కజొన్న, పత్తి, ధాన్యం కొనుగోలు, యూరియా మరియు ఇతర ఎరువుల పంపిణీకి ఫార్మర్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి అవుతుందని స్పష్టం చేశారు. రైతులు తమ ఆధార్ కార్డు, భూ యాజమాన్య పాస్‌బుక్, ఆధార్‌కు అనుసంధానమైన మొబైల్ నంబర్‌తో సమీపంలోని వ్యవసాయ అధికారి లేదా వ్యవసాయ విస్తరణ అధికారిని సంప్రదించవచ్చని, లేక సమీప మీ సేవ కేంద్రాలను సంప్రదించి వెంటనే ఫార్మర్ ఐడీ నమోదు ప్రక్రియను పూర్తి చేసుకోవాలని సూచించారు. వ్యవసాయ శాఖ అధికారులు, మీసేవ కేంద్రాల వారు తమ పరిధిలోని ప్రతి రైతుకు అవగాహన కల్పించి, రిజిస్ట్రేషన్ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.

More news from తెలంగాణ and nearby areas
  • *ITC భద్రాచలం పేపర్ బోర్డ్స్ వద్ద ఉధృతమైన INTUC నిరసన* *14వ LTA జాప్యంపై కార్మికుల తీవ్ర ఆగ్రహం* *ఎండను సైతం లెక్క చేయక నిర్విరామంగా 8 గంటల పాటు ధర్నా* *కార్మిక నినాదాలతో మార్మోగిన అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్* *పరిశ్రమ చరిత్రలో మొదటిసారి 8 గంటల పాటు అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ ముందు ధర్నా* భద్రాచలం పేపర్ బోర్డ్స్ (ITC) యూనిట్ వద్ద INTUC మిత్రపక్షాలు ఆధ్వర్యంలో కార్మికులు భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు. 14వ LTA అమలులో యాజమాన్యం చేస్తున్న జాప్యాన్ని నిరసిస్తూ సోమవారం ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు నల్ల బ్యాడ్జీలు ధరించి ప్లే కార్డులు ప్రదర్శిస్తూ. నినాదాలు చేస్తూ అడ్మిన్ బ్లాక్ ముందు కార్మికులు బైఠాయించారు. ఈ నిరసన కార్యక్రమానికి యూనియన్ అధ్యక్షులు శ్రీ గోనే రామారావు , ప్రధాన కార్యదర్శి శ్రీ యారం పిచ్చి రెడ్డి నాయకత్వం వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పరిశ్రమ లాభాల్లో నడుస్తున్నప్పటికీ, కార్మికుల న్యాయమైన కోర్కెలను తీర్చడంలో యాజమాన్యం నిర్లక్ష్యం వహిస్తోందని విమర్శించారు. మ్యాన్ పవర్ తగ్గించి పని భారాన్ని పెంచాలనే ఆలోచనను విరమించుకోవాలని డిమాండ్ చేశారు ఇప్పటికైనా యాజమాన్యం స్పందించి సానుకూల నిర్ణయం తీసుకోకపోతే, రాబోయే రోజుల్లో ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా గుర్తింపు సంఘానికి కూడా హెచ్చరిస్తున్నాం వేతన ఒప్పందంపై ఎన్నో ఆశలతో ఉన్న కార్మికులను ఇంకా మోసగించకండి. గతంలో అపోజిషన్గా ఉండి ప్యాకేజ్ సాధనకై గొంతెత్తి అరిసిన సందర్భాలను గుర్తు చేసుకోండి! అర్ధనగ్న ప్రదర్శనలతో ఒక్క మాన్ పవర్ కూడా తీయకూడదన్న కార్మికుల ఆవేదన అర్థం చేసుకోండి! నూతన కోటర్స్ నిర్మాణాన్ని వెంటనే పూర్తి చేయండి! రిటైర్డ్, వైద్యం, విద్య, బదిలీ కార్మికుల పర్మనెంట్, శ్రీరామనవమికి పేయిడ్ హాలిడే, జాబ్ క్యాలెండర్, డిపార్ట్మెంట్ గ్రేడ్లకై వేచి ఉన్న, తపిస్తున్న కార్మికులను | దృష్టిలో పెట్టుకొని 22,000/- తగ్గకుండా వేతన ఒప్పందం పూర్తి చేయండి. అలాగే పరిశ్రమ 50 సం॥రాలు పూర్తిచేసుకున్న సందర్భంగా ప్రతి కార్మికునికి పది గ్రాముల గోల్డ్ కాయిన్ బహుమతిగా ఇప్పించండి. మీకు ప్రతికూల పరిస్థితులు ఉంటే రండి కార్మికుల్లో కలవండి కార్మికులను న్యాయం చేసే భాగంలో మాతో కలవండి మీకు పూర్తి సహాయాసహకారాలు అందిస్తామన్నారు ఈ కార్యక్రమంలో ఐ ఎన్ టి యు సి మిత్రపక్షాల ఆఫీస్ బేరర్స్ నాయకులు కార్యకర్తలు కార్మికులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు
    1
    *ITC భద్రాచలం పేపర్ బోర్డ్స్ వద్ద ఉధృతమైన INTUC నిరసన*
*14వ LTA జాప్యంపై కార్మికుల తీవ్ర ఆగ్రహం*
*ఎండను సైతం లెక్క చేయక నిర్విరామంగా 8 గంటల పాటు ధర్నా*
*కార్మిక నినాదాలతో మార్మోగిన అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్*
*పరిశ్రమ చరిత్రలో మొదటిసారి 8 గంటల పాటు అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ ముందు ధర్నా* 
భద్రాచలం పేపర్ బోర్డ్స్ (ITC) యూనిట్ వద్ద INTUC  మిత్రపక్షాలు ఆధ్వర్యంలో కార్మికులు భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు. 14వ LTA  అమలులో యాజమాన్యం చేస్తున్న జాప్యాన్ని నిరసిస్తూ సోమవారం ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు నల్ల బ్యాడ్జీలు ధరించి ప్లే కార్డులు ప్రదర్శిస్తూ. నినాదాలు చేస్తూ అడ్మిన్ బ్లాక్ ముందు కార్మికులు బైఠాయించారు.
ఈ నిరసన కార్యక్రమానికి యూనియన్ అధ్యక్షులు శ్రీ గోనే రామారావు , ప్రధాన కార్యదర్శి శ్రీ యారం పిచ్చి రెడ్డి నాయకత్వం వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ  పరిశ్రమ లాభాల్లో నడుస్తున్నప్పటికీ, కార్మికుల న్యాయమైన కోర్కెలను తీర్చడంలో యాజమాన్యం నిర్లక్ష్యం వహిస్తోందని విమర్శించారు. మ్యాన్ పవర్ తగ్గించి పని భారాన్ని పెంచాలనే ఆలోచనను విరమించుకోవాలని డిమాండ్ చేశారు ఇప్పటికైనా యాజమాన్యం స్పందించి సానుకూల నిర్ణయం తీసుకోకపోతే, రాబోయే రోజుల్లో ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
ఈ సందర్భంగా గుర్తింపు సంఘానికి కూడా హెచ్చరిస్తున్నాం 
వేతన ఒప్పందంపై ఎన్నో ఆశలతో ఉన్న కార్మికులను ఇంకా మోసగించకండి. గతంలో అపోజిషన్గా ఉండి ప్యాకేజ్ సాధనకై గొంతెత్తి అరిసిన సందర్భాలను గుర్తు చేసుకోండి! అర్ధనగ్న ప్రదర్శనలతో ఒక్క మాన్ పవర్ కూడా తీయకూడదన్న కార్మికుల ఆవేదన అర్థం చేసుకోండి! నూతన కోటర్స్ నిర్మాణాన్ని వెంటనే పూర్తి చేయండి! రిటైర్డ్, వైద్యం, విద్య, బదిలీ కార్మికుల పర్మనెంట్, శ్రీరామనవమికి పేయిడ్ హాలిడే, జాబ్ క్యాలెండర్, డిపార్ట్మెంట్ గ్రేడ్లకై  వేచి ఉన్న, తపిస్తున్న కార్మికులను | దృష్టిలో పెట్టుకొని 22,000/- తగ్గకుండా వేతన ఒప్పందం పూర్తి చేయండి. అలాగే పరిశ్రమ 50 సం॥రాలు పూర్తిచేసుకున్న సందర్భంగా ప్రతి కార్మికునికి పది గ్రాముల గోల్డ్ కాయిన్ బహుమతిగా ఇప్పించండి. మీకు ప్రతికూల పరిస్థితులు ఉంటే రండి కార్మికుల్లో కలవండి కార్మికులను న్యాయం చేసే భాగంలో మాతో కలవండి మీకు పూర్తి సహాయాసహకారాలు అందిస్తామన్నారు ఈ కార్యక్రమంలో ఐ ఎన్ టి యు సి మిత్రపక్షాల ఆఫీస్ బేరర్స్ నాయకులు కార్యకర్తలు కార్మికులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు
    user_Shivaram
    Shivaram
    Accountant బుర్గుంపహాడ్, భద్రాద్రి కొత్తగూడెం, తెలంగాణ•
    17 hrs ago
  • Post by Ramprasad islavath
    1
    Post by Ramprasad islavath
    user_Ramprasad islavath
    Ramprasad islavath
    Industrial Real Estate Agency కల్లూరు, ఖమ్మం, తెలంగాణ•
    22 min ago
  • చాలా చక్కటి పోస్ట్! అందరికీ అర్ధమైయ్యేట్లు వువరించారు. అందరూ విని పాటించాల్సిన విషయాలు. *చక్కని ఆరోగ్యం కోరుకునేవారు,40సం.పైబడిన వారు ఈ వీడియో చూడడానికి సమయం కేటాయించండి. ఫాలోఅవ్వండి.*
    2
    చాలా చక్కటి పోస్ట్! అందరికీ అర్ధమైయ్యేట్లు వువరించారు. అందరూ విని పాటించాల్సిన విషయాలు. *చక్కని ఆరోగ్యం కోరుకునేవారు,40సం.పైబడిన వారు ఈ వీడియో చూడడానికి సమయం కేటాయించండి. ఫాలోఅవ్వండి.*
    user_Gurrala vigeswara ramarao
    Gurrala vigeswara ramarao
    చింతలపూడి, ఏలూరు, ఆంధ్రప్రదేశ్•
    2 hrs ago
  • ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ఏప్రిల్ 20వ తేదీ నుండి 26వ తేదీ వరకు వారం రోజులు రాష్ట్రవ్యాప్తంగా అన్ని వసతి గృహాలు సంక్షేమ విద్యాసంస్థలలో సంక్షేమ వారోత్సవాలు ప్రారంభం అయ్యాయి, మహబూబాబాద్ జిల్లా గూడూరు మరిమిట్టా *మహాత్మ జ్యోతిరావు పూలే వసతిగృహం* (బాలికలు) లో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో *జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్* పాల్గొని పిల్లలతో కలిసి భోజనం చేశారు, ఈ సందర్భంగా కలెక్టర్ మహాత్మ జ్యోతిరావు పూలే వసతి గృహంలో పరిసరాలను పరిశీలించారు, ఈ వారం రోజులలో ప్రతిరోజు ఒక థీమ్ ద్వారా వసతి గృహాలలో సానిటేషన్, మైనర్ రిపేర్, హెల్త్, స్టోర్ పరిసరాల పరిశుభ్రత తదితర అంశాలపై ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు, వసతి గృహంలోని స్టోర్ గది, తరగతి గదులు, కిచెన్, డైనింగ్ హాల్, మరుగుదొడ్లు, లను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సంబంధిత వసతి గృహాల సిబ్బంది ఆదేశించారు, భోజనం సిద్ధం చేసే సిబ్బంది కి షెడ్యూల్ ప్రకారం వైద్య పరీక్షలు నిర్వహించాలని సూచించారు, అన్ని వసతి గృహాలలో ఫిర్యాదుల బాక్సులు ఏర్పాటు చేయాలని సూచించారు, విద్యార్థిని, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు, డైట్ నేను ప్రకారం పక్కాగా నాణ్యమైన రుచికరమైన ఆహారాన్ని అందించాలని, విద్యతోపాటు క్రీడా మానసిక వికాసం తదితర అంశాలపై శిక్షణ ఇప్పించాలని, సమ్మర్ క్యాంపు ల ద్వారా పిల్లలకు క్రీడల్లో పాల్గొనే అవకాశం కల్పించాలన్నారు, పిల్లల యొక్క విద్యాసామర్ధ్యాలను స్వయంగా పరిశీలించారు నూతన టెక్నాలజీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డిజిటల్ తరగతుల ద్వారా అత్యాధునిక వినూత్న రీతిలో విద్యాబోధనలు అందించాలని ఉపాధ్యాయునీ ఉపాధ్యాయులకు సూచించారు, అత్యుత్తమ ఫలితాలను సాధించేందుకు కృషి చేయాలని, ఈ వారం రోజులు అన్ని విద్యాసంస్థలలో రోజువారి కార్యక్రమాలను పకడ్బందీగా నిర్వహించాలని తెలిపారు, ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈరోజు నుండి ఏప్రిల్ 26 వరకు వారం రోజులు జిల్లాలో సంక్షేమ వారోత్సవాలను నిర్వహించడం కోసం ఇప్పటికే పక్కా ప్రణాళికతో ప్రతి ఒక్కరికి వసతి గృహాలు హాస్టల్స్, విద్యాసంస్థలను కేటాయించడం జరిగిందని తెలిపారు, కలెక్టర్ వెంట గూడూరు తాసిల్దార్ నాగభవాని, ఎంపీడీవో, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. -
    1
    ప్రజాపాలన -  ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ఏప్రిల్ 20వ తేదీ నుండి 26వ తేదీ వరకు వారం రోజులు  రాష్ట్రవ్యాప్తంగా అన్ని వసతి గృహాలు సంక్షేమ విద్యాసంస్థలలో సంక్షేమ వారోత్సవాలు ప్రారంభం అయ్యాయి,
మహబూబాబాద్ జిల్లా గూడూరు మరిమిట్టా *మహాత్మ జ్యోతిరావు పూలే వసతిగృహం* (బాలికలు) లో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో *జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్* పాల్గొని పిల్లలతో కలిసి భోజనం చేశారు, 
ఈ సందర్భంగా కలెక్టర్ మహాత్మ జ్యోతిరావు పూలే వసతి గృహంలో పరిసరాలను పరిశీలించారు,
ఈ వారం రోజులలో ప్రతిరోజు ఒక థీమ్ ద్వారా వసతి గృహాలలో సానిటేషన్, మైనర్ రిపేర్, హెల్త్, స్టోర్ పరిసరాల పరిశుభ్రత తదితర అంశాలపై ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు,
వసతి గృహంలోని స్టోర్ గది, తరగతి గదులు, కిచెన్, డైనింగ్ హాల్, మరుగుదొడ్లు, లను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సంబంధిత వసతి గృహాల సిబ్బంది ఆదేశించారు,
భోజనం సిద్ధం చేసే సిబ్బంది కి షెడ్యూల్ ప్రకారం వైద్య పరీక్షలు నిర్వహించాలని సూచించారు, 
అన్ని వసతి గృహాలలో ఫిర్యాదుల బాక్సులు ఏర్పాటు చేయాలని సూచించారు, విద్యార్థిని, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు, డైట్ నేను ప్రకారం పక్కాగా నాణ్యమైన రుచికరమైన ఆహారాన్ని అందించాలని, విద్యతోపాటు క్రీడా మానసిక వికాసం తదితర అంశాలపై శిక్షణ ఇప్పించాలని, సమ్మర్ క్యాంపు ల ద్వారా పిల్లలకు క్రీడల్లో పాల్గొనే అవకాశం కల్పించాలన్నారు, 
పిల్లల యొక్క విద్యాసామర్ధ్యాలను స్వయంగా పరిశీలించారు నూతన టెక్నాలజీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డిజిటల్ తరగతుల ద్వారా అత్యాధునిక వినూత్న రీతిలో విద్యాబోధనలు అందించాలని ఉపాధ్యాయునీ ఉపాధ్యాయులకు సూచించారు,
అత్యుత్తమ ఫలితాలను సాధించేందుకు కృషి చేయాలని, ఈ వారం రోజులు అన్ని విద్యాసంస్థలలో రోజువారి కార్యక్రమాలను పకడ్బందీగా నిర్వహించాలని తెలిపారు,
ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈరోజు నుండి ఏప్రిల్ 26 వరకు వారం రోజులు జిల్లాలో సంక్షేమ వారోత్సవాలను నిర్వహించడం కోసం ఇప్పటికే పక్కా ప్రణాళికతో ప్రతి ఒక్కరికి వసతి గృహాలు హాస్టల్స్, విద్యాసంస్థలను కేటాయించడం జరిగిందని తెలిపారు,
కలెక్టర్ వెంట గూడూరు తాసిల్దార్ నాగభవాని, ఎంపీడీవో, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. 
-
    user_Mogulagani Mahendar Mogulagani Mahendar
    Mogulagani Mahendar Mogulagani Mahendar
    మహబూబాబాద్, మహబూబాబాద్, తెలంగాణ•
    15 hrs ago
  • వరంగల్ రంగంపేటలోని శ్రీ భద్రకాళి రోడ్‌పై ఉన్న శ్రీ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి దేవాలయం, శ్రీ కాశీవిశ్వేశ్వర ఆలయం, శ్రీ గాయత్రి మాత దేవాలయాల సముదాయంలో ఈ ఉదయం భక్తి వైభవం నెలకొంది. ఆలయ అర్చకులు జి. కార్తిక్ చారి ఆధ్వర్యంలో శ్రీ రామదూత హనుమాన్ చాలీసా 11 సార్లు పారాయణం నిర్వహించారు. ఇది 101వ దేవాలయ కార్యక్రమంగా ప్రత్యేకత సంతరించుకుంది. ఈ కార్యక్రమంలో ఆకుతోట బాల కొమురెల్లి స్వామి, మాటేటి సత్యనారాయణ (సత్యం) స్వామి, జగన్మోహన్ రెడ్డి, మూడు నగేష్ స్వామి, లాస్య శ్రీ స్వామి, అరవింద స్వామి, ఎం. రాజేందర్ చారి, జి. కృష్ణ స్వామి, ప్రదీప్, గోపీచంద్, ఆర్. సాత్విక, ఏ. వినయ్, ఈశ్వర్, శిల్ప తదితరులు పాల్గొన్నారు. స్వామివారికి వివిధ రకాల పుష్పాలతో అలంకరణ చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నామస్మరణ, రామకీర్తనలు, భజనలు ఘనంగా నిర్వహించబడాయి. ఈ సందర్భంగా భక్తులు వివిధ ప్రాంతాల నుంచి తరలి వచ్చి స్వామివారి దర్శనం చేసుకుని హనుమాన్ చాలీసా పఠిస్తూ భక్తి పారవశ్యంలో మునిగిపోయారు.
    2
    వరంగల్ రంగంపేటలోని శ్రీ భద్రకాళి రోడ్‌పై ఉన్న శ్రీ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి దేవాలయం, శ్రీ కాశీవిశ్వేశ్వర ఆలయం, శ్రీ గాయత్రి మాత దేవాలయాల సముదాయంలో ఈ ఉదయం భక్తి వైభవం నెలకొంది. ఆలయ అర్చకులు జి. కార్తిక్ చారి ఆధ్వర్యంలో శ్రీ రామదూత హనుమాన్ చాలీసా 11 సార్లు పారాయణం నిర్వహించారు. ఇది 101వ దేవాలయ కార్యక్రమంగా ప్రత్యేకత సంతరించుకుంది.
ఈ కార్యక్రమంలో ఆకుతోట బాల కొమురెల్లి స్వామి, మాటేటి సత్యనారాయణ (సత్యం) స్వామి, జగన్మోహన్ రెడ్డి, మూడు నగేష్ స్వామి, లాస్య శ్రీ స్వామి, అరవింద స్వామి, ఎం. రాజేందర్ చారి, జి. కృష్ణ స్వామి, ప్రదీప్, గోపీచంద్, ఆర్. సాత్విక, ఏ. వినయ్, ఈశ్వర్, శిల్ప తదితరులు పాల్గొన్నారు.
స్వామివారికి వివిధ రకాల పుష్పాలతో అలంకరణ చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నామస్మరణ, రామకీర్తనలు, భజనలు ఘనంగా నిర్వహించబడాయి. ఈ సందర్భంగా భక్తులు వివిధ ప్రాంతాల నుంచి తరలి వచ్చి స్వామివారి దర్శనం చేసుకుని హనుమాన్ చాలీసా పఠిస్తూ భక్తి పారవశ్యంలో మునిగిపోయారు.
    user_Chetty:Ramesh
    Chetty:Ramesh
    నర్సంపేట, వరంగల్, తెలంగాణ•
    15 hrs ago
  • జడ్డంగి: ముందస్తు సమాచారం మేరకు జడ్డంగి పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో భారీగా గంజాయి పట్టుబడింది. పోలవరం ఎస్‌పి ఆదేశాలతో, రంపచోడవరం ఎస్‌డీపీవో మరియు రాజవొమ్మంగి సిఐ పర్యవేక్షణలో హైవే నెం. 516E లోని SRC క్యాంప్ వద్ద వాహన తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో అనుమానాస్పదంగా ఉన్న బొలేరో వాహనాన్ని తనిఖీ చేయగా, సుమారు రూ. 4 లక్షల విలువైన 80 కిలోల గంజాయి లభ్యమైంది. పోలీసులు గంజాయితో పాటు వాహనం, రెండు మొబైల్ ఫోన్లు, రూ. 900 నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో జి.కె.వీడి మండలానికి చెందిన పాంగి నూకరాజు, ఒడిశా రాష్ట్రానికి చెందిన కొప్పు దేవరాజులను అరెస్ట్ చేశారు. గెజిటెడ్ అధికారి జి. సీతారామ్ సమక్షంలో జరిగిన ఈ రైడ్ అనంతరం, అక్రమ రవాణాకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.
    1
    జడ్డంగి: ముందస్తు సమాచారం మేరకు జడ్డంగి పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో భారీగా గంజాయి పట్టుబడింది. పోలవరం ఎస్‌పి ఆదేశాలతో, రంపచోడవరం ఎస్‌డీపీవో మరియు రాజవొమ్మంగి సిఐ పర్యవేక్షణలో హైవే నెం. 516E లోని SRC క్యాంప్ వద్ద వాహన తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో అనుమానాస్పదంగా ఉన్న బొలేరో వాహనాన్ని తనిఖీ చేయగా, సుమారు రూ. 4 లక్షల విలువైన 80 కిలోల గంజాయి లభ్యమైంది. పోలీసులు గంజాయితో పాటు వాహనం, రెండు మొబైల్ ఫోన్లు, రూ. 900 నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో జి.కె.వీడి మండలానికి చెందిన పాంగి నూకరాజు, ఒడిశా రాష్ట్రానికి చెందిన కొప్పు దేవరాజులను అరెస్ట్ చేశారు. గెజిటెడ్ అధికారి జి. సీతారామ్ సమక్షంలో జరిగిన ఈ రైడ్ అనంతరం, అక్రమ రవాణాకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.
    user_Vidya Sagar Tumu
    Vidya Sagar Tumu
    అడ్డతీగల, అల్లూరి సీతారామ రాజు, ఆంధ్రప్రదేశ్•
    14 hrs ago
  • హన్మకొండ నగరంలోని ఎక్సైజ్ కాలనీ పరిధిలో వెంకటేశ్వర స్వామి దేవాలయం సమీపంలో చైన్ స్నాచింగ్ ఘటన చోటుచేసుకుంది. చింతల కల్పన ఇంటికి వెళ్తుండగా బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు ఆమె మెడలో ఉన్న సుమారు 28 గ్రాముల బంగారు గొలుసును లాక్కొని పరారయ్యారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రంజిత్ కుమార్ తెలిపారు.
    1
    హన్మకొండ నగరంలోని ఎక్సైజ్ కాలనీ పరిధిలో వెంకటేశ్వర స్వామి దేవాలయం సమీపంలో చైన్ స్నాచింగ్ ఘటన చోటుచేసుకుంది. చింతల కల్పన ఇంటికి వెళ్తుండగా బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు ఆమె మెడలో ఉన్న సుమారు 28 గ్రాముల బంగారు గొలుసును లాక్కొని పరారయ్యారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రంజిత్ కుమార్ తెలిపారు.
    user_M D Azizuddin
    M D Azizuddin
    జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    1 hr ago
  • Post by Ramprasad islavath
    1
    Post by Ramprasad islavath
    user_Ramprasad islavath
    Ramprasad islavath
    Industrial Real Estate Agency కల్లూరు, ఖమ్మం, తెలంగాణ•
    4 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.