logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

- వ్యవసాయ మార్కెట్లలో పూర్తి స్థాయి డిజిటలీకరణకు చర్యలు - అక్రమాలకు తావులేకుండా మార్కెటింగ్ శాఖను పారదర్శకంగా తీర్చిదిద్దాలి - అభివృద్ది పనులన్నీ నిర్దేశించుకొన్న లక్ష్యం వరకు పూర్తి చేయాలి - అన్ని మార్కెట్ యార్డులు, గోదాముల్లో సౌర విద్యుత్ వ్యవస్థలు ఏర్పాటు 3 నెలల్లో పూర్తి చేయాలి - కోహెడ సమీకృత పండ్ల మార్కెట్ నిర్మాణ పనులలో మాసం వారి పురోగతి నిర్దేశించుకొని ముందుకెళ్లాలి. అధికారులకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశం రాష్ట్రంలోని వ్యవసాయ మార్కెటింగ్ శాఖను లక్ష్యం సాంకేతిక పరిజ్ఞానంతో మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా తీర్చిదిద్దేందుకు వేగంగా చర్యలు చేపట్టాలని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార శాఖ మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. మార్కెటింగ్ శాఖపై శనివారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో శాఖ పనితీరు, అభివృద్ధి పనులు, డిజిటలీకరణ, పత్తి కొనుగోళ్ల సన్నద్ధత, ఇంజినీరింగ్ పనులు, మార్కెట్ యార్డులలో సౌర విద్యుత్ వ్యవస్థల ఏర్పాటు, ప్రత్యేక బృందాల తనిఖీలు తదితర అంశాలపై సమగ్రంగా సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... రాష్ట్రంలోని 206 మార్కెట్ కమిటీలను పూర్తిస్థాయిలో ఆటోమేషన్ చేయాలని మంత్రి ఆదేశించారు. ఇందుకు సంబంధించిన ప్రణాళికలు, టెండర్ ప్రక్రియలను ఆగస్టు నెలాఖరులోగా పూర్తి చేసి, సెప్టెంబర్ నుంచి అమలు ప్రారంభించాలని సూచించారు. ప్రతి మార్కెట్ కమిటీలో సీసీ కెమెరాలు, ఎలక్ట్రానిక్ వెయింగ్ స్కేల్స్, గేట్ ఎంట్రీ-ఎగ్జిట్ వ్యవస్థలను ఒకే డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌పై అనుసంధానం చేయాలని ఆదేశించారు. రవాణా శాఖలో అమలవుతున్న నంబర్ ప్లేట్ స్కానింగ్ విధానాన్ని మార్కెట్ యార్డుల్లో కూడా అమలు చేసి, ప్రతి వాహనం ప్రవేశం, నిష్క్రమణ, తూకం, లావాదేవీలన్నీ డిజిటల్ రూపంలో నమోదయ్యేలా అవసరమైన సాఫ్ట్‌వేర్‌ను రూపొందించాలని ఐటీ విభాగానికి సూచించారు. ఇకపై మార్కెటింగ్ శాఖలో జరిగే అన్ని కొనుగోళ్లు పూర్తిగా డిజిటల్ విధానంలోనే నిర్వహించాలని స్పష్టం చేశారు. ఇటీవల ఏర్పాటు చేసిన ఏడు ప్రత్యేక తనిఖీ బృందాలు ఈ వారం నిర్వహించిన తనిఖీలపై వచ్చే సోమవారం లోగా నివేదికలు సమర్పించాలని ఆదేశించారు. ఆ నివేదికల ఆధారంగా మార్కెటింగ్ డైరెక్టర్, వ్యవసాయ శాఖ కార్యదర్శి తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ బృందాల పనితీరుకు వారంవారీ టైమ్‌బౌండ్ వ్యవస్థ అమలు చేయాలని స్పష్టం చేశారు. రానున్న పత్తి కొనుగోలు సీజన్‌కు ముందుగానే సమగ్ర సన్నద్ధత అవసరమని పేర్కొన్న మంత్రి, కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (CCI), జిన్నింగ్ మిల్లుల యాజమాన్యాలు, సంబంధిత అధికారులతో ఆగస్టు మొదటి లేదా రెండో వారంలో సంయుక్త సమావేశం నిర్వహించాలని ఆదేశించారు. గత రెండు సంవత్సరాల్లో విజిలెన్స్ విభాగం గుర్తించిన లోపాలను దృష్టిలో ఉంచుకొని, గతంలో జరిగిన అక్రమాలకు ఎటువంటి అవకాశం లేకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. కనీస మద్దతు ధర (MSP) ప్రయోజనం పూర్తిగా రైతులకే అందేలా చర్యలు చేపట్టాలని, అక్రమాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కొత్తగా కొనుగోలు చేసే ప్యాడీ క్లీనర్లు, డ్రయర్లు, లిఫ్టర్లు వంటి పరికరాలను కొనుగోలు చేసే ముందు సాంకేతిక పరీక్షలు నిర్వహించి, అధికారులకు అవసరమైన శిక్షణ ఇవ్వాలని ఆదేశించారు. ఆయా పరికరాలు నిజంగా అవసరమైన జిల్లాల్లో మాత్రమే కొనుగోలు చేయాలని, ఉపయోగం లేకుండా పరికరాలు కొనుగోలు చేసి మూలన పడేస్తే సంబంధిత కార్యదర్శి, జిల్లా మార్కెటింగ్ అధికారులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. మార్కెటింగ్ శాఖలో కొనసాగుతున్న ఇంజినీరింగ్ పనులన్నింటికీ స్పష్టమైన గడువులు నిర్ధారించి, ఈ ఆర్థిక సంవత్సరంలోనే పూర్తి చేసేలా కార్యాచరణ రూపొందించాలని మంత్రి ఆదేశించారు. శాఖలో ఇంజినీరింగ్ సిబ్బంది కొరత వల్ల పనులు ఆలస్యం అయితే, అవసరమైతే ఆ పనులను ఆర్ అండ్ బి (R&B), పంచాయతీరాజ్ (PR) శాఖలకు అప్పగించి వేగవంతంగా పూర్తి చేయాలని ఏపీసీకి సూచించారు. శాఖకు కేటాయించిన ఇంజినీర్లు విధులకు హాజరుకాకపోతే వారిపై క్రమశిక్షణ చర్యలు ప్రారంభించాలని ఆదేశించారు. ప్రతి పనికి టైమ్‌బౌండ్ కార్యాచరణ తప్పనిసరిగా ఉండాలని స్పష్టం చేశారు. మార్కెట్ యార్డుల్లో పెండింగ్‌లో ఉన్న బిల్లులు, ఇతర సమస్యలపై సమగ్ర నివేదిక సిద్ధం చేసి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాలని శాఖ కార్యదర్శిని ఆదేశించారు. రాష్ట్రంలోని అన్ని మార్కెట్ యార్డులు, గోదాముల్లో సౌర విద్యుత్ వ్యవస్థలు ఏర్పాటు చేయడాన్ని అత్యంత ప్రాధాన్యంగా తీసుకోవాలని మంత్రి పేర్కొన్నారు. వచ్చే నెలలోగా అన్ని మార్కెట్ కమిటీల నుంచి ఫీజిబిలిటీ నివేదికలు సేకరించి, సెప్టెంబర్ నుంచి పనులు ప్రారంభించి, నవంబర్ నాటికి అన్ని మార్కెట్ యార్డులు, గోదాముల్లో సౌర విద్యుత్ వ్యవస్థలు ఏర్పాటు చేసేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కోహెడ సమీకృత పండ్ల మార్కెట్ నిర్మాణానికి సంబంధించి ఏజెన్సీ తయారుచేసిన డిజైన్లను వచ్చే వారంలోగా ఖరారు చేసి, ముఖ్యమంత్రి గారి అనుమతితో వచ్చే నెలలో నిర్మాణ పనులను ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. మార్కెటింగ్ శాఖలో ఇంజినీరింగ్, పరిపాలన విభాగాల్లో ఎక్కడ సిబ్బంది కొరత ఉందో వెంటనే గుర్తించి, అదనపు పోస్టుల మంజూరు కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని మార్కెటింగ్ శాఖ డైరెక్టర్‌ను మంత్రి ఆదేశించారు. శాఖ అవసరాలకు అనుగుణంగా సిబ్బందిని భర్తీ చేసి, పనుల్లో ఎలాంటి జాప్యం లేకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఈ రోజు సచివాలయంలో వరంగల్, భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, సూర్యాపేట, నల్గొండ, నిర్మల్, ఖమ్మం జిల్లాలకు చెందిన ఆయిల్ పామ్ ఫార్మర్స్ అసోసియేషన్ నాయకులు శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, శ్రీ శాంభరెడ్డి ఆధ్వర్యంలో వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత & జౌళి శాఖల గౌరవ మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వరరావును మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగు విస్తరణకు మంత్రి చేపడుతున్న చర్యలను రైతు నాయకులు అభినందిస్తూ కృతజ్ఞతలు తెలిపారు. రైతులకు నాణ్యమైన ఆయిల్ పామ్ మొక్కలు సకాలంలో అందుబాటులో ఉండేలా కంపెనీలను ఆదేశించాలని, అవసరమైన ఎరువులు, ఇతర వ్యవసాయ సామగ్రిని ఆయిల్ పామ్ కంపెనీల ద్వారా తక్కువ ధరలకు సరఫరా చేయాలని కోరారు. అలాగే ఆయిల్ పామ్ తోటలలో విద్యుత్ వైర్ల సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని, రైతులకు ఇబ్బందులు లేకుండా ప్రతి మండలంలో కనీసం ఒక ఆయిల్ పామ్ గెలల సేకరణ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా ఆయిల్ పామ్ రైతులకు బ్యాంకుల ద్వారా రుణ సౌకర్యం కల్పించాలని, కార్మికుల కొరతను అధిగమించేందుకు యంత్ర పరికరాలను సబ్సిడీపై అందించాలని, కస్టమ్ హైరింగ్ సెంటర్లను ఏర్పాటు చేయాలని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ, ఆయిల్ పామ్ రైతుల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ కట్టుబడి ఉందని తెలిపారు. రైతుల ఆదాయం పెంపు లక్ష్యంగా ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతోందని, ప్రతి జిల్లాలో ఆయిల్ పామ్ సాగు విస్తరణకు అధికారులు, కంపెనీలు, రైతులు సమన్వయంతో కృషి చేయాలని సూచించారు. తెలంగాణ ప్రాంతం దేశంలోనే ఆయిల్ పామ్ సాగుకు అత్యంత అనుకూలమైన ప్రాంతమని, ఆయిల్ పామ్ అధిక ఆదాయం అందించే పంట అని, దీనికి మార్కెటింగ్ సమస్యలు లేవని, ప్రకృతి వైపరీత్యాల ప్రభావం కూడా తక్కువగా ఉంటుందని మంత్రి పేర్కొన్నారు. అంతర పంటల సాగు ద్వారా రైతులు అదనపు ఆదాయాన్ని పొందే అవకాశం కూడా ఉందన్నారు. రైతులు కోరిన వెంటనే నాణ్యమైన మొక్కలను అందుబాటులో ఉంచేలా ఆయిల్ పామ్ కంపెనీలకు ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు మంత్రి తెలిపారు.

3 hrs ago
user_Ramprasad islavath
Ramprasad islavath
Taxi Driver కల్లూరు, ఖమ్మం, తెలంగాణ•
3 hrs ago
ae90c38a-3eb5-4308-9ebf-055e52feea09

- వ్యవసాయ మార్కెట్లలో పూర్తి స్థాయి డిజిటలీకరణకు చర్యలు - అక్రమాలకు తావులేకుండా మార్కెటింగ్ శాఖను పారదర్శకంగా తీర్చిదిద్దాలి - అభివృద్ది పనులన్నీ నిర్దేశించుకొన్న లక్ష్యం వరకు పూర్తి చేయాలి - అన్ని మార్కెట్ యార్డులు, గోదాముల్లో సౌర విద్యుత్ వ్యవస్థలు ఏర్పాటు 3 నెలల్లో పూర్తి చేయాలి - కోహెడ సమీకృత పండ్ల మార్కెట్ నిర్మాణ పనులలో మాసం వారి పురోగతి నిర్దేశించుకొని ముందుకెళ్లాలి. అధికారులకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశం రాష్ట్రంలోని వ్యవసాయ మార్కెటింగ్ శాఖను లక్ష్యం సాంకేతిక పరిజ్ఞానంతో మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా తీర్చిదిద్దేందుకు వేగంగా చర్యలు చేపట్టాలని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార శాఖ మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. మార్కెటింగ్ శాఖపై శనివారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో శాఖ పనితీరు, అభివృద్ధి పనులు, డిజిటలీకరణ, పత్తి కొనుగోళ్ల సన్నద్ధత, ఇంజినీరింగ్ పనులు, మార్కెట్ యార్డులలో సౌర విద్యుత్ వ్యవస్థల ఏర్పాటు, ప్రత్యేక బృందాల తనిఖీలు తదితర అంశాలపై సమగ్రంగా సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... రాష్ట్రంలోని 206 మార్కెట్ కమిటీలను పూర్తిస్థాయిలో ఆటోమేషన్ చేయాలని మంత్రి ఆదేశించారు. ఇందుకు సంబంధించిన ప్రణాళికలు, టెండర్ ప్రక్రియలను ఆగస్టు నెలాఖరులోగా పూర్తి చేసి, సెప్టెంబర్ నుంచి అమలు ప్రారంభించాలని సూచించారు. ప్రతి మార్కెట్ కమిటీలో సీసీ కెమెరాలు, ఎలక్ట్రానిక్ వెయింగ్ స్కేల్స్, గేట్ ఎంట్రీ-ఎగ్జిట్ వ్యవస్థలను ఒకే డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌పై అనుసంధానం చేయాలని ఆదేశించారు. రవాణా శాఖలో అమలవుతున్న నంబర్ ప్లేట్ స్కానింగ్ విధానాన్ని మార్కెట్ యార్డుల్లో కూడా అమలు చేసి, ప్రతి వాహనం ప్రవేశం, నిష్క్రమణ, తూకం, లావాదేవీలన్నీ డిజిటల్ రూపంలో నమోదయ్యేలా అవసరమైన సాఫ్ట్‌వేర్‌ను రూపొందించాలని ఐటీ విభాగానికి సూచించారు. ఇకపై మార్కెటింగ్ శాఖలో జరిగే అన్ని కొనుగోళ్లు పూర్తిగా డిజిటల్ విధానంలోనే నిర్వహించాలని స్పష్టం చేశారు. ఇటీవల ఏర్పాటు చేసిన ఏడు ప్రత్యేక తనిఖీ బృందాలు ఈ వారం నిర్వహించిన తనిఖీలపై వచ్చే సోమవారం లోగా నివేదికలు సమర్పించాలని ఆదేశించారు. ఆ నివేదికల ఆధారంగా మార్కెటింగ్ డైరెక్టర్, వ్యవసాయ శాఖ కార్యదర్శి తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ బృందాల పనితీరుకు వారంవారీ టైమ్‌బౌండ్ వ్యవస్థ అమలు చేయాలని స్పష్టం చేశారు. రానున్న పత్తి కొనుగోలు సీజన్‌కు ముందుగానే సమగ్ర సన్నద్ధత అవసరమని పేర్కొన్న మంత్రి, కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (CCI), జిన్నింగ్ మిల్లుల యాజమాన్యాలు, సంబంధిత అధికారులతో

ed931f56-5b97-4496-9653-73a0ccba6d01

ఆగస్టు మొదటి లేదా రెండో వారంలో సంయుక్త సమావేశం నిర్వహించాలని ఆదేశించారు. గత రెండు సంవత్సరాల్లో విజిలెన్స్ విభాగం గుర్తించిన లోపాలను దృష్టిలో ఉంచుకొని, గతంలో జరిగిన అక్రమాలకు ఎటువంటి అవకాశం లేకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. కనీస మద్దతు ధర (MSP) ప్రయోజనం పూర్తిగా రైతులకే అందేలా చర్యలు చేపట్టాలని, అక్రమాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కొత్తగా కొనుగోలు చేసే ప్యాడీ క్లీనర్లు, డ్రయర్లు, లిఫ్టర్లు వంటి పరికరాలను కొనుగోలు చేసే ముందు సాంకేతిక పరీక్షలు నిర్వహించి, అధికారులకు అవసరమైన శిక్షణ ఇవ్వాలని ఆదేశించారు. ఆయా పరికరాలు నిజంగా అవసరమైన జిల్లాల్లో మాత్రమే కొనుగోలు చేయాలని, ఉపయోగం లేకుండా పరికరాలు కొనుగోలు చేసి మూలన పడేస్తే సంబంధిత కార్యదర్శి, జిల్లా మార్కెటింగ్ అధికారులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. మార్కెటింగ్ శాఖలో కొనసాగుతున్న ఇంజినీరింగ్ పనులన్నింటికీ స్పష్టమైన గడువులు నిర్ధారించి, ఈ ఆర్థిక సంవత్సరంలోనే పూర్తి చేసేలా కార్యాచరణ రూపొందించాలని మంత్రి ఆదేశించారు. శాఖలో ఇంజినీరింగ్ సిబ్బంది కొరత వల్ల పనులు ఆలస్యం అయితే, అవసరమైతే ఆ పనులను ఆర్ అండ్ బి (R&B), పంచాయతీరాజ్ (PR) శాఖలకు అప్పగించి వేగవంతంగా పూర్తి చేయాలని ఏపీసీకి సూచించారు. శాఖకు కేటాయించిన ఇంజినీర్లు విధులకు హాజరుకాకపోతే వారిపై క్రమశిక్షణ చర్యలు ప్రారంభించాలని ఆదేశించారు. ప్రతి పనికి టైమ్‌బౌండ్ కార్యాచరణ తప్పనిసరిగా ఉండాలని స్పష్టం చేశారు. మార్కెట్ యార్డుల్లో పెండింగ్‌లో ఉన్న బిల్లులు, ఇతర సమస్యలపై సమగ్ర నివేదిక సిద్ధం చేసి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాలని శాఖ కార్యదర్శిని ఆదేశించారు. రాష్ట్రంలోని అన్ని మార్కెట్ యార్డులు, గోదాముల్లో సౌర విద్యుత్ వ్యవస్థలు ఏర్పాటు చేయడాన్ని అత్యంత ప్రాధాన్యంగా తీసుకోవాలని మంత్రి పేర్కొన్నారు. వచ్చే నెలలోగా అన్ని మార్కెట్ కమిటీల నుంచి ఫీజిబిలిటీ నివేదికలు సేకరించి, సెప్టెంబర్ నుంచి పనులు ప్రారంభించి, నవంబర్ నాటికి అన్ని మార్కెట్ యార్డులు, గోదాముల్లో సౌర విద్యుత్ వ్యవస్థలు ఏర్పాటు చేసేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కోహెడ సమీకృత పండ్ల మార్కెట్ నిర్మాణానికి సంబంధించి ఏజెన్సీ తయారుచేసిన డిజైన్లను వచ్చే వారంలోగా ఖరారు చేసి, ముఖ్యమంత్రి గారి అనుమతితో వచ్చే నెలలో నిర్మాణ పనులను ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. మార్కెటింగ్ శాఖలో ఇంజినీరింగ్, పరిపాలన విభాగాల్లో ఎక్కడ సిబ్బంది కొరత ఉందో వెంటనే గుర్తించి, అదనపు పోస్టుల మంజూరు

965e9b8c-0324-4bbc-99d2-6ad31db85a46

కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని మార్కెటింగ్ శాఖ డైరెక్టర్‌ను మంత్రి ఆదేశించారు. శాఖ అవసరాలకు అనుగుణంగా సిబ్బందిని భర్తీ చేసి, పనుల్లో ఎలాంటి జాప్యం లేకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఈ రోజు సచివాలయంలో వరంగల్, భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, సూర్యాపేట, నల్గొండ, నిర్మల్, ఖమ్మం జిల్లాలకు చెందిన ఆయిల్ పామ్ ఫార్మర్స్ అసోసియేషన్ నాయకులు శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, శ్రీ శాంభరెడ్డి ఆధ్వర్యంలో వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత & జౌళి శాఖల గౌరవ మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వరరావును మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగు విస్తరణకు మంత్రి చేపడుతున్న చర్యలను రైతు నాయకులు అభినందిస్తూ కృతజ్ఞతలు తెలిపారు. రైతులకు నాణ్యమైన ఆయిల్ పామ్ మొక్కలు సకాలంలో అందుబాటులో ఉండేలా కంపెనీలను ఆదేశించాలని, అవసరమైన ఎరువులు, ఇతర వ్యవసాయ సామగ్రిని ఆయిల్ పామ్ కంపెనీల ద్వారా తక్కువ ధరలకు సరఫరా చేయాలని కోరారు. అలాగే ఆయిల్ పామ్ తోటలలో విద్యుత్ వైర్ల సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని, రైతులకు ఇబ్బందులు లేకుండా ప్రతి మండలంలో కనీసం ఒక ఆయిల్ పామ్ గెలల సేకరణ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా ఆయిల్ పామ్ రైతులకు బ్యాంకుల ద్వారా రుణ సౌకర్యం కల్పించాలని, కార్మికుల కొరతను అధిగమించేందుకు యంత్ర పరికరాలను సబ్సిడీపై అందించాలని, కస్టమ్ హైరింగ్ సెంటర్లను ఏర్పాటు చేయాలని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ, ఆయిల్ పామ్ రైతుల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ కట్టుబడి ఉందని తెలిపారు. రైతుల ఆదాయం పెంపు లక్ష్యంగా ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతోందని, ప్రతి జిల్లాలో ఆయిల్ పామ్ సాగు విస్తరణకు అధికారులు, కంపెనీలు, రైతులు సమన్వయంతో కృషి చేయాలని సూచించారు. తెలంగాణ ప్రాంతం దేశంలోనే ఆయిల్ పామ్ సాగుకు అత్యంత అనుకూలమైన ప్రాంతమని, ఆయిల్ పామ్ అధిక ఆదాయం అందించే పంట అని, దీనికి మార్కెటింగ్ సమస్యలు లేవని, ప్రకృతి వైపరీత్యాల ప్రభావం కూడా తక్కువగా ఉంటుందని మంత్రి పేర్కొన్నారు. అంతర పంటల సాగు ద్వారా రైతులు అదనపు ఆదాయాన్ని పొందే అవకాశం కూడా ఉందన్నారు. రైతులు కోరిన వెంటనే నాణ్యమైన మొక్కలను అందుబాటులో ఉంచేలా ఆయిల్ పామ్ కంపెనీలకు ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు మంత్రి తెలిపారు.

More news from తెలంగాణ and nearby areas
  • జాతీయ రహదారి విస్తరణ పనుల అడ్డుకట్ట: అధికారుల హామీతో విరమణ ఖమ్మం జిల్లా ముదిగొండ మండల కేంద్రం నుండి జాతీయ రహదారి వరకు అధికారులు చేపట్టిన రోడ్డు విస్తరణ పనులను గ్రామస్థులు అడ్డుకోవడంతో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. ఈ విస్తరణ వల్ల తాము ఏళ్ల తరబడి నివాసముంటున్న ఇళ్లను కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తూ, పనులు జరుగుతున్న రహదారిపైనే బైఠాయించి ఆందోళన చేపట్టారు. విషయం తెలుసుకున్న పోలీసులు, రెవెన్యూ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకారులతో చర్చలు జరిపారు. బాధితులకు తగిన న్యాయం జరిగేలా చూస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో గ్రామస్థులు నిరసనను విరమించారు.
    1
    జాతీయ రహదారి విస్తరణ పనుల అడ్డుకట్ట: అధికారుల హామీతో విరమణ

ఖమ్మం జిల్లా ముదిగొండ మండల కేంద్రం నుండి జాతీయ రహదారి వరకు అధికారులు చేపట్టిన రోడ్డు విస్తరణ పనులను గ్రామస్థులు అడ్డుకోవడంతో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. ఈ విస్తరణ వల్ల తాము ఏళ్ల తరబడి నివాసముంటున్న ఇళ్లను కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తూ, పనులు జరుగుతున్న రహదారిపైనే బైఠాయించి ఆందోళన చేపట్టారు. విషయం తెలుసుకున్న పోలీసులు, రెవెన్యూ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకారులతో చర్చలు జరిపారు. బాధితులకు తగిన న్యాయం జరిగేలా చూస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో గ్రామస్థులు నిరసనను విరమించారు.
    user_Kasani Venkatesh
    Kasani Venkatesh
    Local News Reporter నేలకొండపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    6 hrs ago
  • పాత కూరగాయలమార్కెట్ నిర్మాణాల కూల్చివేతలపై వ్యాపారులు, రాజకీయ నాయకుల నిరసన .. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు... పాత కూరగాయలమార్కెట్ నిర్మాణాల కూల్చివేతలపై వ్యాపారులు, రాజకీయ నాయకుల నిరసన .. ఇల్లందు పట్టణంలో గత ఐదు దశాబ్దాలుగా వినియోగించుకున్న పాత కూరగాయల మార్కెట్ ప్రాంగణంలోని కొన్ని దుకాణ సముదాయాలను మున్సిపల్ సిబ్బంది జేసీబీ సహాయంతో కూల్చివేతలను ప్రారంభించడంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. తమకు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చివేతలు చేయడం పట్ల కొందరు చిరు వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేయగా వారికి పలురాజకీయ పార్టీల నాయకులు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా పలుపార్టీల నాయకులు మాట్లాడుతూ ఆక్రమణలు ఏమైనా ఉంటే వ్యాపారులకు నోటీసులు అందజేసి తొలగిస్తే తమకు అభ్యంతరం లేదని కానీ ఇల్లందు పట్టణంలో ఎన్నో అక్రమ నిర్మాణాలు ఉన్నప్పటికీ కేవలం కూరగాయలు అమ్ముకునే చిరువ్యాపార నిర్మాణాలను తొలగించడం సరికాదన్నారు. కూల్చివేతలను నిరసిస్తూ రోడ్డుపై బయటాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ అంశంలో అన్ని రాజకీయ పార్టీలతో కలసి కార్యాచరణ రూపొందిస్తామని వెంటనే ఆక్రమణల పేరుతో చిరువ్యాపారులను ఇబ్బందులకు గురి చేయవద్దని డిమాండ్ చేశారు.. కూరగాయల వ్యాపారుల రాజకీయ నాయకుల నిరసనలతో కూల్చివేత పనులను మున్సిపల్ సిబ్బంది నిలిపివేశారు
    1
    పాత కూరగాయలమార్కెట్ నిర్మాణాల కూల్చివేతలపై వ్యాపారులు, రాజకీయ నాయకుల నిరసన ..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు...
పాత కూరగాయలమార్కెట్ నిర్మాణాల కూల్చివేతలపై వ్యాపారులు, రాజకీయ నాయకుల నిరసన ..
ఇల్లందు పట్టణంలో గత ఐదు దశాబ్దాలుగా వినియోగించుకున్న పాత కూరగాయల మార్కెట్ ప్రాంగణంలోని కొన్ని దుకాణ సముదాయాలను మున్సిపల్ సిబ్బంది జేసీబీ సహాయంతో కూల్చివేతలను ప్రారంభించడంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. తమకు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చివేతలు చేయడం పట్ల కొందరు చిరు వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేయగా వారికి పలురాజకీయ పార్టీల నాయకులు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా పలుపార్టీల నాయకులు మాట్లాడుతూ ఆక్రమణలు ఏమైనా ఉంటే వ్యాపారులకు నోటీసులు అందజేసి తొలగిస్తే తమకు అభ్యంతరం లేదని కానీ ఇల్లందు పట్టణంలో ఎన్నో అక్రమ నిర్మాణాలు ఉన్నప్పటికీ కేవలం కూరగాయలు అమ్ముకునే చిరువ్యాపార నిర్మాణాలను తొలగించడం సరికాదన్నారు. కూల్చివేతలను నిరసిస్తూ రోడ్డుపై బయటాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ అంశంలో అన్ని రాజకీయ పార్టీలతో కలసి కార్యాచరణ రూపొందిస్తామని వెంటనే ఆక్రమణల పేరుతో చిరువ్యాపారులను ఇబ్బందులకు గురి చేయవద్దని డిమాండ్ చేశారు.. కూరగాయల వ్యాపారుల రాజకీయ నాయకుల నిరసనలతో కూల్చివేత పనులను మున్సిపల్ సిబ్బంది నిలిపివేశారు
    user_Shekar Thaduri
    Shekar Thaduri
    ఎల్లందు, భద్రాద్రి కొత్తగూడెం, తెలంగాణ•
    7 hrs ago
  • పాతర్లపాడు కూలిన కల్వర్టు తన సొంత ఖర్చులతో రహదారికి తాత్కాలిక మరమ్మతులు గ్రామ సర్పంచ్ జడల సుష్మ చేయించారు ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం తిరుమలయపాలెం మండలంలోని పాతర్లపాడు కూలిన కల్వర్టు తన సొంత ఖర్చులతో రహదారికి తాత్కాలిక మరమ్మతులు గ్రామ సర్పంచ్ జడల సుష్మ చేయించారు. దీనితో రెండు గ్రామాలకు చెందిన రైతులు, ప్రజలకు రాకపోకల ఇబ్బందులు తొలగిపోయాయి. గ్రామస్థులు సర్పంచ్ కు కృతజ్ఞతలు తెలిపారు.
    1
    పాతర్లపాడు  కూలిన కల్వర్టు  తన సొంత ఖర్చులతో రహదారికి తాత్కాలిక మరమ్మతులు గ్రామ సర్పంచ్ జడల సుష్మ చేయించారు
ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం తిరుమలయపాలెం మండలంలోని పాతర్లపాడు  కూలిన కల్వర్టు  తన సొంత ఖర్చులతో రహదారికి తాత్కాలిక మరమ్మతులు గ్రామ సర్పంచ్ జడల సుష్మ చేయించారు. దీనితో రెండు గ్రామాలకు చెందిన రైతులు, ప్రజలకు రాకపోకల ఇబ్బందులు తొలగిపోయాయి. గ్రామస్థులు సర్పంచ్ కు కృతజ్ఞతలు తెలిపారు.
    user_ARUNKUMAR
    ARUNKUMAR
    Local News Reporter నేలకొండపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    9 hrs ago
  • భోగాపురంలో 13 వేల మంది గిరిజన బాలికల థింసా నృత్యం గిన్నిస్ రికార్డు నెలకొల్పింది ఆ సంస్థ ప్రతినిధుల నుంచి గిన్నిస్ అవార్డును గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి అందుకుని థింసా నృత్యంలో పాల్గొన్నారు...
    1
    భోగాపురంలో 13 వేల మంది గిరిజన బాలికల థింసా నృత్యం గిన్నిస్ రికార్డు నెలకొల్పింది
ఆ సంస్థ ప్రతినిధుల నుంచి గిన్నిస్ అవార్డును గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి అందుకుని థింసా నృత్యంలో పాల్గొన్నారు...
    user_Ramprasad Pothuganti
    Ramprasad Pothuganti
    Local News Reporter బుర్గుంపహాడ్, భద్రాద్రి కొత్తగూడెం, తెలంగాణ•
    11 hrs ago
  • 54 అడుగుల వద్ద ప్రవహిస్తున్న గోదావరి సారపాక కు బూర్గంపాడుకు రాకపోకలు నిలిపివేత భద్రాచలం వద్ద గోదావరి మూడో ప్రమాదక హెచ్చరిక దాటి ప్రవహిస్తున్న గోదావరి లోతట్టు ప్రాంతాలలో చేరుకున్న వరద నీరు బూర్గంపాడుకు సారపాకకు రాకపోకలు నిలిపివేత లోతుట్ట ప్రాంత ప్రజలను అప్రమత్తం చేస్తున్న మండల అధికారులు ప్రస్తుతం గోదావరి ఉదయం 6 గంటల సమయం నందు 55. 10 ఫీడ్స్ వద్ద ప్రవహించినది 15,40,412 క్యూసెక్కుల వరద నీరు ప్రవహించగా ప్రస్తుతం ఒక అడుగు తగ్గి 54 అడుగుల వద్ద గోదావరి ప్రవహిస్తున్నది
    1
    54 అడుగుల వద్ద ప్రవహిస్తున్న గోదావరి సారపాక కు బూర్గంపాడుకు రాకపోకలు నిలిపివేత 
భద్రాచలం వద్ద గోదావరి మూడో ప్రమాదక హెచ్చరిక దాటి ప్రవహిస్తున్న గోదావరి లోతట్టు ప్రాంతాలలో చేరుకున్న వరద నీరు బూర్గంపాడుకు సారపాకకు రాకపోకలు నిలిపివేత లోతుట్ట ప్రాంత ప్రజలను అప్రమత్తం చేస్తున్న మండల అధికారులు ప్రస్తుతం గోదావరి ఉదయం 6 గంటల సమయం నందు 55. 10 ఫీడ్స్  వద్ద ప్రవహించినది 15,40,412 క్యూసెక్కుల వరద నీరు ప్రవహించగా  ప్రస్తుతం ఒక అడుగు తగ్గి 54 అడుగుల వద్ద గోదావరి ప్రవహిస్తున్నది
    user_Banatha. Raja
    Banatha. Raja
    బుర్గుంపహాడ్, భద్రాద్రి కొత్తగూడెం, తెలంగాణ•
    9 hrs ago
  • *స్కూల్ బస్ లో పిల్లలకు తృటిలో తప్పిన పెను ప్రమాదం* ఒక్కసారిగా బస్సు ఇంజన్లో నుంచి పొగలు రావడంతో స్కూల్ పిల్లలందరినీ కూడా సడన్గా బస్సులో నుంచి దింపేసిన పరిస్థితి నెలకొంది పిల్లలకు ఎటువంటి ప్రమాదం జరగకుండా బస్సులో నుంచి దింపిన ఆయా *ఎన్టీఆర్ జిల్లా.* *ఇబ్రహీంపట్నం ఫెర్రీ రోడ్డు* కాలం చెల్లిన బస్సులను మెయింటినెన్స్ చేస్తున్న స్కూల్ పై చర్యలు తీసుకోవాలని కోరుతున్న స్థానికులు
    1
    *స్కూల్ బస్ లో పిల్లలకు తృటిలో తప్పిన పెను ప్రమాదం*

 ఒక్కసారిగా బస్సు ఇంజన్లో నుంచి పొగలు రావడంతో స్కూల్ పిల్లలందరినీ కూడా సడన్గా బస్సులో నుంచి దింపేసిన పరిస్థితి నెలకొంది పిల్లలకు ఎటువంటి ప్రమాదం జరగకుండా బస్సులో నుంచి దింపిన ఆయా 


 *ఎన్టీఆర్ జిల్లా.*
*ఇబ్రహీంపట్నం ఫెర్రీ రోడ్డు* 

 కాలం చెల్లిన బస్సులను మెయింటినెన్స్ చేస్తున్న స్కూల్ పై చర్యలు తీసుకోవాలని కోరుతున్న స్థానికులు
    user_పల్లె నరేష్
    పల్లె నరేష్
    ఇబ్రహీంపట్నం, ఎన్టీఆర్, ఆంధ్రప్రదేశ్•
    3 hrs ago
  • రూ.52 కోట్ల మోసం.. నిందితుడి ఆస్తుల చిట్టా వెలుగులోకి. కొత్తగూడెం: రూ.52 కోట్ల పెట్టుబడి మోసం కేసులో అరెస్టైన బేతంపూడి భరత్‌కుమార్‌ ఆస్తుల వివరాలు వెలుగులోకి వచ్చాయి. కేరళలోని పాలాలో అరెస్టు చేసిన పోలీసులు అతడి నుంచి 35 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. మోసం చేసిన డబ్బుతో భద్రాచలం రాజీవ్‌నగర్‌లో మూడు అంతస్తుల భవనం, ప్లాట్‌ కొనుగోలు చేసినట్లు గుర్తించారు. బ్యాంకు లావాదేవీలు, మనీ ట్రైల్‌పై దర్యాప్తు కొనసాగుతోంది.
    1
    రూ.52 కోట్ల మోసం.. నిందితుడి ఆస్తుల చిట్టా వెలుగులోకి.
కొత్తగూడెం: రూ.52 కోట్ల పెట్టుబడి మోసం కేసులో అరెస్టైన బేతంపూడి భరత్‌కుమార్‌ ఆస్తుల వివరాలు వెలుగులోకి వచ్చాయి. కేరళలోని పాలాలో అరెస్టు చేసిన పోలీసులు అతడి నుంచి 35 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. మోసం చేసిన డబ్బుతో భద్రాచలం రాజీవ్‌నగర్‌లో మూడు అంతస్తుల భవనం, ప్లాట్‌ కొనుగోలు చేసినట్లు గుర్తించారు. బ్యాంకు లావాదేవీలు, మనీ ట్రైల్‌పై దర్యాప్తు కొనసాగుతోంది.
    user_JAI TEJ
    JAI TEJ
    బుర్గుంపహాడ్, భద్రాద్రి కొత్తగూడెం, తెలంగాణ•
    5 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.