Shuru
Apke Nagar Ki App…
శివంపేట్ మండలం అల్లీపూర్ గ్రామంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన… ప్రజల ప్రశంసలు శివంపేట్ మండలం అల్లీపూర్ గ్రామం 4వ వార్డులో సీసీ రోడ్ల నిర్మాణ పనులను గ్రామ సర్పంచ్ చింతకాయల కుమార్ ఘనంగా ప్రారంభించారు. గ్రామాభివృద్ధి దిశగా చేపట్టిన ఈ పనులు పూర్తయితే ప్రజలకు రాకపోకలు మరింత సులభం కావడంతో పాటు, వర్షాకాలంలో ఎదురయ్యే ఇబ్బందులు కూడా తగ్గనున్నాయని తెలిపారు.ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ గ్రామంలోని అన్ని వార్డుల్లో అభివృద్ధి పనులు చేపట్టడం తమ లక్ష్యమని, ప్రతి వీధి అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పారు. ప్రజల సహకారంతో గ్రామాన్ని మరింత అభివృద్ధి దిశగా తీసుకెళ్తామని పేర్కొన్నారు.
ASHOK VENGANI
శివంపేట్ మండలం అల్లీపూర్ గ్రామంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన… ప్రజల ప్రశంసలు శివంపేట్ మండలం అల్లీపూర్ గ్రామం 4వ వార్డులో సీసీ రోడ్ల నిర్మాణ పనులను గ్రామ సర్పంచ్ చింతకాయల కుమార్ ఘనంగా ప్రారంభించారు. గ్రామాభివృద్ధి దిశగా చేపట్టిన ఈ పనులు పూర్తయితే ప్రజలకు రాకపోకలు మరింత సులభం కావడంతో పాటు, వర్షాకాలంలో ఎదురయ్యే ఇబ్బందులు కూడా తగ్గనున్నాయని తెలిపారు.ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ గ్రామంలోని అన్ని వార్డుల్లో అభివృద్ధి పనులు చేపట్టడం తమ లక్ష్యమని, ప్రతి వీధి అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పారు. ప్రజల సహకారంతో గ్రామాన్ని మరింత అభివృద్ధి దిశగా తీసుకెళ్తామని పేర్కొన్నారు.
More news from తెలంగాణ and nearby areas
- గజ్వేల్ సిద్దిపేట జిల్లా మార్చి 31 ప్రజా తెలంగాణ న్యూస్/ సిద్దిపేట జిల్లా గజ్వేల్ హనుమాన్ దేవాలయం వద్ద మంగళవారం గజ్వేల్ కిరాణా అసోసియేషన్ అధ్యక్షులు సిద్ది బిక్షపతి లక్ష్మీ నరసమ్మ దంపతులు వారి కుమారుడు సిద్ది నవీన్ కుటుంబ సభ్యుల సౌజన్యంతో పులిహోర పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న కొమురవెల్లి ఆలయ డైరెక్టర్ నంగునూరి సత్యనారాయణ, ఇటిక్యాల మాజీ సర్పంచ్ రావికంటి చంద్రశేఖర్ మాట్లాడుతూ, హనుమాన్ ఆశీర్వాదంతో అందరూ బాగుండాలని కోరుకుంటూ ప్రతి మంగళవారం దాతల సహకారంతో పులిహోర పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని అందులో భాగంగా ఈరోజు పెద్దలు సిద్ధి బిక్షపతి కుటుంబ సభ్యుల సౌజన్యంతో పులిహోర పంపిణీ చేయడం జరిగిందని వారికి వారి కుటుంబానికి దేవదేవతల అనుగ్రహం ఉంటుందని ఆకాంక్షించారు అలాగే ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు, ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య మహాసభ సిద్దిపేట జిల్లా ఉపాధ్యక్షులు మల్యాల భద్రయ్య, సిద్ది రామచంద్రం,సిద్ది నవీన్,నేతి శ్రీనివాస్, కైలాస ప్రశాంత్,గందే యాదగిరి,సిరిపురం సత్యనారాయణ,కాశీనాథ్,శ్రీహరి,రమేష్ , గందే సంతోష్,తదితరులు పాల్గొన్నారు4
- సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం మార్చి 31. శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగా ఇందుప్రియల్ గ్రామంలో శ్రీ సీతారామ రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా ఆలయ పురోహితులు మాట్లాడుతూ ఐదు రోజులుగా ఉత్సవాలు జరుగుతున్నాయి మరియు గ్రామస్తులు అంత భక్తి శ్రద్ధలతో శ్రీ సీతారామ ఆలయంలో పూజలు నిర్వహించారు. PACS చైర్మన్ వెంకటరెడ్డి మాట్లాడుతూ గ్రామంలో ప్రతి సంవత్సరం ఉత్సవాలు నిర్వహిస్తామని అన్నారు. మరియు గ్రామ సర్పంచ్ స్వాతి స్వామి మాట్లాడుతూ ఐదు రోజులుగా గ్రామంలో ఉత్సవాలు నిర్వహించబడుతున్నాయి ఈ ఉత్సవం విజయవంతంగా జరిపించినందుకు గ్రామస్తులకు మరియు యువకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో PACS చైర్మన్ వెంకట్ రెడ్డి గ్రామ సర్పంచ్ స్వాతి స్వామి మరియు వార్డు మెంబర్లు మరియు గ్రామస్తులు మరియు చుట్టుపక్కల గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.4
- తెలంగాణలో రేపటి నుంచి చికెన్ దుకాణాలు బంద్ కానున్నాయి. పౌల్ట్రీ కంపెనీలు మార్జిన్‌లు పెంచే వరకు నిరవధిక బంద్ పాటిస్తామని చికెన్ షాప్ ఓనర్స్ అసోసియేషన్ హెచ్చరించింది. గతంలో కంటే మార్జిన్ ఇప్పుడు తక్కువగా ఇస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. గతంలో పౌల్ట్రీ వాళ్లు రిటైల్ దుకాణాలకు కిలోకు రూ.26 మార్జిన్ ఇచ్చేవారని, గత ఇరవై ఏళ్లుగా ఇదే మార్జిన్ ఇస్తున్నారని, ఇటీవల ఈ మార్జిన్ రూ.16 కు తగ్గించారని దుకాణ యజమానులు ఆందోళన వ్యక్తంచేశారు.కేజీ చికెన్ మార్జిన్ రూ.30 ఇవ్వాలని ఓనర్స్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. అందుకే మార్జిన్ పెంచే వరకు రేపటి నుంచి నిరవధిక బంద్‌కు పిలుపునిస్తున్నట్లు తెలిపింది.2
- full night open this hotel purani Haveli request to Hyderabad City Police take action1
- కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం మద్నూర్లోని రైతు వేదికలో మంగళవారం నిర్వహించిన 'రైతునేస్తం' కార్యక్రమంలో భాగంగా వీసీ ద్వారా యూరియా యాప్పై రైతులకు అవగాహన కల్పించారు. ఏఈవో సౌమ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో అధికారులు మాట్లాడుతూ.. దళారీల ప్రమేయం లేకుండా, ఎరువులు పక్కదారి పట్టకుండా ఉండేందుకే ఈ యాప్ను ప్రవేశపెట్టినట్లు తెలిపారు. రైతులు నేరుగా యాప్ ద్వారానే యూరియా కొనుగోలు చేయాలని సూచించారు.1
- వికారాబాద్, కొడంగల్ : ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మంగళవారం కొడంగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమానికి జిల్లా ఎస్పీ స్నేహమేరా ముఖ్య అతిథిగా హాజరై ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ నేటి యువత దేశానికి వినయం కానీ అటువంటి శివశక్తిని నిర్వీర్యం చేసేందుకు డ్రగ్స్ మాఫియా పన్నుతున్న కుట్రపట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు ఎవరు కూడా మత్తు పదార్థాల జోలికి వెళ్ళొద్దని సరఫరా గురించి తెలిస్తే సమాచారం అందించాలని పేర్కొన్నారు. అరేయ్ అరేయ్ కార్యక్రమాన్ని ఉద్దేశాన్ని వివరిస్తూ ప్రతిరోజు ఉపాధి కోసం బయటకు వెళ్లే వ్యక్తులు తిరిగి క్షేమంగా తమ కుటుంబ సభ్యుల వద్దకు చేరుకోవడమే ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్మణ్ తెలిపారు.1
- రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం పరిధిలోని తిప్పాపురం గోశాలను ఆలయ ఈవో ఎల్. రమాదేవి, జిల్లా వెటర్నరీ అనిమల్ హస్బండ్రీ అధికారి రవీందర్ రెడ్డి కలిసి తనిఖీ చేశారు.ఈ సందర్భంగా గోవులను ఎండ వేడి ప్రభావం నుండి రక్షించేందుకు చేపట్టిన చర్యలను వారు పరిశీలించారు.గోశాల చుట్టూ గ్రీన్ నెట్ ఏర్పాటు, జంబో కూలర్లు, ఫ్యాన్లు, చలువ పందిళ్లు వంటి సౌకర్యాలను సమీక్షించారు.అలాగే గోవులకు తాగునీరు, కార్న్ సైలేజ్ (పశువులకు ప్రత్యేక ఆహారం) సరైన విధంగా అందుతున్నాయా అనే అంశాన్ని పరిశీలించారు. గోవులకు అందిస్తున్న ఆహారాన్ని స్వయంగా చూసి, వాటికి పెట్టి గోవులు తింటున్నాయా అనే విషయాన్ని కూడా ఈవో రమాదేవి గమనించారు.గోవుల ఆరోగ్య పరిస్థితిపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. గోశాలలో పనిచేస్తున్న సిబ్బందితో మాట్లాడి, గోవుల సంరక్షణలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.ఇదే సందర్భంలో రాజన్న కోడె మొక్కుల నిర్వహణ, వాటి ప్రాముఖ్యత గురించి కూడా వివరంగా చర్చించారు.ఈ తనిఖీలలో పర్యవేక్షకులు విజయ్ కుమార్, జూనియర్ అసిస్టెంట్ గొట్టం రవి తదితర ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.1
- Post by Ali ammu1