టి యు డబ్ల్యూ జే( ఐ జేయు )ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్కు వినతిపత్రం అచ్చంపేట, ఫిబ్రవరి 18,(షురూ ఆప్ న్యూస్ ప్రతినిధి): నాగర్‌కర్నూల్, జిల్లా కలెక్టర్ కార్యాలయం లో బుధ వారం రోజు అక్రిడేషన్ దరఖాస్తుల సందర్భంగా తలెత్తుతున్న సాంకేతిక సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ టి యు డబ్ల్యూ జే (ఐ జేయు) నాగర్‌కర్నూల్ జిల్లా ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్కు వినతిపత్రం సమర్పించారు. నాగర్ కర్నూల్ జిల్లా పరిధిలోని కల్వకుర్తి నియోజకవర్గంకు చెందిన కొన్ని మండలాలు ఆన్‌లైన్ లో అక్రిడేషన్ దరఖాస్తుల్లో రంగారెడ్డి జిల్లా పరిధిలో ఉన్నట్లుగా చూపిస్తున్నట్లు జర్నలిస్టులు తెలిపారు. దీంతో దరఖాస్తుల ప్రక్రియలో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. ఈ విషయాన్ని పరిశీలించి సంబంధిత మండలాలను నాగర్‌కర్నూల్ జిల్లాకు అనుసంధానించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ బాదా వత్ సంతోష్ను కోరారు. సమస్యను పరిశీలించి పరిష్కరిస్తానని కలెక్టర్ హామీ ఇచ్చినట్లు నాయకులు తెలిపారు. అనంతరం జిల్లా సమాచార ప్రజాసంబంధాల అధికారి కిరణ్ కుమార్ను కలిసి అక్రిడేషన్ ల జారీపై చర్చించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు పి. విజయ్‌కుమార్, కార్యదర్శి ఆర్. సురేష్‌కుమార్ మాట్లాడుతూ అక్రిడేషన్ ప్రక్రియ పారదర్శకంగా సాగాలని వారు కోరారు. అనర్హులకు అవకాశం కల్పించే పరిస్థితి రాకుండా, నిజమైన జర్నలిస్టులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఆన్‌లైన్ దరఖాస్తుల్లో చిన్నపాటి పొరపాట్లు జరిగితే తిరస్కరించకుండా సవరణకు అవకాశం కల్పించాలని సూచించారు. జిల్లాలోని అన్ని పత్రికల స్టాఫ్ రిపోర్టర్లతో సమావేశం ఏర్పాటు చేసి అక్రిడేషన్ విధివిధానాలు, ప్రతి పత్రికకు కేటాయించే కార్డుల సంఖ్యపై ముందస్తు స్పష్టత ఇవ్వాలని కోరారు. కలెక్టర్, డీపీఆర్వోలను కలిసిన వారిలో నేషనల్ కౌన్సిల్ సభ్యులు సుదర్శన్ రెడ్డి, కర్ణయ్య, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు వెంకటస్వామి, ప్రభాకర్, రాష్ట్ర నాయకుడు శ్యామ్, జిల్లా కార్యవర్గ సభ్యులు పందిరి శ్రీధర్, పట్టాభి, జర్పుల రవీందర్, ఎండి మోబిన్ అహ్మద్ ఖాన్, ఎస్‌ఎస్ బాబు, రమణ కుమార్, ప్రసాద్, ఉపాధ్యక్షుడు రాంప్రసాద్, కొల్లాపూర్ తాలూకా అధ్యక్షుడు రాజేందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

- పురుగుల అన్నం తినలేక పస్తులు ఉంటున్నాం....... - ఇదేమిటి అని అడిగితే బూతు మాటలతో ఎదురుదాడి...... - ఇట్లనే చేస్తే హాల్ టికెట్ ఇవ్వను ఎవరు చెప్పుకుంటారో చెప్పుకోండి...... వెల్దండ: మండల కేంద్రాల్లోని సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల విద్యార్థినిలు వారం రోజుల నుండి ఉడికి ఉడకని పురువుల అన్నం తినలేక పస్తులు ఉంటున్నాం,బుధవారం హైదరాబాద్ -శ్రీశైలం ప్రధాన జాతీయ రహదారి పై బైఠాయించి ప్రిన్సిపాల్ డాం డాం అంటూ ఆందోళన చేపట్టారు. ప్రిన్సిపల్ స్వర్ణ రత్నం ను సస్పెండ్ చేయాలని పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు.మాట్లాడుతూ పురుగుల అన్నం పెడుతూ, అడిగితే పురుగులను తీసేసి తినండి అంటున్నారని, సమస్య ఎవరికైన చెప్పిన మమ్మల్ని టార్గెట్ చేసేవారని తెలిపారు. ప్రతి నెల విద్యార్థుల నుండి అక్రమంగా డబ్బులు వసూలు చేసుకునేదని, ఎందుకు మేడం అంటే పాఠశాల లో మౌలిక వసతుల కోసమని చెప్పేది కానీ ఆ డబ్బులతో ఏమీ చేయకుండా సొంతంగా ఖర్చులకు ఉపయోగించుకునేదని తెలిపారు. ఫెస్టివల్ పార్టీ కానీ, ఫ్రెషర్ పార్టీ కానీ ప్రిన్సిపల్ మైక్ లోనే దుర్భాషలాడేదని, పురుగుల అన్నం తిని అస్వస్థతకు గురవుతున్నామని, మా ఆరోగ్యాలతో ప్రిన్సిపల్ చెలగాటం ఆడుతున్నారని,ఈ ప్రిన్సిపల్ మాకొద్దని, వెంటనే ప్రిన్సిపాల్ ను సస్పెండ్ చేయాలని ప్రిన్సిపల్ ను సస్పెండ్ చేస్తేనే మేము పాఠశాల వెళ్తామన్నారు. ఉన్నతాధికారులు దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కరిస్తామని కార్తీక్ కుమార్, గ్రామ సర్పంచ్ మట్ట యాదమ్మ వెంకటయ్య గౌడ్, ఎస్సై కురుమూర్తి హామీ ఇచ్చారు. ప్రిన్సిపాల్ ను సస్పెండ్ చేయాలని దళిత సంఘాలు ఆగ్రహం.......... పురుగుల అన్నం తినలేక గురుకుల పాఠశాల విద్యార్థినీలు రోడ్డెక్కి ధర్నా చేస్తున్న ప్రిన్సిపాల్ ఏమాత్రం పట్టించుకోకుండా ఉన్నారని దళిత సంఘాల నాయకులు జంగిలి నిరంజన్, పోలే అశోక్, జంగిలి ఆనంద్, సామెల్, కొయ్యల పుల్లయ్య, గోరటి సుధాకర్, గోరటి సంజీవ, జంగిల్ ప్రవీణ్, ఏకుల వెంకటేష్, దుళ్ల పెద్దయ్య లతో పాటు మరి కొంతమంది నాయకులు ఆగ్రం వ్యక్తం చేశారు. బడుగు బలహీన వర్గాల చెందిన పిల్లలు ప్రభుత్వ పాఠశాలలలో చదువుకుంటున్నారని, వారికి పురుగుల అన్నం ఎట్లా పెడతారని, ప్రిన్సిపల్ వెంటనే సస్పెండ్ చేసి సర్వీస్ రిమూవ్ చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసిల్దార్ అలీ, పంచాయతీ కార్యదర్శి గిరి, ఆయా ప్రజా సంఘాల నాయకులు ఉన్నారు.6
- నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం వెల్దండ మండల కేంద్రంలోని గురుకుల పాఠశాలలో పురుగుల భోజనం పెడుతున్నారని శ్రీశైలం - హైదరాబాద్ ప్రధాన రహదారిపై బైఠాయించిన విద్యార్థిను లు ఆందోళన చేస్తుండగా నలుగురు విద్యార్థినులకు అస్వస్థత.. ప్రైవేట్ ఆసుపత్రికి తరలింపుపాఠశాలలో మెనూ ప్రకారం భోజనం పెట్టకుండా పురుగుల అన్నం పెడుతున్నారని.. ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ విద్యార్థినులతో చర్చలు జరిపిన ఎమ్మార్వో, పోలీసులు1
- కాకునూరు గ్రామంలో స్వయంభూగా వెలసిన శ్రీ మహాలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా అగ్నిగుండాల ప్రభను ఘనంగా నిర్వహించారు. గ్రామ పురవీధుల్లో ప్రభను ఊరేగించగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తెల్లవారుజామున వరకు అగ్నిగుండాల వద్ద ప్రత్యేక పూజలు కొనసాగనున్నది.అనంతరం నిప్పుకణుకలపై నడుస్తూ భక్తులు తమ మొక్కులు తీర్చుకున్నారు. ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో, హారతులు, నాదస్వరాలతో ఆధ్యాత్మిక వాతావరణంలో సాగాయి. గ్రామ ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు.1
- వేమలపల్లి మండలం శేట్టిపాలెం గ్రామంలో యూరియా ఆన్లైన్ విధానాన్ని తీసివేయాలని, రైతాంగానే ఆదుకోవాలని భారతీయ జనతా పార్టీ శ్రేణులు మరియు గ్రామ రైతులు పెద్ద ఎత్తున శేట్టిపాలెం గ్రామ కో-ఆపరేటివ్ బ్యాంక్ ను ముట్టడి చేశారు మరియు యూరియా పంపిణి అడ్డుకున్నారు. పోలీసులు బిజెపి శ్రేణులతో వాగ్వాదం జరగడంతో రైతులు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా బిజెపి మండల పార్టీ అధ్యక్షులు పెదమాం భరత్ మాట్లాడుతూ యూరియా ఆన్లైన్ విధానం వల్ల రైతులు గోసపడుతున్నారని,, బుకింగ్ సమయం లో రెండు మూడు నిమిషాల్లోనే యూరియా పూర్తిగా అయిపోతుందని, అన్ని గ్రామాలకు సంబంధించిన కో-ఆపరేటివ్ బ్యాంకులలో ఆ గ్రామానికి సంబంధించిన రైతులకు యూరియా అందించాలని పక్క ఊరి రైతులకు ఇవ్వడం వల్ల ఇక్కడి గ్రామ రైతులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఆన్లైన్ విధానం వల్ల పాస్ పుస్తకాలు పట్టుకొని రైతులు రోడ్ల వెంట తిరుగుతున్నారని ఆన్లైన్ విధానం తెలియని రైతులు ఒక్క దశలోనూ యూరియా అందలేదని వరి పొలాలకు ఇప్పుడు యూరియా అత్యవసరమని యూరియా అందకపోతే రైతులు తీవ్ర నష్టపోతారని నిరక్షరాశులయిన రైతులు,మహిళా రైతులు,ఆన్లైన్ విధానం వల్ల తీవ్ర ఇబ్బందులకు ఎదుర్కొంటున్నారని, శెట్టిపాలెం గ్రామానికి సంబంధించిన రైతాంగానికి యూరియా దొరకడం లేదు అని ప్రతిరోజు టన్నుల కొద్దీ యూరియా వస్తున్న యూరియా కొరత గ్రామంలో తీవ్రంగా ఉంది, కోపరేట్ సొసైటీ ఉన్నప్పటికీ యూరియా దొరకపోవడం బాధాకరమని తక్షణమే ప్రత్యేకంగా శెట్టిపాలెం గ్రామ రైతులకు యూరియా తీసుకురావాలని AEO కిషన్ నాయక్ వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమం కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జవ్వాజి సత్యనారాయణ యాదవ్, బీజేపీ జిల్లా నాయకులు బోల్లేదు లవయ్య,బీజేపీ గ్రామ వార్డు సభ్యులు పెదమాం ప్రసాద్, ఇరుగుదిండ్ల జ్యోతి నవీన్, బిజెపి నాయకులు ఇరుగుదిండ్ల నరేష్, పేరం విలేకర్, కోల చంద్రయ్య, ఆలకుంట్ల మధు, ఈట మహేష్,జగినాల రమేష్ దుండిగల రేణుక, బోగారి సైదులు, పాలడుగు శంకర్, సతీష్, శీను, మహేష్, రామకృష్ణ, ప్రశాంత్, నాగరాజ్ తదితరులు పాల్గొన్నారు.1
- చిత్తూరు నగర శివారులోని ఇరువారం క్రాస్ రోడ్ వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒక సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. అతివేగంగా వచ్చిన కంటైనర్ లారీ కారుపై బోల్తా పడటంతో ఈ దారుణం చోటుచేసుకుంది.సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.1
- every day traffic jam in mir alam mandi road Request to sho mir chowk look into1
- హైదరాబాద్ :-వనస్థలిపురం గ్రీన్ సిటీ కాలనీలోని ఓ అపార్ట్మెంట్ లో దారుణం ఓ మహిళను ఇంట్లో రెండూ కత్తులతో, పెట్రోల్ డబ్బాతో వచ్చి దారుణంగా హత్య చేసిన మహేష్ అనే వ్యక్తి ఇంట్లో ఎవరైనా వస్తే పెట్రోల్ పోసి తగలబెడతానంటూ హెచ్చరికలు జారీ చేసిన మహేష్ అనే వ్యక్తి పోలీసుల అదుపులో మహేష్ అనే వ్యక్తి తనకి మహిళా తో గతంలో పెళ్లి జరిగింది అని తను ఇప్పుడు రెండో పెళ్లి చేసుకుంది అని మహేష్ పోలీసులకు తెలిపినట్లు సమాచారం పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది ఘటన స్థలానికి చేరుకున్న క్లూస్ టీం4
- కేశంపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనాన్ని కొందరు అనుమతి లేకుండా జేసీబీతో చెట్లు తొలగించారని గ్రామస్తులు ఆరోపించారు. ప్రజాధనంతో ఏర్పాటు చేసిన వనాన్ని ధ్వంసం చేయడం చట్టవిరుద్ధమని, అధికారులకు సమాచారం ఇవ్వకుండానే పనులు జరిపారని తెలిపారు. ఘటనపై పంచాయతీ కార్యదర్శి బాధ్యులపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని వెల్లడించారు.1