logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

రాష్ట్రమంతా 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు* భానుడి భగభగలతో రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయికంటే ఎక్కువగా నమోదయ్యాయి. ఎండ తీవ్రతతో వడదెబ్బ బారిన పడి ఇద్దరు వృద్ధులతోపాటు నలుగురు వ్యక్తులు మరణించారు. మరో రెండు రోజులపాటు పగటి ఉష్ణోగ్రతల్లో ఎటువంటి మార్పు ఉండబోదని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. కుమరం భీమ్‌ - అసిఫాబాద్‌ జిల్లా కెరమెరి మండలంలో అత్యధికంగా 44.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, జిల్లా కేంద్రమైన అసిఫాబాద్‌, నిర్మల్‌ జిల్లా బుట్టాపూర్‌, నిజామాబాద్‌ జిల్లా మెండోరాలో 44.5 డిగ్రీలుగా నమోదైంది. ఈ ఏడాది వేసవిలో అత్యధిక పగటి ఉష్ణోగ్రత నమోదు కావడం ఇదే ప్రథమం. కాగా, వివిధ జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలపైనే రికార్డయ్యాయి. ఉమ్మడి మెదక్‌ జిల్లాలోని 104 ప్రాంతాల్లో వాతావరణశాఖ ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేసింది. కాగా, ఆది, సోమవారాల్లో కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. మానేరు నది సమీపాన పెద్దపల్లి జిల్లా మంథని మండలం చిన్న ఓదెల వాసి దాసరి రమేశ్‌ (50).. రాజన్న-సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం వెంకట్రావ్‌పల్లి వాసి నల్లాల మోహన్‌ (46) ఇంటి నిర్మాణ పనులు చేస్తూ వడదెబ్బ గురై మరణించారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం అడవి లింగాల వాసి లింగాల రాములు (59) పొలానికి నీరు పెట్టడానికి వెళ్లి గట్టుపైనే సొమ్మసిల్లి పడిపోయాడు. వరంగల్‌ జిల్లా నర్సంపేట మండలం బోజ్యా నాయక్‌ తండా వాసి భూక్య జంకు (65) శనివారం మధ్యాహ్నం తోటలో పని చేస్తుండగా ఎండదెబ్బకు గురై కుప్పకూలడంతో చికిత్స కోసం ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. నిజామాబాద్‌, రాజన్న-సిరిసిల్ల, సంగారెడ్డి, హైదరాబాద్‌లోని పలు చోట్ల వర్షం కురిసింది. నిజామాబాద్‌ జిల్లా సిరికొండ, ధర్పల్లి, ఇందల్‌వాయి మండలాలు, సిరిసిల్లలోని కోనారావుపేట మండలంలో కురిసిన అకాల వర్షం వల్ల ఆరబోసిన ధాన్యం తడిసిపోయింది. రోడ్లపై చెట్లు విరిగి పడటంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వాతావరణం ఒక్కసారిగా చల్లబడటంతోపాటు సాయంత్రం కురిసిన వర్షంతో సంగారెడ్డి జిల్లా వాసులు ఊపిరి పీల్చుకున్నారు..

22 hrs ago
user_Ramesh Solanki
Ramesh Solanki
स्वतंत्र पत्रकार Asifabad, Kumuram Bheem Asifabad•
22 hrs ago
18ed4f08-1af1-422d-9fe1-19bb0bf35275

రాష్ట్రమంతా 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు* భానుడి భగభగలతో రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయికంటే ఎక్కువగా నమోదయ్యాయి. ఎండ తీవ్రతతో వడదెబ్బ బారిన పడి ఇద్దరు వృద్ధులతోపాటు నలుగురు వ్యక్తులు మరణించారు. మరో రెండు రోజులపాటు పగటి ఉష్ణోగ్రతల్లో ఎటువంటి మార్పు ఉండబోదని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. కుమరం భీమ్‌ - అసిఫాబాద్‌ జిల్లా కెరమెరి మండలంలో అత్యధికంగా 44.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, జిల్లా కేంద్రమైన అసిఫాబాద్‌, నిర్మల్‌ జిల్లా బుట్టాపూర్‌, నిజామాబాద్‌ జిల్లా మెండోరాలో 44.5 డిగ్రీలుగా నమోదైంది. ఈ ఏడాది వేసవిలో అత్యధిక పగటి ఉష్ణోగ్రత నమోదు కావడం ఇదే ప్రథమం. కాగా, వివిధ జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలపైనే రికార్డయ్యాయి. ఉమ్మడి మెదక్‌ జిల్లాలోని 104 ప్రాంతాల్లో వాతావరణశాఖ ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేసింది. కాగా, ఆది, సోమవారాల్లో కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. మానేరు నది సమీపాన పెద్దపల్లి జిల్లా మంథని మండలం చిన్న ఓదెల వాసి దాసరి రమేశ్‌ (50).. రాజన్న-సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం వెంకట్రావ్‌పల్లి వాసి నల్లాల మోహన్‌ (46) ఇంటి నిర్మాణ పనులు చేస్తూ వడదెబ్బ గురై మరణించారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం అడవి లింగాల వాసి లింగాల రాములు (59) పొలానికి నీరు పెట్టడానికి వెళ్లి గట్టుపైనే సొమ్మసిల్లి పడిపోయాడు. వరంగల్‌ జిల్లా నర్సంపేట మండలం బోజ్యా నాయక్‌ తండా వాసి భూక్య జంకు (65) శనివారం మధ్యాహ్నం తోటలో పని చేస్తుండగా ఎండదెబ్బకు గురై కుప్పకూలడంతో చికిత్స కోసం ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. నిజామాబాద్‌, రాజన్న-సిరిసిల్ల, సంగారెడ్డి, హైదరాబాద్‌లోని పలు చోట్ల వర్షం కురిసింది. నిజామాబాద్‌ జిల్లా సిరికొండ, ధర్పల్లి, ఇందల్‌వాయి మండలాలు, సిరిసిల్లలోని కోనారావుపేట మండలంలో కురిసిన అకాల వర్షం వల్ల ఆరబోసిన ధాన్యం తడిసిపోయింది. రోడ్లపై చెట్లు విరిగి పడటంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వాతావరణం ఒక్కసారిగా చల్లబడటంతోపాటు సాయంత్రం కురిసిన వర్షంతో సంగారెడ్డి జిల్లా వాసులు ఊపిరి పీల్చుకున్నారు..

More news from Telangana and nearby areas
  • ఆదిలాబాద్ జిల్లా : సోనాల మండల కేంద్రంలో తుల శ్రీనివాస్ వెళ్ఫర్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రికెట్ టౌర్నమెంటు ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ హాజరై బ్యాట్ పట్టి - సిక్స్ కొట్టి టౌర్నమెంటును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ... ఎండలను దృష్టిలో పెట్టుకొని క్రీడలు ఆడాలని సూచించారు. ఎండ తీవ్రత జాగ్రత్తలు ప్రతీ ఒక్కరు పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ తుల శ్రీనివాస్, సర్పంచులు,నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.
    1
    ఆదిలాబాద్ జిల్లా : సోనాల మండల కేంద్రంలో తుల శ్రీనివాస్ వెళ్ఫర్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రికెట్ టౌర్నమెంటు ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ హాజరై బ్యాట్ పట్టి - సిక్స్ కొట్టి టౌర్నమెంటును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ... ఎండలను దృష్టిలో పెట్టుకొని క్రీడలు ఆడాలని సూచించారు. ఎండ తీవ్రత జాగ్రత్తలు ప్రతీ ఒక్కరు పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ తుల శ్రీనివాస్, సర్పంచులు,నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.
    user_AlluriMahesh
    AlluriMahesh
    Local News Reporter Adilabad Urban, Telangana•
    4 hrs ago
  • ఆవిడకు తెలంగాణ రాష్ట్రంపై ఉన్న ప్రేమ, కేసీఆర్ గారిపై ఉన్న అభిమానం వెలకట్టలేనిది. సత్తెమ్మ గారి పాడె మోసి, ఆవిడ పార్థివ దేహానికి నేడు నివాళులర్పించాము. తెలంగాణ మలిదశ ఉద్యమ సమయంలో ప్రతిరోజూ పాల్గొంటూ, "జై తెలంగాణ" నినాదమే ఊపిరిగా జీవించిన ధీరవనిత సత్తెమ్మ. స్వరాష్ట్ర సాధన కోసం వారు చేసిన పోరాటం, వారి అంకితభావం నేటి యువతకు స్ఫూర్తిదాయకం. 💐🙏🏼
    1
    ఆవిడకు తెలంగాణ రాష్ట్రంపై ఉన్న ప్రేమ, కేసీఆర్ గారిపై ఉన్న అభిమానం వెలకట్టలేనిది. సత్తెమ్మ గారి పాడె మోసి, ఆవిడ పార్థివ దేహానికి నేడు నివాళులర్పించాము.
తెలంగాణ మలిదశ ఉద్యమ సమయంలో ప్రతిరోజూ పాల్గొంటూ, "జై తెలంగాణ" నినాదమే ఊపిరిగా జీవించిన ధీరవనిత సత్తెమ్మ.
స్వరాష్ట్ర సాధన కోసం వారు చేసిన పోరాటం, వారి అంకితభావం నేటి యువతకు స్ఫూర్తిదాయకం. 💐🙏🏼
    user_M.RAJKIRAN REDDY
    M.RAJKIRAN REDDY
    ఇచ్చోడ, ఆదిలాబాద్, తెలంగాణ•
    6 hrs ago
  • Post by Merugu Rajitha
    1
    Post by Merugu Rajitha
    user_Merugu Rajitha
    Merugu Rajitha
    Actor కటారం, జయశంకర్ భూపాలపల్లి, తెలంగాణ•
    6 hrs ago
  • రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి వారిని సినీనటి పూనమ్ కౌర్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఆమె స్వామివారికి కోడె మొక్కులు చెల్లించారు. అనంతరం ఆలయ మండపంలో అర్చకులు, వేద పండితులు ఆమెకు ఆశీర్వచనం అందజేసి, స్వామివారి తీర్థప్రసాదాలను అందించారు.
    2
    రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి వారిని సినీనటి పూనమ్ కౌర్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఆమె స్వామివారికి కోడె మొక్కులు చెల్లించారు. అనంతరం ఆలయ మండపంలో అర్చకులు, వేద పండితులు ఆమెకు ఆశీర్వచనం అందజేసి, స్వామివారి తీర్థప్రసాదాలను అందించారు.
    user_Satheesh gangu
    Satheesh gangu
    జర్నలిస్ట్ సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    4 hrs ago
  • Post by Vodnala thirupthi
    1
    Post by Vodnala thirupthi
    user_Vodnala thirupthi
    Vodnala thirupthi
    గన్నేరువరం, కరీంనగర్, తెలంగాణ•
    7 hrs ago
  • దిలార్పూర్ మండల కేంద్రంలో వాతావరణ మార్పులు ఒక్కసారిగా తీవ్రమవుతున్నాయి. ఎండ తీవ్రత మధ్యలో అకస్మాత్తుగా మేఘాలు కమ్ముకొని వర్షం పడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ అనూహ్య మార్పులతో మొక్కజొన్న రైతులు భయాందోళనకు గురవుతున్నారు. పండించిన పంటను కాపాడుకోవడానికి రైతులు పారీలతో కప్పుతూ అప్రమత్తంగా చర్యలు తీసుకుంటున్నారు.
    1
    దిలార్పూర్ మండల కేంద్రంలో వాతావరణ మార్పులు ఒక్కసారిగా తీవ్రమవుతున్నాయి. ఎండ తీవ్రత మధ్యలో అకస్మాత్తుగా మేఘాలు కమ్ముకొని వర్షం పడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ అనూహ్య మార్పులతో మొక్కజొన్న రైతులు భయాందోళనకు గురవుతున్నారు. పండించిన పంటను కాపాడుకోవడానికి రైతులు పారీలతో కప్పుతూ అప్రమత్తంగా చర్యలు తీసుకుంటున్నారు.
    user_Ravula Purushotham
    Ravula Purushotham
    దిలావర్‌పూర్, నిర్మల్, తెలంగాణ•
    21 hrs ago
  • ఆదిలాబాద్ జిల్లా : సత్నాల మండల కేంద్రంలో కామ్రేడ్ జి.రామన్న అధ్యక్షతన జరిగినది. జిల్లా లోని వివిధ మండల నుండి ప్రతినిధులు హాజరుకావడం జరిగినది.మహాసభ ప్రారంభం లో సీనియర్ రైతు నాయకులు కామ్రేడ్ బండి దత్తాత్రి జండా ఆవిష్కరణ చేశారు. అమరవీరులకు సంతాపాన్ని తెలియజేయడం జరిగింది. మహాసభ ప్రారంబోపాన్యాసాన్నిస్తూ రాష్ట్ర,జాతీయ మహాసభల ప్రాధాన్యతను చెపుతూ మొదటిసారి హైదరాబాద్ లో జాతీయ మహాసభలకు లక్ష మంది రైతులను సమీకరిస్తున్నామని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వల రైతు వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ పెద్ద పోరాటాలకు సిద్ధముకవాలని పిలిపించారు.జిల్లాలో రైతులు అనేక తీవ్ర సమస్యలను అందుకుంటున్నారని,వీటి పరిష్కారానికి కృషిచేయాలని కోరారు. నూతన జిల్లా కమిటీని ఎన్నుకోవటం జరిగినది. చివరలో రైతులు జిల్లాలో ఎదురుకుంటున్న ప్రధాన 10 సమస్యలపై తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదించడం జరిగినది. వ్యకాస జిల్లా నాయకులు లంక రాఘవులు,ఎన్.స్వామి,బి. గంగారాం, NPRD నాయకులు అరీఫా,కె.ఆశన్న , అడ్వకేట్ కె.సాయన్న తదితరులు పాల్గొన్నారు.
    1
    ఆదిలాబాద్ జిల్లా : సత్నాల మండల కేంద్రంలో కామ్రేడ్ జి.రామన్న అధ్యక్షతన జరిగినది. జిల్లా లోని వివిధ మండల నుండి ప్రతినిధులు హాజరుకావడం జరిగినది.మహాసభ ప్రారంభం లో  సీనియర్ రైతు నాయకులు కామ్రేడ్ బండి దత్తాత్రి జండా ఆవిష్కరణ చేశారు. అమరవీరులకు సంతాపాన్ని తెలియజేయడం జరిగింది. మహాసభ ప్రారంబోపాన్యాసాన్నిస్తూ రాష్ట్ర,జాతీయ మహాసభల ప్రాధాన్యతను చెపుతూ మొదటిసారి హైదరాబాద్ లో జాతీయ మహాసభలకు లక్ష మంది రైతులను సమీకరిస్తున్నామని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వల రైతు వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ పెద్ద పోరాటాలకు సిద్ధముకవాలని పిలిపించారు.జిల్లాలో రైతులు అనేక తీవ్ర సమస్యలను అందుకుంటున్నారని,వీటి పరిష్కారానికి కృషిచేయాలని కోరారు. నూతన జిల్లా కమిటీని ఎన్నుకోవటం జరిగినది. చివరలో రైతులు జిల్లాలో ఎదురుకుంటున్న ప్రధాన 10 సమస్యలపై తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదించడం జరిగినది. వ్యకాస జిల్లా నాయకులు లంక రాఘవులు,ఎన్.స్వామి,బి. గంగారాం, NPRD నాయకులు అరీఫా,కె.ఆశన్న , అడ్వకేట్ కె.సాయన్న తదితరులు పాల్గొన్నారు.
    user_AlluriMahesh
    AlluriMahesh
    Local News Reporter Adilabad Urban, Telangana•
    18 hrs ago
  • గన్నేరువరం: హిందువుల ఐక్యతే దేశ భద్రతకు బలమని కరీంనగర్ వివాగ్ సహా వ్యవస్థ ప్రముఖ్ దవులూరి మురళీధర్ అన్నారు. ఆదివారం మండలంలోని గుండ్లపల్లి ఎక్స్ రోడ్ వద్ద ఓ ఫంక్షన్ హాల్ లో జంగపల్లి ఉప మండలం హిందూ సమ్మేళన సభ నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా గుండ్లపల్లి లో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ దేశ భద్రతకు హిందువుల ఐక్యత అవసరమని, ప్రతి హిందువు చైతన్యవంతు డై దేశ రక్షణకు, హిందూ ధర్మ రక్షణకు నడుము బిగించాలని పిలుపునిచ్చారు. హిందూ ఆడబిడ్డలు ల్యాండ్ జియాది, లవ్ జియాది ల చేతిలో మోసపోతున్నారని, వారి వలలు ఆడబిడ్డలు పడకుండా వారిని తల్లిదండ్రులు చైతన్యవంతులను చేయాలని సూచించారు. అందరూ ఐకమత్యంతో హిందూ పండుగలను వైభవంగా జరుపుకొని, కట్టు బొట్టు హైందవ శ్రీ అలంకరణ గొప్పతనాన్ని భావితరాలకు తల్లులు తెలియపరచాలని, ప్రతి హిందువు గర్వంగా హిందూ ధర్మాన్ని ప్రచారం చేయాలని సూచించారు. హిందువులంతా ఐక్యమత్యంతో ఉంటే ఈ దేశాన్ని ఏ ఒక్కరు ఏమి చేయలేరని అన్నారు. హిందూ సమ్మేళన సభకు అధిక సంఖ్యలో మహిళలు స్థానిక ప్రజలు హాజరు కావడం ఆనందకరం అని కొనియాడారు. ప్రతి ఒక్కరూ శ్రీ రామ నామ పారాయణ, హనుమాన్ చాలీసా పారాయణ చేసి మానసిక ప్రశాంతతను పొందాలని, భావితరాలకు చక్కని క్రమశిక్షణ ను రామాయణ మహాభారత భాగవత గ్రంథాల నుండి గొప్ప వ్యక్తుల జీవిత గాధలతో తెలియపరచి భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు సొల్లు అజయ్ వర్మ, సామ రాజిరెడ్డి, నాయకులు బేతల్లి రాజేందర్ రెడ్డి, లెంకల కిషన్ రెడ్డి, దొమ్మాట భాస్కర్ రెడ్డి, తాళ్ల పెళ్లి పరుశురాం గౌడ్, కొంకటి గణేష్, అటికం రామచంద్రం గౌడ్ అధిక సంఖ్యలో హిందూ బంధువులు మహిళలు పాల్గొన్నారు.
    1
    గన్నేరువరం: హిందువుల ఐక్యతే దేశ భద్రతకు బలమని కరీంనగర్ వివాగ్ సహా వ్యవస్థ ప్రముఖ్ దవులూరి మురళీధర్ అన్నారు. ఆదివారం మండలంలోని గుండ్లపల్లి ఎక్స్ రోడ్ వద్ద ఓ ఫంక్షన్ హాల్ లో జంగపల్లి ఉప మండలం హిందూ సమ్మేళన సభ నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా గుండ్లపల్లి లో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ దేశ భద్రతకు హిందువుల ఐక్యత అవసరమని, ప్రతి హిందువు చైతన్యవంతు డై దేశ రక్షణకు, హిందూ ధర్మ రక్షణకు నడుము బిగించాలని పిలుపునిచ్చారు. హిందూ ఆడబిడ్డలు ల్యాండ్ జియాది, లవ్ జియాది ల చేతిలో మోసపోతున్నారని, వారి వలలు ఆడబిడ్డలు పడకుండా వారిని తల్లిదండ్రులు చైతన్యవంతులను చేయాలని సూచించారు. అందరూ ఐకమత్యంతో హిందూ పండుగలను వైభవంగా జరుపుకొని, కట్టు బొట్టు హైందవ శ్రీ అలంకరణ గొప్పతనాన్ని భావితరాలకు తల్లులు తెలియపరచాలని, ప్రతి హిందువు గర్వంగా హిందూ ధర్మాన్ని ప్రచారం చేయాలని సూచించారు. హిందువులంతా ఐక్యమత్యంతో ఉంటే ఈ దేశాన్ని ఏ ఒక్కరు ఏమి చేయలేరని అన్నారు. హిందూ సమ్మేళన సభకు అధిక సంఖ్యలో మహిళలు స్థానిక ప్రజలు హాజరు కావడం ఆనందకరం అని కొనియాడారు. ప్రతి ఒక్కరూ శ్రీ రామ నామ పారాయణ, హనుమాన్ చాలీసా పారాయణ చేసి మానసిక ప్రశాంతతను పొందాలని, భావితరాలకు చక్కని క్రమశిక్షణ ను రామాయణ మహాభారత భాగవత గ్రంథాల నుండి గొప్ప వ్యక్తుల జీవిత గాధలతో తెలియపరచి భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు సొల్లు అజయ్ వర్మ, సామ రాజిరెడ్డి, నాయకులు బేతల్లి రాజేందర్ రెడ్డి, లెంకల కిషన్ రెడ్డి, దొమ్మాట భాస్కర్ రెడ్డి, తాళ్ల పెళ్లి పరుశురాం గౌడ్, కొంకటి గణేష్, అటికం రామచంద్రం గౌడ్ అధిక సంఖ్యలో హిందూ బంధువులు మహిళలు పాల్గొన్నారు.
    user_Vodnala thirupthi
    Vodnala thirupthi
    గన్నేరువరం, కరీంనగర్, తెలంగాణ•
    22 hrs ago
  • తెలంగాణ సత్తెమ్మ గా గుర్తింపును సాధించిన పూర్వపు ఉమ్మడి కరీంనగర్ జిల్లా సిరిసిల్ల మండలం చీర్లవంచ ప్రస్తుత రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలం ఆర్ అండ్ ఆర్ కాలనీ కి చెందిన చిందం సత్తెమ్మ మృతి చెందగా మాజీ మంత్రి బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ సత్తెమ్మ అంత్య క్రియల్లో పాల్గొని స్వయంగా పాడేను మోసి సత్తెమ్మకు ఘన నివాళి అర్పించారు.ప్రస్తుతం వేములవాడ నియోజకవర్గం అగ్రహారానికి సమీపంలో ఉన్న తేట్టకుంట వద్ద ఆర్ అండ్ ఆర్ కాలనీ చీర్లవంచలో నివాసం ఉంటున్న ప్రముఖ ఉద్యమకారురాలు తెలంగాణ సత్తెమ్మ మృతి పట్ల బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తు ఆమె పార్థివ దేహానికి నివాళులర్పించడమే కాకుండా, కేటీఆర్ స్వయంగా పాడె మోశారు.తెలంగాణ మలిదశ ఉద్యమంలో సత్తెమ్మ చురుకైన పాత్ర పోషించారు. ఉద్యమ సమయంలో ప్రతిరోజూ ఉద్యమంలో పాల్గొంటూ, "జై తెలంగాణ" నినాదమే ఊపిరిగా జీవించిన ధీరవనితగా గుర్తింపును సాధించారు. స్వరాష్ట్ర సాధన కోసం సత్తెమ్మ చేసిన పోరాటం, ఆమె అంకితభావం నేటి యువతకు స్ఫూర్తిదాయకమని ఈ సందర్భంగా కేటీఆర్ కొనియాడారు. ఈ కార్యక్రమంలో కేటీఆర్‌తో పాటు వేములవాడ నియోజకవర్గ ఇంచార్జ్ చల్మెడ లక్ష్మీనరసింహ రావు ,మాజీ జెడ్పీ చైర్మన్ తుల ఉమ ,రాష్ట్ర నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి, ఇతర పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొని సత్తెమ్మకు కన్నీటి వీడ్కోలు పలికారు.
    1
    తెలంగాణ సత్తెమ్మ గా గుర్తింపును సాధించిన పూర్వపు ఉమ్మడి కరీంనగర్ జిల్లా సిరిసిల్ల మండలం చీర్లవంచ ప్రస్తుత రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలం ఆర్ అండ్ ఆర్ కాలనీ కి చెందిన చిందం సత్తెమ్మ మృతి చెందగా మాజీ మంత్రి బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ సత్తెమ్మ అంత్య క్రియల్లో పాల్గొని స్వయంగా పాడేను మోసి సత్తెమ్మకు ఘన నివాళి అర్పించారు.ప్రస్తుతం వేములవాడ నియోజకవర్గం అగ్రహారానికి సమీపంలో ఉన్న తేట్టకుంట వద్ద ఆర్ అండ్ ఆర్ కాలనీ చీర్లవంచలో నివాసం ఉంటున్న  ప్రముఖ ఉద్యమకారురాలు తెలంగాణ సత్తెమ్మ మృతి పట్ల బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తు ఆమె పార్థివ దేహానికి నివాళులర్పించడమే కాకుండా, కేటీఆర్ స్వయంగా పాడె మోశారు.తెలంగాణ మలిదశ ఉద్యమంలో సత్తెమ్మ చురుకైన పాత్ర పోషించారు. ఉద్యమ సమయంలో ప్రతిరోజూ ఉద్యమంలో పాల్గొంటూ, "జై తెలంగాణ" నినాదమే ఊపిరిగా జీవించిన ధీరవనితగా గుర్తింపును సాధించారు.
స్వరాష్ట్ర సాధన కోసం సత్తెమ్మ చేసిన పోరాటం, ఆమె అంకితభావం నేటి యువతకు స్ఫూర్తిదాయకమని ఈ సందర్భంగా కేటీఆర్ కొనియాడారు.
ఈ కార్యక్రమంలో కేటీఆర్‌తో పాటు వేములవాడ నియోజకవర్గ ఇంచార్జ్ చల్మెడ లక్ష్మీనరసింహ రావు ,మాజీ జెడ్పీ చైర్మన్ తుల ఉమ ,రాష్ట్ర నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి, ఇతర పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొని సత్తెమ్మకు కన్నీటి వీడ్కోలు పలికారు.
    user_Satheesh gangu
    Satheesh gangu
    జర్నలిస్ట్ సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    23 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.