logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఉత్కంఠ రేపుతున్న కాంగ్రెస్ రాజకీయాలు మంచిర్యాల జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ రాజకీయాలు ఆసక్తిగా మారుతున్నాయి .ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ను వ్యతిరేకిస్తూ ఇన్నాళ్లు ఆయనకు అనుచరుడిగా పేరు ఉన్న జగన్మోహన్రావు ప్రత్యేక కూటమి ఏర్పాటు చేశారు. మంచిర్యాల్, లక్షెట్టిపేట కార్పొరేటర్లు, కౌన్సిలర్లు మాజీలు కొందరు కూటమిలో చేరారు జగన్ కు అండగా ఎంపీ వంశీ, మంత్రి వివేక్ ఉన్నట్లు తెలుస్తుంది. గ్రూప్ రాజకీయాలపై ఎమ్మెల్యే ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

2 hrs ago
user_Gangadhar Reporter
Gangadhar Reporter
Farmer జన్నారం, మంచిర్యాల, తెలంగాణ•
2 hrs ago
fbdb7b11-1762-4eec-9622-7d2f250a583b

మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఉత్కంఠ రేపుతున్న కాంగ్రెస్ రాజకీయాలు మంచిర్యాల జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ రాజకీయాలు ఆసక్తిగా మారుతున్నాయి .ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ను వ్యతిరేకిస్తూ ఇన్నాళ్లు ఆయనకు అనుచరుడిగా పేరు ఉన్న జగన్మోహన్రావు ప్రత్యేక కూటమి ఏర్పాటు చేశారు. మంచిర్యాల్, లక్షెట్టిపేట కార్పొరేటర్లు, కౌన్సిలర్లు మాజీలు కొందరు కూటమిలో చేరారు జగన్ కు అండగా ఎంపీ వంశీ, మంత్రి వివేక్ ఉన్నట్లు తెలుస్తుంది. గ్రూప్ రాజకీయాలపై ఎమ్మెల్యే ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

More news from తెలంగాణ and nearby areas
  • రామగుండం లో గుజరాత్.NIA తనిఖీలు., * పూర్తి స్థాయిలో విచారణ జరపాలని రామగుండం సిపి కి వినతిపత్రం అందించిన విశ్వహింద్ పరిషత్ రామగుండం లో గుజరాత్ NIA తనిఖీల సంబంధించి రామగుండం పోలీసు కమీషనర్ కు వినతి పత్రం సమర్పించిన విశ్వహిందూ పరిషత్ నాయకులు. నిన్ను రామగుండం అయోధ్య నగర్ లో ముజాహిల్ అనే విద్యార్థి నీ గుజరాత్ NIA వారు అతని ఇంటిని సోదాలు నిర్వహించి అతని ఫోన్. లాప్టాప్ తీసుకువెళ్ళి అతనిని NTPC పోలీస్ స్టేషన్ లో విచారించడం జరిగింది.. ఈ సందర్భంగా పరిషత్. విభాగ కార్యదర్శి. అయోధ్య రవీందర్ మాట్లాడుతూ పారిశ్రామిక ప్రాంతంలో గత కొన్ని సంవత్సరాల నుండి ఇక్కడ ఉగ్రవాద జడలు ఉన్నాయి.. అనేకమంది ఇక్కడ షెల్టర్ తీసుకున్నారు. అనేకసార్లు ఇక్కడ జాతీయ నిగూ సంస్థ ల తనిఖీలు జరిగాయి.. కావున పోలీసు వారు ఇలాంటి సంఘటనలను సీరియస్ గా తీసుకొని పూర్తి స్థాయిలో విచారణ జరపాలని కోరారు... ఈ కార్యక్రమంలో. జిల్లా సహా కార్యదర్శి అడ్డిగొప్పుల రాజు. నగర్ కార్యదర్శి మునిగాల సంపత్. వెంకటస్వామి. లింగాన్న. రాజేశ్. తిరుపతి. మరియు బాధ్యులు పాల్గొన్నారు.....
    1
    రామగుండం లో గుజరాత్.NIA తనిఖీలు.,
* పూర్తి స్థాయిలో విచారణ జరపాలని రామగుండం సిపి కి వినతిపత్రం అందించిన విశ్వహింద్ పరిషత్ 
రామగుండం లో గుజరాత్ NIA తనిఖీల సంబంధించి రామగుండం పోలీసు కమీషనర్ కు వినతి పత్రం సమర్పించిన విశ్వహిందూ పరిషత్ నాయకులు.
నిన్ను రామగుండం అయోధ్య నగర్ లో ముజాహిల్ అనే విద్యార్థి నీ గుజరాత్ NIA వారు అతని ఇంటిని సోదాలు నిర్వహించి అతని ఫోన్. లాప్టాప్ తీసుకువెళ్ళి అతనిని NTPC పోలీస్ స్టేషన్ లో విచారించడం జరిగింది.. ఈ సందర్భంగా పరిషత్. విభాగ కార్యదర్శి. అయోధ్య రవీందర్ మాట్లాడుతూ పారిశ్రామిక ప్రాంతంలో గత కొన్ని సంవత్సరాల నుండి ఇక్కడ ఉగ్రవాద జడలు ఉన్నాయి.. అనేకమంది ఇక్కడ షెల్టర్ తీసుకున్నారు. అనేకసార్లు ఇక్కడ జాతీయ నిగూ సంస్థ ల తనిఖీలు జరిగాయి.. కావున పోలీసు వారు ఇలాంటి సంఘటనలను సీరియస్ గా తీసుకొని పూర్తి స్థాయిలో విచారణ జరపాలని కోరారు...
ఈ కార్యక్రమంలో. జిల్లా సహా కార్యదర్శి అడ్డిగొప్పుల రాజు. నగర్ కార్యదర్శి మునిగాల సంపత్. వెంకటస్వామి. లింగాన్న. రాజేశ్. తిరుపతి. మరియు బాధ్యులు పాల్గొన్నారు.....
    user_Telangana reporter
    Telangana reporter
    Local News Reporter రామగుండం, పెద్దపల్లి, తెలంగాణ•
    20 hrs ago
  • అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో ఉండాలి: మార్కెట్‌ చైర్మన్‌ శ్రీకాంత్‌రెడ్డి ఆదిలాబాద్‌ జిల్లా : అర్హత ఉన్న ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదిలాబాద్‌ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ బోరంచు శ్రీకాంత్‌రెడ్డి సూచించారు. ఏ ఒక్క ఓటు కోల్పోకుండా జాబితాను క్షుణ్ణంగా పరిశీలించి అవసరమైన సవరణలు చేపట్టాలని కోరారు. ప్రత్యేక తీవ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌)లో భాగంగా మావల, తాంసి, భీంపూర్‌ మండలాల్లో ఆయన పర్యటించి పలు గ్రామాల్లో నిర్వహించిన గ్రామసభల్లో పాల్గొన్నారు. తాంసి మండలం గోట్కూరి గ్రామంలో జరిగిన గ్రామసభలో శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడుతూ.. 18 ఏళ్లు నిండిన ప్రతి యువతీ, యువకుడు ఓటరుగా నమోదు చేసుకోవాలని సూచించారు. జాబితాలో పేరు, చిరునామా, వయస్సు తదితర వివరాల్లో తప్పులుంటే అధికారుల దృష్టికి తీసుకెళ్లి సరిచేయించుకోవాలన్నారు. ప్రతి కుటుంబం తమ ఓటరు వివరాలను పరిశీలించుకోవాలని, అర్హులైన వారి పేర్లు లేకుంటే వెంటనే నమోదు చేయించాలని కోరారు. ఓటరు జాబితా పారదర్శకంగా, తప్పుల్లేకుండా రూపొందించేందుకు ప్రజలు, బీఎల్‌ఓలు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో తహసీల్దార్లు గణేష్‌ జాదవ్‌, రమేష్‌, మావల ఎంపీడీఓ ముత్యం రావు, సర్పంచులు ధర్మపురి చంద్రశేఖర్‌, మతీన్‌, నాయకులు ఎండి ఖమరుద్దీన్‌ ఖాన్‌, బెజ్జంకి రోహిత్‌, ఉప సర్పంచ్‌ నిమ్మల మల్లయ్య, మార్కెట్‌ డైరెక్టర్‌ తాటి అశోక్‌, బత్తుల కిరణ్‌, బీఎల్‌ఓలు, ప్రజాప్రతినిధులు, గ్రామస్థులు పాల్గొన్నారు.
    1
    అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో ఉండాలి: మార్కెట్‌ చైర్మన్‌ శ్రీకాంత్‌రెడ్డి
ఆదిలాబాద్‌ జిల్లా : అర్హత ఉన్న ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదిలాబాద్‌ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ బోరంచు శ్రీకాంత్‌రెడ్డి సూచించారు. ఏ ఒక్క ఓటు కోల్పోకుండా జాబితాను క్షుణ్ణంగా పరిశీలించి అవసరమైన సవరణలు చేపట్టాలని కోరారు. ప్రత్యేక తీవ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌)లో భాగంగా మావల, తాంసి, భీంపూర్‌ మండలాల్లో ఆయన పర్యటించి పలు గ్రామాల్లో నిర్వహించిన గ్రామసభల్లో పాల్గొన్నారు. తాంసి మండలం గోట్కూరి గ్రామంలో జరిగిన గ్రామసభలో శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడుతూ.. 18 ఏళ్లు నిండిన ప్రతి యువతీ, యువకుడు ఓటరుగా నమోదు చేసుకోవాలని సూచించారు. జాబితాలో పేరు, చిరునామా, వయస్సు తదితర వివరాల్లో తప్పులుంటే అధికారుల దృష్టికి తీసుకెళ్లి సరిచేయించుకోవాలన్నారు. ప్రతి కుటుంబం తమ ఓటరు వివరాలను పరిశీలించుకోవాలని, అర్హులైన వారి పేర్లు లేకుంటే వెంటనే నమోదు చేయించాలని కోరారు. ఓటరు జాబితా పారదర్శకంగా, తప్పుల్లేకుండా రూపొందించేందుకు ప్రజలు, బీఎల్‌ఓలు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో తహసీల్దార్లు గణేష్‌ జాదవ్‌, రమేష్‌, మావల ఎంపీడీఓ ముత్యం రావు, సర్పంచులు ధర్మపురి చంద్రశేఖర్‌, మతీన్‌, నాయకులు ఎండి ఖమరుద్దీన్‌ ఖాన్‌, బెజ్జంకి రోహిత్‌, ఉప సర్పంచ్‌ నిమ్మల మల్లయ్య, మార్కెట్‌ డైరెక్టర్‌ తాటి అశోక్‌, బత్తుల కిరణ్‌, బీఎల్‌ఓలు, ప్రజాప్రతినిధులు, గ్రామస్థులు పాల్గొన్నారు.
    user_AlluriMahesh
    AlluriMahesh
    Local News Reporter Adilabad Urban, Telangana•
    2 hrs ago
  • *శిశు మందిర్ పాఠశాలలో రాఖీ పౌర్ణమి సందర్భంగా పౌర్ణమి హోమం మరియు రాఖీ ఉత్సవం* శ్రీ సరస్వతీ శిశు మందిర్ పాఠశాలలో ముందస్తు రాఖీ పౌర్ణమి పండుగను పురస్కరించుకుని పౌర్ణమి యజ్ఞాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు యజ్ఞంలో పాల్గొని వేద మంత్రోచ్ఛారణల మధ్య హవన కార్యక్రమాన్ని నిర్వహించారు. రక్షాబంధన్ పండుగ అన్నాచెల్లెళ్ల ఆత్మీయతకు, పరస్పర ప్రేమకు, రక్షణ భావానికి ప్రతీక అని ఉపాధ్యాయులు విద్యార్థులకు వివరించారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, సోదరభావం, దేశభక్తి వంటి విలువలను విద్యార్థుల్లో పెంపొందించడమే ఇటువంటి కార్యక్రమాల ముఖ్య ఉద్దేశమని పాఠశాల ప్రధానాచార్యులు మోర రణధీర్ తెలిపారు. యజ్ఞం అనంతరం విద్యార్థులు పరస్పరం రాఖీలు కట్టుకుని రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. పాఠశాల ఆవరణం భక్తి, ఆనందోత్సాహాలతో కళకళలాడింది. కార్యక్రమంలో కార్యదర్శి ఇంజనీర్ కోల అన్నారెడ్డి, ఎలగందుల సత్యనారాయణ, డా. ఎలగందుల శ్రీనివాస్, కొణిజర్ల మహేష్, శిరీష, పులాల శ్యామ్, అల్లాడి ఆనంద్ కుమార్, ముసుకుల విద్యాసాగర్ రెడ్డి, పండుగ నాగరాజు, టి రాజేశ్వర్ రావు, అప్పిడి వకుళా దేవి తదితరులు పాల్గొన్నారు.
    2
    *శిశు మందిర్ పాఠశాలలో రాఖీ పౌర్ణమి సందర్భంగా పౌర్ణమి హోమం మరియు రాఖీ ఉత్సవం* 
శ్రీ సరస్వతీ శిశు మందిర్ పాఠశాలలో ముందస్తు రాఖీ పౌర్ణమి పండుగను పురస్కరించుకుని పౌర్ణమి యజ్ఞాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.  
ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు యజ్ఞంలో పాల్గొని వేద మంత్రోచ్ఛారణల మధ్య హవన కార్యక్రమాన్ని నిర్వహించారు.
రక్షాబంధన్ పండుగ అన్నాచెల్లెళ్ల ఆత్మీయతకు, పరస్పర ప్రేమకు, రక్షణ భావానికి ప్రతీక అని ఉపాధ్యాయులు విద్యార్థులకు వివరించారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, సోదరభావం, దేశభక్తి వంటి విలువలను విద్యార్థుల్లో పెంపొందించడమే ఇటువంటి కార్యక్రమాల ముఖ్య ఉద్దేశమని పాఠశాల ప్రధానాచార్యులు మోర రణధీర్ తెలిపారు.
యజ్ఞం అనంతరం విద్యార్థులు పరస్పరం రాఖీలు కట్టుకుని రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. పాఠశాల ఆవరణం భక్తి, ఆనందోత్సాహాలతో కళకళలాడింది.
కార్యక్రమంలో కార్యదర్శి ఇంజనీర్ కోల అన్నారెడ్డి, ఎలగందుల సత్యనారాయణ, డా. ఎలగందుల శ్రీనివాస్, కొణిజర్ల మహేష్, శిరీష, పులాల శ్యామ్, అల్లాడి ఆనంద్ కుమార్, ముసుకుల విద్యాసాగర్ రెడ్డి, పండుగ నాగరాజు, టి రాజేశ్వర్ రావు, అప్పిడి వకుళా దేవి తదితరులు పాల్గొన్నారు.
    user_OM NAMSHIVAYA
    OM NAMSHIVAYA
    Karimnagar, Telangana•
    2 hrs ago
  • ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలి: TGEJAC ADB: ఉద్యోగ, ఉపాధ్యాయుల హక్కుల పరిరక్షణకై TGEJAC ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట గురువారం పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం చేపట్టారు. సంఘం నాయకులు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు PRC అమలు, పెండింగ్ DA, బకాయిల చెల్లింపు, CPS రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులంతా ఐక్యంగా పోరాడి డిమాండ్లను సాధించుకోవాలని నేతలు పిలుపునిచ్చారు.
    1
    ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలి: TGEJAC
ADB: ఉద్యోగ, ఉపాధ్యాయుల హక్కుల పరిరక్షణకై TGEJAC ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట గురువారం పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం చేపట్టారు. సంఘం నాయకులు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు PRC అమలు, పెండింగ్ DA, బకాయిల చెల్లింపు, CPS రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులంతా ఐక్యంగా పోరాడి డిమాండ్లను సాధించుకోవాలని నేతలు పిలుపునిచ్చారు.
    user_Mallaiah Potta
    Mallaiah Potta
    Local News Reporter ఆదిలాబాద్ అర్బన్, ఆదిలాబాద్, తెలంగాణ•
    3 hrs ago
  • మిలాద్‌ ఉన్‌ నబీ ఊరేగింపు ప్రశాంతంగా నిర్వహణ : సహకరించినందుకు వారికి ధన్యవాదాలు సిపి గౌస్ ఆలం కరీంనగర్‌లో మిలాద్‌ ఉన్‌ నబీ పర్వదినాన్ని పురస్కరించుకుని బుధవారం నిర్వహించిన ఊరేగింపు ప్రశాంతంగా, వైభవంగా సాగింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా కరీంనగర్ పోలీస్‌ కమిషనరేట్‌ ఆధ్వర్యంలో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం తెలిపారు. సీపీ గౌష్‌ ఆలం స్థానిక పోలీసు అధికారులతో కలిసి భద్రతా ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించి పర్యవేక్షించారు. నాఖా చౌరస్తా, తెలంగాణ చౌక్‌ వద్ద ముస్లిం మత పెద్దలను పూలమాలలతో సత్కరించి మిలాద్‌ ఉన్‌ నబీ శుభాకాంక్షలు తెలిపారు. ఊరేగింపును ప్రశాంతంగా నిర్వహించడంలో సహకరించినందుకు వారికి ధన్యవాదాలు తెలిపారు. కరీంనగర్‌ శాంతిభద్రతలు, పరమత సహనం, సోదరభావానికి ప్రతీకగా నిలుస్తోందని, నగరంలోని గంగా–జమునా తెహజీబ్‌కు ఈ వేడుకలు నిదర్శనమని సీపీ పేర్కొన్నారు. ఊరేగింపు మార్గంలో ట్రాఫిక్‌ ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు ట్రాఫిక్‌ మళ్లింపులు చేపట్టి, ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.
    1
    మిలాద్‌ ఉన్‌ నబీ ఊరేగింపు ప్రశాంతంగా నిర్వహణ : సహకరించినందుకు వారికి ధన్యవాదాలు సిపి గౌస్ ఆలం
కరీంనగర్‌లో మిలాద్‌ ఉన్‌ నబీ పర్వదినాన్ని పురస్కరించుకుని బుధవారం నిర్వహించిన ఊరేగింపు ప్రశాంతంగా, వైభవంగా సాగింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా కరీంనగర్ పోలీస్‌ కమిషనరేట్‌ ఆధ్వర్యంలో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం తెలిపారు.
సీపీ గౌష్‌ ఆలం స్థానిక పోలీసు అధికారులతో కలిసి భద్రతా ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించి పర్యవేక్షించారు. నాఖా చౌరస్తా, తెలంగాణ చౌక్‌ వద్ద ముస్లిం మత పెద్దలను పూలమాలలతో సత్కరించి మిలాద్‌ ఉన్‌ నబీ శుభాకాంక్షలు తెలిపారు. ఊరేగింపును ప్రశాంతంగా నిర్వహించడంలో సహకరించినందుకు వారికి ధన్యవాదాలు తెలిపారు.
కరీంనగర్‌ శాంతిభద్రతలు, పరమత సహనం, సోదరభావానికి ప్రతీకగా నిలుస్తోందని, నగరంలోని గంగా–జమునా తెహజీబ్‌కు ఈ వేడుకలు నిదర్శనమని సీపీ పేర్కొన్నారు. ఊరేగింపు మార్గంలో ట్రాఫిక్‌ ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు ట్రాఫిక్‌ మళ్లింపులు చేపట్టి, ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.
    user_శాతవాహన కరీంనగర్
    శాతవాహన కరీంనగర్
    కరీంనగర్ రూరల్, కరీంనగర్, తెలంగాణ•
    17 hrs ago
  • బొగ్గు గని కార్మికులకు 35% లాభాల వాటా, 25% ఇంటిరియం రిలీఫ్ చెల్లించాలి : HMS నేత రియాజ్ అహ్మద్ కోల్ ఇండియా యాజమాన్యం 12వ వేతన ఒప్పందం జరిగేంతవరకు ముందుగా దేశంలోని బొగ్గు గని కార్మికులకు 25% (ఐ. ఆర్) ఇంటీరియం రిలీఫ్ చెల్లించాలని HMS పక్షాన డిమాండ్ చేస్తున్నాం. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ప్రైవేటు బొగ్గు రంగ సంస్థల యాజమాన్యాల కు అనుకూలంగా వ్యవహరిస్తూ 12వ వేతన ఒప్పందం జరగకుండా నిర్లక్ష్యం వహిస్తుంది అందుకే వేతన ఒప్పందం విషయంలో లేబర్ కోడ్లను అడ్డుపెట్టుకొని దేశంలోని బొగ్గు రంగ సంస్థలలో ఎన్నికలు నిర్వహించి 51% మెజారిటీ ఓట్లు వచ్చిన సంఘంతోనే వేతన ఒప్పందాలు చేస్తామని కాంట్రాక్టర్లకు వత్తాసు పలుకుతుంది. దీనికి కోల్ ఇండియా యాజమాన్యం JBCCI సంఘాలను పిలవకుండా 12 వ వేతన కమిటీ వేయకుండా నిర్లక్ష్యం వహిస్తుంది. ఇలాంటి కార్మిక వ్యతిరేక విధానాలను మానుకొని 12వ వేతన కమిటీ ఒప్పందం జరిగే వరకు బొగ్గు రంగ సంస్థలలో పనిచేస్తున్న కార్మికులందరికీ 25% ఇంటీరియర్ రిలీఫ్ చెల్లించాలని మరియు వేతన కమిటీని నియమించాలని HMS పక్షాన డిమాండ్ చేస్తున్నాం. అలాగే సింగరేణి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ మరియు డైరెక్టర్ పా స్పందించి గతంలో ఇచ్చిన మాదిరిగా వేతన ఒప్పందాలు జరిగేంతవరకు సింగరేణి కార్మికులకు 25% శాతం ఇంటీరియం రిలీఫ్ చెల్లించాలని ఒప్పందాలు జరిగిన తర్వాత పెరిగిన పూర్తి వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాం: అంతేకాకుండా గత 2024 సంవత్సరంలో సింగరేణి సంస్థ అంతర్గతంగా ఉన్న భర్తీ చేయడానికి నోటిఫికేషన్ ఇచ్చి కూడా ఇప్పటివరకు ఖాళీలను భర్తీ చేయలేదు. కాబట్టి సెక్యూరిటీ ఖాళీలతో పాటు అంతర్గత ఖాళీలను యుద్ధ ప్రాతిపదికన సంబంధిత పరీక్షలు నిర్వహించి భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. 2025 -26 ఆర్థిక సంవత్సరములో సింగరేణి సంస్థకు వచ్చిన నికర లాభాల నుండి కార్మికులకు 35% లాభాల వాటాను చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాం. అలాగే సింగరేణిలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులకు 10 శాతం లాభాల వాటాను చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాం. లేనిచో తీవ్ర పోరాటాలు తప్పవని హెచ్చరించారు.
    1
    బొగ్గు గని కార్మికులకు 35% లాభాల వాటా,  25% ఇంటిరియం రిలీఫ్ చెల్లించాలి : HMS నేత రియాజ్ అహ్మద్ 
కోల్ ఇండియా యాజమాన్యం 12వ వేతన ఒప్పందం జరిగేంతవరకు ముందుగా దేశంలోని బొగ్గు గని కార్మికులకు 25% (ఐ. ఆర్) ఇంటీరియం రిలీఫ్ చెల్లించాలని HMS పక్షాన డిమాండ్ చేస్తున్నాం. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ప్రైవేటు బొగ్గు రంగ సంస్థల యాజమాన్యాల కు అనుకూలంగా వ్యవహరిస్తూ 12వ వేతన ఒప్పందం జరగకుండా నిర్లక్ష్యం వహిస్తుంది అందుకే వేతన ఒప్పందం విషయంలో లేబర్ కోడ్లను అడ్డుపెట్టుకొని దేశంలోని బొగ్గు రంగ సంస్థలలో ఎన్నికలు నిర్వహించి 51% మెజారిటీ ఓట్లు వచ్చిన సంఘంతోనే వేతన ఒప్పందాలు చేస్తామని కాంట్రాక్టర్లకు వత్తాసు పలుకుతుంది. దీనికి కోల్ ఇండియా యాజమాన్యం JBCCI సంఘాలను పిలవకుండా 12 వ వేతన కమిటీ వేయకుండా నిర్లక్ష్యం వహిస్తుంది. ఇలాంటి కార్మిక వ్యతిరేక విధానాలను మానుకొని 12వ వేతన కమిటీ ఒప్పందం జరిగే వరకు బొగ్గు రంగ సంస్థలలో పనిచేస్తున్న కార్మికులందరికీ 25% ఇంటీరియర్ రిలీఫ్ చెల్లించాలని మరియు వేతన కమిటీని నియమించాలని HMS పక్షాన డిమాండ్ చేస్తున్నాం. అలాగే సింగరేణి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ మరియు డైరెక్టర్ పా స్పందించి గతంలో ఇచ్చిన మాదిరిగా వేతన ఒప్పందాలు జరిగేంతవరకు సింగరేణి కార్మికులకు 25% శాతం ఇంటీరియం రిలీఫ్ చెల్లించాలని ఒప్పందాలు జరిగిన తర్వాత పెరిగిన పూర్తి వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాం: అంతేకాకుండా గత 2024 సంవత్సరంలో సింగరేణి సంస్థ అంతర్గతంగా ఉన్న భర్తీ చేయడానికి నోటిఫికేషన్ ఇచ్చి కూడా ఇప్పటివరకు ఖాళీలను భర్తీ చేయలేదు. కాబట్టి సెక్యూరిటీ ఖాళీలతో పాటు అంతర్గత ఖాళీలను యుద్ధ ప్రాతిపదికన సంబంధిత పరీక్షలు నిర్వహించి భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. 2025 -26 ఆర్థిక సంవత్సరములో సింగరేణి సంస్థకు వచ్చిన నికర లాభాల నుండి కార్మికులకు 35% లాభాల వాటాను చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాం. అలాగే సింగరేణిలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులకు 10 శాతం లాభాల వాటాను చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాం. లేనిచో తీవ్ర పోరాటాలు తప్పవని హెచ్చరించారు.
    user_Telangana reporter
    Telangana reporter
    Local News Reporter రామగుండం, పెద్దపల్లి, తెలంగాణ•
    20 hrs ago
  • తెలంగాణ ఉద్యోగ ఉపాధ్యాయ,పెన్షనర్ల జేఏసీ ఆధ్వర్యంలో కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట ధర్నా కరీంనగర్‌లో ఉద్యోగుల మహాధర్నా ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ఉద్యోగ ఉపాధ్యాయ,పెన్షనర్ల జేఏసీ ఆధ్వర్యంలో కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట ధర్నా జిల్లాలోని ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లు, గెజిటెడ్ అధికారులు, నాలుగో తరగతి సిబ్బంది, డ్రైవర్లు మరియు వివిధ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఉద్యోగుల సంక్షేమానికి చర్యలు తీసుకోవాలని, సీపీఎస్ స్థానంలో పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహించారు.
    3
    తెలంగాణ ఉద్యోగ ఉపాధ్యాయ,పెన్షనర్ల జేఏసీ ఆధ్వర్యంలో కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట ధర్నా 
కరీంనగర్‌లో ఉద్యోగుల మహాధర్నా
ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ఉద్యోగ ఉపాధ్యాయ,పెన్షనర్ల జేఏసీ ఆధ్వర్యంలో కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట ధర్నా 
జిల్లాలోని ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లు, గెజిటెడ్ అధికారులు, నాలుగో తరగతి సిబ్బంది, డ్రైవర్లు మరియు వివిధ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఉద్యోగుల సంక్షేమానికి చర్యలు తీసుకోవాలని, సీపీఎస్ స్థానంలో పాత పెన్షన్ విధానాన్ని  పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహించారు.
    user_OM NAMSHIVAYA
    OM NAMSHIVAYA
    Karimnagar, Telangana•
    2 hrs ago
  • *రేపటి గ్రామ సభల్లో అర్హులైన ఓటర్లను గుర్తించాలి* *ఓటు హక్కు కోల్పోకుండా చూడాల్సిన బాధ్యత కాంగ్రెస్ బీఎల్‌ఏ–2లు, కార్యకర్తలదే – డీసీసీ అధ్యక్షులు* *డా. నరేష్ జాదవ్ గారు * రేపు జరగబోయే గ్రామ సభల్లో అర్హులైన ప్రతి ఒక్క ఓటరును గుర్తించి, వారు తమ ఓటు హక్కును కోల్పోకుండా చూడాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ బీఎల్‌ఏ–2లు, మండల అధ్యక్షులు, టౌన్ అధ్యక్షులు, వార్డు అధ్యక్షులు, ప్రతి కాంగ్రెస్ కార్యకర్తపై ఉందని ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు డా. నరేష్ జాదవ్ గారు అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఈరోజు మండల కాంగ్రెస్ అధ్యక్షులు, టౌన్ అధ్యక్షులు, వార్డు అధ్యక్షులతో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు డా. నరేష్ జాదవ్ గారి నాయకత్వంలో సమావేశం నిర్వహించారు. రాబోయే రోజుల్లో పార్టీ సంస్థాగతంగా మరింత బలోపేతం కావడంతో పాటు, SIR ప్రక్రియలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చేపట్టాల్సిన కార్యాచరణపై సమావేశంలో విస్తృతంగా చర్చించారు. అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో డీసీసీ అధ్యక్షులు డా. నరేష్ జాదవ్ గారు మాట్లాడుతూ, రేపు జరగబోయే గ్రామ సభలను కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అత్యంత బాధ్యతాయుతంగా పర్యవేక్షించాలని సూచించారు. అర్హత కలిగిన ఏ ఒక్కరి ఓటు హక్కు కూడా కోల్పోకుండా చూడాలని, ఓటరు జాబితాలో తమ పేరు ఉందా లేదా అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ పరిశీలించుకునేలా కాంగ్రెస్ కార్యకర్తలు ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నారు. SIR ప్రక్రియలో ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త తన బాధ్యతను గుర్తించి పనిచేయాలని డా. నరేష్ జాదవ్ గారు పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యానికి ఓటు హక్కు పునాది వంటిదని, అర్హులైన ప్రతి పౌరుడికి ఓటు హక్కు ఉండేలా చూడటం ప్రజాస్వామ్య పరిరక్షణలో కీలకమైన అంశమని అన్నారు. ముఖ్యంగా దళితులు, మైనారిటీలు, పేదలు, అణగారిన వర్గాలకు చెందిన అర్హులైన ఓటర్లు తమ ఓటు హక్కును కోల్పోకుండా కాంగ్రెస్ కార్యకర్తలు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. అర్హత కలిగిన ఓటర్లు అవసరమైన పత్రాలను సమర్పించుకోవడం, ఓటరు జాబితాలో తమ పేర్లను పరిశీలించుకోవడం వంటి అంశాల్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రజలకు పూర్తిస్థాయిలో సహకరిస్తారని డా. నరేష్ జాదవ్ గారు తెలిపారు. ఏదైనా కారణంతో అర్హులైన ఓటర్ల పేర్లు తొలగించబడినట్లయితే, సంబంధిత నిబంధనల ప్రకారం వారు తమ అభ్యంతరాలు, దరఖాస్తులు సమర్పించుకునేలా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సహకరించాలని అన్నారు. అర్హులైన ఓటర్లను ఓటరు జాబితా నుంచి తొలగించే కుట్రలకు పాల్పడితే కాంగ్రెస్ పార్టీ సహించబోదని డా. నరేష్ జాదవ్ గారు హెచ్చరించారు. ఓటు హక్కు విషయంలో ఎలాంటి అవకతవకలకు తావులేకుండా ప్రజాస్వామ్య విలువలను కాపాడేందుకు కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ప్రజల పక్షాన నిలుస్తుందని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ పునర్నిర్మాణం, సంస్థాగత బలోపేతంలో భాగంగా మండల కాంగ్రెస్ అధ్యక్షులు, టౌన్ అధ్యక్షులు, వార్డు అధ్యక్షులతో ఈ సమావేశాన్ని నిర్వహించినట్లు డా. నరేష్ జాదవ్ గారు తెలిపారు. పార్టీ అగ్రనేత, గౌరవనీయులు శ్రీ రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా ప్రజా సమస్యలపై చేస్తున్న పోరాటాన్ని కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు స్ఫూర్తిగా తీసుకోవాలని అన్నారు.ప్రజా సమస్యలపై రాహుల్ గాంధీ గారు చేస్తున్న పోరాటం, ఆయన ఆశయాలను ఆదిలాబాద్ జిల్లాలోని ప్రతి గ్రామానికి, ప్రతి కుటుంబానికి చేరేలా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని దిశానిర్దేశం చేశారు. పార్టీ కార్యకర్తలు ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను తెలుసుకుని, వాటి పరిష్కారం కోసం నిరంతరం పోరాడాలని సూచించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజాస్వామ్యం, రాజ్యాంగం, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తున్న తీరును ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని డా. నరేష్ జాదవ్ గారు అన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పోరాటాన్ని ప్రజలకు వివరించాలని సూచించారు. రాబోయే కాలంలో గౌరవనీయులు శ్రీ రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిగా చూడాలనే లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కష్టపడి పనిచేయాలని, అలాగే తెలంగాణ రాష్ట్రంలో రెండోసారి కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఏర్పాటు అయ్యేలా ప్రతి నాయకుడు, ప్రతి కార్యకర్త సమష్టిగా కృషి చేయాలని డీసీసీ అధ్యక్షులు డా. నరేష్ జాదవ్ గారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ డీసీసీ అధ్యక్షులు సాజిద్ ఖాన్ గారు, మాజీ మార్కెట్ చైర్మన్ అల్లూరి సంజీవరెడ్డి గారు, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు ఖిజార్ పాషా గారు, జిల్లా కాంగ్రెస్ అధికార ప్రతినిధి బాలూరి గోవర్ధన్ రెడ్డి గారు, జిల్లా ఓబీసీ సెల్ అధ్యక్షులు అంబకంటి అశోక్ గారు, జిల్లా మైనారిటీ విభాగం అధ్యక్షులు సయ్యద్ షాహిద్ గారు, జిల్లా కాంగ్రెస్ ఎస్సీ విభాగం అధ్యక్షులు పరమేశ్వర్ గారు, జిల్లా సేవాదళ్ అధ్యక్షులు మోతీరామ్ గారు, ఐఎన్‌టీయూసీ జిల్లా అధ్యక్షులు మునిగల నర్సింగ్ గారు, జిల్లా లీగల్ సెల్ అధ్యక్షులు మంగేష్ దేవతడే గారు, పట్టణ మున్సిపల్ కౌన్సిలర్ శ్రీమతి అన్నపూర్ణ గారు, మండల కాంగ్రెస్ అధ్యక్షులు, జిల్లా జనరల్ సెక్రటరీలు, జిల్లా కాంగ్రెస్ సెక్రటరీలు, ఇతర ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు
    3
    *రేపటి గ్రామ సభల్లో అర్హులైన ఓటర్లను గుర్తించాలి* 
 *ఓటు హక్కు కోల్పోకుండా చూడాల్సిన బాధ్యత కాంగ్రెస్ బీఎల్‌ఏ–2లు, కార్యకర్తలదే – డీసీసీ అధ్యక్షులు* *డా. నరేష్ జాదవ్ గారు
* 
రేపు జరగబోయే గ్రామ సభల్లో అర్హులైన ప్రతి ఒక్క ఓటరును గుర్తించి, వారు తమ ఓటు హక్కును కోల్పోకుండా చూడాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ బీఎల్‌ఏ–2లు, మండల అధ్యక్షులు, టౌన్ అధ్యక్షులు, వార్డు అధ్యక్షులు, ప్రతి కాంగ్రెస్ కార్యకర్తపై ఉందని ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు డా. నరేష్ జాదవ్ గారు అన్నారు.
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఈరోజు మండల కాంగ్రెస్ అధ్యక్షులు, టౌన్ అధ్యక్షులు, వార్డు అధ్యక్షులతో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు డా. నరేష్ జాదవ్ గారి నాయకత్వంలో సమావేశం నిర్వహించారు. రాబోయే రోజుల్లో పార్టీ సంస్థాగతంగా మరింత బలోపేతం కావడంతో పాటు, SIR ప్రక్రియలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చేపట్టాల్సిన కార్యాచరణపై సమావేశంలో విస్తృతంగా చర్చించారు.
అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో డీసీసీ అధ్యక్షులు డా. నరేష్ జాదవ్ గారు మాట్లాడుతూ, రేపు జరగబోయే గ్రామ సభలను కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అత్యంత బాధ్యతాయుతంగా పర్యవేక్షించాలని సూచించారు. అర్హత కలిగిన ఏ ఒక్కరి ఓటు హక్కు కూడా కోల్పోకుండా చూడాలని, ఓటరు జాబితాలో తమ పేరు ఉందా లేదా అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ పరిశీలించుకునేలా కాంగ్రెస్ కార్యకర్తలు ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నారు.
SIR ప్రక్రియలో ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త తన బాధ్యతను గుర్తించి పనిచేయాలని డా. నరేష్ జాదవ్ గారు పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యానికి ఓటు హక్కు పునాది వంటిదని, అర్హులైన ప్రతి పౌరుడికి ఓటు హక్కు ఉండేలా చూడటం ప్రజాస్వామ్య పరిరక్షణలో కీలకమైన అంశమని అన్నారు. ముఖ్యంగా దళితులు, మైనారిటీలు, పేదలు, అణగారిన వర్గాలకు చెందిన అర్హులైన ఓటర్లు తమ ఓటు హక్కును కోల్పోకుండా కాంగ్రెస్ కార్యకర్తలు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.
అర్హత కలిగిన ఓటర్లు అవసరమైన పత్రాలను సమర్పించుకోవడం, ఓటరు జాబితాలో తమ పేర్లను పరిశీలించుకోవడం వంటి అంశాల్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రజలకు పూర్తిస్థాయిలో సహకరిస్తారని డా. నరేష్ జాదవ్ గారు తెలిపారు. ఏదైనా కారణంతో అర్హులైన ఓటర్ల పేర్లు తొలగించబడినట్లయితే, సంబంధిత నిబంధనల ప్రకారం వారు తమ అభ్యంతరాలు, దరఖాస్తులు సమర్పించుకునేలా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సహకరించాలని అన్నారు.
అర్హులైన ఓటర్లను ఓటరు జాబితా నుంచి తొలగించే కుట్రలకు పాల్పడితే కాంగ్రెస్ పార్టీ సహించబోదని డా. నరేష్ జాదవ్ గారు హెచ్చరించారు. ఓటు హక్కు విషయంలో ఎలాంటి అవకతవకలకు తావులేకుండా ప్రజాస్వామ్య విలువలను కాపాడేందుకు కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ప్రజల పక్షాన నిలుస్తుందని స్పష్టం చేశారు.
కాంగ్రెస్ పార్టీ పునర్నిర్మాణం, సంస్థాగత బలోపేతంలో భాగంగా మండల కాంగ్రెస్ అధ్యక్షులు, టౌన్ అధ్యక్షులు, వార్డు అధ్యక్షులతో ఈ సమావేశాన్ని నిర్వహించినట్లు డా. నరేష్ జాదవ్ గారు తెలిపారు. పార్టీ అగ్రనేత, గౌరవనీయులు శ్రీ రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా ప్రజా సమస్యలపై చేస్తున్న పోరాటాన్ని కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు స్ఫూర్తిగా తీసుకోవాలని అన్నారు.ప్రజా సమస్యలపై రాహుల్ గాంధీ గారు చేస్తున్న పోరాటం, ఆయన ఆశయాలను ఆదిలాబాద్ జిల్లాలోని ప్రతి గ్రామానికి, ప్రతి కుటుంబానికి చేరేలా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని దిశానిర్దేశం చేశారు. పార్టీ కార్యకర్తలు ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను తెలుసుకుని, వాటి పరిష్కారం కోసం నిరంతరం పోరాడాలని సూచించారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజాస్వామ్యం, రాజ్యాంగం, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తున్న తీరును ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని డా. నరేష్ జాదవ్ గారు అన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పోరాటాన్ని ప్రజలకు వివరించాలని సూచించారు.
రాబోయే కాలంలో గౌరవనీయులు శ్రీ రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిగా చూడాలనే లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కష్టపడి పనిచేయాలని, అలాగే తెలంగాణ రాష్ట్రంలో రెండోసారి కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఏర్పాటు అయ్యేలా ప్రతి నాయకుడు, ప్రతి కార్యకర్త సమష్టిగా కృషి చేయాలని డీసీసీ అధ్యక్షులు డా. నరేష్ జాదవ్ గారు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో మాజీ డీసీసీ అధ్యక్షులు సాజిద్ ఖాన్ గారు, మాజీ మార్కెట్ చైర్మన్ అల్లూరి సంజీవరెడ్డి గారు, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు  ఖిజార్ పాషా గారు, జిల్లా కాంగ్రెస్ అధికార ప్రతినిధి బాలూరి గోవర్ధన్ రెడ్డి గారు, జిల్లా ఓబీసీ సెల్ అధ్యక్షులు అంబకంటి అశోక్ గారు, జిల్లా మైనారిటీ విభాగం అధ్యక్షులు  సయ్యద్ షాహిద్ గారు, జిల్లా కాంగ్రెస్ ఎస్సీ విభాగం అధ్యక్షులు  పరమేశ్వర్ గారు, జిల్లా సేవాదళ్ అధ్యక్షులు మోతీరామ్ గారు, ఐఎన్‌టీయూసీ జిల్లా అధ్యక్షులు మునిగల నర్సింగ్ గారు, జిల్లా లీగల్ సెల్ అధ్యక్షులు  మంగేష్ దేవతడే గారు, పట్టణ మున్సిపల్ కౌన్సిలర్ శ్రీమతి అన్నపూర్ణ గారు, మండల కాంగ్రెస్ అధ్యక్షులు, జిల్లా జనరల్ సెక్రటరీలు, జిల్లా కాంగ్రెస్ సెక్రటరీలు, ఇతర ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు
    user_Musku Rajkiran Reddy
    Musku Rajkiran Reddy
    ఆదిలాబాద్ అర్బన్, ఆదిలాబాద్, తెలంగాణ•
    19 hrs ago
  • కామారెడ్డి జిల్లా బాన్సువాడ తాడ్కోల్ రోడ్డు చౌరస్తా లొ రోడ్డు ప్రమాదం. బైక్ ను వెనుక నుండి ఢీ కొట్టిన లారీ. బైక్ పై తండ్రి వెనుక కూర్చున్న జైనబ్ ఫాతిమా 4 సం యుకెజి తలపై ఎక్కిన లారీ స్పాట్ లోనే మృతి. స్కూల్ కు వెళ్తుండగా ఘటన.
    1
    కామారెడ్డి జిల్లా

బాన్సువాడ తాడ్కోల్ రోడ్డు చౌరస్తా లొ రోడ్డు ప్రమాదం.

బైక్ ను వెనుక నుండి ఢీ కొట్టిన లారీ.

బైక్ పై తండ్రి వెనుక కూర్చున్న జైనబ్ ఫాతిమా 4 సం యుకెజి తలపై ఎక్కిన లారీ స్పాట్ లోనే మృతి. 

స్కూల్ కు వెళ్తుండగా ఘటన.
    user_Banswada news
    Banswada news
    ఆదిలాబాద్ అర్బన్, ఆదిలాబాద్, తెలంగాణ•
    3 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.