పులివెందులలో కాల్పుల కలకలం - వినాయక విగ్రహం వద్ద టీడీపీ వర్గాల ఘర్షణ వైయస్ఆర్ జిల్లా పులివెందులలో వినాయక విగ్రహ ఏర్పాటు వివాదం తీవ్ర ఉద్రిక్తతకు, కాల్పులకు దారితీసింది. టీడీపీ ఇన్‌చార్జ్ బీటెక్ రవి అనుచరుల మధ్యే తలెత్తిన ఆధిపత్య పోరు కాస్తా వర్గపోరుగా మారి పరస్పర దాడికి కారణమైంది. ఘటనకు సంబంధించిన వివరాలు: వివాదానికి కారణം: పులివెందులలో వినాయక విగ్రహం వద్దకు వచ్చిన టీడీపీ ఇన్‌చార్జ్ 'బీటెక్ రవి' స్థానిక నాయకుడు విజయ్‌కు శాలువా కప్పడం, మరో వర్గానికి చెందిన పుష్పనాథరెడ్డి (పుష్ప) వర్గానికి కాకపోవడంతో మనస్పర్థలు తలెత్తాయి. దాడులు: బీటెక్ రవి అక్కడి నుంచి వెళ్లిపోగానే విజయ్ వర్గం, పుష్పనాథరెడ్డి వర్గాల మధ్య వాగ్వాదం పెరిగి పరస్పర దాడులకు దిగాయి. కాల్పుల కలకలం: ఘర్షణ తీవ్రరూపం దాల్చి విజయ్ ఇంటిపైకి రాళ్లు రువ్వడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో గన్ మెన్లు మరియు ఇరువర్గాల తరుపున రబ్బానీ, మహబూబ్ బాషాలు గాల్లోకి కాల్పులు జరిపారు. ఆస్తినష్టం: ఈ ఘర్షణల్లో ఇరువర్గాలు విచక్షణారహితంగా రాళ్లు విసురుకోవడంతో మూడు వాహనాలు ధ్వంసమయ్యాయి. స్థానికంగా కలకలం రేపిన ఈ ఘటనపై పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. పూర్తి వివరాలపై దర్యాప్తు కొనసాగుతోంది.
పులివెందులలో కాల్పుల కలకలం - వినాయక విగ్రహం వద్ద టీడీపీ వర్గాల ఘర్షణ వైయస్ఆర్ జిల్లా పులివెందులలో వినాయక విగ్రహ ఏర్పాటు వివాదం తీవ్ర ఉద్రిక్తతకు, కాల్పులకు దారితీసింది. టీడీపీ ఇన్‌చార్జ్ బీటెక్ రవి అనుచరుల మధ్యే తలెత్తిన ఆధిపత్య పోరు కాస్తా వర్గపోరుగా మారి పరస్పర దాడికి కారణమైంది. ఘటనకు సంబంధించిన వివరాలు: వివాదానికి కారణം: పులివెందులలో వినాయక విగ్రహం వద్దకు వచ్చిన టీడీపీ ఇన్‌చార్జ్ 'బీటెక్ రవి' స్థానిక నాయకుడు విజయ్‌కు శాలువా కప్పడం, మరో వర్గానికి చెందిన పుష్పనాథరెడ్డి (పుష్ప) వర్గానికి కాకపోవడంతో మనస్పర్థలు తలెత్తాయి. దాడులు: బీటెక్ రవి అక్కడి నుంచి వెళ్లిపోగానే విజయ్ వర్గం, పుష్పనాథరెడ్డి వర్గాల మధ్య వాగ్వాదం పెరిగి పరస్పర దాడులకు దిగాయి. కాల్పుల కలకలం: ఘర్షణ తీవ్రరూపం దాల్చి విజయ్ ఇంటిపైకి రాళ్లు రువ్వడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో గన్ మెన్లు మరియు ఇరువర్గాల తరుపున రబ్బానీ, మహబూబ్ బాషాలు గాల్లోకి కాల్పులు జరిపారు. ఆస్తినష్టం: ఈ ఘర్షణల్లో ఇరువర్గాలు విచక్షణారహితంగా రాళ్లు విసురుకోవడంతో మూడు వాహనాలు ధ్వంసమయ్యాయి. స్థానికంగా కలకలం రేపిన ఈ ఘటనపై పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. పూర్తి వివరాలపై దర్యాప్తు కొనసాగుతోంది.
- వెలుగోడు నుంచి రోజుకు 4 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేసి తెలుగు గంగ SR1, SR2 లను నింపాలి - రైతు సేవా సమితి డిమాండ్ కడప జిల్లాలో నీరు లేకుండా అడుగంటిపోయిన తెలుగు గంగ SR1, SR2 ప్రాజెక్టులకు వెలుగోడు నుండి రోజుకు నాలుగు వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేసి, కడప జిల్లా ప్రజలకు, రైతులకు తాగునీటి సమస్యలు లేకుండా చూడాలని రైతు సేవా సమితి కడప జిల్లా సమితి డిమాండ్ చేసింది. రైతు సేవా సమితి ఆధ్వర్యంలో సెప్టెంబర్ 1వ తేదీ నుండి కడప జిల్లా రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం నిర్వహిస్తున్న "రైతు గ్రామబాట" కార్యక్రమం ఈరోజు 15వ రోజుకు చేరుకుంది. ఇందులో భాగంగా ఈరోజు మైదుకూరు ఎమ్మార్వో కార్యాలయ ఆవరణలో నిరసన తెలియజేసి, ఎమ్మార్వో గారు లేకపోవడంతో డిప్యూటీ ఎమ్మార్వో నరసింహ గారికి వినతి పత్రాన్ని అందజేసి రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయాలని కోరారు. ఏలినో ప్రభావంతో జిల్లాలో ఈ సంవత్సరం వర్షాలు లేక నష్టపోతున్న రైతులను ఆదుకునేందుకు కడప జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి, ప్రతి రైతు కుటుంబానికి రూ.30 వేలు సహాయం అందించాలని, అలాగే జిల్లాలో పెండింగ్‌లో ఉన్న రాజోలి, జొలదరాశి, తెలుగు గంగ తదితర సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు నిధులు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో రైతు సేవా సమితి మైదుకూరు నియోజకవర్గ కార్యదర్శి మాడి శెట్టి సహదేవుడు, మైదుకూరు పట్టణ, మండల నాయకులు, రైతులు దాశ రెడ్డి గారి సుబ్బరాయుడు, రాజా, మూలే రామచంద్రారెడ్డి, కోటయ్య గారి గుర్రప్ప, రాజాల రామచంద్రుడు, పసల పుల్లయ్య, అంకిరెడ్డిపల్లి నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.1
- వినాయక చవితి సందర్భంగా బద్వేలు కు విచ్చేసిన జబర్దస్త్ టీం బద్వేలు, సెప్టెంబర్ 15:వినాయక చవితి పండుగ శోభతో బద్వేలు పట్టణం కోలాహలంగా మారింది. ఈ పండుగ వేడుకల్లో భాగంగా ప్రముఖ జబర్దస్త్ టీం బద్వేలు కు విచ్చేసింది.బద్వేలు పట్టణంలోని శేఖర్ రాయల్ నివాసంలో ఏర్పాటు చేసిన వినాయక మండపాన్ని జబర్దస్త్ ఆర్టిస్టులు సందర్శించారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, భక్తులతో కలిసి సందడి చేశారు. తమదైన కామెడీ పంచ్ లతో అక్కడికి వచ్చిన అభిమానులను, చిన్నారులను అలరించారు. ఈ సందర్భంగా శేఖర్ రాయల్ కుటుంబ సభ్యులు జబర్దస్త్ టీంను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో స్థానికులు, చుట్టుపక్కల వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.1
- పులివెందుల లోని మైత్రి లే ఔట్ వినాయక స్వామి విగ్రహం వద్ద ఘర్షణ కడప జిల్లా..... పులివెందుల..... పులివెందుల లోని మైత్రి లే ఔట్ వినాయక స్వామి విగ్రహం వద్ద ఘర్షణ....... టిడిపికి చెందిన ఇద్దరు నాయకుల మధ్య ఘర్షణ..... గాలి లోకి ఒక రౌండ్ కాల్పులు చేసిన హజ్ కమిటీ డైరెక్టర్ మాహబూబ్ భాష గన్మెన్.... టిడిపి పార్టీ కి చెందిన పుష్ప నాథ్ రెడ్డి, విజయ్ కుమార్ రెడ్డి ల మధ్య ఘర్షణ...... విజయ్ కుమార్ ఇంటి వద్ద ఉన్న 3 వాహనాలు ధ్వంసం.....1
- జూపాడుబంగ్లా మండల పరిధిలోని పోతిరెడ్డిపాడు 9వ గేటు మరమ్మతు పనులు పూర్తి జూపాడు బంగ్లా మండల పరిధిలోని పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వద్ద 9వ గేటుకు అధికారులు మరమ్మతు పనులు చేపట్టారు. రూ.2.40 లక్షలతో మరమతు పనులు పూర్తి చేసినట్లు ఇరిగేషన్ అధికారులు వెల్లడించారు. భవిష్యత్తులో రైతులకు ఎటువంటి తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా ఈ సమస్యకు ఉన్నతాధికారుల సహకారంతో సమస్యకు పరిష్కారం చూసినట్లు ఇరిగేషన్ అధికారులు తెలిపారు.1
- నల్ల చెరువు పల్లి లో వినాయక లడ్డును వేలం పాటలో 27, 500వేల రూపాయలుకు దక్కించుకున్న మెరుగు శివ శంకర్ ఓడి చెఱువు సెప్టెంబర్ 15: మండలంలోని నల్లచెరువు పల్లి గ్రామంలోగ్రామస్తులు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించి ,వచ్చిన భక్తులకు తీర్థప్రసాదలు అంద జేశారు. అనంతరం గ్రామస్తుల ఆధ్వర్యంలో లడ్డు వేలంపాట లో శ్రీ వినాయక లడ్డు ను మెరుగు శివ శంకర్ 27,500 రూపాయలు కు దక్కించుకున్నారు.1
- బద్వేలులో వైభవంగా 9వ వార్షిక వినాయక చవితి వేడుకలు. స్వామివారి సన్నిధిలో గొప్ప అన్నదాన కార్యక్రమం. బద్వేలు,సెప్టెంబర్ 15: బద్వేలు పట్టణంలోని 16వ వార్డు సుమిత్రానగర్ నందు శ్రీ వరసిద్ధి వినాయక చవితి 9వ వార్షికోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వినాయక మండపం భక్తులతో కిటకిటలాడుతోంది. ఈ ఉత్సవాలకు విచ్చేయుచున్న భక్తులందరికీ ఉత్సవ కమిటీ సభ్యులు స్వాగతం సుస్వాగతం పలుకుతున్నారు. ఉత్సవాలకు సహకరించిన దాతలు: వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు పలువురు దాతలు ముందుకు వచ్చి తమ వంతు సహాయ సహకారాలు అందించారు. -విగ్రహ దాత మరియు దేవుని పూజా సామాగ్రి దాత: కీ.శే. గాండ్ల వెంకటరమణ బాబు - శ్రీమతి కుమారి -అన్నదాన దాతలు: కీ.శే. కోడూరు వెంకట స్వామి రెడ్డి - శ్రీమతి విజయమ్మ, శ్రీ కోడూరు మల్లిఖార్జున రెడ్డి - శ్రీమతి అపర్ణ -లడ్డు దాత: శ్రీ వెలిగండ్ల నాగరాజు - శ్రీమతి ఉమాదేవి -పూలదండ దాత: శ్రీ నిమ్మకాయల గురివిరెడ్డి - శ్రీమతి రాజమ్మ -పటాకుల దాతలు: శ్రీ కోడూరు చంద్రశేఖర్ రెడ్డి - శ్రీమతి ప్రశాంతి, శ్రీ కీ.శే. సంసాని ఏరికలయ్య - శ్రీమతి ఆదిలక్షుమ్మ ఆర్థిక సహాయం అందించిన దాతలు: శ్రీ నాగినేని వెంకటసుబ్బయ్య - 6000/-, శ్రీ నిమ్మకాయల శేఖర్ రెడ్డి - 5000/-, శ్రీ ఇమామ్ ఖాసీమ్ - 4000/-, శ్రీ లకిడి విజయ్ భాస్కర్ - 2116/-, శ్రీ కోన రవిశంకర్ - 2016/-, శ్రీ చెరుకూరి సిద్ధయ్య (టైలర్) - 2000/-, శ్రీ కనిశెట్టి సతీష్ (టీచర్) - 2000/-, శ్రీ పిట్టా జయసింహ - 2000/-, శ్రీ ఓబుల్ రెడ్డి సాయి ప్రతాప్ రెడ్డి - 2000/-, శ్రీ మోరేపల్లె రామయ్య - 2000/-, శ్రీమతి కోటపాటి సావిత్రమ్మ - 2000/-, శ్రీ కీ.శే. పుల్లయ్య - 2000/-, శ్రీ రెడ్డిపల్లె శ్రీనివాసుల యాదవ్ - 2000/- ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ సభ్యులు మాట్లాడుతూ, గత 9 సంవత్సరాలుగా సుమిత్రానగర్ లో వినాయక చవితి వేడుకలను ఐక్యమత్యంతో నిర్వహిస్తున్నామని, దాతల సహకారంతోనే ఈ వేడుకలు విజయవంతం అవుతున్నాయని తెలిపారు. భక్తులందరూ వచ్చి స్వామి వారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరారు. అనంతరం మధ్యాహ్నం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి సన్నిధిలో కీ.శే. కోడూరు వెంకట స్వామి రెడ్డి - శ్రీమతి విజయమ్మ, కోడూరు మల్లిఖార్జున రెడ్డి - అపర్ణ, కొండూరు చంద్ర కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో గొప్ప అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం సాయంత్రం చెక్కభజన కార్యక్రమం కూడా ఉంటుందని తెలియజేశారు.2
- పులివెందుల పట్టణంలోని మైత్రి లేఔట్లో అర్ధరాత్రి ఇరు వర్గాల ఘర్షణ సీసీ ఫుటేజ్ కడప జిల్లా పులివెందుల పట్టణంలోని మైత్రి లేఔట్లో అర్ధరాత్రి ఇరు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించిన సీసీ టీవీ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఓ నాయకుడి ఇంటి వద్దకు జనాలు గుంపుగా వెళ్లి కర్రలతో వాహనాలను ధ్వంసం చేస్తున్న దృశ్యాలు సీసీ ఫుటేజ్లో చూడవచ్చు. విషయం తెలుసుకున్న పోలీసులు మెరుపు వేగంతో ఘటనా స్థలానికి చేరుకుని జనాలను చల్లాచెదురు చేశారు.1
- *సెల్ఫీ వీడియో కలకలం* *గడ్డి మందు తాగుతూ..* *వేధింపులు తట్టుకోలేక మీడియా ప్రతినిధి ఆత్మహత్యాయత్నం* *కుటుంబ సభ్యుల ఫిర్యాదు* *బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డీఎస్పీని ఆశ్రయించిన కుటుంబం* పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో ఓ మీడియా ప్రతినిధి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. ప్రైమ్9 న్యూస్ రిపోర్టర్ పోలిశెట్టి సత్యనారాయణ (చంటి) గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. చుట్టుపక్కల రైతులు గమనించి ఆయనను తొలుత నరసాపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం తణుకు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆక్వా సాగులో నష్టాల కారణంగా అప్పులపాలైన సత్యనారాయణ, అనంతరం అప్పులు తీర్చినప్పటికీ కొందరు వడ్డీ వ్యాపారులతో కలిసి సహచర మీడియా ప్రతినిధులు తనను వేధించారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ప్రెస్‌మీట్లకు వెళ్లిన సందర్భాల్లో అవమానాలకు గురిచేశారని, సత్యనారాయణను పిలిస్తే తాము ప్రెస్‌మీట్లకు రామని కొందరు బెదిరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సత్యనారాయణ భార్య, పిల్లలు, అన్న సుబ్రహ్మణ్యం నరసాపురం డీఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. తమ కుటుంబానికి సత్యనారాయణే ప్రధాన ఆధారమని, ఆయనకు ఏదైనా జరిగితే కుటుంబం రోడ్డున పడుతుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఘటనపై టీవీ 9 మారుతి, టీవీ 5 సందీప్, ఐ న్యూస్ రాజేష్, సాక్షి పత్రిక కేతినేడి రంగపై కేసులు నమోదు చేసి విచారణ జరిపించాలని కోరుతూ...ఆత్మహత్యాయత్నానికి దారితీసిన పరిస్థితులపై సమగ్ర విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని డీఎస్పీని కోరారు.3