Shuru
Apke Nagar Ki App…
సిరిసిల్ల జిల్లాలో పెద్దపులి సంచారం...తిప్పాపూర్ శివాల్లో మూడు లేగ దూడలు పై దాడి... భయాందోళనలో గ్రామీణ ప్రజలు రాజన్న సిరిసిల్ల జిల్లాలో పెద్దపులి కలకలం సృష్టిస్తుంది. ప్రజల్ని భయాందోళనకు గురిచేస్తుంది. ఇల్లంతకుంట మండలం తిప్పాపూర్ గ్రామ శివారులో పెద్దపులి సంచరించినట్లు ఆనవాళ్లు లభించాయి. ఇప్పటికే మూడు ఆవు దూడలను చంపింది. పెద్దపులి సంచరిస్తున్నట్లు తెలియడంతో గ్రామ ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి. అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో సంఘటన స్థలానికి చేరుకుని పాదముద్రలను గుర్తించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పశువులను సురక్షిత ప్రదేశాల్లో ఉంచాలని ఒంటరిగా వెళ్ళవద్దని కోరారు. పెద్దపులి కదలికలపై నిఘా పెట్టిన అటవీశాఖ అధికారులు, ట్రాకింగ్ కెమెరాలు ఏర్పాటు చేసే పనిలో నిమగ్నమయ్యారు.
K.V.REDDY
సిరిసిల్ల జిల్లాలో పెద్దపులి సంచారం...తిప్పాపూర్ శివాల్లో మూడు లేగ దూడలు పై దాడి... భయాందోళనలో గ్రామీణ ప్రజలు రాజన్న సిరిసిల్ల జిల్లాలో పెద్దపులి కలకలం సృష్టిస్తుంది. ప్రజల్ని భయాందోళనకు గురిచేస్తుంది. ఇల్లంతకుంట మండలం తిప్పాపూర్ గ్రామ శివారులో పెద్దపులి సంచరించినట్లు ఆనవాళ్లు లభించాయి. ఇప్పటికే మూడు ఆవు దూడలను చంపింది. పెద్దపులి సంచరిస్తున్నట్లు తెలియడంతో గ్రామ ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి. అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో సంఘటన స్థలానికి చేరుకుని పాదముద్రలను గుర్తించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పశువులను సురక్షిత ప్రదేశాల్లో ఉంచాలని ఒంటరిగా వెళ్ళవద్దని కోరారు. పెద్దపులి కదలికలపై నిఘా పెట్టిన అటవీశాఖ అధికారులు, ట్రాకింగ్ కెమెరాలు ఏర్పాటు చేసే పనిలో నిమగ్నమయ్యారు.
More news from తెలంగాణ and nearby areas
- ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ ముగిసింది. కోడ్ ను అధికారులు ఎత్తివేశారు. రెండు వారాలు గా సాగిన మున్సి పోరు ప్రశాంతంగా ముగియడంతో అందరు ఊపిరి పీల్చుకున్నారు. ఉమ్మడి జిల్లాలో రెండు మున్సిపల్ కార్పొరేషన్లు 13 మున్సిపాలిటీలు ఉండగా రామగుండం కార్పొరేషన్ తో పాటు 11 మున్సిపాలిటీలను కాంగ్రెస్, కరీంనగర్ కార్పోరేషన్ ను బిజేపి, సిరిసిల్ల జమ్మికుంట రాయికల్ మున్సిపాలిటీలను బిఆర్ఎస్ కైవసం చేసుకుంది. సోమవారం కోరం లేక వాయిదా పడ్డ సుల్తానాబాద్ మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక మంగళవారం నిర్వహించారు. సుల్తానాబాద్ మున్సిపాలిటీని ఏకపక్షంగా కాంగ్రెస్ కైవసం చేసుకుంది. పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు నేతృత్వంలో 12మంది కాంగ్రెస్ కౌన్సిలర్ లు ప్రత్యేక సమావేశానికి హాజరై కౌన్సెలర్ గా ప్రమాణ స్వీకారం చేసి చైర్మన్ వైస్ చైర్మన్ ను ఎన్నుకున్నారు. చైర్మన్ గా బిరుదు రాధాకృష్ణ, వైస్ చైర్మన్ గా అంతటి పుష్పలత ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతన పాలక వర్గాన్ని ఎమ్మెల్యే తోపాటు అధికారులు అభినందించారు.4
- తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పుట్టినరోజు సందర్భంగా హుస్నాబాద్ పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బుధవారం ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ హాజరై కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. కేసీఆర్ కేవలం ఒక రాజకీయ నాయకుడు మాత్రమే కాదని, తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీక అని అన్నారు. రాష్ట్ర సాధన ఉద్యమం నుంచి పాలన వరకు ప్రతి దశలో ఆయన పాత్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని కొనియాడారు.1
- రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం తిప్పాపూర్ గ్రామ శివారులో పెద్దపులి సంచారం స్థానికుల్లో ఆందోళన కలిగిస్తోంది. సిద్దిపేట వైపు అడవుల నుంచి వచ్చినట్లు భావిస్తున్న పులి రెండు రోజులుగా సంచరిస్తూ మూడు ఆవు దూడలను బలి తీసుకుంది. అటవీశాఖ అధికారులు గ్రామస్తులను అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తూ, పులిని అడవిలోకి తరలించే చర్యలు చేపట్టారు.2
- తొర్రూరు మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్ ల ఎన్నిక సందర్భంగా ఎలాంటి గొడవలు జరగకుండా ముందస్తుగా మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును పోలీసులు అమ్మపురం వద్ద అడ్డుకున్నారు. ఆయన వెంట ఉన్న బిఆర్ఎస్ కౌన్సిలర్లను మాత్రమే తొర్రూర్ కు పంపించి ఆయనతోపాటు ఆయన సతీమణి ఉషను సైతం వెనక్కి పంపించారు. దీంతో కొద్దిసేపు అమ్మపురం గ్రామంలో ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది.2
- పోలీసు దాడిలో బాధితుడికి రెండు కళ్ళపై దాడి - కంటి చూపులకు దెబ్బ కంటి చూపు కనిపించని దారుణ వైనం *పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్టు బాధిత కుటుంబ సభ్యుల వెల్లడి* మా వైపు ఏం చూస్తున్నావురా ఎవడ్రా నువ్వు.. నా కొడకా అంటూ ఇద్దరు పెట్రోలింగ్ లో ఉన్న కానిస్టేబుల్స్ అమాయకుడిపై రెచ్చిపోయారు. చెంపలపై నిర్దాక్షిణ్యంగా కొడుతూ అంతటితో ఆగకుండా అతని పోలీసు వాహనంలో బలవంతంగా వేసుకొని ఊరి బయటకు తీసుకెళ్లి ఇష్టారాజ్యంగా అతనిపై దాడి చేశారు. ఈ దాడిలో బాధితుడి రెండు కళ్ళు దెబ్బతిన్నాయి. ప్రస్తుతం కంటిచూపు కనిపించడం లేదు. పోలీసు శాఖకి మచ్చని తెచ్చే ఈ ఘటన రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. నిన్న రాత్రి పరిగి రోడ్డులో శక్తి వైన్స్ వద్ద జరిగిన సంఘటన ఇది. పట్టణంలో బోరు మెకానిక్ గా పనిచేసుకుంటున్న కుమ్మరి వెంకటేష్ (ఇప్పలపల్లి) సాయంత్రం వేళ శక్తి వైన్ సోదరులకు వెళ్లి తనకోసం మందు తెచ్చుకున్నాడు. ఇదే సమయంలో షాపు యజమాని అక్కడికి వచ్చి ఆగిన పోలీస్ పెట్రోల్ వాహనంలో ఉన్న కానిస్టేబుల్స్ కు ఒక కవర్ అందజేశారు. అయితే అతను మందు తీసుకొని వెళ్ళేటప్పుడు కుమ్మరి వెంకటేశ్ పోలీసులను చూశాడు. దీంతో కానిస్టేబుల్స్ ఏమనుకున్నారో తెలియదు కానీ మా వైపు ఏం చూస్తున్నావు రా..? ఎవడ్రా నువ్వు నా కొడకా అంటూ తమదైన స్టైల్ లో అమాయకుడి పై రెచ్చిపోయారు. కుమ్మరి వెంకటేష్ చెంపలను అక్కడే ఫటాఫట్ లాడించారు. అంతటితో ఆగకుండా అతడిని పోలీసు వాహనం ఎక్కించుకొని పరిగి రోడ్డులో హాజిపల్లి రోడ్డు వద్దకు నిర్మానుష ప్రాంతాల్లో తీసుకెళ్లి అతని చితకబాదారు. పోలీసు దాడిలో కుమ్మరి వెంకటేష్ కళ్ళపై దాడి జరగడంతో రెండు కళ్ళు ఎర్రటి రక్తం పేరుకొని కంటిచూపు పూర్తిగా మందగించిపోయింది. నిర్దాక్షిణ్యంగా కొట్టిన తర్వాత అతన్ని అక్కడే పరిగి రోడ్డులో వదిలేసి కనీసం మానవత్వం లేకుండా ఒక క్రూరత్వంతో అతన్ని విడిచి వచ్చేశారు. ఏం నేరం చేసింది లేదు.. పోలీసుల వైపు చూసిన పాపానికి కళ్ళు కనిపించకుండా దిగజారి కొట్టిన ఇద్దరు కానిస్టేబుల్స్ వ్యవహారంపై బాధితుడు కుమారుడు పోలీసులను ఆశ్రయించాడు. దీనిపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు చెప్పారు. అయితే బాధితుడు కుమ్మరి వెంకటేష్ ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో కంటి వైద్యులకు చూపించారు. అమాయకుడి పై దాడికి పాల్పడ్డ ఇద్దరు కానిస్టేబుల్ లపై కేసు నమోదు చేసి వెంటనే శాఖపరమైన చర్య తీసుకోవాలని బాధితుడి కుమారుడు పోలీసు ఉన్నత అధికారులను వేడుకుంటున్నారు. నిన్న జరిగిన ఈత సంఘం ఆలస్యంగా వెలుగు చూడడంతో సంఘటనను స్థానిక మీడియా దృష్టికి బాధితులు తీసుకొచ్చారు..1
- మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బిఆర్ఎస్, కాంగ్రెస్ కౌన్సిలర్లు మున్సిపల్ కార్యాలయానికి చేరగా, ఎంపీకి ఎక్స్‌ఆఫీషియో ఓటు హక్కు లేదని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు.1
- Post by Ravi Poreddy1
- బిఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ జన్మదినోత్సవ వేడుకలను ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి పలు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. బిఆర్ఎస్ కరీంనగర్ నగర శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ చౌక్ లో కేక్ కట్ చేసి మొక్కలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జివి.రామకృష్ణ రావు, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, నగర అధ్యక్షులు చల్లా హరిశంకర్, మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్ , కార్పొరేటర్ గుగ్గిళ్ళ జయశ్రీ- శ్రీనివాస్, మాజీ కార్పొరేటర్లు పాల్గొని బాటసారులకు పూల మొక్కల తో పాటు మిఠాయిలను పంపిణీ చేశారు. స్వరాష్ట్ర సాధనలో అలుపెరుగనిపోరాటం చేసిన ఉద్యమ వీరుడు జనహృదయనేత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ అని మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు అన్నారు. తెలంగాణ ఉద్యమ వ్యూహకర్త, బంగారు తెలంగాణ రూపశిల్పి, అపర భగీరథుడు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ అని కొనియాడారు. మళ్లీ వారి నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావాలని ఆకాంక్షించారు. వారు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నారు.2