శ్రీ వైష్ణవిలో ఘనంగా సంక్రాంతి సంబరాలు సత్తెనపల్లి పట్టణంలోని శ్రీ వైష్ణవి వారి ప్రగతి జూనియర్ అండ్ డిగ్రీ కళాశాలలో ఘనంగా సంక్రాంతి సంబరాలను నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రాంగణాన్ని రంగురంగుల ముగ్గులతో, పతంగులతో సుందరంగా అలంకరించారు. ప్రగతి విద్యాసంస్థల వ్యవస్థాపకులు డాక్టర్ మక్కెన అచ్చయ్య ముఖ్య అతిథిగా పాల్గొని సంక్రాంతి వేడుకల కార్యక్రమాన్ని ప్రారంభించారు. విద్యార్థులు కళాశాల సిబ్బంది భోగిమంట చుట్టూ తిరుగుతూ నృత్యం చేశారు. విద్యార్థులు ఉపాధ్యాయులు సంప్రదాయ దుస్తులు ధరించి భోగి, మకర సంక్రాంతి, కనుమ పండుగల విశిష్టతను చాటుతూ వివిధ సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కళాశాలల డైరెక్టర్ దగ్గుబాటి శివ బ్రహ్మారెడ్డి సంక్రాంతి పండుగ మన సంస్కృతి, సంప్రదాయాలను విద్యార్థులకు పరిచయం చేస్తాయని, ఇలాంటి కార్యక్రమాల ద్వారా పిల్లల్లో ఆనందం, ఐక్యత, కుటుంబ విలువలు పెంపొందుతాయని తెలిపారు. విద్యార్థులకు ముగ్గుల పోటీలను నిర్వహించి బహుమతులను అందజేశారు. శ్రీ తారక చత్రపతి నాట్యకళానిలయం వ్యవస్థాపకులు తేనేటి కరుణాకర్ ఆధ్వర్యంలో చిన్నారులు చేసిన నృత్యాలు చూపర్లను అలరించారు. శ్రీ వైష్ణవి కళాశాలల డైరెక్టర్లు మాచిబట్టు సుబ్బరాజు, ఒంగోలు శ్రీనివాసాచారి, డేగల శ్రీనివాస రావు, ఉప్పు సోమేశ్వరరావు లు ఈ కార్యక్రమాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ సంబరాల్లో కళాశాలల బోధనా, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
శ్రీ వైష్ణవిలో ఘనంగా సంక్రాంతి సంబరాలు సత్తెనపల్లి పట్టణంలోని శ్రీ వైష్ణవి వారి ప్రగతి జూనియర్ అండ్ డిగ్రీ కళాశాలలో ఘనంగా సంక్రాంతి సంబరాలను నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రాంగణాన్ని రంగురంగుల ముగ్గులతో, పతంగులతో సుందరంగా అలంకరించారు. ప్రగతి విద్యాసంస్థల వ్యవస్థాపకులు డాక్టర్ మక్కెన అచ్చయ్య ముఖ్య అతిథిగా పాల్గొని సంక్రాంతి వేడుకల కార్యక్రమాన్ని ప్రారంభించారు. విద్యార్థులు కళాశాల సిబ్బంది భోగిమంట చుట్టూ తిరుగుతూ నృత్యం చేశారు. విద్యార్థులు ఉపాధ్యాయులు సంప్రదాయ దుస్తులు ధరించి భోగి, మకర సంక్రాంతి, కనుమ పండుగల విశిష్టతను చాటుతూ వివిధ సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కళాశాలల డైరెక్టర్ దగ్గుబాటి శివ బ్రహ్మారెడ్డి సంక్రాంతి పండుగ మన సంస్కృతి, సంప్రదాయాలను విద్యార్థులకు పరిచయం చేస్తాయని, ఇలాంటి కార్యక్రమాల ద్వారా పిల్లల్లో ఆనందం, ఐక్యత, కుటుంబ విలువలు పెంపొందుతాయని తెలిపారు. విద్యార్థులకు ముగ్గుల పోటీలను నిర్వహించి బహుమతులను అందజేశారు. శ్రీ తారక చత్రపతి నాట్యకళానిలయం వ్యవస్థాపకులు తేనేటి కరుణాకర్ ఆధ్వర్యంలో చిన్నారులు చేసిన నృత్యాలు చూపర్లను అలరించారు. శ్రీ వైష్ణవి కళాశాలల డైరెక్టర్లు మాచిబట్టు సుబ్బరాజు, ఒంగోలు శ్రీనివాసాచారి, డేగల శ్రీనివాస రావు, ఉప్పు సోమేశ్వరరావు లు ఈ కార్యక్రమాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ సంబరాల్లో కళాశాలల బోధనా, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
- బద్వేలు: అన్నదమ్ముల మధ్య గొడవ.. ఒకరు మృతి.! కడప జిల్లా గోపవరం మండలం నెల్లూరు రోడ్డులోని సత్య టౌన్షిప్ వద్ద గాయాలతో ఇద్దరు వ్యక్తులు పడి ఉన్నారు. ఇరువురి తలలపై తీవ్ర గాయాలై ఉన్నాయి. ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా మరోవ్యక్తి పరిస్థితి విషమంగా ఉండడంతో కడప రిమ్స్కు తరలించినట్లు సమాచారం. వారు ఇద్దరూ కలసపాడు మండలం ఎగువ రామాపురానికి చెందిన అన్నదమ్ములుగా స్థానికులు గుర్తించారు. ఆర్థిక లావాదేవీలతోనే ఇరువురు దాడికి పాల్పడినట్లు ప్రాథమిక సమాచారం.2
- నల్గొండలో కమ్మేసిన మంచు దుప్పటి.. నల్గొండ జిల్లాలో చలివిపరితంగా పెరిగింది తాజాగా ఆదివారం ఉదయం విపరీతమైన చలితో పాటు మంచి దుప్పటి నల్గొండను కమ్మేసింది. దీనికి తోడు వాతావరణం మరింత చల్లబడడంతో పాటు అక్కడక్కడ చిరుజల్లులు కురిసాయి. దీంతో ప్రజలు బయటికి వెళ్లాలంటే చలికి గడగడ వణుకుతున్న పరిస్థితి కనిపిస్తోంది.1
- - ఏకశిలానగర్ రియల్ ఎస్టేట్ గుండా వెంకటేష్ కి సహకరిస్తుంది పోలీసులా ? ప్రభుత్వ పెద్దలా ? - ఈ ప్రాంత ఎంపీగా ఉన్న నేనే స్వయంగా హెచ్చరించిన తర్వాత కూడా బరితెగిస్తున్నారు అంటే ఎవరి అండ చూసుకుని ? - కత్తులు, రాడ్లతో దాడి చేసి చంపే ప్రయత్నం చేస్తున్నారంటే వీళ్ల వెనుక ఉంది ఎవరు ? - ప్రజల ప్రాణాలు పోతున్నా ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదు ? - పోలీసులు, లా అండ్ ఆర్డర్ ఏమైనట్టు ? - రోజుకో దగ్గర ఇలాంటి సంఘటనలు జరుగుతున్నా ప్రభుత్వం నిచ్చేస్టమై పోయింది. - ప్రజల రక్తం కళ్ళచూస్తున్నా కళ్లు తెరవని ప్రభుత్వం. - ముడుపుల కోసం నోరు మూసుకుంటే.. ప్రాణాలు పోతున్నా పట్టించుకోకపోతే.. ప్రజలు మిమ్మల్ని క్షమించరు. - వారికి అండగా మేమున్నాం.. ఉంటాం అంటున్న - ఈటల రాజేందర్.1
- మూడు చెక్కలపల్లిలో క్రీడా ప్రాంగణం చదును.. క్రీడాకారులకు క్రికెట్ బ్యాట్ బహుమతి మూడు చెక్కలపల్లి గ్రామంలో క్రీడాకారులకు అనుకూలంగా క్రీడా ప్రాంగణాన్ని చదును చేసే పనులు ఈరోజు పూర్తయ్యాయి. ఈ కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ సపావట్ కవిత దేవు నాయక్ సమక్షంలో నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ యువతను ప్రోత్సహించే ఉద్దేశంతో క్రీడాకారులకు రూ.2,400 విలువగల క్రికెట్ బ్యాట్‌ను బహుమతిగా అందజేశారు. గ్రామ స్థాయిలో క్రీడలకు ప్రాధాన్యత ఇస్తూ మౌలిక వసతులు కల్పించడంపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.1
- గజ్వెల్ సిద్దిపేట జిల్లా జనవరి 11 ఐ 3 న్యూస్ /* సిద్దిపేట జిల్లాకు అన్యాయం చేసే ఆలోచనను వెంటనే విరమించుకోవాలి: దేవి రవీందర్ సిద్దిపేట జిల్లా పై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కపట ప్రేమతో, కక్షపూరిత ధోరణితో వ్యవహరిస్తోందని మాజీ రాష్ట్ర ఎంపీటీసీల ఫోరం కన్వీనర్ దేవి రవీందర్ ఆరోపించారు. జిల్లాల కుదింపు పేరుతో సిద్దిపేట జిల్లాకు అన్యాయం చేయాలనే ఆలోచనను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే మానుకోవాలని ఆయన హెచ్చరించారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణ కేంద్రంలోని స్థానిక అంబేద్కర్ చౌరస్తా వద్ద ఆయన మాట్లాడుతూ, జిల్లాల కుదింపు పేరుతో సిద్దిపేట జిల్లాను దెబ్బతీయాలని చూడటం హేయమైన చర్యగా అభివర్ణించారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తితో చిన్న రాష్ట్రాల ద్వారా అభివృద్ధి సాధ్యమని ఆయన పేర్కొన్నారు. అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ఆధారంగా 14 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తర్వాత తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రమే ధ్యేయంగా పరిపాలనా సౌలభ్యం కోసం అప్పట్లో పది జిల్లాలుగా ఉన్న తెలంగాణను 33 జిల్లాలుగా విభజించి ప్రజలకు పరిపాలనను మరింత సులభతరం చేశారని తెలిపారు. ఇలాంటి చారిత్రక నిర్ణయాన్ని విస్మరించి, కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు 33 జిల్లాలను కుదించాలనే ఆలోచన చేయడం బాధాకరమని అన్నారు. రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ నిండు శాసనసభలో రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల కుదింపు ఆలోచనలో ఉందని చెప్పడం ఆందోళన కలిగించిందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఈ ఆలోచనను విరమించుకుని ప్రజలకు సుపరిపాలన అందించే దిశగా ఆలోచించాలని సూచించారు. లేనియెడల, గతంలో తెలంగాణ సాధన కోసం సిద్దిపేట జిల్లా ఎలా ఉద్యమాలకు నాంది పలికిందో, అదే విధంగా ఈరోజు కూడా జిల్లాల గుర్తింపును కాపాడుకునే వరకు మరో ఉద్యమానికి సిద్ధంగా ఉందని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు బెండ మధు, మాజీ కౌన్సిలర్లు శివకుమార్, చందు, అలాగే వివిధ ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.1
- సిద్దిపేట జిల్లాను రద్దు చేస్తే మరో ఉద్యమం గజ్వెల్, జనవరి 11 ప్రజా తెలంగాణ న్యూస్ సిద్దిపేట జిల్లాను రద్దు చేస్తే మరో తెలంగాణ ఉద్యమం తప్పదని రాష్ట్ర ఎంపీటీసీల ఫోరం కార్య నిర్వహణ అధ్యక్షులు దేవి రవీందర్ అన్నారు. మంత్రి పొంగులేటి వ్యాఖ్యలకు నిరసిస్తు గజ్వేల్ అంబేద్కర్ సర్కిల్ వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఎంపీటీసీల పోరం కార్యనిర్వాహణ అధ్యక్షులు దేవి రవీందర్ బీఆర్ఎస్ మండల అధ్యక్షులు బెండ మధులు మాట్లాడుతూ.... ఎక్కువ జిల్లాలతో ఇబ్బంది అవుతుందని మంత్రి పొంగులేటి వ్యాఖ్యానించడం సరికాదు డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తితో ఆర్టికల్ 3 ద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం తెచ్చుకున్న రాష్ట్రంలో ప్రజలకు ఇబ్బందులు ఉండకూడదని పరి పాలన సౌలభ్యం కోసం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లాలు డివిజన్లను మండలాలు ఏర్పాటు చేసి ప్రజల ఆకాంక్షను నెరవేర్చారన్నారు. 2016వ సంవత్సరం నుంచి నేటి వరకు పాలన కొనసాగింది నేడు జిల్లాల ను కుదిస్తామనడం అవి వేకం అన్నారు. మరో వైపు పొన్నం ప్రభాకర్ హుస్నా బాద్లో ఉన్న మండలాల ను కరీంనగర్లో కలుపు తామని గతంలో చెప్పారు మొన్న అసెంబ్లీలో జిల్లాల ను కుదిస్తం సిరిసిల్ల సిది పేట మీద ప్రత్యేక శ్రద్ధ పెడతామని చెప్పి పొంగులేటి మాట్లాడడం రాజ్యాంగ విరుద్ధం అన్నారు. మంచి కార్యక్రమాలు చేసి ప్రజల మన్నలను పొందా లి తప్ప విరుద్ధమైనటువంటి ప్రకటనలతో ప్రజలను అయోమయానికి గురిచేస్తే ప్రజాహాగ్రహం తప్పద న్నారు. ఈ విషయంపై తక్షణమే ముఖ్యమంత్రి రేవం త్ రెడ్డి ప్రకటన చేయాలి లేనిపక్షంలో జిల్లా ప్రజల ను కలుపుకొని పార్టీలకు అతీతంగా రేపటినుండిజిల్లా వ్యాప్త ఆందోళన చేపడుతామని అన్నారు. ఈ కార్యక్రమం లో మాజీ కౌన్సిలర్స్ అల్వాల బాలేష్ బొగ్గుల చందు పంబాల శివకుమార్ బిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయ కులు కళ్యాణ్ కర్ నర్సింగరావు గొడుగు స్వామి మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శి తుమ్మ శ్రీనివాస్ చేబర్తి సురేష్ గాలింక శ్రీనివాస్ లైరాం శివకుమార్ పాల్గొన్నారు.1
- నూతన డ్రైనేజీ పనులను పరిశీలించిన కమిషనర్ బద్వేల్ పట్టణంలోని ఎన్జీవో కాలనీ మెయిన్ రోడ్డు నుండి మహమ్మద్ కాలనీ మీదుగా భాకరాపేట చెరువు వరకు వెళ్లే వర్షపు నీరు, డ్రైనేజీ కాలువ నిర్మాణ పనులను మున్సిపల్ కమిషనర్ నరసింహారెడ్డి పరిశీలించారు. గతంలో చిన్న పార్టీ వర్షం పడితే నీరు ఇళ్లల్లోకి చేరడం డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడం వంటి సమస్యలు ఉండేవి అన్నారు. ఈ కాల్వ పూర్తయితే ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా డ్రైనేజీ సమస్య పరిష్కారం అవుతుంది అన్నారు.1
- బనకచర్ల ప్రాజెక్టుకు పేరు మార్చడం కాంగ్రెస్ తెలివి తక్కువ తనానికి నిదర్శనం.. మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి తెలంగాణలో తెలివి తక్కువ దద్దమ్మ ప్రభుత్వం ప్రజల్ని పరిపాలిస్తుందని మాజీమంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి విమర్శించారు. గతంలో కేసీఆర్ ప్రారంభించిన ప్రాజెక్టులు పనులు పూర్తి చేయలేక లేనిపోని ఆ పనిని వేస్తోందని ధ్వజమెత్తారు. బనకచర్ల ప్రాజెక్టు పేరు మార్చి పనులు చేయడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం అన్నారు. ప్రభుత్వం వెంటనే వైఖరి మార్చుకోకపోతే ప్రజలు బుద్ధి చెప్పే సమయం వస్తుందని తెలిపారు.1
- *రాబోయే రోజుల్లో డబ్బు తీసుకొని ఓటు వేయకపోతే ఓడిన అభ్యర్థులు ఇలాగే చేస్తారేమో. ఆలోచనాత్మక వీడియో*1