Shuru
Apke Nagar Ki App…
నంద్యాల జిల్లాలోని నందికొట్కూర్ నియోజకవర్గం పరిధిలో గల మిడుతూరు మండల కేంద్రంలోని అంబేద్కర్ భవనం వద్ద పద్మశ్రీ మందకృష్ణ మాదిగ జన్మదినాన్ని, ఎమ్మార్పీఎస్ 32వ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఘనంగా వేడుకలు నిర్వహించారు. మండల ఇన్‌చార్జి భూపనపాడు సతీష్ మాదిగ అధ్యక్షతన ఎమ్మార్పీ జెండాను ఆవిష్కరించి, కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో వి రాజు, వి సంజన, పనుగంటి రాజు, కొమ్ము నాగరాజు, వి శివప్రసాద్, పనుగంటి విజయుడు, వి ప్రమోద్, వి విక్రం, వి కృపాకర్, చరణ్, నాని, దిలీప్, తదితర ఎమ్మార్పీఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Sateesh bhupanupadu
నంద్యాల జిల్లాలోని నందికొట్కూర్ నియోజకవర్గం పరిధిలో గల మిడుతూరు మండల కేంద్రంలోని అంబేద్కర్ భవనం వద్ద పద్మశ్రీ మందకృష్ణ మాదిగ జన్మదినాన్ని, ఎమ్మార్పీఎస్ 32వ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఘనంగా వేడుకలు నిర్వహించారు. మండల ఇన్‌చార్జి భూపనపాడు సతీష్ మాదిగ అధ్యక్షతన ఎమ్మార్పీ జెండాను ఆవిష్కరించి, కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో వి రాజు, వి సంజన, పనుగంటి రాజు, కొమ్ము నాగరాజు, వి శివప్రసాద్, పనుగంటి విజయుడు, వి ప్రమోద్, వి విక్రం, వి కృపాకర్, చరణ్, నాని, దిలీప్, తదితర ఎమ్మార్పీఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- ఆర్లగడ్డ నియోజకవర్గం ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ మాజీ ఎమ్మెల్యే గంగుల నానికి బహిరంగ సవాల్ విసిరారు. అవినీతి ఆరోపణలను నిరూపిస్తే తాను రాజీనామా చేస్తానని ఆమె స్పష్టం చేశారు. ఆర్లగడ్డలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె ఈ సవాల్ చేశారు. ఆమె మాట్లాడుతూ, తాను సవాల్ చేస్తున్నప్పటికీ మాజీ ఎమ్మెల్యే గంగుల నాని దానిని స్వీకరించరని అన్నారు. తనపై చేసిన ఆరోపణలను బుధవారం సాయంత్రంలోపు నిరూపించాలని, లేకపోతే తాను రాజీనామా చేస్తానని పేర్కొన్నారు. అలా చేయని పక్షంలో గంగుల నాని ఇంటి దగ్గరకు వస్తానని భూమా అఖిలప్రియ హెచ్చరించారు.1
- జూలై 08న బద్వేల్‌లో ప్రియతమ దివంగత ముఖ్యమంత్రి, ఆరోగ్యశ్రీ పథక సృష్టికర్త, జలయజ్ఞ ప్రదాత డాక్టర్ వై.ఎస్. రాజశేఖరరెడ్డి 77వ జయంతి వేడుకలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘనంగా నిర్వహించింది. ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధా, ఎమ్మెల్సీ డిసి గోవిందరెడ్డి ఆదేశాల మేరకు, పట్టణ అధ్యక్షులు సుందర రామిరెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరిగాయి. బద్వేలు మున్సిపాలిటీ పరిధిలోని మైదుకూరు రోడ్డు, నెల్లూరు రోడ్డు, సిద్ధవటం రోడ్డు, ఎన్జీవో కాలనీలలో ఉన్న డాక్టర్ వైఎస్ఆర్ విగ్రహాలకు భారీ గజమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం స్థానిక శాలిమ అనాథాశ్రమంలో భారీ కేక్ కట్ చేసి, చిన్నారులు మరియు నిరాశ్రయులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, వైఎస్ఆర్ ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ, జలయజ్ఞం, రైతు సంక్షేమ పథకాలు ప్రజల గుండెల్లో చిరస్మరణీయంగా నిలిచిపోయాయని పేర్కొన్నారు. ఆయన ఆశయాలను ప్రతి కార్యకర్త ప్రజల్లోకి తీసుకెళ్లాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ వైస్ చైర్మన్లు గోపాల్ స్వామి, రాచపూడి సాయికృష్ణ, రాష్ట్ర బూత్ కన్వీనర్ కార్యదర్శి యద్ధారెడ్డి, అట్లూరు మండల అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి వంకెల పెద్ద పోలిరెడ్డి, స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ కేశవరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి సింగసాని శివయ్య, జిల్లా నేతలు నాగేశ్వరరావు, మాజీ కౌన్సిలర్లు, మండల అధ్యక్షులు, మున్సిపాలిటీ కార్యదర్శులు సహా పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.2
- బిజినపల్లి మండల కేంద్రంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే డా.కూచుకుళ్ల రాజేష్ రెడ్డి భారత రాజ్యాంగ నిర్మాత డా.బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి జయంతిని పురస్కరించుకొని కేక్ కట్ చేసి స్మరించుకున్నారు. సామాజిక న్యాయం, రాజ్యాంగ విలువల పరిరక్షణతో పాటు వైఎస్సార్ సంక్షేమ పాలన స్ఫూర్తితో ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే డా.కూచుకుళ్ల రాజేష్ రెడ్డి ఉద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, కాంగ్రెస్ శ్రేణులు పాల్గొన్నారు.1
- కడప డీఆర్వో మల్లికార్జునుడు బిఎల్ఓ (బూత్ లెవెల్ ఆఫీసర్లు)లు 100 శాతం ఎస్ఐఆర్ (SIR) మ్యాపింగ్ ప్రక్రియను పూర్తి చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. బుధవారం సిద్దవటం మండలంలోని భాకరాపేట సచివాలయంలో బిఎల్ఓలు చేస్తున్న ఎస్ఐఆర్ పనులను పరిశీలించిన ఆయన, వారికి అవసరమైన సూచనలు, సలహాలు అందించారు. ఈ సందర్భంగా డీఆర్వో మాట్లాడుతూ, బిఎల్ఓలకు ఎన్యుమరేషన్ ఫారాలను డిజిటలైజ్ చేయడంలో సహాయం చేయడానికి అంగన్‌వాడీ కార్యకర్తలు మరియు ఎస్.హెచ్.జి విఓఏలను నియమించినట్లు తెలిపారు. జులై 14లోగా డబుల్ ఎంట్రీలు, చనిపోయిన వారి ఓట్లు, వలసదారుల ఓట్లను తొలగించి, మిగిలిన ఓటర్ల మ్యాపింగ్‌ను డిజిటలైజేషన్‌తో సహా పూర్తి చేయాలని ఆయన నిర్దేశించారు. ఈ నెల 12వ తేదీన ఎస్ఐఆర్ ప్రక్రియను తనిఖీ చేసేందుకు తాను మరోసారి వస్తానని, ఆ లోగా బిఎల్ఓలు తమ లక్ష్యాన్ని త్వరగా పూర్తి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ విజయ్ కుమార్ మరియు బిఎల్ఓలు పాల్గొన్నారు.1
- నంద్యాల జిల్లాలోని బండి ఆత్మకూరు మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో బుధవారం మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఎంపీపీ దేరెడ్డి చిన్న సంజీవరెడ్డి అధ్యక్షతన, ఎంపీడీవో గాయత్రి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో, గ్రామాలలో నీటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని, అలాగే గ్రామాలలో నెలకొన్న ఇతర సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని ఎంపీపీ దేరెడ్డి చిన్న సంజీవరెడ్డి పంచాయతీ కార్యదర్శులకు ఆదేశించారు. ఈ సమావేశంలో మండల స్థాయి అధికారులు తమ శాఖల ప్రగతి నివేదికలను చదివి వినిపించారు. అనంతరం, మండలంలోని పలు గ్రామాలలోని వివిధ సమస్యలపై మండల అధికారులతో విస్తృతంగా చర్చించారు. ఈ చర్చల సందర్భంగా, గ్రామాలలో ఆర్టీసీ బస్సులు నిలపడం లేదని, గ్రామాలలో విద్యుత్ అంతరాయం ఏర్పడుతోందని, మరియు ప్రైవేట్ పాఠశాలలు అధిక ఫీజులు వసూలు చేస్తున్నాయని సభ్యులు లేవనెత్తి, వీటిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో మండల అధికారులు, వైస్ ఎంపీపీలు రాగలరమణ, ముంతల మధురాణి, ఎంపీటీసీలు, పంచాయతీ కార్యదర్శులు, తదితరులు పాల్గొన్నారు.1
- దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి 77వ జయంతి సందర్భంగా జూలై 08న బద్వేలులోని పోరుమామిళ్లలో వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో ఘనంగా నివాళుల కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బద్వేలు వైఎస్సార్‌సీపీ అదనపు సమన్వయకర్త నల్లేరు విశ్వనాథ్ రెడ్డి నేతృత్వం వహించారు. స్థానిక పార్టీ కార్యాలయంలో వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం, బద్వేలు నియోజకవర్గంలోని 7 మండలాల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై "వైఎస్ రాజశేఖర్ రెడ్డి అమర్ రహే" అంటూ నినాదాలు చేశారు. అనంతరం, పార్టీ కార్యాలయం నుంచి భారీ ర్యాలీ నిర్వహించి పట్టణ మధ్యలో ఉన్న వైఎస్ఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి గజమాలలు సమర్పించారు. ఈ ర్యాలీలో "విశ్వనాథ్ రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి", "జై జగన్... జై జై జగన్", "జై అవినాష్... జై జై అవినాష్" వంటి నినాదాలతో పట్టణం మార్మోగింది. కార్యక్రమం అనంతరం నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలకు భారీ అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన నల్లేరు విశ్వనాథ్ రెడ్డి, ప్రజల సంక్షేమమే ధ్యేయంగా వైఎస్ఆర్ జీవితాంతం పనిచేశారని, అందుకే ఆయన ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారని స్పష్టం చేశారు. వైఎస్ఆర్ ఆశయాలే తమ బాట అని పునరుద్ఘాటిస్తూ, రాబోయే స్థానిక సంస్థల, సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీని, జగన్మోహన్ రెడ్డిని మరోసారి గెలిపించి ప్రజా సంక్షేమ పాలనను కొనసాగించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.3
- రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే డా. కూచుకుళ్ల రాజేష్ రెడ్డితో కలిసి తిమ్మాజిపేటలోని టీజీఎస్‌ఆర్టీసీ బస్‌స్టేషన్ ఆధునికీకరణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, ప్రజా రవాణా రంగాన్ని బలోపేతం చేయడానికి మరియు మౌలిక వసతులను కల్పించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే డా. కూచుకుళ్ల రాజేష్ రెడ్డి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో దశలవారీగా అభివృద్ధి చేస్తామని పేర్కొంటూ, ఆధునిక వసతులతో ప్రయాణికులకు మెరుగైన సేవలు అందుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్, పలువురు అధికారులు మరియు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.1
- ధరూర్ మండలంలోని వామన్‌పల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజనం కోసం నిల్వ ఉంచిన బియ్యంలో పురుగులు కనిపించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు విద్యార్థుల ఆరోగ్యంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. గతంలోనూ ఇదే సమస్య తలెత్తిందని, మరోసారి ఇలా పురుగుల బియ్యం కనిపించడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని తల్లిదండ్రులు మండిపడ్డారు. ప్రభుత్వ పాఠశాలలో ఇలాంటి పురుగుల బియ్యం ఉంటే పిల్లలు ఎలా తినగలరని తల్లిదండ్రులు ప్రశ్నిస్తూ, తక్షణమే అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.1