ఫసల్‌వాదిలో వైభవంగా మహమ్మేరు దేవాలయ ఆద్యశిలాస్థాపనోత్సవం... పూజా కార్యక్రమాలలో పాల్గొన్న నీలం మధు.. సంగారెడ్డి జిల్లా సంగారెడ్డి నియోజకవర్గం ఫసల్‌వాది లోని శ్రీ జ్యోతిర్వాస్తు విద్యాపీఠం ప్రాంగణం నేడు ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లుతోంది. అక్షయ తృతీయ పర్వదినాన్ని పురస్కరించుకుని, పీఠాధిపతులు బ్రహ్మశ్రీ డాక్టర్ శ్రీ మహేశ్వర శర్మ సిద్ధాంతి గారి దివ్య పర్యవేక్షణలో అత్యంత అరుదైన 'మహమ్మేరు దేవాలయ' నిర్మాణానికి ఆద్యశిలాస్థాపనోత్సవం అత్యంత వైభవంగా ప్రారంభమైంది. మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ ఇంచార్జి నీలం మధు ముదిరాజ్ పాల్గొన్న ఈ ఉత్సవాలు వేద మంత్రోచ్ఛారణలు, భక్తుల జయజయధ్వానాల మధ్య శాస్త్రోక్తంగా కొనసాగుతున్నాయి.సోమవారం ఉదయం 8:01 గంటలకు గణపతి పూజ మరియు గురుపూజతో ఉత్సవాలు అంకురార్పణ జరుపుకున్నాయి.అనంతరం భక్తులందరూ కలిసి సామూహికంగా నిర్వహించిన శతావర్తన హనుమాన్ చాలీసా పారాయణంతో ఆ ప్రాంతమంతా భక్తి భావాన్ని నింపింది.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పుణ్యాహవాచనం, వాస్తుపూజ, నవకుంభ ఆవాహనము, పంచశిలా సంస్కారం మరియు అఘోర హోమం వంటి క్రతువులను వేద పండితులు శాస్త్రీయంగా నిర్వహించారు.ఈ సందర్భంగా మహేశ్వర సిద్ధాంతి మాట్లాడుతూ,భూమి పూజ నుండి శిఖర ప్రతిష్ఠ వరకు అత్యంత కచ్చితమైన ధర్మశాస్త్ర ప్రమాణాలతో ఈ దేవాలయాన్ని నిర్మిస్తున్నట్లు తెలిపారు.ముఖ్యంగా ఆద్యశిలలపై భక్తులు స్వయంగా బీజాక్షరాలు లిఖించడం ద్వారా వారి వంశాభివృద్ధి జరుగుతుందని, పంచ మహాపాపాలు తొలగి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని ఆయన ఆకాంక్షించారు. సాయంత్రం వేళల్లో అమ్మవారి గర్భాలయ ప్రవేశం, ఆద్యశిలాస్థాపన పంచశిలేష్టికాన్యాసం వంటి ప్రధాన ఘట్టాలు జరగనున్నాయి. ఈ చారిత్రాత్మక నిర్మాణానికి దేవాలయ స్థపతులు శ్రీ జి. సుబ్రహ్మణ్యం, ఎస్. సెంథిల్ హేమంతాచార్యులు తమ నైపుణ్యాన్ని అందిస్తున్నారు.ఈ పూజ కార్యక్రమాలలో పాల్గొంటున్న నీలం మధు కు ఆలయ నిర్వాహకులు ధన్యవాదాలు తెలిపారు.అనంతరం ఈ మహత్తర కార్యక్రామానికి భారీగా తరలివచ్చిన భక్తుల కోసం నిర్వాహకులు అన్నప్రసాద వితరణ తీర్థప్రసాదాల ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు, ప్రజలు పెద్దఎత్తున పాల్గొన్నారు.
ఫసల్‌వాదిలో వైభవంగా మహమ్మేరు దేవాలయ ఆద్యశిలాస్థాపనోత్సవం... పూజా కార్యక్రమాలలో పాల్గొన్న నీలం మధు.. సంగారెడ్డి జిల్లా సంగారెడ్డి నియోజకవర్గం ఫసల్‌వాది లోని శ్రీ జ్యోతిర్వాస్తు విద్యాపీఠం ప్రాంగణం నేడు ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లుతోంది. అక్షయ తృతీయ పర్వదినాన్ని పురస్కరించుకుని, పీఠాధిపతులు బ్రహ్మశ్రీ డాక్టర్ శ్రీ మహేశ్వర శర్మ సిద్ధాంతి గారి దివ్య పర్యవేక్షణలో అత్యంత అరుదైన 'మహమ్మేరు దేవాలయ' నిర్మాణానికి ఆద్యశిలాస్థాపనోత్సవం అత్యంత వైభవంగా ప్రారంభమైంది. మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్
ఇంచార్జి నీలం మధు ముదిరాజ్ పాల్గొన్న ఈ ఉత్సవాలు వేద మంత్రోచ్ఛారణలు, భక్తుల జయజయధ్వానాల మధ్య శాస్త్రోక్తంగా కొనసాగుతున్నాయి.సోమవారం ఉదయం 8:01 గంటలకు గణపతి పూజ మరియు గురుపూజతో ఉత్సవాలు అంకురార్పణ జరుపుకున్నాయి.అనంతరం భక్తులందరూ కలిసి సామూహికంగా నిర్వహించిన శతావర్తన హనుమాన్ చాలీసా పారాయణంతో ఆ ప్రాంతమంతా భక్తి భావాన్ని నింపింది.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పుణ్యాహవాచనం, వాస్తుపూజ, నవకుంభ ఆవాహనము, పంచశిలా సంస్కారం మరియు
అఘోర హోమం వంటి క్రతువులను వేద పండితులు శాస్త్రీయంగా నిర్వహించారు.ఈ సందర్భంగా మహేశ్వర సిద్ధాంతి మాట్లాడుతూ,భూమి పూజ నుండి శిఖర ప్రతిష్ఠ వరకు అత్యంత కచ్చితమైన ధర్మశాస్త్ర ప్రమాణాలతో ఈ దేవాలయాన్ని నిర్మిస్తున్నట్లు తెలిపారు.ముఖ్యంగా ఆద్యశిలలపై భక్తులు స్వయంగా బీజాక్షరాలు లిఖించడం ద్వారా వారి వంశాభివృద్ధి జరుగుతుందని, పంచ మహాపాపాలు తొలగి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని ఆయన ఆకాంక్షించారు. సాయంత్రం వేళల్లో అమ్మవారి గర్భాలయ ప్రవేశం, ఆద్యశిలాస్థాపన పంచశిలేష్టికాన్యాసం
వంటి ప్రధాన ఘట్టాలు జరగనున్నాయి. ఈ చారిత్రాత్మక నిర్మాణానికి దేవాలయ స్థపతులు శ్రీ జి. సుబ్రహ్మణ్యం, ఎస్. సెంథిల్ హేమంతాచార్యులు తమ నైపుణ్యాన్ని అందిస్తున్నారు.ఈ పూజ కార్యక్రమాలలో పాల్గొంటున్న నీలం మధు కు ఆలయ నిర్వాహకులు ధన్యవాదాలు తెలిపారు.అనంతరం ఈ మహత్తర కార్యక్రామానికి భారీగా తరలివచ్చిన భక్తుల కోసం నిర్వాహకులు అన్నప్రసాద వితరణ తీర్థప్రసాదాల ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు, ప్రజలు పెద్దఎత్తున పాల్గొన్నారు.
- మహాత్మా బసవేశ్వర జయంతి కార్యక్రమాన్ని విద్యుత్ కార్యాలయం ఆవరణలో సోమవారం నిర్వహించారు. విద్యుత్ బిసి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బసవేశ్వర విగ్రహానికి ప్రత్యేక అభిషేక కార్యక్రమాలు నిర్వహించారు. అర్చకులు వేదమంత్రాలతో పూజా కార్యక్రమాలు చేశారు. అనంతరం పూలమాలలు వేసి తీర్థ ప్రసాదాలను అందజేశారు. కార్యక్రమంలో నాయకులు రాజేశ్వర్ స్వామి, ప్రభు గౌడ్, మల్లికార్జున్ పాటిల్, పాల్గొన్నారు.1
- the mhshshsndihdbxbbxnxndbndjxjxbdoshdhbspHetro address video1
- జహీరాబాద్ నియోజకవర్గం లోని ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన మౌలిక సౌకర్యాలు కల్పించాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నరసింహ ను కోరిన జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు1
- .*ప్రెస్ రిలీజ్* మెదక్ 20 ఏప్రిల్2026 2027 -పూర్తిగా డిజిటల్ జనగణన కలెక్టర్ ఎన్యుమరేటర్స్ సూపర్వైజర్స్ శిక్షణలో సంపూర్ణ అవగాహనతో , జనగణన విజయవంతం చేయాలి జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ 2027 - డిజిటల్ జనగణన అని *జిల్లా కలెక్టర్ ప్రతి మాసింగ్* అన్నారు కౌడిపల్లి మండలంలో జిల్లా పరిషత్ పాఠశాలలో ఎన్యుమరేటర్ సూపర్వైజర్లకు జనగణన-2027 నిర్వహణలో భాగంగా మూడు రోజులపాటు శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ శిక్షణ కార్యక్రమానికి కలెక్టర్ ప్రతిమ సింగ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్యుమరేటర్స్ సూపర్వైజర్లుకు దిశా నిర్దేశం చేశారు. శిక్షణలో ప్రతి అంశాన్ని అవగాహన కల్పించుకోవాలన్నారు ఈ శిక్షణ మూడు రోజులు పాటు కొనసాగుతుందని ప్రశ్నలు సమాధానాల రూపంలో జనగణన కు సంబంధించివారి సందేహాలను నివృత్తి చేశారు. ఈ కార్యక్రమంలో నర్సాపూర్ ఆర్డీవో రామకృష్ణ సంబంధిత ఎనిమరేటర్స్ సూపర్వైజర్స్ తదితరులు పాల్గొన్నారు1
- Post by Tagore1
- రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో మహారాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ గౌరవ చైర్మన్, Shri Vivek Laxmikant Bhimanwar స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఆలయానికి విచ్చేసిన ఆయనకు అర్చకులు, వేద పండితులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.పూజల అనంతరం స్వామివారి మండపంలో అర్చకులు వేద ఆశీర్వచనం అందించగా, స్వామివారి శేష వస్త్రం, లడ్డూ మరియు తీర్థ ప్రసాదాలను అందజేశారు.ఈ సందర్భంగా ఆలయ వాతావరణం భక్తిశ్రద్ధలతో నిండిపోయింది1
- Post by Vishwamber Rao1
- *ప్రజావాణి అర్జీలను సత్వరమే పరిష్కరించాలి* *జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ ప్రజావాణిలో వివిధ సమస్యలతో వచ్చే ప్రజల అర్జీలను సత్వరమే పరిష్కరించాలని *జిల్లా కలెక్టర్ ప్రతిమా అధికారులను ఆదేశించారు. సోమవారం, జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలోని మెయిన్ కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన ప్రజావాణిలో *అదనపు కలెక్టర్ నగేష్, జడ్పీ సీఈఓ ఎల్లయ్య తో కలిసి జిల్లా కలెక్టర్ ఫిర్యాదులను స్వీకరించి, పరిశీలించారు. ఈ సందర్భంగా *(74)* అర్జీలను *కలెక్టర్* స్వీకరించారు. వచ్చిన దరఖాస్తులను సంబంధిత శాఖల అధికారులకు కేటాయిస్తూ, ప్రజా సమస్యలపై తగిన చర్యలు తీసుకొని, త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేయాలని అధికారులకు సూచించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి వేదికగా ప్రజావాణి నిర్వహించినట్లు సూచించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు సిబ్బంది పాల్గొన్నారు1