శ్రీశైలం విషాద బాధిత కుటుంబానికి మంత్రి సత్యకుమార్ యాదవ్ పరామర్శ బత్తలపల్లి టీచర్స్ కాలనీలో బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి సత్యకుమార్ యాదవ్ తక్షణ సాయంగా రూ.50 వేల ఆర్థిక సహాయం.. కుటుంబానికి అండగా ఉంటామని భరోసా బత్తలపల్లి, ఆగస్టు 27:– శ్రీశైలంలో చోటుచేసుకున్న విషాదకర ఘటనలో ధర్మవరం నియోజకవర్గం, బత్తలపల్లి చెందిన కుటుంబ సభ్యులు మృతి చెందడం పట్ల రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మరియు వైద్య విద్య శాఖామాత్యులు, ధర్మవరం నియోజకవర్గ శాసనసభ్యులు సత్యకుమార్ యాదవ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో గురువారం బత్తలపల్లి మండల కేంద్రంలోని టీచర్స్ కాలనీలో ఉన్న బాధిత కుటుంబ స్వగృహానికి మంత్రి సత్యకుమార్ యాదవ్, ఆర్డిఓ రాంభూపాల్ రెడ్డి, ఎమ్మార్వో ఈశ్వర ప్రసాద్, ఎంపీడీవో కిష్టప్ప, తదితర అధికారులతో కలిసి వెళ్లారు. కుటుంబ సభ్యుడు గోకల రాముడును పరామర్శించి, ప్రస్తుత కుటుంబ పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ విషాద సమయంలో కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి, వారికి అండగా ఉంటామని భరోసా కల్పించారు. శ్రీశైలంలో జరిగిన ఘటనలో కుటుంబ సభ్యులను కోల్పోయిన నేపథ్యంలో గోకల రాముడు కుటుంబం ఎదుర్కొంటున్న పరిస్థితులను మంత్రి సత్యకుమార్ యాదవ్ గారు స్వయంగా అడిగి తెలుసుకున్నారు. కుటుంబానికి ప్రస్తుతం ఉన్న అవసరాలు, ఆర్థిక పరిస్థితి తదితర అంశాలపై అధికారులతో చర్చించారు. **తక్షణ సాయంగా రూ.50 వేల ఆర్థిక సహాయం.... బాధిత కుటుంబానికి తక్షణ ఉపశమనంగా మంత్రి సత్యకుమార్ యాదవ్ గారు తనవంతుగా రూ.50 వేల ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ కష్ట సమయంలో కుటుంబం ఒంటరిగా లేదని, ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు అన్ని విధాలా అండగా ఉంటారని కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు. అదేవిధంగా కుటుంబ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం తరఫున అందించగల ఇతర సహాయ సహకారాలపై మంత్రి అక్కడికక్కడే ఆర్డిఓ, ఎమ్మార్వో, ఎంపీడీవో, తదితర అధికారులతో చర్చించారు. అవసరమైన చర్యలను వేగంగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు. కుటుంబ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని రానున్న నెలలో కొత్త పింఛన్ల మంజూరుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే ప్రక్రియలో గోకల రాముడికి పింఛన్ మంజూరయ్యేలా అవసరమైన చర్యలు తీసుకుంటామని మంత్రి సత్యకుమార్ యాదవ్ హామీ ఇచ్చారు. అర్హతకు అనుగుణంగా పింఛన్ కోసం దరఖాస్తు చేసుకునేలా సంబంధిత అధికారులు సహకరించాలని, ప్రభుత్వ నిబంధనల ప్రకారం పింఛన్ మంజూరుకు అవసరమైన ప్రక్రియను పూర్తి చేయాలని మంత్రి సూచించారు. ఈ కష్ట సమయంలో కుటుంబానికి ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు అండగా ఉంటారు. కుటుంబ సభ్యులు అధైర్యపడాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం నుంచి అందించగల ప్రతి సహాయాన్ని అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటాం అని మంత్రి బాధిత కుటుంబానికి భరోసా ఇచ్చారు. **సమస్యలను పంచుకుంటే పరిష్కారం దొరుకుతుంది.... జీవితంలో ఎలాంటి క్లిష్ట పరిస్థితులు ఎదురైనా వాటిని ఒంటరిగా ఎదుర్కోవద్దని సూచించారు. కుటుంబ సభ్యులు, ఆత్మీయులు, స్నేహితులతో సమస్యలను పంచుకుని, వారి సహకారంతో పరిష్కార మార్గాలను అన్వేషించాలని కోరారు. జీవితంలో ఎలాంటి సమస్య ఎదురైనా దానికి పరిష్కారం ఉంటుంది. కష్టకాలంలో ఆత్మీయులతో, కుటుంబ సభ్యులతో, స్నేహితులతో మాట్లాడాలి. సమస్యను పంచుకుంటే పరిష్కారానికి మార్గం దొరుకుతుంది. ఆవేశానికి లోనై ఆత్మహత్య వంటి తీవ్రమైన నిర్ణయాలకు ఎవరూ పాల్పడవద్దు అని మంత్రి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రతి ఒక్కరి జీవితం ఎంతో విలువైనదని, ఎంతటి క్లిష్ట పరిస్థితి ఎదురైనా ధైర్యంగా నిలబడి పరిష్కారం కోసం ప్రయత్నించాలని మంత్రి సూచించారు. కష్టాల్లో ఉన్నవారికి కుటుంబ సభ్యులు, ఆత్మీయులు అండగా నిలవాలని కోరారు. ఈ కార్యక్రమంలో బత్తలపల్లి బిజెపి మండల అధ్యక్షులు ఆకులేటి భాస్కర్, ఆకులేటి వీరనారప్ప, కోటి బాబు, తిరుపతయ్య, మల్లికార్జున, తదితర స్థానిక నాయకులు, కాలనీ ప్రజలు పాల్గొన్నారు...
శ్రీశైలం విషాద బాధిత కుటుంబానికి మంత్రి సత్యకుమార్ యాదవ్ పరామర్శ బత్తలపల్లి టీచర్స్ కాలనీలో బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి సత్యకుమార్ యాదవ్ తక్షణ సాయంగా రూ.50 వేల ఆర్థిక సహాయం.. కుటుంబానికి అండగా ఉంటామని భరోసా బత్తలపల్లి, ఆగస్టు 27:– శ్రీశైలంలో చోటుచేసుకున్న విషాదకర ఘటనలో ధర్మవరం నియోజకవర్గం, బత్తలపల్లి చెందిన కుటుంబ సభ్యులు మృతి చెందడం పట్ల రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మరియు వైద్య విద్య శాఖామాత్యులు, ధర్మవరం నియోజకవర్గ శాసనసభ్యులు సత్యకుమార్ యాదవ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో గురువారం బత్తలపల్లి మండల కేంద్రంలోని టీచర్స్ కాలనీలో ఉన్న బాధిత కుటుంబ స్వగృహానికి మంత్రి సత్యకుమార్ యాదవ్, ఆర్డిఓ రాంభూపాల్ రెడ్డి, ఎమ్మార్వో ఈశ్వర ప్రసాద్, ఎంపీడీవో కిష్టప్ప, తదితర అధికారులతో కలిసి వెళ్లారు. కుటుంబ సభ్యుడు గోకల రాముడును పరామర్శించి, ప్రస్తుత కుటుంబ పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ విషాద సమయంలో కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి, వారికి అండగా ఉంటామని భరోసా కల్పించారు. శ్రీశైలంలో జరిగిన ఘటనలో కుటుంబ సభ్యులను కోల్పోయిన నేపథ్యంలో గోకల రాముడు కుటుంబం ఎదుర్కొంటున్న పరిస్థితులను మంత్రి సత్యకుమార్ యాదవ్ గారు స్వయంగా అడిగి తెలుసుకున్నారు. కుటుంబానికి ప్రస్తుతం ఉన్న అవసరాలు, ఆర్థిక పరిస్థితి తదితర అంశాలపై అధికారులతో చర్చించారు. **తక్షణ సాయంగా రూ.50 వేల ఆర్థిక సహాయం.... బాధిత కుటుంబానికి తక్షణ ఉపశమనంగా మంత్రి సత్యకుమార్ యాదవ్ గారు తనవంతుగా రూ.50 వేల ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ కష్ట సమయంలో కుటుంబం ఒంటరిగా లేదని, ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు అన్ని విధాలా అండగా ఉంటారని కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు. అదేవిధంగా కుటుంబ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం తరఫున అందించగల ఇతర సహాయ సహకారాలపై మంత్రి అక్కడికక్కడే
ఆర్డిఓ, ఎమ్మార్వో, ఎంపీడీవో, తదితర అధికారులతో చర్చించారు. అవసరమైన చర్యలను వేగంగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు. కుటుంబ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని రానున్న నెలలో కొత్త పింఛన్ల మంజూరుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే ప్రక్రియలో గోకల రాముడికి పింఛన్ మంజూరయ్యేలా అవసరమైన చర్యలు తీసుకుంటామని మంత్రి సత్యకుమార్ యాదవ్ హామీ ఇచ్చారు. అర్హతకు అనుగుణంగా పింఛన్ కోసం దరఖాస్తు చేసుకునేలా సంబంధిత అధికారులు సహకరించాలని, ప్రభుత్వ నిబంధనల ప్రకారం పింఛన్ మంజూరుకు అవసరమైన ప్రక్రియను పూర్తి చేయాలని మంత్రి సూచించారు. ఈ కష్ట సమయంలో కుటుంబానికి ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు అండగా ఉంటారు. కుటుంబ సభ్యులు అధైర్యపడాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం నుంచి అందించగల ప్రతి సహాయాన్ని అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటాం అని మంత్రి బాధిత కుటుంబానికి భరోసా ఇచ్చారు. **సమస్యలను పంచుకుంటే పరిష్కారం దొరుకుతుంది.... జీవితంలో ఎలాంటి క్లిష్ట పరిస్థితులు ఎదురైనా వాటిని ఒంటరిగా ఎదుర్కోవద్దని సూచించారు. కుటుంబ సభ్యులు, ఆత్మీయులు, స్నేహితులతో సమస్యలను పంచుకుని, వారి సహకారంతో పరిష్కార మార్గాలను అన్వేషించాలని కోరారు. జీవితంలో ఎలాంటి సమస్య ఎదురైనా దానికి పరిష్కారం ఉంటుంది. కష్టకాలంలో ఆత్మీయులతో, కుటుంబ సభ్యులతో, స్నేహితులతో మాట్లాడాలి. సమస్యను పంచుకుంటే పరిష్కారానికి మార్గం దొరుకుతుంది. ఆవేశానికి లోనై ఆత్మహత్య వంటి తీవ్రమైన నిర్ణయాలకు ఎవరూ పాల్పడవద్దు అని మంత్రి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రతి ఒక్కరి జీవితం ఎంతో విలువైనదని, ఎంతటి క్లిష్ట పరిస్థితి ఎదురైనా ధైర్యంగా నిలబడి పరిష్కారం కోసం ప్రయత్నించాలని మంత్రి సూచించారు. కష్టాల్లో ఉన్నవారికి కుటుంబ సభ్యులు, ఆత్మీయులు అండగా నిలవాలని కోరారు. ఈ కార్యక్రమంలో బత్తలపల్లి బిజెపి మండల అధ్యక్షులు ఆకులేటి భాస్కర్, ఆకులేటి వీరనారప్ప, కోటి బాబు, తిరుపతయ్య, మల్లికార్జున, తదితర స్థానిక నాయకులు, కాలనీ ప్రజలు పాల్గొన్నారు...
- శ్రీశైలం విషాద ఘటనపై మంత్రి సత్యకుమార్ పరామర్శ........ ధర్మవరం: ధర్మవరం నియోజకవర్గానికి చెందిన కుటుంబ సభ్యులు శ్రీశైలంలో మృతి చెందిన ఘటనపై రాష్ట్ర మంత్రి సత్యకుమార్ యాదవ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. గురువారం బత్తలపల్లిలోని వారి స్వగృహానికి ఎం. ఆర్. ఓ ,ఆర్ డి ఓ తదితర అధికారులతో కలిసి వెళ్లిన మంత్రి కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. ఈ కష్టకాలంలో ప్రభుత్వం,ప్రజాప్రతినిధులు కుటుంబానికి అండగా ఉంటారని భరోసా కల్పించారు. కుటుంబ పరిస్థితులను అడిగి తెలుసుకున్న మంత్రి,ప్రభుత్వం తరఫున అందించగల సహాయంపై అధికారులతో అక్కడికక్కడే చర్చించి అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. తక్షణ సహాయంగా ఆర్థిక సహాయం అందించారు.జీవితంలో ఎదురయ్యే క్లిష్ట పరిస్థితులను ఆత్మీయులు,కుటుంబ సభ్యులు,స్నేహితులతో పంచుకుని పరిష్కారం వెతుక్కోవాలని మంత్రి సూచించారు. ఎలాంటి పరిస్థితుల్లోనూ ఆత్మహత్య వంటి తీవ్రమైన నిర్ణయాలకు ఎవరూ పాల్పడవద్దని విజ్ఞప్తి చేశారు.1
- ధర్మవరం నుంచి మరో సరికొత్త వెబ్ సిరీస్.. మిస్టరీ, క్రైమ్, యాక్షన్ అంశాలతో “అర్జున్ – ది హంట్” శ్రీ సత్యసాయి జిల్లా : ధర్మవరం పట్టణానికి చెందిన పెద్ది రాజు నరసింహ రచన, దర్శకత్వంలో “అర్జున్ – ది హంట్” పేరుతో మిస్టరీ, క్రైమ్, యాక్షన్ అంశాలతో వెబ్ సిరీస్ రూపొందుతోంది. ప్రేక్షకులకు ఉత్కంఠను కలిగించేలా కథ, సన్నివేశాలను రూపొందిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ వెబ్ సిరీస్‌లో AI టెక్నాలజీని వినూత్నంగా ఉపయోగించనున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తిగల వారి ఫొటోలను స్వీకరించి, వాటి ఆధారంగా AI సహాయంతో ప్రత్యేకమైన క్యారెక్టర్ లుక్‌ను రూపొందించనున్నట్లు తెలిపారు. వ్యక్తుల లుక్‌కు అనుగుణంగా కథలో పాత్రను డిజైన్ చేసే విధంగా ప్రక్రియ కొనసాగుతుందని పేర్కొన్నారు. వెబ్ సిరీస్‌లో భాగం కావాలనుకునే వారు తమ ఫొటోతో పాటు వివరాలను పంపించవచ్చని నిర్వాహకులు తెలిపారు. ఇందుకోసం 8978580208 నంబర్‌కు WhatsAppలో “ARJUN – THE HUNT” అని మెసేజ్ చేసి, పేరు, వయస్సు, ప్రాంతం, ఫొటో, మొబైల్ నంబర్ వివరాలను పంపించాలని సూచించారు. మిస్టరీ, క్రైమ్, యాక్షన్ అంశాల కలయికతో రూపొందుతున్న ఈ వెబ్ సిరీస్‌ను సరికొత్త విధానంలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.1
- దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరస్వామి వారి ఆలయంలో మహా సంప్రోక్షణ దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరస్వామి వారి ఆలయంలో జీర్ణోద్ధారణ అష్టబంధన మహాసంప్రోక్షణ కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు.ఆగమశాస్త్రోక్తంగా మహా పూర్ణాహుతి, మహాసంప్రోక్షణ,కళాకర్షణ కార్యక్రమాలను అర్చకులు చేపట్టారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర పాల్గొన్నారు. వేద మంత్రోచ్ఛారణలు,మంగళవాయిద్యాల నడుమ మహాసంప్రోక్షణ నిర్వహించి, స్వామివారి అంతరాలయ దర్శనాన్ని పునః ప్రారంభించారు.1
- మదనపల్లి కలెక్టరేట్ ఎదుట రేషన్ డీలర్ల ఆందోళన మదనపల్లెలోని రేషన్ షాపుల డీలర్లు కలెక్టరేట్ ఎదుట ఆందోళనకు పునుకున్నారు. గురువారం మదనపల్లె డివిజన్లోని రేషన్ షాపుల అసోసియేషన్ పిలుపుమేరకు కలెక్టరేట్ వద్దకు డీలర్లు పెద్దఎత్తున చేరుకున్నారు. కార్యాలయ ఆవరణలో ఆందోళన నిర్వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. బియ్యం బస్తాలకు స్కానింగ్ చేసి అమ్మాలని కొత్త విధానాన్ని ప్రభుత్వం తీసుకురావడానికి వ్యతిరేకిస్తున్నట్లు డీలర్ల అసోషియేషన్ నాయకులుఖాసీం తెలిపారు. మదనపల్లి కలెక్టరేట్ ఎదుట రేషన్ డీలర్ల ఆందోళన మదనపల్లెలోని రేషన్ షాపుల డీలర్లు కలెక్టరేట్ ఎదుట ఆందోళనకు పునుకున్నారు. గురువారం మదనపల్లె డివిజన్లోని రేషన్ షాపుల అసోసియేషన్ పిలుపుమేరకు కలెక్టరేట్ వద్దకు డీలర్లు పెద్దఎత్తున చేరుకున్నారు. కార్యాలయ ఆవరణలో ఆందోళన నిర్వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. బియ్యం బస్తాలకు స్కానింగ్ చేసి అమ్మాలని కొత్త విధానాన్ని ప్రభుత్వం తీసుకురావడానికి వ్యతిరేకిస్తున్నట్లు డీలర్ల అసోషియేషన్ నాయకులుఖాసీం తెలిపారు.1
- అధికారుల నిర్లక్ష్యపు వైఖరిపై జగనన్న కాలనీలో తాగునీటి సమస్యపై ఖాళీ బిందెలతో నిరసన తెలిపిన మహిళలు. అన్నమయ్య జిల్లా పుంగనూరు పట్టణంలోని ఎన్‌ఎస్‌పేట జగనన్న కాలనీలో తాగునీటి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ స్థానికులు గురువారం ఖాళీ బిందెలతో నిరసన వ్యక్తం చేశారు. గత రెండు నెలలుగా బోరు మరమ్మతులకు గురికావడంతో తాగునీటికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వారు తెలిపారు. సమస్యపై మున్సిపల్ కమిషనర్, అధికారులకు వినతిపత్రాలు అందజేసినా స్పందన లేదని వాపోయారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి బోరును మరమ్మతు చేసి తాగునీటి సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.1
- పుంగనూరు లో బహుజన సమాజ్ పార్టీలోకి రామకృష్ణ, చుక్కమ్మ... అన్నమయ్య జిల్లా. పుంగనూరు. పుంగనూరులో జరిగిన బహుజన సమాజ్ పార్టీ సమావేశంలో కీలక రాజకీయ పరిణామం చోటుచేసుకుంది. ఉమ్మడి చిత్తూరు జిల్లా ఎరుకల సంఘం అధ్యక్షుడిగా పనిచేసిన రామకృష్ణ బీఎస్పీలో చేరారు. ఆయనను పుంగనూరు అర్బన్ అధ్యక్షుడిగా ఎన్నిక చేశారు. అలాగే వివిధ సామాజిక సంఘాల్లో పనిచేసిన అనుభవం కలిగిన సీనియర్ మహిళా నాయకురాలు చుక్కమ్మ కూడా బహుజన సమాజ్ పార్టీలో చేరారు. ఆమెను పుంగనూరు నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలిగా నియమించారు. ఈ సందర్భంగా జిల్లా కమిటీ నాయకులు పార్టీ కండువాలు కప్పి రామకృష్ణ, చుక్కమ్మలను పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం నియోజకవర్గ కమిటీ సభ్యులు వారిని ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు. కొత్తగా బాధ్యతలు స్వీకరించిన రామకృష్ణ, చుక్కమ్మలు పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని, బహుజనుల హక్కులు, సామాజిక న్యాయం కోసం ప్రజలతో కలిసి పనిచేస్తామని తెలిపారు. పుంగనూరు నియోజకవర్గంలో పార్టీని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతామని నాయకులు పేర్కొన్నారు. జై భీమ్ బహుజన ఐక్యత వర్ధిల్లాలి!2
- రైతులు ఉధ్యాన పంటలపై మెగ్గు చూపాలి:రాష్ట్ర ఉద్యాన సెరికల్చర్ డైరెక్టర్ డాక్టర్ కే. శ్రీనివాసులు రైతులు మంచి ఆదాయాన్ని ఇచ్చే ఉద్యాన పంటలపై మెగ్గు చూపాలని రాష్ట్ర ఉద్యాన సెరికల్చర్ డైరెక్టర్ డాక్టర్ కే. శ్రీనివాసులు పేర్కొన్నారు.బుధవారం మహానంది మండలం గాజులపల్లె గ్రామంలోని ఉద్యాన పంటలను సందర్శించారు. అనంతరం రైతులు వేసిన అంతర పంట యాలక్కి అరటి, 30 రకాల విత్తనాలతో వేసిన పీఎండీస్, ఫారం పాండ్లు, బిందు సేద్యం పద్ధతి ద్వారా సాగు చేస్తున్న బంతిపూలు, గులాబి, మామిడి, అన్న యాపిల్ పంటలను పరిశీలించారు. అనంతరం రైతులతో పంటల సాగు, పద్ధతులు, మార్కెటింగ్ గురించి తెలుసుకున్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఉద్యాన శాఖ అధికారి నాగరాజు, జిల్లా సూక్ష్మ సేద్య సాగు అధికారిణి విజయలక్ష్మి , నంద్యాల ఉద్యాన శాఖ అధికారి హరేంద్ర, రైతులు హుస్సేన్, హుస్సేన్ రెడ్డి,మస్తాన్ తదితరులు పాల్గొన్నారు.1
- రాఖీ పౌర్ణమి సందర్భంగా వైయస్ జగన్‌కు రాఖీలు కట్టిన పలువురు మహిళలు వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో సందడి రాఖీ పౌర్ణమి సందర్భంగా వైయస్ జగన్‌కు రాఖీలు కట్టిన పలువురు మహిళలు వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో సందడి1