logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

అంతా ఈజీగా ఎలా నమ్ముతారో... ఓ రిటైర్డ్ ఉద్యోగి నుంచి 33 లక్షలు కాజేసిన కేటుగాళ్లు....! ఈజీ మనీకి అలవాటు పడిన చాలా మంది కేటుగాళ్లు జనాలను మోసం చేసేందుకు సరికొత్త ఎత్తుగడలు వేస్తున్నారు. తాజాగా ఇలానే అధిక లాభాలు వస్తాయనే ఆశ చూపి ఓ రిటైర్డ్‌ ఉద్యోగి నుంచి ఏకంగా రూ.33లక్షలు కాజేశారు కేటుగాళ్లు. బాధితుడి ఫిర్యాదుతో ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సైబర్ కేటుగాళ్లు అమాయకులను, విశ్రాంత ఉద్యోగులను లక్ష్యంగా చేసుకుని సరికొత్త రీతిలో బురిడీ కొట్టిస్తున్నారు. అధిక లాభాలు వస్తాయనే ఆశ చూపి లక్షల రూపాయలు కొల్లగొడుతున్నారు. తాజాగా సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ ప్రాంతానికి చెందిన మాణిక్ రెడ్డి అనే రిటైర్డ్ ఉద్యోగి సైబర్ నేరగాళ్ల బారినపడి ఏకంగా రూ. 33 లక్షలు పోగొట్టుకున్నారు. అపెక్స్ డిజిటల్ క్యాపిటల్ పేరిట ఒక వాట్సాప్ గ్రూప్‌లో ఇతడిని చేర్చిన ఖలేజాలు, ఆన్‌లైన్ స్టాక్ ట్రేడింగ్ ద్వారా తక్కువ సమయంలోనే ఊహించని లాభాలు గడించవచ్చని నమ్మబలికారు. నిందితుల మాయమాటలు నమ్మిన బాధితుడు వారు సూచించిన నకిలీ ట్రేడింగ్ యాప్‌ను తన ఫోన్‌లో డౌన్‌లోడ్ చేసుకుని, పలు దఫాలుగా తన బ్యాంక్ ఖాతాల నుంచి దాదాపు 33 లక్షల రూపాయలను బదిలీ చేశారు. యాప్‌లో వర్చువల్‌గా భారీగా లాభాలు కనిపిస్తుండటంతో అది నిజమైన లాభమేనని బాధితుడు నమ్మాడు. అయితే, ఆ తర్వాత నిందితులు మరో అడుగు ముందుకేసి ఐపీఓ పెట్టుబడుల పేరుతో అదనంగా మరికొంత డబ్బు చెల్లించాలని డిమాండ్ చేయడంతో మాణిక్ రెడ్డికి అనుమానం వచ్చింది. తాను పెట్టిన పెట్టుబడిని, వచ్చిన లాభాలను విత్‌డ్రా చేసుకోవడానికి ప్రయత్నించగా సాంకేతిక కారణాలు చూపుతూ డబ్బు రావడాన్ని నిలిపివేశారు. దీంతో తాను మోసపోయానని గ్రహించిన బాధితుడు వెంటనే సంగారెడ్డి సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించి రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. నిందితుల వాట్సాప్ నంబర్లు, బ్యాంక్ ఖాతాల ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకుని ముమ్మరంగా దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనపై రంగంలోకి దిగిన సైబర్ క్రైమ్ పోలీసులు బాధితుడు డబ్బులు బదిలీ చేసిన వివిధ మ్యూల్ బ్యాంక్ ఖాతాలను ప్రాథమికంగా గుర్తించి, వాటిని ఫ్రీజ్ చేసేందుకు చర్యలు చేపట్టారు. అలాగే ఈ సైబర్ గ్యాంగ్ వెనుక ఉన్న సూత్రధారులను పట్టుకోవడానికి డిజిటల్ ఆధారాలను విశ్లేషిస్తున్నారు. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా, వాట్సాప్‌లలో వచ్చే పార్ట్‌టైమ్ జాబ్స్, అధిక లాభాలు ఇచ్చే స్టాక్ ట్రేడింగ్ యాప్‌ల పట్ల ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. సెబీ గుర్తింపు లేని ఏ రకమైన థర్డ్ పార్టీ యాప్‌లలోనూ పెట్టుబడులు పెట్టవద్దని, ఒకవేళ మోసపోతే వెంటనే 1930 టోల్ ఫ్రీ నంబర్‌కు లేదా cybercrime వెబ్‌సైట్‌లో ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు.

2 hrs ago
user_ఎనగందుల కొమురయ్య
ఎనగందుల కొమురయ్య
ములుగు, ములుగు, తెలంగాణ•
2 hrs ago
2753c6ce-edb3-4f4c-9918-82d056971eeb

More news from తెలంగాణ and nearby areas
  • ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో పెద్ది సుదర్శన్ రెడ్డి అంత్యక్రియలు జూలై 31 . నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి గారి అంత్యక్రియలు శుక్రవారం ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు నర్సంపేట ఆర్డీవో ఉమారాణి నల్లబెల్లి లో నిర్వహించే అంతిమ సంస్కారానికి హాజరై నివాళులర్పించారు.అంతిమయాత్రలో ప్రభుత్వ అధికారిక లాంఛనాల మధ్య గౌరవ వందనం నిర్వహించారు. అంతిమ యాత్ర లో ప్రజా ప్రతినిధులు , జిల్లా అధికారులు, కుటుంబ సభ్యులు, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై అంతిమ నివాళులర్పించారు.
    1
    ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో పెద్ది సుదర్శన్ రెడ్డి అంత్యక్రియలు
జూలై 31 . నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి గారి అంత్యక్రియలు శుక్రవారం  ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో ఘనంగా నిర్వహించారు.  ప్రభుత్వ ఆదేశాల  మేరకు నర్సంపేట ఆర్డీవో ఉమారాణి  నల్లబెల్లి లో నిర్వహించే  అంతిమ సంస్కారానికి హాజరై  నివాళులర్పించారు.అంతిమయాత్రలో ప్రభుత్వ అధికారిక లాంఛనాల మధ్య గౌరవ వందనం నిర్వహించారు.
అంతిమ యాత్ర లో ప్రజా ప్రతినిధులు , జిల్లా అధికారులు,  కుటుంబ సభ్యులు, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై అంతిమ నివాళులర్పించారు.
    user_Chetty:Ramesh
    Chetty:Ramesh
    నర్సంపేట, వరంగల్, తెలంగాణ•
    13 hrs ago
  • డప్పు కొట్టి రైతులకు పంట మార్పిడిపై అవగాహన కల్పించిన వ్యవసాయ అధికారి మహబూబాబాద్ జిల్లా బయ్యారంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో పంట మార్పిడిపై వినూత్న అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వ్యవసాయ శాఖ అధికారి రాజు డప్పు కొడుతూ రైతులతో కలిసి గ్రామంలో ర్యాలీ నిర్వహించి పంట మార్పిడి ప్రాధాన్యతను వివరించారు. వరి, మొక్కజొన్న పంటల్లో అధిక యూరియా వినియోగం వల్ల నేల సారం తగ్గి దిగుబడులపై ప్రతికూల ప్రభావం పడుతుందని రైతులకు అవగాహన కల్పించారు. పాటల ద్వారా పంట మార్పిడి ప్రయోజనాలను వివరించారు.
    1
    డప్పు కొట్టి రైతులకు పంట మార్పిడిపై అవగాహన కల్పించిన వ్యవసాయ అధికారి
మహబూబాబాద్ జిల్లా బయ్యారంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో పంట మార్పిడిపై వినూత్న అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వ్యవసాయ శాఖ అధికారి రాజు డప్పు కొడుతూ రైతులతో కలిసి గ్రామంలో ర్యాలీ నిర్వహించి పంట మార్పిడి ప్రాధాన్యతను వివరించారు. వరి, మొక్కజొన్న పంటల్లో అధిక యూరియా వినియోగం వల్ల నేల సారం తగ్గి దిగుబడులపై ప్రతికూల ప్రభావం పడుతుందని రైతులకు అవగాహన కల్పించారు. పాటల ద్వారా పంట మార్పిడి ప్రయోజనాలను వివరించారు.
    user_M D Azizuddin
    M D Azizuddin
    జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    6 hrs ago
  • గోదావరి తల్లికి వాయనం సమర్పించిన ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ను రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ సందర్శించారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు లో వరద నీటిని పరిశీలించారు. అనంతరం గోదావరి తల్లికి వాయనం సమర్పించారు.
    1
    గోదావరి తల్లికి వాయనం సమర్పించిన ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్
శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ను రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ సందర్శించారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు లో వరద నీటిని పరిశీలించారు. అనంతరం గోదావరి తల్లికి వాయనం సమర్పించారు.
    user_Telangana reporter
    Telangana reporter
    Local News Reporter రామగుండం, పెద్దపల్లి, తెలంగాణ•
    5 hrs ago
  • పాత కూరగాయలమార్కెట్ నిర్మాణాల కూల్చివేతలపై వ్యాపారులు, రాజకీయ నాయకుల నిరసన .. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు... పాత కూరగాయలమార్కెట్ నిర్మాణాల కూల్చివేతలపై వ్యాపారులు, రాజకీయ నాయకుల నిరసన .. ఇల్లందు పట్టణంలో గత ఐదు దశాబ్దాలుగా వినియోగించుకున్న పాత కూరగాయల మార్కెట్ ప్రాంగణంలోని కొన్ని దుకాణ సముదాయాలను మున్సిపల్ సిబ్బంది జేసీబీ సహాయంతో కూల్చివేతలను ప్రారంభించడంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. తమకు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చివేతలు చేయడం పట్ల కొందరు చిరు వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేయగా వారికి పలురాజకీయ పార్టీల నాయకులు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా పలుపార్టీల నాయకులు మాట్లాడుతూ ఆక్రమణలు ఏమైనా ఉంటే వ్యాపారులకు నోటీసులు అందజేసి తొలగిస్తే తమకు అభ్యంతరం లేదని కానీ ఇల్లందు పట్టణంలో ఎన్నో అక్రమ నిర్మాణాలు ఉన్నప్పటికీ కేవలం కూరగాయలు అమ్ముకునే చిరువ్యాపార నిర్మాణాలను తొలగించడం సరికాదన్నారు. కూల్చివేతలను నిరసిస్తూ రోడ్డుపై బయటాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ అంశంలో అన్ని రాజకీయ పార్టీలతో కలసి కార్యాచరణ రూపొందిస్తామని వెంటనే ఆక్రమణల పేరుతో చిరువ్యాపారులను ఇబ్బందులకు గురి చేయవద్దని డిమాండ్ చేశారు.. కూరగాయల వ్యాపారుల రాజకీయ నాయకుల నిరసనలతో కూల్చివేత పనులను మున్సిపల్ సిబ్బంది నిలిపివేశారు
    1
    పాత కూరగాయలమార్కెట్ నిర్మాణాల కూల్చివేతలపై వ్యాపారులు, రాజకీయ నాయకుల నిరసన ..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు...
పాత కూరగాయలమార్కెట్ నిర్మాణాల కూల్చివేతలపై వ్యాపారులు, రాజకీయ నాయకుల నిరసన ..
ఇల్లందు పట్టణంలో గత ఐదు దశాబ్దాలుగా వినియోగించుకున్న పాత కూరగాయల మార్కెట్ ప్రాంగణంలోని కొన్ని దుకాణ సముదాయాలను మున్సిపల్ సిబ్బంది జేసీబీ సహాయంతో కూల్చివేతలను ప్రారంభించడంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. తమకు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చివేతలు చేయడం పట్ల కొందరు చిరు వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేయగా వారికి పలురాజకీయ పార్టీల నాయకులు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా పలుపార్టీల నాయకులు మాట్లాడుతూ ఆక్రమణలు ఏమైనా ఉంటే వ్యాపారులకు నోటీసులు అందజేసి తొలగిస్తే తమకు అభ్యంతరం లేదని కానీ ఇల్లందు పట్టణంలో ఎన్నో అక్రమ నిర్మాణాలు ఉన్నప్పటికీ కేవలం కూరగాయలు అమ్ముకునే చిరువ్యాపార నిర్మాణాలను తొలగించడం సరికాదన్నారు. కూల్చివేతలను నిరసిస్తూ రోడ్డుపై బయటాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ అంశంలో అన్ని రాజకీయ పార్టీలతో కలసి కార్యాచరణ రూపొందిస్తామని వెంటనే ఆక్రమణల పేరుతో చిరువ్యాపారులను ఇబ్బందులకు గురి చేయవద్దని డిమాండ్ చేశారు.. కూరగాయల వ్యాపారుల రాజకీయ నాయకుల నిరసనలతో కూల్చివేత పనులను మున్సిపల్ సిబ్బంది నిలిపివేశారు
    user_Shekar Thaduri
    Shekar Thaduri
    ఎల్లందు, భద్రాద్రి కొత్తగూడెం, తెలంగాణ•
    11 hrs ago
  • ఇల్లంతకుంట :వాణినికేతన్ హైస్కూల్లో ఘనంగా పోచమ్మ బోనాలు. రాజన్న సిరిసిల్ల జిల్లా మానకొండూర్ నియోజకవర్గం ఇల్లంతకుంట మండలం కేంద్రంలోని వాణి నికేతన్ హై స్కూల్లో పోచమ్మ బోనాలు ఘనంగా నిర్వహించారు. పాఠశాల ఆవరణలో పోచమ్మ చిత్రపటం వద్ద శనివారం పూజలు నిర్వహించారు. సాంప్రదాయ దుస్తులు ధరించి వచ్చిన విద్యార్థినిలు పోచమ్మ బోనాలు ఎత్తుకున్నారు. డప్పు చప్పుళ్ళు, పోతరాజుల విన్యాసాల మధ్య బస్టాండ్ వరకు ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా విద్యార్థుల సంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. అనంతరం పోచమ్మ ఆలయానికి చేరుకొని నైవేద్యం సమర్పించారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ తూముకుంట శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతికి ప్రతీక అయిన బోనాల పండుగను పాఠశాలలో నిర్వహించడం గర్వకారణం అన్నారు. పిల్లలకు చదువుతోపాటు సాంప్రదాయాలు, ఆచారాలపై అవగాహన కల్పించాలని లక్ష్యంతో కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు. బోనాల పండుగ ఐక్యమత్యానికి, సంస్కృతికి నిదర్శనం అన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ తూముకుంట శ్రీనిధి, ఉపాధ్యాయనీలు సుమంగళి, శోభ, మహాలక్ష్మి, లావణ్య, సునంద, మౌనిక, కళ్యాణి, శమిమా, రేణుక, జలజ, శాంత, పద్మ, స్వాతి, రేణుక, సునీత, ఉష, ఉపాధ్యాయులు శ్రీనివాస్, రాజు, సంతోష్, రమేష్, రాజు, తిరుపతి లతోపాటు విద్యార్థులు పాల్గొన్నారు.
    1
    ఇల్లంతకుంట :వాణినికేతన్ హైస్కూల్లో ఘనంగా పోచమ్మ బోనాలు.
 
రాజన్న సిరిసిల్ల జిల్లా మానకొండూర్ నియోజకవర్గం ఇల్లంతకుంట మండలం కేంద్రంలోని  వాణి నికేతన్  హై స్కూల్లో  పోచమ్మ బోనాలు ఘనంగా నిర్వహించారు. పాఠశాల ఆవరణలో పోచమ్మ చిత్రపటం వద్ద శనివారం పూజలు నిర్వహించారు. సాంప్రదాయ దుస్తులు ధరించి వచ్చిన  విద్యార్థినిలు పోచమ్మ బోనాలు ఎత్తుకున్నారు.
డప్పు చప్పుళ్ళు, పోతరాజుల విన్యాసాల మధ్య బస్టాండ్ వరకు ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా విద్యార్థుల సంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. అనంతరం పోచమ్మ ఆలయానికి చేరుకొని నైవేద్యం సమర్పించారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ తూముకుంట శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతికి ప్రతీక అయిన బోనాల పండుగను పాఠశాలలో  నిర్వహించడం గర్వకారణం అన్నారు. పిల్లలకు చదువుతోపాటు  సాంప్రదాయాలు, ఆచారాలపై  అవగాహన  కల్పించాలని  లక్ష్యంతో  కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు. బోనాల పండుగ ఐక్యమత్యానికి, సంస్కృతికి నిదర్శనం అన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ తూముకుంట శ్రీనిధి, ఉపాధ్యాయనీలు సుమంగళి, శోభ, మహాలక్ష్మి, లావణ్య, సునంద, మౌనిక, కళ్యాణి, శమిమా, రేణుక, జలజ, శాంత, పద్మ,  స్వాతి, రేణుక, సునీత, ఉష, ఉపాధ్యాయులు శ్రీనివాస్, రాజు, సంతోష్, రమేష్, రాజు, తిరుపతి లతోపాటు విద్యార్థులు పాల్గొన్నారు.
    user_Bollam Saireddy జయం న్యూస్ మీడ
    Bollam Saireddy జయం న్యూస్ మీడ
    Interior designer Manakondur, Karimnagar•
    8 hrs ago
  • కోనారెడ్డి చెరువుకు కొత్త రూపు.. రూ.2 కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం వరంగల్ జిల్లా:వర్ధన్నపేట పట్టణంలోని చారిత్రాత్మక కోనారెడ్డి చెరువు సుందరీకరణ, చెరువు కట్ట మరమ్మతుల కోసం రూ.2 కోట్లకు పైగా నిధులు మంజూరైనట్లు ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు తెలిపారు. త్వరలోనే అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. చెరువును మోడల్ చెరువుగా తీర్చిదిద్ది, నాణ్యతా ప్రమాణాలతో నిర్ణీత గడువులో పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
    1
    కోనారెడ్డి చెరువుకు కొత్త రూపు.. రూ.2 కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం
వరంగల్ జిల్లా:వర్ధన్నపేట పట్టణంలోని చారిత్రాత్మక కోనారెడ్డి చెరువు సుందరీకరణ, చెరువు కట్ట మరమ్మతుల కోసం రూ.2 కోట్లకు పైగా నిధులు మంజూరైనట్లు ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు తెలిపారు. త్వరలోనే అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. చెరువును మోడల్ చెరువుగా తీర్చిదిద్ది, నాణ్యతా ప్రమాణాలతో నిర్ణీత గడువులో పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
    user_M D Azizuddin
    M D Azizuddin
    జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    8 hrs ago
  • ప్రియ స్నేహితు లారా ఆయనకు నూతన జ్ఞానం మీ జీవితంలో మెండుగా ఉండబోతుంది
    1
    ప్రియ స్నేహితు లారా ఆయనకు నూతన జ్ఞానం మీ జీవితంలో మెండుగా ఉండబోతుంది
    user_T. Raja simha
    T. Raja simha
    ఆత్మకూరు, హనుమకొండ, తెలంగాణ•
    16 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.