logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

అనంతపురం జిల్లా తాటిచెర్ల గ్రామ పరిధిలో రెండు చిరుతలు జింకలపై దాడి అనంతపురం రూరల్ మండలం తాటిచెర్ల గ్రామ పరిధిలో రెండు చిరుతలు జింకలపై దాడి చేసిన ఘటన కలకలం రేపింది. చిరుతల దాడిలో ఏడు జింకలు మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. దీంతో గ్రామస్థులు, రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అటవీశాఖ అధికారులు స్పందించి చిరుతల సంచారాన్ని గుర్తించి, జింకల సంరక్షణకు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. ఈ ఘటనపై అటవీ శాఖ అధికారులు స్పందించాల్సి ఉంది.

23 hrs ago
user_Merzaa Tv
Merzaa Tv
Local News Reporter కళ్యాణదుర్గ్, అనంతపురం, ఆంధ్రప్రదేశ్•
23 hrs ago
8bb82f7d-2215-4ee3-a159-9dcdfbab7f83

అనంతపురం జిల్లా తాటిచెర్ల గ్రామ పరిధిలో రెండు చిరుతలు జింకలపై దాడి అనంతపురం రూరల్ మండలం తాటిచెర్ల గ్రామ పరిధిలో రెండు చిరుతలు జింకలపై దాడి చేసిన ఘటన కలకలం రేపింది. చిరుతల దాడిలో ఏడు జింకలు మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. దీంతో గ్రామస్థులు, రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అటవీశాఖ అధికారులు స్పందించి చిరుతల సంచారాన్ని గుర్తించి, జింకల సంరక్షణకు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. ఈ ఘటనపై అటవీ శాఖ అధికారులు స్పందించాల్సి ఉంది.

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పరిధిలోని ముదిగల్లు గ్రామంలో చిరుత సంచారం కలకలం అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం ముదిగల్లు శివారులోని కొండపై చిరుత సంచారం కలకలం రేపింది. గమనించిన స్థానికులు భయంతో పరుగులు తీశారు. ఈ విషయాన్ని స్థానికులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. గత కొన్ని రోజులుగా గ్రామ శివారులోని కొండ గుట్టలో చిరుతలు సంచరిస్తున్నట్లు స్థానిక ప్రజలు చెప్పారు. చిరుతల సంచారంతో రైతులు, వ్యవసాయ కూలీలు పొలాలకు వెళ్లాలంటే భయపడుతున్నారు. అటవీ శాఖ అధికారులు వెంటనే స్పందించి చిరుతల నుంచి రక్షించాలని రైతులు కోరుతున్నారు.
    1
    కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పరిధిలోని ముదిగల్లు గ్రామంలో చిరుత సంచారం కలకలం
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం ముదిగల్లు శివారులోని కొండపై చిరుత సంచారం కలకలం రేపింది. గమనించిన స్థానికులు భయంతో పరుగులు తీశారు. ఈ విషయాన్ని స్థానికులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. గత కొన్ని రోజులుగా గ్రామ శివారులోని కొండ గుట్టలో చిరుతలు సంచరిస్తున్నట్లు స్థానిక ప్రజలు చెప్పారు. చిరుతల సంచారంతో రైతులు, వ్యవసాయ కూలీలు పొలాలకు వెళ్లాలంటే భయపడుతున్నారు. అటవీ శాఖ అధికారులు వెంటనే స్పందించి చిరుతల నుంచి రక్షించాలని రైతులు కోరుతున్నారు.
    user_Merzaa Tv
    Merzaa Tv
    Local News Reporter కళ్యాణదుర్గ్, అనంతపురం, ఆంధ్రప్రదేశ్•
    9 hrs ago
  • రాయదుర్గంలో అందర్నీ ఆకట్టుకున్న స్కూలుకు వెళ్తున్న గణనాథుడి ప్రతిమ రాయదుర్గం పట్టణంలో నిన్నటి దినం వివిధ ఆకృతులలో గణనాథులు కొలువు తీరాయి. అందులో భాగంగానే రైల్వే స్టేషన్ సమీపాన వరసిద్ధి వినాయక గ్రూప్ వారు ఏర్పాటు చేసిన ప్రత్యేక గణనాథుడు అందరినీ ఆకట్టుకున్నాడు. వీపుకి బ్యాగు తగిలించుకొని, యూనిఫామ్ దుస్తులు ధరించి చేతిలో వాటర్ బాటిల్ ధరించిన గణనాథుడు అందరిని ఆకట్టుకున్నారు. ప్రతి ఏటా ఏదో ఒక ప్రత్యేక విధానంలో గణనాథులను వరసిద్ధి వినాయక సంఘం సభ్యులు గణనాధులను కొలువు తీరుస్తున్నారు.
    1
    రాయదుర్గంలో అందర్నీ ఆకట్టుకున్న స్కూలుకు వెళ్తున్న గణనాథుడి ప్రతిమ
రాయదుర్గం పట్టణంలో నిన్నటి దినం వివిధ ఆకృతులలో గణనాథులు కొలువు తీరాయి. అందులో భాగంగానే రైల్వే స్టేషన్ సమీపాన వరసిద్ధి వినాయక గ్రూప్ వారు ఏర్పాటు చేసిన ప్రత్యేక గణనాథుడు అందరినీ ఆకట్టుకున్నాడు. వీపుకి బ్యాగు తగిలించుకొని, యూనిఫామ్ దుస్తులు ధరించి చేతిలో వాటర్ బాటిల్ ధరించిన గణనాథుడు అందరిని ఆకట్టుకున్నారు. ప్రతి ఏటా ఏదో ఒక ప్రత్యేక విధానంలో గణనాథులను వరసిద్ధి వినాయక సంఘం సభ్యులు గణనాధులను కొలువు తీరుస్తున్నారు.
    user_PHANI JOURNALIST
    PHANI JOURNALIST
    Local News Reporter రాయదుర్గం, అనంతపురం, ఆంధ్రప్రదేశ్•
    10 hrs ago
  • గణేశులను భక్తిశ్రద్ధలతో దర్శించుకున్న గుమ్మనూరు నారాయణ, కమలమ్మ గణేశులను భక్తిశ్రద్ధలతో దర్శించుకున్న గుమ్మనూరు నారాయణ, కమలమ్మ గుంతకల్లు, సెప్టెంబర్ 15: వినాయక చవితి సందర్భంగా అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన గణేశ విగ్రహాలను ఆలూరు నియోజకవర్గ బీజేపీ బీఎల్‌ఓ-1 గుమ్మనూరు నారాయణ, గుమ్మనూరు కమలమ్మ మంగళవారం భక్తిశ్రద్ధలతో దర్శించుకున్నారు. గుంతకల్లు పట్టణానికి చెందిన ప్రదీప్‌ ప్రత్యేక ఆహ్వానం మేరకు ఆయన ఏర్పాటు చేసిన గణేశ మండపాన్ని సందర్శించిన గుమ్మనూరు నారాయణ, కమలమ్మ ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారికి హారతి ఇచ్చారు. అనంతరం నిర్వాహకులను అభినందించారు. ఈ సందర్భంగా ప్రదీప్ ఏర్పాటు చేసిన గణేశ విగ్రహానికి గుమ్మనూరు నారాయణ రూ.50,000 విరాళాన్ని అందజేశారు. మరో గణేశ విగ్రహం నిర్వాహకులకు రూ.5,000 విరాళం అందించారు. వినాయక ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని ఈ సందర్భంగా ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గుంతకల్లు పట్టణ యువత, గుమ్మనూరు నారాయణ అభిమానులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
    2
    గణేశులను భక్తిశ్రద్ధలతో దర్శించుకున్న గుమ్మనూరు నారాయణ, కమలమ్మ

గణేశులను భక్తిశ్రద్ధలతో దర్శించుకున్న గుమ్మనూరు నారాయణ, కమలమ్మ
గుంతకల్లు, సెప్టెంబర్ 15: వినాయక చవితి సందర్భంగా అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన గణేశ విగ్రహాలను ఆలూరు నియోజకవర్గ బీజేపీ బీఎల్‌ఓ-1 గుమ్మనూరు నారాయణ, గుమ్మనూరు కమలమ్మ మంగళవారం భక్తిశ్రద్ధలతో దర్శించుకున్నారు.
గుంతకల్లు పట్టణానికి చెందిన ప్రదీప్‌ ప్రత్యేక ఆహ్వానం మేరకు ఆయన ఏర్పాటు చేసిన గణేశ మండపాన్ని సందర్శించిన గుమ్మనూరు నారాయణ, కమలమ్మ ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారికి హారతి ఇచ్చారు. అనంతరం నిర్వాహకులను అభినందించారు.
ఈ సందర్భంగా ప్రదీప్ ఏర్పాటు చేసిన గణేశ విగ్రహానికి గుమ్మనూరు నారాయణ రూ.50,000 విరాళాన్ని అందజేశారు. మరో గణేశ విగ్రహం నిర్వాహకులకు రూ.5,000 విరాళం అందించారు. వినాయక ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని ఈ సందర్భంగా ఆయన ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో గుంతకల్లు పట్టణ యువత, గుమ్మనూరు నారాయణ అభిమానులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
    user_చక్రం
    చక్రం
    Farmer ఆలూరు, కర్నూలు, ఆంధ్రప్రదేశ్•
    2 hrs ago
  • పులివెందుల లోని మైత్రి లే ఔట్ వినాయక స్వామి విగ్రహం వద్ద ఘర్షణ కడప జిల్లా..... పులివెందుల..... పులివెందుల లోని మైత్రి లే ఔట్ వినాయక స్వామి విగ్రహం వద్ద ఘర్షణ....... టిడిపికి చెందిన ఇద్దరు నాయకుల మధ్య ఘర్షణ..... గాలి లోకి ఒక రౌండ్ కాల్పులు చేసిన హజ్ కమిటీ డైరెక్టర్ మాహబూబ్ భాష గన్మెన్.... టిడిపి పార్టీ కి చెందిన పుష్ప నాథ్ రెడ్డి, విజయ్ కుమార్ రెడ్డి ల మధ్య ఘర్షణ...... విజయ్ కుమార్ ఇంటి వద్ద ఉన్న 3 వాహనాలు ధ్వంసం.....
    1
    పులివెందుల లోని మైత్రి లే ఔట్  వినాయక స్వామి విగ్రహం వద్ద ఘర్షణ

కడప జిల్లా.....
పులివెందుల.....
పులివెందుల లోని మైత్రి లే ఔట్  వినాయక స్వామి విగ్రహం వద్ద ఘర్షణ.......
టిడిపికి చెందిన ఇద్దరు నాయకుల మధ్య ఘర్షణ.....
గాలి లోకి ఒక రౌండ్ కాల్పులు చేసిన హజ్ కమిటీ డైరెక్టర్ మాహబూబ్ భాష గన్మెన్....
టిడిపి పార్టీ కి చెందిన పుష్ప నాథ్ రెడ్డి, విజయ్ కుమార్ రెడ్డి ల మధ్య ఘర్షణ...... 
విజయ్ కుమార్ ఇంటి వద్ద ఉన్న 3 వాహనాలు ధ్వంసం.....
    user_K. Ravi Sekhar
    K. Ravi Sekhar
    పులివెందుల, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    12 hrs ago
  • డప్పుల మోతలు.. నృత్యాలతో మారుమోగిన దైవందిన్నె.. ఆకట్టుకున్న వినాయక చవితి వేడుకలు దైవందిన్నెలో అంగరంగ వైభవంగా వినాయక చవితి వేడుకలు
    1
    డప్పుల మోతలు.. నృత్యాలతో మారుమోగిన దైవందిన్నె.. ఆకట్టుకున్న వినాయక చవితి వేడుకలు
దైవందిన్నెలో అంగరంగ వైభవంగా వినాయక చవితి వేడుకలు
    user_K AMPAIAH ACHARI
    K AMPAIAH ACHARI
    Local News Reporter ఎమ్మిగనూరు, కర్నూలు, ఆంధ్రప్రదేశ్•
    7 hrs ago
  • లక్ష్మి నరసింహ , ఈరన్న స్వామి వర్ల దేవస్థానం ఉరుకుంద హుండీ లెక్కింపు శ్రీ లక్ష్మి నరసింహ , ఈరన్న స్వామి వర్ల దేవస్థానం ఉరుకుంద హుండీ లెక్కింపు 14 రోజుల అమౌంట్ Rs.1,20,72,793/- అన్నదానం హుండీ Rs.10,76,772/- మొత్తం ,31,49,565/- సెంట్రల్ బ్యాంకు అఫ్ శ్రీలంక 50 రూపాయలు బంగారం : 31గ్రామ్స్ 770mg,వెండి : 14కేజీల 500గ్రామ్స్ * 2026 శ్రావణమాసం ఉత్సవాల సంబంధించి శ్రీ స్వామివారి హుండీ లెక్కింపు కార్యక్రమం దేవస్థానం డిప్యూటీ కమీషనర్ మరియు కార్యనిర్వహణాధికారి శ్రీమతి కె.వాణి ఆధ్వర్యంలో మరియు పాలకమండలి సభ్యులు ఆధ్వర్యంలో జరిగినది. ఈ కార్యక్రమంలో హుండీ పర్యవేక్షణ అధికారి శ్రీ బి.సుధాకర్ రెడ్డి, అసిస్టెంట్ కమీషనర్ కర్నూల్, దేవస్థాన పర్యవేక్షకులు మరియు సిబ్బంది, పోలీస్ సిబ్బంది, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్, ఉరుకుంద సిబ్బంది మరియు శ్రీ భ్రమరాంభ సేవాసమితి ఆదోని వారు పాల్గొనియున్నారు.
    2
    లక్ష్మి నరసింహ , ఈరన్న స్వామి వర్ల దేవస్థానం ఉరుకుంద
హుండీ లెక్కింపు
శ్రీ లక్ష్మి నరసింహ , ఈరన్న స్వామి వర్ల దేవస్థానం ఉరుకుంద
హుండీ లెక్కింపు
14 రోజుల అమౌంట్ Rs.1,20,72,793/-
అన్నదానం హుండీ Rs.10,76,772/-
మొత్తం ,31,49,565/-
సెంట్రల్ బ్యాంకు అఫ్ శ్రీలంక 50 రూపాయలు బంగారం : 31గ్రామ్స్ 770mg,వెండి : 14కేజీల 500గ్రామ్స్ *
2026 శ్రావణమాసం ఉత్సవాల సంబంధించి శ్రీ స్వామివారి హుండీ లెక్కింపు కార్యక్రమం దేవస్థానం డిప్యూటీ కమీషనర్ మరియు కార్యనిర్వహణాధికారి శ్రీమతి కె.వాణి  ఆధ్వర్యంలో మరియు పాలకమండలి సభ్యులు ఆధ్వర్యంలో జరిగినది. ఈ కార్యక్రమంలో హుండీ పర్యవేక్షణ అధికారి శ్రీ బి.సుధాకర్ రెడ్డి, అసిస్టెంట్ కమీషనర్ కర్నూల్, దేవస్థాన పర్యవేక్షకులు మరియు సిబ్బంది, పోలీస్ సిబ్బంది, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్, ఉరుకుంద సిబ్బంది మరియు శ్రీ భ్రమరాంభ సేవాసమితి ఆదోని వారు పాల్గొనియున్నారు.
    user_PENDEKALLU VEERANNA
    PENDEKALLU VEERANNA
    మంత్రాలయం, కర్నూలు, ఆంధ్రప్రదేశ్•
    1 hr ago
  • వేపచీరల తో మొక్కులు తీర్చుకున్న భక్తులు..ఘనంగా ప్రారంభం అయిన వేడుకలు రాయదుర్గం పట్టణం మధు సినిమా థియేటర్ సమీపాన వెలసిన మహిమాన్విత దుగ్గిలమ్మ జాతర వేడుకలు వైభవంగా ప్రారంభం అయ్యాయి.ఉదయం నాలుగు గంటల నుండే అమ్మవారి దర్శనానికి భక్తులను అనుమతించారు.వేపాచీరలతో భక్తులు పెద్ద ఎత్తున వారి వారి మొక్కులను తీర్చుకున్నారు.ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అర్బన్ సీఐ దేవానంద్ ఆధ్వర్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.అమ్మవారు భక్తులకు ప్రత్యేక అలంకరణలో దర్శనం ఇచ్చింది.
    1
    వేపచీరల తో మొక్కులు తీర్చుకున్న భక్తులు..ఘనంగా ప్రారంభం అయిన వేడుకలు
రాయదుర్గం పట్టణం మధు సినిమా థియేటర్ సమీపాన వెలసిన మహిమాన్విత దుగ్గిలమ్మ జాతర వేడుకలు వైభవంగా ప్రారంభం అయ్యాయి.ఉదయం నాలుగు గంటల నుండే అమ్మవారి దర్శనానికి భక్తులను అనుమతించారు.వేపాచీరలతో భక్తులు పెద్ద ఎత్తున వారి వారి మొక్కులను తీర్చుకున్నారు.ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అర్బన్ సీఐ దేవానంద్ ఆధ్వర్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.అమ్మవారు భక్తులకు ప్రత్యేక అలంకరణలో దర్శనం ఇచ్చింది.
    user_PHANI JOURNALIST
    PHANI JOURNALIST
    Local News Reporter రాయదుర్గం, అనంతపురం, ఆంధ్రప్రదేశ్•
    12 hrs ago
  • పులివెందుల పట్టణంలోని మైత్రి లేఔట్లో అర్ధరాత్రి ఇరు వర్గాల ఘర్షణ సీసీ ఫుటేజ్ కడప జిల్లా పులివెందుల పట్టణంలోని మైత్రి లేఔట్లో అర్ధరాత్రి ఇరు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించిన సీసీ టీవీ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఓ నాయకుడి ఇంటి వద్దకు జనాలు గుంపుగా వెళ్లి కర్రలతో వాహనాలను ధ్వంసం చేస్తున్న దృశ్యాలు సీసీ ఫుటేజ్లో చూడవచ్చు. విషయం తెలుసుకున్న పోలీసులు మెరుపు వేగంతో ఘటనా స్థలానికి చేరుకుని జనాలను చల్లాచెదురు చేశారు.
    1
    పులివెందుల పట్టణంలోని మైత్రి లేఔట్లో అర్ధరాత్రి ఇరు వర్గాల ఘర్షణ సీసీ ఫుటేజ్
కడప జిల్లా పులివెందుల పట్టణంలోని మైత్రి లేఔట్లో అర్ధరాత్రి ఇరు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించిన సీసీ టీవీ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్
అవుతున్నాయి. ఓ నాయకుడి ఇంటి వద్దకు జనాలు గుంపుగా వెళ్లి కర్రలతో వాహనాలను ధ్వంసం చేస్తున్న దృశ్యాలు  సీసీ ఫుటేజ్లో చూడవచ్చు. విషయం
తెలుసుకున్న పోలీసులు మెరుపు వేగంతో ఘటనా స్థలానికి చేరుకుని జనాలను చల్లాచెదురు చేశారు.
    user_LAKKU SIVA SANKAR reddy
    LAKKU SIVA SANKAR reddy
    Court reporter పులివెందుల, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    9 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.