Shuru
Apke Nagar Ki App…
*ఏసీబీ దాడులు.. సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్‌లో ఆకస్మిక తనిఖీలు* హనుమకొండ జిల్లాలోని వడ్డేపల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులు చేపట్టారు. రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు అక్రమ రిజిస్ట్రేషన్లు చేస్తున్నారని సమాచారంతో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. ఏసీబీ అధికారులు కొద్దిసేపటి క్రితం సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్కు వెళ్లి ఆఫీస్ తలుపులు మూసి తనిఖీలు చేపట్టారు. ఏసీబీ వరంగల్ రేంజ్ డీఎస్పీ సాంబయ్య ఆధ్వర్యంలో రెండు బృందాలు ఆఫీస్లోని ఫైళ్లను స్వాధీనం చేసుకొని పరిశీలిస్తున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Tagore
*ఏసీబీ దాడులు.. సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్‌లో ఆకస్మిక తనిఖీలు* హనుమకొండ జిల్లాలోని వడ్డేపల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులు చేపట్టారు. రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు అక్రమ రిజిస్ట్రేషన్లు చేస్తున్నారని సమాచారంతో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. ఏసీబీ అధికారులు కొద్దిసేపటి క్రితం సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్కు వెళ్లి ఆఫీస్ తలుపులు మూసి తనిఖీలు చేపట్టారు. ఏసీబీ వరంగల్ రేంజ్ డీఎస్పీ సాంబయ్య ఆధ్వర్యంలో రెండు బృందాలు ఆఫీస్లోని ఫైళ్లను స్వాధీనం చేసుకొని పరిశీలిస్తున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
More news from తెలంగాణ and nearby areas
- రెండు వేల మంది పోలీసు సిబ్బందితో పటిష్ఠమైన భద్రతా ఏర్పాట్లు. హైదరాబాద్ ఉప్పల్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరగనున్న ఐపీఎల్ మ్యాచ్‌ల కోసం 2000 మంది పోలీసు సిబ్బందితో పటిష్ఠమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఉప్పల్ డీసీపీ సురేష్ కుమార్ తెలిపారు. ఈ నెల 5, మే 22 తేదీల్లో జరగబోయే మ్యాచ్‌ల కోసం భద్రతా ఏర్పాట్లపై హెచ్‌సీఏ కోశాధికారి అనిల్ కుమార్, జాయింట్ సెక్రటరీ బస్వరాజు, బీసీసీఐ అసిస్టెంట్ వెన్యూ మేనేజర్ వైభవ్, సన్‌రైజర్స్ ప్రతినిధి శర్వానన్‌లతో కలిసి ఆయన ఈ వివరాలు వెల్లడించారు. మల్కాజిగిరి ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాసులు కూడా ఈ ప్రెస్ మీట్‌లో పాల్గొన్నారు.1
- జనగామ జిల్లాలో తెలంగాణ సాయుధ పోరాట యోధుడు దొడ్డి కొమురయ్య జయంతిని ఘనంగా నిర్వహించారు. డీసీసీ అధ్యక్షురాలు లకావత్ ధన్వంతి ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కొమురయ్య పోరాట స్ఫూర్తి చిరస్మరణీయమని ఆమె పేర్కొన్నారు. కార్యక్రమంలో పీసీసీ సభ్యులు లక్ష్మీనారాయణ నాయక్, ఎర్రమల్ల సుధాకర్ తదితరులు పాల్గొని అమరుడి సేవలను స్మరించుకున్నారు.1
- కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పిన మాజీ మంత్రి జీవన్ రెడ్డి వారం పది రోజుల్లో ఏ పార్టీలో చేరేది క్లారిటీ ఇస్తానని చెప్పారు. రేవంత్ రెడ్డి సర్కార్ ను ఓడించే సత్తా గల పార్టీలో చేరతానని స్పష్టం చేశారు. జగిత్యాలలో విలేకరుల సమావేశంలో జీవన్ రెడ్డి మాట్లాడుతూ బీజేపీ, బీఆర్ఎస్ రెండు పార్టీలు తమపై అభిమానాన్ని చూపుతున్నాయని అందుకు ఆయా పార్టీల నేతలకు కృతజ్ఞతలు చెబుతున్నట్లు తెలిపారు. ఏ పార్టీలో చేరాలనేది అభిమానుల ఆలోచనలకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటామని త్వరలోనే ఫైనల్ నిర్ణయం ప్రకటిస్తానని తెలిపారు. గతంలో మార్పు రావాలని....కెసిఆర్ పోవాలని కోరుకున్నామని, పదేళ్ల తర్వాత ప్రజల్లో మార్పు వస్తే, ఇప్పుడు పరిస్థితి మారి, రెండేళ్లలో మార్పు రావాలి రేవంత్ రెడ్డి పోవాలి అనే పరిస్థితి వచ్చిందన్నారు. ప్రాణహిత నదీ జలాలను వినియోగించుకోకవడం, కాళేశ్వరం ప్రాజెక్టు మరమ్మతులు చేయడంలో రేవంత్ రెడ్డి సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని వీడి, వెంటనే కాళేశ్వరం ప్రాజెక్ట్ మరమ్మత్తు పనులు చేపట్టాలని, ప్రాణహిత నది జలాల వినియోగానికి తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజి నిర్మాణం చేపట్టాలని జీవన్ రెడ్డి చేశారు.1
- విశ్వహిందూ పరిషత్ బజరంగ్దళ్ ఆధ్వర్యంలో వీర హనుమాన్ విజయాత్ర ఆత్మ హిందూ బంధువులకు ఆహ్వానం ధైర్యం శక్తిసామర్థ్యాల ప్రతీక హనుమంతుడు తన అనంతబల పరాగ్రామాలతో రామ కార్యం సులభతరం చేసిన వీర హనుమాన్ శక్తులు అపారం తున్న విదర్మీల ఆకృత్యాలు ఎదుర్కోవడానికి హిందూ సమాజం నిలవాలంటే ప్రతి ఒక్కరు అనుమంతుని ఆదర్శంగా తీసుకొని ఐక్యత ప్రదర్శించాలన్నారు హిందూ సమాజ పరిరక్షణకు పూనుకోవాలన్నారు. మెదక్ పట్టణంలోని అభయ ఆంజనేయ స్వామి దేవాలయం వెల్కమ్బోడు వద్ద సాయంత్రం ఐదు గంటలకు విజయ యాత్ర ప్రారంభమవుతుందని సంయోజక్ మహేంద్ర పృథ్వీరాజ్ పిలుపునిచ్చారు ఈ యాత్రలో హిందూ బంధువులు అందరూ పాల్గొని విజయవంతం చేయాలన్నారు మీయొక్క వ్యాపారాలను రెండు గంటల పాటు వదిలి విజయాత్రలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలన్నారు.1
- ములకలకాలువ గ్రామ సభ1
- మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలోని ఓటాయి గ్రామంలో సాంప్రదాయ జానపద కళారూపమైన “యాదవ రాజుల కథ” ప్రదర్శన గ్రామ ప్రజలను విశేషంగా ఆకట్టుకుంది. ఎన్నో ఏళ్లుగా టెలివిజన్, సీరియళ్లకే పరిమితమైన వినోదానికి అలవాటు పడిన ప్రజలు, ముఖ్యంగా మహిళలు, ఇలాంటి చారిత్రక, సాంస్కృతిక కథనాలను ఆసక్తిగా వీక్షించడం గ్రామీణ సంస్కృతికి కొత్త ఊపును తీసుకొచ్చింది. గ్రామీణ కళాకారులు తమ సాంస్కృతిక వృత్తి ధర్మంలో భాగంగా మళ్లీ ఈ జానపద కళారూపాన్ని పునరుద్ధరించి ప్రజల ముందుకు తీసుకురావడం విశేషం. గతంలో పల్లెల్లో విస్తృతంగా వినిపించిన యాదవ రాజుల వీరగాథలు, కాలక్రమేణా కనుమరుగవుతున్న వేళ, ఇప్పుడు మళ్లీ గ్రామాల్లో కళాకారుల కంఠాల్లో ప్రతిధ్వనించడం స్థానికులను ఆనందానికి గురి చేసింది. ఈ ప్రదర్శనను చూడడానికి గ్రామ ప్రజలు, యువతి యువకులు పెద్ద సంఖ్యలో హాజరై భక్తిశ్రద్ధలతో, ఆసక్తితో కథను ఆలకించారు. చారిత్రక నేపథ్యంతో సాగిన ఈ కళారూపం ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా, పాత తరం జ్ఞాపకాలను తడిమింది. గ్రామీణ కళలు, జానపద సంప్రదాయాలు కేవలం వినోదమే కాకుండా, సమాజ చరిత్రను, జీవన విధానాన్ని, సంస్కృతిని తరతరాలకు అందించే గొప్ప వారసత్వమని పలువురు గ్రామ పెద్దలు అభిప్రాయపడ్డారు. ఇలాంటి జానపద కళారూపాలకు ప్రోత్సాహం లభిస్తే గ్రామీణ సంస్కృతి మరింత బలపడటంతో పాటు, కళాకారులకు కూడా గుర్తింపు, ఆదరణ లభిస్తుందని స్థానికులు పేర్కొన్నారు.1
- ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 316వ వర్ధంతి వేడుకలు. హైదరాబాద్ చిల్కానగర్ లో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 316వ వర్ధంతి వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా, నేర్ధం భాస్కర్ మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించకుండా అన్యాయం చేస్తోందని, బడ్జెట్ లో కూడా బీసీలను విస్మరించిందని ఆరోపించారు. అంబేద్కర్ ఇచ్చిన ఓటు ఆయుధంగా, రాబోయే ఎన్నికల్లో హైదరాబాద్ లోని మూడు కార్పొరేషన్లలో బీసీలను గెలిపించుకుంటామని ఆయన అన్నారు. పాపన్న స్ఫూర్తితో కుల సంఘాల నాయకులు పాల్గొని నివాళులర్పించారు.1
- కరీంనగర్ సమీపంలోని బొమ్మకల్ ఫ్లై ఓవర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. బొమ్మకల్ ఫ్లైఓవర్ సమీపంలో ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టింది. కారు నచ్చు నచ్చాయి కార్ల ప్రయాణిస్తున్న సయ్యద్ అబ్దుల్ రెహమాన్, సయ్యద్ అతియాబ్ హుస్సేన్ అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరికి గాయాలుకాగ ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. స్వల్ప గాయాలతో మరొకరు మాత్రమే బయటపడ్డారు. అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. కారు పూర్తిగా నుజ్జునుజ్జుకావడం చూస్తే ఎంత స్పీడులో ఉన్నారో అర్థం అవుతుంది. సంఘటన స్థలాన్ని పోలీసులు చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు ప్రమాదం పై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.3
- హన్మకొండ జిల్లా:ఎల్కతుర్తి మండల కేంద్రంలో గత నెల 31వ తేదీన జరిగిన చోరీ కేసులో నిందితుడిని అరెస్ట్ చేసినట్లు సిఐ పులి రమేష్ తెలిపారు. మండల కేంద్రానికి చెందిన నరిగె సంధ్య ఇంటికి తాళం వేసి బ్యాంకుకు వెళ్లి తిరిగి వచ్చేసరికి తాళం పగలగొట్టి ఉండగా పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇంట్లో బంగారం, వెండి, నగదు కలిపి సుమారు రూ.95 వేల విలువైన వస్తువులు చోరీకి గురైనట్లు గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టి నిందితుడిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.1