Shuru
Apke Nagar Ki App…
తెల్కపల్లి :నిబంధనలు పాటించి.. ప్రాణాలు కాపాడుకుందాం! ఎస్సై నరేష్ ప్రజా పాలన - ప్రగతి ప్రణాళికలో భాగంగా తెలకపల్లిలో రహదారి భద్రతపై అవగాహన కల్పించారు. ఎస్సై నరేష్ మాట్లాడుతూ.. హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించడం ద్వారా ప్రాణాపాయం నుంచి తప్పించుకోవచ్చన్నారు. మద్యం సేవించి వాహనాలు నడపరాదని హెచ్చరించారు. ఆపదలో ఉన్న వారిని కాపాడితే నగదు బహుమతి లభిస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో వైద్యులు సిబ్బందికి సీపీఆర్ పద్ధతులను వివరించారు. ఉత్తమ డ్రైవర్లను సన్మానించగా, స్థానిక ప్రజాప్రతినిధులు, ఆర్టీసీ సిబ్బంది మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.
MALLIKARJUN T
తెల్కపల్లి :నిబంధనలు పాటించి.. ప్రాణాలు కాపాడుకుందాం! ఎస్సై నరేష్ ప్రజా పాలన - ప్రగతి ప్రణాళికలో భాగంగా తెలకపల్లిలో రహదారి భద్రతపై అవగాహన కల్పించారు. ఎస్సై నరేష్ మాట్లాడుతూ.. హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించడం ద్వారా ప్రాణాపాయం నుంచి తప్పించుకోవచ్చన్నారు. మద్యం సేవించి వాహనాలు నడపరాదని హెచ్చరించారు. ఆపదలో ఉన్న వారిని కాపాడితే నగదు బహుమతి లభిస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో వైద్యులు సిబ్బందికి సీపీఆర్ పద్ధతులను వివరించారు. ఉత్తమ డ్రైవర్లను సన్మానించగా, స్థానిక ప్రజాప్రతినిధులు, ఆర్టీసీ సిబ్బంది మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.
More news from Medchal Malkajgiri and nearby areas
- Post by Shyam sunder Yadav Pulapally1
- సదాశివపేట మున్సిపాలిటీలో మంచినీటి సరఫరా కోసం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే తూర్పు జగ్గారెడ్డి1
- ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రజలందరూ భాగస్వాములు కావాలని టీజీఐసీ చైర్ పర్సన్ నిర్మల రెడ్డి అన్నారు. కంది లోని రైతు వేదికలో శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని చెప్పారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు ఇంటిగ్రేటెడ్ గురుకుల పాఠశాలను ఏర్పాటు చేస్తుందని పేర్కొన్నారు.1
- ఉపాధి హామీ పథకం పనిచేస్తున్నారు . డైలీ ఆరు గంటలకు వచ్చి పది గంటలకు వెళుతున్నారు కూలీలు సరిగా రావటం లేదు1
- మునగాల, సూర్యాపేట జిల్లా: ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ప్రభుత్వం నిర్వహిస్తున్న 'ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక' కార్యక్రమంలో విషాదం చోటుచేసుకుంది. అధికారుల నిర్లక్ష్యం, రాజకీయ జోక్యం ఓ నిరుపేద మహిళను ఆత్మహత్యాయత్నానికి ప్రేరేపించింది. జిల్లా కలెక్టర్, ఎస్పీ సమక్షంలోనే బాధితురాలు పురుగుల మందు తాగడం స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. అసలేం జరిగింది? మునగాల మండల కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్, జిల్లా ఎస్పీ నరసింహ మరియు ఇతర మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు. సభ జరుగుతుండగా, తాడ్వాయి గ్రామానికి చెందిన సునీత అనే మహిళ ఒక్కసారిగా అధికారుల ముందుకు వచ్చి తన వెంట తెచ్చుకున్న పురుగుల మందును తాగింది. దీన్ని గమనించిన పోలీసులు, సిబ్బంది వెంటనే ఆమెను అడ్డుకుని చికిత్స నిమిత్తం హుటాహుటిన కోదాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బాధితురాలి ఆవేదన: తాడ్వాయి గ్రామాన్ని ప్రభుత్వం 'ఇందిరమ్మ ఇళ్ల పైలెట్ ప్రాజెక్ట్' కింద ఎంపిక చేసింది. బాధిత మహిళ సునీత తెలిపిన వివరాల ప్రకారం: తన పేరు మీద ఇందిరమ్మ ఇల్లు మంజూరైనప్పటికీ, అధికారులు కావాలని దాన్ని వేరొకరికి కేటాయించారు. కాంగ్రెస్ నాయకులు తమ రాజకీయ పలుకుబడిని ఉపయోగించి, అర్హులకు అందాల్సిన సంక్షేమ పథకాలను అడ్డుకుంటున్నారని ఆమె ఆరోపించారు. పలుమార్లు అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోవడంతో, కలెక్టర్ ముందే తనువు చాలించాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అధికారుల స్పందన: ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితురాలికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. ఇళ్ల కేటాయింపులో ఏవైనా అక్రమలు జరిగాయా అనే కోణంలో విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. రాజకీయ కారణాలతో అర్హులకు అన్యాయం జరుగుతోందన్న ఆరోపణల నేపథ్యంలో మండలంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.1
- Post by Congress social media work1
- ఎమ్మిగనూరులో మారెమ్మ దేవి ఆలయంలో అలంకరణ పూజలు ఘనంగా నిర్వహణ1
- Post by Congress social media work1
- గజ్వేల్ లో ఈతకెళ్లి యువకుడి మృతి సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం గజ్వేల్ ఏప్రిల్ 16, గజ్వేల్ పట్టణానికి చెందిన యువకుడు కొలిచెలిమా మధు వయసు 25 సంవత్సరాలు ఎండలు బగ్గు మంటున్న కారణంగా పట్టణంలో గల స్విమ్మింగ్ పూల్ లో ఈతకెళ్లి మృత్యువాత పడ్డాడు, కుటుంబ సభ్యులు బంధువులు వెళ్లి స్విమ్మింగ్ పూల్ యాజమాన్యాన్ని ప్రశ్నించగా ఎవరు స్పందించడం లేదు. అందుచేత అందరూ కలిసి మాకు న్యాయం కావాలని పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద ధర్నాకు దిగారు. మాకు న్యాయం కావాలని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.4