*ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా ఫిర్యాది దారుల నుండి 34 ఫిర్యాదులను స్వీకరించిన పోలీస్ కమిషనర్* నిజామాబాదు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో *గౌరవనీయులు పోలీస్ కమిషనర్ శ్రీ పి.సాయి చైతన్య, ఐ.పి.ఎస్.,* గారు ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఫిర్యాదు దారుల సమస్యలను విని వాటిని చట్టప్రకారం పరిష్కరించాల్సిందిగా సంబందిత అధికారులకు పలు సూచనలు చేయడమైనది. సోమవారం నాడు ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదు దారుల నుండి అర్జీలను స్వీకరించి వాటిని తక్షణ పరిష్కారం కోసం సంబంధిత పోలీస్ స్టేషన్ ల యొక్క ఎస్.ఐ మరియు సి.ఐ లకు ఫోన్ ద్వారా మాట్లాడి సమస్య స్థితిని మరియు పరిష్కారానికి సూచనలు చేయడం జరిగింది. ప్రజలు నిర్భయంగా, మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా ఎలాంటి, పైరవీలు లేకుండా స్వచ్చందంగా పోలీసు సేవల్ని వినియోగించుకుంటూ, వారి వారి సమస్యలు చట్ట ప్రకారం పరిష్కరించుకునేలా, పోలీసులు ప్రజలకు మరింత దగ్గరయ్యేలా, శాంతి భద్రతలు పరిరక్షిస్తూ ముందుకు సాగడమే లక్ష్యంగా జిల్లా పోలీస్ శాఖ పని చేస్తుందని *గౌరవనీయులు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ పి. సాయి చైతన్య, ఐ.పి.ఎస్.,* గారు తెలియజేశారు. ప్రజా సమస్యలు పై ఫిర్యాదులు నేరుగా స్వీకరిస్తూ ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమం ద్వారా సమస్యలు పరిష్కారిస్తున్నాము అని తెలియజేశారు. *వివిధ ఫిర్యాదు లకు సంబందించిన 34 ఫిర్యాదు లను స్వీకరించారు.*
*ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా ఫిర్యాది దారుల నుండి 34 ఫిర్యాదులను స్వీకరించిన పోలీస్ కమిషనర్* నిజామాబాదు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో *గౌరవనీయులు పోలీస్ కమిషనర్ శ్రీ పి.సాయి చైతన్య, ఐ.పి.ఎస్.,* గారు ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఫిర్యాదు దారుల సమస్యలను విని వాటిని చట్టప్రకారం పరిష్కరించాల్సిందిగా సంబందిత అధికారులకు పలు సూచనలు చేయడమైనది. సోమవారం నాడు ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదు దారుల నుండి అర్జీలను స్వీకరించి వాటిని తక్షణ పరిష్కారం కోసం సంబంధిత పోలీస్ స్టేషన్ ల యొక్క ఎస్.ఐ మరియు సి.ఐ లకు ఫోన్ ద్వారా మాట్లాడి సమస్య స్థితిని మరియు పరిష్కారానికి సూచనలు చేయడం జరిగింది. ప్రజలు నిర్భయంగా, మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా ఎలాంటి, పైరవీలు లేకుండా స్వచ్చందంగా పోలీసు సేవల్ని వినియోగించుకుంటూ, వారి వారి సమస్యలు చట్ట ప్రకారం పరిష్కరించుకునేలా, పోలీసులు ప్రజలకు మరింత దగ్గరయ్యేలా, శాంతి భద్రతలు పరిరక్షిస్తూ ముందుకు సాగడమే లక్ష్యంగా జిల్లా పోలీస్ శాఖ పని చేస్తుందని *గౌరవనీయులు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ పి. సాయి చైతన్య, ఐ.పి.ఎస్.,* గారు తెలియజేశారు. ప్రజా సమస్యలు పై ఫిర్యాదులు నేరుగా స్వీకరిస్తూ ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమం ద్వారా సమస్యలు పరిష్కారిస్తున్నాము అని తెలియజేశారు. *వివిధ ఫిర్యాదు లకు సంబందించిన 34 ఫిర్యాదు లను స్వీకరించారు.*
- *ప్రజావాణి అర్జీలను సత్వరమే పరిష్కరించాలి* *జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ ప్రజావాణిలో వివిధ సమస్యలతో వచ్చే ప్రజల అర్జీలను సత్వరమే పరిష్కరించాలని *జిల్లా కలెక్టర్ ప్రతిమా అధికారులను ఆదేశించారు. సోమవారం, జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలోని మెయిన్ కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన ప్రజావాణిలో *అదనపు కలెక్టర్ నగేష్, జడ్పీ సీఈఓ ఎల్లయ్య తో కలిసి జిల్లా కలెక్టర్ ఫిర్యాదులను స్వీకరించి, పరిశీలించారు. ఈ సందర్భంగా *(74)* అర్జీలను *కలెక్టర్* స్వీకరించారు. వచ్చిన దరఖాస్తులను సంబంధిత శాఖల అధికారులకు కేటాయిస్తూ, ప్రజా సమస్యలపై తగిన చర్యలు తీసుకొని, త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేయాలని అధికారులకు సూచించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి వేదికగా ప్రజావాణి నిర్వహించినట్లు సూచించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు సిబ్బంది పాల్గొన్నారు1
- బోథ్ మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ లో తెలంగాణ రాష్ట్ర మార్కుఫెడ్ వారి ఆధ్వర్యంలో పీఏసీఎస్ బోథ్ ద్వారా ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని సోమవారం బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మొక్కజొన్న రైతులను ఎమ్మెల్యే సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ... రైతులకు న్యాయం జరిగేలా అధికారులు సహకరించాలని, ఎండలో రైతులను ఇబ్బందులు పెట్టొద్దని వీలైనంత త్వరగా పంటలను కొనుగోలు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.1
- రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం లో శంకర జయంతి మహోత్సవాలు భక్తిశ్రద్ధలతో వైభవంగా కొనసాగుతున్నాయి. 3వ రోజు అయిన సోమవారం సందర్భంగా ప్రత్యేక పూజలు, పారాయణాలు ఘనంగా నిర్వహించబడ్డాయి.ఈ మహోత్సవాలు వైశాఖ శుద్ధ పాడ్యమి నుండి పంచమి వరకు నాలుగు రోజులపాటు జరుగనున్నాయి. మహోత్సవాల్లో భాగంగా 3వ రోజు మూలమూర్తులైన లక్ష్మీ గణపతి స్వామివారికి అధర్వశీర్ష పఠనంతో అభిషేకాలు నిర్వహిస్తున్నారు. అలాగే శ్రీ రాజరాజేశ్వర స్వామివారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించగా, రాజరాజేశ్వరి దేవి అమ్మవారికి ఆలయ అర్చకులు ఆంతరంగికంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఉపనిషత్ భాష్య పారాయణం, వేద పారాయణాలు మరియు ఇతర విశిష్ట ధార్మిక కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ప్రతిరోజూ సాయంకాలం “శంకర విజయము”పై ప్రవచనాలు నిర్వహిస్తున్నారు. మహోత్సవాల చివరి రోజు అయిన పంచమి నాడు సాయంకాలం వేద సదస్సు నిర్వహించనున్నారు. అలాగే వైశాఖ మాస విశిష్టతను పురస్కరించుకుని వసంతోత్సవ పూజలు నిర్వహించి ఉత్సవాలను ఘనంగా ముగించనున్నారు.ఈ కార్యక్రమాలు రాజన్న ఆలయ అభివృద్ధిలో భాగంగా ఆలయ అర్చకులు ఏకాంతంగా నిర్వహిస్తున్నారు.1
- ఆవిడకు తెలంగాణ రాష్ట్రంపై ఉన్న ప్రేమ, కేసీఆర్ గారిపై ఉన్న అభిమానం వెలకట్టలేనిది. సత్తెమ్మ గారి పాడె మోసి, ఆవిడ పార్థివ దేహానికి నేడు నివాళులర్పించాము. తెలంగాణ మలిదశ ఉద్యమ సమయంలో ప్రతిరోజూ పాల్గొంటూ, "జై తెలంగాణ" నినాదమే ఊపిరిగా జీవించిన ధీరవనిత సత్తెమ్మ. స్వరాష్ట్ర సాధన కోసం వారు చేసిన పోరాటం, వారి అంకితభావం నేటి యువతకు స్ఫూర్తిదాయకం. 💐🙏🏼1
- మహనీయుల చరిత్ర కేవలం పాఠ్యపుస్తకాలకే పరిమితం కాకూడదని, వారి ఆశయాలను విద్యార్థులు వంటబట్టించుకోవాలని మంచిర్యాల అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ (ATC) ప్రిన్సిపల్ వై. రమేష్ పిలుపునిచ్చారు. మంగళవారం ఐటిఐ కళాశాల ఆవరణలో తెలంగాణ బహుజన విద్యార్థి సమాఖ్య (TBSF) ఆధ్వర్యంలో మహనీయుల జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని విద్యార్థినీ విద్యార్థులకు క్విజ్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో ప్రతిభ కనబరిచిన విజేతలకు ప్రిన్సిపల్ రమేష్ ముఖ్య అతిథిగా హాజరై బహుమతులు అందజేశారు. సామాజిక మార్పుకు విద్యే మార్గం ఈ సందర్భంగా టీబీఎస్ఎఫ్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ జాగిరి రాజేష్ మాట్లాడుతూ, దేశంలో విద్యా విప్లవానికి నాంది పలికిన ఘనత జ్యోతిరావు ఫూలేకు దక్కుతుందన్నారు. జ్యోతిరావు ఫూలే: తన భార్య సావిత్రి బాయి ఫూలేను విద్యావంతురాలిని చేసి, తద్వారా స్త్రీ విద్యకు బాటలు వేశారని కొనియాడారు. అంటరానితనం, అస్పృశ్యత వంటి సామాజిక రుగ్మతలపై ఆయన చేసిన పోరాటం మరువలేనిదని పేర్కొన్నారు. డా. బి.ఆర్. అంబేద్కర్: మహిళల హక్కుల రక్షణ కోసం హిందూ కోడ్ బిల్లును ప్రవేశపెట్టారని, అది పార్లమెంట్‌లో ఆమోదం పొందకపోవడంతో నైతిక బాధ్యతగా తన మంత్రి పదవికే రాజీనామా చేసిన గొప్ప త్యాగశీలి అంబేద్కర్ అని గుర్తుచేశారు. ప్రజలందరికీ సమానమైన ఓటు హక్కు కల్పించిన మహనీయుడు ఆయనేనని తెలిపారు. కార్యక్రమంలో పాల్గొన్న ప్రతినిధులు ఈ కార్యక్రమంలో టి.బి.ఎస్.ఎఫ్ జిల్లా అధ్యక్షుడు పైడిపల్లి సాయి కుమార్, ప్రధాన కార్యదర్శి జాగిరి రాజశేఖర్, గౌరవ అధ్యక్షుడు వేముల కిరణ్, ఐటీఐ ఉపాధ్యాయుడు రాజుతో పాటు అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. క్విజ్ పోటీల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని మహనీయుల జీవిత విశేషాలను చాటిచెప్పారు.2
- గన్నేరువరం మండలంలోని గుండ్లపల్లి గ్రామానికి చెందిన రైతు చాడ నాగిరెడ్డి సోమవారం తన మక్కలను మాదాపూర్ కొనుగోలు కేంద్రానికి తరలించే సమయంలో నష్టం వాటిల్లింది. గునుకుల కొండాపూర్–జంగపల్లి మార్గంలో కంకర రోడ్డు ఉండటంతో జంగపల్లి వద్ద ట్రాక్టర్ తీవ్ర కుదింపులకు గురై, సుమారు 3 క్వింటాళ్ల మక్కలు దాదాపు 100 మీటర్ల మేర రోడ్డుపాలయ్యాయి. రోడ్డు సదుపాయం లేక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, సంబంధిత అధికారులు వెంటనే స్పందించి రహదారిని మెరుగుపరచాలని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు.1
- ఘనంగా బసవేశ్వర జయంతి ఉత్సవాలు వృత్తిని దైవకార్యంగా భావించి కష్టపడి పనిచేయటమే నిజమైన దేశభక్తి అని బసవన్న గారి సందేశం నేటి సమాజానికి స్ఫూర్తిదాయకమని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అన్నారు. కలెక్టరేట్ కార్యాలయంలో బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ తరఫున నిర్వహించిన బసవేశ్వర 893 వ జయంతోత్సవం సందర్భంగా అదనపు కలెక్టర్ నగేష్, జడ్పీ సీఈఓ ఎల్లయ్య, జిల్లా అధికారులు వివిధ కుల సంఘాల నాయకులతో కలిసి కలెక్టర్ బసవేశ్వర చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ. బసవేశ్వరుడు సాంప్రదాయక సమాజంలో కుల, మత భేదాలకు వ్యతిరేకంగా పోరాడిన ఒక అభ్యుదయ వాది అని తెలిపారు మానవతా విలువలను ఆచరణలో పెట్టడం ద్వారా ఆ మహనీయుడి ఆశయాలు నేటి సమాజానికి స్ఫూర్తిదాయకమని తెలిపారు. కష్టపడి పని చేయడమే నిజమైన దేశభక్తి అనే బసవన్న గారి సందేశం నేటికీ కాలానుగుణ ఔచిత్యాన్ని చాటి చెబుతుందన్నారు. ఈ కార్యక్రమంలో వీరశైవ లింగాయత్ మెదక్ జిల్లా .లింగాయత్ సమాజం అధ్యక్షుడు లింగన్న గారి మల్లప్ప గౌరవ అధ్యక్షులు పి.డి ఆనందం జిల్లా జనరల్ సెక్రెటరీ వీరేశం కోశాధికారి ప్రభు కుమార్ శెట్టి శ్రీకాంత్ తప్ప నత్తటి సందీప్ కుమార్ తదితరులు వీరశైవ లింగాయత్ సభ్యులు పాల్గొన్నారు1
- నెరడిగొండ మండలంలోని బుద్దికొండ గ్రామంలో నూతనంగా గొల్ల నారాయణ నిర్మించిన ఇందిరమ్మ ఇల్లు గృప్రవేశానికి ముఖ్యఅతిథిగా బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ హాజరయి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ.. అర్హులందరికీ రెండవ విడతలో ఇల్లు అందేలా కృషి చేస్తానని అన్నారు. గ్రామంలో నిర్మిస్తున్న ఇండ్లను త్వరతరగతిన పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.1
- రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి వారిని సినీనటి పూనమ్ కౌర్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఆమె స్వామివారికి కోడె మొక్కులు చెల్లించారు. అనంతరం ఆలయ మండపంలో అర్చకులు, వేద పండితులు ఆమెకు ఆశీర్వచనం అందజేసి, స్వామివారి తీర్థప్రసాదాలను అందించారు.2