logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

28వ డివిజన్లోని శ్రీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మున్సిపల్ కార్పొరేషన్ పార్కు నందు నిన్న సాయంత్రం మూడు రోజులు పాటు జరిగిన యోగా శిక్షణ తరగతులు, ఈ కార్యక్రమానికి డివిజన్ కార్పొరేటర్ చెక్క అహల్య సాయి సునీల్ ,అపోలో న్యూరాలజిస్ట్ బిందుమినన్ గారు డివిజన్లోని మహిళలు అందరూ పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని హార్ట్ ఫుల్ ధ్యాన శిక్షణ వారు నిర్వహించడం జరిగింది.

on 26 May 2025
user_SRIHARI POONDLA
SRIHARI POONDLA
Nellore Urban, Spsr Nellore•
on 26 May 2025
6be621de-03af-4893-9353-cd09fa6730a1

28వ డివిజన్లోని శ్రీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మున్సిపల్ కార్పొరేషన్ పార్కు నందు నిన్న సాయంత్రం మూడు రోజులు పాటు జరిగిన యోగా శిక్షణ తరగతులు, ఈ కార్యక్రమానికి డివిజన్ కార్పొరేటర్ చెక్క అహల్య సాయి సునీల్ ,అపోలో న్యూరాలజిస్ట్ బిందుమినన్ గారు డివిజన్లోని మహిళలు అందరూ పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని హార్ట్ ఫుల్ ధ్యాన శిక్షణ వారు నిర్వహించడం జరిగింది.

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, దివంగత మహానేత డాక్టర్ వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి 77వ జన్మదినోత్సవం సందర్భంగా, నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం నార్త్ రాజుపాలెంలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. వైఎస్సార్ విగ్రహం వద్ద పార్టీ శ్రేణులు ఆయనకు ఘనంగా నివాళులర్పించాయి. కొడవలూరు మండల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో మాజీ మంత్రి, పి.ఎ.సి. సభ్యులు నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి, మాజీ డిసిఎంఎస్ చైర్మన్, సర్వేపల్లి నియోజకవర్గ పార్టీ పరిశీలకులు వీరి చలపతిరావు, అలాగే మాజీ ఆప్కాబ్ చైర్మన్ కొండూరు అనిల్ బాబు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
    4
    ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, దివంగత మహానేత డాక్టర్ వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి 77వ జన్మదినోత్సవం సందర్భంగా, నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం నార్త్ రాజుపాలెంలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. వైఎస్సార్ విగ్రహం వద్ద పార్టీ శ్రేణులు ఆయనకు ఘనంగా నివాళులర్పించాయి. కొడవలూరు మండల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో మాజీ మంత్రి, పి.ఎ.సి. సభ్యులు నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి, మాజీ డిసిఎంఎస్ చైర్మన్, సర్వేపల్లి నియోజకవర్గ పార్టీ పరిశీలకులు వీరి చలపతిరావు, అలాగే మాజీ ఆప్కాబ్ చైర్మన్ కొండూరు అనిల్ బాబు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
    user_Ravi Teja
    Ravi Teja
    Court reporter కోవూరు, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, ఆంధ్రప్రదేశ్•
    12 hrs ago
  • బద్వేలు నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో, జూలై 8న దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి 77వ జయంతిని ఘనంగా నిర్వహించారు. పోరుమామిళ్ల తో పాటు పులివీడు, గానుగపెంట, ఎస్. వెంకట్రామాపురం, చల్లగిరిగేలా, అగ్రహారం, తిరువెంగళాపురం, కొత్తూరు, రామేశ్వరం, కాలువ కట్ట గ్రామాల్లో జరిగిన ఈ కార్యక్రమాలకు మాజీ ప్రభుత్వ సలహాదారు పోతిరెడ్డి నాగార్జున్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నాగార్జున్ రెడ్డి మాట్లాడుతూ, వైఎస్ఆర్ హఠాత్ మరణంతో దేశం శోకసముద్రంలో మునిగిపోయిందని, తెలుగు రాష్ట్రాల్లో వందలాదిమంది ఆయన వార్తను తట్టుకోలేక మరణించారని గుర్తుచేశారు. ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్, సాగునీటి పథకాలు, డ్వాక్రా మహిళలకు చేయూత, యువతకు ఉపాధి కల్పన వంటి కార్యక్రమాలతో వైఎస్ఆర్ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచారని కొనియాడారు. తండ్రికి తగ్గ తనయుడిగా జగన్మోహన్ రెడ్డి గ్రామ సచివాలయ వ్యవస్థ, కొత్త మెడికల్ కాలేజీలు, ఆర్‌బీకేలు, సంక్షేమ పథకాలను అర్హుల ఇంటికే తీసుకొచ్చారని ఆయన ప్రశంసించారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తోందని నాగార్జున్ రెడ్డి ఆరోపించారు. మళ్లీ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చూడాలని ప్రజలు తీవ్రంగా కోరుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు.
    2
    బద్వేలు నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో, జూలై 8న దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి 77వ జయంతిని ఘనంగా నిర్వహించారు. పోరుమామిళ్ల తో పాటు పులివీడు, గానుగపెంట, ఎస్. వెంకట్రామాపురం, చల్లగిరిగేలా, అగ్రహారం, తిరువెంగళాపురం, కొత్తూరు, రామేశ్వరం, కాలువ కట్ట గ్రామాల్లో జరిగిన ఈ కార్యక్రమాలకు మాజీ ప్రభుత్వ సలహాదారు పోతిరెడ్డి నాగార్జున్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా నాగార్జున్ రెడ్డి మాట్లాడుతూ, వైఎస్ఆర్ హఠాత్ మరణంతో దేశం శోకసముద్రంలో మునిగిపోయిందని, తెలుగు రాష్ట్రాల్లో వందలాదిమంది ఆయన వార్తను తట్టుకోలేక మరణించారని గుర్తుచేశారు. ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్, సాగునీటి పథకాలు, డ్వాక్రా మహిళలకు చేయూత, యువతకు ఉపాధి కల్పన వంటి కార్యక్రమాలతో వైఎస్ఆర్ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచారని కొనియాడారు. తండ్రికి తగ్గ తనయుడిగా జగన్మోహన్ రెడ్డి గ్రామ సచివాలయ వ్యవస్థ, కొత్త మెడికల్ కాలేజీలు, ఆర్‌బీకేలు, సంక్షేమ పథకాలను అర్హుల ఇంటికే తీసుకొచ్చారని ఆయన ప్రశంసించారు.

ప్రస్తుత కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తోందని నాగార్జున్ రెడ్డి ఆరోపించారు. మళ్లీ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చూడాలని ప్రజలు తీవ్రంగా కోరుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు.
    user_జీ.మౌలాలి.
    జీ.మౌలాలి.
    Photographer బద్వేల్, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    5 hrs ago
  • కడప డీఆర్వో మల్లికార్జునుడు బిఎల్ఓ (బూత్ లెవెల్ ఆఫీసర్లు)లు 100 శాతం ఎస్ఐఆర్ (SIR) మ్యాపింగ్ ప్రక్రియను పూర్తి చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. బుధవారం సిద్దవటం మండలంలోని భాకరాపేట సచివాలయంలో బిఎల్ఓలు చేస్తున్న ఎస్ఐఆర్ పనులను పరిశీలించిన ఆయన, వారికి అవసరమైన సూచనలు, సలహాలు అందించారు. ఈ సందర్భంగా డీఆర్వో మాట్లాడుతూ, బిఎల్ఓలకు ఎన్యుమరేషన్ ఫారాలను డిజిటలైజ్ చేయడంలో సహాయం చేయడానికి అంగన్‌వాడీ కార్యకర్తలు మరియు ఎస్.హెచ్.జి విఓఏలను నియమించినట్లు తెలిపారు. జులై 14లోగా డబుల్ ఎంట్రీలు, చనిపోయిన వారి ఓట్లు, వలసదారుల ఓట్లను తొలగించి, మిగిలిన ఓటర్ల మ్యాపింగ్‌ను డిజిటలైజేషన్‌తో సహా పూర్తి చేయాలని ఆయన నిర్దేశించారు. ఈ నెల 12వ తేదీన ఎస్ఐఆర్ ప్రక్రియను తనిఖీ చేసేందుకు తాను మరోసారి వస్తానని, ఆ లోగా బిఎల్ఓలు తమ లక్ష్యాన్ని త్వరగా పూర్తి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ విజయ్ కుమార్ మరియు బిఎల్ఓలు పాల్గొన్నారు.
    1
    కడప డీఆర్వో మల్లికార్జునుడు బిఎల్ఓ (బూత్ లెవెల్ ఆఫీసర్లు)లు 100 శాతం ఎస్ఐఆర్ (SIR) మ్యాపింగ్ ప్రక్రియను పూర్తి చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. బుధవారం సిద్దవటం మండలంలోని భాకరాపేట సచివాలయంలో బిఎల్ఓలు చేస్తున్న ఎస్ఐఆర్ పనులను పరిశీలించిన ఆయన, వారికి అవసరమైన సూచనలు, సలహాలు అందించారు. ఈ సందర్భంగా డీఆర్వో మాట్లాడుతూ, బిఎల్ఓలకు ఎన్యుమరేషన్ ఫారాలను డిజిటలైజ్ చేయడంలో సహాయం చేయడానికి అంగన్‌వాడీ కార్యకర్తలు మరియు ఎస్.హెచ్.జి విఓఏలను నియమించినట్లు తెలిపారు. జులై 14లోగా డబుల్ ఎంట్రీలు, చనిపోయిన వారి ఓట్లు, వలసదారుల ఓట్లను తొలగించి, మిగిలిన ఓటర్ల మ్యాపింగ్‌ను డిజిటలైజేషన్‌తో సహా పూర్తి చేయాలని ఆయన నిర్దేశించారు. ఈ నెల 12వ తేదీన ఎస్ఐఆర్ ప్రక్రియను తనిఖీ చేసేందుకు తాను మరోసారి వస్తానని, ఆ లోగా బిఎల్ఓలు తమ లక్ష్యాన్ని త్వరగా పూర్తి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ విజయ్ కుమార్ మరియు బిఎల్ఓలు పాల్గొన్నారు.
    user_Patan Kwajamainuddin
    Patan Kwajamainuddin
    Local News Reporter సిధౌట్, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    13 hrs ago
  • ప్రియమైన దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామము ఘనత కలుగుగాక.
    1
    ప్రియమైన దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామము ఘనత కలుగుగాక.
    user_T. Raja simha
    T. Raja simha
    బద్వేల్, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    23 hrs ago
  • మదనపల్లె బైపాస్‌లో బుధవారం సాయంత్రం ఒక బొలెరో వాహనం అదుపుతప్పి బీభత్సం సృష్టించింది, మూడు ఇతర వాహనాలను ఢీకొట్టింది. తాలూకా ఎస్‌ఐ చంద్రమోహన్ తెలిపిన వివరాల ప్రకారం, విజయవాడకు చెందిన శ్రీనివాసులు మదనపల్లెకు వస్తుండగా, వర్షం కారణంగా బ్రేక్ వేయడంతో వాహనం అదుపుతప్పింది. రోడ్డు పక్కన మాట్లాడుకుంటున్న ముగ్గురు వ్యక్తులు ఈ ప్రమాదాన్ని గమనించి క్షణాల్లో పక్కకు తప్పుకోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో వాహనాలు దెబ్బతిన్నాయి.
    1
    మదనపల్లె బైపాస్‌లో బుధవారం సాయంత్రం ఒక బొలెరో వాహనం అదుపుతప్పి బీభత్సం సృష్టించింది, మూడు ఇతర వాహనాలను ఢీకొట్టింది. తాలూకా ఎస్‌ఐ చంద్రమోహన్ తెలిపిన వివరాల ప్రకారం, విజయవాడకు చెందిన శ్రీనివాసులు మదనపల్లెకు వస్తుండగా, వర్షం కారణంగా బ్రేక్ వేయడంతో వాహనం అదుపుతప్పింది. రోడ్డు పక్కన మాట్లాడుకుంటున్న ముగ్గురు వ్యక్తులు ఈ ప్రమాదాన్ని గమనించి క్షణాల్లో పక్కకు తప్పుకోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో వాహనాలు దెబ్బతిన్నాయి.
    user_V.V.NARAYANARAO
    V.V.NARAYANARAO
    పులిచెర్ల, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    7 hrs ago
  • జూలై 08న బద్వేల్‌లో ప్రియతమ దివంగత ముఖ్యమంత్రి, ఆరోగ్యశ్రీ పథక సృష్టికర్త, జలయజ్ఞ ప్రదాత డాక్టర్ వై.ఎస్. రాజశేఖరరెడ్డి 77వ జయంతి వేడుకలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘనంగా నిర్వహించింది. ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధా, ఎమ్మెల్సీ డిసి గోవిందరెడ్డి ఆదేశాల మేరకు, పట్టణ అధ్యక్షులు సుందర రామిరెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరిగాయి. బద్వేలు మున్సిపాలిటీ పరిధిలోని మైదుకూరు రోడ్డు, నెల్లూరు రోడ్డు, సిద్ధవటం రోడ్డు, ఎన్జీవో కాలనీలలో ఉన్న డాక్టర్ వైఎస్ఆర్ విగ్రహాలకు భారీ గజమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం స్థానిక శాలిమ అనాథాశ్రమంలో భారీ కేక్ కట్ చేసి, చిన్నారులు మరియు నిరాశ్రయులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, వైఎస్ఆర్ ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ, జలయజ్ఞం, రైతు సంక్షేమ పథకాలు ప్రజల గుండెల్లో చిరస్మరణీయంగా నిలిచిపోయాయని పేర్కొన్నారు. ఆయన ఆశయాలను ప్రతి కార్యకర్త ప్రజల్లోకి తీసుకెళ్లాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ వైస్ చైర్మన్లు గోపాల్ స్వామి, రాచపూడి సాయికృష్ణ, రాష్ట్ర బూత్ కన్వీనర్ కార్యదర్శి యద్ధారెడ్డి, అట్లూరు మండల అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి వంకెల పెద్ద పోలిరెడ్డి, స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ కేశవరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి సింగసాని శివయ్య, జిల్లా నేతలు నాగేశ్వరరావు, మాజీ కౌన్సిలర్లు, మండల అధ్యక్షులు, మున్సిపాలిటీ కార్యదర్శులు సహా పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
    2
    జూలై 08న బద్వేల్‌లో ప్రియతమ దివంగత ముఖ్యమంత్రి, ఆరోగ్యశ్రీ పథక సృష్టికర్త, జలయజ్ఞ ప్రదాత డాక్టర్ వై.ఎస్. రాజశేఖరరెడ్డి 77వ జయంతి వేడుకలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘనంగా నిర్వహించింది. ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధా, ఎమ్మెల్సీ డిసి గోవిందరెడ్డి ఆదేశాల మేరకు, పట్టణ అధ్యక్షులు సుందర రామిరెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరిగాయి.

బద్వేలు మున్సిపాలిటీ పరిధిలోని మైదుకూరు రోడ్డు, నెల్లూరు రోడ్డు, సిద్ధవటం రోడ్డు, ఎన్జీవో కాలనీలలో ఉన్న డాక్టర్ వైఎస్ఆర్ విగ్రహాలకు భారీ గజమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం స్థానిక శాలిమ అనాథాశ్రమంలో భారీ కేక్ కట్ చేసి, చిన్నారులు మరియు నిరాశ్రయులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, వైఎస్ఆర్ ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ, జలయజ్ఞం, రైతు సంక్షేమ పథకాలు ప్రజల గుండెల్లో చిరస్మరణీయంగా నిలిచిపోయాయని పేర్కొన్నారు. ఆయన ఆశయాలను ప్రతి కార్యకర్త ప్రజల్లోకి తీసుకెళ్లాలని వారు పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో మాజీ వైస్ చైర్మన్లు గోపాల్ స్వామి, రాచపూడి సాయికృష్ణ, రాష్ట్ర బూత్ కన్వీనర్ కార్యదర్శి యద్ధారెడ్డి, అట్లూరు మండల అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి వంకెల పెద్ద పోలిరెడ్డి, స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ కేశవరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి సింగసాని శివయ్య, జిల్లా నేతలు నాగేశ్వరరావు, మాజీ కౌన్సిలర్లు, మండల అధ్యక్షులు, మున్సిపాలిటీ కార్యదర్శులు సహా పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
    user_జీ.మౌలాలి.
    జీ.మౌలాలి.
    Photographer బద్వేల్, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    6 hrs ago
  • వైఎస్సార్ జిల్లాలోని బి.కోడూరు మండలం అత్రంపేట గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. అనూష అనే వివాహిత పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. పోరుమామిళ్ల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. అనూష మృతికి ఆమె భర్త, అత్త, మామలే కారణమని బంధువులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. అదనపు కట్నం కోసం వారి వేధింపులు భరించలేకనే అనూష ఆత్మహత్య చేసుకుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ, గత రెండు రోజులుగా నిందితులను అరెస్టు చేయకపోవడంపై బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో, నిందితులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ పోరుమామిళ్ల ప్రభుత్వ ఆసుపత్రి వద్ద మృతదేహంతో బంధువులు ధర్నాకు దిగారు.
    1
    వైఎస్సార్ జిల్లాలోని బి.కోడూరు మండలం అత్రంపేట గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. అనూష అనే వివాహిత పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. పోరుమామిళ్ల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది.

అనూష మృతికి ఆమె భర్త, అత్త, మామలే కారణమని బంధువులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. అదనపు కట్నం కోసం వారి వేధింపులు భరించలేకనే అనూష ఆత్మహత్య చేసుకుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ, గత రెండు రోజులుగా నిందితులను అరెస్టు చేయకపోవడంపై బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో, నిందితులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ పోరుమామిళ్ల ప్రభుత్వ ఆసుపత్రి వద్ద మృతదేహంతో బంధువులు ధర్నాకు దిగారు.
    user_Ponna Eswaraiah
    Ponna Eswaraiah
    Local News Reporter Sidhout, Y.S.R. (Kadapa)•
    13 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.