సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్ అయ్యప్ప స్వామి ఆలయంలో సోమవారం ఉత్తర నక్షత్రం సందర్భంగా ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమాల అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షులు బొగ్గుల సురేష్ మాట్లాడుతూ, అయ్యప్ప స్వామి అనుగ్రహంతో అందరూ బాగుండాలని కోరుకున్నారు. కోరిన కోర్కెలు నెరవేర్చే కొంగుబంగారంగా విరాజిల్లుతున్న ఈ ఆలయంలో స్వామివారిని దర్శించుకుంటే భక్తుల కోరికలు నెరవేరుతాయని వారి విశ్వాసం అని ఆయన తెలిపారు. ఆలయంలో ప్రతిరోజు ఉదయం, సాయంత్రం విశేష పూజా కార్యక్రమాలు జరుగుతాయని, ప్రతి నెల ఉత్తర నక్షత్రం పురస్కరించుకొని విశేష పూజలు, భజన కార్యక్రమాలు నిర్వహిస్తారని వివరించారు. ప్రతి ఒక్కరూ దైవభక్తి, సేవా భావం కలిగి ఉండాలని సురేష్ ఈ సందర్భంగా సూచించారు. ఈ కార్యక్రమంలో నాచారం దేవస్థానం డైరెక్టర్, అయ్యప్ప స్వామి ఆలయ కమిటీ ఉపాధ్యక్షులు జగ్గయ్యగారి శేఖర్, కోశాధికారి నారాయణరెడ్డి, మర్యాల శ్రీనివాస్, గందె యాదగిరి, కొండపాక శ్రీనివాస్, కైలాస ప్రశాంత్, యాదగిరి, సిద్ధి రామచంద్రం, సిరిపురం సత్యనారాయణ, ఆంజనేయులు, విక్రాంత్, గార్గ్ దీపక్, సత్యం, ఆంజనేయులు, నారాయణ రెడ్డి, ఎర్రవాడ యాదగిరి, లక్ష్మినర్సయ్య, ప్రవీణ్, గందే సంతోష్, ఉప్పల చంద్రశేఖర్, డెంటిస్ట్ శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.
సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్ అయ్యప్ప స్వామి ఆలయంలో సోమవారం ఉత్తర నక్షత్రం సందర్భంగా ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమాల అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షులు బొగ్గుల సురేష్ మాట్లాడుతూ, అయ్యప్ప స్వామి అనుగ్రహంతో అందరూ బాగుండాలని కోరుకున్నారు. కోరిన కోర్కెలు నెరవేర్చే కొంగుబంగారంగా విరాజిల్లుతున్న ఈ ఆలయంలో స్వామివారిని దర్శించుకుంటే భక్తుల కోరికలు నెరవేరుతాయని వారి విశ్వాసం అని ఆయన తెలిపారు. ఆలయంలో ప్రతిరోజు ఉదయం, సాయంత్రం విశేష పూజా కార్యక్రమాలు జరుగుతాయని, ప్రతి నెల ఉత్తర నక్షత్రం పురస్కరించుకొని
విశేష పూజలు, భజన కార్యక్రమాలు నిర్వహిస్తారని వివరించారు. ప్రతి ఒక్కరూ దైవభక్తి, సేవా భావం కలిగి ఉండాలని సురేష్ ఈ సందర్భంగా సూచించారు. ఈ కార్యక్రమంలో నాచారం దేవస్థానం డైరెక్టర్, అయ్యప్ప స్వామి ఆలయ కమిటీ ఉపాధ్యక్షులు జగ్గయ్యగారి శేఖర్, కోశాధికారి నారాయణరెడ్డి, మర్యాల శ్రీనివాస్, గందె యాదగిరి, కొండపాక శ్రీనివాస్, కైలాస ప్రశాంత్, యాదగిరి, సిద్ధి రామచంద్రం, సిరిపురం సత్యనారాయణ, ఆంజనేయులు, విక్రాంత్, గార్గ్ దీపక్, సత్యం, ఆంజనేయులు, నారాయణ రెడ్డి, ఎర్రవాడ యాదగిరి, లక్ష్మినర్సయ్య, ప్రవీణ్, గందే సంతోష్, ఉప్పల చంద్రశేఖర్, డెంటిస్ట్ శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.
- Post by KHADEER REPORTER1
- కొలనుపాక సోమేశ్వర ఆలయాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రకటించారు.1
- హరీష్ రావు రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేస్తూ, ఎవరైనా ప్రశ్నిస్తే ఆయన పగబడుతారని ఆరోపించారు. ప్రభుత్వం ఎస్బీఐకి కేటాయించిన భూమిని విక్రయించిన తర్వాత, ఇప్పుడు ప్రశ్నించినందుకు ఎస్బీఐని నిషేధిస్తానని రేవంత్ రెడ్డి అంటున్నారని హరీష్ రావు పేర్కొన్నారు. భవిష్యత్తులో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ), వరల్డ్ బ్యాంక్ కూడా రేవంత్ రెడ్డి మాట వినకపోతే వాటిని కూడా నిషేధిస్తాడంటూ హరీష్ రావు ఎద్దేవా చేశారు. చివరగా, రేవంత్ రెడ్డి వీటన్నింటినీ నిషేధించి కొత్తగా 'కొండల్ రెడ్డి బ్యాంక్' పెడతారేమో అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.1
- రైతులు యూరియా కోసం ఎరువుల దుకాణాల వద్ద గంటల తరబడి వేచి ఉండాల్సిన అవసరం లేదని జిల్లా వ్యవసాయ అధికారి దేవ్‌కుమార్ తెలిపారు. ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చిన ప్రత్యేక యాప్ ద్వారా రైతులు తమ ఇంటి వద్ద నుంచే యూరియాను బుక్ చేసుకోవచ్చని ఆయన స్పష్టం చేశారు. ఈ యాప్‌లో సమీపంలోని ఎరువుల దుకాణాల్లో ఎంత యూరియా నిల్వ ఉందో తెలుసుకునే సౌకర్యం ఉందని, దీనివల్ల రైతులు తమకు అవసరమైన దుకాణాన్ని ఎంపిక చేసుకుని ముందుగానే బుకింగ్ చేసుకోవచ్చని దేవ్‌కుమార్ వివరించారు. ఈ కొత్త విధానం వల్ల క్యూలైన్లు, రద్దీ, అనవసర ఇబ్బందులు తగ్గడంతో పాటు ఎరువుల పంపిణీలో పారదర్శకత పెరుగుతుందని ఆయన పేర్కొన్నారు. యూరియా కొరతపై రైతులు ఎవరూ ఆందోళన చెందవద్దని, అవసరమైన మేర నిల్వలు అందుబాటులో ఉన్నాయని దేవ్‌కుమార్ హామీ ఇచ్చారు. సాంకేతికతను సద్వినియోగం చేసుకొని రైతులు సులభంగా ఎరువులు పొందాలని ఆయన సూచించారు.1
- మెదక్ జిల్లాలో మాజీ మంత్రి హరీష్ రావు, కేటీఆర్ వ్యాఖ్యలు పూర్తిగా బాధ్యతారాహిత్యమని డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్ తీవ్రంగా విమర్శించారు. సోమవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మెదక్ జిల్లాకు శని పట్టడానికి హరీష్ రావు, కేటీఆర్ వల్లే కారణమని ధ్వజమెత్తారు. మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ప్రజలకు జవాబుదారీతనంతో పనిచేస్తున్న నాయకులని ఆంజనేయులు గౌడ్ అన్నారు. ఎమ్మెల్యే రోహిత్ రావు గానీ, మైనంపల్లి హనుమంతరావు గానీ కమిషన్ల కోసం రాజకీయాలు చేసే వ్యక్తులు కాదని స్పష్టం చేశారు. వారికి, బీఆర్ఎస్ నాయకులకూ మధ్య “నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా” ఉందని వ్యాఖ్యానించారు. మాజీ డిప్యూటీ స్పీకర్ చేసిన వ్యక్తిగత విమర్శలు తగవని, “బడిమియా–చోటిమియా” వంటి వ్యాఖ్యలను మానుకోవాలని సూచించారు. అభివృద్ధికి చిరునామాగా ఎమ్మెల్యే రోహిత్ రావు నిలుస్తున్నారని ఆయన కొనియాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో ప్రజలు సంతోషంగా ఉన్నారని, ప్రజల పూర్తి మద్దతు కాంగ్రెస్‌కే ఉందని ఆంజనేయులు గౌడ్ పేర్కొన్నారు. ఈ సమావేశంలో మునిసిపల్ చైర్‌పర్సన్ కానుగురాధిక, వైస్ చైర్మన్ నరేష్ గౌడ్, మెదక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గంగాధర్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు హఫీజుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.1
- చిక్కడపల్లిలో నిరుద్యోగులు మరోసారి రోడ్డెక్కి నిరసన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో పోలీసులు నిరుద్యోగులను అరెస్టు చేశారు. ప్రభుత్వం ఐదు వేల పోస్టులను భర్తీ చేస్తామని ప్రకటించగా, నిరుద్యోగులు 20 వేల కానిస్టేబుల్ ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరుద్యోగులు తమ ఆందోళనను తెలియజేశారు.1
- Post by KHADEER REPORTER1
- జనగామ జిల్లా దేవరుప్పుల మండలంలోని సూర్యాపేట–జనగామ ప్రధాన రహదారిపై దేవరుప్పుల పోలీస్ స్టేషన్ ఎదుట సోమవారం జరిగిన కారు, బైక్ ప్రమాదంలో ద్విచక్ర వాహనదారుడు తీవ్రంగా గాయపడ్డాడు. రక్తస్రావంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న బాధితుడికి సమయానికి అంబులెన్స్ అందుబాటులో లేకపోవడంతో, దేవరుప్పుల మండల పోలీసులు ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా మానవత్వంతో స్పందించారు. బాధితుడి ప్రాణం అమూల్యమని భావించి, పోలీసులు తమ వాహనంలోనే వెంటనే జనగామ జిల్లా కేంద్రంలోని ఏరియా ఆస్పత్రికి తరలించి, అత్యవసర చికిత్స అందేలా చర్యలు చేపట్టారు. అవసరమైన సమయంలో ప్రాణాలను కాపాడే మానవత్వం కూడా ఉంటుందని దేవరుప్పుల పోలీసులు మరోసారి నిరూపించారని, సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని పేర్కొన్నారు.1