Shuru
Apke Nagar Ki App…
*ఉగాదికి మరో డీఎస్సీ.. 3600 పోస్టుల భర్తీ చేసే అవకాశం* ▪️గతేడాది సిలబస్, నిబంధనలే ఈసారీ అమలు. ▪️పాఠశాల విద్యాశాఖ కసరత్తు పూర్తి రాష్ట్ర ప్రభుత్వం మరో డీఎస్సీ ప్రకటించేందుకు సిద్ధమైంది. ఏటా డీఎస్సీ నిర్వహిస్తామని ఇటీవల విద్య, ఐటీ శాఖల మంత్రి లోకేశ్ ఇచ్చిన హామీ మేరకు నోటిఫికేషన్ ప్రణాళిక సిద్ధం చేసింది. ఉగాది పండగ సందర్భంగా ఉపాధ్యాయ నియామకాలకు ప్రకటన విడుదల చేయాలని భావిస్తోంది. ఇప్పటికే క్షేత్రస్థాయి నుంచి ఖాళీల వివరాలను పాఠశాల విద్యాశాఖ సేకరించింది. అన్ని రకాల పోస్టులూ కలిపి 3,600 వరకు ఉండొచ్చు. ఆదర్శ పాఠశాలలు, ఏపీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇనిస్టిట్యూషన్లు, సంక్షేమ శాఖలకు చెందిన పాఠశాలల నుంచి ప్రాథమికంగా వివరాలు తీసుకున్నారు.
Journalist SIDDHU
*ఉగాదికి మరో డీఎస్సీ.. 3600 పోస్టుల భర్తీ చేసే అవకాశం* ▪️గతేడాది సిలబస్, నిబంధనలే ఈసారీ అమలు. ▪️పాఠశాల విద్యాశాఖ కసరత్తు పూర్తి రాష్ట్ర ప్రభుత్వం మరో డీఎస్సీ ప్రకటించేందుకు సిద్ధమైంది. ఏటా డీఎస్సీ నిర్వహిస్తామని ఇటీవల విద్య, ఐటీ శాఖల మంత్రి లోకేశ్ ఇచ్చిన హామీ మేరకు నోటిఫికేషన్ ప్రణాళిక సిద్ధం చేసింది. ఉగాది పండగ సందర్భంగా ఉపాధ్యాయ నియామకాలకు ప్రకటన విడుదల చేయాలని భావిస్తోంది. ఇప్పటికే క్షేత్రస్థాయి నుంచి ఖాళీల వివరాలను పాఠశాల విద్యాశాఖ సేకరించింది. అన్ని రకాల పోస్టులూ కలిపి 3,600 వరకు ఉండొచ్చు. ఆదర్శ పాఠశాలలు, ఏపీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇనిస్టిట్యూషన్లు, సంక్షేమ శాఖలకు చెందిన పాఠశాలల నుంచి ప్రాథమికంగా వివరాలు తీసుకున్నారు.
- Karra kranthi babuGuntur, Andhra Pradeshఎప్పుడు డీఎస్సీ అన్న మెడికల్ ఉద్యోగాలు కూడా వెళ్తే బాగానే ఉండింది34 min ago
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- RTCని ప్రైవేటీకరణ చేస్తే సహించం: JAC గుంటూరు:ఎలక్ట్రిక్ బస్సుల ముసుగులో ఆర్టీసీని ప్రైవేటీకరించేందుకు కుట్ర జరుగుతోందని గుంటూరు-2 డిపో ఎంప్లాయిస్ JAC ఆరోపించింది. కమిటీ ఆధ్వర్యంలో బుధవారం APSRTC ఉద్యోగులు గుంటూరు NTR బస్టాండ్ వద్ద రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఎలక్ట్రిక్ బస్సులను RTC సంస్థ నేరుగా నడపాలన్నారు. ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించవద్దని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే ఆమరణ నిరాహార దీక్షకు దిగుతామని పేర్కొన్నారు.1
- గుంటూరు జిల్లా:కొల్లిపర మండలంలోని గుదిబండి వారి పాలెంలో జరుగుతున్న ఆలయ వార్షికోత్సవాల్లో భాగంగా బుధవారం రెండో రోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ గణపతి, నవగ్రహ, దుర్గాదేవి హోమాలతో పాటు కనకదుర్గాదేవికి కలశ పూజ, కుంకుమార్చనలు శాస్త్రోక్తంగా జరిపారు. ఈ పూజా కార్యక్రమాల్లో చుట్టుపక్కల గ్రామాల నుంచి వందలాది భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.1
- విశాఖ తీరంలో జరుగుతున్న ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూలో, నేవీ సిబ్బంది గౌరవ వందనం స్వీకరించిన రాష్ట్రపతి. ఐఎఫ్ఆర్ కార్యక్రమంలో పాల్గొన్న గవర్నర్, సీఎం, డిప్యూటీ సీఎం.1
- *విజయవాడ 'మహాప్రస్థానం'లో ఉచితం మాయం.. డ్రైవర్ల ఇష్టారాజ్యం!* విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో మానవత్వం మంటగలుస్తోంది. మృతదేహాలను శ్మశానవాటికలకు తరలించేందుకు ప్రభుత్వం ఉచితంగా ప్రవేశపెట్టిన 'మహాప్రస్థానం' సేవలు ఇప్పుడు కాసుల వేటగా మారాయి. వాహనాలపై ఉన్న 'ఉచితం' అనే అక్షరాలను చెరిపేసి, బాధిత కుటుంబాల నుంచి డ్రైవర్లు అందినకాడికి దండుకుంటున్నారు. డ్రైవర్ బేటా పేరిట ఒక్కో మృతదేహానికి 700 నుంచి 1,000 రూపాయల వరకు వసూలు చేస్తుండటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.1
- మచిలీపట్నం పట్టణంలో ఆయుర్వేద వైద్య సేవలకు విశేష స్పందన లభిస్తోందని శుభకర ఆయుర్వేద వైద్యశాల వైద్యుడు రంగనాధ్ తెలిపారు. గత 18 సంవత్సరాలుగా నిరంతరంగా ప్రజలకు సేవలందించడం తనకు ఎంతో ఆనందంగా ఉందన్నారు. ప్రాచీన భారతీయ వైద్య విధానమైన ఆయుర్వేదాన్ని ఆధునిక చికిత్సా సదుపాయాలతో కలిపి ప్రజలకు చేరువ చేయడం తమ లక్ష్యమని చెప్పారు. ముఖ్యంగా కేరళ తరహా పంచకర్మ చికిత్సలు, క్షారసూత్ర విధానం ద్వారా మూలవ్యాధి నివారణ, జలూక చికిత్స ద్వారా రక్తశుద్ధి, శిరోధార ద్వారా మానసిక ఒత్తిడి తగ్గింపు వంటి ప్రత్యేక చికిత్సలను అందిస్తున్నామని వివరించారు. దీర్ఘకాలిక నొప్పులు, సంధివాతం, చర్మవ్యాధులు, జీర్ణ సంబంధ సమస్యలకు సహజసిద్ధమైన మందులతో మెరుగైన ఫలితాలు సాధిస్తున్నామన్నారు. అవసరమైన అన్ని ఆయుర్వేద ఔషధాలను స్థానికంగానే అందుబాటులో ఉంచి, తక్కువ ఖర్చుతో నాణ్యమైన సేవలు అందించడం తమ ప్రత్యేకతగా పేర్కొన్నారు. ఇకపై కూడా ప్రజల ఆరోగ్యమే ధ్యేయంగా మరింత మెరుగైన వైద్యసేవలు అందించేందుకు కృషి కొనసాగిస్తామని తెలిపారు.1
- ఆడపిల్ల గా పుట్టడం ఆ చిట్టి తల్లి చేసుకున్న కర్మ అని అందమా?.... సిగ్గుపడాలి ఈ సమాజం మన కంటే అడవిలో వుండే మృగాలు వంద రెట్లు బెటర్ గా వున్నాయి... తల్లి నీ మరణానికి కారణం ఈ సమాజమే ప్రతి ఒక్కరు బాద్యులే1
- నల్లజర్ల మండలం పోతవరంలో పొగాకు పనుల కోసం నందిగామ నుంచి వలస వచ్చిన ఎస్సీ కూలీల తాత్కాలిక పాకలను స్థానికుడు కరుటూరి సత్యనారాయణ, అతని కుమారుడు ధ్వంసం చేశారని కూలీలు వాపోయారు. వారి సామాగ్రిని, ఆహారాన్ని చిందరవందర చేయడంతో బాధితులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిరుపేద కూలీల ఆవాసాలను పడగొట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, తమకు రక్షణ కల్పించాలని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.1
- గుంటూరు జిల్లా ప్రజలు సైబర్ నేరాలపట్ల అప్రమత్తంగా ఉండాలని మంగళవారం SP వకుల్ జిందాల్ సూచించారు. ట్రాఫిక్ చలాన్ల చెల్లింపుల పేరుతో వాట్సాప్, ఇతర సామాజిక మాధ్యమాల ద్వారా RTOchallan.APK, echallan.APK ລ້ అనధికార లింకులు వస్తున్నాయని అన్నారు. ప్రజలు తెలియక ఈ లింకులను క్లిక్, డౌన్లోడ్ చేయడంవల్ల వారి మొబైల్ ఫోన్లు హ్యాక్కు గురవుతున్నాయన్నారు. వ్యక్తిగత సమాచారం, బ్యాంకింగ్ వివరాలు చోరీ అవుతాయన్నారు.1