ఎమ్మిగనూరులో ఘనంగా బీజేపీ జిల్లా కార్యవర్గ సమావేశం..!! ఎమ్మిగనూరులో ఘనంగా బీజేపీ జిల్లా కార్యవర్గ సమావేశం..!! స్థానిక ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల విజయమే లక్ష్యంగా పనిచేయాలి: పరిగెల మురళీకృష్ణ ఎమ్మిగనూరు: భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు, బీజేపీ కర్నూలు జిల్లా అధ్యక్షులు శ్రీ అక్కమ్మతోట రామకృష్ణ గారి ఆధ్వర్యంలో ఎమ్మిగనూరు పట్టణంలోని విశాల గార్డెన్‌లో బీజేపీ కర్నూలు జిల్లా కార్యవర్గ సమావేశం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ కర్నూలు జిల్లా ఇన్‌చార్జ్ శ్రీ సందిరెడ్డి శ్రీనివాసులు గారు, ఆదోని శాసనసభ్యులు డా. పార్థసారథి గారు, యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ సునీల్ రెడ్డి గారు, సీనియర్ నాయకులు శ్రీ పురుషోత్తం రెడ్డి గారు, శ్రీ చంద్రమౌళి గారు, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, కోడుమూరు మాజీ ఎమ్మెల్యే శ్రీ పరిగెల మురళీకృష్ణ గారు, రాష్ట్ర బిల్డింగ్ కమిటీ చైర్మన్ శ్రీ విట్టా రమేష్ గారు, రాష్ట్ర కార్యదర్శి శ్రీమతి గీతా మాధురి గారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, కోడుమూరు మాజీ ఎమ్మెల్యే శ్రీ పరిగెల మురళీకృష్ణ గారు మాట్లాడుతూ, త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పార్టీ శ్రేణులు సమష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు. బీజేపీ పార్టీ పోటీ చేసే ప్రతి స్థానంలో విజయం సాధించే విధంగా ఇప్పటి నుంచే పటిష్టమైన కార్యాచరణతో ముందుకు సాగాలని సూచించారు. కోడుమూరు నియోజకవర్గంలో పార్టీని గ్రామస్థాయి నుంచి మరింత బలోపేతం చేసేందుకు త్వరలోనే నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాల్లో జరిగే మండల కార్యవర్గ సమావేశాల్లో స్వయంగా పాల్గొంటానని మురళీకృష్ణ గారు తెలిపారు. ప్రతి గ్రామంలో పార్టీ కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ, ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతూ బీజేపీని బలోపేతం చేయాలని ఆయన అన్నారు. ఈ జిల్లా కార్యవర్గ సమావేశంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శులు శ్రీమతి మాలతీ గారు, శ్రీ నాగేశ్వరరావు గారు, వాల్మీకి రాష్ట్ర కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీ మురళీ నాయుడు గారు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రీ నాగరాజు యాదవ్ గారు, శ్రీ అంబలి కృష్ణ గారు, శ్రీ గురురాజ్ దేశాయ్ గారు, శ్రీ హుస్సేనప్ప యాదవ్ గారు, రాష్ట్ర, జిల్లా నాయకులు, వివిధ మోర్చాల జిల్లా అధ్యక్షులు, మండల అధ్యక్షులు, పట్టణ అధ్యక్షులు, మోర్చాల పదాధికారులు, కార్యవర్గ సభ్యులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. Bharatiya Janata Party (BJP) Narendra Modi Amit Shah Nitin Nabin BJP Andhra Pradesh PVN Madhav Madhukar Nukala BJP Kurnool District Akkamthota Ramakrishna Kowthalam

- ప్రత్యేకంగా రెండవ రోజు గణనాథునికి మంగళహారతులు ఇస్తున్న మహిళా మణులు ( కోడుమూరు శురు న్యూస్ ప్రతినిధి) కర్నూలు జిల్లా కోడుమూరు పట్టణంలో కోటకొండ సురేష్ ఇంటి సమీపంలో రెండవ రోజున గణనాథుని ప్రత్యేకంగా మహిళా మణులు మంగళ హారతులు ఇచ్చి గణనాథుని అనుగ్రహం ప్రసాదించాలని భక్తుల కోరిక.సంపూర్ణంగా వర్షాలు కురవాలని అందుకే ఇవాళ ఈ కార్యక్రమం ఏర్పాటు చేశామని మహిళా మణులు శురు న్యూస్ తో తెలిపారువారు.1
- భారత్ మాల రోడ్డు నుండి రాజోలి మండల కేంద్రానికి వెళ్లేందుకు కనెక్టివిటీ రోడ్డు నిర్మించాలి. రాజోలి మీదుగా వెళ్తున్న భారత్‌మాల రోడ్డు నిర్మాణ పనులు దాదాపు పూర్తయ్యాయని అయితే మండల కేంద్రమైన రాజోలికి కనెక్టివిటీ రోడ్డు లేకుండా నిర్మాణం జరుగుతోందని మండల కేంద్రానికి తప్పనిసరిగా కనెక్టివిటీ రోడ్డు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రాజోలి గ్రామస్తులు భారత్‌మాల రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తూ నిరంతరాయంగా మండల కేంద్రానికి ప్రజలు రాత్రి పగలు అని తేడా లేకుండా రాకపోకలు సాగిస్తుంటారు కాబట్టి మండల కేంద్రానికి కనెక్టివ్ రోడ్డు ను నిర్మించాలని డిమాండ్ చేశారు.1
- పత్రికా ప్రకటన నంద్యాల జిల్లా 15.09.2026 వినాయక నిమజ్జన ఘాట్‌లను పరిశీలించిన జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్, IPS. అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా పటిష్ట భద్రతా చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశం. ఆత్మకూరు:నంద్యాల జిల్లా. వినాయక నిమజ్జనం కార్యక్రమాలు ప్రశాంత వాతావరణంలో, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా నిర్వహించేందుకు జిల్లా పోలీస్ శాఖ ముందస్తు చర్యలు చేపడుతోంది. ఈ నేపథ్యంలో జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్, IPS నేడు ఆత్మకూరు సబ్ డివిజన్ పరిధిలోని *వెలుగోడు, ఆత్మకూరు, పాములపాడు జూపాడుబంగ్లా* మొదలగు పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉన్న వినాయక నిమజ్జన ఘాట్‌లను, మరియు ఊరేగింపు జరిగే ప్రధాన ప్రాంతాలను స్వయంగా ఎస్పీ సందర్శించి భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. నిమజ్జన ఘాట్‌ల వద్ద ఏర్పాటు చేసిన భద్రతా చర్యలు, ప్రజల రాకపోకలు, వాహనాల నియంత్రణ, పోలీస్ బందోబస్తు తదితర అంశాలపై సంబంధిత అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. వినాయక నిమజ్జనం సందర్భంగా భక్తులు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు చేపట్టాలని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని జిల్లా ఎస్పీ సంబంధిత పోలీస్ అధికారులను ఆదేశించారు. నిమజ్జన కార్యక్రమాలు సజావుగా జరిగేలా ఘాట్‌ల వద్ద నిరంతరం పోలీస్ సిబ్బంది అందుబాటులో ఉండాలని, రద్దీని క్రమబద్ధీకరించడంతో పాటు ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. అలాగే నిమజ్జన కార్యక్రమాల్లో పాల్గొనే ప్రజలు పోలీసులకు సహకరించి, పోలీస్ శాఖ సూచించిన భద్రతా నిబంధనలను పాటించాలని జిల్లా ఎస్పీ కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ తో పాటు ఆత్మకూరు డిఎస్పి రామంజి నాయక్ ,స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ అశోక్, సంబంధిత పోలీస్ అధికారులు పాల్గొన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయం నంద్యాల.4
- వినాయక నిమజ్జన ఘాట్‌లను పరిశీలించిన జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షొరాణ్, అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా పటిష్ట భద్రతా చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశం.. వినాయక నిమజ్జనం కార్యక్రమాలు ప్రశాంత వాతావరణంలో, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా నిర్వహించేందుకు జిల్లా పోలీస్ శాఖ ముందస్తు చర్యలు చేపడుతోంది. ఈ నేపథ్యంలో జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్, ఆత్మకూరు సబ్ డివిజన్ పరిధిలోని వెలుగోడు, ఆత్మకూరు, పాములపాడు జూపాడుబంగ్లా మొదలగు పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉన్న వినాయక నిమజ్జన ఘాట్‌లను, మరియు ఊరేగింపు జరిగే ప్రధాన ప్రాంతాలను స్వయంగా ఎస్పీ సందర్శించి భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. నిమజ్జన ఘాట్‌ల వద్ద ఏర్పాటు చేసిన భద్రతా చర్యలు, ప్రజల రాకపోకలు, వాహనాల నియంత్రణ, పోలీస్ బందోబస్తు తదితర అంశాలపై సంబంధిత అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. వినాయక నిమజ్జనం సందర్భంగా భక్తులు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు చేపట్టాలని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని జిల్లా ఎస్పీ సంబంధిత పోలీస్ అధికారులను ఆదేశించారు. నిమజ్జన కార్యక్రమాలు సజావుగా జరిగేలా ఘాట్‌ల వద్ద నిరంతరం పోలీస్ సిబ్బంది అందుబాటులో ఉండాలని, రద్దీని క్రమబద్ధీకరించడంతో పాటు ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. అలాగే నిమజ్జన కార్యక్రమాల్లో పాల్గొనే ప్రజలు పోలీసులకు సహకరించి, పోలీస్ శాఖ సూచించిన భద్రతా నిబంధనలను పాటించాలని జిల్లా ఎస్పీ గారు కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ గారితో పాటు ఆత్మకూరు డిఎస్పి రామంజి నాయక్ గారు ,స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ అశోక్, సంబంధిత పోలీస్ అధికారులు పాల్గొన్నారు.2
- వినాయక నిమజ్జనం వేడుకలు ప్రశాంతంగా జరుపుకోవాలి. డిజెలకు అనుమతి లేదు గణేష్ నిమజ్జన ఉత్సవాలు ప్రశాంతంగా జరుపుకోవాలని మహానంది ఎస్ఐఎన్ రామ్మోహన్ రెడ్డి సూచించారు. మంగళవారం అర్ధరాత్రి మహానంది మండలంలోని మండపాల నిర్వాహకులతో పలు సూచనలు చేశారు. నిమజ్జనాల సమయంలో డీజే లకు అనుమతి లేదన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు పాటించాలన్నారు. పోలీసుల సూచనలు పాటిస్తూ నిమజ్జన వేడుకలు జరుపుకోవాలని అన్నారు.1
- జూపాడుబంగ్లా మండల పరిధిలోని పోతిరెడ్డిపాడు 9వ గేటు మరమ్మతు పనులు పూర్తి జూపాడు బంగ్లా మండల పరిధిలోని పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వద్ద 9వ గేటుకు అధికారులు మరమ్మతు పనులు చేపట్టారు. రూ.2.40 లక్షలతో మరమతు పనులు పూర్తి చేసినట్లు ఇరిగేషన్ అధికారులు వెల్లడించారు. భవిష్యత్తులో రైతులకు ఎటువంటి తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా ఈ సమస్యకు ఉన్నతాధికారుల సహకారంతో సమస్యకు పరిష్కారం చూసినట్లు ఇరిగేషన్ అధికారులు తెలిపారు.1
- గణపతిని తెస్తుండగా జరిగిన దుర్ఘటన పటాస్ లకు దూరంగా ఉండండి డీజే మరియు త్రా గుడ కు ప్రమాదకర మైన వాటికి దూరంగా ఉండండి విషయం పటాస్ ల దాటికి సౌండ్ దాటికి లైటింగ్ దాటికి డ్రైవర్ కి కనబడక ఈ విషాదం జరిగింది అందరూ అన్నిటికీ దూరంగా ఉండి జాగ్రత్త వహించాలని కో రడ మై నది4
- నాగర్ కర్నూల్ టి వ్యాపారి దారుణ హత్యకు గురయ్యాడు ప్రియుడు తో కత్తితో పొడిచిన ప్రియుడు విషయం భార్యకు ప్రియుడు కు అడ్డుగా ఉన్నా డ ని చంపేశారు పోలీసులు ఈ కేసును చే దించారు వీడియో1