Shuru
Apke Nagar Ki App…
నాగర్‌కర్నూల్ జిల్లాలోని బిజినేపల్లి మండలం వెలుగొండ గ్రామంలో మొహరం పండుగ వేడుకలు మిన్నంటాయి. ఈ ఉత్సవాల్లో గ్రామానికి చెందిన హిందూ, ముస్లిం ప్రజలు కలసికట్టుగా పీర్ల ఉత్సవాలను ఘనంగా జరుపుకున్నారు, మత సామరస్యానికి ప్రతీకగా నిలిచారు. మహిళలు, పిల్లలు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా అందరూ ఒకరినొకరు ప్రేమతో ఆలింగనం చేసుకుంటూ పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఊరంతా పండగ వాతావరణం సంతరించుకోగా, ఉత్సవాలు ప్రశాంతంగా, ఐకమత్యంతో ముగిశాయని గ్రామ పెద్దలు తెలిపారు.
NAVADEEP
నాగర్‌కర్నూల్ జిల్లాలోని బిజినేపల్లి మండలం వెలుగొండ గ్రామంలో మొహరం పండుగ వేడుకలు మిన్నంటాయి. ఈ ఉత్సవాల్లో గ్రామానికి చెందిన హిందూ, ముస్లిం ప్రజలు కలసికట్టుగా పీర్ల ఉత్సవాలను ఘనంగా జరుపుకున్నారు, మత సామరస్యానికి ప్రతీకగా నిలిచారు. మహిళలు, పిల్లలు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా అందరూ ఒకరినొకరు ప్రేమతో ఆలింగనం చేసుకుంటూ పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఊరంతా పండగ వాతావరణం సంతరించుకోగా, ఉత్సవాలు ప్రశాంతంగా, ఐకమత్యంతో ముగిశాయని గ్రామ పెద్దలు తెలిపారు.
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- కర్నూలు జిల్లా జొన్నగిరి ప్రాంతంలో రైతులు విత్తనాలు వేసి సాగు పనులు ప్రారంభించిన నేపథ్యంలో, పంట పొలాల్లోకి అనుమతి లేకుండా ప్రవేశించే వజ్రాల వేటగాళ్లపై కఠిన చర్యలు ఉంటాయని ఎస్సై మల్లికార్జున హెచ్చరించారు. రైతుల శ్రమను దృష్టిలో ఉంచుకొని ఆయన ఈ ఆదేశాలు జారీ చేసినట్లు స్పష్టం చేశారు. అనుమతి లేకుండా పొలాల్లోకి వెళ్లరాదని, వజ్రాల వేట పేరుతో ఎవరైనా పంట పొలాల్లోకి ప్రవేశిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై మరోసారి స్పష్టం చేశారు. వజ్రాల వేటకు వచ్చేవారికి హోటళ్లలో ఆశ్రయం కల్పించవద్దని హోటల్ యజమానులకు సైతం ఆయన గట్టి హెచ్చరికలు జారీ చేశారు.1
- అంతర్జాతీయ మాదకద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని జూన్ 25న సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఒక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ శ్రీమతి కె. హైమావతి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, మాదకద్రవ్యాల వినియోగం వ్యక్తిగత జీవితాలతో పాటు కుటుంబాలు, సమాజంపై తీవ్ర ప్రభావం చూపుతుందని స్పష్టం చేశారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండి విద్య, ఉపాధి, క్రీడలు మరియు సృజనాత్మక కార్యకలాపాలపై దృష్టి సారించాలని ఆమె సూచించారు. మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగాన్ని అరికట్టేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోందని వెల్లడించిన కలెక్టర్, మాదకద్రవ్యాల నిర్మూలనలో ప్రజలు, విద్యార్థులు, యువత భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా అధికారులు, విద్యార్థులు మరియు ప్రజాప్రతినిధులతో కలిసి మాదకద్రవ్యాల నిర్మూలనకు కట్టుబడి ఉంటామని ఆమె ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, పోలీసు శాఖ ప్రతినిధులు, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.2
- తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ వికారాబాద్ జిల్లా దారుర్ మండల పరిధిలోని ఆవుసుపల్లి గ్రామంలో లబ్ధిదారులు రుక్కుంపల్లి అనురాధ ప్రభాకర్ దంపతుల నూతన ఇందిరమ్మ గృహాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్పీకర్ దంపతులకు నూతన వస్త్రాలను కానుకగా అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకం ద్వారా ప్రతి పేద కుటుంబం సొంత ఇంటి కలను సహకారం చేసుకోవాలని ఆకాంక్షించారు. పేద ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తుందని ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మండల మార్కెట్ కమిటీ చైర్మన్ విజయభాస్కర్ రెడ్డి, నాయకులు కాపు మధుకర్, సర్పంచ్ శ్రీకాంత్ గౌడ్, యాదయ్య తదితరులు పాల్గొన్నారు.1
- ఖాళీగా ఉన్న ఉద్యోగాలను తక్షణమే భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ, డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో నల్గొండలోని సుభాష్ సెంటర్‌లో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నిరసనకారులు, ఏటా రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలని, 19,000 పోలీసు ఉద్యోగాలను వెంటనే నింపాలని, అలాగే నిరుద్యోగ భృతిని అమలు చేయాలని ప్రభుత్వాన్ని గట్టిగా కోరారు. ఖాళీగా ఉన్న అన్ని ఉద్యోగాలను భర్తీ చేయడమే తమ ప్రధాన లక్ష్యమని వారు స్పష్టం చేశారు.1
- మెదక్ జిల్లాలోని పాపన్నపేట మండల పరిధిలోని నాగసానిపల్లి గ్రామంలో ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారి ఆలయంలో శుక్రవారం అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, హారతులు నిర్వహించారు. ఏడుపాయల శ్రీ వన దుర్గ భవాని అమ్మవారికి ప్రత్యేక మంగళహారతి జరిగింది.1
- నంద్యాల జిల్లాలోని మిడుతూరు మండలంలోని వీపనగండ్ల, మాస్‌పేటతో పాటు పలు గ్రామాల్లో గురువారం భారీ వర్షం కురిసింది. చాలా రోజులుగా తీవ్రమైన ఎండతో అవస్థలు పడుతున్న ప్రజలకు ఈ వాన ఎంతో ఉపశమనాన్ని కలిగించింది. మరోవైపు, పత్తి, మొక్కజొన్న, మిరప పంటలకు ఈ వర్షం చాలా ఉపయోగపడుతుందని, దిగుబడులు కూడా బాగుంటాయని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ వర్షంతో మండలంలో వాతావరణం చల్లబడింది.1
- వెనిజులా రాజధాని కారకస్‌ను కుదిపేసిన భారీ భూకంపం సృష్టించిన విలయంలో ఒక అద్భుతం చోటుచేసుకుంది. శిథిలాల కింద చిక్కుకొని ప్రాణాలతో పోరాడుతున్న ఓ మహిళను రెస్క్యూ సిబ్బంది సురక్షితంగా కాపాడారు. ఆమె మృత్యువు అంచు నుంచి తిరిగి రావడాన్ని చూసిన స్థానికులు, సహాయక సిబ్బంది చప్పట్లు కొడుతూ, ఆనందంతో కేరింతలు కొట్టారు. ఆ మహిళ ప్రాణాలతో బయటపడటం అందరిలోనూ కొత్త ఆశలను నింపింది. అయితే, ఈ ప్రకృతి వైపరీత్యం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. వెనిజులా ప్రభుత్వం వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ భూకంపం కారణంగా ఇప్పటివరకు 235 మంది ప్రాణాలు కోల్పోగా, 4,300 మందికి పైగా గాయపడ్డారు. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి.1
- సదాశివపేట మండలం ఇశ్రాతాబాద్ గ్రామ శివారులో ఒక విషాద ఘటన చోటు చేసుకుంది. శుక్రవారం మధ్యాహ్నం వెంకటాపురం గ్రామానికి చెందిన 24 ఏళ్ల చింతకుంట అనిల్ తన అల్లుడితో కలిసి పొలంలో పశువులను మేపుతుండగా, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. అదే సమయంలో పిడుగు పడటంతో అనిల్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మృతుని వద్ద ఉన్న ఫోన్ కూడా పేలిపోయింది. ఈ ఘటనలో నాలుగేళ్ల సిద్దార్థ అనే బాలుడు ప్రాణాలతో బయటపడగా, స్థానికులు సమాచారం అందించడంతో 108 సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. వారు ప్రాథమిక చికిత్స అందించి బాధితుడిని జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.1
- తుంగభద్ర నదికి ఇప్పుడు కొత్త భద్రత లభించింది. నూతన గేట్లను ప్రారంభించడంతో రైతులకు ఎంతో ఊరట లభించింది.1