logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఆర్.కే (R.K) కన్వెన్షన్ హాల్లో ఏర్పాటు చేసిన చేనేత హస్తకళల ప్రదర్శన సందర్శకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఈ ప్రదర్శన వచ్చే నెల 28వ తేదీ వరకు కొనసాగుతుందని ఎగ్జిబిషన్ మేనేజర్ పవన్ కుమార్ మోది తెలిపారు. ఇందులో సందర్శకుల కోసం 200కు పైగా రకాల చేనేత వస్త్రాలు, విభిన్న హస్తకళా వస్తువులను అందుబాటులో ఉంచినట్లు ఆయన వివరించారు. చేనేత హస్తకళలను ప్రతి ఒక్కరూ ఆదరించాలని మేనేజర్ పవన్ కుమార్ మోది కోరారు. ప్రజలందరూ ఇక్కడి చేనేత ఉత్పత్తులను కొనుగోలు చేయడం ద్వారా చేనేత రంగంపై ఆధారపడిన కార్మికులను ఆర్థికంగా ఆదుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

1 hr ago
user_SIDDU.ASR
SIDDU.ASR
నిర్మల్, తెలంగాణ•
1 hr ago
ee6d6d32-2d51-4034-9785-97f894ff22ae

నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఆర్.కే (R.K) కన్వెన్షన్ హాల్లో ఏర్పాటు చేసిన చేనేత హస్తకళల ప్రదర్శన సందర్శకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఈ ప్రదర్శన వచ్చే నెల 28వ తేదీ వరకు కొనసాగుతుందని ఎగ్జిబిషన్ మేనేజర్ పవన్ కుమార్ మోది తెలిపారు. ఇందులో సందర్శకుల కోసం 200కు పైగా రకాల చేనేత వస్త్రాలు, విభిన్న హస్తకళా వస్తువులను అందుబాటులో ఉంచినట్లు ఆయన వివరించారు. చేనేత హస్తకళలను ప్రతి ఒక్కరూ ఆదరించాలని మేనేజర్ పవన్ కుమార్ మోది కోరారు. ప్రజలందరూ ఇక్కడి చేనేత ఉత్పత్తులను కొనుగోలు చేయడం ద్వారా చేనేత రంగంపై ఆధారపడిన కార్మికులను ఆర్థికంగా ఆదుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

More news from తెలంగాణ and nearby areas
  • జగిత్యాల నియోజకవర్గంలో వివిధ కారణాలతో ఆసుపత్రిలో చికిత్స పొంది, వైద్య ఖర్చుల నిమిత్తం సీఎం సహాయ నిధి సాయం కోసం ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎల్ రమణకు బాధితులు దరఖాస్తు చేసుకున్నారు. ఈ దరఖాస్తులపై సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్సీ ఎల్ రమణ, సీఎం సహాయ నిధి నుండి మొత్తం 9 మంది లబ్ధిదారులకు ఆర్థిక సహాయం మంజూరు చేయించారు. దీనికి సంబంధించి మంజూరైన రూ. 1 లక్షల 50 వేల విలువ గల చెక్కులను శనివారం సాయంత్రం 6:30 గంటల ప్రాంతంలో జగిత్యాల జిల్లా కేంద్రంలోని తన క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్సీ ఎల్ రమణ లబ్ధిదారులకు అందజేశారు. ఈ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో జగిత్యాల పట్టణ కౌన్సిలర్లు కోరుకంటి రాము, తోట హరీష్, మాజీ జడ్పీటీసీ కొలుముల రమణ, రాయికల్ మండలం ప్రధాన కార్యదర్శి కొండపల్కల రత్నాకర్ రావు పాల్గొన్నారు. వీరితో పాటు వొళ్ళాల గంగాధర్, గంగిపెల్లి వేణుమాధవ్, పెండేం గంగాధర్, చిరంజీవి, నందు నాయక్ తదితరులు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యమయ్యారు.
    1
    జగిత్యాల నియోజకవర్గంలో వివిధ కారణాలతో ఆసుపత్రిలో చికిత్స పొంది, వైద్య ఖర్చుల నిమిత్తం సీఎం సహాయ నిధి సాయం కోసం ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎల్ రమణకు బాధితులు దరఖాస్తు చేసుకున్నారు. ఈ దరఖాస్తులపై సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్సీ ఎల్ రమణ, సీఎం సహాయ నిధి నుండి మొత్తం 9 మంది లబ్ధిదారులకు ఆర్థిక సహాయం మంజూరు చేయించారు. దీనికి సంబంధించి మంజూరైన రూ. 1 లక్షల 50 వేల విలువ గల చెక్కులను శనివారం సాయంత్రం 6:30 గంటల ప్రాంతంలో జగిత్యాల జిల్లా కేంద్రంలోని తన క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్సీ ఎల్ రమణ లబ్ధిదారులకు అందజేశారు.

ఈ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో జగిత్యాల పట్టణ కౌన్సిలర్లు కోరుకంటి రాము, తోట హరీష్, మాజీ జడ్పీటీసీ కొలుముల రమణ, రాయికల్ మండలం ప్రధాన కార్యదర్శి కొండపల్కల రత్నాకర్ రావు పాల్గొన్నారు. వీరితో పాటు వొళ్ళాల గంగాధర్, గంగిపెల్లి వేణుమాధవ్, పెండేం గంగాధర్, చిరంజీవి, నందు నాయక్ తదితరులు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యమయ్యారు.
    user_Sk chaitanya
    Sk chaitanya
    జగిత్యాల, జగిత్యాల, తెలంగాణ•
    23 hrs ago
  • రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో గత రెండేళ్లుగా విధులు నిర్వహిస్తున్న 14 మంది బదిలీ ఉద్యోగులకు ఆదివారం ఘనంగా వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం నుంచి బదిలీపై వేములవాడకు వచ్చిన ఈ ఉద్యోగులను, దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు ఆలయ కార్యనిర్వహణాధికారి (ఈవో) ఎల్. రమాదేవి అధికారికంగా రిలీవ్ చేశారు. భీమేశ్వర సదన్ హాలులో జరిగిన ఈ కార్యక్రమంలో ఈవో రమాదేవి ఉద్యోగులందరికీ స్వామివారి శేషవస్త్రం, లడ్డు ప్రసాదం అందజేసి ఘనంగా సత్కరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ, వేములవాడ దేవస్థానంలో గత రెండేళ్లుగా ఉద్యోగులు అంకితభావంతో అందించిన సేవలను కొనియాడారు. శ్రీ రాజరాజేశ్వర స్వామి, భీమేశ్వర స్వామివారి సేవలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికీ దేవుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఉద్యోగులతో కలిసి పనిచేసిన అనుభవాలను గుర్తుచేసుకుంటూ ఈవో భావోద్వేగానికి గురయ్యారు. ఈ వేడుకలో అటు ఆనందంతో పాటు ఇటు వీడ్కోలు బాధ కూడా స్పష్టంగా కనిపించింది. ఈ కార్యక్రమంలో డీఈవో నవీన్ కుమార్, ఈఈ రాజేష్, ఆలయ అర్చకులు, వేదపండితులు, దేవస్థాన అధికారులు, ఇతర సిబ్బంది పాల్గొని బదిలీపై వెళ్తున్న ఉద్యోగులకు శుభాకాంక్షలు తెలియజేశారు. తమ విధి నిర్వహణలో క్రమశిక్షణ, సేవాభావంతో పనిచేసి దేవస్థానం అభివృద్ధికి ఈ ఉద్యోగులు విశేషంగా కృషి చేశారని పలువురు అధికారులు వారిని అభినందించారు.
    1
    రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో గత రెండేళ్లుగా విధులు నిర్వహిస్తున్న 14 మంది బదిలీ ఉద్యోగులకు ఆదివారం ఘనంగా వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం నుంచి బదిలీపై వేములవాడకు వచ్చిన ఈ ఉద్యోగులను, దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు ఆలయ కార్యనిర్వహణాధికారి (ఈవో) ఎల్. రమాదేవి అధికారికంగా రిలీవ్ చేశారు.

భీమేశ్వర సదన్ హాలులో జరిగిన ఈ కార్యక్రమంలో ఈవో రమాదేవి ఉద్యోగులందరికీ స్వామివారి శేషవస్త్రం, లడ్డు ప్రసాదం అందజేసి ఘనంగా సత్కరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ, వేములవాడ దేవస్థానంలో గత రెండేళ్లుగా ఉద్యోగులు అంకితభావంతో అందించిన సేవలను కొనియాడారు. శ్రీ రాజరాజేశ్వర స్వామి, భీమేశ్వర స్వామివారి సేవలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికీ దేవుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఉద్యోగులతో కలిసి పనిచేసిన అనుభవాలను గుర్తుచేసుకుంటూ ఈవో భావోద్వేగానికి గురయ్యారు. ఈ వేడుకలో అటు ఆనందంతో పాటు ఇటు వీడ్కోలు బాధ కూడా స్పష్టంగా కనిపించింది.

ఈ కార్యక్రమంలో డీఈవో నవీన్ కుమార్, ఈఈ రాజేష్, ఆలయ అర్చకులు, వేదపండితులు, దేవస్థాన అధికారులు, ఇతర సిబ్బంది పాల్గొని బదిలీపై వెళ్తున్న ఉద్యోగులకు శుభాకాంక్షలు తెలియజేశారు. తమ విధి నిర్వహణలో క్రమశిక్షణ, సేవాభావంతో పనిచేసి దేవస్థానం అభివృద్ధికి ఈ ఉద్యోగులు విశేషంగా కృషి చేశారని పలువురు అధికారులు వారిని అభినందించారు.
    user_సిరిసిల్ల స్వరం
    సిరిసిల్ల స్వరం
    సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    1 hr ago
  • కామారెడ్డి జిల్లా బోధన్ బెల్లాల గ్రామంలోని ఇందిరమ్మ కాలనీలో బెల్ట్ షాపులకు వ్యతిరేకంగా వికలాంగుల జాతీయ అధ్యక్షురాలు సూర్యవంశం సుజాత పోరాటం చేపట్టారు. గ్రామంలో పర్యటించిన ఆమెతో స్థానిక మహిళలు తమ ఆవేదనను పంచుకున్నారు. తమ ఊరిలో బెల్ట్ షాపులు అస్సలు ఉండకూడదని వారు సుజాతకు స్పష్టం చేశారు. ఉదయం 6 గంటల నుంచే ఇక్కడ ప్రజలు మద్యానికి బానిసవుతున్నారని, యువత గంజాయి, ఇతర మత్తు పదార్థాల బారిన పడుతున్నారని మహిళలు ఆరోపించారు. కిరాణా షాపుల పేర్లు చెప్పుకుంటూ అక్రమంగా మద్యం అమ్ముతున్నారని, యువకులు ఎక్కడబడితే అక్కడ తాగుతూ తిరుగుతుండటంతో దొంగతనాలు పెరిగిపోయి ఆడవాళ్లకు రక్షణ లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ చిన్న గ్రామంలో ఉన్న దాదాపు 8 బెల్ట్ షాపులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎక్సైజ్ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అధికారులు వెంటనే స్పందించి ఈ బెల్ట్ షాపులను తొలగించేలా తగిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.
    1
    కామారెడ్డి జిల్లా బోధన్ బెల్లాల గ్రామంలోని ఇందిరమ్మ కాలనీలో బెల్ట్ షాపులకు వ్యతిరేకంగా వికలాంగుల జాతీయ అధ్యక్షురాలు సూర్యవంశం సుజాత పోరాటం చేపట్టారు. గ్రామంలో పర్యటించిన ఆమెతో స్థానిక మహిళలు తమ ఆవేదనను పంచుకున్నారు. తమ ఊరిలో బెల్ట్ షాపులు అస్సలు ఉండకూడదని వారు సుజాతకు స్పష్టం చేశారు.

ఉదయం 6 గంటల నుంచే ఇక్కడ ప్రజలు మద్యానికి బానిసవుతున్నారని, యువత గంజాయి, ఇతర మత్తు పదార్థాల బారిన పడుతున్నారని మహిళలు ఆరోపించారు. కిరాణా షాపుల పేర్లు చెప్పుకుంటూ అక్రమంగా మద్యం అమ్ముతున్నారని, యువకులు ఎక్కడబడితే అక్కడ తాగుతూ తిరుగుతుండటంతో దొంగతనాలు పెరిగిపోయి ఆడవాళ్లకు రక్షణ లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ చిన్న గ్రామంలో ఉన్న దాదాపు 8 బెల్ట్ షాపులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎక్సైజ్ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అధికారులు వెంటనే స్పందించి ఈ బెల్ట్ షాపులను తొలగించేలా తగిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.
    user_సూర్య జిల్లా స్టాప్ రిపోటర్
    సూర్య జిల్లా స్టాప్ రిపోటర్
    Local News Reporter బిచ్కుంద, కామారెడ్డి, తెలంగాణ•
    8 hrs ago
  • సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల పరిధిలోని తోటపల్లి రిజర్వాయర్‌లో ఇథనాల్ ఫ్యాక్టరీ నుంచి విడుదలవుతున్న వ్యర్థాలు కలవడం వల్ల చేప పిల్లలు మృతి చెందుతున్నాయని బీఆర్‌ఎస్ పార్టీ మాజీ మండల అధ్యక్షుడు పాకాల మహిపాల్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయానికి, మత్స్యకారుల జీవనాధారానికి ఎంతో కీలకమైన తోటపల్లి రిజర్వాయర్ను కాలుష్యానికి గురిచేయడం సరికాదని ఆయన శనివారం అన్నారు. కలుషితమైన ఈ నీటిని పంటలకు ఉపయోగించడం వల్ల భూముల సారవంతం తగ్గే ప్రమాదం ఉందని, అలాగే పశువుల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి, రిజర్వాయర్లోకి వ్యర్థ జలాలు చేరకుండా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధితులైన రైతులు, మత్స్యకారులకు జరిగిన నష్టాన్ని అంచనా వేసి తగిన పరిహారం అందించాలన్నారు. ప్రజా సమస్యలపై నిరసనగా బెజ్జంకి తహశీల్దార్ కార్యాలయం ఎదుట నిర్వహించే ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బెజ్జంకి సర్పంచ్ బొల్లం శ్రీధర్, నాయకులు లింగాల లక్ష్మణ్, ఉప సర్పంచ్ దుమాల మహేష్, వంగల నరేష్, వార్డు సభ్యులు తిప్పరపు మహేష్, పొట్లపెల్లి శివ, రామంచ పర్శరాములు తదితరులు పాల్గొన్నారు.
    1
    సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల పరిధిలోని తోటపల్లి రిజర్వాయర్‌లో ఇథనాల్ ఫ్యాక్టరీ నుంచి విడుదలవుతున్న వ్యర్థాలు కలవడం వల్ల చేప పిల్లలు మృతి చెందుతున్నాయని బీఆర్‌ఎస్ పార్టీ మాజీ మండల అధ్యక్షుడు పాకాల మహిపాల్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయానికి, మత్స్యకారుల జీవనాధారానికి ఎంతో కీలకమైన తోటపల్లి రిజర్వాయర్ను కాలుష్యానికి గురిచేయడం సరికాదని ఆయన శనివారం అన్నారు.

కలుషితమైన ఈ నీటిని పంటలకు ఉపయోగించడం వల్ల భూముల సారవంతం తగ్గే ప్రమాదం ఉందని, అలాగే పశువుల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి, రిజర్వాయర్లోకి వ్యర్థ జలాలు చేరకుండా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధితులైన రైతులు, మత్స్యకారులకు జరిగిన నష్టాన్ని అంచనా వేసి తగిన పరిహారం అందించాలన్నారు.

ప్రజా సమస్యలపై నిరసనగా బెజ్జంకి తహశీల్దార్ కార్యాలయం ఎదుట నిర్వహించే ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బెజ్జంకి సర్పంచ్ బొల్లం శ్రీధర్, నాయకులు లింగాల లక్ష్మణ్, ఉప సర్పంచ్ దుమాల మహేష్, వంగల నరేష్, వార్డు సభ్యులు తిప్పరపు మహేష్, పొట్లపెల్లి శివ, రామంచ పర్శరాములు తదితరులు పాల్గొన్నారు.
    user_Vodnala thirupthi
    Vodnala thirupthi
    Tour operator గన్నేరువరం, కరీంనగర్, తెలంగాణ•
    13 hrs ago
  • సిద్దిపేటలో జరిగిన రాష్ట్ర స్థాయి హాతియా పాతియా అసోసియేషన్ క్రీడల్లో మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రెవల్యూషన్ స్కూల్ విద్యార్థినులు అద్భుత ప్రదర్శన కనబరిచి, మూడవ విజేతలుగా నిలిచి జిల్లాకు గర్వకారణంగా నిలిచారు. ఈ జట్టులో రెవల్యూషన్ స్కూల్ విద్యార్థినులు ఆర్. జశ్విత, ఆర్. రిషిక, జె. మనస్విక, బి. సోనికలతో పాటు మరికొన్ని విద్యాసంస్థల విద్యార్థులు కూడా జట్టుగా పాల్గొని ఈ ఘనత సాధించారు. చాలా తక్కువ సమయంలోనే విద్యార్థినులకు కఠోర సాధన చేయించి, వారిని విజేతలుగా తీర్చిదిద్దిన రెవల్యూషన్ స్కూల్ పీటీ టీచర్లు అశ్విని మేడం మరియు వెంకటేష్ సార్‌ల కృషి ఎంతో అభినందనీయం. ఈ ఘన విజయం సాధించిన విద్యార్థినులను, పీటీ టీచర్లను రెవల్యూషన్ స్కూల్ యాజమాన్యం మరియు సిబ్బంది ప్రత్యేకంగా అభినందించారు.
    1
    సిద్దిపేటలో జరిగిన రాష్ట్ర స్థాయి హాతియా పాతియా అసోసియేషన్ క్రీడల్లో మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రెవల్యూషన్ స్కూల్ విద్యార్థినులు అద్భుత ప్రదర్శన కనబరిచి, మూడవ విజేతలుగా నిలిచి జిల్లాకు గర్వకారణంగా నిలిచారు. ఈ జట్టులో రెవల్యూషన్ స్కూల్ విద్యార్థినులు ఆర్. జశ్విత, ఆర్. రిషిక, జె. మనస్విక, బి. సోనికలతో పాటు మరికొన్ని విద్యాసంస్థల విద్యార్థులు కూడా జట్టుగా పాల్గొని ఈ ఘనత సాధించారు.

చాలా తక్కువ సమయంలోనే విద్యార్థినులకు కఠోర సాధన చేయించి, వారిని విజేతలుగా తీర్చిదిద్దిన రెవల్యూషన్ స్కూల్ పీటీ టీచర్లు అశ్విని మేడం మరియు వెంకటేష్ సార్‌ల కృషి ఎంతో అభినందనీయం. ఈ ఘన విజయం సాధించిన విద్యార్థినులను, పీటీ టీచర్లను రెవల్యూషన్ స్కూల్ యాజమాన్యం మరియు సిబ్బంది ప్రత్యేకంగా అభినందించారు.
    user_Thalapalli Ramesh
    Thalapalli Ramesh
    బెల్లంపల్లె, మంచిర్యాల, తెలంగాణ•
    35 min ago
  • తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆటో డ్రైవర్ల బతుకులు ఆగమైపోయాయని ఆటో యూనియన్ ప్రతినిధులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉచిత బస్సు పథకం కారణంగా ఆటో డ్రైవర్ల జీవనోపాధి పూర్తిగా దెబ్బతిందని, కుటుంబాలను పోషించలేక డ్రైవర్లు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ కళ్లు తెరిపించేందుకు ఆగస్టు నెలలో పెద్ద ఎత్తున ఆటోలు బంద్ చేసి, సమ్మెకు దిగాలని వారు తీర్మానించారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో రాష్ట్రంలోని 33 జిల్లాల ఆటో డ్రైవర్ల అధ్యక్ష, కార్యదర్శులతో రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న కరీంనగర్ ఆటో కార్మిక సంక్షేమ సంఘం యూనియన్ అధ్యక్షులు బొమ్మిడి శ్రీనివాస్ రెడ్డి ఆటో డ్రైవర్ల సమస్యలపై మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి ప్రతి ఆటో డ్రైవర్‌కు 12 వేల రూపాయల ఆర్థిక సహాయం అందించాలని మరియు ఆటో డ్రైవర్ల కోసం ఒక ప్రత్యేక సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. దీంతో పాటు, ఉపాధి కోల్పోయి ఆత్మహత్యలు చేసుకున్న ఆటోడ్రైవర్ల కుటుంబాలకు 20 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందించాలని స్పష్టం చేశారు. అలాగే ఆర్టీవో ఆఫీసులో వాహనాల ఫిట్నెస్ పైన రేడియం వేస్తూ చేస్తున్న కాంట్రాక్టును తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ, ఆగస్టు నెలలో ఆటో డ్రైవర్లందరూ ఏకమై సమ్మెలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.
    1
    తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆటో డ్రైవర్ల బతుకులు ఆగమైపోయాయని ఆటో యూనియన్ ప్రతినిధులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉచిత బస్సు పథకం కారణంగా ఆటో డ్రైవర్ల జీవనోపాధి పూర్తిగా దెబ్బతిందని, కుటుంబాలను పోషించలేక డ్రైవర్లు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ కళ్లు తెరిపించేందుకు ఆగస్టు నెలలో పెద్ద ఎత్తున ఆటోలు బంద్ చేసి, సమ్మెకు దిగాలని వారు తీర్మానించారు.

హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో రాష్ట్రంలోని 33 జిల్లాల ఆటో డ్రైవర్ల అధ్యక్ష, కార్యదర్శులతో రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న కరీంనగర్ ఆటో కార్మిక సంక్షేమ సంఘం యూనియన్ అధ్యక్షులు బొమ్మిడి శ్రీనివాస్ రెడ్డి ఆటో డ్రైవర్ల సమస్యలపై మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి ప్రతి ఆటో డ్రైవర్‌కు 12 వేల రూపాయల ఆర్థిక సహాయం అందించాలని మరియు ఆటో డ్రైవర్ల కోసం ఒక ప్రత్యేక సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

దీంతో పాటు, ఉపాధి కోల్పోయి ఆత్మహత్యలు చేసుకున్న ఆటోడ్రైవర్ల కుటుంబాలకు 20 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందించాలని స్పష్టం చేశారు. అలాగే ఆర్టీవో ఆఫీసులో వాహనాల ఫిట్నెస్ పైన రేడియం వేస్తూ చేస్తున్న కాంట్రాక్టును తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ, ఆగస్టు నెలలో ఆటో డ్రైవర్లందరూ ఏకమై సమ్మెలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.
    user_OM NAMSHIVAYA
    OM NAMSHIVAYA
    Karimnagar, Telangana•
    5 hrs ago
  • ఉత్తర గువహటి ప్రజల జీవితాలను కుమార్ భాస్కర్ వర్మ సేతు పూర్తిగా మార్చివేసింది. ఒకప్పుడు ప్రజలు ఎదుర్కొన్న ఫెర్రీ ప్రయాణ ఇబ్బందులు, సుదీర్ఘ నిరీక్షణ మరియు భయాలు ఇప్పుడు కేవలం చరిత్రగా మారిపోయాయి. గతంలో 90 నిమిషాల పాటు సాగిన సుదీర్ఘ పోరాటంతో కూడిన ప్రయాణం, ఈ సేతు నిర్మాణంతో ఇప్పుడు కేవలం 10 నుండి 15 నిమిషాల సులువైన ప్రయాణంగా మారిపోయింది.
    1
    ఉత్తర గువహటి ప్రజల జీవితాలను కుమార్ భాస్కర్ వర్మ సేతు పూర్తిగా మార్చివేసింది. ఒకప్పుడు ప్రజలు ఎదుర్కొన్న ఫెర్రీ ప్రయాణ ఇబ్బందులు, సుదీర్ఘ నిరీక్షణ మరియు భయాలు ఇప్పుడు కేవలం చరిత్రగా మారిపోయాయి. గతంలో 90 నిమిషాల పాటు సాగిన సుదీర్ఘ పోరాటంతో కూడిన ప్రయాణం, ఈ సేతు నిర్మాణంతో ఇప్పుడు కేవలం 10 నుండి 15 నిమిషాల సులువైన ప్రయాణంగా మారిపోయింది.
    user_M.RAJKIRAN REDDY
    M.RAJKIRAN REDDY
    Adilabad Urban, Telangana•
    3 hrs ago
  • రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం భక్తుల రద్దీ నెలకొంది. ఈ సందర్భంగా ఆలయానికి విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా దేవస్థానం కార్యనిర్వహణాధికారి (ఈవో) శ్రీమతి ఎల్. రమాదేవి క్షేత్రస్థాయిలో ఆలయ ప్రాంగణాన్ని మరియు లోపలి పలు విభాగాలను స్వయంగా పరిశీలించి సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. ఆలయ ప్రాంగణంలోని టెంకాయలు కొట్టే ప్రాంతాన్ని పరిశీలించిన ఈవో, అక్కడ భక్తుల నుంచి ఎవరైనా అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నారా అనే విషయాన్ని ఆరా తీశారు. టెంకాయలు కొట్టేందుకు లేదా ఇతర సేవల పేరుతో ఎవరికీ డబ్బులు ఇవ్వవద్దని, ఎవరైనా డబ్బులు డిమాండ్ చేస్తే వెంటనే విధుల్లో ఉన్న అధికారులకు లేదా దేవస్థానం కార్యాలయానికి ఫిర్యాదు చేయాలని ఆలయ మైక్ ద్వారా భక్తులకు సూచించారు. అలాగే కోడె మొక్కులు చెల్లించే భక్తులకు టెండర్‌దారులు విక్రయిస్తున్న పచ్చిగడ్డి, అరటిపండ్ల నాణ్యతను పరిశీలించి, నాణ్యమైన వస్తువులే అందించాలని ఆదేశించారు. దీపారాధన చేసే ప్రాంతాన్ని సందర్శించి, భక్తులు వెలిగించే దీపాల కోసం సహజమైన నెయ్యిని మాత్రమే వినియోగించేలా చూడాలని, ప్లాస్టిక్ లేదా రసాయన పదార్థాలు కలిగిన వస్తువులను ఉపయోగించకుండా తగిన చర్యలు తీసుకోవాలని సిబ్బందికి స్పష్టం చేశారు. ఈ పరిశీలనలో భాగంగా ఉచిత దర్శనం, శీఘ్ర దర్శనం, అతి శీఘ్ర దర్శనం క్యూలైన్లతో పాటు భక్తులు టికెట్లు పొందుతున్న విధానాన్ని పరిశీలించారు. ముఖ్యంగా వృద్ధులు, దివ్యాంగులకు అందుతున్న సౌకర్యాలపై స్వయంగా భక్తులను అడిగి తెలుసుకుని, అవసరమైన చోట మరింత మెరుగైన సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు. భక్తులకు పారదర్శకమైన, సౌకర్యవంతమైన సేవలు అందించడమే దేవస్థానం లక్ష్యమని ఈవో ఎల్. రమాదేవి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ పర్యవేక్షకులు శ్రీనివాస్ శర్మ, ఆలయ పరిశీలకులు వంశీ మోహన్, ఇతర ఆలయ అధికారులు మరియు ఉద్యోగులు పాల్గొన్నారు.
    4
    రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం భక్తుల రద్దీ నెలకొంది. ఈ సందర్భంగా ఆలయానికి విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా దేవస్థానం కార్యనిర్వహణాధికారి (ఈవో) శ్రీమతి ఎల్. రమాదేవి క్షేత్రస్థాయిలో ఆలయ ప్రాంగణాన్ని మరియు లోపలి పలు విభాగాలను స్వయంగా పరిశీలించి సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు.

ఆలయ ప్రాంగణంలోని టెంకాయలు కొట్టే ప్రాంతాన్ని పరిశీలించిన ఈవో, అక్కడ భక్తుల నుంచి ఎవరైనా అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నారా అనే విషయాన్ని ఆరా తీశారు. టెంకాయలు కొట్టేందుకు లేదా ఇతర సేవల పేరుతో ఎవరికీ డబ్బులు ఇవ్వవద్దని, ఎవరైనా డబ్బులు డిమాండ్ చేస్తే వెంటనే విధుల్లో ఉన్న అధికారులకు లేదా దేవస్థానం కార్యాలయానికి ఫిర్యాదు చేయాలని ఆలయ మైక్ ద్వారా భక్తులకు సూచించారు. అలాగే కోడె మొక్కులు చెల్లించే భక్తులకు టెండర్‌దారులు విక్రయిస్తున్న పచ్చిగడ్డి, అరటిపండ్ల నాణ్యతను పరిశీలించి, నాణ్యమైన వస్తువులే అందించాలని ఆదేశించారు. దీపారాధన చేసే ప్రాంతాన్ని సందర్శించి, భక్తులు వెలిగించే దీపాల కోసం సహజమైన నెయ్యిని మాత్రమే వినియోగించేలా చూడాలని, ప్లాస్టిక్ లేదా రసాయన పదార్థాలు కలిగిన వస్తువులను ఉపయోగించకుండా తగిన చర్యలు తీసుకోవాలని సిబ్బందికి స్పష్టం చేశారు.

ఈ పరిశీలనలో భాగంగా ఉచిత దర్శనం, శీఘ్ర దర్శనం, అతి శీఘ్ర దర్శనం క్యూలైన్లతో పాటు భక్తులు టికెట్లు పొందుతున్న విధానాన్ని పరిశీలించారు. ముఖ్యంగా వృద్ధులు, దివ్యాంగులకు అందుతున్న సౌకర్యాలపై స్వయంగా భక్తులను అడిగి తెలుసుకుని, అవసరమైన చోట మరింత మెరుగైన సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు. భక్తులకు పారదర్శకమైన, సౌకర్యవంతమైన సేవలు అందించడమే దేవస్థానం లక్ష్యమని ఈవో ఎల్. రమాదేవి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ పర్యవేక్షకులు శ్రీనివాస్ శర్మ, ఆలయ పరిశీలకులు వంశీ మోహన్, ఇతర ఆలయ అధికారులు మరియు ఉద్యోగులు పాల్గొన్నారు.
    user_సిరిసిల్ల స్వరం
    సిరిసిల్ల స్వరం
    సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    2 hrs ago
  • కరీంనగర్‌లో ఇస్కాన్ ఆధ్వర్యంలో ఈనెల 16వ తేదీన నిర్వహించబోయే శ్రీ జగన్నాథ రథయాత్ర మహోత్సవ కార్యక్రమానికి హాజరుకావాలని మాజీమంత్రి, కరీంనగర్ శాసనసభ్యులు గంగుల కమలాకర్‌ను కమిటీ ప్రతినిధులు ఆహ్వానించారు. ఎమ్మెల్యే గంగుల నివాసంలో జరిగిన ఈ కార్యక్రమంలో, ఆయన చేతుల మీదుగా ఈ ఉత్సవానికి సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగుల వెంట నగర బిఆర్ఎస్ అధ్యక్షులు చల్ల హరి శంకర్, మాజీ మేయర్ సర్ధార్ రవీందర్ సింగ్, కార్పొరేటర్ గుగ్గిళ్ళ జయశ్రీ శ్రీనివాస్, వైద్యులు రాజ భాస్కర్ రెడ్డి, ఎస్ ఆర్ కళాశాల మాజీ ప్రిన్సిపాల్ బుర్ర మధుసూదన్ రెడ్డి, రమేష్ రెడ్డి, అనంతరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
    2
    కరీంనగర్‌లో ఇస్కాన్ ఆధ్వర్యంలో ఈనెల 16వ తేదీన నిర్వహించబోయే శ్రీ జగన్నాథ రథయాత్ర మహోత్సవ కార్యక్రమానికి హాజరుకావాలని మాజీమంత్రి, కరీంనగర్ శాసనసభ్యులు గంగుల కమలాకర్‌ను కమిటీ ప్రతినిధులు ఆహ్వానించారు. ఎమ్మెల్యే గంగుల నివాసంలో జరిగిన ఈ కార్యక్రమంలో, ఆయన చేతుల మీదుగా ఈ ఉత్సవానికి సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగుల వెంట నగర బిఆర్ఎస్ అధ్యక్షులు చల్ల హరి శంకర్, మాజీ మేయర్ సర్ధార్ రవీందర్ సింగ్, కార్పొరేటర్ గుగ్గిళ్ళ జయశ్రీ శ్రీనివాస్, వైద్యులు రాజ భాస్కర్ రెడ్డి, ఎస్ ఆర్ కళాశాల మాజీ ప్రిన్సిపాల్ బుర్ర మధుసూదన్ రెడ్డి, రమేష్ రెడ్డి, అనంతరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
    user_OM NAMSHIVAYA
    OM NAMSHIVAYA
    Karimnagar, Telangana•
    5 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.