logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

బద్వేలు పట్టణంలోని స్థానిక ఎన్జీవో కార్యాలయంలో జూన్ 21న ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (యుటిఎఫ్) బద్వేలు ప్రాంతీయ శాఖ ఆధ్వర్యంలో ఒక అభినందన సభ జరిగింది. యుటిఎఫ్ జిల్లా కార్యదర్శి కె.సుధాకర్ అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో, ఇటీవల పదవ తరగతి పరీక్షా ఫలితాలలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన కడప ఉప విద్యాశాఖాధికారి జి.రాజగోపాల్ రెడ్డి మరియు యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బి.లక్ష్మీరాజా మాట్లాడుతూ, ఈ ఏడాది పదవ తరగతి పరీక్షా ఫలితాలలో కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు అద్భుతమైన విజయాలు సాధించారని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలతో నూతన ఒరవడిని సృష్టించారని, సరైన అవకాశాలు కల్పిస్తే ప్రభుత్వ పాఠశాలల్లో సైతం అద్భుతాలు సృష్టించగలరని వారు పేర్కొన్నారు. విద్యాశాఖ రూపొందించిన ప్రణాళికలు, ఉపాధ్యాయుల ప్రత్యేక కృషి వల్లే ఈ మంచి ఫలితాలు సాధ్యమయ్యాయని ప్రశంసించారు. కార్పొరేట్ మాయాజాలంలో పడి ప్రభుత్వ పాఠశాలల పట్ల చిన్నచూపు చూస్తున్న కొందరు తల్లిదండ్రులకు ఈ ఏడాది ఫలితాలు కనువిప్పు కావాలని ఆకాంక్షించారు. ప్రభుత్వ పాఠశాలలు నాణ్యమైన విద్యకు, విలువల బోధనకు, క్రీడా మరియు సాంస్కృతిక ప్రతిభా వికాసానికి కేంద్రాలుగా నిలుస్తున్నాయని, వీటిని బలోపేతం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వ ఉపాధ్యాయులతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులదేనని వారు ఉద్ఘాటించారు. యుటిఎఫ్ జిల్లా అధ్యక్షులు మాదన విజయ కుమార్ మరియు ప్రధాన కార్యదర్శి పాలెం మహేష్ బాబులు మాట్లాడుతూ, కార్పొరేట్ విద్యా సంస్థలు కేవలం ప్రచార ఆర్భాటంతో విద్యార్థులను ఆకర్షించి ఫీజుల పేరుతో లక్షలాది రూపాయలను దోచుకుంటున్నాయని విమర్శించారు. కార్పొరేట్ విద్యా సంస్థలు ఉత్తీర్ణులైన విద్యార్థుల వివరాలను మాత్రమే ప్రచారం చేసుకుంటాయని, ఫెయిల్ అయిన వారి వివరాలను ప్రకటించే ధైర్యం వారికి లేదని వారు ఎత్తిచూపారు. విద్యార్థుల సర్వతోన్ముఖాభివృద్ధికి పాటుపడేవి ప్రభుత్వ పాఠశాలలేనని స్పష్టం చేశారు. యుటిఎఫ్ కేవలం ఉపాధ్యాయుల సమస్యలకే పరిమితం కాకుండా ప్రభుత్వ విద్యా రంగ పరిరక్షణ కోసం నిరంతరం కృషి చేస్తోందని, అందులో భాగంగానే పదవ తరగతి విద్యార్థుల కోసం ప్రతి ఏటా మోడల్ పేపర్స్ రూపొందించి, అత్యుత్తమ ఫలితాలు సాధించడానికి దోహదపడుతున్నదని తెలిపారు. అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను సమాజానికి పరిచయం చేయడంతో పాటు మరింత ప్రోత్సహించాలనే ఉద్దేశంతోనే ఈ ప్రతిభా పురస్కార కార్యక్రమాన్ని చేపట్టినట్లు వివరించారు. బద్వేలు, గోపవరం మండల విద్యాశాఖాధికారులు ఎస్.మల్లిక, పి.రఘురామిరెడ్డి మరియు ప్రధానోపాధ్యాయుల సంఘం జిల్లా అధ్యక్షులు జి.వెంకటసుబ్బారెడ్డి మాట్లాడుతూ, ఈ విద్యా సంవత్సరం పదవ తరగతి విద్యార్థులు సాధించిన పరీక్షా ఫలితాలు ప్రభుత్వ పాఠశాలల పట్ల తల్లిదండ్రులకు నమ్మకాన్ని పెంచేవిగా ఉన్నాయని అన్నారు. బోధనలో నైపుణ్యం, వృత్తిలో అనుభవం, తగిన విద్యార్హతలు కలిగిన ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులే చక్కగా బోధించగలరనే విశ్వాసం ఈ ఫలితాల ద్వారా మరోసారి రుజువైందని వారు పేర్కొన్నారు. అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులు ఇదే స్ఫూర్తితో లక్ష్యాన్ని నిర్దేశించుకుని ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగితే అద్భుత అవకాశాలు వారి సొంతమని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉచిత విద్యా సామాగ్రి, నాణ్యమైన భోజనం తోపాటు సమరూప దుస్తులు అందజేస్తున్నారని, భవిష్యత్తులో కృత్రిమ మేధస్సు ఆధారిత విద్య అందుబాటులోకి వస్తుందని పేర్కొన్నారు. ప్రజలు కార్పొరేట్ మోజులో పడి లక్షలాది రూపాయలు నష్టపోకుండా, తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలలో చేర్పించాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ విద్యా రంగం కోసం నిరంతరం కృషి చేస్తున్న యుటిఎఫ్ కృషిని వారు కొనియాడారు. ఈ సందర్భంగా అత్యుత్తమ మార్కులు పొందిన విద్యార్థులకు యుటిఎఫ్ పక్షాన మెమెంటోతో పాటు శాలువా, ఫైల్, సర్టిఫికెట్‌లను బహుకరించారు. ఈ కార్యక్రమంలో ఏపీ జెఎసి చైర్మన్ టి.నరసింహారెడ్డి, యుటిఎఫ్ జిల్లా మాజీ అధ్యక్షులు ఎస్.ఓబుల్ రెడ్డి, బద్వేలు, గోపవరం మండలాల పరిధిలోని పలు ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు జి.పెంచలయ్య, టి.శ్రీనివాసులు, పి.మురళి దేవి, జి.విజయ కుమారి, ఓ.సుభాష్ చంద్రా రెడ్డి, కె.సత్యానంద రెడ్డి, గురుకుల విద్యాలయం ప్రిన్సిపల్ కె.రమాదేవి, యుటిఎఫ్ అకడమిక్ సెల్ జిల్లా కన్వీనర్ వీర దాసరి క్రిస్టఫర్, సిపిఎస్ జిల్లా కన్వీనర్ ఎన్.పవన్ కుమార్, బద్వేలు మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎస్.దేవానందం, సి.కంచిరెడ్డి, ట్రెజరర్ ఎ.లాజరస్, గోపవరం మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎస్.మస్తాన్ వలి, ఎం.రామచంద్రయ్య, ట్రెజరర్ బి.ఓబన్న, జిల్లా కౌన్సిల్ సభ్యులు వై.రామయ్య, సి.హెచ్.సాగర్, పాలా శ్రీనివాసులరెడ్డి, పి.చక్రపాణి, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

2 hrs ago
user_జీ.మౌలాలి.
జీ.మౌలాలి.
Photographer బద్వేల్, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
2 hrs ago
fbfcfc37-73fb-4e86-8597-8c9c7220a473

బద్వేలు పట్టణంలోని స్థానిక ఎన్జీవో కార్యాలయంలో జూన్ 21న ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (యుటిఎఫ్) బద్వేలు ప్రాంతీయ శాఖ ఆధ్వర్యంలో ఒక అభినందన సభ జరిగింది. యుటిఎఫ్ జిల్లా కార్యదర్శి కె.సుధాకర్ అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో, ఇటీవల పదవ తరగతి పరీక్షా ఫలితాలలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన కడప ఉప విద్యాశాఖాధికారి జి.రాజగోపాల్ రెడ్డి మరియు యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బి.లక్ష్మీరాజా మాట్లాడుతూ, ఈ ఏడాది పదవ తరగతి పరీక్షా ఫలితాలలో కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు అద్భుతమైన విజయాలు సాధించారని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలతో నూతన ఒరవడిని సృష్టించారని, సరైన అవకాశాలు కల్పిస్తే ప్రభుత్వ పాఠశాలల్లో సైతం అద్భుతాలు సృష్టించగలరని వారు పేర్కొన్నారు. విద్యాశాఖ రూపొందించిన ప్రణాళికలు, ఉపాధ్యాయుల ప్రత్యేక కృషి వల్లే ఈ మంచి ఫలితాలు సాధ్యమయ్యాయని ప్రశంసించారు. కార్పొరేట్ మాయాజాలంలో పడి ప్రభుత్వ పాఠశాలల పట్ల చిన్నచూపు చూస్తున్న కొందరు తల్లిదండ్రులకు ఈ ఏడాది ఫలితాలు కనువిప్పు కావాలని ఆకాంక్షించారు. ప్రభుత్వ పాఠశాలలు నాణ్యమైన విద్యకు, విలువల బోధనకు, క్రీడా మరియు సాంస్కృతిక ప్రతిభా వికాసానికి కేంద్రాలుగా నిలుస్తున్నాయని, వీటిని బలోపేతం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వ ఉపాధ్యాయులతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులదేనని వారు ఉద్ఘాటించారు. యుటిఎఫ్ జిల్లా అధ్యక్షులు మాదన విజయ కుమార్ మరియు ప్రధాన కార్యదర్శి పాలెం మహేష్ బాబులు మాట్లాడుతూ, కార్పొరేట్ విద్యా సంస్థలు కేవలం ప్రచార ఆర్భాటంతో విద్యార్థులను ఆకర్షించి ఫీజుల పేరుతో లక్షలాది రూపాయలను దోచుకుంటున్నాయని విమర్శించారు. కార్పొరేట్ విద్యా సంస్థలు ఉత్తీర్ణులైన విద్యార్థుల వివరాలను మాత్రమే ప్రచారం చేసుకుంటాయని, ఫెయిల్ అయిన వారి వివరాలను ప్రకటించే ధైర్యం వారికి లేదని వారు ఎత్తిచూపారు. విద్యార్థుల సర్వతోన్ముఖాభివృద్ధికి పాటుపడేవి ప్రభుత్వ పాఠశాలలేనని స్పష్టం చేశారు. యుటిఎఫ్ కేవలం ఉపాధ్యాయుల సమస్యలకే పరిమితం కాకుండా ప్రభుత్వ విద్యా రంగ పరిరక్షణ కోసం నిరంతరం కృషి చేస్తోందని, అందులో భాగంగానే పదవ తరగతి విద్యార్థుల కోసం ప్రతి ఏటా మోడల్ పేపర్స్ రూపొందించి, అత్యుత్తమ

c2e950e8-57ed-4db9-b558-8e3d58eebb74

ఫలితాలు సాధించడానికి దోహదపడుతున్నదని తెలిపారు. అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను సమాజానికి పరిచయం చేయడంతో పాటు మరింత ప్రోత్సహించాలనే ఉద్దేశంతోనే ఈ ప్రతిభా పురస్కార కార్యక్రమాన్ని చేపట్టినట్లు వివరించారు. బద్వేలు, గోపవరం మండల విద్యాశాఖాధికారులు ఎస్.మల్లిక, పి.రఘురామిరెడ్డి మరియు ప్రధానోపాధ్యాయుల సంఘం జిల్లా అధ్యక్షులు జి.వెంకటసుబ్బారెడ్డి మాట్లాడుతూ, ఈ విద్యా సంవత్సరం పదవ తరగతి విద్యార్థులు సాధించిన పరీక్షా ఫలితాలు ప్రభుత్వ పాఠశాలల పట్ల తల్లిదండ్రులకు నమ్మకాన్ని పెంచేవిగా ఉన్నాయని అన్నారు. బోధనలో నైపుణ్యం, వృత్తిలో అనుభవం, తగిన విద్యార్హతలు కలిగిన ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులే చక్కగా బోధించగలరనే విశ్వాసం ఈ ఫలితాల ద్వారా మరోసారి రుజువైందని వారు పేర్కొన్నారు. అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులు ఇదే స్ఫూర్తితో లక్ష్యాన్ని నిర్దేశించుకుని ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగితే అద్భుత అవకాశాలు వారి సొంతమని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉచిత విద్యా సామాగ్రి, నాణ్యమైన భోజనం తోపాటు సమరూప దుస్తులు అందజేస్తున్నారని, భవిష్యత్తులో కృత్రిమ మేధస్సు ఆధారిత విద్య అందుబాటులోకి వస్తుందని పేర్కొన్నారు. ప్రజలు కార్పొరేట్ మోజులో పడి లక్షలాది రూపాయలు నష్టపోకుండా, తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలలో చేర్పించాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ విద్యా రంగం కోసం నిరంతరం కృషి చేస్తున్న యుటిఎఫ్ కృషిని వారు కొనియాడారు. ఈ సందర్భంగా అత్యుత్తమ మార్కులు పొందిన విద్యార్థులకు యుటిఎఫ్ పక్షాన మెమెంటోతో పాటు శాలువా, ఫైల్, సర్టిఫికెట్‌లను బహుకరించారు. ఈ కార్యక్రమంలో ఏపీ జెఎసి చైర్మన్ టి.నరసింహారెడ్డి, యుటిఎఫ్ జిల్లా మాజీ అధ్యక్షులు ఎస్.ఓబుల్ రెడ్డి, బద్వేలు, గోపవరం మండలాల పరిధిలోని పలు ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు జి.పెంచలయ్య, టి.శ్రీనివాసులు, పి.మురళి దేవి, జి.విజయ కుమారి, ఓ.సుభాష్ చంద్రా రెడ్డి, కె.సత్యానంద రెడ్డి, గురుకుల విద్యాలయం ప్రిన్సిపల్ కె.రమాదేవి, యుటిఎఫ్ అకడమిక్ సెల్ జిల్లా కన్వీనర్ వీర దాసరి క్రిస్టఫర్, సిపిఎస్ జిల్లా కన్వీనర్ ఎన్.పవన్ కుమార్, బద్వేలు మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎస్.దేవానందం, సి.కంచిరెడ్డి, ట్రెజరర్ ఎ.లాజరస్, గోపవరం మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎస్.మస్తాన్ వలి, ఎం.రామచంద్రయ్య, ట్రెజరర్ బి.ఓబన్న, జిల్లా కౌన్సిల్ సభ్యులు వై.రామయ్య, సి.హెచ్.సాగర్, పాలా శ్రీనివాసులరెడ్డి, పి.చక్రపాణి, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • ప్రియ సహోదరీ సోదరులారా, ఈ సందేశం ప్రభు యేసుక్రీస్తు సన్నిధిలో స్తుతించిన, ఆరాధించిన, ప్రార్థించిన, మరియు వైవిధ్యానించిన వారికి అపారమైన సంతోషం, సమాధానం లభిస్తాయని తెలియజేస్తుంది. దీనితో పాటు, ఎంతో ఆనందంగా జీవము, బలము, క్షేమాదాలను పొందుతారని స్పష్టం చేయబడింది.
    1
    ప్రియ సహోదరీ సోదరులారా, ఈ సందేశం ప్రభు యేసుక్రీస్తు సన్నిధిలో స్తుతించిన, ఆరాధించిన, ప్రార్థించిన, మరియు వైవిధ్యానించిన వారికి అపారమైన సంతోషం, సమాధానం లభిస్తాయని తెలియజేస్తుంది. దీనితో పాటు, ఎంతో ఆనందంగా జీవము, బలము, క్షేమాదాలను పొందుతారని స్పష్టం చేయబడింది.
    user_T. Raja simha
    T. Raja simha
    బద్వేల్, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    19 hrs ago
  • గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి వైసిపిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసిపి వాళ్లు సిగ్గు లేకుండా అబద్ధాలు మాట్లాడుతున్నారని ఆయన స్పష్టం చేశారు. శనివారం అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అశోక్ రెడ్డి మాట్లాడుతూ, అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం కింద మొదటి విడతగా రూ.7 వేలు రైతుల ఖాతాలోకి జమ చేయబోతున్నట్లు తెలిపారు. మొత్తం మూడు విడతల్లో రైతులకు రూ.20 వేలు అందించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇచ్చిన మాట ప్రకారం తల్లికి వందనం పథకం ద్వారా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి లబ్ధి చేకూర్చామని కూడా వెల్లడించారు. వైసిపి వాళ్లు సిగ్గు లేకుండా అబద్ధాలు ఆడుతున్నారని ఎమ్మెల్యే అశోక్ రెడ్డి మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు.
    1
    గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి వైసిపిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసిపి వాళ్లు సిగ్గు లేకుండా అబద్ధాలు మాట్లాడుతున్నారని ఆయన స్పష్టం చేశారు. శనివారం అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే అశోక్ రెడ్డి మాట్లాడుతూ, అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం కింద మొదటి విడతగా రూ.7 వేలు రైతుల ఖాతాలోకి జమ చేయబోతున్నట్లు తెలిపారు. మొత్తం మూడు విడతల్లో రైతులకు రూ.20 వేలు అందించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇచ్చిన మాట ప్రకారం తల్లికి వందనం పథకం ద్వారా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి లబ్ధి చేకూర్చామని కూడా వెల్లడించారు. వైసిపి వాళ్లు సిగ్గు లేకుండా అబద్ధాలు ఆడుతున్నారని ఎమ్మెల్యే అశోక్ రెడ్డి మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు.
    user_Sasi Kumar reddy
    Sasi Kumar reddy
    గిద్దలూరు, ప్రకాశం, ఆంధ్రప్రదేశ్•
    17 hrs ago
  • నంద్యాల జిల్లాలోని మహానంది మండల పరిధిలోని గాజులపల్లె గ్రామంలో గల రైతు సేవా కేంద్రంలో శనివారం అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ 2026-27 మొదటి విడత పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కూటమి నేతలు మాట్లాడుతూ, రైతుల అభ్యున్నతి కోసం ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా, మండలంలోని మొత్తం 4,200 మంది రైతులకు ₹2.84 కోట్ల విలువైన చెక్కులను అందజేశారు. మండల వ్యవసాయ అధికారి నాగేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ నిధుల పంపిణీ జరిగింది. తెలుగుదేశం పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు జనార్ధన్ రెడ్డి, మండల కన్వీనర్ కంచర్ల శివయ్య, మండల క్లస్టర్ ఇన్‌ఛార్జి నరాల చంద్రమౌళీశ్వర్ రెడ్డి, గోపవరం సొసైటీ చైర్మన్ గంగవరపు ఉమామహేశ్వర్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ మాజీ మండలాధ్యక్షుడు ఉల్లి మధు, నాయకులు శశికళ కొండారెడ్డి, లక్ష్మీనారాయణ, రవి స్వామి, హరి ప్రసాద్ రెడ్డి, కిరణ్ కుమార్ గౌడ్, నాగేశ్వరరావుతో పాటు పలువురు నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
    1
    నంద్యాల జిల్లాలోని మహానంది మండల పరిధిలోని గాజులపల్లె గ్రామంలో గల రైతు సేవా కేంద్రంలో శనివారం అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ 2026-27 మొదటి విడత పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కూటమి నేతలు మాట్లాడుతూ, రైతుల అభ్యున్నతి కోసం ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో భాగంగా, మండలంలోని మొత్తం 4,200 మంది రైతులకు ₹2.84 కోట్ల విలువైన చెక్కులను అందజేశారు. మండల వ్యవసాయ అధికారి నాగేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ నిధుల పంపిణీ జరిగింది. తెలుగుదేశం పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు జనార్ధన్ రెడ్డి, మండల కన్వీనర్ కంచర్ల శివయ్య, మండల క్లస్టర్ ఇన్‌ఛార్జి నరాల చంద్రమౌళీశ్వర్ రెడ్డి, గోపవరం సొసైటీ చైర్మన్ గంగవరపు ఉమామహేశ్వర్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ మాజీ మండలాధ్యక్షుడు ఉల్లి మధు, నాయకులు శశికళ కొండారెడ్డి, లక్ష్మీనారాయణ, రవి స్వామి, హరి ప్రసాద్ రెడ్డి, కిరణ్ కుమార్ గౌడ్, నాగేశ్వరరావుతో పాటు పలువురు నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
    user_Syed Rafi
    Syed Rafi
    Photographer మహానంది, నంద్యాల, ఆంధ్రప్రదేశ్•
    18 hrs ago
  • మిత్రులందరికీ నమస్కారమండి. ARDV కంపెనీలో స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరికీ వర్క్ ఫ్రం హోం బిజినెస్ ఆపర్చునిటీ అందుబాటులో ఉంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకునే వారు పూర్తి వివరాల కొరకు మొబైల్ నెంబర్ 9666323500 నంబర్‌కు వాట్సప్ ద్వారా లేదా ఫోన్ కాల్ చేసి సంప్రదించగలరు. ధన్యవాదములు ఫ్రెండ్స్.
    1
    మిత్రులందరికీ నమస్కారమండి. ARDV కంపెనీలో స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరికీ వర్క్ ఫ్రం హోం బిజినెస్ ఆపర్చునిటీ అందుబాటులో ఉంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకునే వారు పూర్తి వివరాల కొరకు మొబైల్ నెంబర్ 9666323500 నంబర్‌కు వాట్సప్ ద్వారా లేదా ఫోన్ కాల్ చేసి సంప్రదించగలరు. ధన్యవాదములు ఫ్రెండ్స్.
    user_Kadiri Anjaneyulu
    Kadiri Anjaneyulu
    గండ్లపెంట, శ్రీ సత్య సాయి, ఆంధ్రప్రదేశ్•
    3 hrs ago
  • రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన పిలుపు మేరకు, బనగానపల్లె మండలం పలుకూరు గ్రామంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో ఉపాధ్యాయ బృందం, హెచ్‌ఎం, మరియు పిటి సాంబశివారెడ్డి యోగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఆదివారం యోగా దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు, ఇందులో విద్యార్థులు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జేకేఆర్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జేఎస్ఎస్ బ్రహ్మానంద చారి మాట్లాడుతూ, యోగా, ధ్యానం, నడక వల్లనే ఆరోగ్యకరమైన సమాజం సాధ్యమవుతుందని అన్నారు. ప్రస్తుతం పెరుగుతున్న షుగరు, బీపీ, గ్యాస్ ట్రబుల్, గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి వ్యాధులకు ఈ సాధనలే నివారణ మార్గాలని ఆయన ఉద్ఘాటించారు. ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి ఒక్కరూ యోగా, ధ్యానం, నడకను అలవర్చుకొని, తమ విలువైన సమయంలో రోజుకు కనీసం రెండు గంటలైనా వీటికి కేటాయించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. యోగా, ధ్యానం, నడకల విశిష్టతను బ్రహ్మానంద చారి వివరించారు. పిటి సాంబశివారెడ్డి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం పిలుపుమేరకు తమ హెచ్‌ఎం మరియు ఉపాధ్యాయ బృందం విద్యార్థులకు యోగా నేర్పుతున్నామని తెలిపారు. మనిషి శారీరకంగా, మానసికంగా ఉల్లాసంగా ఉండాలంటే యోగా ఎంతో అవసరం అని ఆయన వివరించారు.
    1
    రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన పిలుపు మేరకు, బనగానపల్లె మండలం పలుకూరు గ్రామంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో ఉపాధ్యాయ బృందం, హెచ్‌ఎం, మరియు పిటి సాంబశివారెడ్డి యోగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఆదివారం యోగా దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు, ఇందులో విద్యార్థులు కూడా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జేకేఆర్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జేఎస్ఎస్ బ్రహ్మానంద చారి మాట్లాడుతూ, యోగా, ధ్యానం, నడక వల్లనే ఆరోగ్యకరమైన సమాజం సాధ్యమవుతుందని అన్నారు. ప్రస్తుతం పెరుగుతున్న షుగరు, బీపీ, గ్యాస్ ట్రబుల్, గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి వ్యాధులకు ఈ సాధనలే నివారణ మార్గాలని ఆయన ఉద్ఘాటించారు. ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి ఒక్కరూ యోగా, ధ్యానం, నడకను అలవర్చుకొని, తమ విలువైన సమయంలో రోజుకు కనీసం రెండు గంటలైనా వీటికి కేటాయించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. యోగా, ధ్యానం, నడకల విశిష్టతను బ్రహ్మానంద చారి వివరించారు.

పిటి సాంబశివారెడ్డి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం పిలుపుమేరకు తమ హెచ్‌ఎం మరియు ఉపాధ్యాయ బృందం విద్యార్థులకు యోగా నేర్పుతున్నామని తెలిపారు. మనిషి శారీరకంగా, మానసికంగా ఉల్లాసంగా ఉండాలంటే యోగా ఎంతో అవసరం అని ఆయన వివరించారు.
    user_Naga kanth
    Naga kanth
    బండి ఆత్మకూరు, నంద్యాల, ఆంధ్రప్రదేశ్•
    16 hrs ago
  • ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ, కూట‌మి నాయ‌కులు ఇన్నాళ్లు పోలీసుల‌ను అడ్డం పెట్టుకుని క‌క్షపూరిత రాజ‌కీయాలు చేశారని, ఇప్పుడు అదే పోలీసులు ప్ర‌భుత్వాన్ని అడ్డం పెట్టుకుని చెల‌రేగిపోతున్నారని తీవ్రంగా ఆరోపించారు. వ్య‌క్తిగ‌త స్వార్థ రాజ‌కీయాల కోసం వ్య‌వ‌స్థ‌ల‌ను నిర్వీర్యం చేసి వాడుకుంటే స‌మాజం ఎలా త‌యార‌వుతుందో చెప్ప‌డానికి కృష్ణలంక సీఐ నాగరాజు కార‌ణంగా జ‌రిగిన సాయికృష్ణ లాక‌ప్ డెత్‌, క్రాంతి కుమార్ ఆత్మ‌హ‌త్య దుర్ఘ‌ట‌న‌లే సాక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ప్ర‌భుత్వ వైఫ‌ల్యాలు, అప్ర‌జాస్వామిక విధానాల‌ను ప్ర‌శ్నిస్తుంటే కూట‌మి నాయ‌కులు త‌ట్టుకోలేక‌పోతున్నారని, అధికారాన్ని అడ్డం పెట్టుకుని ప్ర‌శ్నించే గొంతుల‌ను నొక్క‌డానికి తెగ‌బ‌డుతున్నారని అప్పిరెడ్డి మండిపడ్డారు. అందులో భాగంగానే నెల్లూరులోని ఎమ్మెల్సీ ప‌ర్వ‌త‌రెడ్డి చంద్ర‌శేఖ‌ర్ రెడ్డికి చెందిన‌ విద్యాసంస్థ‌ల‌పై త‌నిఖీల పేరుతో దాడుల‌కు పూనుకున్నారని ఆయన వెల్లడించారు. డీఎస్సీ-2025 నిర్వ‌హ‌ణ‌లో జ‌రిగిన అక్ర‌మాలు, అవ‌కత‌వకలు, అలాగే తిరుమ‌ల ల‌డ్డూలో క‌ల్తీ నెయ్యి వాడారనే ఆరోప‌ణలు చేసి ఇందాపూర్ డెయిరీ ముసుగులో హెరిటేజ్‌కి లబ్ధి చేకూర్చారని ఆధారాల‌తో స‌హా నిరూపిస్తూ వైయస్ఆర్ సీపీ త‌ర‌ఫున చంద్ర‌శేఖర్ రెడ్డి బలంగా తన గొంతు వినిపించడంతో ప్ర‌భుత్వం ఇరుకున పడిందని అప్పిరెడ్డి వివరించారు. ప్ర‌భుత్వ ఉద్యోగుల స‌మ‌స్య‌ల‌పై ఎప్పటికప్పుడు స్పందిస్తూ కూట‌మి ప్ర‌భుత్వానికి కంటిలో న‌లుసుగా మారినందుకే ఆయనపై క‌క్ష పెంచుకుందని కూడా ఆయన ఆరోపించారు.
    1
    ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ, కూట‌మి నాయ‌కులు ఇన్నాళ్లు పోలీసుల‌ను అడ్డం పెట్టుకుని క‌క్షపూరిత రాజ‌కీయాలు చేశారని, ఇప్పుడు అదే పోలీసులు ప్ర‌భుత్వాన్ని అడ్డం పెట్టుకుని చెల‌రేగిపోతున్నారని తీవ్రంగా ఆరోపించారు. వ్య‌క్తిగ‌త స్వార్థ రాజ‌కీయాల కోసం వ్య‌వ‌స్థ‌ల‌ను నిర్వీర్యం చేసి వాడుకుంటే స‌మాజం ఎలా త‌యార‌వుతుందో చెప్ప‌డానికి కృష్ణలంక సీఐ నాగరాజు కార‌ణంగా జ‌రిగిన సాయికృష్ణ లాక‌ప్ డెత్‌, క్రాంతి కుమార్ ఆత్మ‌హ‌త్య దుర్ఘ‌ట‌న‌లే సాక్ష్యమని ఆయన పేర్కొన్నారు.

ప్ర‌భుత్వ వైఫ‌ల్యాలు, అప్ర‌జాస్వామిక విధానాల‌ను ప్ర‌శ్నిస్తుంటే కూట‌మి నాయ‌కులు త‌ట్టుకోలేక‌పోతున్నారని, అధికారాన్ని అడ్డం పెట్టుకుని ప్ర‌శ్నించే గొంతుల‌ను నొక్క‌డానికి తెగ‌బ‌డుతున్నారని అప్పిరెడ్డి మండిపడ్డారు. అందులో భాగంగానే నెల్లూరులోని ఎమ్మెల్సీ ప‌ర్వ‌త‌రెడ్డి చంద్ర‌శేఖ‌ర్ రెడ్డికి చెందిన‌ విద్యాసంస్థ‌ల‌పై త‌నిఖీల పేరుతో దాడుల‌కు పూనుకున్నారని ఆయన వెల్లడించారు.

డీఎస్సీ-2025 నిర్వ‌హ‌ణ‌లో జ‌రిగిన అక్ర‌మాలు, అవ‌కత‌వకలు, అలాగే తిరుమ‌ల ల‌డ్డూలో క‌ల్తీ నెయ్యి వాడారనే ఆరోప‌ణలు చేసి ఇందాపూర్ డెయిరీ ముసుగులో హెరిటేజ్‌కి లబ్ధి చేకూర్చారని ఆధారాల‌తో స‌హా నిరూపిస్తూ వైయస్ఆర్ సీపీ త‌ర‌ఫున చంద్ర‌శేఖర్ రెడ్డి బలంగా తన గొంతు వినిపించడంతో ప్ర‌భుత్వం ఇరుకున పడిందని అప్పిరెడ్డి వివరించారు. ప్ర‌భుత్వ ఉద్యోగుల స‌మ‌స్య‌ల‌పై ఎప్పటికప్పుడు స్పందిస్తూ కూట‌మి ప్ర‌భుత్వానికి కంటిలో న‌లుసుగా మారినందుకే ఆయనపై క‌క్ష పెంచుకుందని కూడా ఆయన ఆరోపించారు.
    user_Stv9 Press
    Stv9 Press
    తిరుపతి (గ్రామీణ), తిరుపతి, ఆంధ్రప్రదేశ్•
    4 hrs ago
  • కాంగ్రెస్ సీనియర్ నాయకుడు తులసి రెడ్డి ప్రజలకు ప్రతి రోజూ యోగా సాధన చేయాలని సూచించారు. ఆదివారం అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా, ఆయన పట్టణంలోని వైఎస్సార్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లోని హాకీ మైదానం మరియు ఇందిరమ్మ రాణితోపు పార్కులలో యోగాసనాలు వేశారు. ఈ కార్యక్రమంలో యోగా గురువులు వెంకట్రాంరెడ్డి మరియు ఓం ప్రకాశ్ యోగా ప్రాముఖ్యతను వివరించారు. వారు యోగాసనాలు చేయించడంతో పాటు, ప్రాణాయామం కూడా చేయించారు.
    1
    కాంగ్రెస్ సీనియర్ నాయకుడు తులసి రెడ్డి ప్రజలకు ప్రతి రోజూ యోగా సాధన చేయాలని సూచించారు. ఆదివారం అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా, ఆయన పట్టణంలోని వైఎస్సార్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లోని హాకీ మైదానం మరియు ఇందిరమ్మ రాణితోపు పార్కులలో యోగాసనాలు వేశారు.

ఈ కార్యక్రమంలో యోగా గురువులు వెంకట్రాంరెడ్డి మరియు ఓం ప్రకాశ్ యోగా ప్రాముఖ్యతను వివరించారు. వారు యోగాసనాలు చేయించడంతో పాటు, ప్రాణాయామం కూడా చేయించారు.
    user_LAKKU SIVA SANKAR reddy
    LAKKU SIVA SANKAR reddy
    Court reporter పులివెందుల, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    9 hrs ago
  • కడప జిల్లాలోని పులివెందుల నియోజకవర్గంలో తీవ్ర విషాదం నెలకొంది, నీటిలో మునిగి ముగ్గురు మృతి చెందారు. ఈ ఘటన నియోజకవర్గంలోని చక్రాయపేట మండలం అద్దాలమర్రి గ్రామంలో జరిగింది. మృతి చెందిన వారిలో 18 ఏళ్ల జయవర్ధన్ రెడ్డి, 16 ఏళ్ల రాజా వర్ధన్ రెడ్డి అనే ఇద్దరు అన్నదమ్ములు నదిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. ఈ మరణాలకు అక్రమ ఇసుక తవ్వకాలే ప్రధాన కారణమని పలువురు గ్రామస్థులు ఆందోళనకు దిగారు. అక్రమంగా జరుగుతున్న ఇసుక తవ్వకాల వల్లే ఈ విషాదం చోటు చేసుకుందని గ్రామస్థులు నిరసన వ్యక్తం చేశారు.
    1
    కడప జిల్లాలోని పులివెందుల నియోజకవర్గంలో తీవ్ర విషాదం నెలకొంది, నీటిలో మునిగి ముగ్గురు మృతి చెందారు. ఈ ఘటన నియోజకవర్గంలోని చక్రాయపేట మండలం అద్దాలమర్రి గ్రామంలో జరిగింది. మృతి చెందిన వారిలో 18 ఏళ్ల జయవర్ధన్ రెడ్డి, 16 ఏళ్ల రాజా వర్ధన్ రెడ్డి అనే ఇద్దరు అన్నదమ్ములు నదిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు.

ఈ మరణాలకు అక్రమ ఇసుక తవ్వకాలే ప్రధాన కారణమని పలువురు గ్రామస్థులు ఆందోళనకు దిగారు. అక్రమంగా జరుగుతున్న ఇసుక తవ్వకాల వల్లే ఈ విషాదం చోటు చేసుకుందని గ్రామస్థులు నిరసన వ్యక్తం చేశారు.
    user_LAKKU SIVA SANKAR reddy
    LAKKU SIVA SANKAR reddy
    Court reporter పులివెందుల, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    4 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.