logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

కేశంపేట మండలం తొమ్మిది రేకుల ప్రభుత్వ పాఠశాలకు వాటర్ ఫిల్టర్ కేశంపేట: తొమ్మిది రేకుల గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు శుద్ధమైన తాగునీరు అందించేందుకు కాంగ్రెస్ కార్యకర్తలు రూ.18 వేలతో కొనుగోలు చేసిన వాటర్ ఫిల్టర్‌ను గ్రామ సర్పంచ్ బీస కవితా కరుణాకర్ రెడ్డి గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ విద్యార్థులకు స్వచ్ఛమైన, శుద్ధమైన తాగునీరు అందించేందుకు వాటర్ ఫిల్టర్ ఏర్పాటు చేయడం సంతోషకరమన్నారు. విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఇలాంటి సేవా కార్యక్రమాలను మరింతగా కొనసాగించాలని ఆకాంక్షించారు. వాటర్ ఫిల్టర్ ఏర్పాటుకు సహకరించిన కాంగ్రెస్ కార్యకర్తలకు పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ రవి నాయక్, మాజీ ఎంపీటీసీ రంగయ్య, నరసింహారెడ్డి, ప్రధానోపాధ్యాయులు శ్యాంసుందర్, వార్డు సభ్యులు పోగుల నర్సింలు, నరేష్, లచ్చిరామ్ నాయక్, కందెన సంతోష శివయ్య, ప్రేమలత యాదయ్య, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

3 hrs ago
user_S M S R R
S M S R R
Graphic designer కేశంపేట్, రంగారెడ్డి, తెలంగాణ•
3 hrs ago
c3ce02e8-121b-44b7-9012-3dd78c5bd01e

కేశంపేట మండలం తొమ్మిది రేకుల ప్రభుత్వ పాఠశాలకు వాటర్ ఫిల్టర్ కేశంపేట: తొమ్మిది రేకుల గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు శుద్ధమైన తాగునీరు అందించేందుకు కాంగ్రెస్ కార్యకర్తలు రూ.18 వేలతో కొనుగోలు చేసిన వాటర్ ఫిల్టర్‌ను గ్రామ సర్పంచ్ బీస కవితా కరుణాకర్ రెడ్డి గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ విద్యార్థులకు స్వచ్ఛమైన, శుద్ధమైన తాగునీరు అందించేందుకు వాటర్ ఫిల్టర్ ఏర్పాటు చేయడం సంతోషకరమన్నారు. విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఇలాంటి సేవా కార్యక్రమాలను మరింతగా కొనసాగించాలని ఆకాంక్షించారు. వాటర్ ఫిల్టర్ ఏర్పాటుకు సహకరించిన కాంగ్రెస్ కార్యకర్తలకు పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ రవి నాయక్, మాజీ ఎంపీటీసీ రంగయ్య, నరసింహారెడ్డి, ప్రధానోపాధ్యాయులు శ్యాంసుందర్, వార్డు సభ్యులు పోగుల నర్సింలు, నరేష్, లచ్చిరామ్ నాయక్, కందెన సంతోష శివయ్య, ప్రేమలత యాదయ్య, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

More news from తెలంగాణ and nearby areas
  • ఏ రేవంత్ రెడ్డి అంటే అనుముల రేవంత్ రెడ్డి కాదు, ఆంధ్ర రేవంత్ రెడ్డి: కవిత ఏ రేవంత్ రెడ్డి అంటే అనుముల రేవంత్ రెడ్డి కాదు, ఆంధ్ర రేవంత్ రెడ్డి అనాల్సిన పరిస్థితి వస్తుందని టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కల్వకుంట్ల కవిత అన్నారు. తెలంగాణ బ్రాహ్మణ పరిషత్ పదవులను పక్క రాష్ట్రం వారికి ఇవ్వడాన్ని మరియు మన ఉద్యమకారులను దూషించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అన్నారు. తెలంగాణ బ్రాహ్మణులకు గౌరవం దక్కాల్సిందే, బ్రాహ్మణ పరిషత్ చైర్మన్, వైస్ చైర్మన్‌లను తక్షణమే తొలగించాలన్నారు.
    1
    ఏ రేవంత్ రెడ్డి అంటే అనుముల రేవంత్ రెడ్డి కాదు, ఆంధ్ర రేవంత్ రెడ్డి: కవిత
ఏ రేవంత్ రెడ్డి అంటే అనుముల రేవంత్ రెడ్డి కాదు, ఆంధ్ర రేవంత్ రెడ్డి అనాల్సిన పరిస్థితి వస్తుందని టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కల్వకుంట్ల కవిత అన్నారు. తెలంగాణ బ్రాహ్మణ పరిషత్ పదవులను పక్క రాష్ట్రం వారికి ఇవ్వడాన్ని మరియు మన ఉద్యమకారులను దూషించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అన్నారు. తెలంగాణ బ్రాహ్మణులకు గౌరవం దక్కాల్సిందే, బ్రాహ్మణ పరిషత్ చైర్మన్, వైస్ చైర్మన్‌లను తక్షణమే తొలగించాలన్నారు.
    user_Anji
    Anji
    మహబూబ్‌నగర్ రూరల్, మహబూబ్‌నగర్, తెలంగాణ•
    18 min ago
  • ABN ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకు వార్నింగ్ ఇచ్చిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి సోదరా ABN రాధాకృష్ణ మాగురించి రాసే ముందు చూసుకొని రాయి, బావుండదు హెచ్చరిస్తున్నా కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని మర్యాదగా ఉంటే మంచిది ABN రాధాకృష్ణకు వార్నింగ్ ఇచ్చిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ABN లాంటి 100 ఛానళ్ళు పెట్టే శక్తి మాకు ఉంది మేము అనుకుంటే ఇక్కడ ఏ ఛానల్ ఉండదు, ఏ పేపర్ ఉండదు మీడియా అంటే, జర్నలిస్టులు అంటే నాకు గౌరవం ఉంది ఇప్పుడు ABN ఛానల్ ఎవరికి సపోర్ట్ చేస్తుంది.. మా గురించి రాసేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని రాయి రాధాకృష్ణ కానీ మీడియా ముసుగులో తెలంగాణలో మాలాంటి రాజకీయ నాయకులని కించపరిచే విధంగా చేస్తున్న ఆంధ్ర మీడియా ఛానళ్ళకు వార్నింగ్ ఇస్తున్నా ఆంధ్ర మీడియా ఛానళ్ళు మాకు సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అవసరం లేదు - కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
    1
    ABN ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకు వార్నింగ్ ఇచ్చిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి
సోదరా ABN రాధాకృష్ణ  మాగురించి రాసే ముందు చూసుకొని రాయి, బావుండదు హెచ్చరిస్తున్నా
కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని మర్యాదగా ఉంటే మంచిది
ABN రాధాకృష్ణకు వార్నింగ్ ఇచ్చిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
ABN లాంటి 100 ఛానళ్ళు పెట్టే శక్తి మాకు ఉంది
మేము అనుకుంటే ఇక్కడ ఏ ఛానల్ ఉండదు, ఏ పేపర్ ఉండదు
మీడియా అంటే, జర్నలిస్టులు అంటే నాకు గౌరవం ఉంది
ఇప్పుడు ABN ఛానల్ ఎవరికి సపోర్ట్ చేస్తుంది.. మా గురించి రాసేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని రాయి రాధాకృష్ణ
కానీ మీడియా ముసుగులో తెలంగాణలో మాలాంటి రాజకీయ నాయకులని కించపరిచే విధంగా చేస్తున్న ఆంధ్ర మీడియా ఛానళ్ళకు వార్నింగ్ ఇస్తున్నా
ఆంధ్ర మీడియా ఛానళ్ళు మాకు సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అవసరం లేదు
- కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
    user_Sangareddy News
    Sangareddy News
    Local News Reporter Saidabad, Hyderabad•
    20 hrs ago
  • పాలిటెక్నిక్ కళాశాలలపై జీవో 97 రద్దు చేయాలి విద్యార్థులకు అన్యాయం జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి: డా. రామచంద్రరావు హైదరాబాద్: తెలంగాణలోని పాలిటెక్నిక్ కళాశాలలను స్కిల్ ఎడ్యుకేషనల్ వ్యవస్థతో అనుసంధానం చేసేందుకు ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 97పై విద్యార్థి సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఈ జీవో అమలు వల్ల పాలిటెక్నిక్ విద్యార్థుల భవిష్యత్తుకు నష్టం కలుగుతుందని, తమకు అన్యాయం జరుగుతుందని విద్యార్థి సంఘాల నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జీవో 97ను పునఃసమీక్షించి రద్దు చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు డా. రామచంద్రరావు, మల్కాజ్గిరి ఎంపీ డిమాండ్ చేశారు. పాలిటెక్నిక్ విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం తక్షణమే స్పందించాలని, విద్యార్థుల ప్రయోజనాలకు విఘాతం కలగకుండా తగిన నిర్ణయం తీసుకోవాలని వారు కోరారు.
    1
    పాలిటెక్నిక్ కళాశాలలపై జీవో 97 రద్దు చేయాలి

విద్యార్థులకు అన్యాయం జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి: డా. రామచంద్రరావు
హైదరాబాద్: తెలంగాణలోని పాలిటెక్నిక్ కళాశాలలను స్కిల్ ఎడ్యుకేషనల్ వ్యవస్థతో అనుసంధానం చేసేందుకు ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 97పై విద్యార్థి సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఈ జీవో అమలు వల్ల పాలిటెక్నిక్ విద్యార్థుల భవిష్యత్తుకు నష్టం కలుగుతుందని, తమకు అన్యాయం జరుగుతుందని విద్యార్థి సంఘాల నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు.
విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జీవో 97ను పునఃసమీక్షించి రద్దు చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు డా. రామచంద్రరావు, మల్కాజ్గిరి ఎంపీ డిమాండ్ చేశారు.
పాలిటెక్నిక్ విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం తక్షణమే స్పందించాలని, విద్యార్థుల ప్రయోజనాలకు విఘాతం కలగకుండా తగిన నిర్ణయం తీసుకోవాలని వారు కోరారు.
    user_Bhaskar Reddy
    Bhaskar Reddy
    Detective కాప్రా, మేడ్చల్ మల్కాజ్‌గిరి, తెలంగాణ•
    42 min ago
  • శ్రీ ఏడుపాయల వనదుర్గ భవాని అమ్మవారి ప్రత్యేక మంగళహారతి శ్రీ ఏడుపాయల మండల దుర్గ భవాని అమ్మవారిని గురువారం ప్రత్యేకంగా అలంకరించారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని నాగసానుపల్లి గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారి ఆలయంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి, ప్రత్యేక పూజలు, అభిషేకాలు, ఆరుతులను నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు.
    1
    శ్రీ ఏడుపాయల వనదుర్గ భవాని అమ్మవారి ప్రత్యేక మంగళహారతి
శ్రీ ఏడుపాయల మండల దుర్గ భవాని అమ్మవారిని గురువారం ప్రత్యేకంగా అలంకరించారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని నాగసానుపల్లి గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారి ఆలయంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి, ప్రత్యేక పూజలు, అభిషేకాలు, ఆరుతులను నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు.
    user_SREEYAN
    SREEYAN
    పటాన్‌చెరు, సంగారెడ్డి, తెలంగాణ•
    7 hrs ago
  • *కోర్టు పరిధిలో భూమి..! కబ్జాలోకి ఎలా వచ్చింది.?* *ఈదులనాగులపల్లిలో సర్వే నంబర్లు 134, 135పై రైతుల ఆందోళన* *తమ భూములు తమకు దక్కే వరకు పోరాటం చేస్తారంటున్న రైతులు* *కోర్టు పరిధిలో ఉన్న భూములలొ జేసీబీలతో రోడ్డు పనులు ఎలా చేస్తారు* *రియల్‌ వ్యాపారుల పనులను అడ్డుకున్న గ్రామస్తులు* *అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదంటూ రైతుల ప్రశ్న* *తహసీల్దార్‌కు ఫిర్యాదు.. కలెక్టర్‌ను కలవనున్న గ్రామస్తులు* *భూముల రక్షణ కొరకు  కార్యాచరణ కమిటీ ఏర్పాటు* *రోడ్డు పనులకు అనుమతులు ఎవరు అనుమతులు ఇచ్చారు* *కోర్టు వివాదం నడుస్తుండగానే పనులెలా సాగిస్తారు* తమ భూములు తమకు దక్కేవరకు పోరాటం చేస్తామని ఈదులనాగులపల్లి గ్రామ రైతులు స్పష్టం చేశారు. పటాన్‌చెరు నియోజకవర్గంలోని రామచంద్రపురం మండలం, ఈదులనాగులపల్లి గ్రామ పరిధిలోని సర్వే నంబర్లు 134, 135లోని భూములపై వివాదం కొనసాగుతోంది. తమ భూములకు సంబంధించిన వివాదం న్యాయస్థాన పరిధిలో ఉండగానే రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు జేసీబీలతో రోడ్డు పనులు చేపట్టడం రైతులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కోర్టు పరిధిలో ఉన్న భూమిలో పనులు చేపట్టేందుకు అనుమతి ఎవరు ఇచ్చారు? అధికారులు ఎందుకు స్పందించడం లేదని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. బుధవారం ఓ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు జేసీబీలతో భూమి చుట్టూ మట్టి రోడ్డు వేస్తుండటాన్ని గమనించిన గ్రామస్తులు అక్కడికి చేరుకుని పనులను అడ్డుకున్నారు. అప్పటికే కొంత దూరం వరకు మట్టి రోడ్డు వేసినట్లు గ్రామస్తులు తెలిపారు. కోర్టులో వివాదం కొనసాగుతున్న భూమిలో ఎలాంటి నిర్మాణాలు, రోడ్డు పనులు, ఇతర మార్పులు జరగకుండా అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంపై రైతులు ఆర్‌సీ పురం తహసీల్దార్‌ను కలిసి తమ ఆవేదనను వ్యక్తం చేశారు. అయితే ఆమె ఇది తన పరిధిలోకి రాదని తప్పించుకున్నట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కోర్టు పరిధిలో ఉన్న భూమిలో పనులు జరుగుతున్న అంశంపై సమగ్ర విచారణ చేపట్టి, భూముల రికార్డులు, కోర్టు కేసు వివరాలను పరిశీలించాలని గ్రామస్తులు ఆమెను కోరారు. వివాదాస్పద భూములను పరిరక్షించడంతో పాటు నిబంధనలకు విరుద్ధంగా పనులు చేపడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఈ సమస్యపై భవిష్యత్‌ కార్యాచరణ రూపొందించేందుకు గ్రామస్తులు సమావేశం నిర్వహించారు. తమ భూములు తమకు దక్కే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. సమస్యను జిల్లా స్థాయికి తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నారు. సోమవారం సంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ను కలిసి ప్రజావాణిలో ఫిర్యాదు చేయనున్నట్లు రైతులు తెలిపారు. భూముల పరి రక్షణ కోసం కార్యచరణ కమిటీని ఏర్పాటు చేసి, తదుపరి పోరాట కార్యక్రమాలను ప్రకటించనున్నట్లు వెల్లడించారు. న్యాయస్థానంలో వివాదం కొనసాగుతున్న భూమిలో రియల్ వ్యాపారులు జేసీబీలతో రోడ్డు పనులు చేపట్టడంపై అధికారులు తక్షణమే స్పందించాలని గ్రామస్తులు కోరుతున్నారు. కోర్టు పరిధిలోని భూములలో రోడ్డు పనులు చేపట్టడానికి అనుమతులు ఉన్నాయా? ఉంటే ఎవరు ఇచ్చారు? రికార్డులను పరిశీలించకుండానే పనులు ఎలా కొనసాగుతున్నాయనే అంశాలపై అధికారులు స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికైనా రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి, భూమి హద్దులు, రికార్డులు, కోర్టు కేసు పరిస్థితిని పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. లేదంటే తమ భూమి తమకు దక్కేవరకు పోరాటం తీవ్ర తరం చేస్తామని ఈదులనాగులపల్లి గ్రామస్తులు హెచ్చరిస్తున్నారు.
    3
    *కోర్టు పరిధిలో భూమి..! కబ్జాలోకి ఎలా వచ్చింది.?*


*ఈదులనాగులపల్లిలో సర్వే నంబర్లు 134, 135పై రైతుల ఆందోళన*


*తమ భూములు తమకు దక్కే వరకు పోరాటం చేస్తారంటున్న రైతులు*


*కోర్టు పరిధిలో ఉన్న భూములలొ జేసీబీలతో రోడ్డు పనులు ఎలా చేస్తారు*


*రియల్‌ వ్యాపారుల పనులను అడ్డుకున్న గ్రామస్తులు*


*అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదంటూ రైతుల ప్రశ్న*


*తహసీల్దార్‌కు ఫిర్యాదు.. కలెక్టర్‌ను కలవనున్న గ్రామస్తులు*


*భూముల రక్షణ కొరకు  కార్యాచరణ కమిటీ ఏర్పాటు*


*రోడ్డు పనులకు అనుమతులు ఎవరు అనుమతులు ఇచ్చారు*


*కోర్టు వివాదం నడుస్తుండగానే పనులెలా సాగిస్తారు*


తమ భూములు తమకు దక్కేవరకు పోరాటం చేస్తామని ఈదులనాగులపల్లి గ్రామ రైతులు స్పష్టం చేశారు. పటాన్‌చెరు నియోజకవర్గంలోని రామచంద్రపురం మండలం, ఈదులనాగులపల్లి గ్రామ పరిధిలోని సర్వే నంబర్లు 134, 135లోని భూములపై వివాదం కొనసాగుతోంది. తమ భూములకు సంబంధించిన వివాదం న్యాయస్థాన పరిధిలో ఉండగానే రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు జేసీబీలతో రోడ్డు పనులు చేపట్టడం రైతులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కోర్టు పరిధిలో ఉన్న భూమిలో పనులు చేపట్టేందుకు అనుమతి ఎవరు ఇచ్చారు? అధికారులు ఎందుకు స్పందించడం లేదని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. బుధవారం ఓ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు జేసీబీలతో భూమి చుట్టూ మట్టి రోడ్డు వేస్తుండటాన్ని గమనించిన గ్రామస్తులు అక్కడికి చేరుకుని పనులను అడ్డుకున్నారు. అప్పటికే కొంత దూరం వరకు మట్టి రోడ్డు వేసినట్లు గ్రామస్తులు తెలిపారు. కోర్టులో వివాదం కొనసాగుతున్న భూమిలో ఎలాంటి నిర్మాణాలు, రోడ్డు పనులు, ఇతర మార్పులు జరగకుండా అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేశారు.
ఈ వ్యవహారంపై రైతులు ఆర్‌సీ పురం తహసీల్దార్‌ను కలిసి తమ ఆవేదనను వ్యక్తం చేశారు. అయితే ఆమె ఇది తన పరిధిలోకి రాదని తప్పించుకున్నట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కోర్టు పరిధిలో ఉన్న భూమిలో పనులు జరుగుతున్న అంశంపై సమగ్ర విచారణ చేపట్టి, భూముల రికార్డులు, కోర్టు కేసు వివరాలను పరిశీలించాలని గ్రామస్తులు ఆమెను కోరారు. వివాదాస్పద భూములను పరిరక్షించడంతో పాటు నిబంధనలకు విరుద్ధంగా పనులు చేపడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఈ సమస్యపై భవిష్యత్‌ కార్యాచరణ రూపొందించేందుకు గ్రామస్తులు సమావేశం నిర్వహించారు. తమ భూములు తమకు దక్కే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. సమస్యను జిల్లా స్థాయికి తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నారు. సోమవారం సంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ను కలిసి ప్రజావాణిలో ఫిర్యాదు చేయనున్నట్లు రైతులు తెలిపారు. భూముల పరి రక్షణ కోసం కార్యచరణ కమిటీని ఏర్పాటు చేసి, తదుపరి పోరాట కార్యక్రమాలను ప్రకటించనున్నట్లు వెల్లడించారు. న్యాయస్థానంలో వివాదం కొనసాగుతున్న భూమిలో రియల్ వ్యాపారులు జేసీబీలతో రోడ్డు పనులు చేపట్టడంపై అధికారులు తక్షణమే స్పందించాలని గ్రామస్తులు కోరుతున్నారు. కోర్టు పరిధిలోని భూములలో రోడ్డు పనులు చేపట్టడానికి అనుమతులు ఉన్నాయా? ఉంటే ఎవరు ఇచ్చారు? రికార్డులను పరిశీలించకుండానే పనులు ఎలా కొనసాగుతున్నాయనే అంశాలపై అధికారులు స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికైనా రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి, భూమి హద్దులు, రికార్డులు, కోర్టు కేసు పరిస్థితిని పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. లేదంటే తమ భూమి తమకు దక్కేవరకు పోరాటం తీవ్ర తరం చేస్తామని ఈదులనాగులపల్లి గ్రామస్తులు హెచ్చరిస్తున్నారు.
    user_MUKKAGALLA YADANNA
    MUKKAGALLA YADANNA
    Local News Reporter అమీన్‌పూర్, సంగారెడ్డి, తెలంగాణ•
    18 hrs ago
  • మేడ్చల్‌ రాజకీయాల్లో కొత్త సమీకరణాలు.. బీసీ ఎమ్మెల్యే కోసం ‘సర్జికల్‌ స్ట్రైక్‌–59’ మేడ్చల్‌: నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. మేడ్చల్‌లో బీసీ సామాజిక వర్గానికి చెందిన పలువురు బలమైన నాయకులు ఉన్నప్పటికీ, ఇప్పటివరకు ఎమ్మెల్యేలుగా రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారే ఎన్నికవుతూ వచ్చారని ‘సర్జికల్‌ స్ట్రైక్‌–59’ ప్రతినిధులు పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో బీసీ అభ్యర్థిని ఎమ్మెల్యేగా గెలిపించడమే లక్ష్యంగా నియోజకవర్గంలో కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. బీసీలను ఏకతాటిపైకి తీసుకువచ్చి రాజకీయ ప్రాతినిధ్యం పెంచేందుకు కృషి చేస్తామని వెల్లడించారు.
    1
    మేడ్చల్‌ రాజకీయాల్లో కొత్త సమీకరణాలు.. బీసీ ఎమ్మెల్యే కోసం ‘సర్జికల్‌ స్ట్రైక్‌–59’
మేడ్చల్‌: నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. మేడ్చల్‌లో బీసీ సామాజిక వర్గానికి చెందిన పలువురు బలమైన నాయకులు ఉన్నప్పటికీ, ఇప్పటివరకు ఎమ్మెల్యేలుగా రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారే ఎన్నికవుతూ వచ్చారని ‘సర్జికల్‌ స్ట్రైక్‌–59’ ప్రతినిధులు పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో బీసీ అభ్యర్థిని ఎమ్మెల్యేగా గెలిపించడమే లక్ష్యంగా నియోజకవర్గంలో కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. బీసీలను ఏకతాటిపైకి తీసుకువచ్చి రాజకీయ ప్రాతినిధ్యం పెంచేందుకు కృషి చేస్తామని వెల్లడించారు.
    user_AlluriMahesh
    AlluriMahesh
    Local News Reporter Medchal, Medchal Malkajgiri•
    2 hrs ago
  • తీన్మార్ మల్లన్న సర్జికల్ స్ట్రైక్ లో మేడ్చల్ మల్కాజ్గిరి గురించి ప్రస్తావన
    1
    తీన్మార్ మల్లన్న సర్జికల్ స్ట్రైక్ లో మేడ్చల్ మల్కాజ్గిరి గురించి ప్రస్తావన
    user_బండారు రమేష్ యాదవ్ అడ్వకే
    బండారు రమేష్ యాదవ్ అడ్వకే
    Lawyer శేరిలింగంపల్లి, రంగారెడ్డి, తెలంగాణ•
    3 hrs ago
  • మాజీ మంత్రి హరీష్ రావు అరెస్ట్.. పోలీసుల దురుసు ప్రవర్తన హరీష్ రావు పట్ల పోలీసుల దురుసు ప్రవర్తన కనీసం వాహనం కూడా ఎక్కించకుండా కలెక్టరేట్ నుంచి పోలీస్ స్టేషన్‌కు కాలినడకన హరీష్ రావుని పోలీసులు తరలించారు. దీంతో హనుమకొండ కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత TNGO ధర్నాలో పాల్గొన్న హరీష్ రావుని పోలీసులు అరెస్ట్ చేశారు. పాలిటెక్నిక్ విద్యార్థులను కలవకుండా అదుపులోకి తీసుకొని.. సుబేదారి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పోలీసుల తీరుపై బీఆర్ఎస్ శ్రేణులు మండిపడుతున్నారు.
    1
    మాజీ మంత్రి హరీష్ రావు అరెస్ట్.. పోలీసుల దురుసు ప్రవర్తన
హరీష్ రావు పట్ల పోలీసుల దురుసు ప్రవర్తన  కనీసం వాహనం కూడా ఎక్కించకుండా కలెక్టరేట్ నుంచి పోలీస్ స్టేషన్‌కు కాలినడకన హరీష్ రావుని పోలీసులు తరలించారు. దీంతో హనుమకొండ కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత TNGO ధర్నాలో పాల్గొన్న హరీష్ రావుని పోలీసులు అరెస్ట్ చేశారు. పాలిటెక్నిక్ విద్యార్థులను కలవకుండా అదుపులోకి తీసుకొని.. సుబేదారి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పోలీసుల తీరుపై బీఆర్ఎస్ శ్రేణులు మండిపడుతున్నారు.
    user_Anji
    Anji
    మహబూబ్‌నగర్ రూరల్, మహబూబ్‌నగర్, తెలంగాణ•
    25 min ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.