logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ఇండిష్ మిలెట్స్ హోటల్ ప్రారంభించిన డిసిసి అధ్యక్షురాలు అంక్షారెడ్డి గజ్వేల్ జనవరి 10 :::గజ్వేల్ లో కెనరా బ్యాంక్ వెళ్ళే దారిలో మెయిన్ రోడ్డు లో నూతనంగా ఏర్పాటు చేసిన ఇండిష్ మిలెట్స్ హోటల్‌ను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన డిసిసి అధ్యక్షురాలు ఆంక్ష రెడ్డి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో ప్రజలు తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని, చిరుధాన్యాలతో చేసిన ఆహారం తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుందని పేర్కొన్నారు. యువత ఇటువంటి వినూత్నమన ఆరోగ్యకరమైన వ్యాపార రంగాల్లోకి రావడం అభినందనీయమని కొనియాడారు,అనంతరం హోటల్ యాజమాన్యం శ్రీధర్ రెడ్డి,ప్రదీప్ మాట్లాడుతూ మిల్లెట్స్ టిఫిన్ సెంటర్ లో రాగులు, జొన్నలు, సజ్జలు మరియు ఇతర చిరుధాన్యాలతో తయారు చేసిన వివిధ రకాల అల్పాహారాలు,భోజన సదుపాయాలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు మొనగారి రాజు, ప్రధాన కార్యదర్శి నక్క రాములు గౌడ్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు సమీర్,జంగం రమేష్ గౌడ్, గోవర్ధన్ రెడ్డి, మాజీ సర్పంచ్ రాములు గౌడ్,హోటల్ యాజమాన్యం, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు మరియు స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు.

15 hrs ago
user_B Narsimhulu
B Narsimhulu
Journalist గజ్వేల్, సిద్దిపేట, తెలంగాణ•
15 hrs ago
5c9693a8-3f53-442e-9bdd-58546ca7e3d1

ఇండిష్ మిలెట్స్ హోటల్ ప్రారంభించిన డిసిసి అధ్యక్షురాలు అంక్షారెడ్డి గజ్వేల్ జనవరి 10 :::గజ్వేల్ లో కెనరా బ్యాంక్ వెళ్ళే దారిలో మెయిన్ రోడ్డు లో నూతనంగా ఏర్పాటు చేసిన ఇండిష్ మిలెట్స్ హోటల్‌ను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన డిసిసి అధ్యక్షురాలు ఆంక్ష రెడ్డి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో ప్రజలు తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని, చిరుధాన్యాలతో చేసిన ఆహారం తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుందని పేర్కొన్నారు. యువత ఇటువంటి వినూత్నమన ఆరోగ్యకరమైన వ్యాపార రంగాల్లోకి రావడం అభినందనీయమని కొనియాడారు,అనంతరం హోటల్ యాజమాన్యం శ్రీధర్ రెడ్డి,ప్రదీప్ మాట్లాడుతూ మిల్లెట్స్ టిఫిన్ సెంటర్ లో రాగులు, జొన్నలు, సజ్జలు మరియు ఇతర చిరుధాన్యాలతో తయారు చేసిన వివిధ రకాల అల్పాహారాలు,భోజన సదుపాయాలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు మొనగారి రాజు, ప్రధాన కార్యదర్శి నక్క రాములు గౌడ్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు సమీర్,జంగం రమేష్ గౌడ్, గోవర్ధన్ రెడ్డి, మాజీ సర్పంచ్ రాములు గౌడ్,హోటల్ యాజమాన్యం, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు మరియు స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు.

More news from తెలంగాణ and nearby areas
  • గజ్వేల్ మున్సిపల్‌లో బిజెపి జెండా ఎగరవేస్తాం – బైరి శంకర్ 👉 గజ్వేల్ సిద్దిపేట జిల్లా జనవరి 10 ప్రజా తెలంగాణ న్యూస్/ సిద్దిపేట జిల్లా గజ్వేల్ మున్సిపాలిటీలోని అన్ని 20 వార్డుల్లో బిజెపి జెండాను గర్వంగా ఎగరవేస్తామని బిజెపి జిల్లా అధ్యక్షులు బైరి శంకర్ ధీమా వ్యక్తం చేశారు. గజ్వేల్‌లో నిర్వహించిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు.ప్రజా వ్యతిరేక విధానాలతో అధికార పార్టీ ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందని, రానున్న ఎన్నికల్లో గజ్వేల్ మున్సిపాలిటీలో బిజెపి అధికారంలోకి రావడం ఖాయమని తెలిపారు. ప్రతి వార్డులో బలమైన కమిటీలు ఏర్పాటు చేసి ప్రజల సమస్యలను పరిష్కరించే దిశగా బిజెపి పనిచేస్తోందని అన్నారు. గజ్వేల్ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వ పథకాలను పూర్తిస్థాయిలో వినియోగించుకుంటామని, మౌలిక వసతులు, తాగునీరు, రోడ్లు, పారిశుధ్యం వంటి అంశాల్లో ప్రజలకు మెరుగైన పాలన అందిస్తామని బైరి శంకర్ హామీ ఇచ్చారు.ఈ సమావేశంలో బిజెపి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని పార్టీ విజయానికి కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు.బైరి శంకర్ ముదిరాజ్, ఎల్లు రామ్ రెడ్డి, గడిపల్లి భాస్కర్, కప్పర ప్రసాద్ రావు, దేవులపల్లి మనోహర్ యాదవ్, శ్రీను, ఏల్కంటి సురేష్, చెప్యాల వెంకట్ రెడ్డి, సుభాష్ చంద్రబోస్, రామచంద్ర చారి, కమ్మరి, నాయిని సందీప్ కుమార్, మడుగురి నరసింహ ముదిరాజ్, బారు అరవింద్,నాగు ముదిరాజ్, బింగి లక్ష్మీనారాయణ, మంద వెంకట్,దయాకర్ రెడ్డి, పోకల ప్రభాకర్, రామచంద్ర రెడ్డి,నిరంజన్ రెడ్డి,సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు
    1
    గజ్వేల్ మున్సిపల్‌లో బిజెపి జెండా ఎగరవేస్తాం – బైరి శంకర్
👉 గజ్వేల్ సిద్దిపేట జిల్లా జనవరి 10 ప్రజా తెలంగాణ న్యూస్/
సిద్దిపేట జిల్లా గజ్వేల్ మున్సిపాలిటీలోని అన్ని 20 వార్డుల్లో బిజెపి జెండాను గర్వంగా ఎగరవేస్తామని బిజెపి జిల్లా అధ్యక్షులు బైరి శంకర్ ధీమా వ్యక్తం చేశారు. గజ్వేల్‌లో నిర్వహించిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు.ప్రజా వ్యతిరేక విధానాలతో అధికార పార్టీ ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందని, రానున్న ఎన్నికల్లో గజ్వేల్ మున్సిపాలిటీలో బిజెపి అధికారంలోకి రావడం ఖాయమని తెలిపారు. ప్రతి వార్డులో బలమైన కమిటీలు ఏర్పాటు చేసి ప్రజల సమస్యలను పరిష్కరించే దిశగా బిజెపి పనిచేస్తోందని అన్నారు.
గజ్వేల్ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వ పథకాలను పూర్తిస్థాయిలో వినియోగించుకుంటామని, మౌలిక వసతులు, తాగునీరు, రోడ్లు, పారిశుధ్యం వంటి అంశాల్లో ప్రజలకు మెరుగైన పాలన అందిస్తామని బైరి శంకర్ హామీ ఇచ్చారు.ఈ సమావేశంలో బిజెపి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని పార్టీ విజయానికి కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు.బైరి శంకర్ ముదిరాజ్,  ఎల్లు రామ్ రెడ్డి,  గడిపల్లి భాస్కర్, కప్పర ప్రసాద్ రావు, దేవులపల్లి మనోహర్ యాదవ్, శ్రీను, ఏల్కంటి సురేష్, చెప్యాల వెంకట్ రెడ్డి, సుభాష్ చంద్రబోస్, రామచంద్ర చారి, కమ్మరి, నాయిని సందీప్ కుమార్, మడుగురి నరసింహ ముదిరాజ్, బారు అరవింద్,నాగు ముదిరాజ్, బింగి లక్ష్మీనారాయణ, మంద వెంకట్,దయాకర్ రెడ్డి, పోకల ప్రభాకర్, రామచంద్ర రెడ్డి,నిరంజన్ రెడ్డి,సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు
    user_GOUSE BEURO REPORTER
    GOUSE BEURO REPORTER
    Reporter వర్గల్, సిద్దిపేట, తెలంగాణ•
    18 hrs ago
  • - ఏకశిలానగర్ రియల్ ఎస్టేట్ గుండా వెంకటేష్ కి సహకరిస్తుంది పోలీసులా ? ప్రభుత్వ పెద్దలా ? - ⁠ఈ ప్రాంత ఎంపీగా ఉన్న నేనే స్వయంగా హెచ్చరించిన తర్వాత కూడా బరితెగిస్తున్నారు అంటే ఎవరి అండ చూసుకుని ? - ⁠కత్తులు, రాడ్లతో దాడి చేసి చంపే ప్రయత్నం చేస్తున్నారంటే వీళ్ల వెనుక ఉంది ఎవరు ? - ⁠ప్రజల ప్రాణాలు పోతున్నా ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదు ? - ⁠పోలీసులు, లా అండ్ ఆర్డర్ ఏమైనట్టు ? - ⁠రోజుకో దగ్గర ఇలాంటి సంఘటనలు జరుగుతున్నా ప్రభుత్వం నిచ్చేస్టమై పోయింది. - ⁠ప్రజల రక్తం కళ్ళచూస్తున్నా కళ్లు తెరవని ప్రభుత్వం. - ⁠ముడుపుల కోసం నోరు మూసుకుంటే.. ప్రాణాలు పోతున్నా పట్టించుకోకపోతే.. ప్రజలు మిమ్మల్ని క్షమించరు. - ⁠వారికి అండగా మేమున్నాం.. ఉంటాం అంటున్న - ఈటల రాజేందర్.
    1
    - ఏకశిలానగర్ రియల్ ఎస్టేట్ గుండా వెంకటేష్ కి సహకరిస్తుంది పోలీసులా ? ప్రభుత్వ పెద్దలా ? 
- ⁠ఈ ప్రాంత ఎంపీగా ఉన్న నేనే స్వయంగా హెచ్చరించిన తర్వాత కూడా బరితెగిస్తున్నారు అంటే ఎవరి అండ చూసుకుని ? 
- ⁠కత్తులు, రాడ్లతో దాడి చేసి చంపే ప్రయత్నం చేస్తున్నారంటే వీళ్ల వెనుక ఉంది ఎవరు ? 
- ⁠ప్రజల ప్రాణాలు పోతున్నా ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదు ?
- ⁠పోలీసులు, లా అండ్ ఆర్డర్ ఏమైనట్టు ? 
- ⁠రోజుకో దగ్గర ఇలాంటి సంఘటనలు జరుగుతున్నా ప్రభుత్వం నిచ్చేస్టమై పోయింది. 
- ⁠ప్రజల రక్తం కళ్ళచూస్తున్నా కళ్లు తెరవని ప్రభుత్వం. 
- ⁠ముడుపుల కోసం నోరు మూసుకుంటే.. ప్రాణాలు పోతున్నా పట్టించుకోకపోతే.. ప్రజలు మిమ్మల్ని క్షమించరు. 
- ⁠వారికి అండగా మేమున్నాం.. ఉంటాం అంటున్న 
- ఈటల రాజేందర్.
    user_Journalist Madhu
    Journalist Madhu
    Journalist కాప్రా, మేడ్చల్ మల్కాజ్‌గిరి, తెలంగాణ•
    2 hrs ago
  • సంస్కృతికి ప్రతీక సంక్రాంతి పండగ: డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి అనిల్
    1
    సంస్కృతికి ప్రతీక సంక్రాంతి పండగ: డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి అనిల్
    user_Sangareddy News
    Sangareddy News
    Journalist రామచంద్రాపురం, సంగారెడ్డి, తెలంగాణ•
    17 hrs ago
  • కరీంనగర్ జిల్లా హైదరాబాద్ ప్రధాన రహదారి అలుగునూరు బ్రిడ్జిపై మారుతి 800 కారులో మంటలు తగలబడుతున్న కారు భారీగా వాహనాలు నిలిచిపోవడంతో ట్రాఫిక్ అంతరాయం కు కలిగింది పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది
    1
    కరీంనగర్ జిల్లా హైదరాబాద్ ప్రధాన రహదారి అలుగునూరు బ్రిడ్జిపై మారుతి 800 కారులో మంటలు తగలబడుతున్న కారు భారీగా వాహనాలు నిలిచిపోవడంతో ట్రాఫిక్ అంతరాయం కు కలిగింది  పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది
    user_ఉమ్మడి కరీంనగర్ జిల్లా అప్డేట్స్
    ఉమ్మడి కరీంనగర్ జిల్లా అప్డేట్స్
    Reporter కరీంనగర్ రూరల్, కరీంనగర్, తెలంగాణ•
    19 hrs ago
  • ములుగు జిల్లా మేడారంకు నేడు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటు ఐదుగురు మంత్రులు రానున్నారు. సమ్మక్క–సారక్క దేవతలకు మొక్కులు చెల్లించుకుని, మహా జాతర–2026 ఏర్పాట్లు, అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కొండా సురేఖ, సీతక్క, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ పాల్గొననున్నారు. ఇదే నెల 18 సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటుంబ సమేతంగా మేడారం రానుండగా, 19న ఆధునీకరించిన మాస్టర్ ప్లాన్‌ను ప్రారంభించి సమ్మక్క–సారక్క దేవతలకు మొక్కులు చెల్లించనున్నారు. మేడారం ఆధునీకరణ పనులు తుది దశకు చేరుకున్నాయి.
    1
    ములుగు జిల్లా మేడారంకు నేడు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటు ఐదుగురు మంత్రులు రానున్నారు. సమ్మక్క–సారక్క దేవతలకు మొక్కులు చెల్లించుకుని, మహా జాతర–2026 ఏర్పాట్లు, అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కొండా సురేఖ, సీతక్క, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ పాల్గొననున్నారు.
ఇదే నెల 18 సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటుంబ సమేతంగా మేడారం రానుండగా, 19న ఆధునీకరించిన మాస్టర్ ప్లాన్‌ను ప్రారంభించి సమ్మక్క–సారక్క దేవతలకు మొక్కులు చెల్లించనున్నారు. మేడారం ఆధునీకరణ పనులు తుది దశకు చేరుకున్నాయి.
    user_M D Azizuddin
    M D Azizuddin
    Journalist వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    4 hrs ago
  • సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాద్ పట్టణం ఖాళీగా దర్శనమిస్తుంది. నల్గొండ మీదుగా విజయవాడ వెళ్లే వాహనాల రద్దీ పెరగడంతో రోడ్లు ట్రాఫిక్ జాములతో దర్శనమిస్తోంది. నిన్న ఈరోజు దాదాపు లక్ష వాహనాలు విజయవాడ వైపుగా వెళ్ళినట్లు కొర్లపాడు చౌటుప్పల్ టోల్ ప్లాజా సిబ్బంది వెల్లడించారు. ఆదివారం కావడంతో తెల్లవారుజాము నుంచే విపరీతమైన ట్రాఫిక్ జాం నెలకొంది.
    1
    సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాద్ పట్టణం ఖాళీగా దర్శనమిస్తుంది. నల్గొండ మీదుగా విజయవాడ వెళ్లే వాహనాల రద్దీ పెరగడంతో రోడ్లు ట్రాఫిక్ జాములతో దర్శనమిస్తోంది. నిన్న ఈరోజు దాదాపు లక్ష వాహనాలు విజయవాడ వైపుగా వెళ్ళినట్లు కొర్లపాడు చౌటుప్పల్ టోల్ ప్లాజా సిబ్బంది వెల్లడించారు. ఆదివారం కావడంతో తెల్లవారుజాము నుంచే విపరీతమైన ట్రాఫిక్ జాం నెలకొంది.
    user_Journalist Prem
    Journalist Prem
    Journalist చింత పల్లె, నల్గొండ, తెలంగాణ•
    1 hr ago
  • కరాటే పోటీలు ప్రారంభించిన మాజీ మంత్రి ఎర్రబెల్లి.. వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామంలో జరిగిన కరాటే పోటీలను మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రారంభించారు. పిల్లలు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని, ఆటలు, ధ్యానం వంటివి వారి మేధస్సును మెరుగుపరుస్తాయని ఆయన అన్నారు. పాఠశాల నుండి వచ్చిన తర్వాత పిల్లలకు సమయం కేటాయించి, సెల్ ఫోన్లకు అలవాటు పడకుండా చూడాల్సిన బాధ్యత తల్లిదండ్రులదేనని ఆయన సూచించారు.
    1
    కరాటే పోటీలు ప్రారంభించిన మాజీ మంత్రి ఎర్రబెల్లి..
వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామంలో జరిగిన కరాటే పోటీలను మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రారంభించారు. పిల్లలు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని, ఆటలు, ధ్యానం వంటివి వారి మేధస్సును మెరుగుపరుస్తాయని ఆయన అన్నారు. పాఠశాల నుండి వచ్చిన తర్వాత పిల్లలకు సమయం కేటాయించి, సెల్ ఫోన్లకు అలవాటు పడకుండా చూడాల్సిన బాధ్యత తల్లిదండ్రులదేనని ఆయన సూచించారు.
    user_Chetty:Ramesh
    Chetty:Ramesh
    Narsampet, Warangal•
    23 hrs ago
  • 👉గజ్వేల్ జనవరి 10 ప్రజా తెలంగాణ న్యూస్ మేడారం జాతరకు కేసీఆర్ ను ఆహ్వానించిన మంత్రులు సీతక్క, కొండా సురేఖ అమ్మ బాగున్నారా అని ఆత్మీయంగా పలకరించిన కేసీఆర్ టిఆర్ఎస్ అధినేత కేసిఆర్ ను సమ్మక్క సారలమ్మ జాతరను ఆహ్వానించిన మంత్రులు సీతక్క కొండా సురేఖ తెలంగాణ శాసనసభ ప్రధాన ప్రతిపక్ష నేతను గజ్వేల్ ఎర్రవెల్లిలోని తననివాసానికి వచ్చిన మహిళా మంత్రులను బీఆర్ఎ ఎస్ అధినేత కేసీఆర్ ఆత్మీయంగా స్వాగతించారు. తెలంగాణ మంత్రులు సీతక్క, కొండా సురేఖలు కేసీఆర్ను మర్యాదపూర్వకంగా కలిసి మేడారం జాతర ఆహ్వాన పత్రికను అందజేశారు. జాతర ప్రసాదాన్ని అందించి, రాష్ట్ర ప్రభుత్వ తరపున జాతరకు రావాలని ఆహ్వానించారు. ఈ సందర్భంగా కేసీఆర్ దంపతులు సాంప్రదాయ పద్ధతిలో పసుపు, కుంకుమ, చీరలు, తాంబూలాలతో మంత్రులను సత్కరించారు. తేనీటి విందు అనంతరం యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. మంత్రులు ఎర్రవెల్లి నివాసానికి చేరుకున్నప్పుడు మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ స్వాగతం పలికారు.
    1
    👉గజ్వేల్ జనవరి 10 ప్రజా తెలంగాణ న్యూస్
మేడారం జాతరకు కేసీఆర్ ను ఆహ్వానించిన మంత్రులు సీతక్క, కొండా సురేఖ
అమ్మ బాగున్నారా అని ఆత్మీయంగా పలకరించిన కేసీఆర్
టిఆర్ఎస్ అధినేత కేసిఆర్ ను సమ్మక్క సారలమ్మ జాతరను ఆహ్వానించిన మంత్రులు సీతక్క కొండా సురేఖ
తెలంగాణ శాసనసభ ప్రధాన ప్రతిపక్ష నేతను గజ్వేల్ ఎర్రవెల్లిలోని తననివాసానికి వచ్చిన మహిళా మంత్రులను బీఆర్ఎ ఎస్ అధినేత కేసీఆర్ ఆత్మీయంగా స్వాగతించారు. తెలంగాణ మంత్రులు సీతక్క, కొండా సురేఖలు కేసీఆర్ను మర్యాదపూర్వకంగా కలిసి మేడారం జాతర ఆహ్వాన పత్రికను అందజేశారు. జాతర ప్రసాదాన్ని అందించి, రాష్ట్ర
ప్రభుత్వ తరపున జాతరకు రావాలని ఆహ్వానించారు. ఈ సందర్భంగా కేసీఆర్ దంపతులు సాంప్రదాయ పద్ధతిలో పసుపు, కుంకుమ, చీరలు, తాంబూలాలతో మంత్రులను సత్కరించారు. తేనీటి విందు అనంతరం యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. మంత్రులు ఎర్రవెల్లి నివాసానికి చేరుకున్నప్పుడు మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ స్వాగతం పలికారు.
    user_GOUSE BEURO REPORTER
    GOUSE BEURO REPORTER
    Reporter వర్గల్, సిద్దిపేట, తెలంగాణ•
    21 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.