విద్యాసంస్థలు, వసతి గృహాల్లో కలుషిత ఆహార ఘటనలు పునరావృతం కారాదు – జిల్లా కలెక్టర్ అంకిత్ జిల్లాలోని విద్యాసంస్థలు, వసతి గృహాల్లో కలుషిత ఆహార ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు ప్రత్యేక శ్రద్ధతో పర్యవేక్షణ చేపట్టాలని జిల్లా కలెక్టర్ అంకిత్ అధికారులను హెచ్చరించారు. మంగళవారం భద్రాచలం ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి రాహుల్తో కలిసి జిల్లాలోని సంబంధిత శాఖల అధికారులు, మండల ప్రత్యేక అధికారులు, ఎంఈఓలు, ఆర్‌సీవోలు, ఇతర అధికారులతో టెలీకాన్ఫరెన్స్ ద్వారా విద్యాసంస్థల్లో ఆహార భద్రతపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ విద్యాలయాలు, వసతి గృహాల్లో విద్యార్థులకు అందించే ఆహార నాణ్యతపై పూర్తి బాధ్యత సంబంధిత ఆర్‌సీవోలు, మండల ప్రత్యేక అధికారులు, జిల్లా అధికారులదేనని స్పష్టం చేశారు. కలుషిత ఆహార ఘటనలపై కేవలం వంటవారు లేదా వార్డెన్లపై చర్యలు తీసుకోవడం సరిపోదని, ఇటువంటి ఘటనలు పునరావృతమైతే సంబంధిత ఆర్‌సీవోలు, మండల ప్రత్యేక అధికారులు, జిల్లా స్థాయి అధికారులపై కూడా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇటీవల మణుగూరులోని మహాత్మ జ్యోతిబా ఫూలే గురుకుల బాలికల పాఠశాలలో జరిగిన కలుషిత ఆహార ఘటన దురదృష్టకరమని జిల్లా కలెక్టర్ చెప్పారు. ప్రాథమిక సమాచారం ప్రకారం కొందరు విద్యార్థినులు తమ తల్లిదండ్రులు ఇంటి నుండి తీసుకువచ్చిన బిర్యానీ, మాంసాహార పదార్థాలు తీసుకోవడంతో అస్వస్థతకు గురైనట్లు వెల్లడైంది. ఇలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా అధికారులు నిరంతర పర్యవేక్షణ, ఆకస్మిక తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు. పాఠశాలలు, వసతి గృహాల్లో ఏర్పాటు చేసిన ఆహార భద్రత కమిటీ సభ్యులు ముందుగా వండిన ఆహారాన్ని స్వయంగా రుచి చూసిన తరువాత మాత్రమే విద్యార్థులకు వడ్డించే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. విద్యార్థులకు అందించే ఆహారం నాణ్యమైనది, పరిశుభ్రమైనది, పోషకాహార ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా ప్రతి దశలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. జిల్లా అధికారులు, మండల ప్రత్యేక అధికారులు తమ పరిధిలోని విద్యాసంస్థలు, వసతి గృహాలను తరచూ సందర్శిస్తూ ఆహార నాణ్యత, పరిశుభ్రత, వంటశాల నిర్వహణ అంశాలను క్రమం తప్పకుండా పరిశీలించాలని ఆదేశించారు. విద్యార్థుల ఆరోగ్యం విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం సహించబోమని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటే సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు.
విద్యాసంస్థలు, వసతి గృహాల్లో కలుషిత ఆహార ఘటనలు పునరావృతం కారాదు – జిల్లా కలెక్టర్ అంకిత్ జిల్లాలోని విద్యాసంస్థలు, వసతి గృహాల్లో కలుషిత ఆహార ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు ప్రత్యేక శ్రద్ధతో పర్యవేక్షణ చేపట్టాలని జిల్లా కలెక్టర్ అంకిత్ అధికారులను హెచ్చరించారు. మంగళవారం భద్రాచలం ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి రాహుల్తో కలిసి జిల్లాలోని సంబంధిత శాఖల అధికారులు, మండల ప్రత్యేక అధికారులు, ఎంఈఓలు, ఆర్‌సీవోలు, ఇతర అధికారులతో టెలీకాన్ఫరెన్స్ ద్వారా విద్యాసంస్థల్లో ఆహార భద్రతపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ విద్యాలయాలు, వసతి గృహాల్లో విద్యార్థులకు అందించే ఆహార నాణ్యతపై పూర్తి బాధ్యత సంబంధిత ఆర్‌సీవోలు, మండల ప్రత్యేక అధికారులు, జిల్లా అధికారులదేనని స్పష్టం చేశారు. కలుషిత ఆహార ఘటనలపై కేవలం వంటవారు లేదా వార్డెన్లపై చర్యలు తీసుకోవడం సరిపోదని, ఇటువంటి ఘటనలు పునరావృతమైతే సంబంధిత ఆర్‌సీవోలు, మండల ప్రత్యేక అధికారులు, జిల్లా స్థాయి అధికారులపై కూడా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇటీవల మణుగూరులోని మహాత్మ జ్యోతిబా ఫూలే గురుకుల బాలికల పాఠశాలలో జరిగిన
కలుషిత ఆహార ఘటన దురదృష్టకరమని జిల్లా కలెక్టర్ చెప్పారు. ప్రాథమిక సమాచారం ప్రకారం కొందరు విద్యార్థినులు తమ తల్లిదండ్రులు ఇంటి నుండి తీసుకువచ్చిన బిర్యానీ, మాంసాహార పదార్థాలు తీసుకోవడంతో అస్వస్థతకు గురైనట్లు వెల్లడైంది. ఇలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా అధికారులు నిరంతర పర్యవేక్షణ, ఆకస్మిక తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు. పాఠశాలలు, వసతి గృహాల్లో ఏర్పాటు చేసిన ఆహార భద్రత కమిటీ సభ్యులు ముందుగా వండిన ఆహారాన్ని స్వయంగా రుచి చూసిన తరువాత మాత్రమే విద్యార్థులకు వడ్డించే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. విద్యార్థులకు అందించే ఆహారం నాణ్యమైనది, పరిశుభ్రమైనది, పోషకాహార ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా ప్రతి దశలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. జిల్లా అధికారులు, మండల ప్రత్యేక అధికారులు తమ పరిధిలోని విద్యాసంస్థలు, వసతి గృహాలను తరచూ సందర్శిస్తూ ఆహార నాణ్యత, పరిశుభ్రత, వంటశాల నిర్వహణ అంశాలను క్రమం తప్పకుండా పరిశీలించాలని ఆదేశించారు. విద్యార్థుల ఆరోగ్యం విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం సహించబోమని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటే సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు.
- భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: కొత్తగూడెం మున్సిపల్ మేయర్ గణేష్ నగరంలోని 35, 44వ డివిజన్ల పరిధిలో విస్తృతంగా పర్యటించారు. పాల్వంచ డివిజన్ పరిధిలోని ఈ ప్రాంతాల్లో మేయర్ పర్యటించి, స్థానిక ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా పారిశుధ్యం, డ్రైనేజీ వ్యవస్థ, త్రాగునీటి సరఫరా వంటి అంశాలపై స్థానికులతో చర్చించారు. ఈ సందర్భంగా పలువురు స్థానికులు మేడికుంట చెరువు కబ్జాకు గురవుతోందని మేయర్ దృష్టికి తీసుకువచ్చారు. చెరువు పరిసర ప్రాంతాల్లో చెత్తాచెదారం పేరుకుపోయి దుర్వాసన వస్తోందని, దీనివల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని వివరించారు. దీనిపై స్పందించిన మేయర్ గణేష్, మేడికుంట చెరువును పరిరక్షించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. చెరువు పరిసరాలను వెంటనే శుభ్రం చేయాలని, ఆక్రమణలను అడ్డుకోవాలని సూచించారు. నగరంలోని అన్ని డివిజన్లలో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇస్తామని ఈ సందర్భంగా మేయర్ హామీ ఇచ్చారు. ఈ పర్యటనలో మేయర్ వెంట సిపిఐ కార్పొరేటర్లు, మున్సిపల్ అధికారులు, సిపిఐ నాయకులు మరియు ఇతర స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.1
- पेट्रोल पंप पर बिजली का झटका लगने से दो लोगों की मौत मंचेरियल जिले के दांडेपल्ली मंडल के मेदारीपेट में एक बड़ा हादसा हुआ। सोमवार सुबह एक इंडियन पेट्रोल स्टेशन पर बिजली का झटका लगने से दो लोगों की मौके पर ही मौत हो गई। स्थानीय लोगों के अनुसार, पेट्रोल स्टेशन से एक लंबा लोहे का स्टैंड ले जाते समय मेन लाइन के बिजली के तार स्टैंड से टकराने से दो लोगों की बिजली का झटका लगने से मौत हो गई। मरने वालों की पहचान माधापुर के चल्ला लक्ष्मीनारायण (45) और वेलगानूर के चंदनगिरी नागराजू (40) के रूप में हुई है। दोनों स्थानीय स्तर पर मजदूरी करते हैं। दोनों की मौत से परिवार वाले दुखी हैं। मरने वालों के परिवार वालों ने चिंता जताई है कि यह हादसा बैंक मैनेजमेंट की लापरवाही के कारण हुआ है और उन्होंने मुआवजे की मांग की है। सब-इंस्पेक्टर तहसीनुद्दीन मौके पर पहुंचे, केस दर्ज किया और जानकारी इकट्ठा की।1
- Post by Gift maker1
- తాను మాట్లాడుతున్న సందర్భంలో ఎమ్మెల్యే డాక్టర్ భూక్యా మురళీనాయక్ ను అంకుల్ అంటూ సంబోధించిన బిఆర్ఎస్ పార్టీ కి చెందిన కౌన్సిలర్ తేజస్విని...* *ఎమ్మెల్యే ను సభలో అంకుల్ అంటారా..!! రిలేషన్ ఉంటే బయట ఇక్కడ కాదంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన కాంగ్రెస్ పార్టీకి చెందిన కౌన్సిలర్ లు...* *నేను అంత తప్పేం మాట్లాడానంటూ ప్రతివాదనకు దిగిన కౌన్సిలర్ తేజస్విని, మద్దతుగా గొంతుకలిపిన బిఆర్ఎస్ కౌన్సిలర్ లు...* సభ్యుల అరుపులతో రసాభాస.., వేడి పుట్టించిన "అంకుల్" సంబోధన..!!* పరిస్థితి మరింత గోల..గోలగా మారకుండా..!! ఇరువర్గాలకు సర్దిచెప్పి కూర్చోబెట్టిన సిపిఐ మున్సిపల్ ప్లోర్ లీడర్ అజయ్ సారధి....*1
- వరంగల్ జిల్లా కాజీపేట పరిధిలోని మడికొండ చౌరస్తాలో చెత్త డంపింగ్ యార్డ్ తొలగించాలని డిమాండ్ చేస్తూ స్థానికులు నిర్వహిస్తున్న నిరాహార దీక్షలో మంగళవారం ఉద్రిక్తత నెలకొంది. సమస్యపై అధికారులు స్పందించకపోవడంతో ఆందోళనలో పాల్గొన్న పండుగ రాజ్‌కుమార్ ఒంటిపై డీజిల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడటానికి ప్రయత్నించాడు. అయితే అక్కడే ఉన్న స్థానికులు, దీక్షలో పాల్గొన్నవారు వెంటనే అప్రమత్తమై ఆయనను అడ్డుకున్నారు. పరిస్థితి విషమించకుండా వెంటనే అతన్ని అక్కడి నుంచి తరలించారు. ఈ ఘటనతో అక్కడ కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మడికొండ చౌరస్తా సమీపంలో ఉన్న చెత్త డంపింగ్ యార్డ్ కారణంగా గత 15 ఏళ్లుగా తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెత్త నుండి వచ్చే దుర్వాసన, కాలుష్యం వల్ల పరిసర ప్రాంతాల్లో నివసించే ప్రజలు అనారోగ్య సమస్యలకు గురవుతున్నారని తెలిపారు. డంపింగ్ యార్డ్‌ను వెంటనే ఇతర ప్రాంతానికి తరలించాలని చాలా కాలంగా ప్రభుత్వానికి, సంబంధిత అధికారులకు విజ్ఞప్తులు చేస్తున్నప్పటికీ ఇప్పటివరకు సరైన చర్యలు తీసుకోలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. సమస్య పరిష్కారం కోసం నిరాహార దీక్ష చేపట్టినప్పటికీ స్పందన లేకపోవడంతో ప్రజల్లో ఆగ్రహం పెరుగుతోందని పేర్కొన్నారు. డంపింగ్ యార్డ్ సమస్యను వెంటనే పరిష్కరించి ప్రజలకు ఉపశమనం కల్పించాలని స్థానికులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.1
- ఓ సినిమాలోని సన్నివేశం ఆధారంగా రూపొందించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో ఒక రిటైర్డ్ మాస్టర్ తన పింఛన్ కోసం ప్రభుత్వ కార్యాలయాలకు ఎన్నోసార్లు తిరుగుతుంటాడు. అయినప్పటికీ అధికారులు పింఛన్ మంజూరు చేయకుండా లంచం కోరుతున్నట్లు చూపించారు. ఆ సన్నివేశంలో చదువు చెప్పిన గురువును కూడా ఒక మాజీ విద్యార్థి కూడా లంచం అడిగే అధికారిగా కనిపించడం హృదయాన్ని కలచివేస్తోంది. గురువునే లంచం అడిగే పరిస్థితి సమాజంలో పెరుగుతున్న అవినీతిని సూచిస్తోందని వీడియో సందేశం ఇస్తోంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు కూడా తమకు ప్రభుత్వ కార్యాలయాల్లో ఇలాంటి అనుభవాలు ఎదురయ్యాయని కామెంట్లు చేస్తున్నారు. సాధారణ ప్రజలు తమ హక్కుల కోసం తిరగాల్సిన పరిస్థితులు ఇంకా కొనసాగుతున్నాయంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చనీయాంశంగా మారింది.1
- నల్లజర్ల మండలం చీపురుగూడెంలో సీసీ రోడ్ల పనులను ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు సోమవారం పరిశీలించారు. నాణ్యమైన మౌలిక సదుపాయాల కల్పనే ప్రభుత్వ ధ్యేయమని తెలిపారు. గ్రామంలో కొత్త వాటర్ ట్యాంక్ నిర్మించాలని గ్రామస్తులు కోరగా, తాగునీటి సమస్య పరిష్కారానికి హామీ ఇచ్చారు. నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని ఈ సందర్భంగా ఎమ్మెల్యే పేర్కొన్నారు.1
- జిల్లాలో మంగళవారం నిర్వహించిన ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని జిల్లా ఇంటర్మీడియట్ అధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. జిల్లాలోని 37 పరీక్షా కేంద్రాలలో మొత్తం 8,737 మంది విద్యార్థులకు గాను 8,518 మంది హాజరై పరీక్ష రాశారని, 219 మంది గైర్హాజరయ్యారని తెలిపారు. పరీక్షల సందర్భంగా ఎటువంటి మాల్‌ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదని, పరీక్షా కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు సమర్థవంతంగా నిర్వహించబడినట్లు వెల్లడించారు. జిల్లాలో పరీక్షలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించబడినట్లు తెలిపారు.1