జైపూర్ పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన మంచిర్యాల డీసీపీ పివిఆర్ టీవీ9 న్యూస్ ప్రతినిధి జైపూర్ ఆగస్టు 26 జైపూర్ పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన మంచిర్యాల డీసీపీ పివిఆర్ టీవీ9 న్యూస్ ప్రతినిధి జైపూర్ ఆగస్టు 26 రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మంచిర్యాల జోన్‌లో ఉన్న జైపూర్ పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీల్లో భాగంగా మంచిర్యాల డీసీపీ ఎగ్గడి భాస్కర్ తనిఖీ చేశారు.ఈ సందర్భంగా ఏసీపీ వెంకటేశ్వర్లు, సీఐ నవీన్ ,ఎస్‌ఐ భూమేష్ పుష్పగుచ్ఛం అందించి ఆయనకు స్వాగతం పలికారు.అనంతరం డీసీపీ పోలీసు గౌరవ వందనాన్ని స్వీకరించారు. ముందుగా పోలీస్ స్టేషన్ పరిసరాలను, పలు కేసు లలో సిజ్ చేసిన వాహనాలను పరిశీలించి పోలీస్ స్టేషన్ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. అనంతరం రిసెప్షన్ సెంటర్‌లోని సిబ్బందితో మాట్లాడి రికార్డులను తనిఖీ చేశారు. స్టేషన్ రైటర్, సీసీటీఎన్‌ఎస్ రైటర్లతో మాట్లాడి ఆన్‌లైన్‌లో వివరాల నమోదు,అప్‌లోడ్ ప్రక్రియ గురించి తెలుసుకున్నారు. పెండింగ్ కేసుల ఫైళ్లు, క్రైమ్ రికార్డులు తదితర అంశాలను క్షుణ్ణంగా పరిశీలించారు. నమోదైన కేసులు, దర్యాప్తు పురోగతి, పెండింగ్ వ్యవహారాలపై సీఐ నవీన్, ఎస్‌ఐ భూమేష్ ను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ...., పోలీసు సిబ్బంది ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని, శాంతిభద్రతల పరిరక్షణలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆదేశించారు. పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామాలను తరచూ సందర్శిస్తూ ప్రజలతో సత్సంబంధాలు పెంపొందించుకోవడంతో పాటు సమాచార వ్యవస్థను మరింత పటిష్ఠం చేసుకోవాలని సూచించారు. మత్తు పదార్థాల నిర్మూలనకు ప్రత్యేక కృషి చేయాలని తెలిపారు. అలాగే రహదారి భద్రత,ట్రాఫిక్ నిబంధనలు,హెల్మెట్, సీటుబెల్ట్ ధరించడం యొక్క ఆవశ్యకతపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని సూచించారు.ప్రజల భద్రత దృష్ట్యా గ్రామాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు కోసం ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు వాటి ప్రాముఖ్యతపై ప్రజల్లో అవగాహన పెంపొందించాలని సూచించారు. అసాంఘిక కార్యకలాపాల నియంత్రణ కోసం రాత్రి వేళల్లో పెట్రోలింగ్‌ను మరింత సమర్థవంతంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. పోలీస్ స్టేషన్‌కు వచ్చే ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరించి, వారికి మెరుగైన సేవలు అందించాలని సూచించారు. *పోలీస్ అధికారులతో కలిసి డిసిపి పోలీస్ స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటారు.* ఈ తనిఖీలలో ఏసీపీ వెంకటేశ్వర్లు ,సీఐ నవీన్ ,ఎస్‌ఐ భూమేష్ తదితరులు పాల్గొన్నారు.
జైపూర్ పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన మంచిర్యాల డీసీపీ పివిఆర్ టీవీ9 న్యూస్ ప్రతినిధి జైపూర్ ఆగస్టు 26 జైపూర్ పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన మంచిర్యాల డీసీపీ పివిఆర్ టీవీ9 న్యూస్ ప్రతినిధి జైపూర్ ఆగస్టు 26 రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మంచిర్యాల జోన్‌లో ఉన్న జైపూర్ పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీల్లో భాగంగా మంచిర్యాల డీసీపీ ఎగ్గడి భాస్కర్ తనిఖీ చేశారు.ఈ సందర్భంగా ఏసీపీ వెంకటేశ్వర్లు, సీఐ నవీన్ ,ఎస్‌ఐ భూమేష్ పుష్పగుచ్ఛం అందించి ఆయనకు స్వాగతం పలికారు.అనంతరం డీసీపీ
పోలీసు గౌరవ వందనాన్ని స్వీకరించారు. ముందుగా పోలీస్ స్టేషన్ పరిసరాలను, పలు కేసు లలో సిజ్ చేసిన వాహనాలను పరిశీలించి పోలీస్ స్టేషన్ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. అనంతరం రిసెప్షన్ సెంటర్‌లోని సిబ్బందితో మాట్లాడి రికార్డులను తనిఖీ చేశారు. స్టేషన్ రైటర్, సీసీటీఎన్‌ఎస్ రైటర్లతో మాట్లాడి ఆన్‌లైన్‌లో వివరాల నమోదు,అప్‌లోడ్ ప్రక్రియ గురించి తెలుసుకున్నారు. పెండింగ్ కేసుల ఫైళ్లు, క్రైమ్ రికార్డులు తదితర అంశాలను క్షుణ్ణంగా పరిశీలించారు. నమోదైన కేసులు, దర్యాప్తు పురోగతి, పెండింగ్ వ్యవహారాలపై సీఐ నవీన్,
ఎస్‌ఐ భూమేష్ ను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ...., పోలీసు సిబ్బంది ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని, శాంతిభద్రతల పరిరక్షణలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆదేశించారు. పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామాలను తరచూ సందర్శిస్తూ ప్రజలతో సత్సంబంధాలు పెంపొందించుకోవడంతో పాటు సమాచార వ్యవస్థను మరింత పటిష్ఠం చేసుకోవాలని సూచించారు. మత్తు పదార్థాల నిర్మూలనకు ప్రత్యేక కృషి చేయాలని తెలిపారు. అలాగే రహదారి భద్రత,ట్రాఫిక్ నిబంధనలు,హెల్మెట్, సీటుబెల్ట్ ధరించడం యొక్క ఆవశ్యకతపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని సూచించారు.ప్రజల భద్రత దృష్ట్యా
గ్రామాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు కోసం ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు వాటి ప్రాముఖ్యతపై ప్రజల్లో అవగాహన పెంపొందించాలని సూచించారు. అసాంఘిక కార్యకలాపాల నియంత్రణ కోసం రాత్రి వేళల్లో పెట్రోలింగ్‌ను మరింత సమర్థవంతంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. పోలీస్ స్టేషన్‌కు వచ్చే ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరించి, వారికి మెరుగైన సేవలు అందించాలని సూచించారు. *పోలీస్ అధికారులతో కలిసి డిసిపి పోలీస్ స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటారు.* ఈ తనిఖీలలో ఏసీపీ వెంకటేశ్వర్లు ,సీఐ నవీన్ ,ఎస్‌ఐ భూమేష్ తదితరులు పాల్గొన్నారు.
- *జాతీయ బీసీ సంక్షేమ సంఘం* *రాష్ట్ర ఉపాధ్యక్షలు అమరవేణి నర్సాగౌడ్ కు ఆత్మీయ సన్మానం* *జాతీయ బీసీ సంక్షేమ సంఘం* *రాష్ట్ర ఉపాధ్యక్షలు అమరవేణి నర్సాగౌడ్ కు ఆత్మీయ సన్మానం* . ఈరోజు నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఆర్ అండ్ బి అతిథి గృహంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం నిర్మల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలోఇటీవల రాష్ట్ర ఉపాధ్యక్షులుగా నియమితులు ఐన అమరవేణి నర్సాగౌడ్ గారికి పూల మాలలు శాలువాలతో ఆత్మీయ సన్మానం చేశారు నిర్వహించారు. అమరవేణి నర్సాగౌడ్ హనుముల భాస్కర్ మాట్లాడుతూ :- ఈ దేశంలో 85% పైనున్న ఎస్టీ ఎస్సీ బీసీ మైనార్టీలకు రాజ్యాధికారం రాకుండా కేవలం పిడికెడు మంది ఉన్న అగ్రకులాలు రాజ్యాంగపరమైన పదవులను అనుభవిస్తూ బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారంలో వాటా దక్కకుండా చేస్తున్న వారి విధానాలకు వ్యతిరేకంగా పోరాడుతూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు రాజ్యాధికారం లభించే వరకు ఐక్యంగా పోరాడుతామని తెలియజేశారు బీసీల జనాభా ప్రాతిపదికన న్యాయమైన వాటా, హక్కులు సాధించే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని తెలిపారు. . ఈ కార్యక్రమంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం నిర్మల్ జిల్లా అధ్యక్షులు అనుముల భాస్కర్ , సోన్ మండల అధ్యక్షులు మ్యాక ప్రేమ్ కుమార్ నాయకులు రమేష్, సత్యనారాయణ, రాజేష్, లక్ష్మీనారాయణ, కిషోర్ తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.1
- పోగొట్టుకున్న సెల్‌ఫోన్ల ఆచూకీని గుర్తించిన పోలీసులు.. స్వాధీనం చేసుకున్న 142 సెల్‌ఫోన్లను వాటి యజమానులకు అప్పగించిన రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఫోన్ పోయిందా... దొంగిలించబడిందా...? సీఈఐఆర్ పోర్టల్‌ను సద్వినియోగం చేసుకోండి: రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా* * రూ. 27.40 లక్షల విలువైన 142 సెల్‌ఫోన్లు బాధితులకు అందజేత* రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో సెల్‌ఫోన్‌ను పోగొట్టుకున్నా లేదా దొంగిలించబడినా వెంటనే స్పందించి సీఈఐఆర్ (CEIR) పోర్టల్‌ను సద్వినియోగం చేసుకోవాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా సూచించారు. మంగళవారం సెల్‌ఫోన్ల రికవరీకి సంబంధించి పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు సీసీఎస్ ఏసీపీలు రవీందర్, ప్రవీణ్ కుమార్ నేతృత్వంలో రామగుండం పోలీస్ కమిషనరేట్ సీసీఎస్, ఐటీ సెల్ బృందాలు సెల్‌ఫోన్ రికవరీ మేళా నిర్వహించాయి. ఈ సందర్భంగా పోగొట్టుకున్న, దొంగిలించబడిన సెల్‌ఫోన్ల ఆచూకీని గుర్తించి,పోలీసులు స్వాధీనం చేసుకున్న 142 సెల్‌ఫోన్లను వాటి యజమానులకు రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ, దొంగిలించబడిన లేదా పోగొట్టుకున్న సెల్‌ఫోన్ల ఆచూకీని గుర్తించేందుకు సీసీఎస్‌తోపాటు ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఇప్పటివరకు 10,420 మంది సీఈఐఆర్ పోర్టల్‌లో ఫిర్యాదులు నమోదు చేయగా,అందులో 3,717 సెల్‌ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకుని వాటి యజమానులకు అందజేసినట్లు తెలిపారు.గత కొంతకాలంగా సీసీఎస్,ఐటీ సెల్ పోలీసులు ప్రత్యేకంగా శ్రమించి మరో 142 సెల్‌ఫోన్లను గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. సెల్‌ఫోన్ దొంగతనాలు, పోగొట్టుకున్న ఫోన్ల సమస్యల పరిష్కారానికి భారత ప్రభుత్వ టెలికమ్యూనికేషన్స్ విభాగం సీఈఐఆర్ పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకువచ్చిందని తెలిపారు. ప్రస్తుత జీవనశైలిలో మొబైల్ ఫోన్ అత్యంత కీలకమైన సాధనంగా మారిందని అన్నారు.ఏదైనా సమాచారం తెలుసుకోవాలన్నా, నగదు చెల్లింపులు చేయాలన్నా, ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవాలన్నా మొబైల్ ఫోన్‌పైనే ఎక్కువగా ఆధారపడుతున్నామని పేర్కొన్నారు. ఎవరైనా తమ మొబైల్ ఫోన్‌ను పోగొట్టుకున్నా లేదా దొంగిలించబడినా వెంటనే సీఈఐఆర్ పోర్టల్‌లో సంబంధిత ఫోన్‌ను బ్లాక్ చేయడంతోపాటు, సంబంధిత పోలీస్ స్టేషన్‌లో సమాచారం ఇవ్వాలని సీపీ ప్రజలకు సూచించారు. సీఈఐఆర్ పోర్టల్ ముఖ్యంగా పోగొట్టుకున్న లేదా దొంగిలించబడిన మొబైల్ ఫోన్‌లను గుర్తించడంలో ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. పోర్టల్‌లో నమోదు చేసిన ఫోన్ వివరాల ఆధారంగా, ఆ మొబైల్ ఫోన్‌ను ఇతర రాష్ట్రాల్లో లేదా ఇతర నెట్‌వర్క్‌లలో ఉపయోగించకుండా నిరోధించవచ్చని చెప్పారు. దీంతో దొంగిలించబడిన ఫోన్‌ను వినియోగించడం కష్టతరమవుతుందని పేర్కొన్నారు. ఈ విధానం ద్వారా సెల్‌ఫోన్ చోరీలను తగ్గించడంతోపాటు, పోగొట్టుకున్న లేదా దొంగిలించబడిన ఫోన్లను తిరిగి గుర్తించి యజమానులకు అందించే అవకాశం మరింత పెరుగుతుందని సీపీ తెలిపారు.ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీ (పరిపాలన) కె.శ్రీనివాస్,సీసీఎస్ ఏసీపీలు రవీందర్, ప్రవీణ్ కుమార్,వై. కృష్ణారెడ్డి,టి.గోపి,పి. బాలాజీ వరప్రసాద్, ఐటీ కోర్ ఇన్‌స్పెక్టర్ చంద్రశేఖర్ గౌడ్, ఎస్‌ఐలు బి.జీవన్, ఎం.చంద్రశేఖర్, ఎం.ఏ.నసీర్, ఎం. శివకేశవులు,కె. భాస్కర్ రావు,బి. భూమన్న,బి.శిరీష, శెట్టి లలిత,ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.1
- కరీంనగర్ లో మహమ్మద్ ప్రవక్త జన్మదిన పురస్కరించుకుని మిలాద్-ఉన్-నబీ సందర్భంగా ఘనంగా శోభాయాత్ర మిలాద్-ఉన్-నబీ వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నగరంలో ముస్లిం సోదరులు భక్తిశ్రద్ధలతో భారీ శోభాయాత్ర చేపట్టారు. ప్రధాన వీధుల గుండా సాగిన ఈ ఊరేగింపులో శాంతి, సోదరభావ సందేశాలను చాటారు. యువకులు పవిత్ర పతాకాలతో ఉత్సాహంగా పాల్గొన్నారు. శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించగా, ప్రజాప్రతినిధులు ముస్లింలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు.3
- ఆంక్షలతో మేకలను గొర్రెలను అమ్ముకుంటున్నామని ఆవేదన....... కవ్వాల్ అభయారణ్యంలో అమలు చేస్తున్న ఆంక్షలతో తమ వద్ద ఉన్న మేకలను, గొర్రెలను అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని జన్నారం మండలంలోని అక్కపల్లి గూడా గ్రామ పెద్ద చిన్నన్న ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం మధ్యాహ్నం జన్నారంలో ఆయన మాట్లాడుతూ గొర్రెలు, మేకల మందతో ఒకప్పుడు తాము అడవికి వెళ్లే వాళ్ళమని, ప్రస్తుతం ఆ పరిస్థితి లేదని ఆయన వాపోయారు. అటవీ ఆంక్షలు తమ ఉపాధిని పూర్తిగా దెబ్బతీశాయని ఆవేదన వ్యక్తం చేశారు.1
- బీసీల హక్కుల సాధనకు ఐక్యంగా పనిచేయాలి: జాతీయ బీసీ చైతన్య సమితి జాతీయ అధ్యక్షుడు, వ్యవస్థాపకుడు బీసీ రమణ జాతీయ బీసీ చైతన్య సమితి జగిత్యాల జిల్లా కమిటీలలో నూతనంగా నియమితులైన నాయకులకు జాతీయ బీసీ చైతన్య సమితి జాతీయ అధ్యక్షుడు, వ్యవస్థాపకుడు బీసీ రమణ హైదరాబాద్ లో నియామక పత్రాలు అందజేశారు. నూతన బాధ్యతలు స్వీకరించిన నాయకులు బీసీల హక్కుల సాధనకు క్రమశిక్షణతో, ఐక్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. బీసీల సమస్యలను ప్రజల్లోకి తీసుకెళ్లి సామాజిక న్యాయం కోసం కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో సాంబారి కళావతి, కస్తూరి నరేష్, ఆడెపు సత్యం, అల్లే సుదర్శన్, సిరికొండ చంద్రన్న, ఎనుగుర్తి శ్రవణ్, రాజేష్, రాజ శేఖర్, చెట్పెల్లి సురేష్, గుండేటి మారుతి పాల్గొన్నారు.4
- 34 నెలల పాలనలో విద్యార్థుల హామీల అమలేది రేవంత్ రెడ్డి? స్కూటీలు, ల్యాప్‌టాప్‌లు, ఫీజు బకాయిలు ఎప్పుడిస్తారు? విద్యార్థుల హామీలు అమలు చేయకపోతే ఉద్యమం ఉధృతం ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠ రెడ్డి స్కూటీలు, ల్యాప్‌టాప్‌లతో ఖాళీ పర్సులు ప్రదర్శిస్తూ ఏఐఎస్ఎఫ్ విన్నూత నిరసన కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో విద్యార్థినులకు ఇస్తామన్న స్కూటీలు, విద్యార్థులకు ఇస్తామన్న ల్యాప్‌టాప్‌లను, 5లక్షల విద్య భరోసా కార్డును, పెండింగ్ ఫీజు బకాయిలను అధికారంలోకి వచ్చి 34 నెలలు గడుస్తున్నా ఇప్పటికీ ఎందుకు ఇవ్వలేదని, సీఎం రేవంత్ రెడ్డి తన వద్ద విద్యాశాఖ పెట్టుకొని విద్యార్థుల హామీల అమలు చేయకుండా విద్యార్థులకు ఓట్లు లేవని చిన్నచూపు చూస్తున్నాడని, రాష్ట్రంలో విద్యార్థులు సమస్యల కోసం ప్రతి రోజు రోడ్డు ఎక్కుతున్నారని,సీఎం వద్ద విద్యాశాఖ ఉంది కమిషన్ల కోసమేనని, విద్యార్థులకు ఇచ్చిన హామీల అమలు చేయకపోతే రేవంత్ రెడ్డి ప్రభుత్వ పతనం తప్పదని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠ రెడ్డి హెచ్చరించారు కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులకు ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడాన్ని నిరసిస్తూ మంగళవారం కరీంనగర్ నగరంలోని తెలంగాణ చౌక్ వద్ద ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో స్కూటీలు, ల్యాప్‌టాప్‌లతో పాటు ఖాళీ పర్సులను ప్రదర్శిస్తూ వినూత్న నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల సమయంలో విద్యార్థులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని అన్నారు. ముఖ్యంగా ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలు విడుదల కాకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ ,స్కాలర్షిప్ బకాయిలు విడుదల చేయకపోతే విద్యార్థులు వారి తల్లితండ్రులు జేబులోంచి సర్టిఫికెట్ల కోసం కళాశాలకు ఫీజులు కట్టాల్సిన పరిస్థితి వచ్చిందని దీంతో పర్సులు ఖాళీ అయ్యే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థినులకు ఇస్తామన్న స్కూటీలు, విద్యార్థులకు ఇస్తామన్న ల్యాప్‌టాప్‌లను ,యువవికాసం పేరుతో 5లక్షల విద్యా భరోసా కార్డు ఇప్పటికీ ఎందుకు ఇవ్వలేదని , ఒక్కొక్క హామీ అమలు చేస్తున్నాం ఇది ప్రజాపాలనని చెబుతున్నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యార్థుల హామీలను అమలుచేయకాపోవడానికి కారణం ఎందని? విద్యార్థుల హామీల అమలు చేయకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే విద్యార్థులు వారి తల్లిదండ్రుల ఓట్లతో ప్రభుత్వానికి బుద్ధి చెప్తారని, పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలను ఒకేసారి విడుదల చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల భవిష్యత్తుతో ప్రభుత్వం చెలగాటం ఆడకుండా విద్యారంగానికి తగిన ప్రాధాన్యత ఇవ్వాలని బడ్జెట్ లో 15%నిధులు ఇవ్వాలని , ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు కేవలం ప్రచారానికే పరిమితం కాకుండా వాటిని అమలు చేసి విద్యార్థుల పట్ల తమ చిత్తశుద్ధిని రేవంత్ రెడ్డి నిరూపించుకోవాలని, రేవంత్ రెడ్డి తన వద్ద విద్యాశాఖ పెట్టుకొని విద్యా శాఖకు న్యాయం చేయకుంటే విద్యాశాఖకు ప్రత్యేక మంత్రి నియమించాలని, విద్యారంగ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేయాలని లేనిపక్షంలో ఢిల్లీ తరహా ఉద్యమాన్ని తెలంగాణ గల్లీలలో విద్యార్థులను ఏకం చేసి ఉద్యమిస్తామని మణికంఠ రెడ్డి హెచ్చరించారు కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి మచ్చ రమేష్, నగర కార్యదర్శి మామిడిపల్లి హేమంత్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు నూనావత్ శ్రీనివాస్ నాయక్, గర్ల్స్ వింగ్ నాయకురాలు జోష్ణ,నగర నాయకులు సందీప్ రెడ్డి, బోయినీ విష్ణు, అరవింద్,సాయి కృష్ణ తదితరులు పాల్గొన్నారు1
- *ముదిరాజ్ సంప్రదాయం ప్రకారం ఆడబిడ్డగా వివాహం జరిపించిన కవిత* తెలంగాణ రక్షణ సేన నాయకుడు తన వివాహం పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత చేతుల *ముదిరాజ్ సంప్రదాయం ప్రకారం ఆడబిడ్డగా వివాహం జరిపించిన కవిత* తెలంగాణ రక్షణ సేన నాయకుడు తన వివాహం పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత చేతుల మీదుగా జరగాలని ఆకాంక్షించాడు. తన ఇంటి ఆడబిడ్డ హోదాలో ఉండి పెళ్లి చేయాలని కోరాడు. ముదిరాజ్ సంప్రదాయం ప్రకారం పెళ్లికూతురు మెడలో తాళి కట్టాలని కోరాడు. పార్టీ నాయకుడి ఆకాంక్షను గౌరవించి ముదిరాజ్ ఇంటి ఆడబిడ్డగా మారి ఆ నాయకుడి ఆకాంక్షను నెరవేర్చారు కల్వకుంట్ల కవిత. ఈ వేడుకకు ఈసీఐఎల్ - కీసర క్రాస్ రోడ్డులో ఆరాధ్య కన్వేషన్ వేదికగా నిలిచింది. యాదాద్రి భువనగిరి జిల్లా గూడూరు గ్రామానికి చెందిన బాషబోయిన బాలప్రసాద్ తెలంగాణ రక్షణ సేన నాయకుడు. తెలంగాణ జాగృతిలోనూ క్రియాశీలంగా పని చేశాడు. బాలప్రసాద్ కు సీతాఫల్ మండికి చెందిన శివానితో వివాహం నిశ్చయం అయింది. బుధవారం ఉదయం బాలప్రసాద్ - శివాని వివాహ ముహూర్తం కాగా తనకు అక్కాచెల్లెళ్లు లేకపోవడంతో బాలప్రసాద్ కోరిక మేరకు వారి ఇంటి ఆడబిడ్డగా కవిత వ్యవహరించారు. ముదిరాజ్ కులాచారం ప్రకారం వరుడు వధువుకు తాళి కట్టే ముందు ఆడపడుచుతో పసుపు కొమ్ముతో మూడు ముళ్ళు వేయిస్తారు. వారి సంప్రదాయం ప్రకారం కవిత గౌరీ పూజలో పాల్గొని వధువు శివాని మెడలో పసుపు కొమ్ముదారంతో మూడుముళ్లు వేశారు. ఉంగరపు వేలుకు ప్రదానపు ఉంగరం తొడిగారు. ఒడిబియ్యం పోసి పెళ్లి కుమార్తెను ఆశీర్వదించారు. అనంతరం బాలప్రసాద్ శివాని మెడలో మంగళసూత్ర ధారణ చేశారు. ఈ వేడుకలో బాలప్రసాద్ తల్లిదండ్రులు స్వరూప - బాలకృష్ణ, సోదరుడు నాగరాజు, తెలంగాణ రక్షణ సేన నాయకులు పాల్గొన్నారు.1
- సూర్యాపేట జిల్లా కోదాడ సమీపంలోని దొరకుంట కోదాడ రోడ్డు ప్రమాదం.. మృతులు వీరే తెలంగాణ : సూర్యాపేట జిల్లా కోదాడ సమీపంలోని దొరకుంట వద్ద బుధవారం ఉదయం కంటైనర్‌ను ప్రైవేటు బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతిచెందారు. అయితే మృతులంతా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారిగా తెలుస్తోంది. మృతులు యాసారపు చిన్ని(32), బొల్లిపొంగు మేరీ జోష్న(29), చెన్నకేశవుల నాగేంద్రబాబు(21)గా గుర్తించారు. మరో ముగ్గురి వివరాలు తెలియాల్సి ఉంది.1