బి ఆర్ ఎస్ పార్టీ సీనియర్ కార్యకర్త తన రాజకీయ ప్రస్థానం గురించి మీడియా తో చిట్ చాట్ బీఆర్ఎస్ పార్టీకి నిబద్ధత గల సైనికుడు: బోయ రంగస్వామి "పదవులు కాదు పార్టీ ఎజెండా ముఖ్యం" (ధరూర్), ఏప్రిల్ 16, 2026: రాజకీయాల్లో విశ్వసనీయతకు మారుపేరుగా నిలుస్తున్నారు గద్వాల నియోజకవర్గం, ధరూర్ మండలం, నీలహళ్లి గ్రామానికి చెందిన బిఆర్ఎస్ సీనియర్ కార్యకర్త బోయ రంగస్వామి. పార్టీ జెండా పుట్టిన నాటి నుండి నేటి వరకు ఏమాత్రం చలించకుండా ఒకే సిద్ధాంతంతో ఆయన ముందుకు సాగుతున్నారు. తొలి అడుగు నుండే గులాబీ జెండాతో.. 2001లో తెలంగాణ రాష్ట్ర సమితి (TRS) ఆవిర్భవించిన తరుణంలో, స్వరాష్ట్ర సాధనే లక్ష్యంగా అడుగులు వేసిన రంగస్వామి నేటి భారత్ రాష్ట్ర సమితి (BRS) వరకు తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. పార్టీ పుట్టిన నాటి నుండి నేటి వరకు పార్టీ మారకుండా, గులాబీ జెండా నీడలోనే ఉంటూ తన రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగిస్తున్న అరుదైన కార్యకర్తలలో ఆయన ఒకరు. పార్టీకి వెన్నెముకగా నీలహళ్లి గ్రామంలో పార్టీ బలోపేతానికి ఆయన చేస్తున్న కృషి అమోఘం. ఎన్నికల సమయంలో గానీ, పార్టీ పిలుపునిచ్చే ఏ కార్యక్రమమైనా ముందుండి నడిపించడంలో రంగస్వామి సిద్ధంగా ఉంటారు. పదవుల కంటే పార్టీ సిద్ధాంతమే ముఖ్యమని భావించే ఆయన నిబద్ధతను గద్వాల నియోజకవర్గ పార్టీ శ్రేణులు మరియు నాయకులు అభినందిస్తున్నారు. నిరంతరం నమ్మిన సిద్ధాంతం కోసం కట్టుబడి ఉండే ఆయన తీరు యువ కార్యకర్తలకు స్ఫూర్తిదాయకం. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కూడా వెన్నుచూపకుండా నిలబడే ఇలాంటి కార్యకర్తలే బిఆర్ఎస్ పార్టీకి అసలైన బలం అని స్థానిక నాయకులు పేర్కొంటున్నారు.

- వరి పంట లో నూకలు చల్లడం వల్లన కలుపు నివారణ అవుతుంది1
- SK టీవీ న్యూస్ ఏపీ వార్తలు కర్నూలు జిల్లాలోని గోనెగండ్ల మండల కేంద్రంలో గురువారం సాయంత్రం భారీగా గాలివాన బీభత్సం సృష్టించింది భారీ వృక్షాలు నేల కొరకడం జరిగింది రైతులకు ఈ వాన వలన భారీ నష్టం జరిగి ందని చేతికొచ్చిన పంటలు నేలపాలు కావడం చాలా బాధాకరం ప్రభుత్వం రైతులని ఆదుకోవాలని రైతులు కోరారు1
- గోపాల్ పేట మండలం తాడిపర్తి నుంచి చెన్నూరు కు వెళ్లే మార్గంలోని లక్ష్మీ సముద్రం అలుగు వద్ద వంతెన నిర్మించాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు. వర్షాకాలంలో అలుగు పారినప్పుడు రాకపోకలు నిలిచిపోయి, వాహనదారులు ప్రాణాలకు తెగించి ప్రయాణిస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం రహదారి గుంతలమయమై తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ప్రభుత్వం వెంటనే స్పందించి బ్రిడ్జి పనులు ప్రారంభించాలని స్థానికులు కోరుతున్నారు.1
- పెద్దపల్లి మండలం నిమ్మనపల్లి గ్రామంలో ఒంటికోట బడులు కావడం ఆపై అధికంగా ఎండ ఉండడంతో ఎస్సారెస్పీ నీటిని అధికారులు విడుదల చేయగా చిన్నారులు ఎంచక్కా కెనాల్ లో ఈత కొడుతూ ఎండ వేడిని సేద తీరుతున్నారు. 40 డిగ్రీల ఉష్ణోగ్రత అతి ఎండ ఉండడం ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ అధికారులు అప్రమత్తం చేయడంతో పాటు చిన్నారులకు ఇంటికి వెళితే అధికంగా వేడి ఉండడంతో ఉపశమనం కొరకు కెనాల్ కాలువలో చల్లని నీటిలో ఈత కొడుతూ సేద తీరుతున్నారు1
- ఉపాధి హామీ కూలీల హాజరు నమోదులో మల్దకల్ గ్రామ పంచాయతీ రాష్ట్రం దృష్టిని ఆకర్షించింది. కొత్తగా వచ్చిన ఫేస్ అథెంటికేషన్ ప్రక్రియను వేగవంతం చేసి, 620 మంది కూలీల డేటాను నమోదు చేయడం ద్వారా నంబర్ వన్ స్థానాన్ని దక్కించుకుంది. 9 మంది వర్కింగ్ మెట్ల కృషితో తెల్లవారుజామునే లక్ష్యాన్ని చేరుకోవడం గమనార్హం. కార్యదర్శి చొరవను జిల్లా అధికారులు అభినందించారు. సాంకేతిక వినియోగంలో మల్దకల్ ఆదర్శనీయమని ప్రశంసించారు. ప్రభుత్వ లక్ష్యాలను నెరవేర్చడంలో ఈ పంచాయతీ ప్రత్యేక గుర్తింపు పొందింది.1
- రైతు రాజన్నాడం తప్పు రైతుకు గిట్ట పట్టేలార కావాలి అంటూ ఆహ్వానిస్తున్నారు1
- ఉపాధి హామీ పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని వ్యవసాయ కార్మిక సంఘం నాయకుడు డేవిడ్ డిమాండ్ చేశారు. బండి ఆత్మకూరు ఎంపీడీవో కార్యాలయం వద్ద కూలీలు, మేటీలు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉపాధి కూలీ రూ. 600 చెల్లించాలని, ప్రతి కుటుంబానికి 200 రోజులు పని కల్పించాలని కోరారు. పెండింగ్ నిధులు విడుదల చేసి కూలీలను ఆదుకోవాలని, లేనిపక్షంలో పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారు.1
- బండిఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లే రహదారిలో డ్రైనేజీ కాలువలు పూడిపోవడంతో మరియు గుండా పుల్లయ్య ఇంటి వద్ద డ్రైనేజీ బ్లాక్ అవ్వడం వల్ల రోడ్డుపై మురుగునీరు ప్రవహిస్తుండడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులకు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి, తక్షణమే కాలువల్లో పూడిక తీయించి సమస్యను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.1