logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

మణుగూరు డిప్ సైడ్ బొగ్గు బ్లాక్ సింగరేణికి కేటాయించాలని ఐఎన్టీయూసీ ధర్నా. మణుగూరు డిప్ సైడ్ బొగ్గతెలంగాణ రాష్ట్ర మినిమం వేజెస్ అడ్వైజర్ బోర్డు చైర్మన్ , ఐఎన్టీయూసీ సెక్రెటరీ జనరల్ డా. బి.జనక్ ప్రసాద్ ఆదేశాల మేరకు ,ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఏరియా ఇంచార్జ్ రజాక్ సూచనల మేరకు , ఏరియా వైస్ ప్రెసిడెంట్ కోటేశ్వరరావు ఆధ్వర్యంలో ఐఎన్టీయూసీ ఉప ప్రధాన కార్యదర్శి తీగల క్రాంతి కుమార్ ముఖ్యఅతిథిగా పాల్గొని , ఐఎన్టీయూసీ శ్రేణులతో కలిసి సత్తుపల్లి ఏరియాలోని జే.వి.ఆర్ ఓసి , కిష్టారం ఓసి , జే.వి.యర్ సి.హెచ్.పి , జె.వి.ఆర్ డిస్పెన్సరీ కార్మికులతో సత్తుపల్లి జి.ఎం కార్యాలయం ముందు మహాధర్నాను విజయవంతం చేశారు.సింగరేణి సంస్థ పరిరక్షణ కొరకు , కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరిని నిరసిస్తూ ఆగస్టు 4 నుండి 11 వ తేదీ వరకు కేంద్ర ప్రభుత్వం నిర్వహించే బొగ్గు బ్లాక్ ల వేలంలో మణుగూరు డిప్ సైడ్ బొగ్గు బ్లాక్ సింగరేణి సంస్థకు కేటాయించాలని జనరల్ మేనేజర్ చింతల శ్రీనివాస్ కు వినతిపత్రం అందజేశారు. ఐఎన్టీయూసీ నాయకులు తీగల క్రాంతి కుమార్ , కోటేశ్వరరావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం మణుగూరు డిప్ సైడ్ బ్లాక్ , తెలంగాణ రాష్ట్రంలోని బొగ్గు బ్లాక్ లను సింగరేణి సంస్థకు కేటాయించాలి అని , తెలంగాణ రాష్ట్రానికి కొంగు బంగారంగా ఉండే సింగరేణి , రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు మూల స్తంభంగా ఉండే సింగరేణి సంస్థ అని 137 సంవత్సరాల అనుభవం , అధునాతన టెక్నాలజీతో బొగ్గు ఉత్పత్తి సాధిస్తున్న సింగరేణి సంస్థకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని బొగ్గు బ్లాక్ లను కేంద్ర ప్రభుత్వం సింగరేణి సంస్థకే కేటాయించాలని , తాడిచర్ల 2 బొగ్గు బ్లాక్ పూర్తిగా సింగరేణి సంస్థ ద్వారా మాత్రమే నడిపించాలని స్థానిక నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి అవకాశాలు సింగరేణి సంస్థ ద్వారా కల్పించడానికి వీలుగా ఉంటుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన బొగ్గు బ్లాక్ ల వేలంలో పాల్గొని కోయగూడెం బ్లాక్ , సత్తుపల్లి ఓసి 3 బ్లాక్ ప్రైవేట్ పారిశ్రామిక సంస్థలకు కేంద్ర ప్రభుత్వం అలాట్మెంట్ చేయడం జరిగింది. సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ ఇలాంటి మైనింగ్ కార్యకలాపాలు ప్రారంభం కానందున సింగరేణి సంస్థ అనుభవం , సాంకేతిక సామర్థ్యం పరిగణలోకి తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకొని సింగరేణి సంస్థకు కేటాయించే విధంగా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఐఎన్టియుసి నాయకులు నాగ ప్రకాష్ , నాగేశ్వరరావు , మురళి , షట్రక్ బాబు , పొట్టి కిరణ్ , సుదర్శన్ , సీతారామరాజు , షణ్ముఖ చారి , షేక్ బాజీ , నాగేష్ , ముఖ్య నాయకులు , కార్యకర్తలు , ఉద్యోగులు , డి.ఎల్.ఆర్ ఉద్యోగులు పాల్గొన్నారు.

5 hrs ago
user_Arempula Haribabu
Arempula Haribabu
సత్తుపల్లి, ఖమ్మం, తెలంగాణ•
5 hrs ago
315fc5a0-e091-4058-92a0-1a80362e645e

మణుగూరు డిప్ సైడ్ బొగ్గు బ్లాక్ సింగరేణికి కేటాయించాలని ఐఎన్టీయూసీ ధర్నా. మణుగూరు డిప్ సైడ్ బొగ్గతెలంగాణ రాష్ట్ర మినిమం వేజెస్ అడ్వైజర్ బోర్డు చైర్మన్ , ఐఎన్టీయూసీ సెక్రెటరీ జనరల్ డా. బి.జనక్ ప్రసాద్ ఆదేశాల మేరకు ,ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఏరియా ఇంచార్జ్ రజాక్ సూచనల మేరకు , ఏరియా వైస్ ప్రెసిడెంట్ కోటేశ్వరరావు ఆధ్వర్యంలో ఐఎన్టీయూసీ ఉప ప్రధాన కార్యదర్శి తీగల క్రాంతి కుమార్ ముఖ్యఅతిథిగా పాల్గొని , ఐఎన్టీయూసీ శ్రేణులతో కలిసి సత్తుపల్లి ఏరియాలోని జే.వి.ఆర్ ఓసి , కిష్టారం ఓసి , జే.వి.యర్ సి.హెచ్.పి , జె.వి.ఆర్ డిస్పెన్సరీ కార్మికులతో సత్తుపల్లి జి.ఎం కార్యాలయం ముందు మహాధర్నాను విజయవంతం చేశారు.సింగరేణి సంస్థ పరిరక్షణ కొరకు , కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరిని నిరసిస్తూ ఆగస్టు 4 నుండి 11 వ తేదీ వరకు కేంద్ర ప్రభుత్వం నిర్వహించే బొగ్గు బ్లాక్ ల వేలంలో మణుగూరు డిప్ సైడ్ బొగ్గు బ్లాక్ సింగరేణి సంస్థకు కేటాయించాలని జనరల్ మేనేజర్ చింతల శ్రీనివాస్ కు వినతిపత్రం అందజేశారు. ఐఎన్టీయూసీ నాయకులు తీగల క్రాంతి కుమార్ , కోటేశ్వరరావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం మణుగూరు డిప్ సైడ్ బ్లాక్ , తెలంగాణ రాష్ట్రంలోని బొగ్గు బ్లాక్ లను సింగరేణి సంస్థకు కేటాయించాలి అని , తెలంగాణ రాష్ట్రానికి కొంగు బంగారంగా ఉండే సింగరేణి , రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు మూల స్తంభంగా ఉండే సింగరేణి సంస్థ అని 137 సంవత్సరాల అనుభవం , అధునాతన టెక్నాలజీతో బొగ్గు ఉత్పత్తి సాధిస్తున్న సింగరేణి సంస్థకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని బొగ్గు బ్లాక్ లను కేంద్ర ప్రభుత్వం సింగరేణి సంస్థకే కేటాయించాలని , తాడిచర్ల 2 బొగ్గు బ్లాక్ పూర్తిగా సింగరేణి సంస్థ ద్వారా మాత్రమే నడిపించాలని స్థానిక నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి అవకాశాలు సింగరేణి సంస్థ ద్వారా కల్పించడానికి వీలుగా ఉంటుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన బొగ్గు బ్లాక్ ల వేలంలో పాల్గొని కోయగూడెం బ్లాక్ , సత్తుపల్లి ఓసి 3 బ్లాక్ ప్రైవేట్ పారిశ్రామిక సంస్థలకు కేంద్ర ప్రభుత్వం అలాట్మెంట్ చేయడం జరిగింది. సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ ఇలాంటి మైనింగ్ కార్యకలాపాలు ప్రారంభం కానందున సింగరేణి సంస్థ అనుభవం , సాంకేతిక సామర్థ్యం పరిగణలోకి తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకొని సింగరేణి సంస్థకు కేటాయించే విధంగా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఐఎన్టియుసి నాయకులు నాగ ప్రకాష్ , నాగేశ్వరరావు , మురళి , షట్రక్ బాబు , పొట్టి కిరణ్ , సుదర్శన్ , సీతారామరాజు , షణ్ముఖ చారి , షేక్ బాజీ , నాగేష్ , ముఖ్య నాయకులు , కార్యకర్తలు , ఉద్యోగులు , డి.ఎల్.ఆర్ ఉద్యోగులు పాల్గొన్నారు.

More news from తెలంగాణ and nearby areas
  • 54 అడుగుల వద్ద ప్రవహిస్తున్న గోదావరి సారపాక కు బూర్గంపాడుకు రాకపోకలు నిలిపివేత భద్రాచలం వద్ద గోదావరి మూడో ప్రమాదక హెచ్చరిక దాటి ప్రవహిస్తున్న గోదావరి లోతట్టు ప్రాంతాలలో చేరుకున్న వరద నీరు బూర్గంపాడుకు సారపాకకు రాకపోకలు నిలిపివేత లోతుట్ట ప్రాంత ప్రజలను అప్రమత్తం చేస్తున్న మండల అధికారులు ప్రస్తుతం గోదావరి ఉదయం 6 గంటల సమయం నందు 55. 10 ఫీడ్స్ వద్ద ప్రవహించినది 15,40,412 క్యూసెక్కుల వరద నీరు ప్రవహించగా ప్రస్తుతం ఒక అడుగు తగ్గి 54 అడుగుల వద్ద గోదావరి ప్రవహిస్తున్నది
    1
    54 అడుగుల వద్ద ప్రవహిస్తున్న గోదావరి సారపాక కు బూర్గంపాడుకు రాకపోకలు నిలిపివేత 
భద్రాచలం వద్ద గోదావరి మూడో ప్రమాదక హెచ్చరిక దాటి ప్రవహిస్తున్న గోదావరి లోతట్టు ప్రాంతాలలో చేరుకున్న వరద నీరు బూర్గంపాడుకు సారపాకకు రాకపోకలు నిలిపివేత లోతుట్ట ప్రాంత ప్రజలను అప్రమత్తం చేస్తున్న మండల అధికారులు ప్రస్తుతం గోదావరి ఉదయం 6 గంటల సమయం నందు 55. 10 ఫీడ్స్  వద్ద ప్రవహించినది 15,40,412 క్యూసెక్కుల వరద నీరు ప్రవహించగా  ప్రస్తుతం ఒక అడుగు తగ్గి 54 అడుగుల వద్ద గోదావరి ప్రవహిస్తున్నది
    user_Banatha. Raja
    Banatha. Raja
    బుర్గుంపహాడ్, భద్రాద్రి కొత్తగూడెం, తెలంగాణ•
    14 hrs ago
  • వరదల వేళ మాల్స్ జాతర... ప్రజల భద్రత గాలికేనా..? జీవి మాల్, కసం సేల్‌కు పోటెత్తిన జనం. భద్రాచలం వద్ద గోదావరి వరద ఉద్ధృతి కొనసాగుతుండగా జిల్లా యంత్రాంగం సహాయక చర్యలు, లోతట్టు ప్రాంతాల ప్రజల భద్రతపై దృష్టి సారిస్తోంది. ఇదే సమయంలో పట్టణంలో నిర్వహించిన GV మాల్ ఓపెనింగ్ మరియు కసం ఆషాఢం సేల్ ధమాకా కార్యక్రమాలకు భారీ సంఖ్యలో ప్రజలు తరలిరావడం స్థానికంగా చర్చనీయాంశమైంది. ఒకవైపు వరద పరిస్థితులతో అధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తుండగా, మరోవైపు వేలాది మంది మహిళలు, చిన్నారులు, యువత షాపింగ్ మాల్స్ వద్దకు చేరుకోవడంతో ప్రజల భద్రతపై ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. GV మాల్ ప్రారంభోత్సవానికి స్థానిక ఎమ్మెల్యేతో పాటు గ్రామ సర్పంచ్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాల్ పరిసర ప్రాంతంలో భారీ జనసందోహం ఏర్పడటంతో ప్రధాన రహదారిపై ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడినట్లు స్థానికులు చెబుతున్నారు. వరదల నేపథ్యంలో అత్యవసర పరిస్థితులు తలెత్తే అవకాశం ఉన్న సమయంలో ఇలాంటి భారీ కార్యక్రమాలకు అనుమతులు మంజూరు చేసే ముందు భద్రతా ప్రమాణాలను ఎంత మేర పరిశీలించారనే అంశంపై చర్చ జరుగుతోంది. మరోవైపు కసం ఆషాఢం సేల్ ధమాకా నిర్వహించిన ప్రాంగణంలో కూడా మహిళలు, చిన్నారులు పెద్ద సంఖ్యలో హాజరుకావడంతో తీవ్ర రద్దీ నెలకొంది. జనసమ్మర్థం కారణంగా తోపులాట లేదా తొక్కిసలాట వంటి పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని పలువురు స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి కార్యక్రమాల్లో ప్రవేశ, నిష్క్రమణ మార్గాలు, అత్యవసర బయటపడే దారులు, అగ్నిమాపక భద్రత, తగిన భద్రతా సిబ్బంది వంటి అంశాలు అత్యంత కీలకమని వారు అభిప్రాయపడుతున్నారు. స్థానికుల దృష్టిని ఆకర్షించిన మరో అంశం GV మాల్ ముందు ఉన్న విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్. భారీ రద్దీ ఉన్నప్పటికీ ట్రాన్స్‌ఫార్మర్ చుట్టూ భద్రతా ఏర్పాట్లు సరిపోతున్నాయా అనే సందేహాలను స్థానికులు వ్యక్తం చేస్తున్నారు. పెద్ద సంఖ్యలో ప్రజలు రాకపోకలు సాగించే ప్రాంతాల్లో విద్యుత్ పరికరాల వద్ద మరింత పటిష్టమైన రక్షణ చర్యలు ఉండాలని వారు కోరుతున్నారు. ఇంత పెద్ద ఎత్తున ప్రజలు హాజరయ్యే కార్యక్రమాలకు సంబంధించి గ్రామపంచాయతీ, రెవెన్యూ, పోలీసు, విద్యుత్ శాఖలు ముందస్తుగా సంయుక్తంగా భద్రతా తనిఖీలు నిర్వహించాయా? ట్రాఫిక్ నియంత్రణ, అత్యవసర సేవల రాకపోకలు, జనసమ్మర్థ నియంత్రణకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించాయా? అనే ప్రశ్నలు ప్రస్తుతం భద్రాచలంలో వినిపిస్తున్నాయి. అలాగే గోదావరి వరదలతో అనేక కుటుంబాలు ఆందోళనలో ఉన్న ఈ సమయంలో ప్రజాప్రతినిధులు బాధిత ప్రాంతాలను మరింత విస్తృతంగా సందర్శించి, సహాయక చర్యలను పర్యవేక్షించడానికీ ప్రాధాన్యం ఇవ్వాలని పలువురు స్థానికులు అభిప్రాయపడుతున్నారు. భారీ ఆఫర్లు, సినీ ప్రముఖుల హాజరు వంటి కారణాలతో ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉన్నప్పుడు నిర్వాహకులు మరింత కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని, సంబంధిత శాఖలు కూడా నిరంతర పర్యవేక్షణ నిర్వహించాలని స్థానికులు కోరుతున్నారు. వ్యాపార కార్యక్రమాలకు అనుమతులు మంజూరు చేసే సమయంలో ప్రజల ప్రాణ భద్రతకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని, ప్రమాదాలు జరిగిన తర్వాత కాకుండా ముందుగానే నివారణ చర్యలు చేపట్టాలని గ్రామపంచాయతీ, రెవెన్యూ, పోలీసు, విద్యుత్ శాఖల అధికారులకు స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.
    1
    వరదల వేళ మాల్స్ జాతర... ప్రజల భద్రత గాలికేనా..? జీవి మాల్, కసం సేల్‌కు పోటెత్తిన జనం.

భద్రాచలం వద్ద గోదావరి వరద ఉద్ధృతి కొనసాగుతుండగా జిల్లా యంత్రాంగం సహాయక చర్యలు, లోతట్టు ప్రాంతాల ప్రజల భద్రతపై దృష్టి సారిస్తోంది. ఇదే సమయంలో పట్టణంలో నిర్వహించిన GV మాల్ ఓపెనింగ్ మరియు కసం ఆషాఢం సేల్ ధమాకా కార్యక్రమాలకు భారీ సంఖ్యలో ప్రజలు తరలిరావడం స్థానికంగా చర్చనీయాంశమైంది. ఒకవైపు వరద పరిస్థితులతో అధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తుండగా, మరోవైపు వేలాది మంది మహిళలు, చిన్నారులు, యువత షాపింగ్ మాల్స్ వద్దకు చేరుకోవడంతో ప్రజల భద్రతపై ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.
GV మాల్ ప్రారంభోత్సవానికి స్థానిక ఎమ్మెల్యేతో పాటు గ్రామ సర్పంచ్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాల్ పరిసర ప్రాంతంలో భారీ జనసందోహం ఏర్పడటంతో ప్రధాన రహదారిపై ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడినట్లు స్థానికులు చెబుతున్నారు. వరదల నేపథ్యంలో అత్యవసర పరిస్థితులు తలెత్తే అవకాశం ఉన్న సమయంలో ఇలాంటి భారీ కార్యక్రమాలకు అనుమతులు మంజూరు చేసే ముందు భద్రతా ప్రమాణాలను ఎంత మేర పరిశీలించారనే అంశంపై చర్చ జరుగుతోంది.
మరోవైపు కసం ఆషాఢం సేల్ ధమాకా నిర్వహించిన ప్రాంగణంలో కూడా మహిళలు, చిన్నారులు పెద్ద సంఖ్యలో హాజరుకావడంతో తీవ్ర రద్దీ నెలకొంది. జనసమ్మర్థం కారణంగా తోపులాట లేదా తొక్కిసలాట వంటి పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని పలువురు స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి కార్యక్రమాల్లో ప్రవేశ, నిష్క్రమణ మార్గాలు, అత్యవసర బయటపడే దారులు, అగ్నిమాపక భద్రత, తగిన భద్రతా సిబ్బంది వంటి అంశాలు అత్యంత కీలకమని వారు అభిప్రాయపడుతున్నారు.
స్థానికుల దృష్టిని ఆకర్షించిన మరో అంశం GV మాల్ ముందు ఉన్న విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్. భారీ రద్దీ ఉన్నప్పటికీ ట్రాన్స్‌ఫార్మర్ చుట్టూ భద్రతా ఏర్పాట్లు సరిపోతున్నాయా అనే సందేహాలను స్థానికులు వ్యక్తం చేస్తున్నారు. పెద్ద సంఖ్యలో ప్రజలు రాకపోకలు సాగించే ప్రాంతాల్లో విద్యుత్ పరికరాల వద్ద మరింత పటిష్టమైన రక్షణ చర్యలు ఉండాలని వారు కోరుతున్నారు.
ఇంత పెద్ద ఎత్తున ప్రజలు హాజరయ్యే కార్యక్రమాలకు సంబంధించి గ్రామపంచాయతీ, రెవెన్యూ, పోలీసు, విద్యుత్ శాఖలు ముందస్తుగా సంయుక్తంగా భద్రతా తనిఖీలు నిర్వహించాయా? ట్రాఫిక్ నియంత్రణ, అత్యవసర సేవల రాకపోకలు, జనసమ్మర్థ నియంత్రణకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించాయా? అనే ప్రశ్నలు ప్రస్తుతం భద్రాచలంలో వినిపిస్తున్నాయి.
అలాగే గోదావరి వరదలతో అనేక కుటుంబాలు ఆందోళనలో ఉన్న ఈ సమయంలో ప్రజాప్రతినిధులు బాధిత ప్రాంతాలను మరింత విస్తృతంగా సందర్శించి, సహాయక చర్యలను పర్యవేక్షించడానికీ ప్రాధాన్యం ఇవ్వాలని పలువురు స్థానికులు అభిప్రాయపడుతున్నారు.
భారీ ఆఫర్లు, సినీ ప్రముఖుల హాజరు వంటి కారణాలతో ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉన్నప్పుడు నిర్వాహకులు మరింత కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని, సంబంధిత శాఖలు కూడా నిరంతర పర్యవేక్షణ నిర్వహించాలని స్థానికులు కోరుతున్నారు.
వ్యాపార కార్యక్రమాలకు అనుమతులు మంజూరు చేసే సమయంలో ప్రజల ప్రాణ భద్రతకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని, ప్రమాదాలు జరిగిన తర్వాత కాకుండా ముందుగానే నివారణ చర్యలు చేపట్టాలని గ్రామపంచాయతీ, రెవెన్యూ, పోలీసు, విద్యుత్ శాఖల అధికారులకు స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.
    user_Shivaram
    Shivaram
    Local News Reporter భద్రాచలం, భద్రాద్రి కొత్తగూడెం, తెలంగాణ•
    3 hrs ago
  • పాత కూరగాయలమార్కెట్ నిర్మాణాల కూల్చివేతలపై వ్యాపారులు, రాజకీయ నాయకుల నిరసన .. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు... పాత కూరగాయలమార్కెట్ నిర్మాణాల కూల్చివేతలపై వ్యాపారులు, రాజకీయ నాయకుల నిరసన .. ఇల్లందు పట్టణంలో గత ఐదు దశాబ్దాలుగా వినియోగించుకున్న పాత కూరగాయల మార్కెట్ ప్రాంగణంలోని కొన్ని దుకాణ సముదాయాలను మున్సిపల్ సిబ్బంది జేసీబీ సహాయంతో కూల్చివేతలను ప్రారంభించడంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. తమకు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చివేతలు చేయడం పట్ల కొందరు చిరు వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేయగా వారికి పలురాజకీయ పార్టీల నాయకులు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా పలుపార్టీల నాయకులు మాట్లాడుతూ ఆక్రమణలు ఏమైనా ఉంటే వ్యాపారులకు నోటీసులు అందజేసి తొలగిస్తే తమకు అభ్యంతరం లేదని కానీ ఇల్లందు పట్టణంలో ఎన్నో అక్రమ నిర్మాణాలు ఉన్నప్పటికీ కేవలం కూరగాయలు అమ్ముకునే చిరువ్యాపార నిర్మాణాలను తొలగించడం సరికాదన్నారు. కూల్చివేతలను నిరసిస్తూ రోడ్డుపై బయటాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ అంశంలో అన్ని రాజకీయ పార్టీలతో కలసి కార్యాచరణ రూపొందిస్తామని వెంటనే ఆక్రమణల పేరుతో చిరువ్యాపారులను ఇబ్బందులకు గురి చేయవద్దని డిమాండ్ చేశారు.. కూరగాయల వ్యాపారుల రాజకీయ నాయకుల నిరసనలతో కూల్చివేత పనులను మున్సిపల్ సిబ్బంది నిలిపివేశారు
    1
    పాత కూరగాయలమార్కెట్ నిర్మాణాల కూల్చివేతలపై వ్యాపారులు, రాజకీయ నాయకుల నిరసన ..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు...
పాత కూరగాయలమార్కెట్ నిర్మాణాల కూల్చివేతలపై వ్యాపారులు, రాజకీయ నాయకుల నిరసన ..
ఇల్లందు పట్టణంలో గత ఐదు దశాబ్దాలుగా వినియోగించుకున్న పాత కూరగాయల మార్కెట్ ప్రాంగణంలోని కొన్ని దుకాణ సముదాయాలను మున్సిపల్ సిబ్బంది జేసీబీ సహాయంతో కూల్చివేతలను ప్రారంభించడంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. తమకు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చివేతలు చేయడం పట్ల కొందరు చిరు వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేయగా వారికి పలురాజకీయ పార్టీల నాయకులు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా పలుపార్టీల నాయకులు మాట్లాడుతూ ఆక్రమణలు ఏమైనా ఉంటే వ్యాపారులకు నోటీసులు అందజేసి తొలగిస్తే తమకు అభ్యంతరం లేదని కానీ ఇల్లందు పట్టణంలో ఎన్నో అక్రమ నిర్మాణాలు ఉన్నప్పటికీ కేవలం కూరగాయలు అమ్ముకునే చిరువ్యాపార నిర్మాణాలను తొలగించడం సరికాదన్నారు. కూల్చివేతలను నిరసిస్తూ రోడ్డుపై బయటాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ అంశంలో అన్ని రాజకీయ పార్టీలతో కలసి కార్యాచరణ రూపొందిస్తామని వెంటనే ఆక్రమణల పేరుతో చిరువ్యాపారులను ఇబ్బందులకు గురి చేయవద్దని డిమాండ్ చేశారు.. కూరగాయల వ్యాపారుల రాజకీయ నాయకుల నిరసనలతో కూల్చివేత పనులను మున్సిపల్ సిబ్బంది నిలిపివేశారు
    user_Shekar Thaduri
    Shekar Thaduri
    ఎల్లందు, భద్రాద్రి కొత్తగూడెం, తెలంగాణ•
    11 hrs ago
  • *స్కూల్ బస్ లో పిల్లలకు తృటిలో తప్పిన పెను ప్రమాదం* ఒక్కసారిగా బస్సు ఇంజన్లో నుంచి పొగలు రావడంతో స్కూల్ పిల్లలందరినీ కూడా సడన్గా బస్సులో నుంచి దింపేసిన పరిస్థితి నెలకొంది పిల్లలకు ఎటువంటి ప్రమాదం జరగకుండా బస్సులో నుంచి దింపిన ఆయా *ఎన్టీఆర్ జిల్లా.* *ఇబ్రహీంపట్నం ఫెర్రీ రోడ్డు* కాలం చెల్లిన బస్సులను మెయింటినెన్స్ చేస్తున్న స్కూల్ పై చర్యలు తీసుకోవాలని కోరుతున్న స్థానికులు
    1
    *స్కూల్ బస్ లో పిల్లలకు తృటిలో తప్పిన పెను ప్రమాదం*

 ఒక్కసారిగా బస్సు ఇంజన్లో నుంచి పొగలు రావడంతో స్కూల్ పిల్లలందరినీ కూడా సడన్గా బస్సులో నుంచి దింపేసిన పరిస్థితి నెలకొంది పిల్లలకు ఎటువంటి ప్రమాదం జరగకుండా బస్సులో నుంచి దింపిన ఆయా 


 *ఎన్టీఆర్ జిల్లా.*
*ఇబ్రహీంపట్నం ఫెర్రీ రోడ్డు* 

 కాలం చెల్లిన బస్సులను మెయింటినెన్స్ చేస్తున్న స్కూల్ పై చర్యలు తీసుకోవాలని కోరుతున్న స్థానికులు
    user_పల్లె నరేష్
    పల్లె నరేష్
    ఇబ్రహీంపట్నం, ఎన్టీఆర్, ఆంధ్రప్రదేశ్•
    7 hrs ago
  • అడిగేవాడు లేడని,ప్రభుత్వం అండతో ఫీజుల పేరుతో జనాల రక్తాన్ని జలగల్లా పీల్చి పిప్పి చేస్తున్న నారాయణ కాలేజీకి నేరుగా వెళ్లి *వీందో డ్రామా... వాందో డ్రామా😤* అడిగేవాడు లేడని,ప్రభుత్వం అండతో ఫీజుల పేరుతో జనాల రక్తాన్ని జలగల్లా పీల్చి పిప్పి చేస్తున్న నారాయణ కాలేజీకి నేరుగా వెళ్లి యాజమాన్యాన్ని ఏకిపారేసిన *ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న🔥* దొంగ ర్యాంకుల పేరుతో అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చి జనాన్ని మోసం చేస్తే చూస్తూ ఊరుకోవడానికి అక్కడ ఉన్నది చేతకాని రేవంత్ రెడ్డి కాదు,దోపిడిదారి కేసీఆర్ కాదు.....దమ్మున్న తీన్మార్ మల్లన్న....ఒక్కొకడికి ఇక తీన్మారే ఇలాంటి నాయకులు కదా మనకు కావాల్సింది....
    1
    అడిగేవాడు లేడని,ప్రభుత్వం అండతో ఫీజుల పేరుతో జనాల రక్తాన్ని జలగల్లా పీల్చి పిప్పి చేస్తున్న నారాయణ కాలేజీకి నేరుగా వెళ్లి
*వీందో డ్రామా... వాందో డ్రామా😤*
అడిగేవాడు లేడని,ప్రభుత్వం అండతో ఫీజుల పేరుతో జనాల రక్తాన్ని జలగల్లా పీల్చి పిప్పి చేస్తున్న నారాయణ కాలేజీకి నేరుగా వెళ్లి యాజమాన్యాన్ని  ఏకిపారేసిన *ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న🔥*
దొంగ ర్యాంకుల పేరుతో అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చి జనాన్ని మోసం చేస్తే చూస్తూ ఊరుకోవడానికి అక్కడ ఉన్నది చేతకాని రేవంత్ రెడ్డి కాదు,దోపిడిదారి కేసీఆర్ కాదు.....దమ్మున్న తీన్మార్ మల్లన్న....ఒక్కొకడికి ఇక తీన్మారే 
ఇలాంటి నాయకులు కదా మనకు కావాల్సింది....
    user_NIMMANAGANTI ANIL BABU
    NIMMANAGANTI ANIL BABU
    Local News Reporter డోర్నకల్, మహబూబాబాద్, తెలంగాణ•
    11 hrs ago
  • భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం వేడుకలలో భాగంగా చరిత్ర సృష్టించిన మన గిరిజన ఆడబిడ్డలు గర్వపడేలా చేసిన మన సంస్కృతి !! భోగాపురంలో 13 వేల మంది గిరిజన బాలికలు ఒకే వేదికపై అద్భుతంగా ప్రదర్శించిన థింసా నృత్యం గిన్నిస్ ప్రపంచ రికార్డును సొంతం చేసుకుంది. ఇది కేవలం ఒక రికార్డు కాదు మన గిరిజన సంప్రదాయాలకు ప్రపంచం ఇచ్చిన గౌరవం. గిన్నిస్ సంస్థ ప్రతినిధుల నుంచి ఈ ప్రతిష్ఠాత్మక అవార్డును గిరిజన సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి @GSandhyarani_ గారు అందుకోవడం, అనంతరం బాలికలతో కలిసి థింసా నృత్యంలో పాల్గొనడం ప్రతి గిరిజన కుటుంబానికి గర్వకారణం. మన మూలాలను, మన సంస్కృతిని ప్రపంచ వేదికపై నిలబెట్టిన ప్రతి గిరిజన బాలికకు హృదయపూర్వక అభినందనలు. మీ అడుగుల తాళానికి ప్రపంచం చప్పట్లు కొట్టింది .
    1
    భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం వేడుకలలో భాగంగా
చరిత్ర సృష్టించిన మన గిరిజన ఆడబిడ్డలు గర్వపడేలా చేసిన మన సంస్కృతి !!

భోగాపురంలో 13 వేల మంది గిరిజన బాలికలు ఒకే వేదికపై అద్భుతంగా ప్రదర్శించిన థింసా నృత్యం గిన్నిస్ ప్రపంచ రికార్డును సొంతం చేసుకుంది. ఇది కేవలం ఒక రికార్డు కాదు మన గిరిజన సంప్రదాయాలకు ప్రపంచం ఇచ్చిన గౌరవం.

గిన్నిస్ సంస్థ ప్రతినిధుల నుంచి ఈ ప్రతిష్ఠాత్మక అవార్డును గిరిజన సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి  @GSandhyarani_ గారు అందుకోవడం, అనంతరం బాలికలతో కలిసి థింసా నృత్యంలో పాల్గొనడం ప్రతి గిరిజన కుటుంబానికి గర్వకారణం.

మన మూలాలను, మన సంస్కృతిని ప్రపంచ వేదికపై నిలబెట్టిన ప్రతి గిరిజన బాలికకు హృదయపూర్వక అభినందనలు. మీ అడుగుల తాళానికి ప్రపంచం చప్పట్లు కొట్టింది .
    user_Raj Singh
    Raj Singh
    విజయవాడ (అర్బన్), ఎన్టీఆర్, ఆంధ్రప్రదేశ్•
    12 hrs ago
  • చరిత్రలో నిలిచి పోయే గట్టం భోగాపురం ఇంటర్నేషనల్ విమానాశ్రయం.
    1
    చరిత్రలో నిలిచి పోయే గట్టం భోగాపురం ఇంటర్నేషనల్ విమానాశ్రయం.
    user_Seelam Ashok Reddy
    Seelam Ashok Reddy
    Graphic designer మైలవరం, ఎన్టీఆర్, ఆంధ్రప్రదేశ్•
    3 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.