Shuru
Apke Nagar Ki App…
కేజీహెచ్ లో పవర్ కట్ కారణంగా దేవి అనే మహిళ మృతి.. రాజేంద్ర ప్రసాద్ వార్డులో చికిత్స పొందుతూ రాత్రి 11 గంటల సమయంలో మృతి.. ఆక్సిజన్ అందని కారణంగా దేవి మృతి చెందిందని ఆరోపిస్తున్న బంధువులు నిర్లక్ష్యం, కరెంట్ లేకపోవడంతో తీవ్ర ఇబ్బంది పడినట్టు చెప్తున్న మృతురాలి బంధువులు.. ఇంతటి దయనీయ పరిస్థితిలో కూడా వార్డ్ బాయ్స్ లంచాలు తీసుకున్నారని వాపోయిన మృతురాలి కుటుంబీకులు.
User7105
కేజీహెచ్ లో పవర్ కట్ కారణంగా దేవి అనే మహిళ మృతి.. రాజేంద్ర ప్రసాద్ వార్డులో చికిత్స పొందుతూ రాత్రి 11 గంటల సమయంలో మృతి.. ఆక్సిజన్ అందని కారణంగా దేవి మృతి చెందిందని ఆరోపిస్తున్న బంధువులు నిర్లక్ష్యం, కరెంట్ లేకపోవడంతో తీవ్ర ఇబ్బంది పడినట్టు చెప్తున్న మృతురాలి బంధువులు.. ఇంతటి దయనీయ పరిస్థితిలో కూడా వార్డ్ బాయ్స్ లంచాలు తీసుకున్నారని వాపోయిన మృతురాలి కుటుంబీకులు.
- User9063Ponnur, Guntur😂on 8 November
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- జిల్లా కేంద్రమైన కర్నూలు పట్టణంలోని స్టేట్ గెస్ట్ హౌస్‌లో మంగళవారం ఇంచార్జి మంత్రి నిమ్మల రామానాయుడు, మంత్రి టీజీ భరత్ ఆధ్వర్యంలో కూటమి పార్టీల ముఖ్య నేతలు, ఎమ్మెల్యేలు మరియు అసెంబ్లీ ఇన్‌ఛార్జ్‌లతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎమ్మిగనూరు అసెంబ్లీ తరపున దేశాయ్ నెట్‌వర్క్ అధినేత, జిల్లా అధికార ప్రతినిధి గురురాజ్ దేశాయ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మంత్రులను మర్యాదపూర్వకంగా కలుసుకుని… ఎమ్మిగనూరు నియోజకవర్గంలో అర్హులైన బీజేపీ కార్యకర్తలకు పథకాలు అందడం లేదని తెలిపారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఈ పరిస్థితి ఏర్పడిందని పేర్కొంటూ… అర్హులైన ప్రతి కార్యకర్తకు ప్రభుత్వ పథకాలు తక్షణమే అందేలా చర్యలు తీసుకోవాలని మంత్రులను కోరారు. ఇంచార్జి మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ… ఈ సమావేశం ప్రధాన ఉద్దేశ్యం కూటమిలో భాగమైన బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీలు సమన్వయంతో పనిచేయడం అని తెలిపారు. కూటమి ధర్మాలను పాటిస్తూ… అన్ని పార్టీల నాయకులు, కార్యకర్తలకు సమాన న్యాయం జరిగేలా ముందుకు సాగాలని స్పష్టం చేశారు.1
- రామవరం గ్రామం ముద్దనూరు మండలం కడప జిల్లా వాస్తవ్యులైన సాయికుమార్ మరియు లక్ష్మీదేవి గారి కుమారుడైన శ్రీ విష్ణు అనే బాలుడు పుట్టుకతోనే అంతుచిక్కని వ్యాధితో జన్మించడం జరిగింది బాబుకి చెకప్ చేపించగా LAD బిగ్ డిసీస్ వచ్చిందని డాక్టర్లు చెప్పారు. పిల్లాడికి ఆపరేషన్ చేయకపోతే ప్రాణాలకే ప్రమాదం అని వారు సూచించారు కానీ ఆపరేషన్ కి 30 లక్షల దాకా ఖర్చవుతుంది అని డాక్టర్లు చెప్పారు. కావున దాతలు ముందుకు వచ్చి తమకు తోచినంత సహాయం చేయాలని ఆ తల్లిదండ్రులు కోరుకుంటున్నారు మానవతా వాదంతో ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి ఆ పసిబిడ్డ ప్రాణాలని కాపాడాలని అందరూ భావిస్తున్నారు. వీడియోలో కనిపిస్తున్న స్కానర్ కి గాని కింద ఇవ్వబడిన 7207217664 నెంబర్ కి ఫోన్ పే చేసి పిల్లవాడి ప్రాణం కాపాడిన వారు అవుతారు.1
- కేశంపేట మండల కేంద్రంలో పేటీఎం పేరుతో వ్యాపారులను మోసం చేసే ఘటనలు వెలుగుచూస్తున్నాయి. గుర్తు తెలియని వ్యక్తులు డబ్బులు ట్రాన్స్ఫర్ చేశామని నకిలీ స్క్రీన్‌షాట్లు చూపించి నగదు తీసుకుని పరారవుతున్నారు. ఇటీవల ఓ జిరాక్స్ షాపులో రూ.16 వేల మోసం చోటుచేసుకుంది. మొదట డబ్బులు పంపినట్టు నమ్మబలికి నగదు తీసుకుని పారిపోయారు. బాధితుడు వెంబడించగా కొంత మొత్తం ఇచ్చి మళ్లీ తప్పించుకున్నారు. ఈ ఘటనతో స్థానిక వ్యాపారులు భయాందోళనకు గురవుతున్నారు. పోలీసులు సీసీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. అపరిచితులను నమ్మవద్దని, నగదు లావాదేవీల్లో జాగ్రత్తగా ఉండాలని సూచించారు.2
- బద్వేలు:బద్వేలు పట్టణం రాధాకృష్ణ కళ్యాణ మండపంలో జనసేన నేతలు హల్చల్ చేశారు. కళ్యాణ మండపం పరిధిలోని ఇంటిలోనికి ప్రవేశించి తాళాలు పగలగొట్టి మహిళలపై దౌర్జన్యం చేసి ఇండ్లు ఖాళీ చేయకపోతే జెసిపి తో కూల్చి వేస్తామని భయబ్రాంతులకు జనసేన నేతలు చేసినట్లు స్థానికులు తెలిపారు. దినిపై బద్వేలు అర్బన్ పోలీస్ స్టేషన్లో బాధితులు ఫిర్యాదు చేశారు.1
- ఈ సందర్భంగా పట్టణంలో ప్రమాద రహిత నగరంగా చేయాలని లక్ష్యంగా స్పెషల్ డ్రైవ్ చేపట్టారని సిఐ లక్ష్మయ్య తెలిపారు... తాగి వాహనాలు నడిపి తమ ప్రాణాలకే ముప్పు కాకుండా ఇతరులకు ప్రాణహాని కలిగించే విధంగా చేసుకోకూడదని.... డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడితే జైలు శిక్ష కాకుండా భారీ జరిమానా విధించడం జరుగుతుందని హెచ్చరిక! ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించాలి... మైనర్లకు తమ తల్లిదండ్రులు ప్రత్యేక దృష్టి ఉంచి వాహనాలు నడపకుండా జాగ్రత్త వహించాలి... మైనర్లు వాహనాలు నడుపుతూ పట్టుబడితే వారి భవిష్యత్తే కాకుండా తల్లిదండ్రులపై కూడా కేసులు నమోదు చేస్తామని తీవ్ర హెచ్చరికలు జారీ... *నల్గొండ ట్రాఫిక్ సిఐ–మహా లక్ష్మయ్య..* ఈ కార్యక్రమంలో నల్గొండ ట్రాఫిక్ ఎస్ఐ విజయబాయి మరియు సిబ్బంది పాల్గొన్నారు...1
- నల్గొండ: నల్గొండ మండలం కొత్తపల్లి వద్ద ముత్యాలమ్మ చెరువు కట్ట ఇరువైపుల చెట్లతో మూసుకుపోయి రక్షణ గోడలు లేకపోవడంతో ఆ ప్రాంతం అంతా ప్రమాదకరంగా మారింది. నల్గొండ నుంచి కొత్తపల్లి మీదుగా అనంతారం, ఏమిరెడ్డి గూడెం తదితర ప్రాంతాలకు విద్యార్థులు, రైతులు, ప్రజలు నిత్యం దీనిపై ప్రయాణిస్తూ ఉంటారు. వాహనాలు అదుపు తప్పితే పంట పొలాలు, చెరువులోకి దూసుకెళ్లే ప్రమాదం ఉందని స్థానికులు చెబుతున్నారు. కట్ట వెడల్పు పెంచడంతోపాటు రక్షణ గోడలు నిర్మించి, చెట్లను తొలగించాలని వాహనదారులు కోరుతున్నారు.1
- కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో భవన నిర్మాణానికి అనుమతుల పేరుతో భారీ లంచం డిమాండ్ చేశారంటూ ఆదోని ఎమ్మెల్యే పార్థసారథిపై టీడీపీ ముస్లిం మైనార్టీ సీనియర్ నాయకుడు సౌదీ రవూఫ్ సంచలన ఆరోపణలు చేశారు. బిల్డింగ్ కట్టేందుకు రూ.50 లక్షలు డిమాండ్ చేసి, అందులో ఇప్పటికే రూ.10 లక్షలు తీసుకున్నారని ఆయన తీవ్ర ఆరోపణలు గుప్పించారు. భగవద్గీత, ఖురాన్, బైబిల్ సాక్షిగా ప్రమాణం చేసి చెప్పడానికి సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. ఆదోని పట్టణంలోని ఎమ్మిగనూరు రోడ్డులో ట్రెండ్స్ సమీపంలో ప్లాట్లు విక్రయించిన సౌదీ రవూఫ్ ప్రస్తుతం అక్కడ భవనం నిర్మాణం చేపడుతున్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ అధికారులు నిర్మాణంపై అభ్యంతరాలు వ్యక్తం చేయగా, ఎమ్మెల్యేకు డబ్బులు ఇవ్వాలని సూచించారని రవూఫ్ ఆరోపించారు. తన భవన నిర్మాణానికి ఎలాంటి అడ్డంకులు లేకుండా చూడాలంటే రూ.50 లక్షలు ఇవ్వాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారని, అంత మొత్తాన్ని ఇవ్వలేనని చెప్పి వెళ్లిపోయానని తెలిపారు. అయితే తరువాత ఎమ్మెల్యే ఫోన్ చేసి రూ.40 లక్షలు ఇవ్వాలని ఒత్తిడి తెచ్చారని, మధ్యవర్తి ద్వారా ఇప్పటికే రూ.10 లక్షలు, మరో రూ.1 లక్ష కమిషన్‌గా ఇవ్వాల్సి వచ్చిందని బాధితుడు పేర్కొన్నారు. డబ్బులు ఇవ్వకపోతే పనులు ఆపేస్తామని బెదిరించారని, ఒకసారి కాదు పదేపదే డబ్బులు అడుగుతూ వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నాయకుడిననే కారణంతోనే కావాలనే టార్గెట్ చేస్తున్నారని మండిపడ్డారు.1
- ఎమ్మిగనూరు చేనేత సహకార ఉత్పత్తి విక్రయ సంఘం సర్వసభ్య సమావేశానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ సమావేశానికి ముందు నుంచే చేనేత కార్మికులు భారీగా చేరుకుని ఆప్కోలో విలీనాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వైసీపీ పార్లమెంట్ ఇన్‌ఛార్జ్ బుట్టా రేణుక ఆధ్వర్యంలో చేనేత కార్మికులు సొసైటీ కార్యాలయాన్ని ముట్టడించారు. పెద్ద సంఖ్యలో చేరుకున్న కార్మికులు నినాదాలతో ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ బుట్టా రేణుక మాట్లాడుతూ… ఎమ్మిగనూరు చేనేత సహకార సంఘాన్ని ఆప్కోలో విలీనం చేయడం ఎమ్మెల్యే డాక్టర్ బీ.వి. జయనాగేశ్వర రెడ్డి కుట్ర అని ఆరోపించారు. అప్పుల్లో ఉన్న ఆప్కోలో సంఘాన్ని కలిపి, ఆస్తులను అమ్మేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శించారు. అలాగే… చేనేత కార్మికుల ప్రయోజనాలకు విరుద్ధంగా ఉన్న ఈ నిర్ణయాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించమని స్పష్టం చేశారు. అవసరమైతే న్యాయపరంగా పోరాడతామని బుట్టా రేణుక హెచ్చరించారు.1