logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

అంతంపల్లి PACS నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారం ఘనంగా రైతుల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం అంతంపల్లి PACS నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారం ఘనంగా రైతుల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం: ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ కామారెడ్డి జిల్లా, ఆగస్టు 27: కామారెడ్డి నియోజకవర్గంలోని అంతంపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (PACS) నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ ముఖ్య అతిథిగా హాజరై నూతన పాలకవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నూతన PACS చైర్మన్‌గా చిట్టెడి సుధాకర్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయగా, నూతన పాలకవర్గ సభ్యులు కూడా ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు స్వీకరించారు. అనంతరం మహమ్మద్ అలీ షబ్బీర్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. రైతు ఆర్థికంగా బలపడితేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందని పేర్కొన్నారు. రైతులకు అవసరమైన పంట రుణాలు, విత్తనాలు, ఎరువులు, వ్యవసాయ సేవలను సకాలంలో అందించడంలో PACSలు కీలక పాత్ర పోషించాలని సూచించారు. PACSలు కేవలం రుణాలు అందించే సంస్థలుగా కాకుండా రైతుల సమగ్ర అభివృద్ధికి తోడ్పడే కేంద్రాలుగా పనిచేయాలని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని రైతు భరోసా, పంట రుణమాఫీ, ఉచిత విద్యుత్, రైతు బీమా, సాగునీటి వనరుల అభివృద్ధి వంటి కార్యక్రమాలను అమలు చేస్తోందని తెలిపారు. రైతులకు మెరుగైన మార్కెట్ సదుపాయాలు, మౌలిక వసతులు కల్పించడంతో పాటు గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిని వేగవంతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. అంతంపల్లి PACS నూతన చైర్మన్ చిట్టెడి సుధాకర్ రెడ్డిని ప్రత్యేకంగా అభినందించిన షబ్బీర్ అలీ.. రైతులు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని సూచించారు. రాజకీయాలకు అతీతంగా ప్రతి రైతుకు సమానంగా సేవలందిస్తూ PACSను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు నూతన పాలకవర్గం సమష్టిగా కృషి చేయాలని ఆకాంక్షించారు. అంతంపల్లి, లక్ష్మీదేవునిపల్లి తదితర గ్రామాల రైతుల సమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు తనవంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. కామారెడ్డి నియోజకవర్గంలో గ్రామీణ మౌలిక వసతులు, రహదారులు, తాగునీరు, విద్య, వైద్యం, వ్యవసాయం తదితర రంగాలకు ప్రాధాన్యతనిస్తూ అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తున్నామని తెలిపారు. ప్రజా సంక్షేమంతో పాటు గ్రామీణాభివృద్ధికి పెద్దపీట వేస్తూ అభివృద్ధి ఫలాలు ప్రతి గ్రామానికి చేరేలా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి బద్దం ఇంద్రకరణ్ రెడ్డి, మాజీ డీసీసీ అధ్యక్షులు కైలాస్ శ్రీనివాస్, కాంగ్రెస్ నాయకులు నరేందర్ రెడ్డి, అంతంపల్లి సర్పంచ్ మంజుల సంజీవరెడ్డి, లింగారెడ్డి, బిక్కనూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ రాజు, తిప్పాపూర్ సొసైటీ చైర్మన్ భీంరెడ్డి, కామారెడ్డి సొసైటీ చైర్మన్ గూడెం శ్రీనివాస్ రెడ్డి, చుక్కాపూర్ లక్ష్మీనర్సింహ ఆలయ చైర్మన్ కమలాకర్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గోనె శ్రీనివాస్, సుదర్శన్, కౌన్సిలర్ మోతిలాల్, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు భూమని బాలరాజ్, తాటిపాముల లింబాద్రి, డీసీసీ ఉపాధ్యక్షులు గంప ప్రసాద్, ప్రవీణ్ రెడ్డి, శ్రీకాంత్, యాదవ రెడ్డి, కామారెడ్డి పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సందీప్ తదితర నాయకులు, కార్యకర్తలు, మహిళలు, రైతులు, గ్రామస్థులు పాల్గొన్నారు. స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రమాణ స్వీకార కార్యక్రమం అనంతరం స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అర్హులైన లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను అందజేశారు.

55 min ago
user_KODIPYAKA SAIRAM
KODIPYAKA SAIRAM
Salesperson బిర్కూర్, కామారెడ్డి, తెలంగాణ•
55 min ago
e07dc8a7-c61d-4384-aefc-0de1a0caeb58

అంతంపల్లి PACS నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారం ఘనంగా రైతుల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం అంతంపల్లి PACS నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారం ఘనంగా రైతుల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం: ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ కామారెడ్డి జిల్లా, ఆగస్టు 27: కామారెడ్డి నియోజకవర్గంలోని అంతంపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (PACS) నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ ముఖ్య అతిథిగా హాజరై నూతన పాలకవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నూతన PACS చైర్మన్‌గా చిట్టెడి సుధాకర్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయగా, నూతన పాలకవర్గ సభ్యులు కూడా ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు స్వీకరించారు. అనంతరం మహమ్మద్ అలీ షబ్బీర్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. రైతు ఆర్థికంగా బలపడితేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందని పేర్కొన్నారు. రైతులకు అవసరమైన పంట రుణాలు, విత్తనాలు, ఎరువులు, వ్యవసాయ సేవలను సకాలంలో అందించడంలో PACSలు కీలక పాత్ర పోషించాలని సూచించారు. PACSలు కేవలం రుణాలు అందించే సంస్థలుగా కాకుండా రైతుల సమగ్ర అభివృద్ధికి తోడ్పడే కేంద్రాలుగా పనిచేయాలని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని రైతు భరోసా, పంట రుణమాఫీ, ఉచిత విద్యుత్, రైతు బీమా, సాగునీటి వనరుల అభివృద్ధి వంటి కార్యక్రమాలను అమలు చేస్తోందని తెలిపారు. రైతులకు మెరుగైన మార్కెట్ సదుపాయాలు, మౌలిక వసతులు కల్పించడంతో పాటు గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిని వేగవంతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. అంతంపల్లి PACS నూతన చైర్మన్ చిట్టెడి సుధాకర్ రెడ్డిని ప్రత్యేకంగా

227e51ef-ae1b-48d8-aab8-69f170741112

అభినందించిన షబ్బీర్ అలీ.. రైతులు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని సూచించారు. రాజకీయాలకు అతీతంగా ప్రతి రైతుకు సమానంగా సేవలందిస్తూ PACSను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు నూతన పాలకవర్గం సమష్టిగా కృషి చేయాలని ఆకాంక్షించారు. అంతంపల్లి, లక్ష్మీదేవునిపల్లి తదితర గ్రామాల రైతుల సమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు తనవంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. కామారెడ్డి నియోజకవర్గంలో గ్రామీణ మౌలిక వసతులు, రహదారులు, తాగునీరు, విద్య, వైద్యం, వ్యవసాయం తదితర రంగాలకు ప్రాధాన్యతనిస్తూ అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తున్నామని తెలిపారు. ప్రజా సంక్షేమంతో పాటు గ్రామీణాభివృద్ధికి పెద్దపీట వేస్తూ అభివృద్ధి ఫలాలు ప్రతి గ్రామానికి చేరేలా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి బద్దం ఇంద్రకరణ్ రెడ్డి, మాజీ డీసీసీ అధ్యక్షులు కైలాస్ శ్రీనివాస్, కాంగ్రెస్ నాయకులు నరేందర్ రెడ్డి, అంతంపల్లి సర్పంచ్ మంజుల సంజీవరెడ్డి, లింగారెడ్డి, బిక్కనూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ రాజు, తిప్పాపూర్ సొసైటీ చైర్మన్ భీంరెడ్డి, కామారెడ్డి సొసైటీ చైర్మన్ గూడెం శ్రీనివాస్ రెడ్డి, చుక్కాపూర్ లక్ష్మీనర్సింహ ఆలయ చైర్మన్ కమలాకర్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గోనె శ్రీనివాస్, సుదర్శన్, కౌన్సిలర్ మోతిలాల్, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు భూమని బాలరాజ్, తాటిపాముల లింబాద్రి, డీసీసీ ఉపాధ్యక్షులు గంప ప్రసాద్, ప్రవీణ్ రెడ్డి, శ్రీకాంత్, యాదవ రెడ్డి, కామారెడ్డి పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సందీప్ తదితర నాయకులు, కార్యకర్తలు, మహిళలు, రైతులు, గ్రామస్థులు పాల్గొన్నారు. స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రమాణ స్వీకార కార్యక్రమం అనంతరం స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అర్హులైన లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను అందజేశారు.

More news from తెలంగాణ and nearby areas
  • ఎల్లారెడ్డి నియోజకవర్గ ఎలక్ట్రానిక్ మీడియా నూతన కార్యవర్గ ప్రమాణస్వీకారం కామారెడ్డి జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు పట్నం శెట్టి శ్రీనివాస్ కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజక వర్గ ఎలక్ట్రానిక్ మీడియా నూతన కార్య వర్గ ప్రమాణ స్వీకారము మహోత్సవం స్నేహ బంకెట్ హల్ లో ఏర్పాటు చేయటం జరిగింది. దీనికి అధ్యక్షుడు పిన్నురి రమేష్ ఉపాధ్యక్షుడు కుశల్కంటి మహేష్, జెనరల్. సెక్రటరీ. యశ్వంత్ పవార్, కోశాదికారి రాచర్ల సంతోష్, అధికార ప్రతినిధి. ముస్త్యాల శ్రీధర్, షoబులింగం, సాయిరాంగౌడ్, పోచయ్య, గౌస్, అనిల్ నాయక్, బొల్లారం శ్రీనివాస్, బన్సిలాల్, మంగలి రాజు,ముఖర్రం సాయికుమార్ సోమయాజులు. ప్రమాణ స్వీకారం చేసారు. దీనికి గాను ముఖ్య అతిథి గా ఎల్లారెడ్డి ci రాజారెడ్డి, అడ్వకేట్ పండరి, లీగల్ అడ్వైజర్ గోపాల్ రావు అడ్వకేట్, కామారెడ్డి tuwj జిల్లా అధ్యక్షులు రాజనీకాంత్, కామారెడ్డి జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు శ్రీనివాస్ సెక్రటరీ సుధాకరగౌడ్, చందు, మోయిన్ తదితరులు పాల్గొన్నారు.
    1
    ఎల్లారెడ్డి నియోజకవర్గ ఎలక్ట్రానిక్ మీడియా నూతన కార్యవర్గ ప్రమాణస్వీకారం కామారెడ్డి జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు పట్నం శెట్టి శ్రీనివాస్  
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజక వర్గ ఎలక్ట్రానిక్ మీడియా నూతన కార్య వర్గ ప్రమాణ స్వీకారము మహోత్సవం స్నేహ బంకెట్ హల్ లో ఏర్పాటు చేయటం జరిగింది. దీనికి అధ్యక్షుడు పిన్నురి రమేష్  ఉపాధ్యక్షుడు కుశల్కంటి మహేష్, జెనరల్. సెక్రటరీ. యశ్వంత్ పవార్, కోశాదికారి రాచర్ల సంతోష్, అధికార ప్రతినిధి.  ముస్త్యాల శ్రీధర్, షoబులింగం, సాయిరాంగౌడ్, పోచయ్య, గౌస్, అనిల్ నాయక్, బొల్లారం శ్రీనివాస్, బన్సిలాల్, మంగలి రాజు,ముఖర్రం సాయికుమార్ సోమయాజులు. ప్రమాణ స్వీకారం చేసారు. దీనికి గాను ముఖ్య అతిథి గా ఎల్లారెడ్డి ci రాజారెడ్డి, అడ్వకేట్ పండరి, లీగల్ అడ్వైజర్ గోపాల్ రావు అడ్వకేట్, కామారెడ్డి tuwj జిల్లా అధ్యక్షులు  రాజనీకాంత్, కామారెడ్డి జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు శ్రీనివాస్ సెక్రటరీ సుధాకరగౌడ్, చందు, మోయిన్ తదితరులు పాల్గొన్నారు.
    user_KODIPYAKA SAIRAM
    KODIPYAKA SAIRAM
    Salesperson బిర్కూర్, కామారెడ్డి, తెలంగాణ•
    2 hrs ago
  • మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో రాఖీ పౌర్ణమి వేడుకలు.... కామారెడ్డి పట్టణంలోని రాజా నగర్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో గురువారం ముందస్తు రాఖీ పౌర్ణమి పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయుడు రాజయ్య, రాఖీ పౌర్ణమి విశిష్టతను విద్యార్థులకు తెలియజేశారు. పాఠశాలలో విద్యార్థినీ విద్యార్థులు సోదర భావంతో ఉండాలని ఉద్దేశంతో రాఖీ పౌర్ణమి ఉత్సవాలను నిర్వహించినట్లు ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో టీచర్ జ్యోతి, పాఠశాల విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు
    1
    మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో  రాఖీ పౌర్ణమి వేడుకలు....
కామారెడ్డి పట్టణంలోని రాజా నగర్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో గురువారం ముందస్తు రాఖీ పౌర్ణమి పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయుడు రాజయ్య, రాఖీ పౌర్ణమి విశిష్టతను విద్యార్థులకు తెలియజేశారు. పాఠశాలలో విద్యార్థినీ విద్యార్థులు సోదర భావంతో ఉండాలని ఉద్దేశంతో రాఖీ పౌర్ణమి ఉత్సవాలను నిర్వహించినట్లు ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో టీచర్ జ్యోతి, పాఠశాల విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు
    user_Mahesh Nakka
    Mahesh Nakka
    Kamareddy, Hyderabad•
    6 hrs ago
  • గుంతల రోడ్డుపై.. నిరసన బాట! డాంబర్‌ రోడ్డు కోసం 29న పాదయాత్ర.. సన్నాహక సమావేశంలో పద్మాదేవేందర్‌రెడ్డి మెదక్ జిల్లా, నిజాంపేట: మూడేళ్లుగా అధ్వానంగా ఉన్న చల్మెడ కమాన్‌–నందగోకుల్‌ రహదారికి డాంబర్‌ వేయాలని డిమాండ్‌ చేస్తూ ఈ నెల 29న చేపట్టనున్న పాదయాత్రను విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి పిలుపునిచ్చారు. గురువారం మండల కేంద్రంలోని ఫంక్షన్‌హాల్‌లో ముఖ్య కార్యకర్తలతో సన్నాహక సమావేశం నిర్వహించారు. రహదారి అధ్వానంగా ఉండటంతో ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆమె తెలిపారు. ప్రజా సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు నిర్వహిస్తున్న పాదయాత్రకు పెద్దఎత్తున తరలిరావాలని కోరారు. కార్యక్రమంలో సుధాకర్‌రెడ్డి, భాస్కర్‌రావు, బాల్‌రెడ్డి, రంజిత్‌గౌడ్‌, దయాకర్‌, శ్రీకాంత్‌, లక్ష్మణ్‌ తదితరులు పాల్గొన్నారు.
    2
    గుంతల రోడ్డుపై.. నిరసన బాట!
డాంబర్‌ రోడ్డు కోసం 29న పాదయాత్ర.. సన్నాహక సమావేశంలో పద్మాదేవేందర్‌రెడ్డి
మెదక్ జిల్లా, నిజాంపేట: మూడేళ్లుగా అధ్వానంగా ఉన్న చల్మెడ కమాన్‌–నందగోకుల్‌ రహదారికి డాంబర్‌ వేయాలని డిమాండ్‌ చేస్తూ ఈ నెల 29న చేపట్టనున్న పాదయాత్రను విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి పిలుపునిచ్చారు. గురువారం మండల కేంద్రంలోని ఫంక్షన్‌హాల్‌లో ముఖ్య కార్యకర్తలతో సన్నాహక సమావేశం నిర్వహించారు. రహదారి అధ్వానంగా ఉండటంతో ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆమె తెలిపారు. ప్రజా సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు నిర్వహిస్తున్న పాదయాత్రకు పెద్దఎత్తున తరలిరావాలని కోరారు. కార్యక్రమంలో సుధాకర్‌రెడ్డి, భాస్కర్‌రావు, బాల్‌రెడ్డి, రంజిత్‌గౌడ్‌, దయాకర్‌, శ్రీకాంత్‌, లక్ష్మణ్‌ తదితరులు పాల్గొన్నారు.
    user_మహమ్మద్
    మహమ్మద్
    నిజాంపేట, మెదక్, తెలంగాణ•
    6 hrs ago
  • జీపీ మోటార్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ షోరూం ను ప్రారంభించిన మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళా చక్రపాణి. జీపీ మోటార్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ షోరూం ను ప్రారంభించిన మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళా చక్రపాణి. గురువారం సిరిసిల్లలోని స్థానిక 12వ వార్డులో జీపీ మోటార్స్ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఎలక్ట్రిక్ స్కూటర్ షోరూంను మున్సిపల్ చైర్‌పర్సన్ జిందం కళా చక్రపాణి ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు షోరూంలో ఏర్పాటు చేసిన ఎలక్ట్రిక్ స్కూటర్లను పరిశీలించి, వాటి పనితీరును, సాంకేతికతను, వినియోగదారులకు అందించే సౌకర్యాల గురించి నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. పెరుగుతున్న ఇంధన ధరలు, పర్యావరణ పరిరక్షణ నేపథ్యంలో ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రజల్లో ఆదరణ పెరుగుతోందని ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం వల్ల ఇంధన ఖర్చులను తగ్గించుకోవడంతో పాటు కాలుష్యాన్ని నియంత్రించేందుకు దోహదపడుతుందని ఈ సందర్భంగా అన్నారు . సిరిసిల్ల ప్రజలకు నాణ్యమైన ఎలక్ట్రిక్ వాహనాలను అందిస్తూ, మెరుగైన సేవలు అందించాలని జీపీ మోటార్స్ నిర్వాహకులకు సూచించారు. కార్యక్రమంలో కౌన్సిలర్ సభ్యులు మొగిలి నాగరాజు, జీపీ మోటార్స్ నిర్వాహకులు, సిబ్బంది, స్థానిక ప్రజలు, వాహన వినియోగదారులు తదితరులు పాల్గొన్నారు.
    1
    జీపీ మోటార్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ షోరూం ను ప్రారంభించిన మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళా చక్రపాణి. 
జీపీ మోటార్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ షోరూం ను ప్రారంభించిన మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళా చక్రపాణి. గురువారం  సిరిసిల్లలోని స్థానిక 12వ వార్డులో జీపీ మోటార్స్ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఎలక్ట్రిక్ స్కూటర్ షోరూంను మున్సిపల్ చైర్‌పర్సన్ జిందం కళా చక్రపాణి ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు షోరూంలో ఏర్పాటు చేసిన ఎలక్ట్రిక్ స్కూటర్లను పరిశీలించి, వాటి పనితీరును, సాంకేతికతను, వినియోగదారులకు అందించే సౌకర్యాల గురించి నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. పెరుగుతున్న ఇంధన ధరలు, పర్యావరణ పరిరక్షణ నేపథ్యంలో ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రజల్లో ఆదరణ పెరుగుతోందని ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం వల్ల ఇంధన ఖర్చులను తగ్గించుకోవడంతో పాటు కాలుష్యాన్ని నియంత్రించేందుకు దోహదపడుతుందని ఈ సందర్భంగా అన్నారు . సిరిసిల్ల ప్రజలకు నాణ్యమైన ఎలక్ట్రిక్ వాహనాలను అందిస్తూ, మెరుగైన సేవలు అందించాలని జీపీ మోటార్స్ నిర్వాహకులకు సూచించారు. కార్యక్రమంలో కౌన్సిలర్ సభ్యులు మొగిలి నాగరాజు, జీపీ మోటార్స్ నిర్వాహకులు, సిబ్బంది, స్థానిక ప్రజలు, వాహన వినియోగదారులు తదితరులు పాల్గొన్నారు.
    user_సిరిసిల్ల స్వరం
    సిరిసిల్ల స్వరం
    సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    1 hr ago
  • బాన్సువాడలో రాఖీ పండుగ సందడి రాఖీల కొనుగోలుతో కిటకిటలాడిన మార్కెట్‌ కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో రాఖీ పండుగ సందర్భంగా బాన్సువాడ పట్టణంలోని మార్కెట్‌లో సందడి నెలకొంది. అక్కాచెల్లెళ్ల ఆప్యాయతకు, అన్నదమ్ముల అనుబంధానికి ప్రతీకగా నిలిచే రాఖీ పండుగను పురస్కరించుకుని మహిళలు, చిన్నారులు రాఖీలు కొనుగోలు చేసేందుకు దుకాణాలకు తరలివచ్చారు. రాఖీ దుకాణాలు వివిధ రంగులు, ఆకర్షణీయమైన నమూనాలతో కళకళలాడగా, ఉదయం నుంచే మార్కెట్‌లో కొనుగోలుదారులతో కిటకిటలాడింది. తమ అన్నదమ్ముల కోసం ప్రత్యేకమైన రాఖీలను ఎంచుకుంటూ అక్కాచెల్లెళ్లు ఉత్సాహంగా కనిపించారు. పండుగ నేపథ్యంలో వ్యాపారులు సైతం ప్రత్యేకంగా రాఖీలను అందుబాటులో ఉంచడంతో మార్కెట్‌లో సందడి మరింత పెరిగింది.
    1
    బాన్సువాడలో రాఖీ పండుగ సందడి
రాఖీల కొనుగోలుతో కిటకిటలాడిన మార్కెట్‌
కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో రాఖీ పండుగ సందర్భంగా బాన్సువాడ పట్టణంలోని మార్కెట్‌లో సందడి నెలకొంది. అక్కాచెల్లెళ్ల ఆప్యాయతకు, అన్నదమ్ముల అనుబంధానికి ప్రతీకగా నిలిచే రాఖీ పండుగను పురస్కరించుకుని మహిళలు, చిన్నారులు రాఖీలు కొనుగోలు చేసేందుకు దుకాణాలకు తరలివచ్చారు.
రాఖీ దుకాణాలు వివిధ రంగులు, ఆకర్షణీయమైన నమూనాలతో కళకళలాడగా, ఉదయం నుంచే మార్కెట్‌లో కొనుగోలుదారులతో కిటకిటలాడింది. తమ అన్నదమ్ముల కోసం ప్రత్యేకమైన రాఖీలను ఎంచుకుంటూ అక్కాచెల్లెళ్లు ఉత్సాహంగా కనిపించారు. పండుగ నేపథ్యంలో వ్యాపారులు సైతం ప్రత్యేకంగా రాఖీలను అందుబాటులో ఉంచడంతో మార్కెట్‌లో సందడి మరింత పెరిగింది.
    user_SUDHAM VITTAL
    SUDHAM VITTAL
    Lawyer Banswada, Kamareddy•
    2 hrs ago
  • అక్రమ కట్టడాలపై చర్యలు తిసుకోవాలని పిర్యాదు........... బిక్కనూర్ మండలంలోని అంతంపల్లి గ్రామపంచాయతీ పరిధిలో 44వ జాతీయ రహదారి పక్కన మాల్గుడి హోటల్, రిలయన్స్ పెట్రోల్ బంక్, పరివార్ హోటల్ లను ప్రభుత్వ స్థలంలో ఇప్పటి ప్రభుత్వాలు నిర్మించుకునేందుకు అవకాశాలు కల్పించాయని, ప్రభుత్వ భూములలో అక్రమంగా నిర్మించిన హోటళ్లపై చర్యలు తీసుకోవాలని కోరుతూ గురువారం సిపిఎం జిల్లా కార్యదర్శి కొత్త నర్సింలు గ్రామ సర్పంచ్ కు వినతి పత్రం సమర్పించినట్లు చెప్పారు. ప్రభుత్వ భూములలో ఉన్న నిర్మాణాలను తొలగించేందుకు పార్టీలకు అతీతంగా పోరాటం చేయాలన్నారు.
    1
    అక్రమ కట్టడాలపై చర్యలు తిసుకోవాలని పిర్యాదు...........
బిక్కనూర్ మండలంలోని అంతంపల్లి గ్రామపంచాయతీ పరిధిలో 44వ జాతీయ రహదారి పక్కన మాల్గుడి హోటల్, రిలయన్స్ పెట్రోల్ బంక్, పరివార్ హోటల్ లను ప్రభుత్వ స్థలంలో ఇప్పటి ప్రభుత్వాలు నిర్మించుకునేందుకు అవకాశాలు కల్పించాయని, ప్రభుత్వ భూములలో అక్రమంగా నిర్మించిన హోటళ్లపై చర్యలు తీసుకోవాలని కోరుతూ గురువారం సిపిఎం జిల్లా కార్యదర్శి కొత్త నర్సింలు గ్రామ సర్పంచ్ కు వినతి పత్రం సమర్పించినట్లు చెప్పారు. ప్రభుత్వ భూములలో ఉన్న నిర్మాణాలను తొలగించేందుకు పార్టీలకు అతీతంగా పోరాటం చేయాలన్నారు.
    user_Mahesh Nakka
    Mahesh Nakka
    Kamareddy, Hyderabad•
    13 hrs ago
  • మెదక్ : రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేసిన బీజేవైఎం నాయకులు ఫీజు రీయంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ మెదక్ పట్టణంలోని రాందాస్ చౌరస్తా వద్ద బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో బీజేవైఎం నాయకులు రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బిజెపి జిల్లా అధ్యక్షుడు వాళ్దాస్ మల్లేశం గౌడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యార్థులు ఫీజు రీఎంబర్స్మెంట్లు పెండింగ్లో ఉండడంతో తీవ్ర ఇబ్బందులకు ఎదుర్కొంటున్నారన్నారు. యాజమాన్యాల సర్టిఫికెట్లను తీసుకోలేని పరిస్థితిలో విద్యార్థులు ఉన్నారని, విద్యార్థుల సమస్యలను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. పెండింగ్లో ఉన్న 1500 కోట్ల రూపాయలు వెంటనే వీడియోలు చేసి విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని వారి డిమాండ్ చేశారు. పెండింగ్ బకాయిలను వెంటనే విడుదల చేయకపోతే బిజెపి, బీజేవైఎం ఆధ్వర్యంలో పోరాటాన్ని ఉధృతం చేస్తామన్నారు. ఈ కార్యక్రమలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రంజిత్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు నాయిని ప్రసాద్, రాజు యువ మోర్చా పట్టణ అధ్యక్షుడు బాబ్లు, బిజెపి బీజేవైఎం నాయకులు సన్నీ, సాయి, సాయి బాబా, ప్రవీణ్, నర్సింగ్, నవీన్, సాయి జగదీష్ సాయి కిరణ్, తదితరులు పాల్గొన్నారు
    1
    మెదక్ : రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేసిన బీజేవైఎం నాయకులు
ఫీజు రీయంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ మెదక్ పట్టణంలోని రాందాస్ చౌరస్తా వద్ద బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో బీజేవైఎం నాయకులు రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బిజెపి జిల్లా అధ్యక్షుడు వాళ్దాస్ మల్లేశం గౌడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యార్థులు ఫీజు రీఎంబర్స్మెంట్లు పెండింగ్లో ఉండడంతో తీవ్ర ఇబ్బందులకు ఎదుర్కొంటున్నారన్నారు. యాజమాన్యాల సర్టిఫికెట్లను తీసుకోలేని పరిస్థితిలో విద్యార్థులు ఉన్నారని, విద్యార్థుల సమస్యలను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. పెండింగ్లో ఉన్న 1500 కోట్ల రూపాయలు వెంటనే వీడియోలు చేసి విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని వారి డిమాండ్ చేశారు. పెండింగ్ బకాయిలను వెంటనే విడుదల చేయకపోతే బిజెపి, బీజేవైఎం ఆధ్వర్యంలో పోరాటాన్ని ఉధృతం చేస్తామన్నారు. ఈ కార్యక్రమలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రంజిత్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు నాయిని ప్రసాద్, రాజు యువ మోర్చా పట్టణ అధ్యక్షుడు బాబ్లు, బిజెపి బీజేవైఎం నాయకులు సన్నీ, సాయి, సాయి బాబా, ప్రవీణ్, నర్సింగ్, నవీన్, సాయి జగదీష్ సాయి కిరణ్, తదితరులు పాల్గొన్నారు
    user_MERCY
    MERCY
    Local News Reporter మెదక్, మెదక్, తెలంగాణ•
    9 hrs ago
  • యూరియా యాప్ రద్దు చేయాలి. ఇదేమి పాలన ఇదేమి పాలన దొంగ ప్రభుత్వం దొంగ ప్రభుత్వం అనే నినాదంతో రోడ్డెక్కిన రైతులు మెదక్ జిల్లా తూప్రాన్ డివిజన్ పరిధిలోని మాసాయిపేట మండలం జాతీయ రహదారి నేషనల్ 44 హైవే యూరియా కొత్తవాళ్లను చుట్టుపక్కల గ్రామాల రైతులు గత 20 రోజుల నుండి యూరియా దొరకకపోవడంతో ఆగ్రహంతో గిరిజనులు రైతులు ఇతర గ్రామాల రైతులు రోడ్డెక్కి నిరసన వ్యక్తం చేశారు ఇదే మీ ప్రభుత్వం ఇదేమి ప్రభుత్వం దొంగ ప్రభుత్వం దొంగ ప్రభుత్వం అనే నినాదాలతో ఒరే ఎత్తించారు దాదాపు సుమారు 400 మంది రైతులు ఒకేసారి రోడ్డుపైకి రావడంతో పోలీసులు చేతులెత్తేశారు యూరియా యాప్ వెంటనే రద్దు చేయాలని డౌన్ డౌన్ అంటూ వ్యవసాయ అధికారిని వెంటనే సస్పెండ్ చేయాలని మాకు వద్దు ఈ అధికారి అని డిమాండ్ చేశారు ఏ మండలానికి ఆ మండలానికి రైతులు యూరియా తీసుకోవాలని అందరిని కలపవద్దని ఆగ్రహం వ్యక్తం చేశారు
    4
    యూరియా యాప్ రద్దు చేయాలి. ఇదేమి పాలన ఇదేమి పాలన దొంగ ప్రభుత్వం దొంగ ప్రభుత్వం అనే నినాదంతో రోడ్డెక్కిన రైతులు
మెదక్ జిల్లా తూప్రాన్ డివిజన్ పరిధిలోని మాసాయిపేట మండలం జాతీయ రహదారి నేషనల్ 44 హైవే యూరియా కొత్తవాళ్లను చుట్టుపక్కల గ్రామాల రైతులు గత 20 రోజుల నుండి యూరియా దొరకకపోవడంతో ఆగ్రహంతో గిరిజనులు రైతులు ఇతర గ్రామాల రైతులు రోడ్డెక్కి నిరసన వ్యక్తం చేశారు ఇదే మీ ప్రభుత్వం ఇదేమి ప్రభుత్వం దొంగ ప్రభుత్వం దొంగ ప్రభుత్వం అనే నినాదాలతో ఒరే ఎత్తించారు దాదాపు సుమారు 400 మంది రైతులు ఒకేసారి రోడ్డుపైకి రావడంతో పోలీసులు చేతులెత్తేశారు యూరియా యాప్ వెంటనే రద్దు చేయాలని డౌన్ డౌన్ అంటూ వ్యవసాయ అధికారిని వెంటనే సస్పెండ్ చేయాలని మాకు వద్దు ఈ అధికారి అని డిమాండ్ చేశారు ఏ మండలానికి ఆ మండలానికి రైతులు యూరియా తీసుకోవాలని అందరిని కలపవద్దని ఆగ్రహం వ్యక్తం చేశారు
    user_Vijay Kumar
    Vijay Kumar
    Reporter మసాయిపేట్, మెదక్, తెలంగాణ•
    7 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.