పెండింగ్ విల్లులు వెంటనే చెల్లించాలని వంటకాలు ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ముందు దీక్ష పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని వంట కార్మికుల ఒక్కరోజు దీక్ష.. కలెక్టరేట్ ఎదుట ఏఐటీయూసీ ఆధ్వర్యంలో వంట కార్మికుల ఒక్కరోజు దీక్ష... మధ్యాహ్న భోజన వంట కార్మికులకు పెండింగ్ లో ఉన్న బిల్లులను వెంటనే చెల్లించి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తామన్న 10వేల వేతనo వెంటనే చెల్లించాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండీ ఇమ్రాన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మధ్యాహ్న భోజన పథకంలో పనిచేస్తున్న వంట కార్మికుల న్యాయమైన సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో బుధవారం యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట మధ్యాహ్న భోజన వంట కార్మికులు ఒక్కరోజు దీక్షను ఇమ్రాన్ పూలమాలలు వేసి ప్రారంభించిన అనంతరం మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ప్రతిరోజూ మధ్యాహ్న భోజనం వండి పెడుతూ ఎంతో కీలకమైన సేవలు అందిస్తున్న వంట కార్మికుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదన్నారు. 2023–24 విద్యా సంవత్సరానికి సంబంధించిన తొమ్మిది నెలల పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని, అలాగే ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్న బిల్లులన్నింటినీ సకాలంలో విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మధ్యాహ్న భోజన కార్మికులకు ప్రభుత్వం ఇచ్చే గౌరవ వేతనం ఏమాత్రం సరిపోవడం లేదని, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి రాకముందు వంట కార్మికులకు నెలకు రూ.10,000 గౌరవ వేతనం ఇస్తామని చెప్పిన హామీని వెంటనే అమలు చేయాలని. సెంట్రలైజ్డ్ కిచెన్ విధానాన్ని తీసుకురావడం వల్ల స్థానికంగా పనిచేస్తున్న వేలాది మంది వంట కార్మికులు ఉపాధి కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుందని, అందువల్ల సెంట్రలైజ్డ్ కిచెన్ విధానాన్ని రద్దు చేసి ప్రస్తుతం ఉన్న మధ్యాహ్న భోజన పద్ధతినే కొనసాగించాలని అన్నారు. అలాగే మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించిన కోడిగుడ్లు, గ్యాస్, నిత్యావసర వస్తువుల ఖర్చులను ప్రభుత్వమే పూర్తిగా భరించాలని, వంట కార్మికులకు గుర్తింపు కార్డులు ఇవ్వడంతో పాటు వారికి ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని కోరారు. గతంలో పనిచేసిన కార్మికులకు రావాల్సిన పెండింగ్ బకాయిలను వెంటనే చెల్లించి, ఎటువంటి రాజకీయ వేధింపులకు గురిచేయకుండా ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందేలా ప్రభుత్వం మెస్ ఛార్జీలను పెంచి, పెరిగిన ఖర్చులకు అనుగుణంగా మధ్యాహ్న భోజన పథకానికి నిధులు కేటాయించాలని కోరారు. మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే రాబోయే రోజుల్లో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా మరింత విస్తృతమైన ఉద్యమాన్ని చేపడతామని హెచ్చరించారు. కార్మికుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం సానుకూలంగా పరిశీలించి వెంటనే పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షులు గనబోయిన వెంకటేష్, జిల్లా కోశాధికారి సామల శోభన్ బాబు, మధ్యాహ్న భోజన వంట కార్మికుల జిల్లా అధ్యక్షులు బాగుల వసంత, ప్రధాన కార్యదర్శి ముంతాజ్ బేగం, నాయకులు రాజమణి బచ్చమ్మ, శ్యామ్, పద్మ, రజిత, మంజుల, అరుణ, లీలా, అండాలు, సుమీల, వరమ్మ, వీరాస్వామి, మంజుల, హరిత, శ్యామల, రజిత, తదితరులు పాల్గొన్నారు.

- సువర్ణ శివలింగ దర్శనంతో రమణేశ్వరంలో భక్తిశోభ రమణేశ్వరం సువర్ణ శివలింగం వద్ద పెరిగిన భక్తుల రద్దీ1
- యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారికి తగ్గిన నిత్య ఆదాయం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి నిత్య ఖజానాకు బుధవారం భక్తుల రద్దీతో పాటు ఆదాయం కూడా తగ్గింది. అందులో ప్రధాన బుకింగ్ తో రూ.65 వేలు, బ్రేక్ దర్శనాలతో రూ.80,100, VIP దర్శనాలతో రూ.1,12,350, కార్ పార్కింగ్ రూ.1,75,000, ప్రసాద విక్రయాలతో రూ.4,21,770, వ్రతాలతో రూ.55 వేలు, తదితర విభాగాల నుంచి మొత్తం రూ.11,00,486 ఆదాయం సమకూరినట్లు ఈవో భవాని శంకర్ వెల్లడించారు.1
- రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు ఓపెన్ ఛాలెంజ్ మా హయాంలో అక్రమాలు జరిగినయ్ అంటున్నావ్ కదా, నీ హయాంలో జరిగిన అక్రమాలపై, మా మీద నువ్వు వేస్తున్న ఆరోపణలపై సుప్రీమ్ కోర్టు జడ్జితో విచారణకు మేము సిద్ధం..నువ్వు సిద్ధమా? రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు ఓపెన్ ఛాలెంజ్ మా హయాంలో అక్రమాలు జరిగినయ్ అంటున్నావ్ కదా, నీ హయాంలో జరిగిన అక్రమాలపై, మా మీద నువ్వు వేస్తున్న ఆరోపణలపై సుప్రీమ్ కోర్టు జడ్జితో విచారణకు మేము సిద్ధం..నువ్వు సిద్ధమా?2
- శ్రీ శ్రీనివాస ఆఫీసర్స్ కాలనీలో లలిత స్తోత్రం కార్యక్రమం శ్రీ శ్రీనివాస ఆఫీసర్స్ కాలనీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణనాథుడి మండపం వద్ద బుధవారం లలిత స్తోత్ర కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు, లలిత స్తోత్ర పారాయణం నిర్వహించారు. కాలనీలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలతో పాటు పలువురు పాల్గొన్నారు.1
- పడగవిప్పి కదలకుండా కనువిందు చేసిన నాగుపాము............ జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం పరిధిలోని మహబూబాబాద్ జిల్లా తొర్రూరు జాతీయ రహదారిపై నాగుపాము హల్ చల్ చేసిన సంఘటన బుధవారం చోటు చేసుకుంది.పడగవిప్పి కదలకుండా కనువిందు చేస్తూ కనిపించిన నాగుపామును స్థానికులు ఆసక్తికరంగా తిలకించారు.అరగంట పాటు ఆసక్తిగా తిలకించిన వాహనదారులు పాదాచారులు దానంతట అదే రోడ్డు దాటి ఓపెన్ ప్లాట్ లలోని చెట్ల పొదల్లోకి నాగుపాము వెళ్లిన తర్వాత ఎక్కడి వారు అక్కడికి వెళ్ళిపోయారు.1
- గణనాధుడి సేవలో కాచిగూడ ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది ఘనంగా గంగమ్మ తల్లి ఒడికి గణనాథుని పంపుతున్న పోలీసులు ఉత్సవాలకు కుల మతాలు, అధికార తారతమ్యాలు లేవని పోలీసులు రుజువు చేశారు... విజ్ఞాలను తొలగించే గణనాథుడిని సాంప్రదాయ బద్ధంగా పూజలు చేసిన ట్రాఫిక్ పోలీసులు ఆ గణనాథుడి విగ్రహ ఊరేగింపు అత్యంత ఆనందోత్సవాల మధ్య నిర్వహించారు... కాచిగూడ ట్రాఫిక్ అధికారులు, సిబ్బంది కలిసి ఆడుతూ పాడుతూ ఆ గణనాథుడి విగ్రహ నిమజ్జనం ఊరేగింపులో సందడి చేశారు... హైదరాబాద్ కాచిగూడ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లో సిబ్బంది కలిసి గణనాథుడి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. మూడు రోజులపాటు గణనాథుడికి సాంప్రదాయపద్ధంగా శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు... కాచిగూడ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ కౌశిక్ నేతృత్వంలో ఎస్ఐలు సిబ్బంది కలిసి బ్యాండ్ మేళా కనుగొనగా నృత్యాలు చేస్తూ గణనాథుడికి ఘనంగా వీడ్కోలు పలికారు....3
- రేవంత్ రెడ్డి కుటుంబానికి 38 భూమి ఉంది: హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడిన హరీష్ రావు రేవంత్ రెడ్డి కుటుంబానికి 308 ఎకరాల భూమి ఉందని గంటన్నరలో మాకు సమాచారం వచ్చింది రేవంత్ రెడ్డి భూమి పక్కనే ఓఆర్ఆర్ అలైన్‌మెంట్, బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టులు కూడా వచ్చాయని తెలిసింది ఫ్యూచర్ సిటీ చుట్టూ, మిగతా చోట్ల ఉన్న భూముల వివరాలు అన్నీ సేకరిస్తున్నాం - మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు1
- తాతకు 3300 ఎకరాల భూమి ఉండేది మా తాతకు ముగ్గురు భార్యలు ఒక్కో భార్యకు 1100 ఎకరాలు భూమి ఇచ్చాడు - టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మా తాతకు 3300 ఎకరాల భూమి ఉండేది మా తాతకు ముగ్గురు భార్యలు ఒక్కో భార్యకు 1100 ఎకరాలు భూమి ఇచ్చాడు - టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్1